07-02-2026, 11:38 PM
(This post was last modified: 07-02-2026, 11:39 PM by SivaSai. Edited 1 time in total. Edited 1 time in total.)
Part - 83
శిల్ప అలా మాట్లాడుతూ ఉంటే భార్గవి బాధగా కూతురివైపు చూస్తూ నువ్వేం మాట్లాడుతున్నావో ఏమైనా అర్థమవుతుందా...
నేను నిజాలే మాట్లాడుతున్నాను. అవి నిజాలు కాబట్టి నీకు నచ్చడం లేదు. ఓకే అవని మామ్ మీద కోపంతో ఆవిడని ఏదో చేసావు అనుకోవచ్చు.
అవిని ఏం చేసింది. మా ఇద్దరినీ ఒకేలాగా ట్రీట్ చేసి ఉంటే.. నువ్వు వాళ్ళ మమ్మీకి హాని తలపెట్టిన..అది డాడీకి తెలిసేది కాదు కదా..
ఈరోజు చూడు నీ కూతురుగా పుట్టినందుకు నీలాగానే బ్యాడ్గా బిహేవ్ చేసి ఇక్కడ దాకా వచ్చాను. నాకు ఒక అక్క ఉన్నా సరే ఆ రిలేషన్ ని ఎంజాయ్ చేయలేకపోయాను.
ఇదంతా నీ వల్లే కదా.. ఐ హేట్ యు మామ్.. ఐ హేట్ యు అనుకుంటు అక్కడ నుండి వెళ్ళిపోతుంది. వెళుతున్న కూతురిని చూస్తూ నిశ్శబ్దంగా మారిపోతుంది.
అంతా శూన్యంగా కనిపిస్తుంది. తను, తన కూతురు ఇద్దరు గొప్పగా బతకాలి అని.. ప్రపంచానికి శిల్ప ఒక్కతే ధనుంజయ్ కూతురు.
ధనుంజయ్ ఎంపైర్ కి తనే యువరాణి అని నలుగురు అనుకోవాలి అని ఎంతో తాపత్రయపడింది. దాని కోసం ఎన్నో చేసింది. అవని నీ చాలా రకాలుగా హింసించింది.
రజిత మీద ఉన్న కోపాన్ని అంతా అవిని మీద చూపించింది. ఆఖరికి అవిని మెడలో తాళి లాగేసుకుంది. తన మేనల్లుడుతో అవిని జీవితాన్ని నాశనం చేయించడానికి కూడా వెనకడుగు వేయలేదు.
ఇన్ని నీచాలు పాపాలు చేసింది దేనికోసం. తన కూతురు గొప్పగా బతకాలి. భార్గవి మాత్రమే ధనుంజయ్ భార్య అని నలుగురు అనుకోవాలి అని. కానీ ఈరోజు ఏమయింది అని అక్కడే నిలబడి పోతుంది.
అక్కడే ఉన్న మరొక ఖైదీ కదిపే వరకు అలాగే నిలబడిపోతుంది. తర్వాత మెల్లిగా చిన్న చిన్న పనులు చేస్తూ ఉంటుంది కానీ శిల్ప అన్న మాటలు చుట్టూనే తిరుగుతూ ఉంటుంది.
భార్గవి మౌనాన్ని చూసి పక్కన ఉన్న ఖైదీ కదుపుతుంది. ఎందుకు నువ్వు ఇక్కడికి వచ్చినప్పుడు నుంచి చాలా సైలెంట్ గా ఉన్నావు. ఈరోజు మాత్రం నీలో బాధ కనిపిస్తుంది.
అది ఏమిటో షేర్ చేసుకో.. కొంచమైనా తగ్గుతుంది. షేర్ చేసుకోవాలా అన్నట్టుగా చూస్తుంది. ఏమిటి అలా చూస్తున్నావు.
ఒక ఖైదీ తో ఏంటి షేర్ చేసుకునేది అని ఆలోచిస్తున్నావా.. నువ్వు కూడా ఒక హంతకురాలివే కదా.. పరవాలేదు చెప్పు అంటుంది.
హంతకురాలిన అని తనలో తానే అనుకుంటుంది. నీలో నువ్వే ఏదో గోనుక్కుంటున్నట్టు ఉన్నావు. నీ గురించి మాకు ఇక్కడ ఎవరికీ తెలియదు అనుకుంటున్నావా..
ఆరోజు నువ్వు మాట్లాడింది అంతా కూడా టీవీలో వచ్చింది కదా.. మేమందరం ఇక్కడ న్యూస్ చూసేటప్పుడు చూసాము అని చెబుతుంది.
