15-02-2026, 08:52 AM
ఎపిసోడ్ 80
గెస్ట్ హౌస్ కి తీసుకువచ్చిన మల్లి వాళ్ళు, చంద్రశేఖర్ వాళ్ళని విడిపించుకుని మహేష్ ని చంపి వెళ్లిపోవడంతో తల లేని బాడీ దగ్గర బాధపడుతూన్న వాళ్ళని చూసి ఇప్పటికైనా తప్పు తెలుసుకోండి అని చెప్పినా ఆశ నుదుటిమీద తుపాకీ పెట్టి, చనిపోయింది నా తండ్రి, నా అన్న ఆ బాధ నీకు ఎలా తెలుస్తుంది అని కోపంతో అభీర్ అని గట్టిగా అరిచింది అర్ణ.
*************
నంద గెస్ట్ హౌస్ నుంచి దాస్ వాళ్లతో కార్ లొ వెళ్ళుతు డ్రైవర్ వైపు చూసి "ఫాస్ట్ గా వెళ్ళారా బాబు! రెండు సింహాల మధ్య పడ్డ జింక పిల్ల లాగా అయిపోయింది నా పరిస్థితి, అర్జెంటుగా ఇక్కడి నుంచి ట్రాన్స్ఫర్ చేయించుకుని వెళ్ళిపోవాలి." అని కంగారుగా చూస్తూ
"ఏమయ్యా దాసు! ఆ అమ్మాయి ఏంటి వాడి తలని అలా నరికేసింది. ఆ కళ్ళు లేని వాడిని చూసి పాపం అనుకున్నాను కానీ వాడు మీదకి వచ్చే బులెట్ ని కత్తితో ఆపేడు ముందుకు వచ్చిన మనుషుల్ని కనికరం లేకుండా నరికేశాడు.
వీళ్ళు నన్నేమీ చేయకుండా సైలెంట్ గా నాతో అక్కడకి వచ్చినప్పుడే డౌట్ వచ్చి ఉండాలి, నేనే తీసుకువెళ్లి నంద గారి మనవడు ప్రాణాలు తీయించినట్లు ఉంది." అని కార్ నుంచి బయటికి చూస్తూ
"ఎవరని చూసిన నా మీద ఎటాక్ చేస్తున్నట్లు అనిపిస్తుంది కాస్త ఇంటి వరకు తోడు రండి." అని టెన్షన్ గా చూస్తూ చెప్పాడు ప్రహల్లాద్.
"సార్! టెన్షన్ పడకండి మీరు ఆ నంద ఫ్యామిలీ చెప్పినట్లు చేశారు, ఇటు అభీర్ కి కూడా హెల్ప్ చేశారు కాబట్టి మీరు రెండు వైపుల నుంచి సేఫ్ గా ఉంటారు." అని చెప్పాడు దాస్.
"అంతే అంటావా!" అని చెప్పి ఇల్లు రావడంతో కార్ దిగి వేగంగా లోపలకి వెళ్ళిపోయాడు ప్రహల్లాద్.
అక్కడి నుంచి వెళుతూ దాస్ వైపు చూసి "సార్! ఆయన పేరే ఎన్కౌంటర్ ప్రహ్లాద్ కదా మరి ఎందుకు అంత భయపడుతున్నారు?" అని డౌట్ గా అడిగాడు కుమార్.
"ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పనా? నీకు దేవుడంటే భయం ఉందా? భక్తి ఉందా?" అని అడిగాడు దాస్.
"దేవుడు అంటే భయం ఎందుకు ఉంటుంది సార్! భక్తి ఉంటుంది." అని చెప్పాడు కుమార్.
"కరెక్ట్! పాపం చేసిన వాడికి దేవుడిని చూస్తే భయమేస్తుంది. అందుకే మన ఎస్పీ సార్ కి అభీర్ పేరు చెబితేనే భయం వేస్తుంది." అని చెప్పాడు దాస్.
"అంటే! మన ఎస్పీ సర్ పెద్ద పాపాత్ముడు అన్నమాట! ఇప్పుడు నాకు అర్థమైంది." అని నవ్వుతూ చెప్పాడు కుమార్.
