09-02-2026, 06:11 AM
ఎపిసోడ్ 67
మన పద్మవ్యూహంలోకి వాళ్ళని స్వేచ్ఛగా రానివ్వండి నేను చెప్పే వరకు ఎవరు ఆవేశపడకండి అని చెప్పి అక్కడి నుంచి తన వాళ్ళని పంపించాడు అభీర్.
ప్రవీణ్ కి అంత్యక్రియలు చేసి నేను ఇక్కడి నుంచి వెళ్లి తప్పు చేశాను నా పవర్ ఏమిటో చూపిస్తాను అని చెప్పాడు ముకుల్.
*****************
మరుసటి రోజు ఉదయం తన గెస్ట్ హౌస్ దగ్గర ఆలోచిస్తూ ఒంటరిగా కూర్చున్న ముకుల్ దగ్గరికి వచ్చి "తాతయ్య! ఒక టీవీ ఛానల్ లో జారువా తెగ గురించి డాక్యుమెంటరీని డైలీ ఎపిసోడ్స్ గా రిలీజ్ చేస్తున్నారు." అని చెప్పింది అర్ణ.
"ఆ డాక్యుమెంటరీ పూర్తి అయింది అంటే అభీర్ కి ప్రజల మద్దతు పెరుగుతుంది. వాడు ఏది చేసినా కరెక్ట్ అంటారు గవర్నమెంట్ కూడా మనకి రివర్స్ అవుతుంది." అని చెప్పాడు అభిజిత్.
"మనం ఆ డాక్యుమెంటరీని ఆపలేమా? అవసరమైతే ఆ ఛానల్ ని కొనేయండి." అని చెప్పాడు ముకుల్.
"మనం ఇప్పుడు ఆ చానల్ జోలికి వెళ్ళిన డాక్యుమెంటరీ తీసిన వాళ్ళ జోలికి వెళ్లిన రివర్స్ అవుతుంది. మనం చేయవలసింది ఏమిటంటే అది పూర్తయ్యలోపు ఈ జారువా తెగకి సంబంధించి ఒక్కడు కూడా బతికి ఉండకూడదు, ఆ బైరి కొండలు ఉండకూడదు అదంతా ఒక కథలానే మిగిలిపోవాలి." అని చెప్పాడు నిర్మల్.
"ఎస్! నిర్మల్ చెప్పింది కరెక్ట్! మనం ఆ కొండలు తవ్వడం మొదలుపెడితే ఆ తెగ వాళ్ళు ఎక్కడ ఉన్నా సరే బయటికి వస్తారు దొరికిన వాడిని దొరికినట్టు అక్కడ పాతి పెట్టడమే!" అని చెప్పాడు తంబియార్.
"మీరు ఆ కొండలు తవ్వే పని చూడండి అక్కడికి వచ్చిన వాళ్ళని చంపే పని నేను చూసుకుంటాను." అని ఆవేశంగా అన్నాడు విష్ణు.
మహేష్ తో కలిసి అక్కడికి వస్తూ "ఏ పనైనా మన చేతికి మట్టి అంటకూడదు మన ఇంటి పేరు మీద మరక పడకూడదు." అని చెప్పాడు మిథున్.
"ఆ కొండల దగ్గర ఏదో శక్తి ఉంది నేను కళ్ళారా చూశాను మనం ఏం చేసినా చాలా జాగ్రత్తగా చేయాలి ఈసారి ఒక్క ప్రాణం కూడా పోకూడదు." అని చెప్పాడు జాకీ.
అక్కడికి వస్తున్న వ్యక్తిని చూపించి "తాతయ్య! అతని పేరు నెల్సన్ రష్యా నుంచి వచ్చాడు వాళ్ళు మొత్తం పదిమంది ప్రొఫెషనల్ కిల్లర్స్, స్నైపర్ గన్స్ తో చాలా లాంగ్ డిస్టెన్స్ నుంచి టార్గెట్ మిస్ అవ్వకుండా షూట్ చేయడంలో ఎక్స్పర్ట్స్!
