13-02-2026, 12:48 PM
పిల్లలకి పెళ్ళిళ్ళు చేసేది మన అహాలని నిలబెట్టుకోవడానికి కాదు, వాళ్ళ జీవితాలు అర్థవంతంగా
వుండటానికి. వాళ్లమధ్య అనుబంధాన్ని పెరగనీ. వాసునిబట్టి నువ్వుగానీ నిన్నుబట్టి వాసు కాదు.
తొందరపాటుతో తెగేదాకా లాగకు." అనేసి ప్రసాదరావుకూడా వెళ్ళిపోయాడు.
లోపల స్నేహ, హరితో అంటోంది.
"వదిన పాపం మంచిది కదన్నయ్యా! అమ్మెందుకని యిలా మారిపోయింది? మననేమో చదువు చదువని అంటుంది. వదిన చదువుకుంటుంటే యిలా మాట్లాడుతోంది".
"పెళ్ళయ్యాక చదువులూ, ఎగ్జామ్సు అంటే ఎలా కుదుర్తుందే? చిన్నపిల్లవి నీకు తెలీదివన్నీ.అమ్మ... మనకోసం ఎంత కష్టపడ్తోంది? ఆమెనలాగే కష్టపడమని ఎవరిదారిన వాళ్ళు వెళ్ళిపోతే ఎలా?" అన్నాడు హరి అసహనంగా.
అన్నీ కృత్రిమమైన బంధాలు, బాధ్యతలు. ఎవరిదారిన వాళ్ళు సుఖపడ్డం చాతకాక,
ఒకళ్ళ పరిధిలోకి మరొకరు చొరబడిపోయి అంతా కలగాపులగం చేసుకోవటం. కోడలొచ్చి తనకి
ఆసరా యిస్తుందనే కోణంలోంచీకాక, కన్న ముగ్గురు పిల్లల్నీ లైఫ్ లో సెటిల్ చేసేస్తే తనకి విముక్తి అనే
దిశగా అహల్య ఆలోచించి వుంటే యీ అసంతృప్తి వుండేదికాదు.
...
ఆరోజు సాయంత్రమే వాసు సృజనని పుట్టింట్లో వదిలి వచ్చాడు. రాత్రి ఇంట్లో తల్లితో సరదాగా మాట్లాడలేకపోయాడు. అప్పటిదాకా ఆమెపట్ల అతనికిగల వున్నతాభిప్రాయాలు మూలాలలో
కదిలాయి. అమ్మ పెద్దగా చదువుకోలేదు. నలుగురిలోకి వెళ్ళలేదు. అంతేకాదు, తన పిల్లలకి అన్నీ అనువుగా చేసిపెట్టుకుని, ప్రతిక్షణం వాళ్ళు పైకి పోవాలని ఆకాంక్షించిన ఆమే మరో తల్లి కూతురైన సృజనని తన సంతానంలో కలుపుకోలేకపోతోందని అనిపించింది. ఏమిటి, మగవాడు పెళ్లి ద్వారా
పొందేది? భార్య సంతోషంగా వుంటేనే అతడి నిజమైన ఎదుగుదల. కానీ సృజన ఆకాంక్షలు తల్లికి పట్టవు. ఇద్దరికీ సమన్వయం లేదు. ఏది తన నిజమైన కుటుంబం? తల్లి తండ్రి నిర్మించుకున్న
కుటుంబంలో తనూ, సృజనా భాగమా లేక తామిదరూ వేరే కుటుంబమా అనేది తెలుసుకోవలసిన పరిస్థితి. తల్లిదండ్రుల కుటుంబంలో తాము భాగమైతే తమ కోరికలకీ ఆకాంక్షలకీగల విలువేంటి? క్రాస్ రోడ్స్ లో వున్నట్టనిపించింది వాసుకి..
అన్నయ్య మారిపోయాడనుకున్నాడు హరి తనవరకూ తను. వాసుతో ఫ్రీగా మాట్లాడలేకపోయింది. స్నేహ.
ఆ రాత్రి అహల్యకి సరిగా నిద్రపట్టలేదు. ఎన్నో ఆలోచనలు! తన మాట కాదని వాసు సృజనని పుట్టింట్లో దింపి రావటం తన అధికారపరిధికీ వాళ్ల స్వేచ్ఛకీ హద్దుగీత గీసినట్టనిపించింది... ఇంకా?
సృజన తిరిగొచ్చాక కూడా తన విషయంలో పెద్దగా మార్పేదీ వుండదన్న విషయం లీలగా స్ఫురించింది అహల్యకి. ఈ టెస్టు పాసౌతుంది. ఇంకా కొన్ని టెస్టులు ఎదురుచూస్తుంటాయి.
