06-02-2026, 07:15 AM
Part - 81
నివి ని చూస్తూ ఉన్న రాజ్ ఏం మాట్లాడకుండా అలానే చూస్తూ ఉంటాడు. తను ప్రపంచం మొత్తం స్తంభించిపోయిందా.. మేమిద్దరమే ఇక్కడ ఉన్నాము అన్న ఫీలింగ్ ని ఎంజాయ్ చేస్తూ ఉంటాడు.
ఎంతసేపు అయినా రాజ్ లో కదలికఉండదు. నివి రాజ్ని ఒకసారి చూసి వాళ్ళ అమ్మ వాళ్ళతో మాట్లాడుతూ ఉంటుంది.
షాపింగ్ అయ్యేటప్పటికి ఏ టైం అవుతుందో అన్నీ చెబుతూ ఉంటుంది. అయినా రాజ్ లో ఎటువంటి స్పందన ఉండదు.
ఏంటి రాజ్ ఏమి పిలవడం లేదు అని ఒకసారి విక్రమ్ వైపు చూస్తుంది. విక్రమ్ అది అర్థం చేసుకుని దగ్గరికెళ్ళి రాజ్ వీపు మీద ఒకటి చరుస్తాడు.
ఏమైంది అంటూ చుట్టూ చూసి.. ఎందుకు కొట్టావు బావ అంటే... ఎందుకు కొట్టానో నీకు అర్థం కాలేదా.. ఏం చూస్తున్నావ్ నువ్వు ఇక్కడ అంటాడు.
అప్పుడు తేరుకొని అందరూ నన్నే చూస్తున్నారా అనుకుని... అంటే ఇంటీరియర్ బాగుందని చూస్తున్నాను బావ.
ఓ... ఇదే కదా నువ్వు మొదటిసారి వచ్చింది. ఎవరికి చెప్తున్నావు. వినయ్, భరత్ పక్కకు వచ్చి షాపింగ్ కి తీసుకు వెళ్తానని మంచి ఊపులో ఉన్నట్టున్నావ్.
మీకేంటి ఇబ్బంది అని అడుగుతాడు. మాకు ఏమి ఇబ్బంది లేదు. వచ్చేటప్పటికి ఎలా ఉంటావో.. ఏమిటో.. ఒక పిక్ తీసుకుంటాము.
మీరు కొంచెం ఎక్కువ చేస్తున్నట్టు అనిపించడం లేదా.. లేదు మేము చాలా తక్కువ చేస్తున్నాము. షాపింగ్ అంటే ఏదో అనుకుని పరిగెడుతున్నావు కదా.. అందుకే పిక్ తీసుకునేది.
షాపింగ్ అంటే ఏముంది.. మాల్ కి వెళ్తాం. తనకు నచ్చిన సారీస్ తీసుకుంటది. దానిమీద మ్యాచింగ్ యాక్సెసరీస్ తీసుకుంటుంది. అంతే కదా...
ఓహో.. లేడీస్ షాపింగ్ అంటే అంత సింపుల్ అనుకుంటున్నావా.. ఇప్పుడు దాకా ఎవరిని తీసుకొని వెళ్ళలేదా.
లైక్ ఆంటీని కూడా అంటే.. అబ్బే మా అమ్మ మాతో రాదులే షాపింగ్ కి. అందుకే నీకు అర్థం కావట్లేదు. వెళ్ళు... వెళ్ళు... వెళితే గాని నీకు అర్థం కాదు.ఎంజాయ్ యువర్ షాపింగ్ ట్రిప్ అని బుగ్గ మీద తడతారు.
ఏమిటి వీళ్ళు ఇలా భయపెడుతున్నారు అని ఒక్క నిమిషం భయపడిన... నివి వైపు చూసి నా బంగారానికి అంత సీన్ లేదులే. ఎదుటి వాళ్ళని ఇబ్బంది పెట్టదు అని తనకు అనే ధైర్యం చెప్పుకుంటాడు.
విక్రమ్ ఇంకా బయలుదేరండి. లేట్ అవుతుందని ఇద్దరిని పంపిస్తూ... నివి జాగ్రత్త అని చెబుతాడు. నేనున్నాను కదా బావ. డోంట్ వర్రీ అని చెప్పి విజిలెసుకుంటూ వెళతాడు.
