10-02-2026, 07:39 AM
Part - 87
నివి కారు దిగి లెహంగా ని రెండు పక్కల చేతితో కొంచెం పైకి పట్టుకుని మెల్లిగా అడుగులో అడుగు వేస్తూ నడుస్తూ ఉంటుంది.
నేనేమైనా హెల్ప్ చేయనా.. ఇబ్బంది పడుతున్నావా అని కన్సర్న్ చూపిస్తూ ఉంటాడు. పరవాలేదు రాజ్.. మెల్లిగా నడు. ఇక్కడ అడుగు వెయ్యి.. అక్కడ కొంచెం డస్ట్ ఉంది అని చెబుతూ మెల్లిగా నడిపిస్తూ ఉంటాడు.
ఇద్దరు గుమ్మం దగ్గరకు వచ్చేటప్పటికి విక్రమ్, శ్రీ చేతులు కట్టుకుని చూస్తూ ఉంటారు. నివి ఇద్దరిని చూస్తూ హాయ్ అన్నయ్య అని విక్రమ్ ని హగ్ చేసుకుని...
ఏంటండీ కొత్త పెళ్ళికొడుకు గారు.. లోపల ఉండకుండా ఇలా బయట ఎండలో నిలబడ్డావు అంటే.. కొన్ని కొన్ని వింతలు చూడాలంటే ఎండలో ఏంటి.. ఎక్కడైనా నిలబడవచ్చు అంతేనా రాజ్ అంటాడు.
రాజ్ కి పరిస్థితి అర్థం అయ్యి ఏమో నాకేం తెలుస్తుంది. ఆ వింతల గురించి అని... నువ్వు లోపలికి వెళ్ళి నివి అని చెప్పి పంపించి...
ఏంట్రా ఇద్దరు నా వైపు అలా చూస్తున్నారు అంటే.. సూటిగా చూస్తూ ఉంటారు. ఆ చూపులో ఎటువంటి మార్పు ఉండదు
సరే.. సరే... మీ చూపుల్లో బావమెంటో అర్థమైంది. ఎన్నో అనుకుంటాము అన్ని అవ్వాలని లేదు కదా అని ఎటో చూస్తూ చెబుతాడు. అయినా ఇద్దరూ కదలకుండా చూస్తూ ఉంటారు.
ఇంకా లాభం లేదు అనుకోని రెండు చేతులతో నమస్కారం చేసి బెండ్ అయ్యి ముజే మాఫ్ కరో అంటాడు అంతే... ఇద్దరూ ఒకరినొకరు చూసికుని వీపు మీద గుద్దిన గుద్దకుండా గుద్దుతారు.
అబ్బ వదలండి రా..... మీకు దండం పెడతాను. మరి ఇంత కోపం చూపిస్తున్నారు ఏంట్రా అని బ్రతిమాలతూ ఉంటే... మాది కోపం కాదు రా ఆవేదన అంటాడు.
విక్రమ్ వియర్ట్ గా చూస్తూ ఇవేం కొత్త పదాలు రా అంటే... ఏదో బాగుంది కదా అని వాడేసాను. సూట్ అవ్వలేదా అని అడుగుతాడు.
కర్మ రా బాబు... ఎప్పుడు ఏం మాట్లాడతావో ఇప్పటికి వైనం లేదు. అయితే ఇక్కడ డైలాగ్ ఏంటో నువ్వే చెప్పు నేను సైలెంట్ గా ఉంటాను అని శ్రీ నోటి మీద చేయి వేసుకుంటాడు.
ఏరా నా ముందు నా చెల్లికి సైట్ కొడుతున్నావా అని చెయ్యి మెలిపెడుతూ ఉంటే.. ఒరేయ్ సైట్ కొట్టడం లేదు రా.. లవ్ లో దింపుతున్నాను.
అయినా నీకు ఏమీ తెలియనట్టుగా మాట్లాడుతావేంటి.. నీకు మొదటి రోజు నుంచి అన్ని అర్థమే కదా... ఆహ... నాకు అర్థమైతే...నా ముందే రెచ్చిపోతున్నావా..
