07-02-2026, 11:35 PM
ఎపిసోడ్ 66
గెస్ట్ హౌస్ దగ్గరికి వచ్చి వరదరాజులు మనుషుల్ని కొట్టి ముకుల్ రెండో కొడుకు ప్రవీణ్ తలనరికి బ్యాగ్ లో పెట్టుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు నారప్ప.
*****************
ప్రవీణ్ తల నరికి దర్జాగా సూట్ కేసులో పెట్టుకుని వెళ్ళిపోతున్న నారప్ప వైపు భయంగా చూస్తూ 'ఈ టైమ్ కి వీళ్ళు ఇండియా రాకపోతే ఆ తల నాదై ఉండేదేమో!' అనుకున్నాడు సుజిత్.
"ఆ నారప్ప గాడు తల తీసుకుని అంత దర్జాగా వెళుతుంటే చూస్తూ నుంచున్నారేమిటిరా? వెళ్లి అడ్డంగా నరికేయండి." అని గట్టిగా అరిచాడు అభిజిత్.
ఆ మాట విని గేట్ వైపు పరిగెత్తారు వరదరాజులు మనుషులు.
గేటు వైపు పరిగెత్తిన వాళ్ళ వెనకాలే వెళుతున్న నిర్మల్, మోహిత్, ప్రమోద్ వాళ్ళని వీడియో కాల్ లో చూస్తూ "అందరూ అక్కడే ఉండండి ఎవరు బయటకు వెళ్ళకండి ఆ అభీర్ మనిషి ఒక్కడే రాడు మనలో మరొక ప్రాణం పోవడం నేను చూడలేను." అని గట్టిగా అరిచి ఏడుస్తూ ఉన్నాడు ముకుల్.
ఆ మాట విని అక్కడే ఆగి ప్రవీణ్ బాడీ దగ్గరికి వెళ్లి బాధపడుతూ ఉన్నారు అందరు.
"ఇండియా వెళ్ళద్దు అని తాతగారు ముందే చెప్పారు కానీ మనమే ఆయన మాట వినకుండా వచ్చేసాము." అని ఏడుస్తూ చెప్పింది ఆశ.
వీడియో కాల్ చూస్తూ "అభిజిత్! వాళ్ళని ఎలాగైనా సేఫ్గా లండన్ కి పంపించు." అని చెప్పాడు ముకుల్.
ఆ మాట విని కోపంగా చూస్తూ "మీ కొడుకుని చంపితే మీరు ప్రశాంతంగా ఉండొచ్చు ఏమో! నా తండ్రిని చంపితే నేను చేతులు కట్టుకుని కూర్చోలేను, దీనికి కారణమైన వాళ్ళని చంపిన తర్వాతే నేను ఇక్కడి నుంచి వస్తాను." అని ఏడుస్తూ చెప్పాడు విష్ణు.
"సరే! మేము వచ్చేవరకు ఎవరు ఆ గెస్ట్ హౌస్ వదిలి బయటకు వెళ్ళకండి. లోపలికి ఎవరని రానివ్వకండి ఇప్పుడే తాతగారు నేను ఇండియాకి బయలుదేరుతున్నాము." అని చెప్పి కాల్ కట్ చేసింది అర్ణ.
అంతలో అక్కడకి వచ్చి "సార్! వాడు ఎటు వెళ్లిపోయాడో తెలియదు ఎక్కడ కనపడలేదు." అని చెప్పాడు వరదరాజులు మనిషి.
ఆ మాట విని కోపంగా చూస్తూ "అయ్యగారికి ఇచ్చిన మాట నిలబెట్టుకోలేకపోయాను, వాడు వాడి నాయకుడు నా నుంచి ఎలా తప్పించుకుంటారో చూస్తాను." అని కొడుకు వైపు చూసి "ఎస్పీ ప్రహ్లాద్ కి ఫోన్ చేసి రమ్మను." అని చెప్పాడు వరదరాజులు.
"ఆ ఎస్పి అంత గట్టోడా? అభీర్ ని వాడి మనుషులను పట్టుకుంటాడా?" అని అడిగాడు ముకుల్ చిన్న అల్లుడు రాజేష్.
