04-02-2026, 07:36 AM
ఎపిసోడ్ 60
ముకుల్, అభిజిత్ ఫ్యామిలీలకు సహాయం చేసే వాళ్ళకి మొదటి హెచ్చరిక పంపించమని అభీర్ చెప్పడంతో వరదరాజులకి అభీర్ సేన నాయుకుడి ఆజ్ఞ అని హెచ్చరిక పంపించండి అని తన మనుషులకి చెప్పాడు బైరా.
ఫ్యామిలీ మెంబర్స్ అందరూ రావడంతో రూమ్ లో నుంచి బయటకు వస్తూ ప్రతాప్ మిశ్రని చూసి నీకు ఇండియాలో వరదరాజులతో కాకుండా ఇంకా ఎవరు టచ్ లో ఉన్నావు అని అడిగాడు ముకుల్ నంద.
********************
ముకుల్ అడిగిన మాట విని కంగారుపడుతూ "మీరు చెప్పిన దగ్గర నుంచి ఇండియాలో పరిచయాలన్ని వదిలేసాను, వరదరాజులతో కూడా సుజిత్ ఇండియా వెళుతున్నాడని తెలిసిన తర్వాత మాట్లాడాను." అని చెప్పాడు ప్రతాప్ మిశ్ర.
"సరే! నువ్వు చెప్పింది నిజం అయితే నీ కొడుకు క్షేమంగా లండన్ కి వస్తాడు, లేదు ఇంకా ఎవరితో అయినా పరిచయం ఉంది అంటే ముందే చెప్పు వాడు ప్రాణాలతో ఉండేలాగా నేను చూసుకుంటాను." అని చెప్పి అర్ణతో పాటు ఫ్యామిలీ మెంబర్స్ దగ్గరికి వెళ్ళాడు ముకుల్.
ఆ మాటకి టెన్షన్ గా చూస్తూ "ఈ ముక్కోడు ఏంటి ఇలా మాట్లాడుతున్నాడు?' అనుకుంటూ వెనకాలే వెళ్ళాడు ప్రతాప్ మిశ్ర.
ముకుల్ తో పాటు వెళుతూ "తాతయ్య! సుజిత్ మనం చెప్పింది చెప్పినట్లు చేస్తాడు, ఎవరితో పరిచయాలు పెంచుకోడు వాడి గురించి నాకు బాగా తెలుసు!" అని చెప్పింది అర్ణ.
ఆ మాట విని "అవును సార్! సుజిత్ గురించి పాపకి బాగా తెలుసు! వాడికి మీరంటే అపారమైన గౌరవం! ఎటువంటి పరిస్థితుల్లో మీ మాట జవాడతాడు." అని చెప్పాడు ప్రతాప్ మిశ్ర.
అక్కడ ఉన్న ఫ్యామిలీ మెంబర్స్ వైపు చూస్తూ "మహేష్ ఇక్కడకి రాలేదా?" అని డౌట్ గా అడిగాడు ముకుల్.
"మిథున్ తో కలిసి ఫ్యామిలీ టూర్ వెళ్ళాడు టుడేస్ లో వస్తాడు, అయినా నేను ఉండగా వాడు అవసరం లేదు." అని చెప్పింది అర్ణ.
"నువ్వు ఇండియాలో లాయర్ హిరణ్యతో కాకుండా ఇంకా ఎవరితోనైనా టచ్ లో ఉన్నావా?" అని అడిగాడు ముకుల్.
"నాకు ఇండియా కి సంబంధించిన అంతవరకు ఏ అవసరం ఉన్న మిథున్ చూసుకుంటాడు, లాయర్ హిరణ్యతో కూడా నేను డైరెక్ట్ గా మాట్లాడలేదు. నా గురించి మీకు బాగా తెలుసుగా తాతయ్య!
అయ్యినా! ఇండియాలో ఉన్న పరిచయాల గురించి ఇప్పుడు అడుగుతున్నారు ఎందుకు?" అని డౌట్ గా అడిగింది అర్ణ.
ఆ మాటకి సైలెంట్ గా ఫ్యామిలీ మెంబర్స్ దగ్గరికి వెళ్లి ఒక్కొక్కరిని హాగ్ చేసుకుని " మిమ్మల్ని అందరిని ఇలా చూడడం చాలా సంతోషంగా ఉంది." అని చెప్పాడు ముకుల్.
"డాడ్! ఇండియా ప్రాపర్టీ గురించి ఎవరు మాట్లాడద్దు అని చెప్పారు కదా, మళ్లీ ఆ విషయం గురించి ఎందుకు మీటింగ్ ఏర్పాటు చేశారు?" అని డౌట్ గా అడిగాడు సుభాష్.
ఆ మాటకి ముకుల్ దగ్గరికి వెళ్లి జాగ్రత్తగా చైర్లు కూర్చోబెట్టి "ఇండియాలో ఉన్న ప్రాపర్టీస్ మొత్తం తాతయ్య గారు సేల్ చేయాలి అనుకుంటున్నారు. ఆ విషయం గురించి కూడా మనం కూడా ఒకసారి మాట్లాడుకున్నాము మర్చిపోయారా బాబాయ్?" అని అడిగింది అర్ణ.