వెళుతున్న రాజ్ ని చూసి నవ్వుకుంటాడు. వినయ్ భరత్ మాత్రం చాలా జాలిగా చూస్తూ ఉంటారు. ఏంట్రా మీ ఇద్దరు చూపులు...
పాపం వీడికి అర్థం కావట్లేదు. నివి తో షాపింగ్ అంటే ఏదో మంచినీళ్లు తాగినట్టు అనుకుంటున్నాడు. అది చూపించే చుక్కలకి ఏమైపోతాడో...
అలవాటు పడిని అంటే.. అంతేనంటావా... అంతే కదా... పెళ్లికి ముందు మంచి ఇంట్రెస్ట్ మీద ఉంటారు. ఆ మోజులో వాళ్ళు ఎలా అడిగినా షాపింగ్ కి ఫుల్ గా తిప్పేస్తారు.
చచ్చినట్టు పెళ్లయిన తర్వాత కూడా అలాగే తిప్పకపోతే చుక్కలు చూపిస్తారు. కాబట్టి వాడికి తెలియకుండా వాడే బెండ్ అయిపోతున్నాడు అని నవ్వుతాడు.
వీళ్ళ నవ్వుల మధ్యనుండగానే... శ్రీ ఫోన్ చేస్తాడు. మధ్యలో వీడు గోల ఏంటి అని.. లిఫ్ట్ చేసి చెప్పరా.. ఏం చేస్తున్నారు రా..
ఇక్కడ పనులు ఉంటే మీరు తాతీయగా కూర్చున్నారా.. రాజ్ కూడా కనపడటం లేదు. ఏమైపోయాడు. అయ్యో నీకు తెలియదా...
రాజ్ నివిని తీసుకొని షాపింగ్ కి వెళ్ళాడు అని చెబుతాడు. ఏంటి అప్పుడే వీడు ఈ పనులు కూడా మొదలుపెట్టాడా... నాకు చెప్పకుండా వెళ్ళిపోయాడు అని బుసలు కొడుతూఉంటాడు.
ఎందుకురా అంత కోపం అంటే.. నా పెళ్లి పనులు ఆపేసి నివిని షాపింగ్ తీసుకెళ్ళాడు. కోపం రాదా... ఒరేయ్ నువ్వు నేహా ని షాపింగ్ కి తీసుకెళ్తే మేము ఏమైనా అంటామా..
అదే ఇది ఒకటే అలా అవుతుంది. అయినా వాడికి తెలియదా నివి తో షాపింగ్ అంటే ఎలా ఉంటుందో.. ఇంకా వాడు ఎక్స్పీరియన్స్ చేయలేదు కదా..
ఈ రోజు చేస్తాడులే అంటారు. మంచి హుషారుగా వెళ్లినట్టు ఉన్నాడు అంటే... బాగా....
పాపం బిడ్డ. విక్రమ్ ఫోను స్పీకర్లో పెట్టే మాట్లాడుతూ ఉంటాడు. వినయ్ కూడా మేము ఎన్ని రకాలుగా హింట్ ఇచ్చిన ఎక్కడ ఆగడం లేదు.
అవునులే... ఆ వేడిలో ఉన్నప్పుడు అసలు ఏమీ అర్థం కాదులే. అయినా బావ నా ఎంగేజ్మెంట్ రోజున ఏమన్నాడు...
వచ్చే అమ్మాయిని తన కంట్రోల్లో పెట్టుకుంటానని ఎన్ని ప్రగల్బాలు పలికాడు. అసలు ప్రపోజ్ చేయకముందే బెండ్ అయిపోయాడు.
వాడు బెండయ్యాడో, బెండు తీస్తాడో ఎవరికి తెలుసురా అని విక్రమ్ అంటాడు. అంత లేదులే బావ. చూస్తూ ఉండు..
సాయంత్రం వచ్చేటప్పటికిఎలా ఉంటాడో.. రాగానే మాత్రం ఒక పిక్ తీసి, నాకు వీడియో కాల్ చేయండి.. చూడాల్సిందే అంటాడు.
