Thread Rating:
  • 5 Vote(s) - 3.6 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
ఖైదీ నెంబర్ 402 - నా మాటే శాసనం
ఎపిసోడ్ 62


ముకుల్ ఫ్యామిలీ ఇండియా బయలుదేరారు అని చెప్పిన బైరి వైపు చూసి జాజి కి ఫోన్ చేసి హిరణ్య తల పట్టుకు రమ్మను, సుజిత్ దగ్గర డబ్బు సంగతి సింబా చూసుకుంటాడు మీరు ముకుల్ ఫ్యామిలీకి ఘన స్వాగతం పలకండి అని చెప్పాడు అభీర్.

***********************

అభీర్ చెప్పినా మాట విని "సరే నాయకుడా!" అని చెప్పి జాజి కి ఫోన్ చేసాడు బైరి.

కోర్టు దగ్గర హిరణ్య ఛాంబర్ లో నవ్వుతూ మాట్లాడుతున్న సుజిత్ వాళ్ళని చూసి "అభీర్ ఇలా సైలెంట్ అయిపోతాడని నేను అస్సలు ఊహించలేదు, వాళ్ళని చూస్తుంటే నాకు చాలా ఇరిటేషన్ గా ఉంది." అని చెప్పింది నీలమ్.

"ఈరోజు గడవడానికి చాలా టైం ఉంది అని వసుంధర అక్క చెప్పింది కానీ, ఇప్పుడు మధ్యాహ్నం ఒంటిగంట అయింది సగం రోజు గడిచిపోయింది." అని చెప్పింది సుమతి.

"అక్క! ఆ లాయర్ గాడి పక్కన  జాజి అంట ఎలా ఉన్నాడో చూడు చూస్తేనే భయం వేస్తుంది. ఇంక దగ్గరికి ఎవరు వెళతారు?" అని చెప్పాడు చాక్లెట్.

అంతలో అక్కడికి వచ్చిన కార్ లోనుంచి రెండు పెద్ద సూట్ కేసులు దింపడం చూసి "క్యాష్ కూడా వచ్చేసింది ఇంకేముంది హ్యాపీగా ఇక్కడ నుంచి వెళ్ళిపోతారు." అని చెప్పింది మిత్ర.

బయట కారు దగ్గర నుంచున్న తన మనుషులని చూసి "సుజిత్! క్యాష్ వచ్చింది వెళదామా?" అని అడిగాడు తంబియార్.

"సరే! అని హిరణ్య వైపు చూసి "లాయర్ గారు! మేము బయలుదేరుతున్నము సాయంత్రం గెస్ట్ హౌస్ దగ్గరికి వచ్చేయండి మంచి పార్టీ అరేంజ్ చేశాను." అని చెప్పాడు సుజిత్.

"సరే సరే! అలాంటి పార్టీలు నేను అసలు మిస్ అవ్వను జాగ్రత్తగా వెళ్ళిరండి. అసలే వెయ్యి కోట్లు!" అని చెప్పాడు హిరణ్య.

ఆ మాటకి నవ్వుతూ "ఇదేం చూశారు ఇంక ముందు ముందు ఇలాంటి సూట్ కేసులు చాలా వస్తాయి, మీ చేతుల మీదగానే అగ్రిమెంట్లు కూడా అవుతూ ఉంటాయి." అని చెప్పి బయటికి వెళ్ళాడు సుజిత్.

'నా చేతుల మీదుగా అగ్రిమెంట్లు అయితే నాకు ఏంటి ఉపయోగం!' అని మనసులో అనుకుని జాజి వైపు చూసి "సూట్ కేస్ ఫైల్స్ తీసుకో వేరే కోర్టు దగ్గరికి వెళ్ళాలి." అని చెప్పాడు హిరణ్య.

"ఓకే సార్!" అని రూమ్ లోపలికి వచ్చాడు జాజి.

సుజిత్ తో కలిసి కారు దగ్గరికి వచ్చి "రెండు సూట్ కేసులు కలిపి 1000 కోట్లు మొత్తం 2000 నోట్లు!" అని చెప్పి ఆకాశంలో అరుపులు వినపడడంతో తలపైకి ఎత్తి "ఏంటి!ఇన్ని రాబందులు ఎగురుతున్నాయి?" అని విచిత్రంగా చూస్తూ చెప్పాడు తంబియార్.