అవి రాస్తుంది. ప్రమోషన్లు వస్తాయి. కెరీర్... దాన్ని నిరంతరం ముందుకి తీసుకెళ్లాలి. ఈ మధ్యలో ఎప్పుడో తీరిక చేసుకుని ఓ పాపనో బాబునో కంటుంది. ఆ పాపోబాబో పెద్ద కాలేజీకెళ్ళదాకా
తమతో కలిసుంటారేమో! అదేనా తను మంచిగా వుంటేనే, లేకపోతే వేరే వెళ్ళిపోతారు. పిల్లల్ని పెంచడానికి తను కాకపోతే ఆమె తల్లివుంది. అంతేనా, యీ పెళ్ళినుంచి తాను పొందబోయేది? తలుచుకుంటే గుండె చిక్కబట్టినట్టింది. అహల్యం, కళ్ళలోంచి నీళ్ళు
జారిపడ్డాయి.
పక్కమంచం మీద వున్న ప్రసాదరావు గమనించాడు. “వాసు పెళ్ళికి
ముందు నీకెలాంటి కష్టాలు వుండేవి కాదనుకుంటా. నువ్వేడవడం నేనెప్పుడూ చూడలేదు."
అన్నాడు వ్యంగంగా... అహల్య తీవ్రంగా గాయపడింది.
...
సృజన తోడులేకపోవడం వాసుకి వెల్తిగా అనిపిస్తోంది. ఆమె ఎప్పుడు తిరిగొస్తుందా అనే ఆత్రం అతన్ని నిలవనివ్వటం లేదు. అత్తగారింటికి చక్కర్లు కొడున్నాడు. అలావెళ్ళినప్పుడు
ఒకొక్కసారి అక్కడే భోజనం చేసి వస్తున్నాడు. అది అహల్య అసహనాన్ని పెంచుతోంది. పెళ్ళవడంతో
కొడుక్కి కొత్త బంధం ఏర్పడి, కొత్త బాధ్యతలు వచ్చాయని అనిపించటం లేదామెకి. అంతేకాదు, తమ కుటుంబం యొక్క సంస్కారాన్ని వియ్యాలవారింట్లో అందంగా ప్రెజెంట్ చేయబడటం అతనిద్వారా మాత్రమే సాధ్యమని కూడా. మగవాడు సాంప్రదాయిక భర్త స్థాయినుంచి స్మార్ట్ జీవితభాగస్వామిగా ఎదగడాన్ని కూడా ఆమె గుర్తించడం లేదు. అసలా ప్రక్రియ ఒక్కొక్క తరంలోనూ కొద్దికొద్దిగా జరుగుతూ వస్తోంది. ఏ తరం తల్లికి ఆ తరానికి తన కొడుకు మారిపోయినట్టనిపిస్తోంది. తమ భర్తల్లో వచ్చిన మార్పు మాత్రం వాళ్ళు గుర్తించడంలేదు. అహల్య దీనికి మినహాయింపుకాదు...
...
సృజన తల్లితో అత్తవారింటి గురించి చెప్పింది.
"ఇప్పుడే చేసుకోనంటుంటే వినకుండా పెళ్ళిచేసేసారు" అని ,"ఆవిడకేమిటో నా వునికే యిష్టం లేనట్టుంది. నేనేం చేసినా తప్పే కనిపిస్తుంది.నేను చేసే పనులతో సంతృప్తి లేదు. వాసుకి నాగురించి ఏవోచెప్తుంటుందనుకుంటా. ఒక్కొక్కసారి అతను మూడీగా వుంటాడు. ఎందుకమ్మా, అంత యిష్టం లేకుండా పెళ్ళిచెయ్యడం?" అంది
"పెళ్ళవగానే ఆడపిల్ల పరాయిదౌతుందని బాహాటంగా వప్పుకుంటాం. మగవాడి విషయంలో
కూడా అదే నిజమైనా అలా వప్పుకోలేరు. అతనింకా తన కొడుకే, తన చెప్పుచేతల్లోనే వుండాలని
ఆశిస్తారు. క్రమంగా అర్థమౌతుంది. అప్పటిదాకా సంఘర్షణ తప్పదు. నువ్వు కూడా సర్దుకుపోవాలి" అంది సృజన తల్లి.
ఆవిడా అత్తచేతుల్లో ఆరళ్ళుపడ్డదే. ఆవిడ అత్త కొడుకు సమక్షంలో ఒకలా పరోక్షంలో మరొకలా ప్రవర్తించేది.
ఇదంతా యిద్దరు స్నేహితుల మధ్యకి మూడోవ్యక్తి ప్రవేశంలాంటిది. ఆ మూడో వ్యక్తిని ప్రేమించడానికి కొంతకాలం పడుతుంది. ఒక్కొక్కసారి అలా ప్రేమించబడకుండానే జీవితమంతా గడిచిపోవటంకూడా జరుగుతుంది.
వాసు ప్రేమ పట్ల సృజనకెలాంటి సందేహం లేదు. కానీ దానిమీద అత్తగారి ప్రభావంఎంత వుంటుందనేదే ఆమెని భయపెడుతుంటుంది.