ఆ కొండల చుట్టూ వీళ్ళు ఉంటారు అక్కడికి ఆ తెగవాళ్లు ఎవ్వరు వచ్చిన సరే వాడి తలలో బుల్లెట్ దిగుతుంది." అని చెప్పాడు మోహిత్.
"అయ్యా! అతను ఎస్పీ ప్రహ్లాద్ మనకు నమ్మిన బంటు, ఎన్కౌంటర్ స్పెషలిస్ట్! ఆ అభీర్ మనుషులు ఎక్కడ ఉన్నారో వెతికి పట్టుకుని చిత్రహింసలు చేసి మరీ చంపుతాడు మళ్లీ మన జోలికి రావాలి అంటే ఒక్కొక్కడికి గుండెలు అదిరిపోవాలి." అని చెప్పాడు వరదరాజులు.
"తాతగారు! అతని పేరు సాధు అస్సాం నుంచి వచ్చాడు వీళ్ళు డబ్బు కోసం ఏ పనైనా చేస్తారు మనుషుల్ని చంపడం అంటే వీళ్ళకి సరదా! వాళ్ల కంటికి ఒక మనిషిని చూపించాము అంటే అతనిని చంపే వరకు నిద్రపోరు." అని చెప్పాడు నిర్మల్.
"తాతయ్య! లండన్ నుంచి మిసైల్ తన మనుషులతో వచ్చాడు, మన ఫ్యామిలీ ఎక్కడ ఉంటే అక్కడ వీళ్ళ సెక్యూరిటీ ఉంటుంది వాళ్ళని దాటుకుని ఎవరు లోపలికి రాలేరు." అని చెప్పింది అర్ణ.
"మీరు తీసుకొచ్చిన మనుషులు పవర్ ఫుల్ గానే ఉన్నారు మీరు పవర్ఫుల్ గానే ఉన్నారు, కానీ అసలు ఆ అభీర్ సేన ఎక్కడ ఉంది? వాళ్ళు ఎలా ఉంటారు? ఎంతమంది ఉన్నారు? వీటిల్లో ఏ ఒక్క విషయమైనా ఇక్కడ ఉన్న వాళ్ళకి తెలుసా?" అని అందరి వైపు చూస్తూ అడిగాడు రఘురామ్.
"ఆ బైరి కొండలు తవ్వుతూ ఉంటే చావుని వెతుక్కుంటూ వాళ్లే వస్తారు." అని చెప్పాడు నిర్మల్.
"నువ్వు చెప్పింది కరెక్టే! కానీ అక్కడికి వచ్చినవాడు ఆ అభీర్ సేనకి చెందిన వాడని నీకు తెలుసా? అక్కడికి పనివాళ్ళుగా అయినా రావచ్చు మన మనుషులుగా అయినా రావచ్చు ఎవరికి తెలుసు!
అసలు మీకు తెలిసినంతవరకు ఆ తెగలో ఆరోజు చనిపోయిన వాళ్ళు కాకుండా బతికి ఉన్న వాళ్ళు ఎంతమంది?" అని అడిగాడు రఘూరామ్.
"ఆ కొండల దగ్గర గెస్ట్ హౌస్ లో ఉన్న జేమ్స్ వాళ్ళని చంపినప్పుడు అభీర్ తో పాటు మరొక ఐదుగురు వచ్చారు నాకు తెలిసి ఆ ఆరుగురు బతికి ఉన్నారు." అని చెప్పాడు జాకి.
"ఆ విషయంలోనే మీరు పప్పులో కాలు వేశారు, 12 సంవత్సరాల క్రితం మీరు వాళ్ళని చంపకముందు అక్కడ పనిచేసిన ఒక ఫారెస్ట్ గార్డ్ ని ఇక్కడికి పిలిపించాను అతను చెప్పింది పూర్తిగా వినండి తర్వాత మీ ప్లాన్ లు ఆలోచించండి." అని చెప్పాడు రఘురామ్.
