Thread Rating:
  • 5 Vote(s) - 3.6 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
ఖైదీ నెంబర్ 402 - నా మాటే శాసనం
ఎపిసోడ్ 63


అర్ణ కాల్ చేయడంతో నువ్వేమి టెన్షన్ పడకు కాసేపట్లో నా మనిషి రాహుల్ నీకు కాల్ చేస్తాడు అవసరమైతే ఎయిర్ పోర్ట్ నుంచి లైవ్ ఇస్తాడు మీ ఫ్యామిలీ మెంబర్స్ సేఫ్ గా లండన్ చేరుకుంటారు అని చెప్పాడు మిథున్.

*******************

మిథున్ తో ఫోన్లో మాట్లాడి ముకుల్ వైపు చూసి "తాతయ్య! మనవాళ్ళు సేఫ్గా లండన్ కి వస్తారు." అని చెప్పింది అర్ణ.

"అభీర్ కి ఎటువైపు నుంచి ఛాన్స్ ఇవ్వకూడదు." అని ప్రతాప్ మిశ్ర వైపు చూసి "వరదరాజులకి కాల్ చెయ్!" అని చెప్పాడు ముకుల్.

"సరే సర్!" అని ఫోన్ తీసి కాల్ చేశాడు ప్రతాప్ మిశ్ర.

డబ్బులు మిస్ అయ్యాయని టెన్షన్ లో ఉండగా ఫోన్ రింగ్ అవ్వడం చూసి లిఫ్ట్ చేసి "ప్రతాప్! డబ్బులు సుజిత్ చేతిలో ఉండగానే మిస్ అయ్యాయి." అని చెప్పాడు వరదరాజులు.

"ఒక్క నిమిషం లైన్లో ఉండు నీతో ముకుల్ సార్ మాట్లాడుతారంట!" అని చెప్పాడు ప్రతాప్ మిశ్ర.

"అవునా? ఈ విషయం గురించి మనం మాట్లాడుకుందాము పెద్దాయనదాకా ఎందుకు?" అని కంగారుగా అన్నాడు వరదరాజులు.

ప్రతాప్ దగ్గర ఫోన్ తీసుకుని "వరద బాగున్నావా?" అని అడిగాడు ముకుల్.

"అయ్యా నమస్కారం! మీరు పెట్టిన బిక్ష వల్ల సంతోషంగానే ఉన్నాను, కానీ ఈరోజు డబ్బు పోయిన విషయం తలుచుకుంటేనే కాస్త బాధగా ఉంది." అని చెప్పాడు వరదరాజులు.

"ఆ డబ్బు గురించి మర్చిపో, ఈరోజు నుంచి ఆ ఆస్తి నీదే  నా మాట మీద నీకు నమ్మకం ఉంది కదా!" అని చెప్పాడు ముకుల్.

"అయ్యా! మీ నోటి నుంచి మాట వచ్చింది అంటే రిజిస్ట్రేషన్ అయిపోయినట్లే లెక్క!" అని సంతోషంగా చెప్పాడు వరదరాజులు.

"నాకు ఇప్పుడు ఒక పని చేసి పెట్టాలి." అని చెప్పాడు ముకుల్.

"నేనేం చేయాలో చెప్పండి చాలు మీ పని అయిపోయినట్లే!" అని చెప్పాడు వరదరాజులు.

"నా ఫ్యామిలీ మొత్తం స్పెషల్ ఫ్లైట్లో సాయంత్రం ఐదు గంటలకి ఢిల్లీలో ఉంటారు, వాళ్లు ఫ్లైట్ దిగకుండానే లండన్ రిటర్న్ అవుతారు ఆ టైం కి ఎయిర్ పోర్ట్ నా మనుషుల హ్యాండ్ ఓవర్ లొ ఉంటుంది.

నువ్వు చేయవలసింది ఏమిటంటే ఫ్లైట్ ఢిల్లీ లొ దిగి లండన్ రిటర్న్ అయ్యేంతవరకు ఎయిర్ పోర్ట్ చుట్టుపక్కల నా మనుషులు తప్పితే వేరే మనిషి ఎంటర్ అవ్వకూడదు.

ఒకవేళ ఎట్టి పరిస్థితుల్లోనైనా మా నా ఫ్యామిలీ అక్కడ ఉండి పోవాల్సి వస్తే వాళ్ల మీద ఈగ కూడా వాడకూడదు." అని చెప్పాడు ముకుల్.

