Yesterday, 08:01 AM
(This post was last modified: Yesterday, 08:02 AM by SivaSai. Edited 1 time in total. Edited 1 time in total.)
Part - 92
రాజ్ దగ్గరికి వచ్చేద్దాం మనం..
శ్రీ, నేహా నోములు అయిన తర్వాత ఆ రోజు సాయంత్రం అందరు పర్మిషన్తో రాజ్, నివిని తీసుకుని బయటకు వెళతాడు.
కారులో కూర్చున్న నివి సైలెంట్ గా ఉంటే రాజ్ టెన్షన్ గా ఉంటాడు. ఇద్దరూ ఏమీ మాట్లాడకుండానే మౌనంగానే ట్రావెల్ చేస్తూ ఉంటారు.
కొంచెం సేపటికి నివి కి విసుగు వచ్చి ఏంటి రాజ్ ఏమీ మాట్లాడకుండా కూర్చున్నావు. నువ్వు ఇలా డ్రైవ్ చేసుకోవాలనుకుంటే పక్కన ఇంకా నేనెందుకు. నువ్వు ఒక్కడివే వెళ్లొచ్చు కదా..
అయ్యో నివి నీకు కోపం వచ్చిందా.. సోరి.. సోరి.. ఏం మాట్లాడాలి అర్థం కాక సైలెంట్ గా ఉన్నాను. అదేంటి రోజు బానే మాట్లాడుతావు కదా..
ఈ రోజు మాట్లాడడానికి ఏమైంది అని అడుగుతుంది
రోజు వేరు.. ఈరోజు వేరు. ఏంటో ఈరోజు మాట్లాడాలి అంటే టెన్షన్ వస్తుంది అంటాడు. ఎందుకు ఆ టెన్షన్ అని అడుగుతుంది .
ప్లీజ్ నివి కాసేపు నన్నేమీ మాట్లాడించకు. చాలా టెన్షన్ గా ఉన్నాను. సరే సాంగ్స్ అయినా పెట్టు అని మ్యూజిక్ ఆన్ చేస్తుంది.
అన్ని కూడా రొమాంటిక్ సాంగ్స్ వస్తూ ఉంటాయి. రాజ్ నీకు చాలా మంచి టేస్ట్ ఉంది. థాంక్యూ... థాంక్యూ.. అని మురిసిపోతుంటాడు.
దీనికే నువ్వు ఇంత హ్యాపీగా ఉంటే... నేను ఇచ్చే సర్ప్రైజ్ కి ఇంకేమంటావో అనుకుంటూ ఫ్లయింగ్ చేస్తూ ఉంటాడు.
ఏమైంది రాజ్ నీలో నువ్వే నువ్వేసుకుంటున్నావు. నాకు చెబితే నేను నవ్వుతాను కదా.. అబ్బా.. ఏమీ లేదు అంటాడు.
ఇంకా ఎంత దూరము వెళ్ళాలి అంటే.. దగ్గర్లోకి వచ్చేసాము. చీకటి కూడా పడుతుంది. ఆ వాతావరణం చాలా బాగుంటుంది.
పూర్తిగా సూర్యుడు అస్తమించకుండా.. అలాగే వెన్నెల కూడా పూర్తిగా రాకుండా.. ఆ నేచర్లో పక్షులు గూటికి చేరుతూ ఉంటే... ఆ టైంలో... ట్రాఫిక్ లేని రోడ్లో.. ఎవరూ లేని ఏకాంతంలో.. తనకి నచ్చిన నేచ్చెలి తో వెళితూఉంటే...
ఆ ఫీల్ ని ఎంత వర్ణించి చెప్పినా తక్కువే కదా.. నివి వైపు చూస్తాడు. రాజ్ చెప్తున్నంత సేపు కూడా కల్లార్పకుండా అలానే చూస్తూ ఉంటుంది.
నివి చూపులకి ఇబ్బందిగా ఏంటి నివి అలా చూస్తున్నావ్.. రాజ్ నీలో మంచి కవి ఉన్నాడు తెలుసా.. అసలు ఎంత బాగా చెప్పావు.
నువ్వు ఎవరికైనా ప్రపోజ్ చేయాలి అనుకున్నప్పుడు ఇదే ఫీల్ తో మంచి కవిత చెప్పు. ఆ అమ్మాయి ఎవరైనా సరే... క్లీన్ బౌల్ అంటుంది.
అంత బాగా చెప్పానా అని మెరిసే కళ్ళతో అడుగుతాడు. నీకు ఇంకా అంత డౌటే ఎందుకు... నేనే కితాబు ఇచ్చాక అని డ్రామాటిక్కా చెబుతోంది. ఆ మాటలకి నవ్వుకుంటాడు.
సూర్యుడు పూర్తిగా వెళ్ళిపోయాడు అన్న సమయానికి రాజ్ తన అనుకున్న ప్లేస్ కి తీసుకు వస్తాడు. ఎక్కడికి వచ్చాము అని అడిగితే మన గెస్ట్ హౌస్ కి అని చెబుతాడు.
