Thread Rating:
  • 5 Vote(s) - 3.6 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
ఖైదీ నెంబర్ 402 - నా మాటే శాసనం
ఎపిసోడ్ 77


శివాజీ మహారాజ్ కి వెన్నంటి ఉండవని అమ్మవారి శక్తీ తో వచ్చినవారే అభీర్ సేన వారి వారసులతో మీరు ఢీకొట్టపోతున్నారు ఒక్కసారి బాగా ఆలోచించుకొని అడుగు ముందుకు వేయండి అని చెప్పాడు చంద్రశేఖర్.

****************

చంద్రశేఖర్ చెప్పింది విని కంగారుగా చూస్తూ చెమటలు తుడుచుకుని "పురాణ గాథలు వినడానిని బానే ఉంటాయి, కానీ ఇప్పుడు వాళ్లు లేరు కదా ఒకవేళ అంత శక్తి ఉంటే మా చేతిలో చనిపోయే వారే కాదు." అని చెప్పాడు ముకుల్.

"అవును! తాతగారు చెప్పింది కరెక్ట్! మాకు ఆ ఐదుగురు ఎక్కడ ఉన్నారో తెలియాలి అప్పుడే నీ కూతురు హ్యాపీగా ఇంటికి వెళుతుంది." అని చెప్పింది అర్ణ.

"చంద్రశేఖర్ గారు చెప్పిందంతా నిజమే ఆ అభీర్ సేనకు అంత శక్తి ఉంది. వాళ్ళని ఎలా ఎదుర్కోవాలో మాకు బాగా తెలుసు! ఆ కొండ దగ్గర విలువైన వస్తువులు ఎక్కడ ఉన్నాయో మాకు చెప్పండి మీరు హ్యాపీగా ఉండొచ్చు!" అని చెప్పింది వాసుకి.

"ఆ కొండలు ఒక మహాశక్తి వాటి దగ్గరికి మీరు వెళితే బూడిద అయిపోతారు, అయినా సరే శక్తివంతమైన వస్తువులు అక్కడ ఉన్నాయి అన్నది ఒక ఊహ మాత్రమే అటువంటి ఏమీ లేవు, ఆ విషయం మీద మీ నాన్న రీసెర్చ్ చేసి ప్రాణాలు పోగొట్టుకున్నాడు ఇప్పుడు నువ్వు కుడా అటువంటి తప్పు చేయకు." అని చెప్పాడు చంద్రశేఖర్.

"అది ఊహ కాదు నిజమే! లేకపోతే అభీర్ కి ప్రాణదానం చేసే శక్తి ఎలా వస్తుంది? మురళి జోషి కూతుర్ని బ్రతికించడం నాకు తెలుసు." అని చెప్పింది వాసుకి.

"అవును! అభీర్  కొండ దగ్గర ఒక జంతువుకి ప్రాణం పోయడం నేను కుడా చూశాను, కచ్చితంగా అక్కడ ఏదో ఒక శక్తివంతమైన వస్తువు ఉండే ఉంటుంది గోకుల్ కూడా దానికోసం చాలా ఆశపడ్డాడు." అని చెప్పాడు అభిజిత్.

"అమ్మవారి పాదాల దగ్గర ఉన్న పంచరత్నాలు కత్తితో తీసావు కదా దానివల్ల ఎంత నష్టం జరిగిందో మర్చిపోయావా? మళ్ళీ  ఆ కొండల గురించి ఆలోచిస్తున్నావు." అని చెప్పాడు చంద్రశేఖర్.

"నీ నోటి నుంచి నిజం ఎలా రప్పించాలో నాకు బాగా తెలుసు!" అని మిసైల్ వైపు చూసి "తన కూతురు ఉన్న గదిలో కాకుండా వేరే గదిలో ఉంచండి." అని చెప్పింది అర్ణ.

"సరే మేడం!" అని చంద్రశేఖర్ ని గెస్ట్ హౌస్ లోపలికి తీసుకు వెళ్ళాడు మిస్సైల్.

