Thread Rating:
  • 5 Vote(s) - 3.6 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
ఖైదీ నెంబర్ 402 - నా మాటే శాసనం
ఎపిసోడ్ 78


నితీష్ కాల్ చేసి మా జైలర్ గారి సిస్టర్ దగ్గర పనిచేసే మల్లి ఈరోజు సాయంత్రం రైల్వే స్టేషన్ లో అభీర్ సేన మనిషిని కలుస్తుంది అని మిథున్ కి చెప్పాడు.

*********************

ఫోన్లో చెప్పింది విని కాల్ కట్ చేసి వెంటనే ప్రహ్లాద్ కి కాల్ చేశాడు మిథున్.

తన ఆఫీసులో ఉండగా ఫోన్ రింగ్ అవ్వడం చూసి లిఫ్ట్ చేసి "నమస్తే సార్! నాకు ఇంకా ఎటువంటి ఇన్ఫర్మేషన్ రాలేదు రాగానే ఫస్ట్ మీకే చెప్తాను." అని చెప్పాడు ప్రహ్లాద్.

"నాకు ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది. మీ ఇంటికి ఇంటర్వ్యూ కు వచ్చిన జైలర్ గాడి మరదలు దగ్గర మల్లి అని ఒక అమ్మాయి పని చేస్తుంది.

తను ఈరోజు సాయంత్రం రైల్వే స్టేషన్ దగ్గర అభీర్ సేన  మనిషిని కలవబోతోంది నువ్వు ఎలాగైనా ఇద్దరిని తీసుకుని గెస్ట్ హౌస్ దగ్గరికి తీసుకురా..! ఈ దెబ్బతో నీ కోపం కూడా తీరుతుంది." అని చెప్పాడు మిథున్.

ఆ మాట విని "ఒకే సార్! ఇక నేను చూసుకుంటాను." అని సంతోషంగా చెప్పి ఫోన్ పెట్టేసాడు ప్రహల్లాద్.

ఫోన్ మాట్లాడి పెట్టేసిన మిథున్ వైపు చూసి "మనకి ఆ సేనలో ఒక్క మనిషి దొరికిన చాలు వాళ్ల గుట్టు మొత్తం తెలుసుకోవచ్చు!" అని ఆశ గా చెప్పింది వాసుకి.

అక్కడికి వస్తూ "ఈ పని చేయడం ప్రహల్లాద్ వల్ల అవుతుంది అంటావా? లేక మిసైల్ ని పంపుదామా?" అని అడిగింది అర్ణ.

"నో నో! అక్కడ హడావిడి చేయకూడదు సెక్యూరిటీ ఆఫీసర్లు అరెస్టు చేసినట్లు జాగ్రత్తగా వాడే ఇక్కడికి తీసుకు వస్తాడు." అని చెప్పాడు మిథున్.

"నీకు వచ్చిన ఇన్ఫర్మేషన్ కరెక్టే కదా!" అని డౌట్ గా అడిగాడు మహేష్.

"100% కరెక్ట్!" అని చెప్పాడు మిథున్.

టేబుల్ మీద ఉన్న మ్యాప్ ని చూసి "ఏంటి? ఏదైనా నిధి కోసం వెతుకుతున్నారా?" అని అడిగింది అర్ణ.

"అవును! ఇది బేర దగ్గర ఉన్న కొండలకు సంబంధించిన మ్యాప్ చాలా పాతకాలం నాటిది శివమణి ఇంటి దగ్గర దొరికింది. కచ్చితంగా ఈ ప్లేస్ లోనే ఆ తెగ వాళ్ళ పూర్వీకులు దాచిన కొన్ని మహిమగల వస్తువులు ఒక భారీ నిధి ఉన్న ప్లేస్ ఉంది." అని చెప్పింది వాసుకి.

"అసలు! ఆ తెగ వాళ్ళకి ఆ మహిమ గల వస్తువులు, నిధి  ఎక్కడి నుంచి వస్తాయి?" అని అనుమానంగా అడిగింది అర్ణ.

