Thread Rating:
  • 5 Vote(s) - 3.6 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
ఖైదీ నెంబర్ 402 - నా మాటే శాసనం
ఎపిసోడ్ 73


మనం అనుకున్న ప్లాన్ కరెక్ట్ గా జరిగే వరకు గెస్ట్ హౌస్ లో నుంచి ఫోన్స్ గాని మనుషులు గాని బయటకు వెళ్లకూడదు ఆర్డర్ వేసింది అర్ణ.

అది విని పక్కకి మాట్లాడుకుంటున్న వరదరాజులు వాళ్ళకి కాఫీ ఇచ్చి అక్కడ ఉన్న పక్షులకి గింజలు వేస్తూ వింత శబ్దం చేసాడు రాము.

******************

పక్షులకి ఆహారం వేస్తూన్న రాముని చూసి "వాడు చూడు ఎలా అరుస్తున్నాడో,  వెరైటీ క్యాండిడేట్స్ అందరూ ఇక్కడే ఉన్నారు." అని సుజిత్ వైపు చూసి "నువ్వు చెప్పిన అమ్మాయి ఎక్కడ ఉంది." అని అడిగాడు వరదరాజులు.

"ఆ విష్ణు గాడికి ఏవో కబుర్లు చెబుతూ వాడి రూమ్లోనే ఉంటుంది." అని కోపంగా చూస్తూ చెప్పాడు సుజిత్.

"అవునా? పద దాని సంగతి ఏంటో చూద్దాము." అని చెప్పాడు తబియర్.

"అక్కడ విష్ణు ఉంటాడు కదా!" అని అడిగాడు సుజిత్.

"ఆ విష్ణు గాడిని అక్కడ నుంచి ఎలా పంపించాలో నాకు బాగా తెలుసు పదండి." అని చెప్పి లిఫ్ట్ లొ ఫిఫ్త్ ఫ్లోర్ కి వెళ్లి సోఫాలో దర్జాగా కూర్చున్న రియాని చూసి "ఇది ఇక్కడే ఉంది." అని చెప్పాడు ప్రతాప్ మిశ్ర.

లోపలికి వెళుతూ "విష్ణు! నువ్వు ఇంకా ఇక్కడే ఉన్నావా? అక్కడ అర్ణ మంచి ప్లాన్ వేసింది. ఈ దెబ్బతో అభీర్, వాడి మనుషుల పని క్లోజ్! నువ్వు కూడా వెళ్లావు అనుకున్నాను." అని చెప్పాడు సుజిత్.

"గెస్ట్ హౌస్ లో నుంచి ఎవరిని బయటికి వెళ్ళకూడదు అని అర్ణ ఆర్డర్ వేసింది కదా ఎలా వెళ్ళతాడు? పాపం వెళితే తన పగ కొంచెం చల్లరుతుంది  అనుకున్నను." అని వ్యగ్యం గా చూస్తూ చెప్పాడు తంబియార్.

ఆ మాట విని "నేను ఇప్పుడే అక్కడికి వెళతాను వాళ్ళ చావు నా కళ్ళారా చూడాలి, ఎవరు ఆపుతారో చూస్తాను." అని కోపంగా కిందకి వెళ్ళాడు విష్ణు.

'హమ్మయ్య...మన ప్లాన్ పనిచేసింది. వస్తే వాళ్లతో పాటు తిరిగి వస్తాడు లేకపోతే వీడు కూడా పోతాడు.' అని మనసులో అనుకున్నాడు ప్రతాప్ మిశ్రా.

కిటికీ లోనుంచి చూస్తూ "డాడ్! విష్ణు ఎవరి మట వినకుండా కారులొ ఫాస్ట్ గా వెళ్ళిపోయాడు ఇంక మన పని స్టార్ట్ చేయొచ్చు!"  అని చెప్పాడు తంబియార్.

సోఫాలో కూర్చున్న రియా దగ్గరికి వెళ్లి "నువ్వు విష్ణు పంపితే నా దగ్గరికి వచ్చావా? లేక అభీర్ పంపితే వచ్చేవా?" అని కోపంగా చూస్తూ అడిగాడు సుజిత్.