...
ఆఖరి పరీక్ష అవగానే తనే వెళ్ళి సృజనని తీసుకొచ్చేసాడు వాసు.
"మంచిది చూసుకుని మేమే తీసుకొచ్చి దింపుతాం" అని సృజన తల్లితండ్రులు చెప్పినావినలేదు. ఇంకొక్క క్షణం కూడా ఆమెని వదిలిపెట్టి వుండలేని స్థితికొచ్చేసాడు.
ఇంటికి రాగానే అహల్య అననే అంది. “ఏమ్మా మీ వాళ్ళకి సాంప్రదాయం, పద్ధతి ఏమీ తెలీవా? లేకపోతే అలాంటి పట్టింపులేం లేవా? మొదటిసారి వెళ్ళావుకదా, పెద్దవాళ్ళువెంటబెట్టుకుని రావాలన్న కనీసపు మర్యాద కూడా లేదా?" అని
"మీ అబ్బాయే వద్దన్నారండీ!” సృజన మామూలుగా అనేసింది.
అహల్య అహం దెబ్బతింది. విసురుగా వెనక్కి తిరిగి లోపలికి వెళ్ళిపోయింది. సృజన మనసు ముడుచుకుపోయింది. వాసు చిన్నబోయాడు.
"వదినా!" అంటూ వుత్సాహంగా రాబోయిన స్నేహ ఆగిపోయింది.
ఈ పరిస్థితంతా చూసాక ప్రసాదరావు ఒక కచ్చితమైన నిర్ణయానికి కొచ్చాడు.
...
"ఇప్పుడు లీవెందుకు పెట్టారు?" ఆశ్చర్యంగా అడిగింది అహల్య కొద్దిరోజులు అందరిళ్ళకీ తిరిగొద్దాం. నువ్వూ అనుకుంటున్నదేగా?“ జవాబిచ్చాడు ప్రసాదరావు. అహల్య మొదట అపనమ్మకంగా చూసినా, అతను ప్రయాణపు ఏర్పాట్లు చూస్తుంటే నమ్మక తప్పులేదు.
"కొద్ది రోజులు మనం బైటికి వెళ్ళొస్తే సృజనకి బాధ్యత తెలుస్తుంది. ఈ యిల్లు తనదికూడాననే ఆలోచన కలుగుతుంది." అనికూడా అన్నాడు ప్రసాదరావు.
ఈ యిల్లు సృజనదా? తనింత కష్టపడి అభివృద్ధి చేసినది? ఇంత అనుబంధం
పెంచుకున్నది? అహల్యకి గుండెల్లో ఎక్కడో వాడిగా గుచ్చుకుంది. ప్రసాదరావు నిట్టూర్చాడు.
కొడుకు పెళ్ళవ్వాలి. కోడలు రావాలి. ఆ కోడలు అతన్ని సుఖపెట్టాలి . అతిల్లే లోకంగా బతకాలి కానీ
ఆమె ఆయింట్లో భాగం కాదు. పరాయిదే. ఎక్కడినుంచో వచ్చినదే. ఎవరింటికో చెందినదే.
అమెదంటూ ఏదీ వుండకూడదు... భార్య ఆలోచనలు యీ స్థాయిని దాటవనిపించిందతనికి.
****
ఒక్కొక్కరింటికీ వెళ్తూ వుంటే ప్రపంచానికి సంబంధించిన కొత్త ద్వారం
తెరుచుకుంటున్నట్టనిపిస్తోంది అహల్యకి. ఇదివరకూ కూడా వాళ్ళతో బంధుత్వాలున్నాయి, రాకపోకలున్నాయి. కానీ యిప్పుడు మొదలైనది కొత్త విశ్లేషణ. అందరిళ్ళలోనూ వాసుకి సమవయస్కులైన పిల్లలున్నారు.
ఒక్కొక్కరిది ఒక్కో సమస్య.
ప్రసాదరావు అన్నకొడుకు సింధీ అమ్మాయిని ప్రేమించాడట. పెళ్ళి చేసుకుంటానన్నాడట.
"అలా ఎలా కుదుర్తుంది? కులం, గోత్రం, సాంప్రదాయం..." అని వీళ్ళంటే-
"నాలాగే బీటెక్ చదివి, నాతోపాటే జాబ్ చేస్తున్న అమ్మాయైతే ఇద్దరం ఒకే చోట చేసే వీలుంటుంది. అంతేగానీ మీరు అన్ని లెక్కలూ వేసి తీసుకొచ్చేదాంతో అలా ఎలా కుదుర్తుంది?
ఐనా పెళ్ళిచేస్కునేది నేను, కాపురం చేసేది నేను. నాకు వీలుగా వుండాలా, మీకా?" అన్నాడట.