"ఆ ఎస్పీ వాళ్ళని పట్టుకోవడమే కాదు, ఒకొక్కడి పేగులు తీసి మెడలో వేసుకుంటాడు." అని చెప్పాడు తంబియార్.
"ఆ అభీర్ సేనని వేటాడడానికి సెక్యూరిటీ ఆఫీసర్లు ఒక్కరే సరిపోరు ప్రొఫెషనల్ కిల్లర్స్ ని కూడా దింపాలి రష్యన్ నుంచి నెల్సన్ గ్యాంగ్ ని పిలిపిస్తాను మనం కొట్టే దెబ్బ ఎలా ఉంటుందో వాడికి రోజు చూపిస్తాను." అని ఆవేశంగా చెప్పాడు మోహిత్.
"మీరందరూ ఏం చేస్తారో నాకు తెలియదు నా ఆస్తి మొత్తం పోయిన పర్వాలేదు మా డాడ్ ని చంపిన వాళ్ళు మాత్రం బతికి ఉండకూడదు." అని చెప్పాడు విష్ణు.
చనిపోయిన ప్రవీణ్ వైపు చూసి బాధపడుతూ "నిర్మల్! అస్సాం కి ఫోన్ చేసి సాధు గ్యాంగ్ ని బయలుదేరి రమ్మను రమ్మను, మనం మెత్తగా ఉంటే వాళ్ళు నమన భుజాలు ఎక్కి కూర్చుంటారు. అలాగే సాయంత్రం జాకీ ఫ్లైట్ దిగుతాడు వాడిని సేఫ్గా గెస్ట్ హౌస్ కి తీసుకురండి." అని చెప్పాడు అభిజిత్.
అక్కడ ఉన్న అందరి మాటలు విని సుజిత్ దగ్గరికి వెళ్లి "సార్! నాకు చాలా భయంగా ఉంది నేను ఇంటికి వెళుతున్నాను." అని చెప్పింది రియా.
"సరే జాగ్రత్తగా వెళ్ళు నిన్ను డ్రాప్ చేయడానికి రాలేకపోతున్నాను." అని చెప్పాడు సుజిత్.
"నో ప్రాబ్లం సార్!" అని అక్కడి నుంచి బయటికి వచ్చింది రియా.
*****************
సూట్ కేస్ పట్టుకుని ఇంటి దగ్గరకి వచ్చిన నారప్పని చూసి సంతోషంగా దగ్గరికి వెళ్లి భుజం మీద చేతులు వేసి "సహదేవుడి ఆత్మ ఇప్పుడు శాంతిస్తుంది వీడి తలని కూడా ఆ డబ్బుల కట్టలలో వేసి తగలబెట్టండి." అని చెప్పి ఫోన్ తీసి నీలమ్ కి కాల్ చేశాడు అభీర్.
ఆఫీసులో వర్క్ లో ఉండగా ఫోన్ రింగ్ అవ్వడం చూసి 'అభీర్ కాల్ చేస్తున్నాడు.' అని సంతోషంగా లిఫ్ట్ చేసి "హయ్!" అని చెప్పింది నీలమ్.
"హయ్! నాకు హెల్ప్ చేస్తాను అన్నావు కదా! నేను చెప్పే విషయం న్యూస్ ఛానల్ లో ధైర్యంగా టెలికాస్ట్ చేయగలవా?" అని అడిగాడు అభీర్.
"ఆ లాయర్ హిరణ్య చచ్చిన తర్వాత మా ఎండీకి ధైర్యం వచ్చింది. నువ్వు ఏం చెప్తావో అది న్యూస్ లొ వస్తుంది." అని చెప్పింది నీలమ్.
"సరే! ముకుల్ రెండో కొడుకు నా మనిషి చేతిలో చనిపోయాడు ఈ చావులు వల్ల వాళ్ళ మీద ఎవరికి జాలి రాకూడదు అసలు నిజం అందరికీ తెలియాలి.
