Thread Rating:
  • 5 Vote(s) - 3.6 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
ఖైదీ నెంబర్ 402 - నా మాటే శాసనం
ఎపిసోడ్ 72


మిత్ర, శివమణి కూతురు అని తెలియడంతో కాల్ చేసి మురళి జోషి చిన్న కూతురు, వసుంధర కూతురు చదివే కాలేజ్ తెలుసా అని అడిగి ట్రాప్ లో పెట్టి జాకిని పంపించాడు మిథున్.

**************

మిధున్ తో ఫోన్లో మాట్లాడి హడావుడిగా చాక్లెట్ ని తీసుకుని బైక్ మీద వెళుతూ "కాలేజ్ నుంచి రోషిని, ప్రణతి లని కిడ్నాప్ చేయడానికి చూస్తున్నారు నీలమ్,సుమతి లకి ఫోన్ ట్రై చెయ్ ఎలాగైనా వాళ్ళని కాపాడాలి." అని కంగారుగా చెప్పింది మిత్ర.

"సరే అక్క!" అని బండి వెనకాల కూర్చుని ఫోన్ ట్రై చేస్తూ "ఇద్దరి నెంబర్లు బిజీ వస్తున్నాయి." అని చెప్పాడు చాక్లెట్.

బైక్ మీద ఫాస్ట్గా వెళుతూ ఆ మాట విని "అయితే! లాయర్.మేడం అని ఉంటుంది దానికి డయల్ చెయ్!" అని చెప్పింది మిత్ర.

"సరే అక్క!" అని ఫోన్ లొ నెంబర్ చూసే లోపు రింగ్ అవ్వడం చూసి "అక్క! అర్ణ ఫోన్ చేస్తుంది." అని టెన్షన్ గా చూస్తూ చెప్పాడు  చాక్లేట్.

"అవునా?" అని బైక్ స్లో చేసి ఫోన్ తీసుకుని అనుమానంగా చూస్తూ లిఫ్ట్ చేసి "గుడ్ మార్నింగ్ మేడం!" అని చెప్పింది మిత్ర.

"హలో మిత్ర! ఎక్కడ ఉన్నావుm నీతో ఒక అర్జెంట్ పని పడింది." అని చెప్పింది అర్ణ.

"నేను ఇంటి దగ్గర ఉన్నను మేడం చెప్పండి?" అని అడిగింది మిత్ర.

"సరే! అక్కడే ఉండు అభీర్ ని అరెస్ట్ చేయడానకి ఒక ఛాన్స్ దొరికింది  కాసేపట్లో నీకు ఒక లొకేషన్ పంపుతాను అక్కడికి వెళ్లి  ప్రహ్లాద్ వాళ్లకి కాస్త హెల్ప్ గా ఉండు." అని చెప్పింది అర్ణ.

"ఓకే మేడం! మీరు లొకేషన్ పంపగానే బయలుదేరుతాను." అని చెప్పి ఫోన్ పెట్టి "అభీర్ ని అరెస్టు చేసే అంత ప్రహల్లాద్ కి ఏమి దొరికి ఉంటుంది?" అని ఆలోచిస్తూ శ్రీకర్ కి కాల్ చేసింది మిత్ర.

తన ఆఫీసులో దయాతో మాట్లాడుతూ ఉండగా ఫోన్ రింగ్ అవ్వడం చూసి లిఫ్ట్ చేసి "మిత్ర! టెల్ మీ?" అని అడిగాడు శ్రీకర్.

"సార్! ఎస్పీ ప్రహల్లాద్, అభీర్ మీద ఏదో కేసు ఫైల్ చేస్తున్నాడని తెలిసింది నిజమేనా?" అని అడిగింది మిత్ర.

"ఎస్! తీహార్ జైల్ లొ అభీర్ చేతిలో చనిపోయిన నలుగురి ఫ్యామిలీ మెంబర్స్ తో కేసు ఫైల్ చేయించారు నాకు ఇప్పుడే తెలిసింది. ఈ విషయం అప్పుడే నీకు ఎలా తెలిసింది?" అని డౌట్ గా అడిగాడు శ్రీకర్.

"నాకు అర్ణ కాల్ చేసి చెప్పింది. అంతే కాదు వాళ్ళు రోషిని, ప్రణతి కిడ్నాప్ చేయబోతున్నారు." అని చెప్పింది మిత్ర.

