Thread Rating:
  • 5 Vote(s) - 3.6 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
ఖైదీ నెంబర్ 402 - నా మాటే శాసనం
ఎపిసోడ్ 69


ప్రమోద్ తనతో పాటు నిర్మల్ ని గార్డెన్ లోకి తీసుకువెళ్లి  ఆరుల్ ని పరిచయం చేయడంతో, ఇద్దరికి ఆ కొండల గురించి చెప్పి వాటి మీద వరదరాజుల కొడుకు తంబీయర్ కన్ను కూడా పడింది అని చెప్పాడు అరుల్.

****************

గెస్ట్ హౌస్ లో ఎవరి దారిన వాళ్ళు మాట్లాడుకోవడం చూసి అసహనంగా ఉన్నా ముకుల్ దగ్గరికి వెళ్లి "ఏమైంది తాతయ్య? అలా ఉన్నారు?" అని అడిగింది అర్ణ.

"ఆ అభీర్ సేన మనుషులు మన చుట్టూ ఉన్నారు అనిపిస్తుంది. ముందు మనవాళ్లలోనే ఒకరికి ఒకరికి అవగాహన లేదు, ఐక్యత లేదు. అయిన వాళ్ల కంటే బయట వ్యక్తులతో చనువుగా ఉంటున్నారు. ఎవరి వల్ల ఎప్పుడు ఏ ఆపద వస్తుందో కూడా అర్థం కావడం లేదు." అని అసహనంగా చెప్పాడు ముకుల్.

"మీరు చెప్పింది కరెక్ట్ తాతయ్య! ఎవరు మనవాళ్ళో ఎవరు పరాయి వాళ్ళో కూడా అర్థం కావడం లేదు, దీనికి ఏదైనా ఉపయోగం ఆలోచించాలి." అని మిస్సైల్ ని పిలిచి

"గెస్ట్ హౌస్ చుట్టూ ఫుల్ సెక్యూరిటీ ఉంచండి నాకు తెలియకుండా కొత్త వ్యక్తులు ఎవరు లోపలికి రావడానికి వీల్లేదు మనవాళ్ళు ఎవరు బయటికి వెళ్లడానికి వీల్లేదు ప్రతి ఒక్కరికి ఫోను టాపింగ్ లో పెట్టండి." అని చెప్పింది అర్ణ.

"ఓకే మేడం!" అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళాడు మిసైల్.

ప్రహ్లాద్ జాకి, సాధులని పిలిచి "మీకు చెప్పిన పని మొదలు పెట్టండి." అని చెప్పి నెల్సన్ వైపు చూసి "వీళ్ళ ముగ్గురికి ప్రొటెక్షన్ ఇవ్వండి. అనుమానం వస్తే ఎవరు అని చూడకుండా షూట్ చేయండి." అని చెప్పింది అర్ణ.

"ఓకే మేడం!" అని అక్కడి నుంచి బయలుదేరారు నలుగురు.

సుజిత్ తో కలిసి దూరం నుంచి వింటూ "ఇదేదో పెద్ద ప్లాన్ వేసింది మనం కొంచెం జాగ్రత్తగా ఉండాలి." అని చెప్పాడు ప్రతాప్ మిశ్ర.

****************

ఆఫీస్ లో ఉన్న నీలమ్, సుమతిల దగ్గరికి చాక్లెట్ తో కలిసి వెళ్లి "మీరిద్దరూ కేర్ఫుల్ గా ఉండాలి ఆ డాక్యుమెంటరీ విషయంలో ముకుల్ ఫ్యామిలీ చాలా సీరియస్ గా ఉంది." అని చెప్పింది మిత్ర.

"ఆ విషయం మాకు కూడా తెలుసు మమ్మల్ని టచ్ చేస్తే ఈ స్టోరీ రియల్ అని అందరూ నమ్ముతారు ఆ అర్ణ తెలివైనది అయ్యితే మా మీద ఈగ కూడా వాలానివ్వదు." అని చెప్పింది నీలమ్.

