11-02-2026, 08:06 AM
ఎపిసోడ్ 71
ఫ్యాక్టరీ దగ్గర నుంచి వెళ్లడానికి కార్ దగ్గరికి వెళ్లిన వరదరాజుల వైపు చూసి రేపు జూ లొ ఉన్న జంతువులు మొత్తం బేరా అడవికి పంపడానికి పర్మిషన్ తెప్పించాలి వివరాలు మొత్తం రాజన్ చెబుతాడు అని చెప్పాడు అభీర్.
*******************
అభీర్ చెప్పిన మాట విని "జూలో ఉన్న జంతువుల్ని అడవికి పంపించాలా? దానికి పర్మిషన్ నేను తీసుకొస్తే ముకుల్ కి అనుమానం వస్తుంది." అని చెప్పాడు వరదరాజులు.
"నీ మీద ఎవరికీ అనుమానం రాకుండా ఏం చేయాలో రాజన్ చెప్తాడు." అని కారు దగ్గరికి వెళ్లి నలుగురు వైపు చూస్తూ
"ఇక్కడి నుంచి ప్రాణాలతో బయటపడ్డాము కదా అని పిచ్చి పిచ్చి వేషాలు వేశారో నా మనుషులు ప్రతి చోటా ఉంటారు తేడా జరుగుతుంది అని తెలిసిన మరుక్షణం మీ గొంతులో కత్తి దిగుతుంది. శాంపిల్ చూస్తారా?" అని చెప్పి చనిపోయిన ఎనిమిది మంది వైపు చూసి "ఇంకా లెగండి." అని చెప్పాడు అభీర్.
ఆ మాట విని కింద పడ్డవాళ్ళు పైకి లేచి నుంచోవడం చూసి "వీళ్ళు చనిపోలేదా?" అని కంగారుగా అడిగాడు ప్రతాప్ మిశ్రా.
"మీలాంటి అవకాశం వాదుల కోసం మా మనుషులు ఎందుకు పోతారు, నా మాట విని బుద్ధిగా ఉండండి ప్రాణాలతో ఉంటారు ఇంక వెళ్ళండి." అని చెప్పి డ్రైవింగ్ సీట్లో ఉన్న సుజిత్ వైపు చూసి "కార్ స్టార్ట్ చెయ్!" అన్నాడు అభీర్.
"సరే!" అని కారు స్టార్ట్ చేసి స్పీడ్ గా అక్కడి నుంచి బయటికి వెళ్లాడు సుజిత్.
అక్కడినుంచి కారు వెళ్లడంతో అభీర్ వాళ్ళ వైపు చూసి "ఇదంతా మీరు వేసిన ప్లాన్ ఆ..! ఒక్క క్షణం గుండె ఆగిపోయింది." అని టెన్షన్ గా చూస్తూ చెప్పింది నీలమ్.
"అందుకే కదా మీ ఇద్దరి బదులు మల్లి నీ కిడ్నాప్ చేసి తీసుకువచ్చారు." అని నవ్వుతూ చెప్పాడు అభీర్.
"అబ్బో.. నీకు నవ్వడం కూడా వచ్చా, నిజంగా వాళ్ల మనుషులే నన్ను కిడ్నాప్ చేస్తే కాపాడడానికి వచ్చేవాడివా?" అని అడిగింది నీలమ్.
"నా అనుకున్న వాళ్ళని వదిలి వెళ్లి ఒక్కసారి తప్పు చేశాను మళ్ళీ అటువంటి తప్పు చేయను." అని చెప్పాడు అభీర్.
"అవును! రియల్ గన్ తో షూట్ చేసిన మీ మనుషులు చావలేదేమిటి?" అని అనుమానంగా అడిగింది సుమతి.
"ఆ గన్ రియల్ కానీ బుల్లెట్స్ డమ్మీ! మల్లి గన్ హ్యాండిల్ చెయ్యడం లొ ఎక్స్పర్ట్, కుమార్ చేతిలో నుంచి గన్ తన చేతిలోకి తీసుకునేటప్పుడే మ్యాగజైన్ మార్చి తన దగ్గర ఉన్న మ్యాగజైన్ ఫిక్స్ చేసింది." అని చెప్పాడు జాజి.