అప్పటిదాకా భార్గవికి అసలు ఐడియానే ఉండదు. ఆరోజు జరిగిందంతా టీవీలో వచ్చింది అని... సెక్యూరిటీ ఆఫీసర్లకి లైవ్ ఇచ్చారు అనుకుంది కానీ...
అది అంత టీవీలో న్యూస్ వచ్చేలాగా ప్లాన్ చేశారు అని అర్థమయ్యేటప్పటికి ఇంకా బిగుసుకుపోతుంది. ఇక తన జీవితం అంతా జైల్లోనే అని అర్థమయిపోతుంది.
పొరపాటున బయటికి వెళ్లిన జనం అందరూ కూడా తనని అదే దృష్టిలో చూస్తారు. ఇన్ని రోజులు ధనుంజయ్ భార్యగా సొసైటీలో తనకంటూ ఒక హోదా ఉంది.
కానీ ఆ సొసైటీయే ఇప్పుడు తను చాలా అసహ్యంగా చీప్ గా చూస్తుంది అని అర్థమవుతుంది. ఇలా ప్లాన్ చేసిన విక్రమ్ మీద కోపం వస్తుంది.
ధనుంజయ్ మీద కూడా కోపం పెరుగుతుంది.. కానీ ఏమీ చేయలేకపోతోంది. ఎంతసేపు మొదటి భార్య రజిత... రజిత.. అంటాడు కానీ....
తనతో కలిసి ఉన్నది గట్టిగా మూడు సంవత్సరాలు ఏమో.. మిగిలిన జీవితమంతా నాతోనే ఉన్నారు కదా.. నా ప్రేమ అర్థం కాలేదా..
ఏ రోజైనా ఆయనకి లోటు చేశానా అని తనలో తాను గొనుక్కుంటూ పనిచేసుకుంటూ ఉంటుంది. కూతురి ప్రవర్తన భర్త నిరాధారణ భార్గవిని బాగా కృంగదీస్తాయి.
అవని జీవితంతో ఆడుకున్న దానికి మాత్రం రియులైజ్ అవ్వదు.
శిల్పా పైకి బాధగా ఉన్న లోపల మాత్రం నవ్వుకుంటూ అమ్మతో ఇలా మాట్లాడింది మొత్తం కచ్చితంగా ఇటు నాన్నకు గాని.. అటు విక్రమ్ గాని తెలుస్తుంది.
వాళ్లు నన్ను పూర్తిగా నమ్ముతారు. నేను మారాను అనుకుంటారు. ఇంకొక రెండు మూడు సార్లు అమ్మతో ఇలా ప్రవర్తించి..
అప్పుడు నాన్నకు కబురు పంపిస్తాను. నన్ను అర్థం చేసుకుని ఇంటికి తీసుకు వెళ్ళిపోతారు. అప్పుడు మళ్లీ నా పాత లైఫ్ని స్టార్ట్ చేయొచ్చు అనుకుంటూ ఎంతో బాధగా కళ్ళు నీళ్లు రాకపోయినా తుడుచుకుంటూ పనిచేసుకుంటూ ఉంటుంది.
శిల్ప కి తెలియని విషయమేమిటంటే తను నటిస్తూ కార్చిన కన్నీళ్లే తర్వాత గిఫ్ట్ గా తీసుకుంటుంది అని...
బిందు ధనుంజయ్ సహాయంతో సునీల్ ని కలుస్తుంది. భార్యాభర్తలిద్దరూ మాట్లాడుకుంటారని ధనుంజయ్ అక్కడ నుండి వెళ్లిపోతాడు.
జైల్లో చిక్కుపోయి ఉన్న భర్తను చూసి కన్నీళ్ళతో ఎలా ఉన్నారండి అని అడుగుతుంది. చేసిన తప్పులకు శిక్ష అనుభవిస్తున్నాను అని తలదించుకొని చెబుతాడు.
ఉదయ్ గురించి ఏమైనా తెలిసిందా అని ఆత్రంగా అడుగుతాడు. ఏమీ తెలియలేదండి ఒకసారి విక్రమ్ ని కూడా కలిసి కనుక్కోవాలి.
మీరు చేసిన దానికి ఎన్ని సంవత్సరాలు శిక్ష పడుతుందో అర్థం కావడం లేదు అండి అని భయంగా భర్త చేతులు పట్టుకొవడానికి చూస్తుంది.