ఈరోజు నుంచి మీ ఛానల్ లొ మా జారువా తెగ స్టోరీ స్టార్ట్ చెయ్! మాకు జరిగిన అన్యాయం చూపించు, మీ ఛానల్ కి మీకు నేను అండగా ఉంటాను." అని చెప్పాడు అభీర్.
"నువ్వు మాట ఇచ్చావు అంటే చాలు ఇక నేను చూసుకుంటాను, ఈ రోజు సాయంత్రం నుంచి స్టోరీ స్టార్ట్ అవుతుంది." అని సంతోషంగా చెప్పి ఫోన్ పెట్టేసింది నీలమ్.
ఫోన్ మాట్లాడుతున్న అభీర్ దగ్గరకి చాక్లెట్ తో కలిసి వచ్చి "అన్న!" నువ్వు చేసేది తప్పు అని నేను చెప్పను, కానీ ఏ తప్పు చేయని ఆ ఇంటి ఆడవాళ్ల పరిస్థితి ఏమిటి?" అని అడిగింది మిత్ర.
"ప్రజల శ్రేయస్సు కోసం ఆడది అయ్యినా రాక్షసి తాటకిని రాముడు శిక్షించాడు, అలాగే తన వంశాన్ని ప్రజలని రాజ్యాన్ని నాశనం అవ్వాలని శపించిన ధృతరాష్ట్రుడు భార్య గాంధారిని శ్రీకృష్ణుడు క్షమించాడు.
శిక్షా అనేది ఆడ మగ తేడా ఉండదు వారి ప్రవర్తనని బట్టి ఉంటుంది. ఆ ఇంటి ఆడవాళ్లు పాపబితి చెందితే బతుకుతారు లేకపోతే చనిపోతారు." అని చెప్పాడు అభీర్.
"నువ్వు చెప్పింది నిజమే అన్న! ధర్మం, న్యాయం అందరికీ సమానమే ఎవరి కోసం మారదు." అని సంతోషంగా చూస్తూ చెప్పింది మిత్ర.
"అక్క! రాజు ఫోన్ చేసాడు ఆ జాకీ దుబాయ్ నుంచి వస్తున్నాడు ఈరోజు సాయంత్రం ఎయిర్ పోర్ట్ లో దిగుతున్నాడు." అని చెప్పాడు చాక్లెట్.
"అవునా? ఆ జాకీ గాడి చావు నా చేతుల్లోనే ఉంది." అని ఆవేశంగా చెప్పింది మిత్ర.
ఆవేశం గా ఉన్న మిత్ర వైపు చూసి "ప్రతిదానికి ఒక సమయం ఉంటుంది ప్రశాంతంగా ఉండు, ముకుల్ కొడుకు చావుతో వాళ్లు కచ్చితంగా జాగ్రత్త పడతారు, ఈ సమయంలోనే మనం తెలివిగా ఉండాలి శత్రువు బలం తెలుసుకోకుండా మనం అడుగు ముందుకు వేయకూడదు." అని చెప్పాడు అభీర్.
అక్కడకి వస్తూ "అభీర్ చెప్పింది నిజం! వరదరాజులు ఎస్పీ ప్రహద్ ని రంగంలోకి దింపుతున్నాడు, సుభాష్ కొడుకు మోహిత్ రష్యా నుంచి ప్రొఫెషనల్ కిల్లర్ నెల్సన్ గ్యాంగ్ ని దింపుతున్నాడు, అభిజిత్ కొడుకు నిర్మల్ అస్సాం నుంచి సాధు గ్యాంగ్ ని దింపుతున్నాడు, అంతేకాదు అర్ణ మాకుల్ ఇండియాకి స్టార్ట్ అయ్యరు." అని చెప్పింది రియా.
తను చెప్పింది విని "బైరి వాళ్లకి హెల్ప్ చేయడానికి వచ్చే ప్రతి ఒక్కరి డీటెయిల్స్ నాకు కావాలి జాజి, నారప్ప తప్పితే అందరు రంగలోకి దిగండి." అని చెప్పాడు అభీర్.
"సరే నాయుకుడా!" అని తన వాళ్ళందరినీ పిలిచాడు బైరి.
"నేను కూడా వెళ్లి అర్ణని రిసీవ్ చేసుకుంటాను." అని చెప్పింది మిత్ర.