"అదికాదురా! ఆంధ్రాలో మాత్రం వీడిపాటి చదువుకున్న అమ్మాయిలు లేరంటావా? వాళ్ళు ముంబైలో వుద్యోగాలు చెయ్యట్లేదంటావా? వీడికా సింధీపిల్ల వచ్చింది... అంతే"
తమ్ముడితో చెప్పుకుని బాధపడ్డాడు ప్రసాదరావు అన్న.
"కులాలు మతాలు అర్థాలు మారిపోయాయేమోలే అన్నయ్యా! కొత్త నిర్వచనాలు చెప్పుకోవలసి వస్తోంది. డాక్టరు చదివిన కుర్రాడు డాక్టర్నే చేసుకోవాలనుకుంటున్నాడు. ఇంజనీరు మళ్ళీ యింజనీరునే. కంపాటిబులిటీ కోసమేమో!" అన్నాడు ప్రసాదరావు సర్దిచెప్పు.
"ఈయనెప్పుడూ పిల్లల పక్షమే" అంది అహల్య. ప్రసాదరావు నవ్వాడు.
అక్కడినుంచీ అహల్య అక్కగారింటికి వెళ్లారు.ఆవిడ కూతురూ, అల్లుడూ అమెరికా వెళ్తున్నారట. ఆ సంతోషం అక్కలో కనిపించలేదు అహల్యకి.
“నాకూతురని చెప్పుకోవడానికే సిగ్గుగా వుందే అహల్య! మావారి మేనత్త కొడుక్కేగా దాన్నిచ్చినది? బైటి సంబంధం కూడా కాదు. ఆవిడకేమో మడి, ఆచారం. దీనికి ఆవిడ వునికే
గిట్టదు. ఇప్పుడా పెద్దావిడ్ని వదిలేసి అమెరికా వెళ్తున్నారు. పాపం! ఆవిడెంత బాధపడ్తోందో!" అంది.
ఆమె కూతుర్ని కదిలిస్తే-
“ఇప్పుడు మా అత్తగారికేం తక్కువ చేసామని పిన్నీ? ఓపిగ్గా వుంది. మడి కట్టుకుని వండటం నావల్లకాదు. నాకు నచ్చని, నాకు నమ్మకం లేని ప్రిన్సిపుల్స్ నేను పాటించలేను. ఆవిడ వంట ఆవిడ
చేసుకుంటారు. ఆవిడ సిద్ధాంతాలని ఆవిడ నిలబెట్టుకుంటున్నారు... ఇంక అమెరికా అంటావా, వెళ్ళక యిక్కడే వుండి మేం చేసేదేముంది? ఆవిడ్నీ తీసికెళ్తామన్నాం రానంది. అమ్మానాన్నలు ఆవిడ్ని తమ దగ్గరికి పిలిపించుకోవచ్చు. వాళ్ళు పిలవరు. ఎందుకంటే యిది వాళ్ళకి అక్కర్లేని
బాదరబందీ. ఒకవేళ వాళ్ళు పిల్చినా ఆవిడ వెళ్ళదు. మగపిల్లాడి తల్లినని ఇగో. మేం మాత్రం అవసరంలేని త్యాగాలు చెయ్యాలి..." అంది.
ప్రసాదరావు పొయెటిక్ జస్టిస్ అన్నాడు. పిల్లలు త్యాగాలు చెయ్యాలని తాము
కోరుకుంటున్నారా అనేది అహల్యకి అర్ధమవలేదు.
అహల్య అన్న యింట్లో మరోరకం సమస్య. కొడుకూ కోడలూ దెబ్బలాడి వేరుపడ్డారట.
అన్నగారు దాన్ని తాత్వికంగానే తీసుకున్నా, "ఎదిగిన పిల్లలు ఎంతకాలం మనని అంటి పెట్టుకుని
వుంటారు? వాళ్ళకీ మనకీ యింటరాక్షన్స్ ఆగిపోయాక కూడా కలిసెలా వుంటారు? ఎక్కడ
యింటరాక్షన్స్ వుంటాయో సహజంగానే అటువైపు ఆకరించబడతారు" అని ఫిలాసఫి మాట్లాడినా,
అహల్య వదినమాత్రం తన బాధని దాచుకోలేకపోయింది.
"ఎంత అపురూపంగా పెంచానే
అహల్యా వాడిని? అలాంటిది నామాట విషమైంది. భార్య బెల్లమైంది." అంది.
"బావుందే, నువ్వు చెప్పేది. రేపెప్పుడో కోడలొచ్చి వేరు చేస్తుంది, దానికోసం నా కొడుకుని నేనెందుకు అపురూపంగా పెంచాలనుకుంటారా ఏమిటి, ఎవరేనా?" అని అన్నగారంటే అహల్యకి
నవ్వొచ్చింది. కానీ వదిన బాధపడ్తుందని ఆపుకుంది.
"రోలొచ్చి మద్దెలతో మొరపెట్టున్నటుందిలే బావా! మాయింట్లోనూ ఓ కోడలుంది.
