06-02-2026, 07:32 AM
ఎపిసోడ్ 64
ఢిల్లీ ఎయిర్పోర్ట్లో ఫ్లైట్ ల్యాండ్ అయ్యినా వెంటనే ముకుల్ ఫోన్లో చెప్పడంతో లండన్ కి రిటన్ అయ్యినా ఫ్లైట్ ని వెళ్ళనివ్వకుండా ఆకాశంలో రాబందులు చుట్టుముట్టడంతో అందరూ షాక్ అయ్యి చూస్తూ ఉండిపోయారు.
*************
వీడియో కాల్ లో ఆకాశంలో ఉన్న రాబందులను చూసి "అక్కడకి సింబా వచ్చాడు అంటే అభీర్ వచ్చినట్లే! ఇంక మనవాళ్లు ఎయిర్ పోర్ట్ ఉండడం సేఫ్ కాదు వెంటనే అక్కడి నుంచి వెళ్లిపోవాలి." అని చెప్పాడు ముకుల్.
ఆ మాట విని "ఏంటి తాతయ్య? ఆ పక్షులకు కూడా భయపడాలా? ఒక్క నిమిషంలో ఆకాశంలో వాటిని లేకుండా చేయొచ్చు!" అని వీడియో కాల్ లో చూస్తూ "రాహుల్! ఏంటి నోరు వెళ్ళబెట్టి చూస్తున్నారు? సైరన్స్ ఆన్ చేసి ఫ్లై జోన్ క్లియర్ చేయమను." అని సీరియస్ గా చెప్పింది అర్ణ.
"ఓకే మేడం!" అని హడావుడిగా ఆఫీసర్స్ దగ్గరికి పరిగెత్తాడు రాహుల్.
తండ్రితో కలిసి అక్కడికి వచ్చి ఆకాశంలోకి ఆశ్చర్యంగా చూస్తూ "ఈ రాబందులు అన్ని ఏక్కడి నుంచి వచ్చాయి?" అని అక్కడికి వచ్చిన ఆఫీసర్ వైపు చూసి "వాటిని చెదరగొట్టండి లేకపోతే షూట్ చేయండి." అని చెప్పాడు తంబియార్.
"సార్! మనం ఇక్కడి నుంచి షూట్ చేసిన బుల్లెట్ అంత పైకి వెళ్ళదు, సైరన్స్ ఆన్ చేస్తున్నాము ఆవే పోతాయి." అని చెప్పి సిగ్నల్ ఇచ్చాడు ఆఫీసర్.
అంతలో సైరన్స్ ఆన్ అవడంతో అక్కడ ఉన్న వారంతా గట్టిగా చెవులు మూసుకుని ఆకాశం వైపు చూస్తూ ఉన్నారు.
ఆకాశంలో ఉన్న రాబందులు కొంచెం పక్కకి జరగడం వీడియో లొ చూసి "తాతయ్య! టెన్షన్ పడకండి క్లియర్ అవుతుంది. మనవాళ్ళు బయలుదేరుతారు." అని సంతోషంగా చూస్తూ చెప్పింది అర్ణ.
సడన్గా ఆ రాబందుల మధ్యలో నుంచి వేగంగా అక్కడికి వచ్చి ఫ్లైట్ ముందు వాలేడు సింబా.
ఫ్లైట్ ముందు ఉన్న సింబాని చూసి "ఇంక ఫ్లైట్ ఇక్కడి నుంచి ఆగుళం కూడా కదలదు, లోపల ఉన్న వాళ్ళు చచ్చినట్లు ఈ గడ్డమీద దిగి ఇక్కడ చావ్వాల్సిందే!" అని సంతోషంగా చూస్తూ చెప్పింది రియా.
సింబా అరుపు విని వేల సంఖ్యలో గబ్బిలాలు అక్కడకి వచ్చి ఫ్లైట్ మీద వాలి మూసేయడంతో వీడియో కాల్ లొ చూస్తూ 'ఏంటిది? అసలు ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి? " అని కంగారుగా చూస్తూ
"రాహుల్ మనవాళ్ళని అర్జెంటుగా ఫ్లైట్ దింపి అక్కడి నుంచి సేఫ్ గా తీసుకు వెళ్లిపోండి." అని చెప్పింది అర్ణ.
