13-02-2026, 12:41 PM
(This post was last modified: 13-02-2026, 12:47 PM by k3vv3. Edited 5 times in total. Edited 5 times in total.)
కోడలొచ్చింది
![[Image: K.jpg]](https://i.ibb.co/tMB2znfG/K.jpg)
శ్రీదేవి సోమంచి
"ఇంకేంటి అహల్యా! వాసు పెళ్ళి కుదిరిపోయింది. కోడలొస్తుంది. అంతా తీరికే" ఫ్రెండ్సు అన్నమాటలు పదేపదే గుర్తొచ్చాయి అహల్యకి. పెదాలమీద చిన్ననవ్వు విరిసింది.
నిజమే. కోడలొస్తే యింటి బాధ్యతలనుంచి తనకి కొంతేనా విముక్తి. ముందు వారంరోజులు పల్లెటూళ్ళో వుండే తన తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి రావాలి. ఆ తర్వాత వరసపెట్టి అక్కచెల్లెళ్ళందరి ఇళ్ళకీ వెళ్ళి తలో రెండురోజులూ వుండాలి. ఢిల్లీలో వుండే అన్నగారు, ముంబాయిలో
వుండే తమ్ముడూ ఎప్పుడూ అంటూవుంటారు- "ఒక్క వారం రోజులేనా వుండేలా రావే. ఊరంతా
చూద్దువుగాని అని.
వాళ్ళు రమ్మనీ అంటారు. ఇక్కడ భర్త, పిల్లలు వెళ్ళమనీ చెప్తారు. కానీ తనే వెళ్ళలేదు.వెళ్ళినా ఒక్కరోజుమించి వుండలేదు. ఏవో అజ్ఞాతబంధాలు తనని వుండనివ్వవు.
ఇక్కడ యిబ్బందిపడుతున్నారేమో. వేళకి వండుకున్నారో, తినారో లేదో! ఎన్నో సందేహాలు. అంతా కలిసి
వెళ్దామనుకుంటే భర్త చేసేది పోస్టాఫీసులో. ఎప్పుడూ లీవు దొరకదు. మరోవైపు పిల్లల చదువులు.
వాసు భార్య వస్తే యింటి బాధ్యత ఆమెకి వదిలిపెట్టి తను నిశ్చింతగా వెళ్ళిరావచ్చు....ప్రపంచం చాలా అందంగా కనిపించింది ఆమెకి.
"స్నేహా! ఫ్రిజిలోంచి పచ్చిమిరపకాయలు, కరివేపాకు తెచ్చివ్వవే." అంది కూతురితో,
ఆపిల్ల ఓ చేతో నోట్ బుక్, మరోచేత్తో తల్లి అడిగినవీ తీసుకుని వచ్చి, వాటిని ఆవిడకిస్తూ -
"ఇంకెంతమ్మా, వదినొస్తే నేనింక వంటింట్లోకి అడుగే పెట్టను" అంది.
తల్లి చెప్పే చిన్నచిన్న పనులు, కోరే సహాయాలూ స్నేహకి నవ్వు తెప్పిస్తాయి. తను సీరియస్ గా చదువుకుంటున్నప్పుడైతే
కోపం కూడా వస్తుంది. ఇంటిపనంతా నిలబడి అవలీలగా చెయ్యగలిగే తల్లి ఇలాంటి పుమాయింపులు చెయ్యటం వింతగానూ అనిపిస్తుంది. ఒక్కర్తే వుండటంచేత వంటింట్లో బోరు కొడ్తుందేమో, వదినొస్తే మంచి కంపెనీ! అనుకుంది.
"ఆ<! వదిన కోసమే నేనూ చూస్తున్నానులేవే! నాగదిలో పుస్తకాలన్నీ చిందరవందరగా
వుంటాయని నాన్నగారు కోప్పడుతుంటారా, అమ్మేమో తనకి తోచినట్టూ సర్దేస్తుందా, తర్వాత
నాక్కావల్సినవి దొరక్క పడే తిప్పలు మీకేం తెలుసు? వదిన పోస్ట్ గ్రాడ్యుయేట్. నారూమ్
ఛార్జి తనకిచ్చేస్తాను" అన్నాడు హరి అప్పుడే అక్కడికొస్తూ.
అందరిమాటలూ వింటుంటే నవ్వొచ్చింది ప్రసాదరావుకి . అలాగే నవ్వొచ్చి పెదాలనీ, మనసునీ పలకరించిన మరో వ్యక్తి వాసు... కోబోయే పెళ్ళికొడుకు.