చంద్రశేఖర్ అక్కడి నుంచి వెళ్ళిన తర్వాత వాసుకి వైపు చూసి "మేము ఆ కొండల దగ్గర ఒక రోజు మొత్తం ఉన్నాము ఆ ప్లేస్ మొత్తం చూసాము అక్కడ పంచరత్నాలు తప్పితే ఇంకా ఏమి కనిపించలేదు, నిజంగా అది ఊహ అనుకుంటా!" అని చెప్పాడు ముకుల్.

"అది ఊహ కాదు నిజమే! దానిని నేను ఎలాగైనా కనిపెట్టి మీకు చూపిస్తాను." అని ఆవేశంగా లోపలికి వెళ్ళింది వాసుకి.

*******************

ప్రెస్ మీట్ కంప్లీట్ చేసుకుని హడావిడిగా ఇంటికి వెళ్లి టీవీ చూస్తున్న భార్య కూతురు వైపు చూసి "ఎవరు వస్తే వాళ్ళకి వంటలు చేసి చూపిస్తావా?" అని కోపంగా అడిగాడు ప్రహ్లాద్.

"ఏమైంది ఇప్పుడు? ఒక్కసారి నా ప్రోగ్రాం టీవీలో వచ్చేటట్లు చేయమని ఎన్నిసార్లు అడిగాను పట్టించుకున్నారా? నా టాలెంట్ తెలిసి ఛానల్ వాళ్లే ఇంటికి వచ్చారు దానికి ఎందుకు అంత అరుస్తావు?" అని కోపంగా అడిగింది భార్య.

"ఇక్కడికి వచ్చిన వాళ్ళు నిన్ను బేబీని వీడియోలొ చూపించి బెదిరించి నాతో ఐదుగురిని చంపించారు ఇప్పుడు చచ్చిన వాళ్ల మనుషులు వచ్చి నా ప్రాణాలు తీస్తారు." అని టెన్షన్ గా చూస్తూ

"పద మనం వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి మళ్లీ  మిమ్మల్ని అడ్డం పెట్టుకొని నన్ను బెదిరిస్తారు." అని కంగారుగా చెప్పాడు ప్రహ్లాద్.

అంతలో ఇంట్లోకి  వస్తూ "నువ్వు చేయవలసింది ఇంకా చాలా ఉంది ఎక్కడికి వెళ్లి పోతావు.?" అని అడిగాడు తంబియార్.

ఆ మాట విని వెనక్కి తిరిగి చూసి "సార్! నన్ను వదిలేయండి ఆ అభీర్ మనుషులు చాలా డేంజరస్ గా ఉన్నారు." అని చెప్పాడు ప్రహ్లాద్.

"అంటే! మేము డేంజరస్ కదా!" అని కళ్ళు పెద్దవి చేసి అడిగాడు తంబియార్.

"సార్! ఇప్పటీ వరకు మీరు చెప్పిన ప్రతి పని చేశాను కానీ మనం వాళ్ళ జోలికి వెళ్లకపోవడమే మంచిది నాకున్న అనుభవంతో చెబుతున్నాను." అని చెప్పాడు ప్రహ్లాద్.

"నువ్వు ఏమి చేయనవసరం లేదు ప్రశాంతంగా నీ ఉద్యోగం చేసుకో, కానీ ఆ అభీర్ మనుషుల గురించి ఏదైనా ఇన్ఫర్మేషన్ వస్తే మాకు ఇవ్వు చాలు!" అని చెప్పాడు ప్రతాప్ మిశ్ర.

"సరే! ఆ అభీజిత్ గారి మనుషులు నా మీదకు రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మీదే!" అని సిసి ఫుటేజ్ లో తన ఇంటికి వచ్చిన నీలమ్ వాళ్ళ ముగ్గురి వీడియో చూపించి "దీనిని మిథున్ గారికి చూపించండి నేను చెప్పింది నిజం అని నమ్ముతారు." అని చెప్పాడు ప్రహల్లాద్.

"సరే!" ఆ విషయం మేము చూసుకుంటాము." అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు తంబియర్ వాళ్ళు.