పోనిలే ఫ్రెండ్ అని ఊరుకుంటుంటే అని కొంచెం గట్టిగా పట్టుకుంటాడు. అబ్బా ప్లీజ్ రా చెయ్ వదులురా... చేతికి ఏదైనా అయ్యితే..
సాయంత్రం నివిని డేట్ కి తీసుకెళ్లడం కుదరదు అంటాడు. ఆ మాటకి శ్రీ.. రాజ్ ముందుకు వచ్చి అప్పుడే డేట్ దాకా వెళ్ళావా...
ఏదో మా ప్రయత్నాలు మావి... నువ్వే బెటర్ రా...పెళ్లి కుదిరిన సరే.. నా పెళ్ళాన్ని డేట్ కి తీసుకు వెళ్లలేకపోయాను అని వాపోతాడు.
ఆ మాటకి విక్రమ్ రాజ్ చేయి వదిలేసి ఏంట్రా మీ ఇద్దరికీ 15 డేస్ ఒకే చోట కలిసి ఉండే టైం ఇచ్చాను కదా... అయినా వెళ్లలేదా అని ఆశ్చర్యపోవడం విక్రమ్ వంతు అవుతుంది.
రాజ్ కూడా అదే ఎక్స్ప్రెషన్ తో శ్రీ వైపు చూస్తాడు. ఆ మాటకి ఏం చెప్పాలో తెలియక దిక్కులు చూస్తూ ఉంటాడు..
ఈసారి శ్రీ ఇద్దరి మధ్యన ఇరుక్కుంటాడు. ఏం చేసావురా 15 రోజులు అని ఇద్దరూ చెరో వైపు పట్టుకుని మెలిపెడుతారు.
అబ్బా వదలండి రా... ఇప్పుడు అసలే పూజ దగ్గర కూర్చోవాలి. మళ్లీ నా చేతికి ఏదైనా అయితే మా నాన్న సెటైర్లు భరించలేను.
ఏం చేసావో చెప్పురా వదిలేస్తాము అని కొంచెం గట్టిగా లాగుతారు. ఏదో.. అది మా ఇద్దరి పర్సనల్ మ్యాటర్ నేను చెప్పను.
మళ్ళీ సజెషన్స్ కి మా దగ్గరకు రా.. అప్పుడు చెబుతాం నీ పని అని ఇద్దరు ఒకేసారి చేతులు వదులుతారు. వెంటనే ఇద్దరి చేతిలో పట్టుకుని మీరిద్దరూ అలా అంటే నేను ఏమైపోవాలి రా...
చిన్న ప్రాణాన్ని అంటే.. ఎక్కువ అవ్వడం లేదు. ఏం చేసావో చెప్పు. అప్పుడు నెక్స్ట్ టైం ఏమైనా సలహా ఇవ్వాలా లేదా అన్నది మేము ఆలోచిస్తాము అని రాజ్ విక్రమ్ వైపు తిరిగి అంతే కదరా అంటాడు.
అంతే.. అంతే.. చెప్పు చెప్పు అని ఈసారి మేడ మీద చేతులు వేస్తాడు. హె... హే... ఆపండ్రా మీ గోల. నేహా ఏమి... నిధి అంత ఫస్ట్ కాదు.
అసలు కారులో ఆఫీస్ కి తీసుకువెళ్తాను అంటేనే... వద్దు.. ఎవరైనా మనిద్దరి గురించి రాంగా అనుకుంటారు అని ఆలోచించే మనస్తత్వం.
ఇంకా డేట్ కి ఏమొస్తుంది చెప్పు. అందుకే రోజు మార్నింగ్ నేనే డోర్ దగ్గరికి వెళ్లి నాక్ చేసి గుడ్ మార్నింగ్ చెప్పి రోజ్ ఇచ్చేవాడిని అని మెలికలు తిరుగుతూ చెబుతాడు.
