11-02-2026, 08:03 AM
Part - 90
చెప్పు నేహా ఏదో అనుమానం పడుతున్నట్టున్నావు. ఆడపిల్ల అంటే అమ్మని అడిగి సలహాలు తీసుకొని ముందుకు ఎలా వెళ్లాలి అని ఆలోచిస్తుంది. అబ్బాయి పేరెంట్స్ అలాగాఉండరు కదా.
ఎందుకు ఉండరు.. ఉండరు అని ఎవరు చెప్పారు నీకు. మన ఊరిలోనే ఒక అమ్మాయి పెళ్లి అయిన తర్వాత పుట్టింటికి వచ్చేసింది కదా తను అన్నది.
ఒకవైపునే విని అదే నిజమని అనుకోకూడదు అమ్ములు. నీకు ఒక ఉదాహరణ చెప్పనా.. మా పెళ్లయిన కొత్తలో నానమ్మ తెలిసిన పెళ్లి అని వెళ్ళింది.
వచ్చిన నాలుగు రోజుల వరుకు అమ్మ మీద రుసరసలాడుతూ ఉంది. ఏమైందో మాకు ఎవరికీ అర్థం కాలేదు.
మీ అమ్మకంతా కొత్త కదా ఎందుకు మీ నానమ్మ అలా ప్రవర్తిస్తున్నారో అర్థం కాక భయం భయంగా ఉండేది. ఇక ఒక రోజు నాకే విసుగు వచ్చి.. ఏమైందమ్మా..
ఎందుకలాఉన్నావు. పెళ్లికి వెళ్లి వచ్చినప్పుడు నువ్వు అలా చిరాకుగా ఉన్నావు అని అడిగితే...మా అమ్మ చెప్పింది విని నేను ఆశ్చర్యపోయాను.
ఏం చెప్పి ఉంటుందో గెస్ చేయగలవా అని అడుగుతారు. తెలియదు అంటే.. ఇప్పటికి మీ అమ్మ నీకు ఆ విషయం చెప్పలేదు కదా అని.
మీ నానమ్మ ఒక పెళ్ళికి వెళ్ళింది కదా...ఆ పెళ్ళికూతురు కట్నం ఎక్కువ తెచ్చుకుంది అంట. ఘనంగా సారేతో వచ్చిందంట.
అది మీ అమ్మతో కంపేర్ చేసుకుని.. నా కొడుకుకి కొన్ని రోజులు ఆగి ఉంటే ఇంకా మంచి సంబంధం వచ్చేది కదా.. తొందరపడి ఈ పెళ్లి చేసాను అని మాట్లాడింది..
ఆ మాటలు విని మీ అమ్మ చిన్నబుచ్చుకుంది. బాధపడింది. కోపం కూడా వచ్చింది కానీ ఎవరి మీద చూపించాలో తెలియక తనమీద తానే చూపించింది.
అన్ని పనులు చేసేది కానీ ఏమీ తినేది కాదు. నేను ఎంత నచ్చజెప్పినా సరే తినాలనిపించడం లేదు అని ఏదో ఒక పనిలో పడిపోయేది.
మా అమ్మ కూడా ఆకలేస్తే అదే తింటుందిలే అన్న నిర్లక్ష్యంగా ఉండేది. ఇప్పుడు ఉన్నంత స్వేచ్ఛ అప్పుడు భార్యాభర్తలకి ఉండేది కాదు కదా..
అందుకే మా అమ్మ ముందు నా భార్యకి ఏమీ చేయలేకపోయావాడిని. చాలా ఇబ్బందిగా అనిపించేది. ఈ ప్రాబ్లం ఎలా సాల్వ్ చేయాలో కూడా నాకు అర్థం అయ్యేది కాదు.
అలా మూడు రోజులు గడిచిపోయాయి. సడన్గా ఊరి నుంచి మీ అమ్మమ్మ తాతయ్య వచ్చారు. కూతుర్ని అలా చూసిన మీ అమ్మమ్మ చాలా కంగారు పడిపోయింది.
