15-02-2026, 09:08 AM
Part - 97
నీ ఇష్టం అవిని. నేను అస్సలు ఇబ్బంది పెట్టను. ప్లీజ్ అండి మీరు ఇలా చేయడం ఏమైనా బాగుందా.. అదే ప్లీజ్ అడుగుతున్నాను అండి.
మాకు చిన్న చిన్న కోరికలు ఉంటాయి కదా. నా వల్ల కాదండి.. ఇది కూడా నా వల్ల కాదండి అని అవని లాగానే చెబుతాడు.
ప్లీజ్ అండి నాకు ఇబ్బందిగా ఉంటుంది. అరే.. ఏదైనా ముందు అలాగే అనిపిస్తుంది. పెళ్ళికి ముందు నీకు నాకు ఇదేమైనా అలవాటా...
కానీ ఇప్పుడు చూడు ఒక రోజైనా ఉండగలుగుతున్నామా... ఇది అంతే. మీరు మాటలతో గారడీ చేస్తున్నారు.
లైఫ్ ని ఎంజాయ్ చేయమంటున్నాను. ఒప్పుకోకపోతే అని కోపాన్ని నటిస్తూ అడుగుతుంది. నేను ఏమి చేయను అన్నాను కదా...
నీ ఇష్టం అని తల కింద చేతులు పెట్టుకొని కాళ్లు ఊపుతూ ఉంటాడు. గడియారం టైం తిరుగుతూ ఉంటుంది. ఏవండీ టైం అయిపోతుంది.
చెప్పాను కదా భార్యమణి. ఏదైనా మాకు సమ్మతమే.. ఇది అన్యాయం. మీరు ఇలా చేస్తే నేను ఏడుస్తాను అని ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేయడానికి ట్రై చేస్తుంది.
నువ్వు ఏడుస్తే ఆ ఏడుపు ఎలా ఆపాలో నాకు తెలుసు గాని.. చేసిన ఓవరాక్షన్ చాలు. ఏదో ఒకటి డిసైడ్ చేసుకో..
ఇంకొంచెం సేపు ఆగితే అమ్మ వచ్చి డోర్ కొడుతుంది. అప్పుడు ఏమి చేస్తావు అని కళ్ళు ఎగరేసి అడుగుతాడు. మీరు టైం చూసి ఆడుకుంటున్నారు. అలా ఆడుకున్నప్పుడే మజాగా ఉంటుంది అని బుగ్గ పట్టుకుని లాగుతాడు.
ఏంటి తెగ బెదిరిస్తున్నారు. నేను వెళ్లలేని అనుకుంటున్నారా అని మెల్లిగా బెడ్ షీట్ లో నుంచి కాళ్లు కింద పెడుతుంది.
లేచి నుంచోలేక అవస్థలు పడుతూ బిక్కమొహం వేసుకుని విక్రమ్ వైఫై చేస్తుంది. వెళ్ళు అన్నట్టుగా చూస్తాడు.
ఇంక చేసేదేమీ లేక.. సరేలే మీ కండిషన్ కి ఒప్పుకుంటున్నాను అని చెబుతోంది. తర్వాత మాట మార్చవు కదా...
మార్చితే మాత్రం మీరు ఒప్పుకుంటారా... ఎలాగైనా సాధించుకుంటారు కదా.. పరవాలేదు నా గురించి పూర్తిగా తెలుసుకున్నావు.
బుగ్గ పైన కనీ కనపడకుండా పంటి గాటు పెట్టి బెడ్షీట్ తో సహా చుట్టి వాష్ రూమ్ లోకి తీసుకువెళ్తాడు. మీరు ఎక్కడికి అని కంగారుగా అడిగితే... ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది.
సరిగంగా స్నానం చేసి ఒకేసారి రెడీ అవుదాము అని చెప్పి చుట్టిన బెడ్ షీట్ ని లాగి షవర్ ఆన్ చేస్తాడు. అవని కి మాట్లాడే సమయం కూడా ఇవ్వకుండా చుట్టేస్తాడు.
