10-02-2026, 07:38 AM
ఎపిసోడ్ 70
నీలమ్ వాళ్లు షాపింగ్ కాంప్లెక్స్ నుంచి సుమతి ఇంటిదగ్గరకి రాగానే స్పీడ్ గా అక్కడికి వచ్చి మెడలో ఐడి కార్డ్ చూసి సుమతి అనుకుని మల్లిని కిడ్నాప్ చేసి తీసుకువెళ్లిపోయారు నలుగురు.
*******************
కార్ లొ వచ్చిన నలుగురు బలవంతంగా మల్లి ని తీసుకుని వెళ్లడంతో వెనకాల స్కూటీ మీద సుమతి తో పాటు ఫాలో అవుతూ "డాక్యుమెంటరీ తీసే మనిద్దరిలో ఎవరినైనా కిడ్నాప్ చేయాలి, అంతేగాని మల్లి ని తీసుకువెళ్లారు ఏంటి?" అని అనుమానంగా అడిగింది నీలమ్.
"మల్లి మెడలో ఐడి కార్డు ఉంది అది చూసి కిడ్నాప్ చేశారేమో! అభీర్ కి కాల్ చేయనా?" అని అడిగింది సుమతి.
"నో నో! అక్కడ సిచువేషన్ తెలియకుండా అభీర్ ని ఎంటర్ చేయకూడదు తనని డేంజర్ లోకి పంపినట్లు అవుతుంది." అని చెప్పి కారు అక్కడ ఉన్న ఒక ఫ్యాక్టరీ లోపలికి వెళ్లడం చూసి దూరంగా ఇద్దరు సెక్యూరిటీ ఆఫీసర్లు కనిపించడంతో
"మనం ఇద్దరమే లోపలికి వెళ్ళడం అంత సేఫ్ కాదు ఆ సెక్యూరిటీ ఆఫీసర్ల హెల్ప్ అడుగుదాము." అని ఫాస్ట్గా వాళ్ళ దగ్గరకి వెళ్ళింది నీలమ్.
స్కూటీ మీద దగ్గరకి వచ్చిన నీలమ్ వాళ్ళని చూసి "మేడం బాగున్నారా? ఈ టైంలో ఇక్కడ ఉన్నారు ఏమిటి?" అని అనుమానంగా అడిగాడు శక్తి దాస్.
తెలిసిన ఆఫీసర్లు కనిపించడంతో ఊపిరి పీల్చుకుని "హమ్మయ్య టైం కి కనిపించారు మా కొలీగ్ ని ఎవరో కిడ్నాప్ చేసి కార్ లొ ఆ ఫ్యాక్టరీలోకి తీసుకువెళ్లారు." అని కంగారుగా చెప్పింది నీలమ్.
"మేడం! మీరేమీ కంగారు పడకండి. మా సార్ పెట్రోలింగ్లో ఉండగా కిడ్నాప్ జరిగింది అంటే ఆయనకే అవమానం మీ కొలీగ్ ని సేఫ్ గా తీసుకువస్తారు." అని చెప్పాడు కుమార్.
"అవును మేడం! లోపలికి వెళ్దాం పదండీ మా కుమార్ ప్రాణాలు ఫణంగా పెట్టి అయ్యినా సరే మీ ఫ్రెండ్ ని కాపాడతాను." అని నీలమ్ వాళ్ళతో కలిసి ఫ్యాక్టరీ లోపలికి వెళ్ళాడు శక్తి దాస్.
ఫ్యాక్టరీ లోపలలికి వెళుతు "సార్! ఆ అమ్మాయి కోసం నా ప్రాణాలు పణంగా పెట్టడం ఎందుకు?" అని నెమ్మదిగా అడిగాడు కుమార్.
"మరి నేను పెట్రోలింగ్లో ఉండగా ఎవరైనా కిడ్నాప్ అయితే నాకు అవమానమా?" అని చెప్పి నీలమ్ వైపు చూసి "మేడం! మీరు ఎవరితోనైనా గొడవ పెట్టుకున్నారా? లేకపోతే చానల్లో ఏదైనా న్యూస్ టెలికాస్ట్ చేశారా?" అవి డౌట్ గా అడిగాడు శక్తి దాస్.