వాసుమీది పెత్తనం వదులుకోవడానికి యీవిడ సిద్ధంగా లేదు. విసుర్లు, కసుర్లు... " ప్రసాదరావు
నోరిప్పాడు.
నిజమా అన్నట్టు చూసారు అహల్య అన్నావదినలు. అహల్య చిన్నపిల్లే అయింది. కళ్ళలో నీళ్ళు నిలిచాయి. "నేను చేస్తున్నది తప్పని నాకే తెలుస్తోందన్నయ్యా. కానీ వాడిమీది ప్రేమ.... వాడు నాకు దూరమౌతాడేమోనన్న బెంగ... నన్ను వుక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. పైగా యీయనకూడా ఆ పిల్లవైపే మాట్లాడతారు. నన్నర్థంచేసుకోరు." అంది.
విషయం కొంత సీరియసేనని అర్థమైంది అహల్య వదినకి. “సరే! ఈవిషయాలన్నీ
తీరిగ్గా మాట్లాడుకుందాం. ముందు స్నానాలు చేసి, భోజనాలకి లేవండి" అంది మాటమార్చి.
వీళ్ళు వచ్చినట్లు కొడుక్కి ఫోన్ చేసింది అహల్య వదిన. అతను భార్యనీ కొడుకుని తీసుకుని మేనత్తమామల్ని చూడటానికొచ్చాడు. అతని ప్రవర్తనలో ఎలాంటి లోపమూ కనబడలేదు అహల్యకి. సాయంత్రందాకా వుండి వెళ్ళిపోయారు.
ఆ రాత్రి వదినా మరదళ్ళు చాలా సేపు మాట్లాడుకున్నారు.
"ప్రఫుల్ పెళ్ళైన కొత్తలో నేనెంత సిల్లీగా ప్రవర్తించానో తలుచుకుంటే నాకే సిగ్గనిపిస్తుంది అహల్యా! పెళ్ళితో వాడికొక వ్యక్తిగత జీవితం ఏర్పడింది. అందులోకి నాకు ప్రవేశం లేదు. వాడు నాకు దూరమయాడనిపించి, అసూయతో రగిలిపోయేదాన్ని. కోడలి మీద అకారణ ద్వేషం చూపించేదాన్ని...."అహల్య వదినగారి అనుభవాన్ని నిశ్శబ్దంగా వింది.
“వాళ్ళిద్దరి విషయాల్లో అనవసర జోక్యం చేసుకునేదాన్ని. ఇంతలో మీనా ప్రెగ్నెంటవడం, బాబు పుట్టడం జరిగింది. వాడు... నామనవడు నా కొడుకురక్తం... నా భర్త రక్తం... ఇలా అనుకుంటుంటే నామనసు వుప్పొంగిపోయేది. వాడిని ఒక్కక్షణం కూడా వదిలి పెట్టి
వుండలేకపోయేదాన్ని. వాడి పనులన్నీ నేనే చేసేదాన్ని. మీనా వాడిని సరిగా ఎత్తుకోలేదేమో! పెంచట్లేదేమో! ఇలాంటి ఆలోచనలొచ్చేవి. రాత్రివేళవాడు కాస్త కంయిమంటే చాలు, వెంటనే
లేవలేదని మీనామీద కోపం వచ్చేది. పొద్దున్న లేవగానే అంత మొద్దు నిద్రేమిటని కోప్పడేదాన్ని.
అహల్యా! అది చాలా మంచి పిల్లగాబట్టి ఎంతో ఓర్చుకుంది"
"..."
"భార్యని అపురూపంగా చూసుకుని ఆమెని గౌరవించి, ఆమె అభిప్రాయాలని
మన్నించేవాడిని ఎంతో వున్నతంగా భావిస్తాం. మన భరలు అలా వుండాలని ఆశిస్తాం. కానీ కొడుకలా వుంటే వోర్వలేం. కొడుకు ఎప్పటికీ కొడుకుగానే వుండిపోవాలని మన కోరిక. అతను
ప్రేమికుడిగా, చక్కటి భర్తగా, తండ్రిగా ఎదుగుతూ వుంటే సహించలేం...ఏదో ద్రోహం జరిగిపోయినట్టు బాధపడతాం. అహల్యా! ఆఖరికి ఒక్కరోజు మీనా బయటపడింది . ప్రఫుల్ ని నిలదీసి
అడిగింది-
మనకంటూ పర్సనల్ లైఫ్ లేదా? ప్రతి విషయంలోనూ ఆవిడెందుకు తలదూర్చడం?తొమ్మిదినెలలు మోసి కన్నదాన్ని, నాకొడుకుని నేను పెంచుకోలేనా? - అని.
ప్రఫుల్ కి కూడా నా పద్ధతి నచ్చనట్టే వుంది. మొదట్లో సున్నితంగా చెప్పేవాడు. తర్వాత
పెద్ద దెబ్బలాటే అయింది. వాళ్ళని వేరే వెళ్ళిపొమ్మన్నారు. మీ అన్నయ్య."