ఇద్దరూ స్నానం చేసిన తర్వాత పొడి టవల్ లో చుట్టి చంటి పాపను ఎత్తుకున్నట్టుగా ఎత్తుకుని డ్రెస్సింగ్ రూమ్ లోనికి తీసుకు వెళతాడు.
అబ్బ ప్లీజ్ అండి. వదలండి. ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది. మీరు ఇంకా లేట్ చేస్తున్నారు. కింద అత్తయ్య వాళ్ళు ఏమనుకుంటారు. మెడ చుట్టూ చేతులు వేసి అడుగుతుంది.
ఏమీ అనుకోరు. అందరూ మన స్టేజ్ దాటి వచ్చిన వాళ్లే. కొడుకు కోడలు చిలక గోరింకల్లాగే కుచ్ కుచ్ హోతా హై చేసుకుంటున్నారు అనుకుంటారు అంతే అని చెప్పి...
ఆ తడి పెదవులు మీద చిన్న పెక్ ఇచ్చి..ఈ రోజు నిన్ను నేనే రెడీ చేస్తాను. వార్డురోబ్ దగ్గరికి వెళ్లి ఏం కలర్ సారీ కట్టుకుంటావు అని అడుగుతాడు. రెడీ చేసేది మీరేగా మీరే తీయండి అని చెబుతోంది.
కుంకం కలర్ జార్జెట్ చీర తీసి దాని మీదకి ముత్యాలు సెట్
సెట్ చేస్తాడు. దగ్గరుండి భార్యకి చీర కట్టి, జడవేసి , పాపిట్లో లో కుంకం పెడతాడు.
మెడలో ముత్యాల సెట్టు పెట్టి రెడీ చేసి ఫైవ్ మినిట్స్ అని చెప్పి విక్రమ్ కూడా రెడీ అవుతాడు. భార్యని పైనుంచి నుంచి కిందకి ఒకసారి మళ్ళీ ఒకసారి చూసుకుని ఏదో మిస్సయింది అంటాడు.
అవని అద్దంలో చూసుకుంటూ అంత బానే ఉందిగా.. ఇంకేం మిస్ అయ్యింది. ఒక్క నిమిషం.. కళ్ళకు పెట్టిన కాటుక కొద్దిగా తీసుకొని అరిపాదంలో పెట్టి..నుదుటిన ముద్దు పెట్టుకుని.. ఇప్పుడు పర్ఫెక్ట్ పద అంటాడు.
భర్త ప్రేమను చూసి అవని కళ్ళల్లో నీళ్ళు తిరుగుతాయి. హేయ్.. పిచ్చి ఏమిటివి అని చెప్పి కళ్ళు తుడుస్తాడు. విక్రమ్ ని గట్టిగా హత్తుకొని ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకున్నానో కానీ. ఇంత అపురూపమైన వజ్రం నాకు దొరికింది అని ఎమోషనల్ అవుతుంది.
ఓయ్ ఏంటిది. అసలే కష్టపడి ఇష్టంగా రెడీ చేసుకున్నాను. ఇప్పుడు నువ్వు ఏడ్చి ఆ ముఖమంత పేడ లాగా చేసుకున్నావ్ అనుకో.. నా కష్టానికి విలువ ఉండదు.
నా భార్యామణి ఎప్పుడూ చిరునవ్వుతో ఉంటే అదే నాకు సగంబలం అర్థమవుతుందా అని ఆ కళ్ళు తుడుస్తాడు. అవని విక్రమ్ నుదుటున ప్రేమగా ముద్దు పెట్టుకుని వెళదాం అంటుంది.
ఎన్నిసార్లు చెప్పినా మొగుడికి ఎక్కడ ముద్దు పెట్టాలో ఇప్పటికీ తెలియడం లేదు అని పెదవులు అందుకుంటాడు. ఒక్క ఐదు నిమిషాలకి పెదవులు వదిలి అవని వైపు చూస్తాడు.
సిగ్గుతో బుగ్గలు ఎరుపెక్కి పోయి కళ్ళు వాల్చేస్తుంది. మూడు డైవర్ట్ అయిందని అర్థమైయి పదా అని భుజం చుట్టూ చేయి వేసి తీసుకువెళతాడు.