"ఏమీ లేదు సార్! నంద ఫ్యామిలీ, అభిజిత్ ఫ్యామిలీ గురించి ఒక చిన్న డాక్యుమెంటరీ చేస్తున్నాము నాకు తెలిసి దానిని ఆపమని బెదిరించడానికి కిడ్నాప్ చేసి ఉంటారు." అని చెప్పి అభీర్ కి కాల్ చేసింది నీలమ్.
ఫోన్ లిఫ్ట్ చేసి "మేడం! నేను జాజిని మాట్లాడుతున్నాను చెప్పండి?" అని అడిగాడు
"మేము ఇంటికి వెళ్లేటప్పుడు ఎవరో కారులో వచ్చి మల్లిని కిడ్నాప్ చేసి ఒక ఫ్యాక్టరీ దగ్గర తీసుకొచ్చారు మేము కూడా అక్కడే ఉన్నాము లోపలికి వెళ్తున్న మీరు త్వరగా రండి." అని చెప్పింది నీలమ్.
"అవునా? మీరు ఏమి కంగారు పడకండి మల్లి చూసుకుంటుంది." అని చెప్పాడు జాజి.
"నేను చెప్పింది అర్థం కాలేదా? కిడ్నాప్ చేసిందే మల్లినే!" అని విసుగ్గా చెప్పింది నీలమ్.
జాజి దగ్గర ఫోన్ తీసుకుని "నాకు తెలిసి ఈ కిడ్నాప్ ప్లాన్ అర్ణ వాళ్ళది కాదు భయపడకుండా లోపలకు వెళ్లి అక్కడ ఎవరు ఉన్నారో చూడండి." అని చెప్పాడు అభీర్.
"సరే!" అని ఫోన్ పెట్టేసి అక్కడినుంచి నెమ్మదిగా ముందుకు వెళ్లి చైర్ లో మల్లి కట్టేసి ఉండడం చూసి "అక్కడ ఎవరూ లేరు ఏమిటి?" అని అనుమానంగా చూస్తూ చెప్పింది నీలమ్.
"మేడం! ఎవరు లేకపోతే హ్యాపీనే కదా! వెళ్లి ఆ అమ్మాయిని తీసుకుని వెళ్ళిపోదాము పదండి." అని పరిగెత్తుకుంటూ వెళ్లి మల్లి చేతి కట్లు విప్పుతూ ఉన్నారు దాస్, కుమార్ లు.
అక్కడికి వచ్చి "అసలు కిడ్నాప్ చేసిన వాళ్ళు మల్లిని కట్టేసి ఎందుకు వెళ్లిపోయారు? ఇక్కడ ఎవరూ లేరేమిటి?" అని చుట్టూ చూస్తూ ఉంది నీలమ్.
కంగారుగా చూస్తూ "ఎవరో డోర్స్ క్లోజ్ చేసి వెళ్ళిపోయారు ఇప్పుడు మనం బయటికి వెళ్లలేము." అని చెప్పింది సుమతి.
"అవునా?" అని పరిగెత్తుకుంటూ వెళ్లి డోర్స్ క్లోజ్ అవ్వడం చూసి "మనల్ని ఇక్కడ ఎందుకు బ్లాక్ చేశారు?" అని అనుమానంగా చూస్తూ అడిగింది నీలమ్.
"మేడం! ఎవరో కావాలని ఇదంతా చేస్తున్నారు." అని కంగారుగా చెప్పాడు కుమార్.
"మనం కనిపించకుండా పోతే అది అర్ణ వాళ్లకే నష్టం! వాళ్లు నష్టపడితే లాభపడేది ఎవరో వాళ్లే మనల్ని కిడ్నాప్ చేశారు." అని చెప్పింది నీలమ్.
అక్కడికి వస్తూ "బానే కనిపెట్టారు మీరు చచ్చిపోతే మాకు ఇంకా లాభం!" అని చెప్పాడు ప్రతాప్ మిశ్ర
"అవును! మిమ్మల్ని ఇక్కడ చంపేసి ఆ నంద ఫ్యామిలీ అభిజిత్ ఫ్యామిలీ ఇదంతా చేశారు అని పబ్లిక్ కి తెలిసేటట్లు చేస్తాము, ఆస్తులు వదిలేసి ఇక్కడి నుంచి పారిపోతారు మేము లాభపడతాము." అని నవ్వుతూ చెప్పాడు వరదరాజులు.