"అయ్యా! మీరు టెన్షన్ పడకండి నేనే స్వయంగా ఎయిర్ పోర్ట్ దగ్గర ఉంటాను, ఆ ఫ్లైట్ లోనే మీ ఫ్యామిలీ మెంబర్స్ ని లండన్ పంపించే బాధ్యత నాది. తర్వాత ఈ విషయంలో మిమ్మల్ని టెన్షన్ పెట్టిన వాడిని చంపే బాధ్యత కూడా నాదే!" అని చెప్పాడు వరదరాజులు.

"సరే! నీకు మళ్ళీ 5:30 తర్వాత కాల్ చేస్తాను." అని చెప్పి ఫోన్ పెట్టేసాడు ముకుల్.

ఫోన్ తీసుకుంటూ "సార్! మీరేమీ కంగారు పడకండి అక్కడికి మన సుజిత్ వెళుతున్నాడు మిథున్ గారి మనుషులు వెళుతున్నారు వరదరాజులు వెళుతున్నాడు వీళ్ళందర్నీ దాటుకుని వాడు అక్కడికి రాలేడు." అని చెప్పాడు ప్రతాప్ మిశ్ర.

అంతలో ఫోన్ రింగ్ అవడం చూసి "రాహుల్ కాల్ చేస్తున్నాడు." అని లిఫ్ట్ చేసి స్పీకర్ ఆన్ చేసి "నువ్వు ఎయిర్ పోర్ట్ కి వెళ్ళావా?" అని అడిగింది అర్ణ.

"మేడం! నేను ఎయిర్ పోర్ట్ లోనే ఉన్నాను, ఫోర్ ఓ క్లాక్ నుంచి సిక్స్ ఓ క్లాక్ వరకు ఉన్న ఫ్లైట్స్ మొత్తం క్యాన్సిల్ చేయించాను. 3:30 తర్వాత ఎయిర్ పోర్ట్ లో మనవాళ్లు తప్ప ఎవ్వరూ ఉండరు, సుజిత్ సార్ కూడా ఇక్కడే ఉన్నారు." అని చెప్పాడు రాహుల్.

"సరే! నాకు ఎయిర్ పోర్ట్ సీసీ కెమెరాస్ ఆక్సిస్ కావాలి." అని చెప్పింది అర్ణ.

"ఓకే మేడం! మీ మొబైల్ కి ఇప్పుడే లింక్ సెండ్ చేస్తున్నాను." అని చెప్పాడు రాహుల్.

"ఓకే!" అని చెప్పి ఫోన్ పెట్టేసి మెయిల్లో వచ్చిన లింక్ ని క్లిక్ చేసి ఎయిర్ పోర్ట్ ని లైవ్ లొ ముకుల్, ప్రతాప్ మిశ్ర లతో  కలిసి చూస్తూ ఉంది అర్ణ.

*****************

ఇంటి దగ్గర సింబా తీసుకొచ్చిన సూట్ కేసులో డబ్బుని చూస్తూ, జాజి తీసుకువచ్చిన హిరణ్య తల వైపు చూసి  రెండు చేతులతో డబ్బులు తీసుకుని "వీటి కోసమేకదా ఆరాటం! ఈ డబ్బుల కట్టలలోనే వాడి తలని తగలబెట్టండి." అని చేతిలో ఉన్న డబ్బుని కింద పోశాడు అభీర్.

"సరే నాయకుడా!" అని కింద పోసిన డబ్బుని అంటించి దాంట్లో తలని పడేసాడు జాజి.

అక్కడికి వచ్చి "నాయకుడా! కాసేపటిలో ఫ్లైట్ ల్యాండ్ అవుతుంది. ఫ్యామిలీ మెంబర్స్ని ఈ గడ్డమీద అడుగుపెట్టనివ్వకుండా ఉండడానికి రక్షణగా తన మనుషులతో ఒక గోడ కట్టాడు." అని లాప్టాప్ లొ లైవ్ వీడియో చూపించడు బైరి.

వీడియో వైపు చూసి "లైవ్ వస్తుంది అక్కడ మన వాళ్ళు ఎవరున్నారు?" అని అడిగాడు అభీర్.

"రాజన్, రియాలు సుజిత్ తో పాటు ఎయిర్ పోర్ట్ లోపలికి వెళ్లారు వాళ్లే ఈ లింకు పంపించారు, నాకు తెలిసి ముకుల్ ఫ్యామిలీ తిరిగి లండన్ వెళ్లిపోతారు ఇప్పుడు ఏం చేద్దాము?" అని అడిగాడు బైరి.