**************
ప్రమోద్ తో కలిసి రాజస్థాన్ వెళ్లి ఫారుక్ ని కలుసుకుని xఅడవిలో విష్ణు జడ ఏమైనా తెలిసిందా?" అని అడిగాడు నిర్మల్.
"ఆ అడవిలో ఉన్న ఆ కొండల మీద చనిపోయిన ఆ తెగ వాళ్ళ ఆత్మలు తిరుగుతున్నాయంట! ఆఫీసర్లు కానీ ఇక్కడ ఉండే మనుషులు గాని వెళ్లడానికి భయపడుతున్నారు, అందుకే గొర్వర్ ప్రాంతంలో ఉండే కొంతమంది గిరిజనల్ని పంపించను ఎలాగైనా విష్ణు ని వెతికి పట్టుకు వస్తారు." అని చెప్పాడు ఫరూక్.
ఆ మాటకి నవ్వుతూ "దెయ్యాలు లేవు భూతాలు లేవు, ఆ కొండల దగ్గర విలువ కట్టలేని సంపద ఉంది అందుకే ఈ పుకార్లు పుట్టించి ఉంటారు, ఆ అడవిని ఎలాగైనా మనం హ్యాండ్ ఓవర్ చేసుకోవాలి,
ఉదయానికి నాగాలాండ్, బీహార్ నుంచి నా మనుషులు ఇక్కడ దిగుతారు వాళ్ళని చూస్తే భూతాలు కూడా భయపడతాయి." అని చెప్పాడు నిర్మల్.
"సరే! లోపలికి వెళ్లడానికి సేఫ్టీ వాన్స్ ఏర్పాటు చేస్తాను ఎందుకంటే అక్కడ చాలా జంతువులు ఉంటాయి 12 సంవత్సరాలుగా మనవాళ్ళు ఎవరు లోపలకి వెళ్లలేదు కొంచెం జాగ్రత్తగా ఉండాలి." అని చెప్పాడు ఫరూక్.
"ఆ అభీర్ మనుషుల అలజడి ఇక్కడ ఏమైనా ఉందా?" అని అడిగాడు ప్రమోద్.
"అసలు వాడి పేరే ఇక్కడ ఎవరకి తెలియదు ఇక్కడకి వచ్చి ఏమైనా పిచ్చి వేషాలు వేస్తే చూసుకోవడానికి మా మనుషులు ఉన్నారు శవం కూడా దొరకదు." అని కత్తులతో ఉన్న తన మనుషుల్ని చూపించాడు ఫరూక్.
"ఆ కొండల దగ్గర ఏదో భారీ నిధి ఉంది అంటున్నారు దాని గురించి నీకేమైనా తెలుసా?" అని అడిగాడు నిర్మాల్.
"ఆ మాట నేను కూడా విన్నాను నాలుగు సంవత్సరాల క్రితం వియత్నం నుంచి ఒక టీమ్ ఫుల్ ఎక్విప్మెంట్ తో వచ్చారు రెండు నెలలు వెతికారు సగం మంది చచ్చారు మిగతా వాళ్ళు ప్రాణాలకు భయపడి వెనక్కి వెళ్ళిపోయారు." అని చెప్పాడు ఫరూక్.
"అంటే వాసుకి చెప్పింది నిజమే! అక్కడ ఏదో ఉండే ఉంటుంది." అని చెప్పి ఫోన్ రింగ్ అవ్వడంతో లిఫ్ట్ చేసి మాట్లాడి నిర్మల్ వైపు కంగారుగా చూస్తూ "మహేష్ ని అభీర్ సేన మనుషులు చంపేశారు." అని చెప్పాడు ప్రమోద్.
"అవునా?" అని ఆశ్చర్యంగా చూస్తూ "ఇప్పుడు అర్ణ ని ఆపడం కష్టమే!" అని చెప్పాడు నిర్మల్.
*************
ఉదయం మహేష్ దహన సంస్కరాలు చేసి గెస్ట్ హౌస్ కి వచ్చి బాధగా కూర్చున్న ముకుల్ దగ్గరికి వెళ్లి "తాతయ్య ఇప్పుడు ఏం చేద్దాము అనుకుంటున్నారు?" అని అడిగింది ఆశ.