ఆ మాట విని ఆకాశం వైపు చూస్తూ "ఆ పక్షి ఏంటి అంత పెద్దగా ఉంది?" అని ఆశ్చర్యంగా చూస్తూ ఉన్నాడు సుజిత్.

ఆకాశంలో వేగంగా ఎగురుకుంటూ వస్తున్న పక్షిని చూసి "అది మన అభీర్ ఫ్రెండ్ సింబా కదా!" అని డౌట్ గా అడిగింది నీలమ్.

అక్కడికి వస్తూ "అవును! సింబా వస్తున్నాడు అంటే అభీర్ వచ్చినట్లే!" అని సంతోషంగా చూస్తూ చెప్పింది వసుంధర.

"ఆ పక్షులు గోలా మనకెందుకు కానీ ఆ అగ్రిమెంట్ ఇచ్చి క్యాష్ తీసుకో!" అని సుజిత్ చేతిలో ఉన్న అగ్రిమెంట్ ని పట్టుకున్నాడు తంబియార్.

"సరే!"అని అగ్రిమెంట్ ఇచ్చి సూట్ కేసు మీద చెయ్యి వేసి  వేగంగా మీదకి వస్తున్నా పక్షిని చూసి భయంతో వెనక్కి వచ్చాడు సుజిత్.

సూట్ కేసుల మీద వాలి తన రెండు కాళ్లతో రెండు సూట్ కేసులు పట్టుకుని వేగంగా గాలిలోకి ఎగిరిపోయాడు సింబా.

సూట్ కేసులతో గాలిలో ఎగిరిపోతున్న సింబాని చూసి "1000 కోట్లు! 1000 కోట్లు!" అని అరుస్తూ వెనకాల పరిగెత్తాడు తంబియర్.

సింబా రెండు సూట్ కేసులు పట్టుకుని ఎగిరిపోవడం చూసి "పాపిష్టి డబ్బుకి రెక్కలు వస్తాయి అంటే ఇదేనేమో!" అని నవ్వుతూ చెప్పింది మిత్ర.

"పాపం హిరణ్య మంచి సీన్ మిస్ అయిపోయాడు." అని చాక్లెట్ వైపు చూసి "వెళ్లి లాయర్ గారిని బయటికి పిలుచుకు రా.!" అని చెప్పింది వసుంధర.

"సరే మేడం!" అని చెప్పి చాంబర్ దగ్గరికి వెళ్లి వెనక్కి పరిగెత్తుకుంటూ వచ్చి "మేడం! లాయర్ గారు బయటికి వచ్చిన చూడలేరు పాపం ఆయన తల ఎవరో పట్టుకు వెళ్ళిపోయారు." అని జాలిగా చూస్తూ చెప్పాడు చాక్లెట్.

ఆ మాట విని షాక్ అయ్యి ఛాంబర్ దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్లి తల లేని హిరణ్య మొండెం చూసి "అందరం ఇక్కడే ఉన్నాము అంతలో ఎవరు వచ్చి వీడి తల పట్టుకెళ్ళిపోయారు?" అని ఆశ్చర్యంగా చూస్తూ అడిగింది వసుంధర.

"నా రైట్ హ్యాండ్ జాజిని దాటి ఎవరు దగ్గరికి రాలేరు అన్నాడు కదా, అందుకునే అతనే  హిరణ్య తల పట్టుకెళ్ళి పోతున్నాడు." అని చూపించింది  మిత్ర.

తల లేని హిరణ్యని చూసి "నా కోపం ఇప్పుడు కొంచెం తగ్గింది." అని సంతోషంగా చూస్తూ చెప్పింది సుమతి.

"కొంచెం లేట్ అయ్యినా అభీర్ చెప్పింది చేసాడు." అని చెప్పింది నీలమ్.

"నాకు తెలిసి అభీర్ లేట్ చేయడానికి కూడా కారణం ఉండే ఉంటుంది." అని చెప్పింది వసుంధర.

అక్కడికి వస్తు "మీరు చెప్పింది కరెక్టే! లండన్ లో ముకుల్ ఫ్యామిలీ ఇండియాకి బయలుదేరేవరకు అభీర్ వెయిట్ చేశాడు. పులి మటువేసి వేటాడడం విన్నానే కానీ ఇప్పుడు చూస్తున్నను." అని చెప్పాడు శ్రీకర్.

