15-02-2026, 08:50 AM
ఎపిసోడ్ 79
మిథున్ చెప్పడంతో రైల్వేస్టేషన్లో మల్లి, లింగు లను దాస్ కుమార్ హెల్ప్ తో కార్లో ఎక్కించుకొని గెస్ట్ హౌస్ దగ్గరికి తీసుకు వెళ్ళాడు ప్రహల్లాద్.
*********
కార్ దిగుతున్నప్రహల్లాద్ వైపు చూసి "సార్! నందా గారి గెస్ట్ హౌస్ కి తీసుకువచ్చారు ఈ విషయం అభీర్ కి తెలిసింది అంటే ఇంకేమైనా ఉందా?" అని కంగారుగా అడిగాడు దాస్.
"మీ ఇద్దరి గురించి మాట బయటికి రాదు వీళ్లని దింపిన తర్వాత నేను చెప్తాను అప్పుడు ఇక్కడి నుంచి వెళ్లిపోండి." అని చెప్పి కార్ దిగి వెళ్ళాడు ప్రహ్లాద్.
మల్లి వైపు కంగారుగా చూస్తూ "నేను అక్కడే చెప్పాను కదా పారిపోకుండా మాతో పాటు ఎందుకు వచ్చారు?" అని అడిగాడు దాస్.
"నేను పారిపోతాను పాపం లింగుకి కళ్ళు లేవు అతను ఎలా తప్పించుకుంటాడు అయ్యినా స్టేషన్ కి తీసుకు వెళ్తాడు అనుకున్నాను ఇక్కడికి తీసుకు వస్తాడు అనుకోలేదు." అని కళ్లకు కట్టిన గంతలు తీసి డ్రైవర్ వైపు చూసి సైగ చేసింది మల్లి.
సైగ చేయడం చూసి 'ఓహో ఏదో ప్లాన్ లోనే వచ్చారు.' అని మనసులో అనుకున్నాడు దాస్.
మిథున్ దగ్గరికి వెళ్లి "సార్! మీరు చెప్పినట్లు ఆ ఇద్దరిని తీసుకొచ్చాను కార్ లొ ఉన్నారు ఇక్కడకి తీసుకురమంటారా..?" అని అడిగాడు ప్రహల్లాద్.
సాదు వైపు చూసి "ఇద్దరి చేతులు కట్టేసి ఇక్కడికి తీసుకురా..!" అని చెప్పాడు మిథున్.
కారులో నుంచి దింపి చేతులు కట్టి తీసుకు వస్తున్న ఇద్దరినీ చూసి "అతనికి కళ్ళకి గంతలు ఎందుకు కట్టలేదు?" అని డౌట్ గా అడిగింది అర్ణ.
"మేడం! అతని కళ్ళు కనిపించవు అందుకే కట్టలేదు." అని చెప్పాడు ప్రహల్లాద్.
అక్కడికి వచ్చిన లింగు దగ్గరకి వెళ్లి "కళ్ళు లేకుండా అభీర్ సేనలొ ఉండి నువ్వేం చేస్తావు?" అని నవ్వుతూ అడిగాడు మహేష్.
"మరి ఈ కళ్ళు లేనోడు ఏం చేస్తాడని భయపడి చేతులు కట్టేసి ఇక్కడికి తీసుకొచ్చారు?" అని అడిగాడు లింగు.
ఆ మాటకి కోపంగా చూస్తూ "అతని చేతి కట్లు విప్పండి." అని చెప్పి మల్లి దగ్గరికి వెళ్లి "మా గురించి డాక్యుమెంటరీ తీయడంలో బాగా హెల్ప్ చేస్తున్నవు అని తెలిసింది నీకు అన్ని విషయాలు తెలుసా?" అని కళ్ల గంతలు తీస్తూ అడిగింది అర్ణ.
అక్కడికి వస్తూ "నువ్వు అభీర్ సేన మనిషిని రిసీవ్ చేసుకున్నావు అంటే మిగతా వాళ్ళు కూడా ఎక్కడ ఉన్నారో తెలిసే ఉంటుంది వాళ్ళ ఇన్ఫర్మేషన్ మాకు ఇస్తే నిన్ను చంపకుండా వదిలేస్తాము." అని చెప్పాడు ముకుల్.
