05-02-2026, 07:55 AM
(This post was last modified: 05-02-2026, 07:55 AM by SivaSai. Edited 1 time in total. Edited 1 time in total.)
Part - 79
అవిని ముందే కింద మోకాళ్ళ మీద కూర్చుని చెయ్యి పట్టుకోబోతాడు. వెంటనే చేతులు వెనక్కి తీసుకుంటుంది.
ధనుంజయ్ కూడా ఆ ప్రయత్నం ఆపేసి నేను చెప్పేది పూర్తిగా విను అవని అని. నీ విషయంలో జరిగింది ఏది కూడా నాకు తెలియదు.
నా కళ్ళకి నిన్ను ప్రేమగా చూసుకుంటున్నాం అనే గుడ్డని కప్పి మాయ చేసారు. అదే నిజమని నమ్మి నిన్ను సరైన దారిలో పెడుతున్నారు అనుకున్నాను కానీ.. నువ్వు నాకు శాశ్వతంగా దూరమయ్యే పరిస్థితి వస్తుందని అనుకోలేదు.
నా కూతురు భవిష్యత్తు గొప్పగా ఉండాలి అని కలలు కన్నాను. అందుకే నా దగ్గర పెంకిగా ఉన్న పెళ్లయ్యాకైనా వీళ్ళందర్నీ చూసి బాగుంటావని...
ముందు విక్రమ్ సంబంధం నీకోసమే తెచ్చాను కానీ అందరి ముందు నువ్వు వద్దు అని చెప్పావు అనగానే.. చురుగ్గా చూస్తుంది. అదే చెప్పేలాగా చేశారు.
చాలా రోజులు బాధపడ్డాను. ఎందుకు అవిని ఇలా ప్రవర్తిస్తుందా అని. నేను చేసిన తప్పు నీ దగ్గర కూర్చుని నీతో మనస్పూర్తిగా మాట్లాడకపోవడం.
పెళ్లిరోజున కూడా నీకోసం మొత్తం వెతికాను. ఎక్కడా కనపడలేదు అడిగితే.. అలిగింది రాను అని కరాఖండిగా చెప్పేసింది అని చెప్పారు.
ఇలాగైనా రెడీ అయి నలుగురిలోకి వస్తే నీకు నచ్చిన వాడు కనిపిస్తాడు కదా అని ఆలోచించాను. కానీ అది కూడా నీవల్ల జరగలేదు అన్న కోపం బాగా అన్నీ వచ్చాయి.
తర్వాత పెళ్లి పనుల్లోపడి నీ గురించి ఆలోచించలేదు. అది నిజంగా ముమ్మాటికీ నా తప్పే. నువ్వు ప్రేమించిన వాడితో వెళ్ళిపోయావు అని చెప్పినప్పుడు నిజంగా నాకు నమ్మాలని అనిపించలేదు.
అవని ఎప్పటికీ అలాగా చెయ్యొదు. అప్పుడే పెళ్లి చేసుకోను అని నాతో ధైర్యంగా మాట్లాడింది. ఎందుకు ఈ విషయంలో ఇలాగా చేస్తోంది అని ఆలోచించాను.
కానీ అక్కడ ఉదయ్ దెబ్బలతో కనపడి.. సర్వెంట్స్ కూడా నిజమే అన్నట్టుగా మాట్లాడితే నమ్మక తప్పలేదు అని కూతురు వైపు చూస్తాడు.
అవని కన్నీళ్ళతో చూస్తూ ఉంటే ఇబ్బందిగా తలదించుకుంటాడు. ఆ నిమిషం నిజంగానే కృంగిపోయాను.
మీ అమ్మని ప్రేమించి పెళ్లి చేసుకున్నాను. ఆ ప్రేమకి ప్రతిరూపమైన నువ్వు నాకు దూరంగా వెళ్లిపోయినట్టుగా అనిపించింది.
నానమ్మ తాతయ్య కూడా ఇంకెక్కడు ఉండలేము అని ఊరు వెళ్ళిపోయారు. వారు వెళ్ళిన తరువాత ఎందుకో ఒకరోజు భార్గవి..