“అదేంటొదినా! మనవలు మనకి మాత్రం ముద్దుకాదా? వాళ్ళని దగ్గరికి తియ్యడం తప్పా?" చప్పున అడిగింది అహల్య.
"నేనిదే ప్రశ్న మీ అన్నయ్యని అడిగాను. ఆయన తప్పనే అన్నారు. తల్లితండ్రుల తర్వాతే ఎవరేనానట. భార్యాభర్తల మధ్య, తల్లితండ్రులకీ పిల్లలకీ మధ్య అనుబంధాలు పెరిగితేనే స్వచ్ఛమైన
కుటుంబబంధాలు ఏర్పడతాయట. ఆలోచించగా నాకూ అదే నిజమనిపించింది. పుట్టిన పిల్లవాడు
పుట్టినట్టే తల్లివడిలో వుండిపోడు. పారాడుతూ దూరం జరుగుతాడు. అదే ఎదుగుదల. మనకి వాళ్ళే ప్రపంచం కావచ్చునుగానీ వాళ్ళ ప్రపంచంలోమాత్రం మనం ఒక భాగమే. మనం ఏ ప్రేమనైతే వాళ్ళమీద చూపించామో, దాన్ని నేర్చుకుని వాళ్ళు వాళ్ళ పిల్లలమీద ప్రకటిస్తారు."
“మరి మనం?"
“నాకు మీ అన్నయ్యా, నీకు ప్రసాదూ లేరా?"
"అంటే పిల్లలకి పెళ్ళిళ్ళు చేస్తే మనకి మిగిలేది యిదేనా?”
"ఏమీ మిగలకపోవటమేమిటి? నువ్వు పెళ్ళి చేసుకున్నావు. వాసు పుట్టాడు. మిగిలిన యిద్దరూ పుట్టారు. వాసు పెళ్ళైంది. వాళ్ళకీ పుడతారు. మనం పెర్పెచ్యువేట్ కావటం లేదూ?
అదంతా మిగులేగదమ్మా?"
అహల్య నిశ్శబ్దంగా ఏడ్చింది. చాలాసేపు ఏడ్చింది. ఏదో బాధ... ఏదో ఆవేదన....
ఇంకేదో ఆర్తి... అన్నీ బహిర్గతమయ్యాయి. ఆ తర్వాత మనసు వెల్తిపడింది.
“ఎందుకు ఏడుస్తావు, అహల్యా! మగవాళ్ళలా అంటీముట్టనట్టు వుండేలా మనని పెంచరు.
అనుబంధాలూ, ప్రేమా అంటూ రంగరించిపోస్తారు. సృష్టికి మనమే ఆధారమని అభూతకల్పనలు
చేస్తారు. అవన్నీ నిజమేనని నమ్మి ఆరాటపడతాం. కానీ జీవితంలో ఒక్కొక్క మెట్టూ దాటుతుంటే
అర్థమౌతుంది, మనదంటూ ఏదీ లేదని. పెళ్ళిచేసుకోవటం, పిల్లల్ని కనటం, వాళ్ళని చక్కగా పెంచటం-అక్కడితో మన బాధ్యత తీరుతుంది. ఆ తర్వాత?” అని ఆగింది అహల్య వదిన.
“ఆ తర్వాత?” అప్రమేయంగా అడిగింది అహల్య.
“మనం దాటిన స్టేజిలన్నీ మన పిల్లలు దాటుతారు. అది మనం చూస్తాం. అందులో మనం ఒరిపిడి పడక్కర్లేదు. ఎవరి జీవితం వాళ్ళదనుకుంటే సరి... ఏ అత్తా తన కోడలు మంచిదని ఏ కోడలూ అత్త మంచితనాన్ని వప్పుకోదు.ఇది కొత్తగా వచ్చినది కాదు. ఉమ్మడి కుటుంబాలలోనూ వుండేది. దీన్ని సాంప్రదాయక వైరం అంటారు. కానీ నువ్వే ఆలోచించు. తను పెరిగిన వాతావరణాన్ని, తనవాళ్ళని, అక్కడ తనకుండే స్వేచ్ఛాస్వతంత్రాలని వదులుకుని జీవన శైలిని సైతం మార్చుకోవడానికి వచ్చిన పిల్లకి మనం ఏపాటి సహకరిస్తున్నామో! కావాలంటే ఆమెమీద ఆంక్షలు పెడతాం. సాంప్రదాయాన్ని రుద్దుతాం. కానీ ఆంక్షలూ, సాంప్రదాయాలూ ప్రేమని పుట్టించవు. కుటుంబాలను
నిలబెట్టవు. మనుషులని కలిపి వుంచవు" అంది.
అహల్య ఆలోచనలో పడింది.