ఆ మాటకి నవ్వుతూ "అభీర్ సేన సంగతి పక్కన పెట్టు ముందు నీ మనవడు విష్ణు ఎక్కడ ఉన్నాడో తెలుసుకున్నావా?" అని అడిగింది మల్లి.
"అంటే! మా విష్ణు ఎక్కడ ఉన్నాడో నీకు తెలుసు కదా మర్యాదగా చెబుతావా లేదా?" అని మల్లి పీక పట్టుకున్నాడు మోహిత్.
అది చూసి కోపంగా అక్కడకి వచ్చి మోహిత్ చెయ్యి పట్టుకుని లాగి "నీకు సిగ్గు లేదా చేతులు కట్టేసి ఉన్న ఒక అమ్మాయి పీక పట్టుకున్నావు?" అని కోపంగా అంది ఆశ.
మళ్లీ తో పాటు లింగు రావడం చూసి 'ఇక్కడ చీకటి యుద్ధం జరుగుతుంది.' అనుకుని లోపలికి వెళ్ళాడు రాము.
"మీ మనుషుల్లో ఒకరు చనిపోయి ఒకరు కనపడకుండా పోతేనే ఇంత ఆవేశ పడిపోతున్నారు మావాళ్ళని అంత మందిని మత్తు మందు పెట్టి దారుణంగా చంపేశారు నోరులేని మూగజీవాలను క్రూరంగా చంపారు మరి మాకు ఎంత కోపం రావాలి?" అని కసిగా చూస్తూ చెప్పింది మల్లి.
"అంటే! నువ్వు కూడా అభీర్ సేన మనిషివే కదా!" అని అనుమానంగా చూస్తూ అడిగింది వాసుకి.
"అవును! మీరు మా బతుకులు చీకటి చేశారు మీకు చీకటి ఎంత భయంకరంగా ఉంటుందో ఇప్పుడు చూపిస్తాను." అని "జై భవాని!" అని గట్టిగా అరిచింది మల్లి.
ఆ అరుపు విని జనరేటర్ వైర్లు కట్ చేసి కరెంట్ ఫీజులు పీకి దూరంగా పడేసి రూమ్ లో ఉన్న చంద్రశేఖర్, ప్రీతి లను బయటికి తీసుకువచ్చి "వెళ్లిపోవడానికి సిద్ధంగా ఉండండి." అని చెప్పాడు రాము.
లైట్స్ ఆఫ్ అయ్యి అంత చీకటిగా మారడంతో "జనరేటర్ ఆన్ చేయండి రా..!" అని గట్టిగా అరిచాడు మహేష్.
"చీకటి ఇంత భయంకరంగా ఉంటుందా...? అసలు ఇక్కడ ఏం జరుగుతుందో కూడా అర్థం కావడం లేదు." అని కంగారుగా చెప్పాడు వరదరాజులు.
"అవును!" అని వరదరాజుల వచ్చి పట్టుకుని "ఇక్కడే ఉండు." అని చెప్పాడు ప్రతాప్ మిశ్ర.
చీకటిలో రాము చేస్తున్న సౌండ్ విని వేగంగా అక్కడికి వెళ్లి "చంద్రశేఖర్ గారు మీరిద్దరూ నన్ను పట్టుకోండి కళ్ళు మూసుకుని భయం లేకుండా వేగంగా నాతో పాటు రండి." అని చెప్పాడు లింగు.
"భయం లేదు వెళ్ళండి మా మనిషే మిమ్మల్ని సేఫ్ గా ఇక్కడి నుంచి తీసుకువెళ్లిపోతాడు." అని చెప్పాడు రాము.
"సరే!" అని కూతురు చేయి పట్టుకుని లింగు భుజం మీద చెయ్యి వేసి గట్టిగా పట్టుకున్నాడు చంద్రశేఖర్.