"ఆ వరదరాజులు వాళ్ళ చుట్టు నిజంగా మీ మనుషులు ఉన్నారా?" అని డౌట్ గా అడిగింది సుమతి.
ఆ మాటకి నవ్వి "మల్లి! ఇద్దరిని జాగ్రత్తగా ఇంటికి తీసుకువెళ్లు నువ్వు సుమతీ దగ్గర ఉండు." అని చెప్పాడు అభీర్.
"మరి నా మీద ఎవరైనా అటాక్ చేస్తే!" అని అనుమానంగా అడిగింది నీలమ్.
"శంకర్ మీ ఇంటి దగ్గరే ఉంటున్నాడు నీకు ఎటువంటి భయం లేదులే!" అని చెప్పాడు అభీర్.
"సరే!" అని స్మైల్ ఇచ్చి స్కూటీ ఎక్కి స్టార్ట్ చేసి "రెండు రోజుల్లో అడవిలో షూటింగ్ స్టార్ట్ చేయాలి." అని చెప్పింది నీలమ్.
"సరే! దానికి కావలసిన ఏర్పాట్లు జరుగుతున్నాయి జూలో ఉన్న జంతువులు అడవికి వెళ్లగానే మిమ్మల్ని పంపిస్తాను." అని చెప్పాడు అభీర్.
గన్ లొ ఒరిజినల్ మ్యాగజైన్ పెట్టి కుమార్ కి ఇచ్చి స్కూటీ ఎక్కింది మల్లి.
గన్ లోపల పెట్టుకుని "అభీర్ భయ్యా! వాళ్లు రాజకీయ నాయకులు మేము నార్మల్ సెక్యూరిటీ ఆఫీసర్లము మాకు ఎటువంటి ప్రాబ్లం ఉండదు కదా!" అని అడిగాడు కుమార్.
"మీ గురించి వాళ్లు ఆలోచిస్తే నేను వాళ్ల గురించి ఆలోచిస్తాను భయపడకుండా వెళ్లి మీ డ్యూటీ మీరు సక్రమంగా చేయండి." అని చెప్పాడు అభీర్.
అభీర్ దగ్గరికి వచ్చి "నిన్ను మళ్ళీ చూడడం చాలా హ్యాపీగా ఉంది. వాళ్ళు మమ్మల్ని ఏమి చేయలేరు ఎందుకంటే నువ్వు మాకు అండగా ఉంటావు అని వాళ్ళకి తెలుసు!" అని చెప్పి కుమార్ తో కలిసి బయలుదేరడు శక్తి దాస్.
నారప్ప వాళ్ళతో కలిసి బయలుదేరుతూ "రాజన్! అడవి నుంచి వచ్చిన ప్రతి జంతువు మళ్ళీ అక్కడకు వెళ్ళిపోవాలి మళ్లీ అవి స్వేచ్ఛగా సంతోషంగా ఉండడం నేను చూడాలి." అని చెప్పాడు అభీర్.
"సరే నాయకుడా! నేను అదే పనిలో ఉంటాను మీరు బయలుదేరండి." అని చెప్పి తన మనుషుల వైపు చూసి "బళ్ళు తీయండి మనం కూడా బయలుదేరుదాము." అని చెప్పాడు రాజన్.
******************
ఫ్యాక్టరీ దగ్గర నుంచి వరదరాజుల ఇంటికి కారులో వెళుతూ "డాడ్! మనం ఆ అభీర్ గాడికి భయపడాలా?" అని కోపంగా అడిగాడు తంబియార్.
"మనం రాజకీయ నాయకులము అందితే జుట్టు అందకపోతే కాళ్లు మన పబ్బం గడుపుకోవడానికి ఏదైనా చేయాలి ప్రస్తుతానికి కాళ్లు పట్టుకున్నాము జుట్టు అందకుండా ఉంటుందా!
ప్రస్తుతం వాడి టైం నడుస్తుంది కాదు అంటే ఎవరో ఒకరి చేతిలో చావడం కన్ఫామ్! మన టైమ్ వచ్చేవరకు సైలెంట్ గా ఉండు." అని చెప్పాడు వరదరాజులు.
