Thread Rating:
  • 5 Vote(s) - 3.6 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
ఖైదీ నెంబర్ 402 - నా మాటే శాసనం
ఎపిసోడ్ 81


నంద గెస్ట్ హౌస్ దగ్గరికి వచ్చి అర్ణ వాళ్ళని అభీర్ సేన గురించి హెచ్చరించి చరిత్ర దాచిన నిజాన్ని మీకు చెబుతాను తర్వాత కూడా మీరు వాళ్ళ జోలికి వెళ్లాలి అనుకుంటే మీ ఇష్టం అని చెప్పడం మొదలు పెట్టాడు శ్రీకర్.

***************

"మీలో ప్రతి ఒక్కరికి శివాజీ మహారాజ్ పోరాటం గురించి మాత్రమే తెలుసు అయన మరణం తర్వాత హిందూ ధర్మం కోసం పోరాడిన వీరుల గురించి ఔరంగజేబు పతనం గురించి తెలీదు ఎందుకంటే తమ స్వార్ధ ప్రయోజనాల కోసం కొంత మంది మన వీరుల చరిత్రను దాచిపెట్టారు.

శివాజీ మహారాజ్ మరణం తరువాత ఆ సింహాసనాన్ని ఆయన పెద్ద కొడుకు శంబాజీ మహారాజ్ ఆదిష్టించారు  ఆయనను 'చావా' అని పిలిచేవారు అంటే పులిబిడ్డ మరాఠ సామ్రాజ్యాన్ని 9 సంవత్సరాలు పరిపాలించాడు దాంట్లో ఐదు సంవత్సరాలు యుద్ధంలోనే ఉన్నారు.

శివాజీ మహారాజ్ తో అంతమైపోయింది అనుకుని సంతోషం పడుతున్న మొగలాలుకి, శంభాజీ మహారాజ్ గుండెల్లో బాకు లాగా తయారయ్యాడు, అతన్ని ప్రత్యక్ష యుద్ధంలో ఓడించలేమని తెలిసి కుట్రపన్ని తన పక్కన ఉన్న వాళ్ళ సహాయంతో వెన్నుపోటు పొడిచి బంధించారు 42 రోజులు చిత్రహింసలు పెట్టి దారుణంగా చంపారు కానీ ఒక్కసారి కూడా క్షమించమని ఆయన నోట మాట రాలేదు హిందూ ధర్మాన్ని వీడలేదు.

శంభాజీ మహారాజ్ మరణంతో మరాఠా సామ్రాజ్యం మొత్తం చీకటి కమ్ముకుంది అయన తమ్ముడైన 19ఏళ్ల  ఛత్రపతి రాజారామ్ మహారాజ్ సింహాసనం అధిష్టించాడు. ఇదే అదునుగా ఆక్రమించడానికి ఔరంగజేబు సుమారు  తొమ్మిది లక్షల మంది సైన్యంతో బయలుదేరేడు.

ఇంక మరాఠా సామ్రాజ్యం అంతం అయిపోయింది అని అందరూ అనుకున్నారు అప్పుడే మహావీరులైన శాంతాజి, ధనాజీలు, రాజారాం మహారాజ్ కి అండగా వచ్చారు అప్పుడు వారి దగ్గర ఉన్న  సైన్యం 20 వేల మంది మాత్రమే

శివాజీ మహారాజ్ మరణం తరువాత బేరా అడవికి వెళ్ళిపోయిన అభీర్ సేనకి సమాచారం అందించారు విషయం తెలుసుకుని ప్రతీకారంతో రగిలిపోయారు.

ఔరంగజేబు తన సైన్యంతో తులాపూర్ దగ్గర ఉన్నాడని సమాచారం తెలుసుకున్న అభీర్ 500 మందితో సేనతో రెండు వేల మంది మరాఠీ సేనతో దానజీ అక్కడికి చేరుకున్నారు.

అప్పుడు జరిగిన యుద్ధంలో మొగులుల సైన్యన్ని ఊచ కోత కోశారు ఔరంగజేబు ప్రాణభయంతో అక్కడి నుంచి పారిపోయాడు చనిపోయిన తన సైన్యాన్ని చూసి ఎందుకు మరాఠా సామ్రాజ్యం తో పెట్టుకున్నానా అనుకున్నాడు.