నవ్వుతూ "అందరూ అలా ఆలోచించే అక్కడితో ఆగిపోతారు, కానీ నేను మరో రకంగా ఆలోచించాను అందుకే నాకు కొన్ని ఆశ్చర్యకరమైన విషయాలు తెలిసాయి." అని చెప్పింది వాసుకి.

"ఏంటి? ఆ ఆశ్చర్యకర విషయం!" అని ఆత్రుతగా అడిగారు మిథున్.

"ఈ కొండల దగ్గర ఒక రహస్య గుహ ఉంది దాంట్లో ద్వాపరయుగం నాటి కొన్ని మహిమ గల వస్తువులు శ్రీకృష్ణుడు భద్రపరిచి ఈ తెగను కాపలాగా ఉంచాడు అని చెబుతారు.

అలాగే శివాజీ మహారాజ్ హిందూ ధర్మన్ని కాపాడడం కోసం ఒక భారీ నిధిని కుడా అక్కడే ఉంచారు అని తెలుసుకున్నాను." అని చెప్పింది వాసుకి.

"అంటే! మీ నాన్నగారు మా నాన్నగారు దానికోసమే వెతికారా?" అని అడిగింది అర్ణ.

"ఎస్! ఈ నిధి గురించి మా నాన్నగారు నాకు చాలాసార్లు చెప్పారు దీని కోసమే మొగలలు కూడా ప్రయత్నించారు కానీ సాధ్యపడలేదు అంట!" అని చెప్పింది వాసుకి.

"ఆ విషయం నీకు అంత ఖచ్చితంగా ఎలా తెలుసు?" అని అడిగాడు మిథున్.

తన బ్యాగ్ లో నుంచి ఒక పాత బుక్ బయటకి తీసి  చూపిస్తూ "ఇది ఔరంగజేబు తన స్వహస్తాలతో రాసుకున్న డైరీ, శివాజీ మహారాజ్ పెద్ద కొడుకు అయిన శంభాజీ మహారాజ్ ని బంధించినప్పుడు ఆ నిధి గురించి తెలుసుకోవడానికి ప్రయత్నించారు.

శంభాజీ ని ఎన్ని చిత్రహింసలు పెట్టిన హిందూ ధర్మ పరిరక్షణ కోసం ఆయన ప్రాణాలు అర్పించాడు కానీ నోరు విప్పలేదు. తరువాత కొన్ని సంవత్సరాలకి మొగలుల పరిపాలన అంతమైపోయింది ఆ తరువాత ఆ నిధి గురించి ఎవరు పట్టించుకోలేదు." అని చెప్పింది వాసుకి.

"ఆ నిధి ఎక్కడ ఉందో చంద్రశేఖర్ కనిపెట్టాడంటావా?" అని అడిగింది అర్ణ.

"నాకు తెలిసి చంద్రశేఖర్ కి కొంత తెలుసు అతను నోరు విప్పితే ఆ విషయాలతో నా బుర్రకి పదును పెట్టి నేను కనిపెడతాను, మనకి హెల్ప్ చేయడానికి బెస్ట్ ట్రెజర్ హంటర్ అయ్యినా 'తల్వార్' ఈజిప్ట్ నుంచి రేపు ఇక్కడికి వస్తున్నాడు." అని చెప్పింది వాసుకి.

"ఈ తల్వార్ ఎవరు?" అని డౌట్ గా అడిగింది అర్ణ.

"ఐదు సంవత్సరాలలో ఈజిప్టు భూగర్భంలో ఉన్న 36 రహస్య ప్రదేశాలను కనుగొన్నాడు ఎంత కష్టమైన నిధి మార్గాన్ని అయ్యినా ఓపెన్ చేయగలడు, అంతే కాదు ఎటువంటి మంత్ర, తంత్రాలానైనా ఎదుర్కోగలడు." అని చెప్పింది వాసుకి.

ఆ మాట విని సంతోషంగా చూస్తూ ఉన్నారు అర్ణ వాళ్ళు

************

రూమ్ డోర్ ఓపెన్ అవ్వడంతో  భోజనం పట్టుకొస్తున్న రాముని చూసి "నా కూతురిని చూస్తేనే కానీ పచ్చి మంచినీళ్లు ముట్టుకోను." అని కోపంగా చెప్పాడు చంద్రశేఖర్.