ఆ మాటకి టీవీ ఆఫ్ చేసి తల పైకెత్తి చూసి "విష్ణు పంపితే వచ్చాను, అయినా అభీర్ నాతో ఎందుకు మాట్లాడతాడు?" అని అడిగింది రియా.

"మా వాడిని వలలో వేసుకున్నట్లే విష్ణుని కూడా వలలో వేసుకున్నావు కాదు, నువ్వు అభీర్ మనిషివే అని మాకు తెలుసు ఇక్కడ నీలాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు?" అని కోపంగా చూస్తూ అడిగాడు ప్రతాప్ మిశ్ర.

"నిజం చెబితే ప్రాణాలతో బయటకు వెళతావు లేకపోతే ఈ గెస్ట్ హౌస్ లో చంపి పాతి పెడతాము." అని తంబియార్ వైపు చూసి "తలుపులు మూసేయ్ ఈరోజు దీని నోట్లో నుంచి నిజం ఎలా చెప్పించాలో నాకు బాగా తెలుసు!" అని గన్ బయటికి తీసి చిన్నగా స్మైల్ ఇచ్చాడు వరదరాజులు.

డోర్స్ క్లోజ్ చేసి రియా దగ్గరకి వచ్చి సీరియస్ గా చూస్తూ "అందరూ మంచి బిజీగా ఉన్నారు ఇప్పుడు నిన్ను ఇక్కడ చంపేసినా ఎవరు పట్టించుకోరు, నీతో పాటు ఇంకా ఎవరు ఎవరు ఇక్కడ ఉన్నారో చెప్పి హ్యాపీగా ఈ దేశం వదిలి పారిపో కావలసినంత డబ్బు ఇస్తాను." అని చెప్పాడు తంబీయర్.

ఆ మాట విని సోఫాలో నుంచి లేచి భయంగా చూస్తూ "ప్లీజ్! నన్ను ఏమి చేయకండి. మీకు అన్ని విషయాలు చెబుతాను." అని పరిగెత్తుకుంటూ డోర్ దగ్గరికి వెళ్ళింది రియా.

"నాకు తెలిసు నువ్వు ఇలాంటి పని ఏదో చేస్తావని లాక్ చేశాను." అని చేతిలో ఉన్న కీ చూపించి వెటకారంగా నవ్వాడు తంబియార్.

"అవునా? నేను పారిపోవడానికి డోర్ దగ్గరికి వెళ్ళలేదు లాక్ కరెక్ట్ చేసావా లేదా అని చూడడానికి వచ్చాను." అని దగ్గరికి వచ్చి రిమోట్ తీసుకుని టీవీ ఆన్ చేసి సౌండ్ పెంచి సుజిత్ రెండు కళ్ళ మధ్యలో ఒక తన్ను తన్ని

"ఏరా! అమ్మాయిని చూస్తే చాలు సొల్లు కార్చుకుంటూ వెంటపడడమేనా అసలు తను ఎవరో ఏంటో తెలుసుకోవాలి కదా!" అని మీదకి వస్తున్న తంబీయర్ ని ఎత్తి సోఫాలో పడేసి గుండెల మీద కాలు వేసి

"ఆడది అంటే అంత లోకువా నీకు డోర్ లాక్ చేసి తాళం జేబులో వేసుకున్నావు, ఒక్క తొక్కు తొక్కాను అంటే నీ గుండె కాయ నోట్లో నుంచి బయటికి వస్తుంది." అని కళ్ళు పెద్దవి చేసి ఉరుముతూ చూసింది రియ.

"వరదరాజులు! చూస్తూ కూర్చున్నావు ఏమిటి! దానిని షూట్ చెయ్!" అని గట్టిగా అరిచాడు ప్రతాప్ మిశ్రా.

ఆ మాట విని వేగంగా వెనక్కి తిరిగి వరదరాజుల చేతిలో గన్ తీసుకొని "మోసలు చేసే నా కొడకల్లారా..! మా నాయకుడు మంచోడు కాబట్టి ఫ్యాక్టరీలో మీరు దొరికిన ఒక ఛాన్స్ ఇచ్చి వదిలేసాడు, నేను అలా కాదు నలుగురిని ఇక్కడే చంపేసి దర్జాగా వెళ్ళిపోతాను." అని చెప్పింది రియా.