ఎందుకురా నీకు అంత ఉత్సాహం అంటే.. అది అంతే బావ. అవని నీ తీసుకు వస్తున్నావా అని అడుగుతాడు. నేను ఆఫీస్ కి వెళుతూ దింపేసి వెళతాను. సరే అని ఫోన్ పెట్టేస్తాడు.
అవిని నీ పిలిచి రెడీ అవ్వు. నిన్ను శ్రీ వాళ్ళ ఇంటిదగ్గర డ్రాప్ చేయాలి. ఆంటీకి ఏదో పని ఉందంట అని చెబుతాడు. సరే అని ఇందిరాగారికి, లలిత గారరికి చెప్పి విక్రమ్ తో కలిసి బయలుదేరి వెళుతుంది.
రాజ్ మాత్రం మంచి హుషారుగా తీసుకు వెళుతూ ఉంటాడు. ఎక్కడికి వెళదాం నివి అంటే ఫస్ట్... బంజారాహిల్స్ వెళ్ళనివ్వండి.
అబ్బో నా బంగారానికి మర్యాదలు ఎక్కువే తెలిసే అనుకుని మురిసిపోతూ ఉంటాడు. అక్కడ ఒక ఫేమస్ మాల్ కి తీసుకువెళ్లి సారీస్ చూస్తూ ఉంటుంది.
ఎన్ని చూసినా ఏదీ నచ్చదు. ఏమైంది నివి...ఏమీ నచ్చడం లేదు. కలెక్షన్ బానే ఉంది కదా అంటే.. ఇక్కడ ఉన్న కలర్స్ నా దగ్గర చాలా ఉన్నాయి అని చెబుతుంది.
ఒక సారి తీసి నీకు చాలా బాగుంటుంది అంటే.. ఆల్రెడీ కలర్ ఉంది అంటుంది. ఇంకొకటి తీస్తే ఇది లైట్ అయింది అని చెబుతోంది. ఇంకొక సారి తీస్తే ఇందులో ఉన్న కలరు నాకున్న చీరల్లో మిక్స్ అయింది అని చెబుతుంది.
ఎన్ని చూపించిన ప్రతి దానికి ఏదో ఒక రీసన్ చెపుతూ ఉంటే.. రాజ్ కి అప్పటికే నీరసం వచ్చేస్తుంది. వచ్చి రెండు గంటలు అయింది.
నువ్వు ఒక్క చీర కూడా సెలెక్ట్ చేయలేదు అంటే... అసలు డిజైనర్స్ కి డిజైన్ చేయడమే రావడం లేదండి. అన్ని రెగ్యులర్ కలర్స్ తో డిజైన్ చేస్తే ఎలాగా అని అడుగుతుంది.
ఆ మాటకి కన్ఫ్యూజ్ అవుతూ ఎక్కడ డిజైన్ చేశారు. అయ్యో ఈ సారి లో ఉన్న ఈ షేడ్ తో నా దగ్గర టాప్ ఉంది అని చెబుతుంది.
టాప్ కి చీర కు సంబంధం ఏముంది అని అర్థం కాకుండా అడిగితే... టాప్స్ వేసుకున్న చీర కట్టుకున్న నేనే కదా మరి. అలాగా వాడిని కలర్ ని ఎలా వాడుతానండి అని అడుగుతుంది.
అంతే ఆ మాటకి రాజ్ కి ఫ్యూస్లు ఎగిరిపోతాయి.. బొమ్మ తిరిగి సినిమా కనపడుతుంది. వచ్చే ముందు వినయ్, భరత్ తను వంక ఎందుకు అంత జాలిగా చూసారో ఇప్పుడు అర్థమవుతుంది.
పొద్దున్నుంచి సాయంత్రం దాకా తిప్పి తిప్పి ఒక చీర సెలెక్ట్ చేస్తుంది. అలాగే ఇంకొక డ్రెస్సెస్ సెలెక్ట్ చేస్తుంది కానీ దాని మీద చున్ని నచ్చలేదు అంటుంది. ఇప్పుడు చున్నీ కోసం ఎక్కడిక తిప్పుతుందో అని వణికిచస్తాడు.
రాజ్ ముఖం చూసి అయ్యో రాజ్ గారు మిమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టేస్తున్నట్టున్నాను. సారీ అండి.. మీకు ఇబ్బందిగా అనిపిస్తే మీరు వెళ్లిపోండి.