అవతలి గదిలో ప్రసాదరావు బావమరిదితో అంటున్నాడు "మాకోడలు... సృజన చాలా-
తెలివైన పిల్ల. నాకా అమ్మాయిని చూసే చాలా ముచ్చటగా అనిపిస్తుంది బావా! మంచికల్చరున్న కుటుంబంలోంచి వచ్చింది. వాసుకి చక్కటిజోడీ. కానీ అహల్య ప్రవర్తనే సరిగా లేదు. వాసు
పెళ్ళయేదాకా తనేగా, యింట్లో అన్ని పనులూ చేసుకునేది? ఇందరికోసం వంట సునాయాసంగా చేసేది. మేం సాయం చేయబోయినా చెయ్యనిచ్చేది కాదు... అలాంటిది... ఇప్పుడా అమ్మాయితో వంతుపోతోంది... సూటిపోటి మాటలంటోంది. అసహనంతో రగిలిపోతోంది. తను వాసునించి ఏం ఆశిస్తోందో తెలీదు. వాడు పెళ్ళికి ముందులాగే తన చుట్టూ తిరగాలనుకుంటోందా? సృజనని
పట్టించుకోవద్దనుకుంటోందా? ఇంట్లో యిదివరకులేని అశాంతి యిప్పుడు చోటుచేసుకుంది."
ఆయన సుదీర్ఘంగా నిశ్వసించాడు. "ఒక కొత్త వ్యక్తి యింట్లోకి ప్రవేశించగానే కలతలు మొదలు. వాటిని కలతలని అనడంకన్నా సర్దుబాటు సమస్యలనో యిగోప్రాబ్లమ్సనో అనటం
సబబేమో ప్రసాద్! ఆడవాళ్ళకోసం వంటింటిని సృష్టించి, దానికి వాళ్లని పట్టాభిషిక్తులని చేసినది ఒకప్పుడు
మనమే. ఇప్పుడు వాళ్ళని డ్రాయింగ్ రూమ్ దాకా తీసుకురావాల్సిన బాధ్యత కూడా మనదే... కోడలు పరాయిదనే కోణంలోంచీ ఆలోచిస్తే సమస్య కొంచెం జటిలంగా అనిపిస్తుంది. మన పిల్లల్లాంటిదే అనుకుంటే, మన పిల్లలనుంచీ ఎదురయ్యే సమస్యలే ఆమెనించి కూడా ఎదురౌతున్నాయని
అర్థమౌతుంది. మే పెద్దవాళ్ళమయాం. ఇంకా ఎంతకాలం మీమాట వినాలి? - అని పిల్లలు ప్రశ్నిస్తే అది వాళ్ళ వ్యక్తిత్వవికాసంలో భాగమనుకుంటాం. కోడలుమాత్రం అలాంటిదికాదా? మరో |
విషయం... ఎదిగిన పిల్లల్ని స్నేహితుల్లా చూడమంటారు. కొడుకు స్నేహితుడైనప్పుడు కోడలు
స్నేహితుడి భార్యౌతుంది. స్నేహితుడి భార్యపట్ల ఎలాంటి డీసెన్సీ చూపిస్తామో ఆమె పట్ల కూడా చూపిస్తే యీ గొడవలు తలెత్తవు. కానీ అదే చెయ్యలేకపోతున్నాం" అన్నాడు.
"..."
"వెనుకట ఆర్థికంగా వెసులుబాటు లేక , వ్యవసాయం, వ్యాపారం, పెద్దకుటుంబాలలో సహకారం కోసం అలాంటి కొన్ని ప్రత్యేక అవసరాలకోసం కలిసి వున్నారు. ఇప్పుడు అలాంటివేం లేవు.ఐనా కూడా మనుషులు కలిసి వుండాలంటే ప్రేమ ఒక్కటే వాళ్లని కలిపి వుంచేది. అది ఒక్కరోజులోనో, ఒక సాంప్రదాయంతోనో పుట్టేది కాదు"
ఆ తర్వాత వాళ్ళా విషయాన్నొదిలేసి టీవీ వార్తల్లో లీనమయ్యారు. అదయ్యాక రాజకీయాగురించిన చర్చలో పడ్డారు. చాలాసేపు మాట్లాడుకున్నాక ప్రసాదరావుకి సందేహం కలిగింది - ఇద్దరు ఆడవాళ్ళు వంటరిగా కూర్చున్నప్పుడు ఏం మాట్లాడుకుంటారాని. వెంటనే
జవాబు కూడా దొరికింది - భర్తలమీదో, అత్తలమీదో, కోడళ్ళమీదో చెప్పుకుంటారని. ఎందుకంటే వాళ్ల అసంతృప్తి అక్కడే మొదలౌతుంది.