అక్కడికి వస్తూ "నమస్తే సార్ నా పేరు హస్కర్! నేను ఆ ఏరియా ఫారెస్ట్ గార్డ్ గా పనిచేసేవాడిని 12 సంవత్సరాల క్రితం జాతర జరగకముందు ఆ తెగకు సంబంధించిన సుమారు 250 మంది దాకా అడవి వదిలి బయట ప్రపంచంలోకి వెళ్లి రహస్యంగా జీవించడం మొదలుపెట్టారు.
జాతర మూడో రోజు వాళ్లందరూ ఆ కొండ దగ్గరికి వెళ్లడానికి అభీర్ కోసం ఎదురుచూస్తున్నారు అప్పుడే నాకు కూడా తెలిసింది. ఒక ఐదుగురు వాళ్ళ దగ్గరకి వచ్చి కొండ దగ్గరికి వెళ్లకుండా వెనక్కి తీసుకు వెళ్లిపోయారు వాళ్ళు ఎక్కడ ఉన్నారో ఎలా ఉంటారో ఎవరికి తెలియదు." అని చెప్పాడు హస్కర్.
ఆ మాట విని "అంటే! ఆ తెగ వాళ్ళు ఇంకా 250 మంది బతికి ఉన్నారా?" అని ఆశ్చర్యంగా చూస్తూ అడిగాడు అభిజిత్.
"అవును సార్! ఆ తెగ వాళ్ళు చాలా పవర్ఫుల్ మీరు కొంచెం జాగ్రత్తగా ఉండండి." అని చెప్పి అక్కడినుంచి దూరంగా వెళ్లి నుంచున్నాడు హస్కర్.
అక్కడ ఉన్న వారి వైపు చూస్తూ "ఒక్కడు మన దగ్గరికి వచ్చి శివతాండవం చేసి ప్రవీణ్ తల తీసుకుని దర్జాగా వెళ్ళిపోయాడు, ఇప్పుడు అలాంటి వాళ్ళు 250 మంది ఉన్నారు వాళ్లందరికీ ఒక నాయకుడు ఉన్నాడు, అతను చాలా తెలివైన వాడిని మీరే చెబుతున్నారు మీ ప్లాన్ లు ఇప్పుడు చెప్పండి." అని అడిగాడు రఘురామ్.
ఆ మాట విని అందరూ సైలెంట్ గా ఉండడం చూసి ముందుకు వచ్చి "ఆ జారువా తెగ వాళ్ళు కూడా మనుషులే కదా చంపితే చస్తారు కదా దాని గురించి ఎందుకు ఆలోచిస్తున్నారు.
వాళ్లు అడవిలో పెరిగారు మామూలుగా అయితే వాళ్ళని పట్టుకోలేము అందుకే ఎర వేసి వల వేసి వేటాడుదాము నేను ప్లాన్ చెప్తాను అలా చేయండి." అని చెప్పింది అర్ణ.
"ఎస్! అర్ణ మైండ్ లోకి ప్లాన్ వచ్చింది అంటే తప్పకుండా సక్సెస్ అవుతుంది అందరూ తనని ఫాలో అవ్వడం కరెక్ట్!" అని చెప్పాడు మిథున్.
ఆ మాట విని కోపంగా ముందుకు వెళుతున్న విష్ణు చేయ్యి పట్టుకుని ఆపి "కంగారు పడతవు ఎందుకు చూసుకుందాము." అని నెమ్మదిగా చెప్పాడు రఘురామ్.
"ప్రవీణ్ బాబాయ్ ది రేపు మూడో రోజు కార్యక్రమం అయ్యేలోపు ఆ డాక్యుమెంటరీ షూట్ చేసింది ఎవరో తెలుసుకోండి. వాళ్లకి కచ్చితంగా అభీర్ ఎక్కడ ఉన్నాడో తెలుస్తుంది తరువాత నా ప్లాన్ ఏమిటో చెబుతాను." అని చెప్పింది అర్ణ.