"బాబోయ్.. వాడి మనుషులు మామూలు వాళ్ళు కాదు ఆ రాజన్ గాడు నాకు ఆరు సంవత్సరాలుగా పరిచయం నా ప్రతి విషయం వాడికి తెలుసు ఇంత మోసం చేస్తాడని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు.
మనం చాలా జాగ్రత్తగా ఉండాలి అభీర్ మనుషులు ఎక్కడైనా ఉండొచ్చు అంత ఎందుకు మీ ఇంట్లో వంటవాడు కూడా వాళ్ళ మనిషి అయి ఉండొచ్చు చెప్పలేము కదా!" అని కళ్ళు పెద్ద చేసుకుని చెప్పాడు ప్రతాప్ మిశ్రా.
"ఆ రాజన్ మోసం చేశాడు అంటున్నావు మరి మనం చేసేది ఏంటి మోసం కాదా! ప్రస్తుతానికి వాళ్లకి హెల్ప్ చేయడమే మన దగ్గర ఉన్న మార్గం తరువాత ఏం చేయలో చూద్దాము ఆ అర్ణ కి అనుమానం రాకుండా ఉండండి." అని చెప్పాడు వరదరాజులు.
కార్ డ్రైవ్ చేస్తూ "డాడ్! మన చుట్టూ అభీర్ మనుషులు ఉన్నారు అంటే, ఇంక నంద ఫ్యామిలీ అభిజిత్ ఫ్యామిలీ చుట్టూ కమ్మేసి ఉంటారు కదా!
వాళ్లు అది తెలియక పిచ్చిపిచ్చి ప్లాన్లు వేస్తున్నారు. నాకు తెలిసి అందర్నీ వాడు చంపేస్తాడు ఆస్తులు మొత్తం నా పేరు మీదే పవర్ ఆఫ్ అటార్నీ ఉన్నాయి కాబట్టి మనం అభీర్ చెప్పినట్లు వినడం బెటర్ !" అని చెప్పాడు సుజిత్.
"అవును! మనం ఆబీర్ కి కాస్త సహాయం చేస్తే అందరినీ లేపేస్తాడు నాకు రాజకీయంగా అడ్డుపడే అభీజిత్ ఫ్యామిలీ కూడా ఉండదు." అని సంతోషంగా చూస్తూ చెప్పాడు తంబియార్.
"సరే! ముందు ఆ జూలో జంతువుల్ని అడవిలోకి పంపించే పర్మిషన్ ఏర్పాట్లు ఏమిటో చూడు లేకపోతే నలుగురిలో ఎవరో ఒకరి గొంతులో కత్తి దిగుతుంది." అని భయంగా చూస్తూ చెప్పాడు ప్రతాప్.
"ఆ పర్మిషన్ ఇప్పించడం ఈజీయె, కానీ అది చేస్తే మన మీద ఖచ్చితంగా ముకుల్ వాళ్లకి డౌట్ వస్తుంది దానికి రాజన్ ఏ ఐడియా ఇస్తాడో చూడాలి." అని చెప్పాడు వరదరాజులు.
*****************
ఉదయం ప్రహల్లాద్ కలిసి అర్ణ దగ్గరికి వచ్చి "మేడం! మీ అనుమానం నిజమే! ఆ మిత్ర ఎవరో కాదు శివమణి కూతురు తనని చిన్నప్పుడే అభీర్ అనాధ ఆశ్రమంలో జాయిన్ చేశాడు." అని చెప్పాడు జాకీ.
ఆ మాట విని షాక్ అయ్యి మిథున్ వైపు చూసి "నీకు మిత్ర ఎలా పరిచయం?" అని అడిగింది అర్ణ.
"తను ఐబి ఇన్ ఫార్మర్ గా వర్క్ చేసేది నాకు రెండుసార్లు హెల్ప్ చేసింది ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడమే కదా అని నీకు పరిచయం చేశాను." అని చెప్పాడు మిథున్.
"నాకు తెలిసి ఆ మిత్ర మాత్రమే కాదు మన చుట్టూ చాలామంది ఉండి ఉంటారు, మనవాళ్లు ఇండియాలో ఎవరెవరితో టచ్ లో ఉన్నారో అందరి మీద ఎంక్వైరీ పెట్టండి." అని చెప్పాడు ముకుల్.