మిగిలిన షాపింగ్ నేను కంప్లీట్ చేసుకుని వచ్చేస్తాను అంటుంది. ఆ మాటకి... అయ్యో నివి అలా అంటావేంటి.. మధ్యలో నేను ఎలా వదిలేస్తాను.
నీతో కలిసి షాపింగ్ చేస్తూ ఉంటే నాకు ఎక్కడలేని ఉత్సాహం వస్తుంది అని.. కొంచెం ఏదైనా తాగి మళ్ళీ స్టార్ట్ చేద్దాము. సరే అని చెప్పగానే జ్యూస్ సెంటర్ దగ్గర ఆపుతాడు.
జ్యూస్ తాగి ఆ చున్ని మ్యాచింగ్ కూడా తీసుకున్నాక ఇంకా అయిపోయిందా అని అడుగుతాడు. ఎక్కడ అయిపోయింది...
ఈ సారీ కి మ్యాచ్ అయ్యే విధంగా బ్యాంగిల్స్ తీసుకోవాలి అంటుంది. సరే ఎక్కడ షాప్ అంటే.. ఇక్కడ కాదు బేగంబజార్ అంటుంది.
అంతే కారు సడన్ బ్రేక్ వేసి ఏంటి గాజుల కోసం బేగంబజార్ వెళతావా.. అవేవో ఇక్కడే తీసేసుకోవచ్చు కదా...
అయ్యో రాజ్ గారు మీకు అసలు ఏమీ తెలియడం లేదు. అక్కడ మ్యాచింగ్ చాలా బాగుంటాయి. అలాగే కాస్ట్ కూడా తక్కువ ఉంటుంది.
ఇంత టైం వేస్ట్ అవుతుంటే కాస్ట్ గురించి ఆలోచిస్తుందేంటి.. సరదాగా షాపింగ్ అయిన వెంటనే ఎక్కడికైనా సరదాగా తీసుకువెళదాం అనుకుంటే..
మొత్తం అంతా నన్ను ఈ షాపింగ్ మాల్స్ లోనే కూర్చోబెడుతుంది అని తల పట్టుకుంటాడు. ఏమైందండీ తలనొప్పి వస్తుందా... లేదండి.. తలనొప్పి కాదు... మీకు ఎంత ఓపిక ఇచ్చాడు అని భగవంతుని తలుచుకుంటున్నాను.
మీరు మరీ ఎక్కువ పొగిడేస్తున్నారు అండి.. మీకు ఇలాగ అర్థమైందా అండి.. పదండి అని చెప్పి కార్ స్టార్ట్ చేస్తాడు..
బేగంబజార్ దగ్గరికి వెళ్ళాక కార్ ఎక్కడ పార్క్ చేయాలో అర్థం కాక చుట్టూ చూస్తూ ఉంటాడు. ఏమైందండీ అంటే.. కార్ ఎక్కడ పెట్టాలో చూస్తున్నాను.
మీ షాపింగ్ ఇలా ఉంది అనుకుంటే... బైక్ వేసుకోవచ్చే వాళ్ళము. అమ్మో ఎండలో టాన్ అయిపోము అంటుంది. ఒక్కసారి నివి వైపు చూసి ఉఫ్.. అనుకుని రేపు నా ఫ్యూచర్ ఏమిటి అనుకుంటాడు.
తనికి ఎక్కడి నుంచో మే.. మే.. సౌండ్ వినపడుతూ ఉంటుంది. నో అని గట్టిగా అరుస్తాడు. ఏమైందండీ ఎందుకలా అరిచారు.
అబ్బే ఏమీ లేదు జస్ట్ కార్ పార్క్ చేయడం గురించి ఆలోచిస్తున్నాను అంతే అని కవర్ చేసుకొని.. అక్కడ కొంచెం ప్లేస్ కనిపిస్తే కార్ పార్కింగ్ చేసే వెళదామా అని తీసుకెళ్తాడు.
అయ్యో బిడ్డ... ఎంజాయ్ చేద్దాం అని వచ్చి షాపింగ్ లో ఇరుక్కుపోయాడు ???

![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)