**************

నంద గెస్ట్ హౌస్ దగ్గరికి వచ్చి "అయ్యా! మీరు చెప్పినట్లు పర్మిషన్ తెప్పించాను ఈరోజు సాయంత్రం జంతువులు మొత్తం అడవి దగ్గరికి బయలుదేరుతున్నాయి ఇంక మీ పని మొదలు పెట్టండి." అని చెప్పాడు వరదరాజులు.

"సరే!" అని నిర్మల్ వైపు చూసి "జావిద్ కొడుకుతో మాట్లాడి అడవిలో మన మనుషులు ఉండేటట్లు చూడండి. వాళ్ళని దాటి అక్కడికి బయటి వ్యక్తి ఎవరు రాకూడదు." అని చెప్పాడు  ముకుల్.

"సరే సార్! ఆల్రెడీ ఫరూక్ తో అన్ని విషయాలు మాట్లాడను అడవిలో విష్ణు కోసం కుడా వెతుకుతున్నారు, నేను ప్రమోద్ ఉదయం రాజస్థాన్ బయలుదేరి వెళతాము ఆ కొండల సంగతేమిటో చూస్తాము." అని చెప్పాడు నిర్మల్.

"అక్కడ అంతా సెట్ అయిన తర్వాత కాల్ చేయండి చంద్రశేఖర్ ని తీసుకుని మేము కూడా వస్తాము." అని చెప్పి రాము వైపు చూసి "ఆ రూమ్స్ లో ఉన్న ఇద్దరికి ఫుడ్ తీసుకువెళ్ళు వాళ్లతో నువ్వేమి మాట్లాడకు." అని చెప్పింది అర్ణ.

"సరే మేడం!" అని చెప్పి లోపలికి వెళ్ళాడు రాము.

మిథున్ కి పెన్ డ్రైవ్ ఇచ్చి "ప్రహ్లాద్ తప్పు ఏమీ లేదు  ఫ్యామిలీ అడ్డం పెట్టుకొని బ్లాక్ మెయిల్ చేశారు." అని చెప్పాడు తంబియార్.

"సరే!" అని పెన్ డ్రైవ్ తీసుకుని లాప్టాప్ పెట్టి నీలమ్ వాళ్ళ ముగ్గురిని చూస్తూ ఉన్నాడు మిథున్.

********************

మరుసటి రోజు ఉదయం అభీర్ దగ్గరికి వచ్చి "నాయకుడా! జూ లో ఉన్న జంతువులు మొత్తం అడవికి చేరుకున్నాయి జావిద్ కొడుకు ఫరూక్ సహాయంతో అడవిలో మొత్తం వాళ్ళ మనుషులు ఉండేటట్లు చేసుకున్నారు." అని చెప్పాడు రాజన్.

"అడవి దగ్గరకి నిర్మల్, ప్రమోద్ బయలుదేరి వెళుతున్నారు." అని చెప్పాడు అరుల్.

"గెస్ట్ హౌస్ దగ్గరికి సర్పరాజ్ కూతురు వాసుకి వచ్చింది అక్కడినుంచి మమ్మల్ని పంపించి పక్షుల్ని కూడా చెదరగొట్టి వాళ్ళతో ఏదో మాట్లాడింది." అని చెప్పింది రియా.

అక్కడికి చాక్లెట్ తో కలిసి వచ్చి "అభీర్! చంద్రశేఖర్ గారిని అయన కూతుర్ని అభిజిత్ మనుషులు కిడ్నాప్ చేసి తీసుకువెళ్లారు వాళ్లతో ఏమి పని ఉందో అర్థం కాలేదు." అని డౌట్ గా చూస్తూ చెప్పింది మిత్ర.

"నేను అనుకున్నది జరుగుతుంది వాళ్లకి సహాయం చేసే వాళ్ళు ఒక్కొక్కరుగా బయటికి వస్తున్నారు." అంటూ బైరి వైపు చూసి

"చంద్రశేఖర్ గారు ఆయన కూతురు వాళ్ళ దగ్గర ఉండకూడదు అక్కడ ఉన్న మన రాముకి సహాయం గా మల్లి, లింగు లని పంపించు ఈరోజు రాత్రికి అర్ణకి బాధ, వాసుకి కి భయం ఎలా ఉంటాయో చూపించాలి." అని చెప్పాడు అభీర్.