జంటగా వస్తున్న విక్రమ్, అవని నీ చూసి ఇందిరాగారు మెటికలు విరుస్తారు. కోడల్ని పిలిచి ఇద్దరికి ముందు దిష్టి తీయవే..చిలకా గోరింటాకు లాగా ఉన్నారు.
అలాగే అత్తయ్య అని చెప్పి కిందకు రాగానే ముందు ఇద్దరికీ దిష్టి వస్తుంది. మామ్ ఏంటిది అని అడిగితే.. మీ అమ్మకి ఊపు వచ్చిందంటే అలా దిస్టులు తీసే చంపేస్తుంది రా..
పాపం ఇందాకే రాజ్ తప్పించుకున్నాడు అని కళ్యాణ్ గారు చెబితే అవును.. మీ నాన్న కూడా తప్పించుకున్నారు. సాయంత్రం గట్టిగా తీయాల్సింది ఉంది అని లలిత గారు వారగా చూస్తూ చెబుతారు.
ఆ మాటకి కళ్యాణ్ గతుక్కుమంటాడు. రమేష్.. ఎందుకు బావ సైలెంట్ గా పడుకున్న పాముని కర్రతో పొడిచి మరి కెలుకుతావు.
ఏదో సరదాగా సెటైర్ వేద్దాం అనుకున్నాను. అది తిరిగి తిరిగి మళ్లీ నా దగ్గరికి వచ్చి ఆగుతుందని నేను కలగన్నానా..
నువ్వు ఏదో ఒక కలగను. నన్ను మాత్రం ఆ కలలోకి లాగకు. నా భార్య సైలెంట్ గా ఉంది. మర్చిపోయినట్టు ఉంది. దాన్ని అలాగే ఉండనివ్వు.
అలా ఎలా కుదురుద్ది బావ. ఇరుక్కుంటే ఇద్దరము ఇరుక్కోవాలి. తప్పుకుంటే ఇద్దరమూ తప్పుకోవాలి. ఫస్ట్ నుంచి ఇదే కదా ఫాలో అవుతున్నాము కదా..
నీకు దండం రా బావ.. ఇక్కడ నుంచి ముందు వెళ్దాం.. మనం డిస్కషన్ మన భార్యలు ఇద్దరు చూశారు అంటే మళ్ళీ ఇద్దరికీ ఒక పూనకం వస్తది. ఎందుకు వచ్చిన గొడవ అని చెప్పి కళ్యాణ్ ని లాక్కుని అక్కడి నుండి వెళ్ళిపోతాడు.
రండిరా మీరిద్దరే లేట్ అయ్యారు బ్రేక్ఫాస్ట్ చేద్దురుగాని అని చెప్పి... కొడుకు, కోడలి ని కూర్చోబెట్టి కొసరి కొసరి వడ్డిస్తుంది.
అమ్మ చాలు అన్నా సరే తినండి అని చెప్పి ఫుల్లుగా తినిపించి.. అవని కోసం సెపరేట్గా రెడీ చేసిన డ్రై ఫ్రూట్స్ మిల్క్ షేక్ పట్టిస్తారు.
అత్తయ్య ఇలా తాగితే నేను ఇంక అంతే. నువ్వు ఎలా ఉన్నా మాకు బానే ఉంటావు. అసలు బలమే లేదు. ఇలాగైతే రేపు పిల్లలు కనేటప్పుడు ఎంత కష్టమవుతుందో తెలుసా అనగానే.. ఆ మాటకి సిగ్గుపడుతూ గ్లాస్ అందుకుంటుంది.
మొదటి రోజుకి ఇప్పటికి అవిని తీసుకునే ఫుడ్ లో కొంచెం ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. అది చూసిన లలిత గారికి కూడా కొంచెం సంతోషంగా ఉంటుంది.
టిఫిన్ చేసి హాల్లో కూర్చోగానే... రాజ్ విక్రమ్ పక్కకు వచ్చి.. ఏంటి బావ ఇప్పుడు దాకా నువ్వు కిందకే రాలేదు. ఎప్పుడు ఇంత లేట్ చేయవు కదా..