ఇద్దరినీ అక్కడ నుంచి తీసుకు వెళుతూ "నేను చెప్పే వరకు నా చెయ్యి వదలకండి." అని చెప్పి వేగంగా గేటు దగ్గరికి వెళ్లి ఓపెన్ చేసి అక్కడ కాపలాగా ఉన్నాయి ఇద్దరినీ తన చేతులతో గట్టిగా పట్టుకుని "మీరు వెళ్లిపోండి." అని చెప్పాడు లింగు.
అంతలో సెల్ ఫోన్ లైట్ ఆన్ చేసి మల్లి ఒక్కతే ఉండడం చూసి "ఆ కళ్ళు లేని అతను పారిపోయాడు." అని గట్టిగా అరిచింది అర్ణ.
ఫీజులు పెట్టి పరిగెత్తుకుంటూ అక్కడికి వస్తు "మేడం! ఎవరో కావాలని కరెంటు తీశారు వీళ్ళిద్దరూ కాకుండా ఇక్కడ ఎవరో అభీర్ మనిషి ఉన్నాడు." అని చెప్పాడు మిసైల్.
అంతలో నళిని పీక మీద కత్తి పెట్టి బయటికి వస్తున్న రాముని ఆశ్చర్యంగా చూస్తూ 'వీడు కూడా వాళ్ళ మనిషేనా? ఇక్కడ ఇంకా ఎంతమంది ఉన్నారు రా..!" అని భయంగా చూస్తూ అనుకున్నాడు ప్రతాప్ మిశ్రా.
మల్లి దగ్గరికి వచ్చి చేతికట్లు విప్పి ఒక కత్తి ఇచ్చి మరొకటి గేటు దగ్గర ఉన్న లింగు వైపు విసిరి "ఆ ఇద్దరు సేఫ్ ఏ కదా!" అని అడిగాడు రాము.
తన రెండు చేతులలో ఉన్న ఇద్దరిని పక్కకి విసిరి గాలిలో వస్తున్న కత్తి సౌండ్ విని పట్టుకుని "ఇద్దరూ సేఫ్!" అని చెప్పి కత్తిని బొంగరంలా తిప్పుతూ
"నాకు కళ్ళు లేవు సేన లొ ఉండి ఏం చేస్తావు అన్నారు కదా! నేను చేయవలసింది నేను చేశాను." అని చెప్పాడు లింగు.
నళిని పీకి మీద ఉన్న కత్తి తీసి "మీరు వెళ్ళండి మేము ఆడవాళ్ళని అడ్డం పెట్టుకుని పారిపోము." అని చెప్పాడు రాము.
ముగ్గురికి వైపు కోపంగా చూస్తూ "వీళ్ళని కాల్చి పారేయండి." అని గట్టిగా అరిచాడు ముకుల్.
ఆ మాట విని కోపంతో తన దగ్గర ఉన్న గన్ తీసి లింగు వైపు షూట్ చేశాడు మహేష్.
మీదికి వస్తున్న బుల్లెట్ కి కత్తి అడ్డంగా పెట్టి "దేవుడు ఒకటి తీసుకుంటే మరొకటి ఇస్తాడు, నాకు నీ ఊపిరి కూడా వినపడుతుంది." అని చెప్పాడు లింగు.
"షూట్ చేయకండి వీళ్ళ ముగ్గురిని ప్రాణాలతో పట్టుకోండి." అని చెప్పింది అర్ణ.
"ఆ ఇద్దరు ఎంతో దూరం పారిపోయి ఉండరు పట్టుకోండి." అని చెప్పింది వాసుకి.
ఆ మాట విని బయటికి వెళ్లడానికి గేటు దగ్గరికి పరుగెత్తుకుంటూ వస్తున్న ఇద్దరి అడుగులు చప్పుడు విని రెండు కాళ్ళు నరికేశాడు లింగు.
"మా లింగు అక్కడ ఉండగా ఎవరు బయటికి వెళ్ళలేరు, మా నాయకుడు అర్ణకి బాధ, వాసుకి భయం చూపించమన్నాడు." అని చెప్పి గాలిలోకి ఎగిరి కత్తి దుస్తు వాసుకి మీదకి దూకింది మల్లి.
తన మీదకి వసున్న కత్తి వెంట్రుక వాసిలో పీక పక్క నుంచి వెళ్లడం చూసి భయంతో గట్టిగా అరిచింది వాసుకి.