వీడియో కాల్ లో చూస్తూ "పాప! నువ్వు కంగారు పడకు మన వాళ్ళని సేఫ్ గా గెస్ట్ హౌస్ కి తీసుకు వెళ్తాను." అని చెప్పి తన మనుషులని ఫ్లైట్ దగ్గరికి పంపించాడు వరదరాజులు.
ఫ్లైట్ ని పట్టుకున్న గబ్బిలాలని ఆకాశంలో ఏగురుతున్న రాబందులని ఫ్లైట్ ముందు ఉన్న సింబాని చూసి "నంద కుటుంబం మీద ఈ పక్షులు ఏమైనా పగ పట్టాయా ఏంటి? అందుకే వీళ్ళు ఇండియా రావడం లేదా?" అని డౌట్ గా తండ్రిని అడిగాడు తంబియార్.
"నాకు కూడా తెలియదు ముందు వాళ్ళని దింపి మన గెస్ట్ హౌస్ కి తీసుకువెళ్లే పని చూడు, తర్వాత ఈ గోలా ఏమిటో తెలుసుకుందాము." అని చెప్పాడు వరదరాజులు.
ఫ్లైట్ లో నుంచి కిందకు దిగుతూ అక్కడ ఉన్న పక్షుల్ని చూసి భయంతో పరిగెత్తుకుంటూ ఎయిర్ పోర్ట్ లోకి వెళ్లి వీడియో కాల్ లో ఉన్న అర్ణ వైపు చూసి "ఏంటి ఇదంతా?" అని కంగారుగా అడిగాడు రఘురామ్.
"మావయ్య! అది నా ప్లాన్ కాదు మీరు జాగ్రత్తగా వరదరాజులు గారితో పాటు వెళ్ళండి. మిమ్మల్ని లండన్ ఎలా తీసుకురావాలో నేను ఆలోచిస్తాను." అని చెప్పింది అర్ణ.
"సరే!" అని అక్కడ రెడీగా ఉన్న కార్ లలో ఎక్కరు అందరు.
కార్ దగ్గరికి వెళ్లి విష్ణు వైపు చూసి "వెల్కం టు ఇండియా సార్!" అని నవ్వుతూ చెప్పింది రియా.
"ఏంటి? మా విష్ణు నీకు ముందే తెలుసా?" అని డౌట్ గా అడిగాడు సుజిత్.
"నో సార్! నేను అందరికీ చెప్తున్నాను విష్ణు గారు అంటే వీళ్ళలో ఎవరు?" అని అడిగింది రియా.
"సరే! ముందు ఇక్కడి నుంచి వెళ్ళిన తర్వాత మాట్లాడుకుందాము నువ్వు కూడా ఏదో ఒక కార్ లొ వచ్చేయ్!" అని చెప్పాడు సుజిత్.
అక్కడికి వచ్చి "త్వరగా వెళ్ళండి ఆ పక్షులు ఇక్కడికి వచ్చి కార్ లు కూడా కదలకుండా చేస్తాయేమో!" అని కంగారుగా చూస్తూ చెప్పాడు రాహుల్.
అక్కడినుంచి కార్లు మొత్తం వరదరాజులు గెస్ట్ హౌస్ దగ్గరికి బయలుదేరడంతో ఎయిర్ పోర్ట్ స్టాఫ్ వైపు చూసి గట్టిగా అరుస్తూ తన ముక్కుతో ఫ్లైట్ ని పొడిచి వార్నింగ్ ఇచ్చి ఆకాశంలోకి వేగంగా ఎగిరిపోయాడు సింబా.
అక్కడ నుంచొని ఆశ్చర్యంగా చూస్తూ "ఆ పక్షి మనతో ఏదో చెప్పాలనుకుంటుంది." అన్నాడు స్టాప్ లో ఒకడు.
"ఈ ఫ్లైట్ ఇక్కడి నుంచి ఎగిరితే ముక్కుతో పొడిచి మరీ కులుస్తాను అని వార్నింగ్ ఇస్తుంది." అని చెప్పాడు రాజన్.
"అవునా?" అని ఆశ్చర్య చూస్తూ ఉన్నారు అక్కడ స్టాప్.
కాసేపటికి అక్కడికి వచ్చిన గబ్బిలలు, రాబందులు వెళ్లిపోవడంతో "ఈ పక్షులన్నీ కచ్చితంగా వీళ్ళ మీద పగబట్టాయి." అని చెప్పాడు తంబియార్.