ఆ మాట విని భయంగా చూస్తూ "ప్లీజ్ మమ్మల్ని వదిలియ్! గన్ లోపల పెట్టు పేలుతుంది.  మేము మీ నాయకుడు చెప్పినట్లయితే చేస్తున్నాము, నువ్వు నిజాయితీగా ఉన్నవో లేదో అని టెస్ట్ చేశాము." అని తంబియార్ జేబులో ఉన్న కీ తీసి ఇచ్చాడు వరదరాజులు.

"మా నాయకుడు తన పర్మిషన్ లేకుండా ఎవరిని చంపకూడదని మాట తీసుకున్నాడు కాబట్టి మీరు బతికిపోయారు, మళ్లి పిచ్చిపిచ్చి వేషాలు వేశారు అంటే తోలు వలిచేస్తాను." అని వరదరాజులు చేతిలో కీ తీసుకుని బుల్లెట్స్ తీసి జేబులో వేసుకుని గన్ అక్కడ పడేసి బయటకు వెళ్లింది రియా.

బయటికి వెళుతున్న రియా వైపు భయంగా చూస్తూ "అక్కడ అభీర్ ని చంపడానికి ప్లాన్ చేశారు విషయం ఎలా చెప్పాలో మాకు తెలియడం లేదు." అని చెప్పాడు వరదరాజులు.

"అవునా?" అని ఒక స్మైల్ ఇచ్చి బయటికి వెళ్ళిపోయింది రియా.

"హమ్మయ్య.. బతికిపోయాము లేకపోతే మన నలుగురిని  ఇక్కడే చంపేసేది." అని ఊపిరి పీల్చుకున్నాడు ప్రతాప్ మిశ్ర.

తంబియార్ ల వైపు చూసి "అడ్డ గాడిద లాగా ఉన్నావు ఒక్క ఆడదాన్ని ఏమి చేయలేకపోయావా? " అని కోపంగా చూస్తూ అడిగాడు వరదరాజులు.

"ఏంటి చేసేది! ఒక్క దెబ్బతో నన్ను పైకి ఎత్తి సోఫాలో పడేసింది. అది మామూలు ఆడది కాదు  మనం చాలా జాగ్రత్తగా ఉండాలి లేకపోతే ఎప్పుడో ఒకప్పుడు గొంతులో కత్తి దింపుతుంది." అని సోఫాలో నుంచి నెమ్మదిగా పైకి లేచాడు తంబియార్.

కిందపడి గిల గిల కొట్టుకున్న సుజిత్ వైపు చూసి "వెంటనే డాక్టర్ని పిలిపించాలి ఇప్పుడు వీడు పెళ్లికి పనికి వస్తాడో లేదో!" అని కంగారుగా చూస్తూ అన్నాడు ప్రతాప్ మిశ్ర.

******************

కాలేజ్ దగ్గరికి బైక్ మీద మిత్ర, కారులో శ్రీకర్, దయా రావడం చూసి రోషిని, ప్రణతి లని కారులో ఎక్కించుకొని డ్రైవింగ్ సీట్లో ఉన్న తన మనిషి వైపు చూసి

"ఫాస్ట్ గా గోడౌన్స్ దగ్గరకి వేళ్ళు వాళ్లు మన వెనకాలే రావాలి." అని గ్లాస్ దింపి మిత్ర వాళ్ళ వైపు చూసి నవ్వుతూ చేయ్యి ఉపాడు జాకి.

కార్ లొ ఫాస్ట్గా దగ్గరికి వచ్చి "జాకీ! ఆ పిల్లల్ని వదిలియ్ వాళ్లకి ఏమైనా జరిగితే నిన్ను మాత్రం వదిలిపెట్టను." అని కోపంగా చూస్తూ చెప్పాడు శ్రీకర్.

బైక్ మీద ఫాస్ట్గా కార్ ని చాజ్ చేస్తూ "అభీర్ కి ఈ విషయం తెలిస్తే మిమ్మల్ని వదిలి పెట్టడు." అని ఆవేశంగా చెప్పింది మిత్ర.

"అవునా? మేము బఫర్ గోడౌన్స్ దగ్గరికి వెళుతున్నము ఆ అభీర్ గాడికి ఫోన్ చేసి దమ్ముంటే అక్కడికి రమ్మను." అని చెప్పి గ్లాస్ క్లోజ్ చేసాడు జాకీ.