ఆ విషయం గుర్తుంది. అప్పుడు తాత గారు ఇంకా డిసిషన్ తీసుకోలేదు, కానీ ఇప్పుడు తాతయ్య గారు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు కాబట్టి అక్కడ ప్రాపర్టీ కూడా అందరికీ సమానంగా పంచితే అమ్మే వాళ్ళు అమ్ముకుంటారు ఉంచుకునే వాళ్ళు ఉంచుకుంటారు. " అని చెప్పాడు విష్ణు.
ఆ మాట విని భార్య వైపు చూసి రఘురామ్ సైగ చేయడంతో "అవును! విష్ణు చెప్పింది కూడా కరెక్టే! ఇప్పుడు ఆస్తులు అమ్ముకోవాల్సినంత అవసరం ఏమి వచ్చింది. ఎవరి వాటాలు వాళ్లకి పంచి పెడితే ఎవరు ఇష్టం వచ్చినట్లు వాళ్ళు చేసుకుంటారు." అని చెప్పింది ఝాన్సీ.
"డాడీ! ఈ ముసుగులో గుద్దులాటలు ఎందుకు! రాజస్థాన్లో ఉన్న ఏదో ఒక పెద్ద ప్రాపర్టీ నువ్వు అర్ణకి కి రాయాలని చూస్తున్నావు అని తెలిసింది.
నీ మాటకి ఎవరు ఎదురు చెప్పరు, అలా చేయడం కరెక్ట్ అనుకుంటే అలాగే చెయ్యి, మా మీద నీకు ప్రేమ లేదు అనుకుంటాము." అని చెప్పింది నర్మదా.
ఆ మాట విని మనసులో సంతోషపడుతూ 'ఏదైనా ఇంట్లో చిన్నవాళ్ళు చిన్నవాళ్లే ఉన్నదేదో మొహనా అడిగేస్తారు.' అనుకున్నడు రఘురామ్.
"రాజస్థాన్లో పెద్ద ప్రాపర్టీ గురించి నేను ఎప్పుడు వినలేదే!' అని మనసులో అనుకున్నాడు ప్రతాప్ మిశ్రా.
ఫ్యామిలీ మెంబర్స్ మాటలు విని సీరియస్గా చూస్తూ "రాజస్థాన్ లో ప్రాపర్టీ ఉందని మీకు ఎవరు చెప్పారు? దాని గురించి మీకు ఏం తెలుసు?" అని అడిగాడు ముకుల్.
"ఎలా తెలిస్తే ఏముందిలే మావయ్య గారు! రాజస్థాన్లో బేరా అడవుల్లో వజ్రాల కొండలు ఉన్నాయని అవి మన ఆస్తి కన్నా మూడు రెట్లు విలువైనవని తెలిసింది. కానీ మాకు చూపించిన ఇండియా ఆస్తుల వివరాలలో వాటిని కనిపించకుండా చేశారు." అని అర్ణ వైపు చూస్తూ చెప్పాడు రాజేష్.
"అవును! అక్కడ మైనింగ్ చేసే కాంట్రాక్ట్ కూడా గోకుల్ పెదనాన్న పేరుతో ఉన్న కంపెనీ పేరు మీద ఉంది." అని చెప్పాడు మోహిత్.
ఆ మాట విని షాక్ అయ్యి చూస్తూ "అంటే! మీరు నేను చెప్పిన మాట వినకుండా ఇండియాలో ఎవరితోనో టచ్ లో ఉన్నారు, ఎవరెవరు ఎవరితో టచ్ లో ఉన్నారో నాకు ఇపుడే తెలియాలి." అని ఆవేశంగా అడిగాడు ముకుల్.
"ఆ వజ్రాల కొండల గురించి ఇప్పటివరకు మాతో ఎందుకు చెప్పలేదో! ఆ విషయం కూడా చెప్పండి." అని దీర్ఘం తీస్తూ అడిగాడు రఘురామ్.
"అర్ణ! నువ్వు కూడా ఇండియాలో ఉన్న ప్రాపర్టీస్ గురించి చెప్పినప్పుడు ఆ వజ్రాల కొండల గురించి ఎందుకు చెప్పలేదు?" అని కోపంగా చూస్తూ అడిగింది ఝాన్సీ.
"అత్త! ఆ విషయం నాకు కూడా రెండు రోజుల క్రితమే తెలిసింది." అని చెప్పింది అర్ణ.
"నేను అడిగిన దానికి మీరు ఎవరు సమాధానం చెప్పలేదు, మీరు ఇండియాలో ఎవరెవరు ఎవరితో టచ్ లో ఉన్నారు? ఆ కొండల గురించి మీతో ఎవరు చెప్పారు?" అని గట్టిగా అడిగాడు ముకుల్.