శంభాజీని వెన్నుపోటు పొడిచిన ఎవ్వరిని వదల్లేడు అందరిని అత్యంత దారుణంగా చంపేసారు మొగలలు అధీనం లొ ఉన్న ప్రతి కోట మీద దాడి చేసి స్వాధీనం చేసుకున్నారు.

ఔరంగజేబు వీళ్ళకి బయపడి తప్పించుకుని పారిపోతూ ఉండేవాడు కానీ 27 సంవత్సరాల వరకు ఢిల్లీ వెళ్ళనివ్వలేదు ఆఖరికి చనిపోయి మహారాష్ట్ర మట్టిలోనే కలిసిపోయాడు మొగులుల సామ్రాజ్యం అంతమైంది.

అప్పుడు తన సైన్యాన్ని తీసుకుని బేరా అడవులకు వెళ్లిపోయడు అభీర్ సేన ప్రతీకారం అలా ఉంటుంది. అప్పుడు ఉన్న అభీర్ అయ్యినా ఇప్పుడు ఉన్న అభీర్ అయ్యినా వాళ్ళ రక్తం ఒకటే పౌరుషం ఒక్కటే

మిమ్మల్ని ఈ గడ్డమీద నుంచి బయటకు వెళ్ళనివ్వడు ఈ మట్టిలో కలిసి పోవాల్సిందే కాబట్టి క్షమించమని వేడుకోండి ప్రాణాలతో మిగులుతారు." అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు శ్రీకర్.

***********

ఆ మాటలు విని అక్కడి నుంచి వరదరాజులతో కలిసి పక్కకు వెళ్లి "ఆ ఆఫీసర్ ఏమిటి వెన్నుపోటు అన్నప్పుడల్లా మన వైపు చూస్తున్నాడు?" అని కంగారుగా అడిగాడు ప్రతాప్ మిశ్రా.

"ఆరోజు అభిర్ మనకు వార్నింగ్ ఇచ్చినప్పుడు ఈ ఆఫీసర్ కూడా ఉన్నాడు కదా మర్చిపోయావా? సైలెంట్ గా ఉండు ఇప్పుడు ఈ ముకుల్ ఫ్యామిలీ రెస్పాన్స్ ఏంటో చూడాలి." అని చెప్పాడు వరదరాజులు.

"ముకుల్ దగ్గరికి వెళ్లి తాతయ్య చరిత్రను ఎన్ని రకాలుగా కావాలంటే అన్ని రకాలుగా మార్చి చెప్పొచ్చు ఆ ఆఫీసర్ చెప్పింది నిజమే అయ్యుండొచ్చు, కానీ అప్పటి పరిస్థితులు వేరు ఇప్పటి పరిస్థితులు వేరు ఇప్పుడు డబ్బు ఉన్న వాడిదే అధికారం, మన నంద ఫ్యామిలీ వ్యాపారంలో ముందుకు వెళ్లాలంటే తలవంచ కూడదు వంచితే మునిగిపోతాము." అని చెప్పింది అర్ణ.

"అవును తాతయ్య! మనం వాళ్ళని క్షమించమని అడిగాము అంటే ఇంక మార్కెట్లో మన మాటకి విలువే ఉండదు బతికి ఉన్న చచ్చినట్లే!" అని చెప్పాడు మోహిత్.

"అంకుల్! మనల్ని భయపెట్టడానికి వంద మంది వంద రకాలుగా చెబుతారు మీరు ఎవరి మాటలు నమ్మకండి ఆ అభీర్ ని ఎలా దారిలోకి ఎలా రప్పించాలో నాకు బాగా తెలుసు!" అని చెప్పాడు అభిజిత్.

అక్కడికి వస్తువు "అవును మావయ్య గారు! మీరు ఆశ మాటలు ఏమీ పట్టించుకోకండి. అది చిన్న పిల్ల దానికి ఈ విషయాలన్నీ సరిగ్గా తెలీదు." అని చెప్పాడు రఘురామ్.

ఆ మాటలకి ఆలోచిస్తూ "ఆ అభీర్ సేన శక్తి మొత్తం వాసుకి చెప్పినట్లు ఆ కొండల దగ్గరే ఉంది నువ్వు చెప్పిన తల్వార్ ఎప్పుడు వస్తున్నాడు." అని అడిగాడు ముకుల్.