"కరెక్టే! కానీ తను ఏదో పెద్ద ప్లాన్ చేసింది ఏమిటో అర్థం కావడం లేదు ఆ జాకీ గాడు నా కళ్ళముందే ఉన్న ఏమి చేయలేకపోయాను." అని చెప్పింది మిత్ర.

జాజి, నారప్పతో కలిసి అక్కడికి వస్తూ "ప్రతీకారం నీ  గుండెల్లో రగులుతూ ఉంటే, అది న్యాయమే అయితే తప్పకుండా నెరవేరుతుంది." అని చెప్పాడు అభీర్.

ఆ మాట విని వెనక్కి తిరిగి ఆశ్చర్యంగా చూస్తూ "అభీర్! నువ్వు ఇక్కడ?" అని సంతోషంగా అడిగింది నీలమ్.

"నా అనుకునే వాళ్ళని కాపాడుకోవడానికి ఎక్కడికైనా ఎప్పుడైనా వస్తాను." అని వెనక్కి తిరిగి మల్లి అని పిలిచాడు అభీర్.

అక్కడికి వచ్చిన మల్లి వైపు చూసి "ఎవరి ఈ అమ్మాయి? మేము తీసే డాక్యుమెంటరీలో యాక్ట్ చేస్తుందా?" అని అడిగింది నీలమ్.

"కాదు ఈరోజు నుంచి మీ ఇద్దరితో ఉంటుంది మిమ్మల్ని కంటికి రెప్పలా కాపాడుతుంది తనని దాటి మీ దగ్గరికి ఎవరు రాలేరు." అని చెప్పాడు అభీర్.

ఆ మాట విని మల్లి వైపు చూసి "ఏంటి? తను మమ్మల్ని ప్రొటెక్ట్ చేయగలదా?"  అని అనుమానంగా అడిగింది సుమతి.

"ఆ అనుమానం మీకు అక్కర్లేదు మిమ్మల్ని కంటికి రెప్పలా కాపాడుతుంది." అని చెప్పాడు జాజి.

"సరే అయితే! మల్లి తో పాటు ముందు నీ వేషం కూడా మార్చాలి పదండి." అని చెప్పి ఆఫీస్ నుంచి ఒక పెద్ద షాపింగ్ మాల్ కి తీసుకు వెళ్ళింది నీలమ్.

లోపలికి వస్తున్న వాళ్ళని చూసి "గుడ్ ఈవెనింగ్ మేడం!" అని చెప్పాడు సేల్స్ మాన్.

అభిర్ ని చూపించి "మా సార్ ని తీసుకువెళ్లి హీరోలా తయారుచేసి తీసుకురావాలి మేము కూడా గుర్తుపట్టలేనంతగా..!" అని నవ్వుతూ చెప్పింది నీలమ్.

ఆ మాట విని "ఇప్పుడు ఏమీ వద్దు నాకు ఇలా ఉండడమే  ఇష్టం!" అని చెప్పాడు అభీర్.

"ఇలా ఉంటే నీకు ఇష్టమేమో కానీ, మాకు ఇష్టం లేదు మాట్లాడకుండా పద!" అని అభీర్ ని లోపలికి తోసింది నీలమ్

"వెల్కమ్ సార్!" అని లోపలికి తీసుకువెళ్లాడు సేల్స్ మెన్.

మల్లి ని తీసుకుని లేడీస్ కౌంటర్ వైపు వెళ్ళింది సుమతి.

నీలమ్ వైపు చూసి "మంచి పని చేశారు ఈ రోజుల్లో ఒంటి మీద బట్టలని చూసే మనిషికి గౌరవం! మా నాయకుడికి ఎన్నిసార్లు చెప్పినా మా మాట వినడం లేదు కానీ ఇప్పుడు మీ మాట కాదనలేకపోయాడు." అని సంతోషం గా చెప్పాడు నారప్ప.

"నేను తీసే డాక్యుమెంట్ హీరో అభీర్, బయట కూడా హీరోలానే ఉండాలి." అని చెప్పింది నీలమ్.

"అక్క! మరి హీరోయిన్ ఎవరు?" అని నవ్వుతూ అడిగాడు చాక్లెట్.