అత్తయ్య మావయ్య గారిని తీసుకుని రండి. పెద్ద వాళ్లు ఇంట్లో లేకపోతే బాగోలేదు అని బ్రతిమాలితే నిజంగానే.. నువ్వు లేక అమ్మానాన్న లేక ఇల్లంతా ఏదో వెలితిగానే అనిపించింది.
ఇంకా నేనే ఆగలేక అమ్మ వాళ్ళని తీసుకొద్దామని వెళ్లాను. అవని గురించి పూర్తిగా తెలుసుకున్న తర్వాతే మనస్ఫూర్తిగా మాట్లాడు అని అంటే...
అవని గురించి తెలుసుకోవలసింది ఏముంది అని అనుకున్నాను. కానీ ఒక్కొక్కటి తెలుస్తూ ఉంటే నా కూతురు తన ఇంట్లోనే ఒక పరాయిదాన్నిలాగా బ్రతికింది అని అర్థం అవ్వగానే... నా గుండెని ఎవరో గుణపంతో పొడిచిన అంత బాధ వచ్చింది.
ప్రతిరోజు మీ అమ్మ నన్ను కన్నీళ్ళతో అడుగుతున్నట్టుగానే అనిపించింది. అవనికి అన్యాయం చేస్తారా...
నీ గురించి అన్ని నిజాలు తెలిసిన తర్వాత. మీ అమ్మ చావుకి కారణమైన వాళ్ళని ఇన్నాళ్లు నెత్తిన పెట్టుకున్నాను అని అర్థం అయిన తర్వాత నేను బ్రతికున్న అనవసరం అనిపించింది అని చెప్పి అవిని వైపు చూస్తాడు.
అయినా అవనిలో ఎటువంటి స్పందన ఉండదు . ధనుంజయ్ వైపు అలాగే చూస్తుంది. కూతురులో ఎటువంటి స్పందన లేకుంటే చాలా బాధగా అనిపిస్తుంది.
తన చేసిన పనులు వల్లే నమ్మడం లేదు అని కూడా అర్థం అవుతుంది. మన జీవితాలుతో ఆడుకున్న వాళ్ళని జైల్లో పెట్టించాను.
ఈ ఆస్తికి అసలైన హక్కుదారువి నువ్వే. అందుకే మొత్తం ప్రాపర్టీస్ అన్నీ నీ పేరు మీదకి మార్చి.. కంపెనీ కూడా నీకు హ్యాండ్ఓవర్ చేసి నానమ్మ తాతయ్యని తీసుకుని ఊరు వెళ్లిపోతున్నారు అని చెబుతాడు.
అందరికీ అది విని చాలా బాధగా అనిపిస్తుంది. విక్రమ్ మాత్రం అవిని నే చూస్తూ ఉంటాడు. అవనిలో ఎటువంటి స్పందన ఉండదు.
ధనుంజయ్ మొత్తం చెప్పే తీసుకో అవని.. పేపర్స్ అని ముందుకు పెడతాడు. అయినా సరే అవని కదలదు.. సత్యవతి గారు ముందుకు వచ్చి మీ నాన్న అంతలా చెబుతున్న మాట్లాడవేంటి.
ఆవిడ వైపు చూసి కథ బాగుంది అందుకే వింటున్నాను అంటుంది. ఒక్క నిమిషం ధనుంజయ్ ఏమి విన్నాడో అర్థం కాకుండా ఉంటుంది. కథ ఏమిటి అవిని. నేను నిజమే చెబుతున్నాను అని తడబడుతూ అంటాడు.
ఏది నిజం సార్... ఇంట్లోనే ఉన్నారంట...కానీ ఏం జరుగుతుందో తెలియదంట.. నాతో కూర్చుని మాట్లాడడానికి అసలు టైమే లేదంట...
అసలు విషయం ఏంటో నేను చెప్పనా అనగానే.. అందరూ అవని ఏం చెబుతుందా అని చూస్తారు. విక్రమ్ మాత్రం అవని మనస్థితిని అంచనా వేస్తూ ఉంటాడు.
ఈయన గారి భార్య కూతురు జైల్లో ఉన్నారు. చేసిన తప్పులకి నా భర్త జైల్లో పెట్టించాడు కానీ అది కూడా ఈయనగారి అకౌంట్ లో వేసుకున్నారు.