సెక్యూరిటీ గేట్స్ తీయగానే కార్ లోపలికి తీసుకువెళ్లి ఒకచోట పార్క్ చేసి కం నివి అని వచ్చి డోర్ తీస్తాడు.
డోర్ తీసి తన చెయ్యి అందిస్తాడు. నివి ఒకసారి రాజ్ వైపు చూసి ఆ చేతిలో చెయ్యవేసి కాళ్లు కింద పెట్టబోతోంది.
వన్ మినిట్ నివి అనగానే.. ఏమైంది నువ్వు చెప్పులు కారులోనే వదిలేసి దిగుఅని చెబుతాడు. ఎందుకు...ప్లీజ్ అని రిక్వెస్ట్ చేస్తాడు.
సరే అని తను శాండిల్స్ కారులోనే వదిలేసి పాదాలు కింద పెడుతుంది. పాదాలు నేలకి చేరకుండా మధ్యలో మెత్తని ఒక స్పర్శ అడ్డుపడుతూ ఉంటుంది.
ఆ స్పర్శకి తనవు మనసు కూడా పులకించిపోతుంది. ఆ స్పర్శను చూడాలి అన్న ఆతృతతో నివి తన కళ్ళను కిందకి దించుతుంది.
అక్కడ నాలుగు అడుగుల మందులతో మెత్తటి పువ్వులు పరిచి ఉంటాయి. దారి అంతా కూడా కేవలం గులాబీ రేకులు మాత్రమే ఉంటాయి.
ఆశ్చర్యంగా రాజ్ వైపు చూస్తే. రేకులైతే నీకు ఏమి ఇబ్బందిగా ఉండదు అని ఇలా ఏర్పాటు చేశాను. పదా అని చేయి పట్టుకుని తీసుకువెళ్తాడు.
మంత్రం వేసినట్టుగా ఒక తన్మయత్వంలో రాజ్ వెనకాలే వెళుతూ ఉంటుంది. మెల్లిగా చీకట్లు ముసురుతో ఉంటే.. చుట్టూ ఉన్న చెట్లు చల్లటి పవనాలను విసురుతూ ఉంటే..
నివి ప్రతి అడుగుకి.. సూర్యుని వెలుగుకి పోటీ వచ్చే విధంగా లైట్స్ వెలుగుతూ.. నివిని ఒక అద్భుత లోకంలోనికి తీసుకు వెళ్ళిపోతాడు.
లోపలకి తీసుకువెళ్లి ఒక గది ముందు నుంచోపెట్టి ఓపెన్ ద డోర్ నివి అంటాడు. రాజ్ పనులకి ఎప్పుడో రాజ్ కంట్రోల్ లోకి వెళ్లిపోయిన నివి.. తను చేతలతో తనకే సంబంధం లేనట్టుగా తలుపులు తెరుస్తుంది.
ఆ తలుపులు తెరిచిన వెంటనే హార్ట్ షేప్ లో ఉన్న రెడ్ బెలూన్స్ అన్ని ఎగురుతూ నివి మీద నుంచి ఆకాశంలోనికి వెళుతూ ఉంటాయి. ఆ దృశ్యం చూడగానే నివి ఫ్రీజ్ అయిపోతుంది.
ఒక అడుగు ముందుకు వేసేటప్పటికి 100 బెలూన్స్ బయటకు వస్తూ ఉంటాయి. ఆశ్చర్యంగా రాజ్ వైపు చూస్తూ ఉంటే నివి ఎక్స్ప్రెషన్స్ చూస్తూ తనలో తానే నవ్వుకుంటూ ఉంటాడు.
ఏదో మాట్లాడాలి అనుకున్న నివి ఏమీ మాట్లాడలేక ఏమిటిది అన్నట్టుగా కళ్ళతోనే అడుగుతుంది. రాజ్ కళ్ళతోనే నీకోసమే అన్నట్టుగా సమాధానం చెబుతూ...
ఆ చేతిని పట్టుకుని ముందుకి అడుగు వేస్తాడు. ఒకరి చెయ్యి ఒకరి పట్టుకుని అడుగులో అడుగు వేసుకుంటూ ఆ గది మధ్యలోకి తీసుకువెళతాడు.
బెలూన్స్ అన్ని ఆకాశంలోనికి ఎగిరిపోయిన తర్వాత కొన్ని బెలూన్స్ మాత్రం గదిలో వేలాడుతూ ఉంటాయి. ప్రతి బెలూన్ మీద ఐ లవ్ యు నివి అని రాసి ఉంటుంది.
నివి మీద ఫీలింగ్ స్టార్ట్ అయినప్పటి నుంచి కలెక్ట్ చేసిన ఫొటోస్ అన్నీ కూడా పిన్ చేసి హ్యాంగ్ చేస్తాడు. అవి చూసి మరింత ఆశ్చర్యపోతూ ఇవన్నీ ఎప్పుడు కలెక్ట్ చేశావు అని అడుగుతుంది. జస్ట్ లైక్ దట్ అన్నట్టుగా భుజాలు ఎగరేస్తాడు.