"ఈ విషయం ముకుల్ నందకి తెలిస్తే, ఫ్యామిలీ మెంబర్స్ ఢిల్లీ ఎయిర్ పోర్ట్ లొ దిగడం ఆలస్యం మళ్లీ అదే ఫ్లైట్లో వెనక్కి తీసుకు వెళ్తాడు." అని చెప్పింది వసుంధర.

"నాకు తెలిసి వాళ్ళు ఇక్కడికి అడుగు పెట్టడమే కానీ వెనక్కి తిరిగి వెళ్ళలేరు అభీర్ ఆ విషయం గురించి కూడా ఖచ్చితంగా ఆలోచించే ఉంటాడు." అని చెప్పింది మిత్ర.

తన ఆఫీసర్స్ తో అక్కడికి వచ్చి శ్రీకర్ వైపు చూసి "సార్! ఇప్పుడు ఈ మర్డర్ కేస్, ఆ చోరీ కేస్ ఏమని ఫైల్ చేయాలి?" అని డౌట్ గా అడిగాడు దయా.

"హిరణ్య గారికి కి శత్రువులు తక్కువేమీ లేరు ఎవడో కడుపు మండి తల నరికేసాడు అని ఫైల్ చెయ్, ఇంకా చోరీ కేసు అంటావా! రాబందుల మీద పెట్టాలి.

ఆకాశంలో చాలా ఎగురుతున్నాయి బ్యాగ్ లు ఎత్తుకు వెళ్ళింది ఏ పక్షో  తంబియార్  గారు గుర్తుపడితే అరెస్ట్ చెయ్యొచ్చు!" అని నవ్వుతూ చెప్పాడు శ్రీకర్.

*******************

లండన్ ముకుల్ ఇంటి దగ్గర ఫోన్ రింగ్ అవడం చూసి "సార్! సుజిత్ కాల్ చేస్తున్నాడు 1000 కొట్టు చేతికి వచ్చాయి అనుకుంటా!" అని సంతోషంగా ఫోన్ లిఫ్ట్ చేసి స్పీకర్ ఆన్ చేసి "డబ్బు అందిందా? గెస్ట్ హౌస్ కి వచ్చేసావా?" అని అడిగాడు ప్రతాప్ మిశ్ర.

"డాడ్! ఇక్కడ అంతా అయోమయంగా ఉంది. 1000 కోట్లు ఉన్న రెండు సూట్ కేసులు ఒక పెద్ద పక్షి వచ్చి మా కళ్ళముందే  ఎత్తుకు వెళ్లిపోయింది. అప్పటీ వరకు మాతో మాట్లాడిన హిరణ్య తల ఎవరో తీసుకువెళ్లిపోయారు." అని టెన్షన్ గా చెప్పాడు సుజిత్.

ఆ మాట విని "పక్షి డబ్బులు ఎత్తుకు వెళ్లడం ఏమిటి రా..! అయినా మీరు అక్కడ ఉండగా ఆ లాయర్ తల ఎవరు తీసుకు వెళ్ళారు? అక్కడ తంబియర్ ఉన్నాడా?" అని కంగారుగా అడిగాడు ప్రతాప్ మిశ్ర.

"డాడ్! తంబియార్ ఆ పక్షి వెనకాల పరిగెత్తుకుంటూ వెళ్ళాడు, సెక్యూరిటీ ఆఫీసర్లు హిరణ్య తల కోసం వెతుకుతున్నారు నాకు ఏం చేయాలో అర్థం కాక టెన్షన్ లొ నీకు కాల్ చేశాను." అని చెప్పాడు సుజిత్.

ఫోన్లో సుజిత్ చెప్పిన మాట విని అర్ణ వైపు చూసి "అభీర్ ని తక్కువ అంచనా వేయొద్దు అని నేను చెప్పానా? ఇప్పుడు చూడు ఫ్యామిలీ మొత్తం ఇండియా వెళ్లారు." అని టెంక్షన్ గా చూస్తూ చెప్పాడు ముకుల్.