భోజనం అక్కడ పెట్టి "ధైర్యంగా ఉండండి మీ అమ్మాయి క్షేమంగా ఉంది ఇప్పుడే భోజనం ఇచ్చి వస్తున్నాను, అభీర్ సేన నుంచి ఇద్దరు వీరులు ఇక్కడికి వస్తున్నారు మిమ్మల్ని సేఫ్ గా తీసుకువెళ్తారు." అని చెప్పాడు రాము.

ఆ మాట విని ఆశ్చర్యంగా చూస్తు "ఆంటే! నువ్వు.." అని అనుమానంగా చూశాడు చంద్రశేఖర్.

"మీరు ఆలోచిస్తున్నది నిజమే!" అని చెప్పాడు రాము.

"ఇక్కడ పక్షులు రాకుండా మిషన్స్ ఏర్పాటు చేశారు మరి నీకు సమాచారం ఎలా అందింది?" అని డౌట్ గా అడిగాడు చంద్రశేఖర్.

"మిథున్ ఫోన్లో మాట్లాడడం నేను విన్నాను సేనలొ ఉన్న వాళ్ళ గురించి అంత తేలిక బయటికి రాదు, విషయం లీక్ అయింది అంటే ఇక్కడికి రావడానికి కావాలని ప్లాన్ చేశారు అని అర్ధం, భోజనం చేసి వెళ్లడానికి సిద్ధంగా ఉండండి." అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు రాము.

ఆ మాట విని సంతోషంగా చూస్తూ భోజనం చేశాడు చంద్రశేఖర్.

**************

తన ఛాంబర్ లో కూర్చుని బయట ఉన్న ఆఫీసర్స్ వైపు చూసి "వీళ్లని ఎవరిని తీసుకువెళ్లిన అభీర్ మీద భయంతో వెనక్కి వెళ్ళిపోతారు." అని ఆలోచిస్తూ శక్తి దాస్, కుమార్ లు వెళ్లడం చూసి లోపలికి పిలిచాడు ప్రహ్లాద్.

ఛాంబర్ లోకి వచ్చి సెల్యూట్ చేసి "జైహింద్ సర్!" అని చెప్పాడు దాస్.

"ఏమయ్యా! మీరు ఆ సి బి ఐ ఆఫీసర్ తో కలిసి అభీర్ కి హెల్ప్ గా ఉంటున్నారని అభిజిత్ గారు మీ మీద చాలా కోపంగా ఉన్నారు, ఎప్పుడైనా ఏమైనా జరగొచ్చు జాగ్రత్తగా ఉండండి." అని చెప్పాడు ప్రహ్లాద్.

"సార్!+మా డ్యూటీ మేము చేస్తున్నము మేము ఎవరి వైపు లేము ఆ విషయం మీకు కూడా తెలుసు మీరే మమ్మల్ని సేవ్ చేయాలి." అని కంగారుగా చెప్పాడు దాస్.

"సరే! నాతో పాటు వచ్చి ఒక చిన్న పని చేయండి. అప్పుడు అభిజిత్ గారికి మీ మీద ఉన్న కోపం కొంచెం తగ్గుతుంది." అని చెప్పాడు ప్రహ్లాద్.

ఆ మాట విని కాసేపు ఆలోచించి "సరే సార్! మాతో పాటు మీరు కూడా ఉంటారు కదా!" అని అడిగాడు దాస్.

"నేను కూడా ఉంటాను అయ్యా! మీకు ఎటువంటి భయం ఉండదు పదండి." అని కార్ లొ రైల్వే స్టేషన్ దగ్గరికి వెళ్లి వెయిట్ చేస్తూ ఉన్నాడు ప్రహ్లాద్.

కార్ లొ ఫ్రంట్ సీట్లో ఉన్న ప్రహ్లాద్  వైపు చూసి "సార్! బంధువులు ఎవరైనా వస్తున్నారా?" అని అడిగాడు కుమార్.