వాళ్ళిద్దరూ జైల్లో ఉండడం వల్ల కంపెనీ రేపిటేషన్ ఏదో దెబ్బతిని ఉంటుంది లేదా షేర్స్ అన్ని పడిపోయి ఉండాలి.
వాటిని మళ్లీ నిలబెట్టుకొని భార్యని,కూతురిని జైలు నుంచి విడిపించుకోవడానికి నా భర్త అండ కావాలి.
దానికి సాకు ఇది అంతా... కంపెనీ నాకు అప్పచెపితే అది నా భర్త ఎలాగు హ్యాండిల్ చేస్తారు కాబట్టి.. మళ్లీ పూర్వ వైభవం వస్తుంది.
తర్వాత మెల్లిగా నన్ను తప్పించి ఆయన కూతురిని అందలం ఎక్కించాలి అని తాపత్రయపడుతున్నారు. అంతే కదా సార్ అని అడుగుతుంది.
అవని చెప్పిన విధానానికి అందరూ షాక్ తో బిగుసుకుపోతారు. సత్యవతి గారి ఇంకా తట్టుకోలేక ఏం మాట్లాడుతున్నావ్ అవని నీకైనా అర్థమవుతుందా...
నాకు బాగానే అర్థం అవుతుంది నానమ్మ. మీరు ఆయన ట్రాప్ లో పడొచ్చు గానీ... నేను పడను. ఎందుకంటే అనుభవించింది నేను కాబట్టి..
భార్యాభర్తలు ఎలాంటి వాళ్ళో నాకు పూర్తిగా తెలుసు . మీ కొడుకు పైన మీకు నమ్మకం ఉంది అది పూర్తిగా మీ వ్యక్తిగతం కానీ నన్ను నమ్మమని మాత్రం అడగద్దు అంటుంది.
అవని అలా చెబుతూ ఉంటే ధనుంజయ్ తట్టుకోలేక పోతాడు. మోకాళ్ళ మీద కూర్చుని ఏడుస్తూ నేను నిజమే చెబుతున్నాను. నన్ను నమ్ము అనే అడుగుతాడు.
అవని నమ్మే పరిస్థితుల్లో కాదు కదా... అసలు ధనుంజయ్ వైపు చూడడానికి కూడా ఇష్టపడదు. ఎంత చెప్పినా కూతురు నమ్మడం లేదు అని...
ఆ పేపర్స్ అక్కడ టేబుల్ మీద పెట్టి ఈ ఆస్తి పూర్తి హక్కుదారులువి నువ్వే. ఈ కంపెనీని ఏమి చేస్తావో అన్నది పూర్తిగా నీ ఇష్టం.
నువ్వు హ్యాండిల్ చేస్తే కంపెనీలో ఉన్న ఉద్యోగస్తులు రోడ్డున పడకుండా ఉంటారు. లేదు అంటావా పూర్తిగా నీ ఇష్టం అని చెప్పి వెనక్కి తిరుగుతాడు.
వెళుతూ ఒక విషయం అవని.. నీ విషయంలో నేను సరిదిద్దుకోలేను తప్పే చేశాను. నువ్వు నన్ను నమ్మవని కూడా తెలుసు కానీ...
ఎప్పటికైనా నా కూతురు నన్ను నమ్ముతుంది. నాన్న అని ప్రేమగా పిలుస్తుంది అని మాత్రం ఎదురు చూస్తూ ఉంటాను.
రెండు అడుగులు వేయగానే ఆగండి అన్న పిలుపు వినబడుతుంది. ఆ గొంతు వినిపించిన వైపు తిరగగానే విక్రమ్ నిలబడి రెండు చేతులను ప్యాంటు పాకెట్లో పెట్టుకుని చూస్తూ ఉంటాడు.
చెప్పండి అల్లుడుగారు అనగానే... కాల్ మీ విక్రమ్. ఆ పేపర్స్ చేతిలోకి తీసుకొని మీరు ఈ పేపర్స్ ద్వారా ఏం తెలియజేయాలి అనుకుంటున్నారు మిస్టర్ ధనుంజయ్ అని అడుగుతాడు.