ఆవేశంగా అక్కడికి వస్తూ "ఏం చేయడమేమిటి! ఆ అభీర్ సేన లొ ఒక్కరు కూడా మిగలడానికి వీల్లేదు మన దగ్గర డబ్బు పలుకుబడి రెండు ఉన్నాయి వీటిని ఉపయోగించి వాళ్ల అంతు చూస్తాను." అని కోపంగా చూస్తూ చెప్పింది అర్ణ.
"అవును! మన దగ్గర అన్నీ ఉన్నాయి కానీ తప్పు చేశాము అన్న పశ్చాత్తాపం మాత్రం లేదు, మనవాళ్లు ముగ్గురు చనిపోతేనే నీకు అంత ఆవేశం వచ్చింది. మరి వాళ్ళ మనుషుల్ని ఎంతమందిని వీళ్ళు చంపారు అలాంటప్పుడు వాళ్ళు చేతులు ముడుచుకుని కూర్చుంటారా..?" అని చెప్పింది ఆశ.
"12 సంవత్సరాలుగా మూసుకుని కూర్చున్నారు కదా అలాగే ఇప్పుడు కూడా కూర్చుంటారు." అని చెప్పాడు అభిజిత్.
"మనల్ని ఇన్ని సంవత్సరాలు ఏమీ చేయకుండా సైలంట్ గా ఉండడానికి ఆ అభీర్ పిరికివాడు కాదు చాలా ముందు ఆలోచన ఉన్నవాడు అందుకే వాళ్ళ బలం పెరిగే అంతవరకు ప్రశాంతంగా ఉన్నాడు.
ఇప్పుడు యుద్ధం మొదలుపెట్టాడు కనీసం మనం ఈ దేశం వదిలి పారిపోయా అవకాశం లేకుండా చేశాడు, నాకు తెలిసి అతను తలుచుకుంటే మనల్ని అందరిని ఒక్కసారి చంపేయగలడు కానీ ఎందుకు చంపడం లేదో తెలుసా?
తాతయ్య మనవాళ్లలొ ఒక్కొక్కరు చనిపోవడం చూసి నేను ఈ తప్పు ఎందుకు చేశానా అని కుమిలి కుమిలి ఏడవలి అందుకే ఆయన కళ్ళముందే ఒక్కొక్కరిని చంపుతున్నాడు విష్ణుని కూడా అడవిలో చంపాడు మన ముందుకు తీసుకువచ్చే చంపుతాడు." అని చెప్పింది ఆశ.
"నువ్వు కాసేపు నోరు మూసుకుంటావా? నీకేం తెలుసు అని అంత పెద్ద పాటలు మాట్లాడుతున్నావు?" అని కోపంగా చెప్పాడు రఘురామ్.
అక్కడికి వస్తూ "ఆ అమ్మాయి చెప్పింది కరెక్ట్ సార్!" అని చెప్పాడు శ్రీకర్.
ఆ మాట విని తల పక్కకి తిప్పి చూసి "ఎవరు నువ్వు? లోపలికి ఎవరు రానిచ్చారు?" అని సీరియస్ గా అడిగాడు ముకుల్.
"మేము సిబిఐ ఎక్కడికైనా వస్తాము మమ్మల్ని ఎవరు ఆపలేరు అని చెప్పాడు శ్రీకర్.
"ఏంటి? మురళి జోషి కేసు గురించి విచారించడానికి వచ్చావా?" అని అడిగాడు ముకుల్.
"మీరు 12 సంవత్సరాల క్రితం చేసిన దారుణం మొత్తం నాకు తెలుసు కానీ ఆధారాలు లేకుండా నేను మిమ్మల్ని ఏమి చేయలేను." అని చెప్పి అక్కడ ఉన్న వరదరాజులు, అభిజిత్ వైపు చూస్తూ
"మీకు ఇద్దరు సెంట్రల్ మినిస్టర్స్ అండ ఉంది కాబట్టి ఆల్రెడీ మీలో ముగ్గురు చచ్చారు కాబట్టి సెక్యూరిటీ కూడా ఇస్తాను కానీ ఆ అభీర్ సేన మిమ్మల్ని ఏమీ చేయకుండా మాత్రం ఆపలేను." అని చెప్పాడు శ్రీకర్.