"అవును! మేడమ్ వంట కార్యక్రమం షూట్ చేయడానికి ఒక రిపోర్టర్ వస్తుంది. పికప్ చేసుకుని ఇంటికి తీసుకువెళ్లాలి." అని పళ్ళు కొరుకుతూ చెప్పాడు ప్రహ్లాద్.

"సార్! మొన్న మేడం గారి ప్రోగ్రాం టీవీలో వచ్చింది. అది చూసి సేమ్ వంటకం మా ఇంట్లో చేశారు అంత బాలేదు ఈసారి మంచిది చేయమనండి." అని నవ్వుతూ చెప్పాడు దాస్.

"సరే సరే!" అని మల్లి వచ్చే స్టేషన్ దగ్గర వెయిట్ చేయడం చూసి "అదిగో రిపోర్టర్ వచ్చింది కెమెరామెన్ కూడా వస్తాడు వెళ్లి ఇద్దర్ని తీసుకొచ్చి కార్లో ఎక్కించండి." అని చెప్పాడు ప్రహ్లాద్.

కారులో నుంచి చూస్తూ "సరే సార్!" అని కార్ దిగి మల్లి దగ్గరికి "మమ్మల్ని పక్కకి తోసి ఇక్కడి నుంచి పారిపో నిన్ను తీసుకు వెళ్ళడానికి ఎస్పీ గారు వచ్చారు." అని టెన్షన్ గా  చూస్తూ చెప్పాడు దాస్.

"ఆ విషయం నాకు తెలుసు! మా ఇద్దరిని తీసుకువెళ్లండి నేను ఏమి మాట్లాడినా మీరు సైలెంట్ గా ఉండండి." అని చెప్పింది మల్లి.

ఆ మాట విని ఆశ్చర్యంగా చూస్తూ "అభీర్ ఏదో పెద్ద ప్లానే వేశాడు సరే పదండి." అని ఇద్దర్నీ తీసుకుని కారు దగ్గరికి వెళ్లి "సార్! వీళ్ళు ఏ వంట ప్రోగ్రామ్ షూట్ చేయడానికి రాలేదంట!" అని చెప్పాడు దాస్.

"నాకు తెలుసు!" అని గన్ తీసి చూపించి "మర్యాదగా లోపల కూర్చోండి." అని కోపంగా చూస్తూ చెప్పాడు ప్రహ్లాద్.

"ఈ విషయం అభీర్ కి తెలిసిందో నీ పని అవుట్!" అని చెప్పింది మల్లి.

"నోరు మూసుకుని కూర్చోండి." అని రెండు బ్లాక్ క్లాత్ లు ఇచ్చి "వాళ్ళ కళ్ళకి కట్టండి." అని చెప్పాడు ప్రహ్లాద్.

"సరే సార్!" అని కంగారుగా చూస్తూ మల్లి కళ్ళకి కట్టి "సార్! ఇతను బ్లైండ్!" అని చెప్పాడు కుమార్.

"అవునా?" అని వెన్నక్కి తిరిగి చూసి "అయ్యితే అవసరం లేదు ఆలా ఉండనివండి." అని చెప్పి డ్రైవర్ వైపు చూసి "నంద గారి గెస్ట్ హౌస్ కి ఫాస్ట్ గా వేళ్ళు ఎవ్వరు ఆపిన ఆపాకు!" అని చెప్పాడు ప్రహ్లాద్.

"ఓకే సార్!" అని ఫాస్ట్ గా వెళ్ళాడు డ్రైవర్.

ఏం జరుగుతుందో అని కంగారుగా చూస్తూ ఉన్నారు దాస్, కుమార్ లు.
[+] 11 users Like SivaSai's post
Like Reply


Messages In This Thread
RE: వేదం - by Manmadhsbanam143 - 22-12-2025, 04:13 PM
RE: ఖైదీ నెంబర్ 402 - నా మాటే శాసనం - by SivaSai - 14-02-2026, 06:43 AM



Users browsing this thread: 1 Guest(s)