"కరెక్టే సార్! నేను ఇప్పటి వరకు అంత పెద్ద పక్షిని చూడలేదు, ఇంకా నయం వాళ్లకి హెల్ప్ చేసుకున్నందుకు మన మీద అటాక్ చేయలేదు." అని భయంగా చూస్తూ చెప్పాడు రాహుల్.
ఎయిర్ పోర్ట్ నుంచి ఫ్యామిలీ మెంబర్స్ వెళ్లిపోవడంతో వీడియో కాల్ కట్ చేసి "తాతయ్య! మనవాళ్ళు సేఫ్గా గెస్ట్ హౌస్ కి వెళ్ళిపోతున్నారు ఫ్లైట్ అక్కడే ఉంచమన్నాను టైం చూసి వాళ్ళని వెనక్కి తీసుకోవద్దము." అని చెప్పింది అర్ణ.
"అభీర్ ఎవరిని అక్కడ నుంచి వెనక్కి రానివ్వడు, ఇప్పుడు వాళ్ళని ఇక్కడికి తీసుకు రావడానికి చూడకూడదు అక్కడ వాళ్ళ ప్రాణాలు కాపాడడానికి చూడాలి." అని టెన్షన్ గా చూస్తూ చెప్పాడు ముకుల్.
ఆ మాట విని "అసలు అభీర్ ని లేకుండా చేస్తే ఈ ప్రాబ్లం ఉండదు కదా! ఇప్పటివరకు వాడి ఆట మనకి చూపించాడు ఇప్పుడు నా అట వాడికి చూపిస్తాను." అని సీరియస్ గా చెప్పింది అర్ణ.
****************
వసుంధర ఇంటి దగ్గరికి వచ్చి హాల్లో టీవీ చూస్తున్న వాళ్ళని చూసి "మేడం! ఒకసారి న్యూస్ చూడండి ఇండియాకి వచ్చి వెనక్కి పారిపోదాం అనుకున్నా నంద ఫ్యామిలీకి అభీర్ చుక్కలు చూపించాడు." అని నవ్వుతూ చెప్పింది మిత్ర.
ఆ మాట విని న్యూస్ ఛానల్ పెట్టి ఎయిర్ పోర్ట్ లొ జరిగింది చూస్తూ "ఆధర్మం మీద ధర్మం యుద్ధం మొదలుపెడితే ఎలా ఉంటుందో ఇప్పుడు వీళ్ళకి తెలుస్తుంది." అని చెప్పింది వసుంధర.
"వదిన! ఫ్యామిలీ అంటే మగాళ్ళే కాదు ఆడవాళ్లు కూడా ఉంటారు కదా వాళ్ళని కూడా అభీర్ చంపేస్తాడా?" అని అనుమానంగా అడిగింది నీలమ్.
"చట్టం ముందు ఆడ మగ తేడా లేదు, కానీ అభీర్ నమ్మే ధర్మం ఎలా ఉంటుందో నాకు తెలియదు." అని చెప్పింది వసుంధర.
ఆ మాట విని చాక్లెట్ తో కలిసి అభీర్ దగ్గరకి బయలుదేరింది మిత్ర.
*****************
ఇంటి దగ్గర బైరితో కలిసి షూటింగ్ ప్రాక్టీస్ చేస్తున్న అభీర్ దగ్గరికి వచ్చి "నాయకుడా! ముకుల్ నంద ఫ్యామిలీ ఈ గడ్డమీద అడుగుపెట్టింది." అని సంతోషంగా చూస్తూ చెప్పాడు రాజన్.
అంతలో అక్కడికి వచ్చి తన ముందు వాలిన సింబా వైపు చూసి "నీ స్నేహితుల చావుకి కారణమైన వాళ్ల మీద పగ తీర్చుకునే సమయం వచ్చింది. ఇన్ని సంవత్సరాలుగా మనం అనుభవిస్తున్న క్షోబా ఇప్పుడు ముకుల్, అభిజిత్ లు అనుభవిస్తారు." అని చెప్పాడు అభీర్.
"నాయకుడా! ముకుల్ ఫ్యామిలీ మొత్తం వరదరాజులు గెస్ట్ హౌస్ లో ఉన్నారు." అని చెప్పాడు అరుల్.
"ఆ వరదరాజులకి అభీర్ సేన పవర్ ఏమిటో చూపించాలి." అని అక్కడ ప్రాక్టీస్ చేస్తున్న తన మనుషుల వైపు చూసి "సహదేవుడి తమ్ముడు నారప్పని ఉదయం గెస్ట్ హౌస్ కి పంపించండి." అని చెప్పాడు అభీర్.