అక్కడికి వచ్చిన తన వాళ్ళ వైపు చూసి "మనం వేసే ప్రతి అడుగు జాగ్రత్తగా వెయ్యాలి మనలో ఒక్క ప్రాణం కూడా పోకూడదు వాళ్లలో ఒక్క ప్రాణం కూడా మిగలకూడదు, నేను చెప్పే వరకు ఎవరు ఆవేశపడకండి జై భవాని!" అని ఆవేశంగా చెప్పాడు అభీర్.
"జై భవాని, జై భవాని!" అని చెపుతూ అక్కడనుంచి బయలుదేరారు అభీర్ సేన.
"నాయకుడా ఇప్పుడు మన ప్లాన్ ఏమిటి?" అని అడిగాడు బైరి.
"మన పద్మవ్యూహం లోపలికి వాళ్ళని స్వేచ్ఛగా రానివ్వండి. అక్కడ నుంచి ఎవరు వెనక్కి వెళ్ళలేరు నేను చెప్పిన ప్లాన్ స్టార్ట్ చేయండి." అని చెప్పాడు అభీర్.
"సరే నాయకుడా!" అని చెప్పి అక్కడి నుంచి బయలుదేరారు రాజన్ వాళ్ళ ఐదుగురు.
******************
లండన్ నుంచి ముకుల్, అర్ణ, టూర్ నుండి మహేష్ మిథున్, దుబాయ్ నుంచి జాకి రావడంతో ఉదయం ప్రవీణ్ కి అంత్యక్రియలు చేసి "అంకుల్! మనం ఇంకా భయపడుతూ బ్రతకకూడదు మీలో నేను పాత ముకుల్ ని చూడాలి." అని చెప్పాడు అభిజిత్.
"నా ఫ్యామిలీలో ఎవరికి ఈ పరిస్థితి రాకూడదు అని దూరంగా పారిపోయాను కానీ ఆ అభీర్ నన్ను మళ్ళీ ఇక్కడికి వచ్చేటట్లు చేశాడు ఇన్ని రోజులు ఆ తెగ వాళ్ళ జోలికి వెళ్లి నిన్ను తప్పు చేశాను అనుకున్నాను.
కానీ వాడిని చంపకుండా జైల్లో పెట్టి ఇక్కడ నుంచి పారిపోయి తప్పు చేశాను అని ఇప్పుడే తెలుసుకున్నాను, ఇకనుంచి నేనేమిటో వాడికి చూపిస్తాను ఆ బేరా కొండల మీదే నా నంద సామ్రాజ్యాన్ని స్థాపిస్తాను." అని ఆవేశంగా చెప్పాడు ముకుల్.
అక్కడ బాధపడుతున్నట్లు నటిస్తూ కొడుకుని తీసుకుని దూరంగా వెళ్లి "ఏంటి? ఈ ముక్కోడు చేసేది. వాళ్లలో ఒక బచ్చ గాడు వచ్చి అతమంది ముందు తల నరికి దర్జాగా వెళ్ళిపోయాడు.
అసలు వాళ్ళు ఎంతమంది ఉన్నారో, ఎక్కడ ఉన్నారో, ఏం చేస్తున్నారో కూడా తెలియదు, ఇంక వీడు పీకేది ఏముంది?" అని చెప్పాడు ప్రతాప్ మిశ్ర.
"నువ్వు చెప్పింది నిజమే డాడ్! వాళ్లు మామూలు వాళ్ళు కాదు, ఆ నారప్ప గాడే అలా ఉన్నాడు అంటే వాళ్ళ నాయకుడు అభీర్ ఎలా ఉంటాడో తలుచుకుంటూనే భయం వేస్తుంది." అని చెప్పాడు సుజిత్.
"మనం ఇకనుంచి ప్రేక్షకా పాత్ర వహిద్దాము వాళ్ళు వాళ్ళు కొట్టుకు చాస్తారు ఎవరు మిగిలితే వాళ్లవైపు వెళ్లి నుంచుందాము." అని చెప్పాడు ప్రతాప్ మిశ్ర.

![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)