కానీ ఇద్దరి మధ్య ఉన్న గ్రిల్స్ ఆ అవకాశాన్ని ఇవ్వదు. దానితో బాధగా చూస్తూ మనం చేసిన పాపాలు వల్ల ఒకరికొకరు ఎదురుగా ఉన్న ఓదార్చుకోలేని పరిస్థితిలో ఉన్నాము.
నాకు ఎన్ని సంవత్సరాలు శిక్ష పడిన పరవాలేదు. కోర్టులో నేను నిజమే చెబుతాను. కుదిరితే అవినికి నా తరపున క్షమాపణలు చెప్పు.
మన స్వార్థం కోసం రజిత ప్రాణాలు పోతున్న కళ్ళు వదిలిపెట్టి చూశాను. అదే స్వార్థంతో నా కొడుకు చేతులో అవని జీవితం నాశనం అవ్వబోతుంటే కూడా సంతోషపడ్డాను.
ఆ పాపమే శాపమై తగిలి ముగ్గురుము చేట్టుకొకళ్ళం పుట్టకోకళ్ళం అయినట్టు అయిపోయాము అని బాధపడతాడు.
బాధపడకండి అని చెబితే.. బాధపడకుండా ఎలా ఉంటాను బిందు. ఈ వయసులో అండగా నిలబడాల్సిన కొడుకు ఏమైపోయాడో తెలియదు.
భార్యని పరాయి వాళ్ళు చెంతన ఉంచాల్సి వచ్చింది ఇంతకంటే దౌర్భాగ్యం ఏమంటుంది అని బాధపడతాడు.
టైం అయిపోయింది అని కానిస్టేబుల్ చెప్పగానే ఇంకా వెళతానండి అని బయటికి వస్తుంది.
ధనుంజయ్ దగ్గరికి వెళ్లి అన్నయ్యగారు ఇంకొక చిన్న సహాయం చేస్తారా అని అడుగుతుంది. నావల్ల అయ్యేది అయితే చేస్తాను చెప్పు అని ఎటో చూస్తూ చెబుతాడు.
మీకు నా మొఖం చూడడం కూడా ఇష్టం లేదని అర్థమవుతుంది అని బాధగా అనుకొని.. ఒకసారి నన్ను విక్రమ్ దగ్గరికి తీసుకువెళ్తారా అని అడుగుతుంది.
ఎందుకు అని అనుమానంగా అడిగితే.. నా కొడుకు గురించి తెలుసుకోవడానికి. వాడు ఎక్కడున్నాడో తెలిస్తే నేను కూడా అక్కడే ఉండి పనిచేసుకుంటాను.
లేదు అంటే నా కొడుకుని తీసుకుని ఎక్కడికైనా వెళ్ళిపోతాను అని చెబుతుంది. ఆ మాటలకు ఒకసారి బిందువైపు చూస్తాడు.
బిందులో పశ్చాత్తాపం కనబడుతూ ఉంటుంది. కానీ తను ఏమీ చెయ్యలేడు. ఎందుకంటే విక్రమ్ ఏదైనా ఒక నిర్ణయం తీసుకున్నాడు అంటే..
ఎంత స్ట్రిక్ట్ గా ఉంటాడో అన్నది తనని మామగారు అని పిలవనప్పుడే అర్థమైంది. ఏంటన్నయ్య గారు ఏమి మాట్లాడకుండా చూస్తున్నారు.
నేను మారలేదు. ఇంకా నటిస్తున్నాను అనుకుంటున్నారా అని బాధగా అడుగుతుంది. నువ్వు నటిస్తున్నావా లేదా అని నేను ఆలోచించడం లేదు.
విక్రమ్ ఇప్పుడు అప్పుడే నీ కొడుకుని నీకు చూపించడు. ఇది మాత్రం నిజం. వెళ్లి అడిగి అవమానపాలు అవ్వడం తప్ప ఉపయోగం లేదు.
నిన్ను ఆ ఇంటి గేటు కూడా దాటనివ్వరు. సమయం వచ్చినప్పుడు నేనే తీసుకువెళతాను అని చెప్పి పదా అని కారు దగ్గరికి వస్తాడు. ధనుంజయ్ ని అనుసరిస్తూ బిందు కూడా వెళుతుంది.
రాజ్ మెల్లిగా కళ్ళు తెరిచి చుట్టూ చూస్తూ ఉంటాడు. టైమెంతయింది అనుకుంటు మొబైల్ తీసి చూసి అదేంటి ఇంత టైం అయ్యేదాకా పడుకున్నాను అని గబగబా మంచం మీద నుంచి లేస్తాడు.