"ఆ విషయంలో అభీర్ నుంచి ఇంకా క్లారిటీ రాలేదు వచ్చాక కచ్చితంగా హీరోయిన్ ని కూడా ఫిక్స్ చేస్తాను." అని చెప్పింది నీలమ్.

"అమ్మవారి పాదాల దగ్గర పంచరత్నాలు ప్రతిష్టించేటప్పుడు మా నాయకుడు జంటగా ఉండాలని మా అందరి కోరిక! తనకోసం ఎవరో ఒకరు పుట్టే ఉంటారు." అని చెప్పాడు జాజి.

అంతలో సుమతితో పాటు జీన్స్ ప్యాంట్ టీ షర్టు వేసుకుని బయటికి వస్తున్న మల్లి ని చూసి "ఇప్పుడు పర్ఫెక్ట్ రిపోర్టర్ లాగా ఉంది. మాతో పాటు తీసుకువెళ్లిన ఎవ్వరికి అనుమానం రాదు." అని చెప్పింది మిత్ర.

"అవును! ఒక్కటి తగ్గింది." అని తన మెడలో ఐడి కార్డు మల్లి మెడలో వేసింది సుమతి.

కాసేపటికి బ్లాక్ డ్రస్సులో బయటికి వస్తున్న అభీర్ వైపు కళ్ళు ఆర్పకుండా చూస్తూ "నా హీరో అదిరిపోయాడు." అని చెప్పింది నీలమ్.

"ఏంటి? నీ హీరోనా..? నీ డాక్యుమెంటరీ లో హీరోనా..?" అని నవ్వుతూ భుజం మీద తన భుజంతో కొడుతూ అడిగింది మిత్ర.

ఆ మాటకి కంగారుపడుతూ "అదే అదే! నా డాక్యుమెంటరీలో హీరో!" అని అక్కడ ఉన్న బ్లాక్ స్పెట్స్ తీసి అభీర్ కి పెట్టి "సూపర్! చేతిలో ఒక గన్ ఉంటే అదిరిపోతుంది." అని చెప్పింది నీలమ్.

"అభీర్ భయ్యా! చేతిలో గన్ ఉంటే యుద్ధానికి వెళ్లే కామెండో లాగా ఉంటాడు." అని చెప్పాడు చాక్లెట్.

"యుద్ధానికి వెళ్లడం ఏమిటి ఆల్రెడీ యుద్ధం చేస్తున్నాడు." కదా అని చెప్పింది మిత్ర.

ఆ మాటకి నవ్వుతూ "నేను చేస్తుంది యుద్ధం కాదు, వేట! యుద్ధం లొ రెండు వైపులా చావులు ఉంటాయి, కానీ వేటలో ఒకవైపు మాత్రమే చావులు ఉంటాయి, ఇంకా వెళదామా?" అని జాజి వైపు చూసి "వీటీకి డబ్బులు కట్టు!" అని చెప్పాడు అభీర్.

"ఆగు ఆగు! నీ డబ్బులు నా దగ్గర ఉన్నాయి, ఆ షాప్ అతను నువ్వు ఇచ్చిన స్టోన్ కి మిగతా డబ్బులు కూడా ఇచ్చేశాడు." అని బ్యాగ్ లో నుంచి ప్యాకెట్ తీసి అభీర్ చేతికి ఇచ్చింది నీలమ్.

"మనం ఇచ్చిన ఒక్క రాయి కి ఇంత డబ్బు వచ్చిందా?" అని ఆశ్చర్యంగా చూస్తూ  "అందుకే ఆ కొండల మీద అందరూ అంతా ఆశ పడుతున్నారు." అని ప్యాకెట్ తీసుకుని జాజి చేతీలో పెట్టాడు అభీర్.

అక్కడి నుంచి వెళుతూ "కొండలంటే గుర్తొచ్చింది ఆ అర్ణ ఏదో పెద్ద ప్లాన్ చేస్తుంది. ఆ గెస్ట్ హౌస్ లొ అందరు నా కళ్ళ ముందే  తిరుగుతున్నారు కానీ నేనేమీ చేయలేకపోతున్నాను వాళ్ళని చూస్తుంటే మన పగ తీరుతుందా అనిపిస్తుంది." అని నిరాశగా చెప్పింది మిత్ర.