మరుసటి రోజు ప్రఫుల్ వచ్చాడు, అహల్యని తనింటికి తీసుకెళ్ళడానికి. “మీనానీ బాబునీ యిక్కడ చూసానుకదరా, మరోసారి వస్తాను” అంది అహల్య మామూలుగా. అతను
చిన్నబుచ్చుకునేసరికి బయల్దేరింది. దార్లో అన్నాడతను. "అమ్మావాళ్ళనుంచీ వేరే వచ్చేసానని
కోపంగా వుండచ్చు అత్తా! కానీ ఒక్క విషయం చెప్పు. నాకు పెళ్ళిచేసారు,
ఆమెని ప్రేమగా చూసుకొమ్మన్నారు. అదే నేను చేస్తుంటే అమ్మకి కోపం. నాకు యిద్దరూ ఒకటే . తల్లిదండ్రులు తమ ప్రేమనంతా మొదటిబిడ్డమీద కేంద్రీకరిస్తారు. రెండోబిడ్డ పుట్టగానే యిద్దరి మధ్యా పంచుతారు. మరోవ్యక్తి నా జీవితంలోకి వచ్చాక కూడా నేను వెనకటిలా వుండటం ఎలా సాధ్యం.
మీనాని ప్రేమించడానికీ అమ్మని గౌరవించడానికీ ఏమిటి సంబంధం? రెండూ వేర్వేరు విషయాలు కావా?”
అతను వ్యక్త పరిచిన భావాలకి అహల్య నివ్వెరబోయింది. నిన్న మొన్న పెళ్ళైన ప్రపుల్ లో ఎంత మెచ్యూరిటీ?!
అతనే మళ్ళీ అన్నాడు. “మావైపునించీ కూడా ఆలోచించండి. మా సంపాదన ఎక్కువే. మాకుండే కంఫర్డ్స్ కూడా. ఎక్కువే. అలాగే వత్తిళ్ళు. నాన్నా, మామయ్యా వాళ్ళలాగా ఏ యిరవయ్యేళ్ళకో వుద్యోగంలో చేరితే అరవయ్యేళ్ళదాకా నిశ్చింతగా చెయ్యగలిగేవి కావు. ప్రతిక్షణం మా వుద్యోగాన్ని నిలబెట్టుకునే ప్రయత్నం చేయ్యాలి. బాస్ ని యింప్రెస్ చెయ్యాలి. కాలంతో పరిగెడ్తూ మా స్కిల్స్
పెంచుకోవాలి. నువ్వుత్త వెధవ్వి అని ఎవరేనా మొహం మీదే అన్నా నేనెలా వెధవని కాదో నవ్వుతూ వివరించగలగాలి. అదంతా ఒక కృత్రిమమైన లైఫ్ . ఇంటికొచ్చాక ప్రశాంతంగా వుందామనుకుంటే
అమ్మకీ మీనాకీ పడదు. ఎప్పుడూ ఏదో ఒక గొడవ. ఆ గొడవల్ని తప్పించడానికి వేరే వచ్చాను. నాకు యిద్దరినుంచీ కూడా సంతోషమేకావాలి” అన్నాడు.
మాటల్లోనే యిల్లు చేరారు. ఇల్లు పొందిగ్గా, కళాత్మకంగా వుంది. ఆ యింట్లో ప్రఫుల్ తనెలా వుండాలనుకుంటున్నాడో
అలా వుంటాడు. అతనొక ఎదిగిన వ్యక్తిలా అనిపించాడు తప్పించి మేనల్లుడిలా అనిపించలేదు.
అంటే ఆత్మీయత లేదని కాదు. అదతని కొడుకుని చూడగానే పొంగివచ్చింది. వాడిని ఎత్తుకుని
ముద్దు పెట్టుకుంది.
...
వదిన జీవితంలో వచ్చిన మార్పుని గమనించింది అహల్య. ఇదివరకట్లా చాదస్తంగా పనితో కాలాన్ని గడపడంలేదు. పూజలు కూడా తగ్గాయి. టీవీ చూస్తోంది. పుస్తకాలు చదువుతోంది. మ్యూజిక్ క్లాసులకి కూడా వెళోందట. మార్నింగ్ వాక్, యీవెనింగ్ వాక్ చేస్తోంది. ఎలాంటి జీవితం గడపాలని పెళ్ళైన కొత్తలో ఏ ఆడపిల్లేనా అనుకుంటుందో అలాంటిది గడుపుతోంది. కానీ అందులో వెల్తి వుంది. కారణం - యిప్పుడు అది ఆమె మీద బలవంతంగా రుద్దబడింది.
అహల్యకి తన గమ్యం ఏమిటో స్పష్టమైంది. అది రెండు విధాలు. తను సృజనని మరో కూతురిలా ప్రేమించగలగాలి. అప్పుడు కూడా వాళ్ళు తమ మధ్య యిమడలేకపోతే స్వేచ్ఛనివ్వాలి. వదినలా బాధపడుతూకాదు, నవ్వుతూ.

ఇతర ధారావాహికాలు
శక్తి ఆగమనం
(https://xossipy.com/thread-71346.html)
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు
మా తెలుగు తల్లికి మల్లె పూదండ

![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)