తర్వాత అంటే.. సాయంత్రం ఆఫీసు నుంచి వచ్చిన తర్వాత ఇద్దరం కలిసి అక్కడే వాకింగ్ చేస్తూ సరదాగా కబుర్లు చెప్పుకునే వాళ్ళము అని మెమరీస్ తలుచుకొని మురిసిపోతూ ఉంటాడు .
విక్రమ్ శ్రీ ఇద్దరు ఒకరి మొఖాలు ఒకరు చూసుకుని ఇది డేట్ కన్నా బాగుంది కదరా అంటే...నిజంగానా అని మెరిసే కళ్ళతో అడుగుతాడు.
ఒరేయ్ ఇందాక అంకుల్ అన్నారని కాదు గాని... నిజంగా మా చెల్లి నిన్ను మిగిలిన లైఫ్ అంతా భరించడం చాలా కష్టం రా అని విక్రమ్ వాపోతాడు.
నువ్వు మరీ అంత బిల్డప్ ఇవ్వాల్సిన అవసరం లేదు. నాతో మీ చెల్లి హ్యాపీగానే ఉంటుంది అని ఉడుక్కుంటాడు.
విక్రమ్ నవ్వుతూ హ్యాపీగా ఉండదని నేను చెప్పలేదే అంటే..
మరి నువ్వు అన్నదానికి అర్థం ఏంటి... పోను... పోను.. నీకే అర్థమవుతుంది కానీ పద అందరూ చూస్తూ ఉంటారు అని లోపలికి వెళతారు.
నవ్వుతూ వస్తున్న ముగ్గురి స్నేహితులులను చూసి వాసు గారు ఏంట్రా ఇంత లేట్ అయ్యింది. పూజకి టైం అవుతుంది కదా ..
వస్తున్నాము అంకుల్ అని దగ్గరికి వెళతారు.. ఇంతలో నేహాను కూడా తీసుకొని అక్కడికి వస్తారు. శ్రీ, నేహా ని పూజ దగ్గర కూర్చోబెట్టి వ్రతం మొదలుపెడతారు.
వ్రతం అయ్యేలోపే రాజ్ నివి కి తెగ సైటు కొడుతూ ఉంటాడు. వినయ్, భరత్ ఇద్దరూ కామ్ గా రాజ్ పక్కన వచ్చి కూర్చుని..
రాజ్ ని నివి ని అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. రాజ్ అలుపన్నది లేని సైనికుడు లాగా నివి వైపే చూస్తూ ఉంటే.. నివి మాత్రం అక్కడున్న లేడీస్ తో ముచ్చట్లో పడుతుంది.
ఎంతసేపైనా ఆ సీను మారకపోయేటప్పటికి వినయ్ కి విసుగు వచ్చి బావ అని వీపు మీద ఒకటి పీకుతాడు. రాజ్ ఉలిక్కిపడి చూసి.. మీరు వచ్చి ఎంతసేపు అయింది రా...
మేము వచ్చి.. నీ పక్కన కూర్చొని.. నిన్ను నివి ని అబ్జర్వ్ చేస్తున్న కూడా నీకు తెలియడం లేదు అంటే.. మా చెల్లి తో నువ్వు ఎంత పీకల్లోతూ ప్రేమలో పడిపోయావో అర్థమవుతుంది.
హ్మ్... నా ప్రేమ అందరికీ అర్థం అవుతుంది కానీ అర్థం అవ్వాల్సిన వాళ్లకే అర్థం కావడం లేదు అని ఫీల్ అవుతాడు.
అసలు దానికి అర్థమయ్యే విధంగా నువ్వు చెప్పావా అంటే.. అందుకే కదా ఈరోజు సాయంత్రం డేట్ కి తీసుకు వెళుతున్నాను అని ఉత్సాహంగా చెబుతాడు.
ఏంటి మా చెల్లిని డేట్ కి తీసుకువెళుతూ అది మళ్ళీ మాకే చెబుతున్నావా అని వినయ్ కోపంగా అడిగితే.. ఎందుకు బావ అంత కోపం.