కోడలొస్తుంది, కొడుకు జీవితంలోకి
వసంతంలా... అనుకోవడం లేదెవరూ. ఎవరి బాధ్యతల్ని వాళ్ళు చిలక్కొయ్యకి తగిలించినట్టు ఆమె భుజానికి తగిలించి వూపిరి పీల్చుకుందామనుకుంటున్నారు.
వాసుకి సెటిలైన అమ్మాయి సృజన. చామనఛాయలో మృదుత్వం, దృఢత్వం సమపాళ్ళలో
కలిసినట్టుంటుంది. చదువుకుంది. ఉద్యోగం చేస్తోంది. పెళ్ళిచూపులప్పుడు వాసుతో స్పష్టంగా తన యాంబిషన్స్ చెప్పింది. వాళ్ళది యిదే వూరు. ట్రాన్సర్ల బెడదలేదు. చాలా యిష్టపడి వప్పుకున్నారు ఇద్దరూ !
అహల్యా ప్రసాదరావూ కొంచెం చర్చించుకున్నారు. జాబ్ చేస్తున్న అమ్మాయిగాబట్టి, గృహిణిగానే వుండిపోయిన అహల్యతో కలవగలదా లేదా అనేది ఆయన ప్రశ్న. ఆ ప్రశ్నని
భార్యవైపు నుంచి కూడా వేసుకున్నాడు. తేలిగ్గా కొట్టిపారేసింది అహల్య, భర్త సంశయాలని.
"ఈ రోజుల్లో ఎందరు వుద్యోగాలు చెయ్యటంలేదు? అలాగే నా కోడలూను. మనకేమంత ఆస్తులున్నాయి? పిల్లలకి ఎంత మిగిల్చివ్వగలం? ఇద్దరూ ఉద్యోగస్తులైతే ఆసరాగానూ వుంటారు, మననుంచీ ఆశించరు " అంది.
ఆఖరికి అంతా కలిసి ఓకే చేశారు.
...
ఎంతో ఎదురుచూసిన పెళ్ళి... వాసు పెళ్ళి అవనే అయింది. కొత్తకోడలింకా
పాతబడనేలేదు- ఆఫీసుకి తయారైంది.
"అదేంటమ్మా! పదహార్రోజుల పండుగయేదాకానేనా వుండవా?" తెలతెలబోతూ అడిగింది అహల్య.
"ప్రొబేషన్లో వున్నానుకదండీ! లీవు పీరియడ్ కి ప్రొబేషన్ పొడిగిస్తారు. అందుకే ఎక్కువ లీవు పెట్టలేదు" అంది.
అహల్య యింకేదో అనబోతుంటే ప్రసాదరావు కలగజేసుకున్నాడు. "వెళ్ళి జాయినవనీ, అహల్యా!ప్రొబేషనరీ పీరియడ్లో లీవులు పెట్టడం అంత మంచిది కాదు" అన్నాడు.
సృజన వెళ్ళిపోయింది. వాసు వెళ్ళి డ్రాప్ చేసి వచ్చాడు. మళ్ళీ ఆమె రావటం ఆరింటికి.
వస్తూనే వాసు పిక్చర్ ప్రోగ్రాం పెట్టాడు. ఫ్రెండు , భార్యతో వెళ్తూ వీళ్ళనీ రమ్మన్నాడట. తిరిగొచ్చేసరికి
రాత్రి పదిన్నర. అప్పుడొచ్చి అన్నం పెట్టుకుని తిన్నారు.
అహల్యకి కొద్దిగా అసహనంగా అనిపించింది. అదెందుకో అర్థం కాలేదు.
* * *
పొద్దున్న ఆరింటికి లేస్తుంది సృజన. ఒక్కొసారి ఆరున్నరకూడా ఔతుంది. లేచి, గబగబ స్నానం చేసి వంటింట్లో కొస్తుంది. అప్పటికే అహల్య లేచేసి వుంటుంది. స్టామీద ఒకవైపు పొగలు
చిమ్ముతున్న పాలు, మరోవైపు
హిస్ మంటూ కుక్కరూ వుంటాయి..
"అయ్యో! మీరు కుక్కరు పెట్టేసారా? నేనొచ్చేదాన్నిగా, ఆగకపోయారా?" అంటుందేమోనని ఆశిస్తుంది అహల్య. అంతేకాదు, మర్నాటినుంచి తనకన్నా ముందే లేచి వంటింట్లో కనిపిస్తుందని కూడా అనుకుంటుంది.