నాకున్నది ఒకే వారసురాలు. అది అవని అని చెప్పడానికి అని సూటిగా బదులుచెబుతాడు. మీరు ఇలా చేస్తే మీ భార్య ఇంకో కూతురు వల్ల ప్రాబ్లం వస్తుంది కదా...
వాళ్లకి, ఆస్తికి ఎటువంటి సంబంధం లేదు.అన్ని విధాలుగా డాక్యుమెంట్స్ చేపించాను. ఎట్టి పరిస్థితుల్లోనూ అవనినీ వాళ్ళు ఇబ్బంది పెట్టడానికి కూడా అవకాశం లేదు అని చెబుతాడు.
అయితే ఈ పేపర్స్లో ఒక చిన్న మార్పు చేయండి అని చెబుతాడు. చెప్పండి ఏం చేయమన్నా చేస్తాను అవని ఒప్పుకుంటే చాలు అంటాడు.
హ్మ్.. అని అందరి వైపు చూస్తాడు. అవిని ఫేసులో అసహనం కనిపిస్తూ ఉన్న మౌనంగా ఉంటుంది. అది విక్రమ్ కి ఇచ్చే విలువ అని అందరికీ తెలుసు.
విక్రమ్ అవినినీ చూస్తూ నేను ఏ నిర్ణయం తీసుకున్న నీకు సమ్మతమేనా అని అడుగుతాడు. మీరు ఏది తీసుకున్నా అది మన మంచికే అని నాకు తెలుసు.
మీ నిర్ణయానికి నేను కట్టుబడి ఉంటాను అని చెబుతుంది. ఆ మాటలకు విక్రమ్ కి గర్వంతో కూడిన నువ్వు వస్తుంది. తన భార్యకి తన పైన ఉన్న నమ్మకానికి చాలా ఆనందంగా అనిపిస్తుంది.
ధనుంజయ్ వైపు తిరిగి మీరు కంపెనీ యానివర్స్ డే కి ఫంక్షన్ ఏర్పాటు చేసి ఈ ఆస్తికి, కంపెనీకి అన్నింటికీ సర్వహక్కుదారురాలు అవని అని అనౌన్స్ చేయండి.
అలాగే కంపెనీలో వచ్చే ప్రాఫిట్ మొత్తం లో నుంచి 50% తల్లిదండ్రులు ఆదరణ కోల్పోయి స్వశక్తితో ఎదుగుతున్న పిల్లలకు సపోర్ట్ చేసే విధంగాను,శరణాలయాలకి వెళ్లే విధంగా ప్రిపేర్ చేయించండి.
అలాగే మిగిలిన ప్రాఫిట్ కంపెనీలో ఎప్పటినుంచో జాబ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి వాళ్ల జీతాలు పరంగా షేర్స్ అందేటట్టుగా అరేంజ్ చేయండి.
సింగిల్ మదర్స్ ఎవరైనా జాబ్ చేస్తూ ఉంటే వాళ్ళ పిల్లలకు సపోర్టుగా వెళ్లేటట్టుగా చూడండి. నామమాత్రంగానే అవని అక్కడ సీఈవోగా తన బాధ్యతలు తీసుకుంటుంది.
ఆ కంపెనీ నుంచి ఒక్క రూపాయి కూడా అవని జీతం గా తీసుకోదు. ఇదంతా మీకు సమ్మతమైతే ఆ పేపర్స్ ని ఆ విధంగా చేయించి అందరి ముందు ఆరోజు అవనికి అందజేయండి అని చెప్పి అవిని వైపు చూస్తాడు.
అవని సమ్మతమే అని కన్నీళ్ళతో విక్రమ్ వైపు చూస్తుంది.
విక్రమ్ చిన్న నవ్వు నవ్వి ధనుంజయ్ వైపు తిరిగి ఆ రోజు జరిగే ప్రతి విషయం కూడా మీ భార్య,కూతురికి తెలిసేటట్టుగా అరేంజ్ చేయండి. ఇక్కడ జరిగేది ప్రతిదీ వాళ్ళు చూడాలి అని చెబుతాడు.
ధనుంజయ్ సంతోషంగా తప్పకుండా అని చెప్పి అందరికీ నమస్కారం చేసి తల్లిదండ్రులు తీసుకుని అక్కడి నుండి వెళ్ళిపోతాడు.

![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)