"ముగ్గురుని చుట్టుముట్టండి." అని సాధు వైపు చూసి చెప్పాడు మిథున్.
మీదకి వస్తున్న వాళ్ళని చూసి చేతిలో ఉన్న కత్తిని వేగంగా తిప్పుతూ ఇద్దరి చేతులు నరికి "డబ్బు కోసం వికలాంగులు అవ్వకండి." అని చెప్పాడు రాము.
మల్లి చెప్పిన మాట మైండ్లో మెదులుతూ "మనవాళ్ళందరూ లోపలికి వెళ్ళండి." అని చెప్పింది అర్ణ.
"మనకి వీళ్ళు ప్రాణాలతో అవసరమా?" అని గన్ లోడ్ చేసి షూట్ చేయడానికి ఎయిమ్ చేశాడు మహేష్.
నవ్వుతున్న మల్లి వైపు చూసి "మహేష్ అక్కడి నుంచి పారిపో!" అని గట్టిగా అరిచింది అర్ణ.
అంతలో గెస్ట్ హౌస్ బయట కార్ హారన్ సౌండ్ వినపడడంతో "వీళ్ళ ముగ్గురు వెళ్ళిపోతున్నారు షూట్ చేయండి." అని చెప్పింది వాసుకి.
అంతలో బయట నుంచి నాలుగు బాంబుల లోపల పడి మొత్తం పొగ కమ్ముకోవడంతో గన్ ఎత్తిన మహేష్ తల నరికి చేత్తో పట్టుకుని "లింగు పదం వెళదాము." అని చెప్పింది మల్లి.
హారన్ సౌండ్ వింటు తన చెయ్యి పట్టుకున్నా రాము, మల్లి లని వేగంగా అక్కడి నుంచి కార్ దగ్గరకు తీసుకువెళ్లి పోయాడు లింగు.
గెస్ట్ హౌస్ మొత్తం పోగా కమ్మేయడంతో "ఒరేయ్! ఎవరు షూట్ చేయకండి." అని కంగారుగా అరుస్తూ చెప్పాడు మిథున్.
కాసేపటికి పొగ తగ్గడంతో తల లేని మహేష్ ని చూసి ఏమి మాట్లాడకుండా సైలెంట్ గా పక్కన కూర్చుంది అర్ణ.
గన్ తీసుకుని సాధు, మిసైల్ తో కలిసి గెస్ట్ హౌస్ బయటకి పరిగెత్తి అక్కడ ఎవరు లేకపోవడంతో "త్వరగా వెళ్ళండి వాళ్ళు ఎంతో దూరం వెళ్లారు." అని చెప్పాడు మిథున్.
తల లేని మహేష్ బాడీని చూసి కంగారుగా కారు దగ్గరికి వెళ్లి దాస్ వాళ్ళ వైపు చూస్తూ "పదండి త్వరగా వెళ్ళిపోదాము వాళ్ళని తీసుకు వచ్చినందుకు కోపంతో మనల్ని చంపిన చంపేస్తారు." అని కంగారుగా చెప్పాడు ప్రహల్లాద్.
మహేష్ బాడీని చూస్తూ "అయ్యో" నా వారసులని ఏ పరిస్థితిలో అయితే చూడకూడదు అనుకున్నానో అలాగే చూస్తున్నాను." అని ఏడుస్తూ చెప్పాడు ముకుల్.
అక్కడికి వచ్చి ఏడుస్తూ "తాతయ్య! మీరు చేసిన పాపం మమ్మల్ని వెంటాడుతుంది. ఇప్పటికైనా మీ తప్పు తెలుసుకోండి మిగిలిన వాళ్లు అయిన ప్రాణాలతో ఉంటారు." అని చెప్పింది ఆశ.
ఆ మాట విని అక్కడ ఉన్న గన్ తీసి ఆశ తల మీద పెట్టి "చచ్చిపోయింది మా నాన్న, నా అన్న ఆ బాధ ఏమిటో నీకెలా తెలుస్తుంది." అని కసిగా అభీర్ అని అరుస్తూ గాల్లోకి షూట్ చేసింది అర్ణ.

![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)