ఏమైందమ్మా ముఖమంత ఇలా పీక్కుపోయింది అని కంగారుగా అడిగితే..నాకు చాలా టెన్షన్ వచ్చింది. మొదటిసారి మా అమ్మ కూడా ఇబ్బంది పడింది. నిజంగానే మూడు రోజుల నుంచి పట్టించుకోలేదు అని తనను తానే తిట్టుకుంది .
ఇప్పుడు కోడలు జరిగిందంతా చెబితే వియ్యంకులు ముందు తన పరువు పోతుంది. రేపటి నుంచి తనని ఎలా చూస్తారు అని మా అమ్మ కొంచెం గిల్టీగా చూస్తుంది.
మీ అమ్మ ఏం చెప్పిందో తెలుసా... జ్వరం వచ్చి లంకణాలు చేశాను. అంత మా అత్తగారే పని చేసుకుంటున్నారు.
నాకు ఆర.. ఆర....గా జావలు కాచి కూడా ఇస్తున్నారు అమ్మ అని చెప్పింది. ఆ మాటకి నా మనసు నిండిపోయింది. మా అమ్మ చేసిన తప్పేంటో తనకి అర్థమయింది.
మీ అమ్మమ్మ.. మీ నానమ్మ చేతులు పట్టుకొని మీలాంటి అత్తగారు దొరుకడం నా కూతురు అదృష్టం వదినగారు అని కంటతడి పెట్టుకున్నారు.
ఆ రోజు నుంచి ఎప్పుడు మీ నానమ్మకి, మీ అమ్మకి మధ్యనా మనస్పర్ధలు రాలేదు. చిన్న చిన్నవి వచ్చిన సరే వెంటనే సర్దుకునేవారు.
కానీ ప్రస్తుతపు రోజుల్లో ఎలా ఉన్నారు. ఒక చిన్న తుమ్ము తుమ్మినా సరే... వెంటనే ఫోన్ చేసి అమ్మ... మా ఆయన ఇలాగ అన్నారు. మా అత్తగారు నా చీరకి వంక పెట్టారు లేకపోతే ఇంకోటి ఇంకొకటి అని చిన్నదాన్ని కూడా భూతద్దంలో పెట్టి చూపిస్తున్నారు.
అమ్మాయి తల్లిదండ్రులు కూడా కూతురు నిజంగానే అక్కడ కష్టపడిపోతుందేమో అనుకుని.. నువ్వు ఏమీ లెక్క చేయనవసరం లేదు.
నీకేమి తక్కువ. నువ్వు ఉద్యోగం చేస్తున్నావు. సంపాదిస్తున్నావు. నువ్వు అన్నది ఒప్పుకోకపోతే గొడవ పెట్టుకుని వచ్చేసేయ్. వెనకాల మేము ఉన్నాము కదా అని రెచ్చగొడుతున్నారు.
కానీ ఏం జరిగిందమ్మా.. అసలు ఏమైంది అని నెమ్మదిగా మాట్లాడే తల్లిదండ్రులు ఎంతమంది ఉన్నారు. ఒకప్పుడు అత్త కోడళ్ళతో పోల్చుకుంటే ఇప్పుడు అత్తా కోడళ్ల మధ్యన అన్ని గొడవలు ఉండడం లేదు.
భార్యాభర్తల మధ్యనైనా సరే.. కానీ ప్రతి చిన్నదాన్ని ఇప్పుడు భూతద్దంలో చూస్తున్నారు. అప్పుడు ఎంత పెద్ద విషయమైనా సరే గడప దాటనిచ్చేవారు కాదు.
అందుకే ఆ రోజుల్లో కుటుంబాలు నిలబడ్డాయి. ఈరోజుల్లో ఎవరికి వారే యమునా తీరే అన్నట్టుగా ఉన్నారు.
ఒక్క విషయం గుర్తు పెట్టుకో అమ్ములు.. నేను మాత్రమే గెలవాలి అనుకుంటే.. అందులో ఉండే సంతోషము తక్కవే.. ఉండేది నువ్వు ఒక్కదానివే.
అదే నువ్వు గెలుస్తూ నీ భర్తను కూడా గెలిపిస్తున్నావు అనుకో... అందులో సంతోషం ఎక్కువే... కుటుంబం కూడ ఉంటుంది అని చెబుతారు.