ఆ మాట విని "ఓర్నీ వాళ్లే పెద్ద వెధవలు అనుకుంటే మీరు ఇంకా పెద్ద వెధవల్లాగా ఉన్నారే! నమ్మిన వాళ్లకి వెన్నుపోటు పొడుస్తున్నారు." అని చెప్పింది నీలమ్.
"నమ్మిన వాళ్లకి వెన్నుపోటు పొడవు కదా! మా వెధవలు మీ ఇద్దరిలో ఎవరో ఒకరిని తీసుకురమ్మంటే ఐడి కార్డు ఉందని ఆ పిల్లని తీసుకువచ్చారు అనవసరంగా ఇప్పుడు అది కూడా చస్తుంది." అని నవ్వుతూ చెప్పాడు తంబియార్.
"అంకుల్! త్వరగా వీళ్ళని చంపేసి న్యూస్ లో చూపిస్తే అర్ణ వేసిన ప్లాన్ ఆగిపోతుంది. అందరూ డైనమాలొ పడతారు ఎక్కడి వాళ్ళు అక్కడే ఆగుతారు మనం ఆ కొండల దగ్గరికి వెళ్లి మన పని మొదలు పెట్టొచ్చు!" అని చెప్పాడు సుజిత్.
వరదరాజులు వైపు చూస్తూ "ఆస్తికోసం ఆశపడి ముగ్గురు ఆడపిల్లలని చంపడం తప్పు సార్!" అని చెప్పాడు దాస్.
"అలా అయితే వీళ్ళ ముగ్గురితో పాటు మీ ఇద్దరినీ కూడా చంపేస్తాము అప్పుడు తప్పు ఉండదు." అని నవ్వుతూ చెప్పాడు తంబియార్.
"మీరు ఒక విషయం మర్చిపోయారు మాకు డాక్యుమెంటరీ తీయడానికి జరిగిన విషయము చెప్పిన అబీర్ మా సేఫ్టీ చూడకుండా ఉంటాడు అనుకున్నారా?" అని అడిగింది సుమతి.
శక్తి దాస్ దగ్గరికి వెళ్లి "సార్! మీ ఇద్దరి దగ్గర గన్స్ ఉన్నాయి కదా ఎదురుగా వాళ్ళు అలా మాట్లాడుతుంటే షూట్ చేయకుండా సైలెంట్ గా ఉన్నారు ఏమిటి? మీకు ధైర్యం లేకపోతే ఆ గన్ నాకు ఇవ్వండి." అని అడిగింది మల్లి.
ఆ మాట విని నవ్వుతూ "ఓ సెక్యూరిటీ ఆఫీసర్! ఆ అమ్మాయికి గన్ కావాలంట ఇవ్వు!" అని చెప్పాడు తంబియార్.
మల్లి వైపు చూసి "నువ్వు ఉండవమ్మా! వాళ్ళని ఇంకా రెచ్చగొడుతున్నావు అసలు నీకు గన్ పట్టుకోవడం అయ్యినా వచ్చా!" అని వెటకారంగా చూస్తూ అడిగాడు కుమార్.
"ఒక్కసారి గన్ ఇవ్వండి పట్టుకోవడం వచ్చో లేదో చూపిస్తాను." అని కోపంగా చూస్తూ చెప్పింది మల్లి.
తన మనుషులు వైపు చూసి "ఒరేయ్! ఆ బక్కదానికి పొగరెక్కువగా ఉంది ముందు దాన్ని చంపేయండి." అని చెప్పాడు వరదరాజులు.
తన మీదకి వస్తున్న నలుగురిని చూసి కుమార్ చేతీలో ఉన్న గన్ తీసుకుని తల మీద షూట్ చేసింది మల్లి.
బుల్లెట్ తగిలి కింద పడ్డ నలుగురిని చూసి మల్లి వైపు ఆశ్చర్యంగా చూస్తూ "నీకు గన్ షూటింగ్ వచ్చా కరెక్ట్ గా నలుగురి తల మీద గురి తప్పకుండా ఎలా కాల్చావు!" అని అనుమానంగా అడిగాడు దాస్.