ప్రశాంత్ మిస్రా చేతిలో ఫోన్ తీసుకుని "సుజిత్ నేను చెప్పేది జాగ్రత్తగా విను, లండన్ నుంచి స్పెషల్ ఫ్లైట్లో మా ఫ్యామిలీ మెంబర్స్ ఇండియా బయలుదేరారు ఈవినింగ్ ఫైవ్ కి ఢిల్లీ ఎయిర్ పోర్ట్ లో ఫ్లైట్ ల్యాండ్ అవుతుంది.

వాళ్లు కిందకి దిగకు ముందే ఫ్లైట్ ని తిరిగి లండన్ పంపించాలి నీ దగ్గర ఉన్న మనుషులందరిని తీసుకుని వేళ్ళు ఆ ఫ్లైట్ దగ్గరికి మనవాళ్ళు కాకుండా వేరే మనిషి రాకూడదు." అని చెప్పింది అర్ణ.

"సరే సరే! నేను చూసుకుంటాను." అని చెప్పి హడావుడిగా అక్కడ నుంచి బయలుదేరి వెళ్ళాడు సుజిత్.

ఫోన్ మాట్లాడుతున్న అర్ణ వైపు టెన్షన్ గా చూస్తూ "ఇది సుజిత్ ఒక్కడి వల్ల అవ్వదు వెంటనే మిథున్ కి కాల్ చెయ్! అవసరమైతే ఎయిర్ పోర్ట్ స్టాఫ్ మొత్తాన్ని కొనేస్తాడు మన వాళ్ళని సేఫ్గా లండన్ పంపిస్తాడు." అని చెప్పాడు ముకుల్.

"సరే తాతయ్య!" అని హడావిడిగా మిథున్ కి కాల్ చేసింది అర్ణ.

మహేష్ తో కలిసి బీచ్ లో నడుస్తూ ఫోన్ రింగ్ అవ్వడం చూసి "అర్ణ కాల్ చేస్తుంది." అని లిఫ్ట్ చేసి "హాయ్ అర్ణ! హౌ ఆర్ యు?" అని అడిగాడు మిథున్.

"నేను చెప్పేది జాగ్రత్తగా విను వివరాలు చెప్పే అంత టైం లేదు, ఢిల్లీ ఎయిర్ పోర్ట్ లొ మా ఫ్యామిలీ వస్తున్న స్పెషల్ ఫ్లైట్ ఈవినింగ్ ఫైవ్ కి ల్యాండ్ అవుతుంది.

మా వాళ్ళని కిందకి కూడా దిగనివ్వకుండా ఆ ఫ్లైట్ ని వెంటనే లండన్ పంపించాలి, నీ ఇన్ ఫ్లన్స్ మొత్తం ఉపయోగించు, ఎయిర్ పోర్ట్ లోకి బయట మనిషి రాకూడదు సుజిత్ కూడా అక్కడే ఉంటాడు." అని టెన్షన్ గా చెప్పింది అర్ణ.

"కూల్ కూల్! నువ్వేమి టెన్షన్ పడకు అవసరమైతే ఆ టైమ్ కి ఉన్న ఫ్లైట్స్ మొత్తం క్యాన్సిల్ చేయిస్తాను, నా మనుషుల్ని దాటుకుని ఎవరు ఎయిర్ పోర్ట్ లోకి రాలేరు.

మీ ఫ్యామిలీ మెంబర్స్ ఉన్న ఫ్లైట్ సేఫ్ గా లండన్ చేరుకుంటుంది. కరెక్ట్ గా 30 మినిట్స్ లో  నా మనిషి రాహుల్ నీకు కాల్ చేస్తాడు అవసరమైతే నీకు ఎయిర్ పోర్ట్ నుంచి లైవ్ ఇస్తాడు." అని చెప్పాడు మిథున్.

"ఓకే థాంక్యూ!" అని ఊపిరి పీల్చుకుని ఫోన్ పెట్టేసి ముకుల్ వైపు చూసి "తాతయ్య మనవాళ్లు సేఫ్ గా లండన్ వస్తారు." అని చెప్పింది అర్ణ.
[+] 11 users Like SivaSai's post
Like Reply


Messages In This Thread
RE: వేదం - by Manmadhsbanam143 - 22-12-2025, 04:13 PM
RE: ఖైదీ నెంబర్ 402 - నా మాటే శాసనం - by SivaSai - 05-02-2026, 07:53 AM



Users browsing this thread: 1 Guest(s)