"ఆన్ ద వే సార్! కాసేపట్లో ఇక్కడే ఉంటాడు." అని చెప్పింది వాసుకి.

"సరే!" ఇక మీదట నేను చెప్పినట్లు వినండి. మనలో ఒక్క ప్రాణం కూడా పోవడానికి వీల్లేదు, రాజస్థాన్ వెళ్ళిన ప్రమోద్ వాళ్లకి కూడా కాల్ చేసి జాగ్రత్తగా ఉండమని చెప్పండి తల్వార్ రావడంతోనే నా దగ్గరకు తీసుకురండి." అని అక్కడ ఉన్నవారు వైపు చూస్తూ

"మీరు చెప్పింది నిజమే! పరపతి పోయిన తర్వాత బ్రతికి ఉన్న ఒకటే చచ్చిన ఒకటే!" అని లోపలికి వెళ్ళిపోయాడు ముకుల్.

ఆ మాట విని "హమ్మయ్య! వీళ్ళు స్టాండ్ మీదే ఉన్నారు ఎక్కడ మారిపోతారో మనకి పనే లేకుండా పోతుంది అనుకున్నాను." అని నెమ్మదిగా వాసుకి దగ్గరికి వెళ్లి xనువ్వు బానే ఉన్నావు కదా!" అని అడిగాడు ప్రతాప్ మిశ్ర.

ఆ మాటకి ఉలిక్కిపడి వెనక్కి తిరిగి "మీరా కంగారు పడ్డాను నేను బానే ఉన్నాను." అని చెప్పింది వాసుకి.

"ఆ అభీర్ మనుషులు నీకు బానే భయం చూపించినట్లు ఉన్నారు,  సీక్రెట్స్ ఏమైనా ఉంటే మాతో కూడా పంచుకో హెల్ప్ చేస్తాము." అని చెప్పాడు ప్రతాప్ మిశ్ర.

"సరే!" అని కోపంగా చూస్తూ లోపలికి వెళ్ళిపోయింది వాసుకి.

అర్ణ దగ్గరికి వెళ్లి "నువ్వు బాధపడి ప్రయోజనం లేదు ఏం చేయాలో ఆలోచించు, నువ్వు చెప్పినట్లు మనం మార్కెట్లో నిలబడాలి అంటే ఈ విషయంలో గట్టిగా నిలబడాలి.

ఆ అభీర్ మీద పగతో కాకుండా బిజినెస్ లో ఎదుటి వాళ్ళని దెబ్బ కొడతాం కదా అలాగా ఆలోచించు అప్పుడు నీ ప్లాన్ వర్క్ అవుట్ అవుతుంది." అని చెప్పాడు మిథున్.

"సరే!" అని మహేష్ ఫోటో వైపు చూస్తూ ఊపిరి పీల్చుకుని లోపలికి వెళ్ళింది అర్ణ.

ప్రతాప్ మిశ్ర, వరదరాజులు వైపు చూసి "మీరు భయపడితే మాకు దూరంగా వెళ్లిపోండి." అని చెప్పాడు అభిజిత్.

"అలాంటిదేమీ లేదు మేము ధైర్యంగానే ఉన్నాము మీకు ఎప్పుడు తోడుగానే ఉంటాము, ఇటువంటి విషయాలు మన పొలిటీషియన్స్ కి అలవాటే కదా!" అని లేని నవ్వు మోహన తెచ్చుకుని చెప్పాడు వరదరాజులు.

"సరే! మనకి ఉపయోగపడతాడు అనుకున్న ప్రతి ఒక్కరిని పిలిపించండి ఎంత డబ్బు కావాలన్నా ఇద్దాము." అని చెప్పి నిజం తో కలిసి  వీల్ చైర్ లొ లోపలికి వెళ్ళాడు అభిజిత్.

తంబియార్, సుజిత్ లో వైపు చూసి "మీ ఇద్దరి పని ఈరోజు నుంచి ఏమిటంటే, ఇక్కడ ఉన్న  వాళ్ళలో అభీర్ మనుషులు ఎవరో తెలుసుకోవడమే, వాళ్లతోనే వాడికి కన్ను పొడిపించాలి." అని చెప్పాడు వరదరాజులు.

"ఓకే డాడ్!" అని చెప్పాడు తంబియార్.