కాళ్లు ఒకటే నొప్పులు. ఒళ్లంతా పులుసు పోయి ఉంటుంది. అబ్బా ఈ నొప్పులు ఏమిట్రా దేవుడా అనుకు..ని నిన్న షాపింగ్ ఎఫెక్ట్ అనుకుంటా..
అయినా ఈ ఆడవాళ్ళు ఇంత ఓపిగ్గా ఎలా షాపింగ్ చేస్తారు. వీళ్ళకి అసలు నొప్పులు ఉండవా అనుకుంటూ మెల్లగా లేచి ఫ్రెష్ అయ్యి బయటకు వస్తాడు.
రాజ్ ని చూసిన లలిత గారు లేచావమ్మా కాఫీ తీసుకురానా అని చెప్పి వెళ్లి స్ట్రాంగ్ కాఫీ కలుపుకొని ఇచ్చి.. చాలా థాంక్స్ రాజ్.
నివి చెపుతుంది నువ్వు బాగా ఓపిగ్గా తిప్పావు. నీకు ఓపిక ఎక్కువ అని మెచ్చుకుంటుంది అని గొప్పగా చెబుతారు. ఆ మాటలు వింటూ ఒకసారి నివి వైపు చూస్తాడు.
అప్పుడే విరిసిన ఫ్రెష్ గులాబీ లాగా ఉంటుంది. ఇంకా షాపింగ్ ఎక్కడ చేయాలో అన్నది అవినితో డిస్కస్ చేస్తూ ఉంటుంది.
ఈ లేడీస్ కి ఇంత ఓపిక ఎక్కడి నుంచి వస్తుంది. నిన్న ఇద్దరం కలిసే కదా తిరిగాము. నేను ఇంతలా అలసిపోయి పడుకుంటే...
ఈ మేడమ్ ఎప్పుడు లేచింది. మళ్ళీ షాపింగ్ డిస్కషన్ పెట్టింది. వీళ్ళకి నొప్పులు ఉంటావా.. ఉన్నా సరే షాపింగ్ పిచ్చలో వదిలేస్తారా అని ఆలోచిస్తూ వాళ్ళిద్దరు వైపే చూస్తూ ఉంటాడు.
ఏమిటి రాజ్ ఆలోచిస్తున్నావు అని లలిత గారు కదిపితే.. ఆహా ఏమీ లేదు. నిన్న ఇద్దరము కలిసే కదా తిరిగాము. నేను ఇంత టైడ్ అయిపోయిఉంటే...
నివి ఎలా ఫ్రెష్ గా ఉందా అని ఆలోచిస్తున్నాను అంతే అంటాడు. దానికి నివి నవ్వుతూ ఇందులో అంత ఆలోచించాల్సిందే ఏముంది.
నాకు షాపింగ్ ఇష్టం. పనులు ఉన్నాయి కాబట్టి ఎలా ఉన్నా సరే నేను అడ్జస్ట్ అయిపోతాను అని చెబుతోంది. అవునా అనుకొని... ఆంటీ శ్రీ, విక్రమ్ ఎక్కడ కనపడటం లేదు ఏంటి...
వాళ్ళు పొద్దుటే ఆఫీస్ కి వెళ్ళిపోయారు. ఈ రోజుకి రెస్ట్ తీసుకోమన్నారు. సాయంత్రం వచ్చిన తర్వాత ఏదో పని ఉందంట.
ఓ మై గాడ్ మల్లి షాపింగా... ఈసారి గుండెజారి కడుపులోకి వస్తుంది. ఇంకొక్క నాలుగు రోజులు నన్ను ఇలా తిప్పారు అంటే....
పెళ్లి సంగతి ఏమోగానీ హాస్పిటల్ బెడ్ ఎక్కడం ఖాయం అనుకొని.. సరే అంటి నేను వెళ్లి రెస్ట్ తీసుకుంటాను అని అక్కడి నుంచి మెల్లిగా జారుకుంటాడు.
టిఫిన్ చేసి రెస్ట్ తీసుకో అంటే ఇప్పుడు టిఫిన్ ఏమి వద్దు అంటి... డైరెక్ట్ గా లంచ్ చేస్తాను అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు.
ఒక్కొక్కరి ఆలోచన ఒక్కొక్క విధానం..
ఎవరి ఆలోచన ఎటు మలుపు తిప్పుతుంది...

![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)