"అవునా? అలా అయితే వాళ్ల కోసం కచ్చితంగా అభీర్ వస్తాడు అప్పుడు అరెస్ట్ చేయాలని ప్లాన్ చేసి ఉంటారు, ఆ ప్రహ్లాద్ అరెస్ట్ చేసి ఊరుకొడు కచ్చితంగా ముకుల్ వాళ్ల కోసం ఎన్కౌంటర్ చేయడానికి చూస్తాడు.

ఎలాగైనా ఆ ఇద్దరిని కిడ్నాప్ అవ్వకుండా చూడాలి నువ్వు వెంటనే కాలేజ్ దగ్గరికి వేళ్ళు నేను కూడా దయాతో కలిసి బయలుదేరుతాను." అని చెప్పాడు శ్రీకర్.

"ఓకే సార్! " అని చెప్పి ఫోన్ పెట్టేసి బైక్ మీద ఫాస్ట్ గా వెళ్ళింది మిత్ర.

**************

గెస్ట్ హౌస్ దగ్గర గార్డెన్ లొ మిథున్ వాళ్ళతో మాట్లాడుతున్న అర్ణ దగ్గరికి వచ్చి "మేడం! మీరు చెప్పినట్లు అందరి ఫోన్స్ టాపింగ్ లో పెట్టాము ఇప్పుడే మిత్ర సిబిఐ ఆఫీసర్ శ్రీకర్ కి కాల్ చేసింది.

అభీర్ మీద ప్రహ్లాద్ ఫైల్ చేసినా కేసు గురించి కన్ఫామ్ చేసుకుని మనం పిల్లలిద్దరిని కిడ్నాప్ చేస్తున్న విషయం చెప్పింది ఇప్పుడు వాళ్ళందరూ కాలేజ్ దగ్గరికి బయలుదేరుతున్నారు."  అని చెప్పాడు మిస్సైల్.

ఆ మాట విని కోపంగా చూస్తూ "మిత్ర! మమ్మల్నే మోసం చేయాలని చూస్తావా? నీ తండ్రికి పట్టిన గతే నీకు పడుతుంది." అని ప్రహ్లాద్ వైపు చూసి

"ఈ విషయం ఖచ్చితంగా అభీర్ కి తెలుస్తుంది ఆ పిల్లల్ని కాపాడడానికి తప్పకుండా వస్తాడు ఆ ఇద్దరు పిల్లల్ని తీసుకుని జాకి మన బఫర్  గోడౌన్స్ దగ్గరికి వస్తాడు మీరు కూడా అక్కడికి వెళ్లి రెడీగా ఉండండి. వచ్చిన వాళ్ళు ఎవరు తిరిగి వెళ్ళకూడదు." అని చెప్పి ఫోన్ తీసి జాకి కి కాల్ చేసింది అర్ణ.

కాలేజ్ దగ్గర కారులో వెయిట్ చేస్తూ ఫోన్ రింగ్ అవ్వడం చూసి లిఫ్ట్ చేసి "మేడం! చెప్పండి?" అని అడిగాడు జాకి.

"ఆ పిల్లలిద్దరూ కాలేజ్ దగ్గరికి వచ్చారా?" అని అడిగింది అర్ణ.

"ఎస్ మేడం! క్లాసులో ఉన్నారు నేను బయట వెయిట్ చేస్తున్నాను కాసేపట్లో లిజర్ కి గ్రౌండ్ లొకి వస్తారు." అని చెప్పాడు జాకీ.

"గుడ్! నీకు వచ్చిన డౌట్ కరెక్టే! మిత్ర అ అభీర్ మనిషి, ఆ ఇద్దరు పిల్లల్ని కాపాడడానికి సిబిఐ ఆఫీసర్ ని వెంట పెట్టుకుని అక్కడికి వస్తుంది. వాళ్ల కళ్ళముందే ఇద్దరినీ కిడ్నాప్ చేసి మన బఫర్ గోడౌన్స్ తీసుకురా..! అక్కడ ప్రహ్లాద్  రెడీగా ఉంటారు ఎవరు తిరిగి బయటికి వెళ్ళకూడదు." అని చెప్పింది అర్ణ.