"పగ ప్రతీకారం ఎలా ఉంటుందో రియల్ గా జరిగిన ఒక విషయం చెబుతాను జాగ్రత్తగా వినండి. కొన్ని సంవత్సరాల క్రితం ఒక వ్యక్తి  తమ దగ్గర పని చేసే ఒక అమ్మాయిని నమ్మించి మోసం చేయడంతో తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంది.

ఆ విషయం తెలుసుకున్న ఆ అమ్మాయి తమ్ముడు కోపంతో తన అక్క ప్రేమించిన వ్యక్తి మీద పగ పెంచుకుని తుపాకీ తీసుకువెళ్లి ఇంటి ముందు గార్డెన్ లో ఉన్న ఆ వ్యక్తిని చూసి కసితిరా మూడు సార్లు షూట్ చేశాడు.

రెండు బుల్లెట్లు అతని బాడీలోకి వెళ్లాయి ఒక బుల్లెట్ గురి తప్పి పక్కన ఉన్న చెట్టులో దిగింది. కింద పడ్డ వ్యక్తిని చూసి చనిపోయాడు అనుకుని అక్కడి నుంచి ఇంటికి వెళ్లి అక్క ఫోటో చూస్తూ కాల్చుకుని చనిపోయాడు.

కానీ రెండు బుల్లెట్లు తగిలిన ఆ వ్యక్తి ట్రీట్మెంట్ తో మళ్ళీ బతికాడు కానీ 10 సంవత్సరాల తర్వాత తన ఇంటి ముందు గార్డెన్లో ఎదిగిన చెట్లను నరికిస్తూ ఉండగా గురి తప్పి చెట్టులో దిగిన బులెట్ గొడ్డలి దెబ్బకి ఎగిరి వచ్చి దూరంగా నుంచున్న  ఆ మనిషి తలలో దిగి చనిపోయాడు.

మన ప్రతీకరం న్యాయమైంది అయితే మనం ఉన్న లేకపోయినా మన చేతులతో  జరిగి చర్యల వల్ల జరిగితీరుతుంది." అని చెప్పాడు అభీర్.

ఆ మాట విని సంతోషంగా చూస్తూ "నాకు ఇప్పుడు నమ్మకం వచ్చింది. నా ప్రతీకరం న్యాయమైంది అనుకుంటున్నాను తప్పకుండా జరిగి తీరుతుంది." అని చాక్లెట్ తో కలిసి బైక్ మీద వెళ్లిపోయింది మిత్ర.

మల్లి, సుమతితో కలిసి అక్కడినుంచి బయలుదేరుతూ అభీర్ వైపు చూసి "నువ్వు చాలా ప్రాక్టికల్ మనిషివి నీకోసం ఎంతకాలమైనా వెయిట్ చేస్తాను." అని నవ్వుతూ అక్కడినుంచి బైక్ మీద వెళ్లిపోయింది నీలమ్.

బైక్ మీద వెళ్లి సుమతి ఇంటి దగ్గర దిగుతూ నీలమ్ వైపు చూసి "నువ్వు మా నాయకుడిని ఇష్టపడుతున్నావా?" అని అడిగింది మల్లి.

అంతలో వేగంగా కారులో అక్కడికి వచ్చి కిందకు దిగి గన్ చూపించి బెదిరిస్తూ "మురళి జోషి కూతురు సుమతి ఎవరు?" అని అడుగుతూ మల్లి మేడలో ఐడీ కార్డు చూసి తల మీద గన్ పెట్టి "సైలంట్ గా కార్ లొ కూర్చో!" అని చెప్పాడు నలుగురులో ఒక వ్యక్తి.
[+] 9 users Like SivaSai's post
Like Reply


Messages In This Thread
RE: వేదం - by Manmadhsbanam143 - 22-12-2025, 04:13 PM
RE: ఖైదీ నెంబర్ 402 - నా మాటే శాసనం - by SivaSai - 10-02-2026, 07:32 AM



Users browsing this thread: 1 Guest(s)