ఎలా అనే నేహా చూస్తూ ఉంటే... అర్థం కాలేదు కదా నీకు ప్రాక్టికల్ గా చూపిస్తాను ఉండు అని చుట్టూ చూస్తూ ఉంటారు.
శ్రీను గారికి పారిజాతం చెట్టు కనబడుతుంది. అమ్ములు నువ్వు వెళ్లి అక్కడ ఉన్న ఆ పువ్వులని ఒక్క చేత్తోనే తీసుకో. రెండో చేయి ఎట్టు పరిస్థితుల్లోనూ ఉపయోగించవద్దు అని చెబుతారు.
సరే అని వెళ్లి ఒక చేతికి ఎన్ని పువ్వులు అయితే దొరుకుతున్నాయో అన్ని పట్టుకుని వచ్చి చూపిస్తుంది.
ఎన్ని ఉన్నాయి నేహా అని అడిగితే.. చాలా తక్కువ వచ్చాయి అని చెబుతుంది. సరే ఈ పువ్వులు ఇక్కడ పెట్టి మళ్ళీ వెళ్ళి నీ రెండు చేతులతో నువ్వు ఎన్ని తీసుకురాగలవో అని తీసుకురా అని చెబుతారు.
ఈసారి రెండు చేతుల నిండా తీసుకుని వస్తుంది. ఇప్పుడు ఎన్ని ఉన్నాయి అంటే.. ఇందాకటి కన్నా ఎక్కువ ఉన్నాయి అని చెబుతోంది. సరే అని ఆ పువ్వులు కూడా అక్కడ పెట్టమని చెబుతారు.
ఇప్పుడు నీ చున్నీలో ఎన్ని తీసుకురాగలవో అన్ని తీసుకురా అని చెబుతారు. ఈసారి ఆ చెట్టు కింద ఉన్న పువ్వులే కాకుండా పక్క చెట్టు దగ్గర ఉన్న పువ్వులు కూడా వేసుకుని తెస్తుంది.
అది చూసి శ్రీను గారు నవ్వుతూ అదేంటి అమ్ములు.. నిన్ను ఈ చెట్టు కిందే కదా తెమ్మన్నాను. మరి ఆ చెట్టు కింద కూడా ఎందుకు తెచ్చావు అని అడుగుతారు.
చున్నీలో ఈ పువ్వులు వేసిన తర్వాత చాలా ఖాళీ ఉంది. అందుకే ఆ చెట్టు కింద ఉన్న పువ్వులు కూడా ఇందులో వేశాను అని చెబుతుంది. అవి కూడా ఈ పక్కన పెట్టు అని చెబుతారు.
ఇప్పుడు చెప్పు ఎక్కడ ఎక్కువ పువ్వులు ఉన్నాయి అని అడిగితే చున్నీలో తెచ్చిన పువ్వులను చూపిస్తుంది ఇప్పుడు అర్థమైందా..
మొదటి తెచ్చిన పువ్వులు నేను మాత్రమే గెలవాలి అనుకున్నది. రెండోసారి తెచ్చిన పువ్వులు నువ్వు నీ భర్త కలిసి గెలవాలి అనుకున్నది. మూడోసారి తెచ్చిన పువ్వులు నీ కుటుంబం మొత్తం గెలవాలి అని ఉన్నది.
ఇక్కడ నీకు అర్థం కాని విషయం ఏమిటంటే.. ఈ మూడిట్లో కూడా నువ్వు ఉన్నావు. నువ్వు లేకుండా ఈ మూడు లేవు.
ఒక్కొక్కసారి ఆడవాళ్ళకి అనిపిస్తూ ఉంటుంది. ఇందులో నేను ఎక్కడ ఉన్నాను అంతా నా భర్త, నా కుటుంబమే కదా ఉన్నారు. కానీ మీకు తెలియకుండానే మీరు వాడే పదం... నా... అన్న పదం.
ఆ పదంలోనే మీరు ఉన్నారు అని మీరు గుర్తించగలిగితే చాలు. మన శరీరంలో కూడా మన వెన్నుముక కనిపించదు.
కానీ వెన్నెముకకి ఏదైనా జరిగితే అన్ని అవయవాలు సరిగా పనిచేసిన సరే ఆ మనిషి సరిగ్గా నిలబడలేడు. అలాగే ఇంటి ఇల్లాలు బాధ్యత కూడా వెన్నుముక లాంటిదే.