ఆ మాట విని కళ్ళు మూసుకుని "రేపు ఉదయం 11:40 నిమిషాలకి ముకుల్ రెండో కొడుకు ప్రవీణ్ చావు ముహూర్తం నిర్ణయించాను, అది తప్పించడం ఎవరికీ సాధ్యం కాదు." అని చెప్పాడు అభీర్.

ఆ మాట విని ఆశ్చర్యంగా చూస్తూ "అంటే! ముకుల్ ఫ్యామిలీ ఈ గడ్డమీద అడుగు పెడతారా? ఇక్కడే ఉంటారా?" అని అడిగాడు బైరి.

"అవును!" అని రెండు సూట్ కేస్ ల వైపు చూపించి "ఈ డబ్బులోనే వాళ్ళ తలలు కూడా తగలబడతాయి." అని చెప్పాడు అభీర్.

"సరే నాయకుడా!" అని రెండు సూట్ కేసులు తీసుకుని రూమ్ లోకి వెళ్లి అక్కడ ఉన్న అగస్త్య వైపు చూసి

"నాకు తెలిసి ముకుల్ వాళ్ళని ఇక్కడ ఉండనివ్వడు ఏదో విధంగా ఫ్లైట్ లొ లండన్ తీసుకువెళతాడు, కానీ నాయకుడు రేపు చావుకి ముహూర్తం పెట్టాడు ఎలా జరుగుతుందో నాకు అర్థం కావడం లేదు." అని చెప్పాడు బైరి.

"నాయకుడు నోటి నుంచి మాట వచ్చింది అంటే జరిగి తీరుతుంది చూస్తూ ఉండు." అని కాన్ఫిడెంట్గా చెప్పాడు అగస్త్య.

**********************

ఎయిర్ పోర్ట్ లొ కాసేపట్లో ఫ్లైట్ ల్యాండ్ అవుతుంది అని అందరూ హడావుడిలొ ఉండగా రాజన్ దగ్గరికి వచ్చి "మన ప్లాన్ ఫెయిల్ అయ్యేటట్లు ఉంది. వాళ్ళని ఫ్లైట్లో నుంచి దిగనివ్వకుండానే లండన్ రిటన్ పంపించేస్తారు." అని డల్ గా చెప్పింది రియా.

"నాకు తెలిసి అభీర్ ఏదో ఒకటి చేస్తాడు వాళ్ళని ఇక్కడి నుంచి ఎట్టి పరిస్థితుల్లో వేళ్ళనివ్వడు." అని చెప్పాడు రాజన్.

"ఒక్కసారి చుట్టూ చూడు ఎంతమంది ఉన్నారో మనవాళ్లు కనీసం ఎయిర్ పోర్ట్ దగ్గరికి కూడా ఎంటర్ అవ్వలేరు." అని చెప్పింది రియా.

"అభీర్ సంకల్ప బలం గొప్పది తప్పకుండా జరిగి తీరుతుంది. అది ఎలానో నాకు కూడా తెలియదు కానీ వాళ్ళు తిరిగి వెళ్ళలేరు." అని చెప్పాడు రాజన్.

కాసేపటికి ఫ్లైట్ ల్యాండ్ అవ్వడం చూసి సుజిత్ వెనకాల వెళ్లారు ఇద్దరు.

అక్కడినుంచి హడావుడిగా రాహుల్ తో కలిసి ఫ్లైట్ దగ్గరికి కారులో వెళ్ళాడు సుజిత్.

ఎయిర్ పోర్ట్ లో ఉన్న తన కొడుకు వైపు చూసి "తంబియార్! నేను పెద్దాయనకి మాట ఇచ్చాను ఇది డబ్బు సమస్య కాదు పరువు సమస్య! మన వాళ్ళందరినీ ఎలర్ట్ గా ఉంచు ఆ ఫ్లైట్ ని లండన్ పంపించాలి ఒకవేళ  కుదరకపోతే వాళ్ళని క్షేమంగా మన గెస్ట్ హౌస్ కి తీసుకువెళ్లాలి." అని చెప్పాడు వరదరాజులు.

"సరే నాన్న!" అని తన మనుషుల్ని తీసుకుని వెళ్ళాడు తంబియార్.