"సరే నాయకుడా!" అని ఆనందంగా చూస్తూ "నారప్ప!" అని గట్టిగా అరిచాడు బైరి.
*****************
ఉదయం గెస్ట్ హౌస్ లోపలకి కార్ లొ వచ్చి దిగి వీల్ చైర్ లో అభిజిత్ ని లోపలికి తీసుకు వస్తున్న నిర్మల్ ని చూసి దగ్గరకు వెళ్లి "హాయ్ రా..!" అని పలకరించాడు ఇచ్చాడు ప్రమోద్.
వీల్ చైర్ లో ఉన్న అభిజిత్ వైపు చూసి "ఎలా ఉన్నావు?" అని అడిగాడు సుభాష్.
ఆ మాటకి చిన్నగా నవ్వి "చూస్తున్నావు కదా ఇలా వీల్ చైర్ లో, అదే గోకుల్ గాడు బతికి ఉంటే లెచి నడిచేవాడినేమో!" అని బాధగా చెప్పాడు అభిజిత్.
"మేము వచ్చేసాము కదా అంకుల్! నేను నిర్మల్ కలిసి మిమ్మల్ని నడిపిస్తాము." అని చెప్పాడు ప్రమోద్.
అక్కడికి వస్తూ "నమస్కారం అభిజిత్ గారు! ఈ వంకనైన మా గెస్ట్ హౌస్ కి విచ్చేశారు చాలా సంతోషం!" అని చెప్పాడు వరదరాజులు.
"ఆ అభీర్ ఎవరు డాడ్? మనల్ని ఎదిరించి మన వాళ్ళని భయపెట్టే అంత ధైర్యం ఉందా?" అని అడిగాడు నిర్మల్.
"అవును సార్! అసలు అభీర్ ఎవరు? మాకు కూడా వార్నింగ్ లెటర్ పంపించాడు, వాడు కనిపిస్తే నేను ఏమిటో చూపించేవాడేని." అని కోపంగా చెప్పాడు తంబియార్.
"ఆ అభీర్ ఒక కొండ తెగ వాడు అని డాడ్ మాటలని బట్టి తెలిసింది. వాడి గురించి ఇంత భయపడడం అనవసరం!" అని చెప్పాడు ప్రవీణ్.
"అవును! ఇక్కడ మనకి ఇంత అండ ఉండగా వాడికి భయపడడం ఏమిటి?" అని వేటకారంగా చూస్తూ చెప్పాడు రఘురామ్.
లాప్టాప్ తీసుకుని అక్కడకి వస్తూ "తాతయ్య, అర్ణ వీడియో కాల్ లో ఉన్నారు." అని చూపించింది సుభాష్ కూతరు ఆశ.
వీడియో కాల్ లో చూస్తూ "అభిజిత్! నువ్వు అక్కడికి వచ్చేసరికి నాకు ధైర్యం వచ్చింది. ఆ అభీర్ కి సంబంధించిన మనుషులు ఎక్కడ ఉన్నారో తెలుసుకుని వెరీ పారేయాలి." అని కోపంగా చెప్పాడు ముకుల్.
"సరే అంకుల్! జానీ కూడా దుబాయ్ నుంచి బయలుదేరాడు రేపు ఉదయానికి ఇక్కడే ఉంటాడు, ఇప్పుడు వరదరాజులు కూడా మనకి తోడు వచ్చాడు కదా, ఇంక ఆ అభీర్ ని వాడి మనుషుల్ని వదిలి పెట్టే ప్రసక్తే లేదు." అని చెప్పాడు అభిజిత్.
అంతలో వరదరాజులు దగ్గరికి వచ్చి "సార్! బయట ఎవరో ఒక మనిషి మన డబ్బు పోయిన బ్యాగ్ పట్టుకొని వచ్చాడు, పేరు నారప్ప అంట మిమ్మల్ని కలవాలి అంటున్నాడు." అని చెప్పాడు సెక్యూరిటీ ఆఫీసర్.
ఆ మాట విని "అవునా? ఎవడ్రా నారప్ప? మన బ్యాగ్ వాడి చేతిలోకి ఎలా వెళ్ళింది? చూద్దాం లోపలకి తీసుకురా.!" అని చెప్పాడు వరదరాజులు.

![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)