తీసుకువెళ్తేనే కదా నేను ప్రపోజ్ చేయగలుగుతాను. చెప్పకుండా తీసుకువెళ్తే నువ్వు ఫీల్ అవ్వాలి గాని... చెప్పి తీసుకెళ్తుంటే ఎందుకు ఫీల్ అవుతున్నావు.
ఇది అన్నయ్యకి తెలుసా అంటే.. హా.
ఇందాకే చెప్పాను అంటాడు. ఓకే అన్నయ్య ఒప్పుకుంటే మాకేమి ఇబ్బంది లేదులే అంటాడు.
భరత్ మాత్రం సీరియస్గా ఆలోచిస్తూ ఉంటాడు. రాజ్ కు ఒక చిన్న అనుమానం వస్తుంది. భరత్ ఏమైనా నివి నీ ఇష్టపడుతున్నాడా అని.
అది కూడా క్లారిటీ తెచ్చుకుంటే... రేపు అన్న రోజున ఇబ్బంది ఉండదు కదా అని భరత్ అని పిలుస్తాడు. నిన్ను ఒక విషయం అడుగుతాను ఇబ్బంది పడకుండా నిజమే చెబుతావా..
ఇప్పుడు నీకు కొత్త అనుమానం ఏమొచ్చింది అని అడుగుతాడు. అనుమానం కాదు రేపు అన్నా రోజున ఇబ్బంది లేకుండా ఉండటానికి.
సరే అడుక్కో అంటాడు. నేను ఇంత మర్యాదగా అడుగుతుంటే నువ్వు అలా అంటున్నావ్ ఏంటి ఉక్రోషంగా అడుగుతాడు.
ఎంతైనా పిల్లనిచ్చే వాళ్ళము. ఆ మాత్రం బెట్టు చేయకపోతే ఎలాగా అంటాడు. అంటే నీకు నివి మీద ఎలాంటి ఫీలింగ్స్ లేవా అని అడుగుతాడు.
నీ ఉద్దేశం ఏమిటి రాజ్ అని సీరియస్ గానే అడుగుతాడు. నువ్వు సీరియస్ అవ్వద్దు. చిన్నప్పటినుంచి ఒకే చోటు ఉన్నారు కదా... పైగా బావ మరదళ్లు..
అయితే... నీకేమైనా ఫీలింగ్స్ ఉన్నాయేమో అని నసుగుతూ ఉంటాడు. నాకు ఫీలింగ్స్ ఉన్నాయి అంటే.. వదిలేస్తావా.. అలా ఎలా వదిలేస్తాను.
మరి ఎందుకు పిచ్చ డౌట్లు అన్ని పెట్టుకుంటావు. నివి అంటే ఇష్టమే కానీ.. నువ్వు అనుకున్న టైపు కాదు. మేమందరం ఒకే చోట పెరిగాము.
నేను, విక్రమ్, వినయ్ ముగ్గురు ఒకేలాగా చూస్తాము. దాన్ని బట్టి నువ్వే అర్థం చేసుకో. ఇంకొకసారి ఇలాంటి పిచ్చిపిచ్చి అనుమానాలు మాత్రం పెట్టుకున్నావు అనుకో..
విక్రమ్ కాదు.. నేనే పెళ్లి జరగనివ్వను అని సీరియస్గా చెబుతాడు. ఈ మాత్రం దానికి నువ్వు అంత సీరియస్ అయిపోవాలా.
ఏదో నా వల్ల నువ్వు బాధపడకూడదు అన్న చిన్న తాపత్రయం అంతే. కొంచెంకూల్ అవ్వు బ్రదర్ అంటాడు. ఒక్క లుక్ ఇచ్చి సైలెంట్ అవుతాడు.
మరి ఎందుకు అంత సీరియస్గా ఆలోచిస్తున్నావు అంటే.. నిజం చెబితే నువ్వేమైపోతావో అని నా ఆలోచిస్తున్నాను అంతే అంటాడు.
ఏమిటా నిజం...

![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)