ఉ<హు< అలాంటిదేం జరగదు. కామ్ గా మిగిలినపని అందుకుంటుంది. గబగబ
అయిందనిపించి, వాసుకి పెట్టి, తను తిని బైటపడ్తుంది. ఆరింటికి వచ్చాక కొద్దిసేపు వాళ్ళ గదిలో రిలాక్సై స్నానం చేసి ఆ తర్వాత తీరిగ్గా వంటగదిలో అడుగుపెట్టేసరికి సగం వంటైపోయి వుంటుంది.అప్పుడూ ఏమీ మాట్లాడదు. పద్దతీ మార్చుకోదు.
రాత్రి పదింటికి లైట్ ఆరిపోతుంది. మళ్ళీ పన్నెండింటికి వెలుగుతుంది. ఆ అర్ధరాత్రివేళ అంతసేపు లైట్ వేసుకొని ఏం చేస్తున్నారో అర్థం అవ్వదు అహల్యకి. మధ్యలో మాటలు వినిపిస్తుంటాయి చిన్నగా. ఏం చేస్తుంటారు? కబుర్లు చెప్పుకుంటుంటారా?
ఉదయం సృజన లేచేసరికి ఆరు దాటిపోతోంది తరుచుగా.
...
"ఈ పిల్ల పద్దతి నాకేం నచ్చలేదండీ! ఎంతకాలం కొత్తకోడలు? చకచక నాలుగు పనులూ చేసుకోవాలిగానీ అంతా నావంతన్నట్టు తూచితూచి చేస్తుంది. పొద్దున్నేమో పదింటిదాకా లేవకపోవడం. పరాయి ఇంటికి వచ్చిన ఆడపిల్ల ఇలాగేనా వుండటం? బుద్ధి
ఉండద్దూ, ఆ తల్లికి? ఇదేం పెంపకం?” ప్రసాదరావుతో అంది అహల్య.
కోడలు వస్తుంది, బాధ్యతలు తగ్గుతాయి, సరదాలు పెరుగుతాయి అనుకుంటే అక్కరకు రాని చుట్టంలా వచ్చి పడింది. అదే చాకిరి, అదే బాధ్యత. ఉక్రోషంతో ఆమె కళ్ళలో నీళ్ళు తిరుగుతున్నాయి.
"ఏవో పనులు చేస్తూనే వుంది కదు, అహల్యా?" అన్నాడు ప్రసాదరావు సర్దిచెప్తూ.
"ఉ<హు< నాకేం నచ్చలేదు. నేను లేచేసరికి తను వంటింట్లో ఉండాలిగానీ. నేను పనంతా చేసుకున్నాక తను తిప్పుకుంటూ రావడం కాదు. సాయంత్రం మాత్రం? రాగానే
వంటింట్లోకి ఎందుకురాదు?"
"తొందరపడకు " హెచ్చరించాడు ప్రసాదరావు. తను అనుకున్నట్టే జరగటం అతనికి బాధని కలిగించింది.
...
“ ఇంట్లో పని, ఆఫీసులో పని ఆపైన ఈ టెస్టులు అసలు పాసౌతానా? ఉ<హు<.
నావల్లకావటం లేదు. కొద్దిరోజులు మా అమ్మవాళ్ళింట్లో వుంటాను... ”
కళ్ళలో నీళ్ళు తిరుగుతుండగా అంది సృజన . నిన్నమొన్నటిదాకా ఏ బాధ్యతలూ లేకుండా పెరిగి,
ఒక్కసారి యింతమంది మధ్యకొచ్చిపడేసరికి గిజగిజలాడిపోతోంది. ముఖ్యంగా అహల్య తనని దోషిలా చూడటాన్ని తట్టుకోలేకపోతోంది. అమ్మ , పిన్ని, మేనత్తలు వీళ్ళ ప్రేమని మాత్రమే చూసిన ఆమెకి యిక్కడ ఎదురౌతున్న కటుత్వం గాయపరుస్తోంది. తనకి పెద్దగా పనులు రావు. కుక్కరు పెట్టడం, కొన్ని కూరలు చెయ్యడం, సాంబారు చెయ్యటం వచ్చు. అదీ పెళ్ళికి ముందే నేర్చుకుంది. తనకొచ్చినవేదో చేస్తూనే వుంది. టైం చాలటంలేదు. ఆఫీసులో రోజు లేటు.
సృజన అన్న ఆ కొద్దిమాటల్లోనూ ఆమె అంతర్యాన్ని విన్నాడు వాసు. "అమ్మావాళ్ళతో మాట్లాడతాను" అన్నాడు మృదువుగా దగ్గరికి తీసుకుని.