నివికి అవి చాలా బాగా నచ్చుతాయి. సంతోషంతో ముందుకు వెళ్లి ప్రతి ఫోటోని, ఆ బెలూన్స్ ని తాకి మరీ చూస్తుంది.
నివి అలా చూస్తూ ఉండగానే... రాజ్ వెనకాల నుంచి నివి అని పిలుస్తాడు. హ.. అని వెనక్కి తిరుగుతుంది. అక్కడ రాజ్ ఒక మోకాళ్ళ మీద బెండ్ అయ్యి కూర్చుని...
కుడి చేతితో ఉంగరం పట్టుకుని నివి వైపు చూస్తూ ఐ లవ్ యు నివి. ఎంత అని అడిగితే నేను చెప్పలేను.. కానీ మా అమ్మ తర్వాత నేను ప్రేమించిన మరొక అమ్మాయివి నువ్వే. నా జీవితకాలం మొత్తం నిన్ను మాత్రమే ప్రేమిస్తాను.
ఎందుకు అని మాత్రం అడగవద్దు. నువ్వు ఎప్పుడు నా మనసులోకి వచ్చావో నాకే తెలియదు. వచ్చిన నిమిషం నుంచి నా మాట... నా చూపు.. నా గమనం అన్ని నీ వైపుకే తిరుగుతున్నాయి.
నువ్వు నో అంటే బ్రతకలేను అని పెద్ద పెద్ద మాటలు చెప్పను కానీ.. మరొక అమ్మాయిని మాత్రం నా జీవితంలోనికి రానివ్వను. నువ్వు అవునన్నా.. కాదన్నా...
నా జీవితంలో ఉండే ఒకే ఒక అమ్మాయివి నువ్వు....
నన్ను పెళ్లి చేసుకుంటావా.. నీ జీవితంలోకి నన్ను రానిస్తావ.. నీ కాలు కందనివ్వను. నీకంట కన్నీరు రానివ్వను. నీ మనసులో ఉన్నది నీ కన్నా ముందే నేనే కనిపెట్టి చేస్తాను. నిన్ను ఒక మహారాణి లాగా చూసుకుంటాను. ఇలాంటి పెద్ద పెద్ద డైలాగ్స్ నేను చెప్పను.
నీ ప్రతి కష్టంలోనూ నీకు తోడుగా నిలబడతాను. నీ ప్రతి విజయానికి నేను ఆయువు పోస్తాను. నీ, నా అనే భావం కాకుండా మన అన్న భావాన్ని నీకు నేను కలగచేస్తాను.
ప్లీజ్ అని రిక్వెస్ట్ చేయను.. ఆర్డర్ అని డిమాండ్ చేయను. నా ప్రేమలోని నిజాయితీ నిన్ను తాకితే... రాజ్ మాట మాటలో ఉండగానే నివి తన చేతిని ముందుకు చాపుతుంది.
అది చూసి సంతోషంతో వేలికి ఉంగరం పడతాడు. పైకి లేచి నుంచుని నువ్వు ఇంత తొందరగా ఒప్పుకుంటావని అనుకోలేదు నివి. ఇంకా నేను ఎన్ని ప్రయత్నాలు చేయాలో అనుకున్నాను అని హగ్ చేసుకుంటాడు.
నివి కూడా రాజ్ చుట్టూ చేతులు వేసి నువ్వు ఎప్పుడు ప్రపోజ్ చేస్తావా అని నేను చాలా రోజుల నుంచి ఎదురుచూస్తున్నాను.
ఆఖరికి ఇప్పటికి ఓపెన్ అయ్యావు అంటుంది. నేను ప్రపోజ్ చేయకపోతే నువ్వు చేయొచ్చు కదా అని కౌగిలి నుంచి దూరం జరిపి అడుగుతాడు.
అబ్బా మేము ఎలా ప్రపోజ్ చెస్తాము. మీరు మా వెనకాల పడాలి. మెప్పించాలి. ప్రపోజ్ చేయాలి. అవన్నీ మాకు ఓకే అయితే ఎస్ అని చెప్పాలి అని చేతులు కట్టుకుని చెబుతుంది.
అంటే నీకు ఎప్పుడో అర్థమయ్యే కావాలని అర్థం కానట్టుగా ఉన్నావా అని బ్లాంక్ ఫేస్ తో అడుగుతాడు. దానికి నవ్వుతూ అది ఇప్పటికి అర్థమైందా..
శ్రీ పెళ్లి రోజున వినయ్ అన్న మాటలు గుర్తుకు వస్తాయి.. నువ్వు చెబితే గాని అది ఓపెన్ అవ్వద్దు అన్నమాటలు గుర్తుకు వచ్చి ఈ విషయం మీ ఇంట్లో అందరికీ తెలుసా అని గుర్రుగా చూస్తూ అడుగుతాడు.
ఆఫ్కోర్స్ భుజాలు ఎగరేస్తూ రెండు చేతుల్ని ఓపెన్ చేసి చెబుతుంది.
గోవిందుడు బుక్కయ్యాడు అన్నట్టుగా మా రాజ్ బాబు బుక్కయ్యాడు ???
కథ కొనసాగుతుంది...

![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)