నువ్వు జాబ్ చేస్తున్నావు కదా.. మీ ఆఫీస్ లో కూడా టీం వర్క్ చేస్తూ ఉంటారు కదా.. ఎందుకని అని అడుగుతారు. టీం వర్క్ చేస్తే ప్రాజెక్ట్స్ తొందరగా అవుతాయి. అలాగే ప్రాబ్లంస్ కూడా తొందరగా సాల్వ్ చేస్తాము. నాలెడ్జ్ పెరుగుతుంది అని చెబుతుంది.
మీరు సరిగ్గా వర్క్ చేయకపోతే... మీ బాస్ తిడతారు కదా అప్పుడు ఎలా ఫీలవుతారు. కొంచెం బాధగానే అనిపిస్తుంది.
ఇంత హార్డ్ వర్క్ చేసిన మిస్టేక్స్ వస్తున్నాయి అని ఫీల్ అవుతాము. అది ఎలా సాల్వ్ చేయాలి అన్నది ఆలోచిస్తాము అంటుంది.
అంతేగాని మీరు జాబ్ మానేయరు కదా అని అడుగుతారు. అలా మానేస్తాము నాన్నగారు. మరి మీ బాస్ తిడితే మానేయాలి కదా..
చిన్నప్పటినుంచి కష్టపడి చదువుకున్నాము. మంచి శాలరీ తో జాబ్ చేస్తూ. లైఫ్ లో సెటిల్ అవ్వాలి అన్న గోల్ తో ఉన్నప్పుడు ఇలాంటివన్నీ పట్టించుకుంటే ముందుకు ఎలా వెళ్ళగలుగుతాము .
మీ బాస్ ఒక మాట అన్నా సరే నెల అయ్యేటప్పటికి వచ్చే జీతం చూసుకునేటప్పుడు... ఇది మీ ఇద్దరి జీవితం. మరి మీ ఇద్దరూ ఎలా ఉండాలి. నువ్వే ఆలోచించుకో అని చెబుతారు.
నేహా... వాళ్ళ నాన్నగారు వైపు చూస్తూ.. మీరు చెప్పే ప్రతి మాట చాలా వాల్యుబులే కాదని అనను. కానీ మనం ఎన్ని ప్రయత్నాలు చేసినా సరే అటు నుంచి... సరైన రెస్పాండ్ లేకుండా ఇబ్బంది పెడుతూ ఉంటే అప్పుడే ఏమి చేయాలి అని అడుగుతుంది.
మంచి ప్రశ్న వేశావు నేహ..
నేను వ్యవసాయం మొదలు పెట్టినప్పుడు మనపొలం అంతా కూడా సాగులో లేదు.
కొంత పొలం దిబ్బలతోనూ, కంచెలతోను ఉండేది. అది బాగు చేసేటప్పుడు నా చేతికి చాలా గాయాలు అయ్యాయి.
ఒక్కొక్కసారి ముళ్ళు కూడా గుచ్చుకునేవి. తినడానికి కూడా చేతులు సహకరించేది కాదు. అయినా ఇది నా పొలం. నేను కష్టపడితేనే నా పొలం ఇంకా బాగుంటుంది అని శ్రమ అనుకోకుండా నా పొలాన్ని బాగు చేసుకున్నాను.
ఈ రోజు అదే పొలం బంగారాన్ని పండిస్తుంది. ప్రతి చోట సమస్యలు ఉంటాయి. దాన్ని మనం ఎంత చాకచక్యంగా సాల్వ్ చేసాము అన్నదాని మీదే... మన నేర్పరితనం ఉంటుంది.
ఏదైనా సమస్య వచ్చినప్పుడు నీ వంతుగా నువ్వు ప్రయత్నం చేయి. అది నీవల్ల కానప్పుడు ఖచ్చితంగా నీ వెంట ఎప్పుడూ మేమందరము ఉంటాము అని చెబుతారు.
థాంక్స్ నాన్న.. కచ్చితంగా మీరు చెప్పినట్టుగానే నేను నడుచుకుంటాను.
❤️❤️❤️❤️❤️

![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)