పెళ్ళికి ముందు తనింట్లో జరిగిన చర్చలు గుర్తొచ్చాయి. అప్పుడే తల్లిలో అసంతృప్తిఛాయలు కనిపిస్తున్నాయి అవిడ ఆశించినట్టు కోడలు యింటిని అల్లుకుపోవడం లేదని.
ముప్పయ్యేళ్ళుగా యింటికీ వంటకీ అంకితమైపోయిన ఆవిడ అలా ఆశించంటంలో తప్పులేదు.
మరి సృజన? ఇంట్లోనూ ఆఫీసులోనూ ఎంతకని చెయ్యగలడు? అందులోనూ పెళ్లైన కొత్తలో?
ఆమె పుట్టింట్లో ఇద్దరూ ఆడపిల్లలే. చదువూ, వుద్యోగం, కెరీర్ అనే పరుగులు పెట్టారు తప్ప పనులమీద పెద్దగా దృష్టి పెట్టలేదు.
పెళ్ళి చేసుకోవటంతో సరికాదు. యింకా పెద్దబాధ్యతేదో తనపైన వుందనిపించింది వాసుకి.
...
"ఇప్పుడది పుట్టింటికి పనికిరా?" తెల్లబోతూ అడిగింది అహల్య
ఆఫీసులో ఏవో టెస్టులున్నాయమ్మా! రొటీన్ మారిందికదా, ఇబ్బందిపడుతోంది" అన్నాడు వాసు..
అతని మాటలింకా పూర్తికానేలేదు, విరుచుకుపడింది. "ఇప్పుడంత కొంపలంటుకుపోయే
ఎగ్జామ్సేం వున్నాయి? తర్వాత రాసుకొమ్మను. పెళ్ళై అత్తగారింటికొచ్చిందా లేక హాస్టలు కొచ్చిందా?"
"తనది. టెంపరరీ పోసింగ్. ప్రొబేషన్లో వుంది. అది పూరైయి పరీక్షరాస్తే రెగ్యులరౌతుంది. కేడర్ ఎగ్జామ్స్ రాయటానికి ఎలిజిబులిటీ వస్తుంది." నచ్చజెప్పబోయాడు వాసు.
"ఐతే?"
“వాళ్ళింట్లోనైతే శ్రద్ధ పెట్టి చదవచ్చని..."
"ఇక్కడేం కష్టమొచ్చిందట? తిని కూర్చొవడమేగా? ఆ తిండికూడా మంచం దగ్గరికే పంపించమనా?" అహల్య బైటపడిపోయింది. వాసు నిర్మిణుడైపోయాడు. అది సృజన యింట్లోలేని సమయం.
ప్రసాదరావు వెంటనే జోక్యం చేసుకున్నాడు. "వాసూ! నీకెలా మంచిదనిపిస్తే అలాగే
చెయ్యి, నువ్వేం చిన్నవాడివికాదు. పెళ్ళైనవాడివి. అన్నిటికీ మమ్మల్నడగడం దేనికి?" అన్నాడు. |
వాసు తలొంచుకుని వెళ్ళిపోయాడు. ఈ పరిస్థితుల్లో సృజనని కొంతకాలం తల్లికి దూరంగా పంపటమే ఉత్తమమనిపించింది. లేకపోతే మనసులు విరుగుతాయి. తన లేడీ కోలీగ్స్ లో అత్తలంటే కోడళ్ళకీ , వీళ్ళంటే వాళ్లకీ ఎంత ద్వేషమో అతనికి తెలుసు. తనింట్లో కూడా అంతేనా? దిగ్ర్భాంతిగా వుంది.
"అహల్యా! నువ్వేం మాట్లాడుతున్నావో మతుండే మాట్లాడావా?" భార్యని మందలించాడు ప్రసాదరావు. అతనికి కోడల్ని చూస్తే ముచ్చటవేస్తుంది. పిజీ చదివి, కాంపిటీటివ్ ఎగ్జామ్స్ లో
నెగ్గుకొచ్చి వుద్యోగం సంపాదించుకుంది. వాసూ, హరీ, స్నేహలకీ ఆ అమ్మాయికీ తేడా కనిపించదు. మరి అహల్యలో ఎందుకామెపట్ల ద్వేషం మొదలైంది? సాంప్రదాయిక వైరమా లేక అసూయా?