చనిపోయిన తన మనుషులని చూసి "అది రిపోర్టర్ కాదు కచ్చితంగా అభీర్ మనిషి అయ్యి ఉంటుంది." అని కంగారుగా చెప్పాడు తంబియార్.
అక్కడికి వస్తూ "కరెక్ట్ గా కనిపెట్టారు సార్! కానీ మీరు మరొక విషయం కనిపెట్టలేకపోయారు." అని చెప్పాడు రాజన్.
"ఏమిటి ఆ విషయం?" అని కంగారుగా అడిగాడు ప్రతాప్ మిశ్రా.
"అభీర్ సేన దగ్గర నుంచి వార్నింగ్ లెటర్ వచ్చినప్పుడే మీరు ఈ విషయం నుంచి దూరంగా ఉండాలి, ఆస్తి కోసం ఆశ పడితే పర్వాలేదు కానీ ఆ కొండల మీద ఆశపడ్డారు చూడండి అప్పుడే మీ ప్రాణాల మీదకు తెచ్చుకున్నారు." అని చెప్పాడు రాజన్.
"అంటే! నువ్వు కూడా అభీర్ మనిషివేనా?" అని ఆశ్చర్యంగా చూస్తూ అడిగాడు సుజిత్.
"నేనొక్కడినే కాదు నంద ఫ్యామిలీ, అభిజిత్ ఫ్యామిలీ చుట్టూ ఉన్న వాళ్ళందరూ మా మనుషులే!" అని చెప్పాడు రాజన్.
"ఈ ఫ్యాక్టరీ చుట్టూ నా మనుషులు ఉన్నారు ఇక్కడి నుంచి మీరు బయటికి వెళ్ళలేరు." అని చెప్పాడు తంబియార్.
"మీరు ఒక విషయం మర్చిపోయారు ఆ మనుషుల్ని పెట్టిందే నేను ఇక్కడ జరిగింది మీరు మాట్లాడింది మొత్తం రికార్డు అయింది. ఇంక మిమ్మల్ని మేము చంపనవసరం లేదు ఈ వీడియో అర్ణకి పంపిస్తే తనే చూసుకుంటుంది." అని చెప్పాడు రాజన్.
ఆ మాట విని కంగారు పడుతూ "ఆ పని మాత్రం చేయకు ఏం కావాలో చెప్పండి మీకు ఏ హెల్ప్ కావాలన్నా చేస్తాము." అని చెప్పాడు ప్రతాప్ మిశ్ర.
అంతలో అక్కడికి వస్తున్న కారు వైపు చూసి "మా నాయకుడు వస్తున్నాడు అతను చెప్పింది చేయండి." అని చెప్పాడు రాజన్.
కారు దిగి వరదరాజుల వైపు చూస్తూ "మీ నలుగురు ఎప్పటిలాగా వాళ్లతోనే ఉండండి కానీ మేము చెప్పిన పని మాత్రమే చేయాలి అప్పుడే మీరు ప్రాణాలతో ఉంటారు లేకపోతే వాళ్ల చేతిలోనైనా చస్తారు మా చేతిలోనైనా చస్తారు." అని చెప్పాడు అభీర్.
"సరే! నువ్వు చెప్పినట్లే చేస్తము కానీ మా నలుగురిని చంపను అని నువ్వు మాట ఇవ్వాలి." అని అడిగాడు వరదరాజులు.
"మా మాట విన్నంతవరకు మీరు ప్రాణాలతోనే ఉంటారు." అని చెప్పాడు అభీర్.
"సరే మేము ఇంకా ఇక్కడి నుంచి వెళ్లొచ్చా!" అని అడిగాడు వరదరాజులు.
"హ్యాపీగా వెళ్ళండి కానీ చేయవలసిన పని ఒకటి ఉంది. ఇక్కడ జూలో ఉన్న జంతువులని బేరా అడవిలో వదలడానికి పర్మిషన్ తెప్పించాలి దాని వివరాలు మొత్తం రాజాన్ చెబుతాడు." అని చెప్పాడు అభీర్.
"సరే!" అని అక్కడ ఉన్న కార్ ఎక్కడు వరదరాజులు.

![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)