"సరే నాయకుడా!" అని చెప్పి మల్లి వైపు చూసి "ప్లాన్ గుర్తు ఉంది కదా!" అని చెప్పాడు బైరి.

"సరే!" అని లింగు తో కలిసి అక్కడి నుంచి బయలుదేరింది మల్లి.

"అరుల్! నువ్వు కూడా నిర్మల్ వాళ్లతో పాటు అడవికి బయలుదేరు." అని చెప్పి ఆగస్త్య వైపు చూసి "నువ్వు ఇచ్చిన ప్లాన్ రఘురామ్ బానే అమలు చేశాడు మన జంతువులు మొత్తం ఆడవి చేరుకున్నాయి  మిగతా ఐడియాలు కూడా ఇవ్వు!"  అని నవ్వుతూ చెప్పాడు అభీర్.

"సరే నాయకుడా! అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయారు అరుల్, ఆగస్త్యలు.

బైరి దగ్గర ఫోన్ తీసుకుని శంకర్ కి కాల్ చేసాడు అభీర్.

తీహార్ జైల్ లొ డ్యూటీలో ఉండగా ఫోన్ రింగ్ అవ్వడం చూసి లిఫ్ట్ చేసి "జై భవాని!" అని చెప్పాడు శంకర్.

"మల్లి, లింగిలు బయలుదేరారు ఏమి చేయాలో తెలుసు కదా!" అని చెప్పాడు అభీర్.

"సరే నాయుకుడా అర్థం అయింది." అని చెప్పి ఫోన్ పెట్టేసి సబ్ జైలార్ నితీష్ దగ్గరికి వెళ్లి "నమస్తే సార్! అభీర్ ఫోన్ చేశాడు మీరు చేసిన తప్పు సరిదిద్దుకునే టైమ్ వచ్చింది." అని చెప్పాడు శంకర్.

"సరే! నువ్వు చెప్పినట్లు చేస్తాను ఇంక నేను సేఫ్ ఏ కదా!" అని అడిగాడు నితీష్.

"అభీర్ మాట ఇస్తే ఎలా ఉంటుందో మీకు కూడా బాగా తెలుసు కదా!" అని చెప్పాడు శంకర్.

"ఎస్ ఎస్!" అని ఫోన్ తీసుకుని బయటికి వెళ్లి మిథున్ కి కాల్ చేశాడు నితీష్.

గెస్ట్ హౌస్ తో మహేష్, వాసుకి లతో మాట్లాడుతూ ఫోన్ రింగ్ అవ్వడం చూసి "ఈ జైలర్ గాడు ఇప్పుడు కాల్ చేస్తున్నాడు ఎందుకు?" అని లిఫ్ట్ చేసి "నితీష్ ఏమైనా డబ్బులు కావాలా?" అని అడిగాడు మిథున్.

"నో సార్! చిన్న ఇన్ఫర్మేషన్ దొరికింది మీకు ఉపయోగపడుతుందని కాల్ చేశాను." అని చెప్పాడు నితీష్.

"మీకు సంబంధించిన డాక్యుమెంటరీ తీసేది మా జైలర్ గారి సిస్టర్ ఆ విషయం మీకు తెలిసే ఉంటుంది. తన దగ్గర పనిచేసే మల్లి అనే ఒక అమ్మాయి ఈరోజు సాయంత్రం రైల్వే స్టేషన్ లో అభీర్ సేనలొ ఒక మనిషిని పికప్ చేసుకోబోతుంది." అని చెప్పాడు నితీష్.

"అవునా? కరెక్ట్ టైం కి మంచి న్యూస్ చెప్పావు?" అని సంతోషంగా చెప్పి ఫోన్ పెట్టేసి ప్రహల్లాద్ కి కాల్ చేసాడు మిథున్.
[+] 8 users Like SivaSai's post
Like Reply


Messages In This Thread
RE: వేదం - by Manmadhsbanam143 - 22-12-2025, 04:13 PM
RE: ఖైదీ నెంబర్ 402 - నా మాటే శాసనం - by SivaSai - 14-02-2026, 06:41 AM



Users browsing this thread: 1 Guest(s)