భర్త మందలింపుతో తనని తను నిగ్రహించుకుంది.అతనిముందు తన అసంతృప్తిని పరిచింది. "ఇదేమిటి? కోడలోస్తే నాకు కొంత ఆసరా ఔతుందనుకున్నాను. ఓ కొడుకుని
నాకు దూరంగా తీసుకుపోవటమా, తను నాకు చేసే సాయం?" అంది
అతను చిన్నగా నవ్వాడు. “ఎదుటివారినుంచీ ఆశించడం, వాళ్ళకి మనం ఏదో యివ్వాలనుకోవటం - యీ రెండూ చాలా సమస్యల్ని సృష్టిస్తాయి అహల్యా! కోడలు తీసుకోవడానికి
నీకున్న బాధ్యతలేమిటి? ఆ అమ్మాయికి లేనివేమిటి? చేతిలో పనందుకుని నిన్ను కూర్చోబెట్టిచెయ్యాలనుకుంటున్నావు ...తను చేసేవిధంగా నువ్వు చేయించుకుంటావా? కెరీర్ అనే కేంద్రకం
చుట్టూ తిరిగే ఆ పిల్లకి ఇంత ఇల్లూ, ఇన్ని సామాన్లూ, పనులూ అవసరం లేదు. ఏదో ఇంత వండుకు తిని ఆఫీసుకి పరిగెత్తటం తిరిగొచ్చాక వోపిక వుంటే మళ్ళీ వంట...లేకపోతే బయట
తినటం..."
"తనొక్కతేనా, ఉద్యోగం చేస్తోంది? " మధ్యలోనే ఆపి వుక్రోషంగా అడిగింది. "ఏదో ఒక ఉద్యోగం వుంది. ప్రమోషన్లనీ వాసు చూసుకుంటాడు. ఆడపిల్ల తనకెందుకవన్నీ?”
ప్రసాదరావుకి నవ్వూ, కోపం రెండూ వచ్చాయి. భార్యది అజ్ఞానమో, మూర్ఖత్వమో అర్ధమవలేదు. తన అడుగులకి మడుగులొత్తడానికి కోడలు ప్రమోషన్లు వదులుకుని కూర్చోవాలని ఆశిస్తోంది.
"చచ్చేదాకా ఈ చాకిరీ నాకు తప్పుదులెండి. అదేగా మీరు చెప్పేది? ఆవిడగారు సింగారించుకుని ఆఫీసుకు వెళ్లి కూర్చుంటుంది. నేనేమో అన్నీ అమర్చిపెట్తాను." అంది తనే మళ్ళీ.
ప్రసాదరావు సూటిగా చూసాడామెని "ఎవరికి చేస్తున్నాను నువ్వు ?నీ కుటుంబానికి చేస్తున్నావు. నీ భర్తకీ పిల్లలకీ చేస్తున్నావు. నీ బాగుకోసం చేస్తున్నావు. ఎవరో బైటిపిల్ల నీ యీ
బాధ్యతలన్నీ నెత్తిన వేసుకోవాలనే కోరికేంటో నాకు తెలీడం లేదు... అహల్యా! ఇంట్లోవుండి నువ్వేదో
కష్టపడిపోతున్నాననుకుంటున్నావు. వుద్యోగంతో నేనూ విసిగిపోయాను. పెళ్ళి పిల్లలు,కుటుంబం - అనేవి నీ స్వేచ్చని ఎలా అరికట్టాయో, నా విషయంలోనూ అంతే చేసాయి... అహల్యా! నువ్వే ఈ పనులు చెయ్యాలనిగానీ, యిలాగే చెయ్యాలనిగానీ, నీ పుట్టింటికీ, అన్నదమ్ముల దగ్గరికీ
వెళ్ళరానిగానీ నేనెప్పుడూ నిర్దేశించలేదు. నీకు నువ్వే కొన్ని స్టాండర్డ్స్ పెట్టుకున్నావు. కొన్ని బంధాలు వేసుకున్నావు. ఈ పనులు యీ పద్ధతిలోనే చేస్తాననుకున్నావు. నువ్వెళ్తే యిక్కడంతా
అస్తవ్యస్తమౌతుందేమోనని భయపడ్డావు.... నీ జీవితాన్ని నీకు తోచినట్లు గడిపావు. అలాంటి స్వేచ్ఛని
సృజనకీ యివ్వు. నువ్వు యివ్వకపోయినా వాళ్ళ స్వేచ్చని వాళ్ళు వదులుకోరు. మరో విషయం.

ఇతర ధారావాహికాలు
శక్తి ఆగమనం
(https://xossipy.com/thread-71346.html)
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు
మా తెలుగు తల్లికి మల్లె పూదండ

![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)