పొద్దుటే లేచి జిమ్ కి వస్తావు కదా.. అన్నీ మిస్ చేశావేంటి అని అడుగుతాడు. ఆ మాటకి చురుగ్గా ఒక చూపు చూస్తే ఇప్పుడు నేను ఏమన్నాను. నువ్వు అంత కోపంగా చూస్తున్నావు.
ఏమీ లేదు బావగారు మీకు ఎలాంటి మర్యాదలు చేయాలా అని ఆలోచిస్తున్నాను. అబ్బా విక్కీ నువ్వు అలా బావగారు అని పిలుస్తుంటే చెవిలో అమృతం పోసినంత కమ్మగా ఉందిరా అంటాడు.
ఒరేయ్ అదేం పోలిక రా అంటే ఏమో ఏదో ప్రాస బాగుంది కదా అని వాడేసాను. అలా కాదా అంటే ఏమో నాకు తెలియదు అంటాడు.
ఇంతకీ మన శ్రీ గాడు ఏం చేస్తున్నాడు. ఫోన్ చేశాడా.. వాడికి కొత్తగా పెళ్లయింది రా.. చాలా పనులు ఉంటాయి. నేను కూడా కొత్తగా ప్రేమలో పడ్డాను.
నేను అందరి గురించి ఆలోచించడం లేదా.. ఎలాగైనా నాకు ఉన్నంత హ్యుమానిటీ మీ ఇద్దరికీ లేదబ్బా అని అంటాడు.
అవునా నీకు ఎక్కువైపోయినట్టుంది కదా అంటే.. చాలా.. రాజ్ అదృష్టం బాగా పండి నివి వస్తుంది. రాజ్ మీరు ఖాళీయేనా అని అడుగుతుంది.
అంతే ఆ దెబ్బతో ఫ్యూజులు ఎగిరిపోయి నో.. నివి నేను ఆఫీస్ కి వెళ్ళాలి. చాలా వర్క్ ఉంది అని చెబుతాడు. ఏ ఆఫీస్ కి వెళ్ళాలి అని అడుగుతుంది.
విక్రమ్ పక్కనే ఉన్నాడు. ఈ ఆఫీస్ కంటే వాడు కచ్చితంగా గాలి తీసేస్తాడు. ఏ ఆఫీస్ కి వెళ్తాను.. మన ఆఫీస్ కి అంటే...
అప్పుడే అక్కడికి పార్ధు గారు వచ్చి మన ఆఫీసులో ఇప్పుడు వర్క్ ఏమీ లేదురా... నేను అంతా సెట్ చేసేసాను.
కోడలు పిల్లకి ఏం కావాలో నువ్వు చూసుకో అని ఇరికించేస్తారు. ఆ మాటకి తండ్రిని కొరకురా చూస్తూ.. మీరు నిన్నే వచ్చారు కదా డాడీ..
మీకు ఆ వర్క్ అంతా తెలియదు. నా ఆఫీసులో నాకు తెలియంది ఏమి ఉంటది. ఏదో అక్కడికి వెళ్లి పొడిచేస్తున్నట్టు బిల్డప్ ఇస్తున్నావు.
విక్రమ్ నివి వైపు చూస్తూ.. బావగారికి ఏదో పని ఉందంట. నీతో రావడానికి అవ్వదు అనుకుంటా అని సాగదీస్తాడు.
ఆ మాటకి నివి బాధగా రాజ్ వైపు చూస్తూ అవునా రాజ్...
సరేలే నేను ఒక్కదాన్నే వెళతాను అని బ్యాగ్ తీసుకుంటుంది. రాజ్.. విక్రమ్ వైపు చూస్తూ ఇరికించేసావు కదరా అని మెల్లగా అంటే... నీకు హ్యుమానిటీ ఎక్కువ కదా.. ఎంజాయ్ అని భుజాలు ఎగరేస్తాడు.
ఏంటో మా రాజ్ బాబు అస్తమాను బుక్ అయిపోతాడు ??

![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)