ఫోన్లో తను చెప్పింది విని "సూపర్ ప్లాన్ మేడం! ఒక్క దెబ్బకు అన్ని పిట్టలు ఎగిరిపోతాయి." అని నవ్వుతూ ఫోన్ పెట్టేసి తన మనుషులతో కలిసి కాలేజ్లోకి వెళ్ళాడు జాకి.

గెస్ట్ హౌస్ దగ్గర్నుంచి ప్రహల్లాద్ వెళ్లడంతో జాకీ తో ఫోన్ మాట్లాడి పెట్టేసి నెల్సన్ వైపు చూసి " మీరు కూడా బఫర్ గోడౌన్స్  దగ్గరికి వెళ్లి రౌండప్ వేయండి. మీ పని ఏమిటంటే మన వాళ్ళని సేఫ్ గా ఉంచడం.

మీరు అక్కడ ఉన్నట్లు ఎవ్వరికీ తెలియకూడదు వాళ్లలో ఎవరైనా తప్పించుకోవాలని చూస్తే బుల్లెట్ దింపండి." అని చెప్పింది అర్ణ.

"ఓకే మేడం!" అని తన మనుషులతో కలిసి స్నైపర్ గన్స్ తీసుకుని గోడౌన్స్ దగ్గరికి బయలుదేరాడు నెల్సన్.

ముకుల్ వైపు చూసి "తాతయ్య! ఈరోజుతో ఆ అభీర్ సేన పని క్లోజ్! నాయకుడు లేకపోతే అందరు చిన్న భిన్నమవుతారు, ఆవేశంలో ప్రతి ఒక్కరు వచ్చి మనవాళ్ళ చేతిలో చస్తూ ఉంటారు." అని మిస్సైల్ వైపు చూసి

"ఈ రోజు ఆ పని పూర్తి అయ్యే వరకు ఈ గెస్ట్ హౌస్ లో నుంచి ఎవరు బయటికి వెళ్లడానికి వీల్లేదు ఎవరికి ఫోన్లు పని చేయకూడదు." అని ఆర్డర్ వేసింది అర్ణ.

"ఓకే మేడం!" అని గెస్ట్ హౌస్ లో ఫిక్స్ చేసిన జామర్స్ ఆన్ చేశాడు మిస్సైల్.

"మన ఫోన్స్ పని చేయకపోతే జాకీ వాళ్లు ఏదైనా మాట్లాడాలంటే ఎలా కుదురుతుంది?" అని డౌట్ గా అడిగాడు మిథున్.

"నో ప్రాబ్లెమ్ సార్! మేడం ఫోన్ పని చేస్తుంది." అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళాడు మిస్సైల్.

వీల్ చైర్ లో సంతోషంతో ఊగిపోతూ "నీ గురించి మా మిథున్ చెబుతుంటే ఏమో అనుకున్నాను, నీ తెలివి ముందు ఎవడైనా దాసోహం అనాల్సిందే!

ఈ నందా గ్రూప్ సింహాసనానికి నువ్వే కరెక్ట్ గా సరిపోతావు 12 సంవత్సరాల క్రితమే నువ్వు ఉండి ఉంటే గోకుల్ బతికేవాడు ఆ కొండలు మన చేతిలో ఉండేవి." అని చెప్పాడు అభిజిత్.

ఆ మాట విని లేని నవ్వు మొహం మీదకి తెచ్చుకుని "అభిజిత్ గారు కరెక్ట్ గా చెప్పారు." అని వరదరాజులతో పాటు అక్కడి నుంచి లోపలికి వెళుతూ "ఇప్పుడు మనం ఏమీ చేద్దాము. కచ్చితంగా మన ఫోన్స్ కూడా టపింగ్ లో పెట్టి ఉంటుంది. " అని కంగారుగా చెప్పాడు ప్రతాప్ మిశ్ర.

"ఇది మామూలు ఆడది కాదు ఆవిలిస్తే పేగులు లెక్కపెడుతుంది మనం చాలా జాగ్రత్తగా ఉండాలి, ఇప్పుడు మనం చేయగలిగింది ఏమీ లేదు, ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ఫోన్లు కూడా పనిచేయడం లేదు ప్లాన్ సక్సెస్ అయితే మనకి అభీర్ గోల వదిలిపోతుంది." అని చెప్పాడు వరదరాజులు.