"సరే!" అని అక్కడ నుంచి అందరూ వెళ్లడంతో హస్కర్ దగ్గరికి వెళ్లి డబ్బులు ఇస్తూ "నువ్వు వెళ్ళు ఏదైనా అవసరం అయితే మళ్లీ పిలుస్తాను." అని చెప్పి ఫోన్ తీసి ఆగస్త్య కి కాల్ చేశాడు రఘురామ్.
ఫోన్ లిఫ్ట్ చేసి "గుడ్ మార్నింగ్ సార్! నేను పంపించిన హస్కర్ మీకు ఉపయోగపడ్డాడా?" అని అడిగాడు అగస్త్య.
"నువ్వు సూపర్ అయ్యా బాబు! అతని వల్ల అందరిలో నా ఇమేజ్ అమాంతం పెరిగిపోయింది. నేను ఇంత తెలివిగలవాడినా అని మా మామయ్య గారు కూడా ఆశ్చర్యపోయారు.
అలాగే ఆ అభీర్ వాడి మనుషులు ఎక్కడ ఉన్నారో తెలుసుకో నీ శ్రమకు తగ్గ ఫలితం ఉంటుందిలే!" అని నవ్వుతూ చెప్పాడు రఘురామ్.
"ఓకే సార్! నాకు తెలిసిన ప్రతి ఇన్ఫర్మేషన్ మీకు ఇస్తూ ఉంటాను." అని చెప్పి ఫోన్ పెట్టేసాడు అగస్త్య.
డల్ గా కూర్చున్న ప్రతాప్ మిశ్రా సుజిత్ మిశ్రాల దగ్గరికి వెళ్లి "సార్! సెక్యూరిటీగా ఉన్న నా మనుషులని పంపించేసారంట? ఇక్కడ మన వర్క్ కంప్లీట్ అయిపోయిందా?" అని అడిగాడు రాజన్.
ఆ మాటకి తల ఎత్తి డల్ గా చూస్తూ "మనమే అంటే మన కన్నా పెద్ద ముదర్లు ఉన్నారు ఇక్కడ! ఎవడి ప్లాన్లు వాడికి ఉన్నాయి, ఎవరి మనుషులు వాళ్ళకి ఉన్నారు, ఏం చేయాలో కూడా అర్థం కావడం లేదు." అని చెప్పాడు ప్రతాప్ మిశ్రా.
"ఆ అభీర్ మనుషులలో ఒక్కడినైనా మనం పట్టుకుంటే అర్ణ మన రూట్ కి వస్తుంది." అని చెప్పాడు సుజిత్.
"సార్! ఈరోజు నుంచి నా మనుషులు ఆ పనిలోనే ఉంటారు వాళ్ళు ఎక్కడ ఉన్నా సరే తెలుసుకుని మీకు చెబుతాను."అని చెప్పి అక్కడ నుంచి వెళ్ళాడు రాజన్.
తండ్రి ఫోటో వైపు బాధగా చూస్తున్న విష్ణు, ఆశల దగ్గరికి వెళ్లి "సారీ! ఈ టైంలో ఈ విషయం గురించి మాట్లాడొచ్చో లేదో నాకు తెలియదు కానీ నీ బాధ చూసి చెప్పాలి అనిపిస్తుంది.
నాకు బైరి అని ఒక వ్యక్తి తెలుసు అతను RAW తో కలిసి వర్క్ చేస్తూ ఉంటాడు, వాళ్ళ నెట్వర్క్ చాలా పెద్దది ఆ అభీర్ మనుషుల్ని ఈజీగా పట్టుకుంటాడు నువ్వు ఓకే అంటే ఒక్కసారి మీట్ అవుదాము." అని చెప్పింది రియా.
ఆ మాట విని "అవునా? అయితే వెంటనే మీటింగ్ అరేంజ్ చెయ్! వాళ్లలో ఒక్కడినైనా నా చేతులతో చంపాలి అప్పుడే నాకు ప్రశాంతంగా ఉంటుంది." అని చెప్పాడు విష్ణు.
"సరే! ఈవినింగ్ మీ ఇద్దరికీ మీటింగ్ ఏర్పాటు చేస్తాను." అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళింది రియా.

![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)