*************

మల్లి తెచ్చిన మహేష్ తలని డబ్బులలో తగలబెడుతున్న అభీర్ దగ్గరికి వచ్చి "చంద్రశేఖర్ గారిని సేఫ్ ప్లేస్ కి పంపించాము వాళ్ళు ఎక్కడ ఉన్నారో ఎవరు తెలుసుకోలేరు." అని చెప్పాడు బైరి.

"రాజస్థాన్ నుంచి అరుల్ కాల్ చేశాడు అడవిలో విష్ణు కోసం వెతుకుతున్నారంట, అలాగే నాగాలాండ్ నుంచి బీహార్ నుంచి మనుషుల్ని రప్పించి అడవిలోకి వెళ్లడానికి రెడీ అవుతున్నారు." అని చెప్పాడు రాజన్.

"అంతేకాదు బేరా లొ ఉన్న నిధిని వెతకడం కోసం తల్వార్ అనే ట్రెజర్ హంటర్ ని పిలిపించింది వాసుకి, అతను ఈరోజు సాయంత్రం ఇక్కడికి వస్తున్నాడు." అని చెప్పాడు రాము.

"ఇప్పటినుంచి వాళ్లు చాలా జాగ్రత్త పడతారు ఆవేశంతో అడుగు ముందుకు వెయ్యరు, వాళ్లు ఏ డబ్బు ఆపేక్షతో కొండల దగ్గరికి వెళుతున్నారో ఆ డబ్బుని వాళ్ళకి దూరం చేయాలి.

నంద, అభిజిత్ వ్యాపారలా గురించి అన్ని విషయాలు తెలుసుకోండి వాళ్ళ మూలాల మీద దెబ్బ కొట్టాలి, ఆ దెబ్బ ఎలా ఉండాలి అంటే వాళ్లు ఆలోచించడానికి కూడా టైమ్ దొరకకూడదు." అని చెప్పాడు అభీర్.

చాక్లెట్, నీలమ్ వాళ్లతో కలిసి అక్కడికి వస్తూ "బాగు చేయడం కష్టం కానీ నాశనం చేయడం చాలా ఈజీ! ఆ విషయంలో మేము చాలా స్పీడ్ గా ఉంటాము ఏం చేయాలో చెప్పండి దూసుకు వెళ్ళిపోతాము." అని చెప్పింది మిత్ర.

"ఆ నంద ఫ్యామిలీ బిజినెస్ మేటర్స్ అయితే నాకు సరిగ్గా తెలియదు కానీ అభిజిత్ గురించి అయితే ఫుల్ డిటేల్స్ తెలుసు!" అని చెప్పింది నీలమ్.

"మరి అడవిలోకి వెళుతున్న వాళ్ళ సంగతి!" అని అడిగాడు బైరి.

"అవును! అక్కడ మనం లేకపోతే ఆ కొండల దగ్గరికి వెళ్ళనివ్వకుండా ఆపలేము, ఇప్పుడు అడవిలోకి మన వాళ్ళని పంపించడానికి కూడా మార్గం లేదు ప్రతి దారిలో ఆ ఫరూక్ తన మనుషుల్ని ఆఫీసర్స్ ని ఉంచాడు." అని చెప్పాడు రాజన్.

"అడవిలోకి వెళ్లడానికి మన వాళ్ళని 50 మందిని సిద్ధం చేయండి ఎవరికంట కనపడకుండా మన పూర్వీకులు బామ్రఘడ్ నుంచి బేరా చేరుకున్న మార్గం నాకు తెలుసు వాళ్ళని సేఫ్ గా మన లింగు తీసుకువెళతాడు." అని చెప్పాడు అభీర్.

"అక్కడ ఉన్న లింగు వైపు చూసి ఏంటి కళ్ళు కనపడని ఇతను సేఫ్గా 50 మందిని తీసుకువెళతాడా? ఎలాగా?" అని ఆశ్చర్యంగా చూస్తూ అడిగింది నీలమ్.
[+] 9 users Like SivaSai's post
Like Reply


Messages In This Thread
RE: వేదం - by Manmadhsbanam143 - 22-12-2025, 04:13 PM
RE: ఖైదీ నెంబర్ 402 - నా మాటే శాసనం - by SivaSai - 16-02-2026, 10:29 AM



Users browsing this thread: 1 Guest(s)