రాహుల్ తో కలిసి ఫ్లైట్ లోపలకి వెళ్లి దిగడానికి రెడీ అవుతున్న విష్ణు వాళ్లని చూసి "వెయిట్! వెయిట్! ఎవరు కిందకి దిగకండి. మీతో తాతయ్య గారు మాట్లాడతారు." అని లాప్టాప్ లో వీడియో కాల్ లో ఉన్న ముకుల్ ని చూపించాడు సుజిత్.

వీడియో కాల్ లో ఉన్న ముకుల్ వైపు చూసి "వాట్ హప్పెండ్ తాతయ్య?" అని డౌట్ గా అడిగాడు విష్ణు.

వీడియో కాల్ లోకి వచ్చి "విష్ణు! మీరు స్టార్ట్ అయ్యినా ఆఫెన్ అవర్ కి  ఇండియాలో లాయర్ హిరణ్యని దారుణంగా చంపేశారు, అగ్రిమెంట్ కి ఇచ్చిన డబ్బులు పక్షులు తీసుకువెళ్లిపోయాయి, ఇటువంటి సిచువేషన్ లో మీరు అక్కడికి వెళ్లడం మంచిది కాదు అందుకే ఫ్లైట్ ని వెంటనే లండన్ కి రప్పిస్తున్నాము." అని చెప్పింది అర్ణ.

ఆ మాట విని వీడియో కాల్ దగ్గరికి వచ్చి నవ్వుతూ "ఏంటి? డబ్బులు పక్షులు ఎత్తుకు వెళ్ళిపోయాయా? ప్లాన్ చేసేటప్పుడు అయినా కరెక్ట్ గా చేయాలి కదా అర్ణ!" అని వెటకారంగా అడిగాడు రఘురామ్.

ఆ మాటకి కోపంగా చూస్తూ "మీకు చెబితే అర్థం కావడం లేదా? నా ఆస్తిలో వాట కావాలి అంటే వెనక్కి రండి. అవసరం లేదు అనుకుంటే కిందకి దిగి చావండి." అని చెప్పాడు ముకుల్.

"డాడ్! అంత కోపం ఎందుకు? మీ మాట ఎప్పుడైనా కాదన్నామా! సరే ఇప్పుడే రిటర్న్ అయిపోతాము." అని నిదానంగా చెప్పింది ఝాన్సీ.

వీడియో కాల్ చూస్తూ "సుజిత్ నువ్వు కూడా ఆ ఫ్లైట్లో లండన్ కి వచ్చేయ్!" అని కంగారుగా చెప్పాడు ప్రతాప్ మిశ్ర.

"ఓకే డాడ్!" అని రాహుల్ వైపు చూసి "మీరు వెళ్ళండి నేను కూడా వీళ్ళతో పాటు లండన్ వెళ్ళిపోతాను." అని చెప్పాడు సుజిత్.

"ఓకే!' అని అందరి వైపు చూసి "హ్యాపీ జర్నీ!" అని కిందకి దిగాడు రాహుల్.

ఫ్లైట్ టేక్ ఆఫ్ అవ్వడానికి రన్ వే మీద వెళ్లడం చూసి ఊపిరి పీల్చుకున్నారు ఎయిర్ పోర్ట్ లొ ఉన్నవాళ్లు వీడియో కాల్ లో ఉన్నవాళ్లు

అంతలో ఫ్లైట్ స్లో అవడం చూసి "వాట్ హప్పెండ్ రాహుల్"  ఫ్లైట్ ఎందుకు ఆగిపోయింది? " అని వీడియో కాల్ లొ చూస్తూ కంగారుగా అడిగింది అర్ణ.

"వన్ మినిట్!" అని ఫోన్ మాట్లాడి ఆకాశం వైపు ఆశ్చర్యంగా చూస్తూ లాప్టాప్ లొ పైకి చూపించాడు రాహుల్.

ఫ్లైట్ ఎగరడానికి వీలు లేకుండా ఆకాశం కూడా కనబడనట్టు రాబందులు ఎగరడం చూస్తూ షాక్ అయ్యి "సింబా వచ్చాడు అంటే అభీర్ వచ్చినట్లే!" అని టెంక్షన్ గా చెప్పాడు ముకుల్.
[+] 9 users Like SivaSai's post
Like Reply


Messages In This Thread
RE: వేదం - by Manmadhsbanam143 - 22-12-2025, 04:13 PM
RE: ఖైదీ నెంబర్ 402 - నా మాటే శాసనం - by SivaSai - 06-02-2026, 07:25 AM



Users browsing this thread: 1 Guest(s)