"ఒకవేళ ప్లాన్ ఫెయిల్ అయితే అభీర్ కి ఇన్ఫర్మేషన్ ఇవ్వనందుకు ఏదైనా చేస్తాడు." అని చెప్పాడు సుజిత్.

"నాకు తెలిసి ఇక్కడ అభీర్ మనుషులు ఎవరో ఒకరు ఇక్కడ ఉండే ఉంటారు జరిగిందంతా వాళ్ళకి కూడా తెలుసు కదా! ఫోన్లు పని చేయకపోతే మనం మాత్రం ఏం చేస్తాము కనీసం బయటికి వెళ్లడానికి కూడా లేదు." అని చెప్పాడు తంబియార్.

"మనల్ని రాజన్ ట్రాప్ చేశాడు, అర్ణని మిత్ర ట్రాప్ చేసింది మరి మిగతా వాళ్ళని కూడ ఖచ్చితంగా ఎవరో ఒకరు ట్రాప్ చేసే ఉంటారు వాళ్ల గురించి తెలుసుకోవాలి." అని చెప్పాడు ప్రతాప్ మిశ్ర.

ఆ మాట విని "తెలుసుకుని ఏం చేస్తావు ఏంటి?" అని డౌట్ గా అడిగాడు వరదరాజులు.

"మనల్ని ఆ అభీర్ గాడే బ్లాక్ మెయిల్ చేస్తాడా! మనం వాడిని బ్లాక్మెయిల్ చేయలేమా? ఛాన్స్ దొరికినప్పుడు వాడు మన మాట వినాలి అంటే వీళ్ళు మన చేతిలో ఉండాలి." అని చెప్పాడు ప్రతాప్ మిశ్రా.

"డాడ్! నాకు రియా మీద డౌట్ గా ఉంది." అని చెప్పాడు సుజిత్.

"అవునా? ఆలా అయ్యితే దాని మీద ఒక కన్ను వేసి ఉంచుదాము." అని చెప్పాడు తంబీయర్.

అంతలో అక్కడికి వచ్చి "సార్! కాఫీ తీసుకోండి. ముకుల్ సార్ మిమ్మల్ని రమ్మంటున్నారు." అని చెప్పాడు వంట మనిషి రాము.

కాఫీ తీసుకుంటూ "నువ్వు వంట చేయడంలో అంత పోటుగాడివా? లండన్ నుంచి తీసుకువచ్చారు." అని వెటకారంగా చూస్తూ అడిగాడు వరదరాజులు.

ఆ మాటకి నవ్వుతూ "ఎస్ సార్! నా చేతివాటం ఎలా ఉంటుందో త్వరలోనే మీరు టేస్ట్ చేస్తారు, కాఫీ ఎలా ఉంది సార్?" అని అడిగాడు రాము.

"హ..బాగుంది కొంచెం షుగర్ వేస్తే ఇంకా బాగుండేది." అని చెప్పాడు ప్రతాప్ మిశ్ర.

"మీ జీవితాలలో నుంచి దూరమయ్యే దానిని ఎక్కువగా తీసుకోకూడదు అందుకే తీపి తక్కువగా వేసాను." అని సీరియస్ గా చూస్తూ చెప్పి

"అదే సార్! షుగర్ జబ్బు వస్తుంది." అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళి గార్డెన్ లో ఉన్న పక్షులకి గింజలు వేస్తూ వింత శబ్దం చేస్తూ ఉన్నాడు రాము.

కాఫీ తాగుతూ "ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కడు వెరైటీ క్యాండిడేట్స్ లాగ ఉన్నారు, ఆ వంటవాడు  పక్షులకి తిండివేస్తూ ఎలా అరుస్తున్నాడో చుడండి." అని చికాకుగా చూస్తూ చెప్పాడు వరదరాజులు.
[+] 12 users Like SivaSai's post
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.


Messages In This Thread
RE: వేదం - by Manmadhsbanam143 - 22-12-2025, 04:13 PM
RE: ఖైదీ నెంబర్ 402 - నా మాటే శాసనం - by SivaSai - 11-02-2026, 08:09 AM



Users browsing this thread: 1 Guest(s)