"ఎందుకు వాళ్ళు అంత మొనగాళ్ల?" అని అడిగాడు అభిజిత్.
"అవును! అభీర్ ని మీరు జైలుకు పంపించిన తర్వాత మిగిలిన వాళ్ళందరూ ఎక్కడ ఉన్నారో ఏమైపోయారో ఎవరికీ తెలీదు కానీ వాళ్లకి మీలో ప్రతి ఒక్కరి గురించి తెలుసు!" అని చెప్పాడు శ్రీకర్.
"నా ఫ్యామిలీ ఈ 12 సంవత్సరాలొ ఒక్కసారి కుడా ఇండియాకి రాలేదు మరి నా వాళ్ళ గురించి వాళ్ళకి ఎలా తెలుస్తుంది?" అని అనుమానంగా అడిగాడు ముకుల్.
"అక్కడికే వస్తున్నాను వాళ్లలో చాలామంది RAW లొ వర్క్ చేసారు వాళ్ళ ఒరిజినల్ ఐడెంటిటీ ఏమిటో ఎవరికి తెలియదు అందరూ ఫుల్ ట్రైన్డ్ ఎట్టి పరిస్థితుల్లోనైనా శత్రువుతో యుద్ధం చేయగలరు,
ఒకవేళ వాళ్ళని మీరు పట్టుకుని చంపుదాము అని ఆలోచించే లోపు మిమల్ని చంపేసి వెళ్ళిపోతారు ఇలాంటి సైన్యానికి ఒక సమర్ధుడైన నాయకుడు ఉంటే ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి." అని చెప్పాడు శ్రీకర్.
" మమ్మల్ని భయపెట్టాలని చూస్తున్నావా? ఆ నాయకుడిని చంపేస్తే ఆ సైన్యం చెల్లాచెదురు అవుతుంది." అని కసిగా చూస్తూ చెప్పింది అర్ణ.
ఆ మాటకి నవ్వుతూ "మిమ్మల్ని చూస్తుంటే జాలేస్తుంది ఎంత చెప్పినా మీ బుర్రకి ఎక్కలేదు అంటే ఇంక మిమ్మల్ని ఎవ్వరూ కాపాడలేరు, ఆఖరిగా ఒక విషయం చెప్పి వెళ్ళిపోతాను." అని అక్కడ ఉన్న వాసుకి వైపు చూసి
"నీకు అభీర్ సేన గురించి తెలిసిన చరిత్ర ఏమిటి?" అని అడిగాడు శ్రీకర్.
ఆ మాటకి కంగారుగా అర్ణ వైపు చూసింది వాసుకి.
"పర్వాలేదు చెప్పు వీళ్ళు మనల్ని ఏమి చేయలేరు." అని చెప్పింది అర్ణ.
"ఆ అభీర్ సేన జారువా తేగకు సంబంధించిన వారు చత్రపతి శివాజీ మహారాజ్ సైన్యంలో సీక్రెట్ గా ఉండి ప్రతి యుద్ధంలో సహాయం చేసేవారు.
శివాజీ మహారాజ్ చనిపోయిన తర్వాత అమ్మవారు ప్రసాదించిన చంద్రహాస్ ఖడ్గన్ని తీసుకుని అక్కడనుంచి వెళ్లిపోయారు వాళ్ల ఉనికి గురించి ఔరంగజేబు వెతుకుతున్నాడని తెలిసి బామ్రఘడ్ అడవుల నుంచి రాజస్థాన్లో ఉన్న బేర అడవులకు వెళ్లిపోయారు." అని చెప్పింది వాసుకి.
"మన వీరుల చరిత్ర గురించి మనల్ని బానిసలుగా పరిపాలించిన వాళ్ళు చెప్పిందే నిజం అనుకుని ఇప్పటికీ నమ్ముతున్నాము, మీకు తెలిసింది చరిత్రని వక్రీకరించి చెప్పిన కథ అసలు వాస్తవం నేను చెప్తాను వినండి. తర్వాత కూడా వాళ్ల జోలికి వెళతాను అంటే మీ ఇష్టం!" అని చెప్పడం మొదలుపెట్టాడు శ్రీకర్.

![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)