"మరి ఎప్పుడు ఆ మిత్రని ఏం చేద్దాము?" అని అడిగాడు జాకి.
"మిత్ర మన దగ్గరికి అభీర్ పంపితేనే వచ్చిందా లేక మామూలుగా వచ్చిందా ముందు అది తెలుసుకోవాలి." అని చెప్పింది అర్ణ.
"అలా అయితే తనకి ఒక ఇన్ఫర్మేషన్ ఇస్తాను అది బయటికి వెళ్లింది అంటే తను అభీర్ మనిషి అని కన్ఫామ్ అవుతుంది. అప్పుడు జాగ్రత్తగా ఏదైనా ప్లేస్ కి పిలిచి క్లోజ్ చేసేయండి." అని చెప్పి
తాగిన కప్పు టేబుల్ మీద పెడుతూ జారి కింద పడి తీయబోయి లైట్ వెలగడం చూసి 'సైలెంట్ గా ఉండండి.' అని సైగ చేసి అక్కడ ఉన్నా మైక్రో స్పీకర్ బయటకు తీసి కాలు కింద పెట్టి తొక్కి "కచ్చితంగా ఇక్కడ కూడా అభీర్ మనుషులు ఉన్నారు, ముందు వాళ్ళు ఎవరో తెలుసుకోండి." అని చెప్పాడు మిథున్.
"అంటే! ఇప్పుడు వరకు మనం మాట్లాడిన మాటలు వాళ్ళు వింటూ ఉన్నారా?" అని కంగారుగా అడిగింది అర్ణ.
"టెంక్షన్ పడకండి మేడం! ఇలాంటిది ఏదో జరుగుతుంది అని మార్నింగ్ జామర్స్ ఏర్పాటు చేయించారు ఇక్కడ ఎటువంటి ట్రాన్స్మిషన్స్ పనిచేయవు." అని చెప్పాడు మిస్సైల్.
"గుడ్! ఈ మైక్రో ట్రాన్స్ మిషన్ పెట్టింది ఎవరో కూడా తెలుసుకోండి. ఇకనుంచి ప్రతి ఒక్కరిని అనుమానంగా చూడండి. ముందు ఆ మిత్ర విషయం ఏమిటో తెలుసుకోండి." అని చెప్పింది అర్ణ.
"ఆ విషయం నేను చూసుకుంటాను." అని చెప్పి ఫోన్ తీసి మిత్రకి కాల్ చేశాడు మిథున్.
ఫోన్ లిఫ్ట్ చేసి"హాయ్ సార్!" అని చెప్పింది మిత్ర.
"హో.. సారీ జాకీ కి చేయబోయి నీ నెంబర్ టచ్ అయినట్టు ఉంది. అది సరే మురళి జోషి రెండో కూతురు, లాయర్ వసుంధర కూతురు ఏ కాలేజ్లో చదువుతున్నారో నీకేమైనా తెలుసా?" అని అడిగాడు మిథున్.
ఆ మాట విని "నాకు అంత ఐడియా లేదు సార్! తెలుసుకుని చెప్పమంటే చెబుతాను ఎందుకు సార్?" అని అనుమానంగా అడిగింది మిత్ర.
"ఎందుకు అంటావు ఏమిటి! కొన్నిసార్లు పని జరగాలంటే ఫ్యామిలీని టార్గెట్ చేయక తప్పదు సరే ఉంటాను మనవాళ్లే చూసుకుంటారులే!" అని చెప్పి ఫోన్ పెట్టేసి జాకి వైపు చూసి "ఇప్పుడు నువ్వు ఏం చేయాలో తెలుసు కదా!' అని చెప్పాడు మిథున్.
"ఎస్! ఇంకా నేను చూసుకుంటాను." అని చెప్పి అక్కడినుంచి తన మనుషులతో బయలుదేరాడు జాకీ.
ఫోన్ పెట్టేసి హడావుడిగా బైక్ స్టార్ట్ చేసి చాక్లెట్ ఎక్కించుకుని ఫాస్ట్ గా వెళ్ళింది మిత్ర.

![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)