బైక్ స్లో చేసి కాల్ చేయడానికి ఫోన్ తీస్తున్న మిత్ర వైపు చూసి "వాళ్ళు ఏదో ప్లాన్ చేశారు అభీర్ అక్కడికి రాకూడదు మనం వెళదాం పదండి." అని చెప్పాడు శ్రీకర్.

"సరే!" అని ఫోన్ పెట్టి బైక్ అక్కడ పార్క్ చేసి శ్రీకర్ వాళ్ళ కారులో ఎక్కరు చాక్లెట్, మిత్రలు.

**************

కార్ లొ రోషిని, ప్రణతి లని తీసుకుని ఫాస్ట్ గా గోడౌన్  దగ్గరికి వెళ్లి అక్కడ ఉన్న ప్రహల్లాద్ వైపు చూసి "వస్తున్నారు వస్తున్నారు మన వాళ్ళని రెడీగా ఉండమను." అని కారు దిగి డోర్ ఓపెన్ చేసి "ఈ ఇద్దరిని తీసుకెళ్లి కాళ్లు చేతులు కట్టేసి ఒక రూమ్ లో పడేయండి." అని చెప్పాడు జాకి.

అంతలో కార్ లొ ఫాస్ట్ గా వస్తున్న విష్ణుని చూసి "సడన్గా ఈయన ఎందుకు వస్తున్నాడు?" అని డౌట్ గా అడిగాడు ప్రహల్లాద్.

అంతలో తన చేతిలో ఫోన్ రింగ్ అవ్వడం చూసి "అర్ణ మేడం ఫోన్ చేస్తున్నారు." అని చెప్పి లిఫ్ట్ చేసి

"మేడం! ఇద్దరిని తీసుకుని గోడౌన్ దగ్గరికి వచ్చేసాను మిత్రతో పాటు ఆ సిబిఐ ఆఫీసర్, సెక్యూరిటీ అధికారి ఆఫీసర్ దయ  కూడా వస్తున్నారు, నాకు తెలిసి విషయం అభీర్ కి చెప్పే ఉంటారు కచ్చితంగా ఇక్కడికి వస్తాడు ఈరోజుతో అందరి పని క్లోజ్!" అని సంతోషంగా చెప్పాడు జాకి.

"గుడ్! అభీర్ అక్కడికి వచ్చేసరికి మిత్ర బతికి ఉండకూడదు ఆఫీసర్స్ మనం మాట వింటే ఉంచండి లేకపోతే వాళ్ళని కూడా లేపేయండి. అక్కడికి విష్ణు వచ్చాడు వాడిని జాగ్రత్తగా చూసుకోండి." అని చెప్పింది అర్ణ.

"ఓకే మేడం! ఆ ఇద్దరు పిల్లల్ని కూడ చంపేయమంటారా?" అని అడిగాడు జాకి.

అర్ణ దగ్గర ఫోన్ తీసుకుని "అప్పుడే కాదు అభీర్ ని చంపిన తర్వాత చంపండి లేకపోతే వాడిని మీరు ఆపలేరు." అని చెప్పాడు అభిజిత్.

"సరే సార్!" అని చెప్పి ఫోన్ పెట్టేసి కారు దిగి ఆవేశంగా వస్తున్న విష్ణు వైపు చూసి "కూల్ సార్ కూల్! ఇంకా అభీర్ రాలేదు రాగానే మీ చేతులతోనే చంపించమని మేడం కాల్ చేసి చెప్పారు." అని నవ్వుతూ చెప్పాడు జాకీ.

అంతలో గోడౌన్స్ దగ్గరికి వచ్చి కారు దిగి బాడీ మీద గ్రీన్ లైట్ డాట్స్ పడడం చూసి "చుట్టూ స్మైపర్స్ ఉన్నారు జాగ్రత్తగా ఉండండి." అని చెప్పాడు శ్రీకర్.
[+] 8 users Like SivaSai's post
Like Reply


Messages In This Thread
RE: వేదం - by Manmadhsbanam143 - 22-12-2025, 04:13 PM
RE: ఖైదీ నెంబర్ 402 - నా మాటే శాసనం - by SivaSai - 12-02-2026, 07:43 AM



Users browsing this thread: 1 Guest(s)