"అంటే డాడ్! ఆ విషయం మాకు తెలియకూడదు అని మీరు అనుకున్నారా?" అని అడిగాడు ప్రవీణ్.
"అవును! ఆ విషయం మీకు తెలియకూడదు అనుకున్నాను, ఆ కొండల వల్లే మీ అన్నయ్య చనిపోయాడు. నేను కూడా 12 సంవత్సరాలుగా పుట్టిన దేశంలో ఆస్తులు వ్యాపారాలు వదిలేసి వెళ్లకుండా ఇక్కడే ఉండిపోయాను." అని బాధపడుతూ చెప్పాడు ముకుల్.
"మీరు గోకుల్ అన్నయ్య యాక్సిడెంట్లో చనిపోయాడు అని చెప్పారు, మళ్లీ ఇప్పుడు ఆ కొండల గురించి చనిపోయాడు అని చెప్తున్నారు, సరే ఆ విషయం వదిలేయండి. వాటి గురించి మీరు ఇండియా ఎందుకు వెళ్ళలేదు?" అని అడిగింది నళిని.
ఆ మాటకి కోపంగా చూస్తూ "నా వంశాన్ని కాపాడుకోవడానికి మిమ్మల్ని బతికించుకోవడానికి!" అని జరిగిన విషయం మొత్తం వివరంగా చెప్పాడు ముకుల్.
జరిగింది మొత్తం విని నవ్వుతూ "తాతయ్య! నువ్వు ఇంత సిల్లిగా ఆలోచిస్తావు అనుకోలేదు. ఇటువంటి చిన్న విషయానికి భయపడి ఇండియా వెళ్లకుండా మమ్మల్ని వెళ్ళనివ్వకుండా ఆపేసావా? ఈ విషయం మాకు తెలిస్తే ఆ జైల్లో ఉన్నవాడిని ఎప్పుడో క్లోజ్ చేసే వాళ్ళము." అని చెప్పాడు విష్ణు.
"తాతయ్య! మీరు భయపడి వెళ్లలేదు మరి అభిజిత్ అంకుల్ ఫ్యామిలీ అక్కడే ఉన్నారు కదా! ఆ అడవి మనుషులు వాళ్ళని ఏమి చేయలేదు.
వాళ్ళ ఫ్యామిలీ హ్యాపీగా ఉన్నారు మనమే వాల్యుబుల్ ప్రాపర్టీస్ వదులుకొని బిజినెస్ లు వదులుకొని దూరంగా బతుకుతున్నాము." అని చెప్పాడు మోహిత్.
"మావయ్య గారు! మిమ్మల్ని భయపెట్టి అక్కడి నుంచి పంపించి ఆ అభిజిత్ ఫ్యామిలీ మన వ్యాపారాలు కూడా వాళ్లే చేసుకుంటూ మనకన్న ఎక్కువ సంపాదించారు.
అసలు ఇప్పుడు అక్కడ వజ్రాల కొండలు ఉన్నాయో ఉట్టి మట్టి మిగిల్చారో ముందు అది చూడండి." అని నవ్వుతూ చెప్పాడు రఘురామ్.
"మీరు అనుకున్నంత ఈజీ కాదు, అభిజిత్ ఫ్యామిలీ కూడా ఆ కొండల జోలికి వెళ్లలేదు. ఆ తెగ వాళ్ళు ఇప్పటివరకు ఆ ఫ్యామిలీని ఏమి చేయకుండా ఎందుకు ఉన్నారో నాకు తెలియదు. కానీ అభీర్ నోటి నుంచి వచ్చిన మాట తప్పకుండా జరుగుతుంది." అని చెప్పాడు ముకుల్.
"డాడ్! ఆ తెగ వాళ్ళు బతికున్నారో లేదో కూడా తెలియదు ఒక్కడు మనల్ని ఏమి చేయగలడు దాని గురించి మీరు పెద్దగా వర్రీ అవ్వకండి." అని చెప్పాడు సుభాష్.
"డాడ్! మీరు అన్ని కోట్లు ఖర్చుపెట్టి వాడిని 12 సంవత్సరాలు జైల్లోకి పెట్టి కడుపునిండా అన్నం పెట్టించారు, ఆ డబ్బు వేరే విధంగా ఖర్చుపెడితే వాళ్ల మనుషులతో పై లోకంలో హ్యాపీగా ఉండేవాడు." అని నవ్వుతూ చెప్పింది నళిని.
అక్కడ ఉన్న వారి మాటలు వింటూ 'వీళ్ళు మామూలు వాళ్ళు కాదు అంతమందిని చంపేశారు పాపం అని కూడా చెప్పడం లేదు, వీళ్ళతో కొంచెం జాగ్రత్తగా ఉండాలి.' అని మనసులో అనుకున్నడు ప్రతాప్ మిశ్ర.
"సరే మావయ్య గారు! మీకు ఆ అభీర్ బతికి ఉంటేనే కదా ప్రాబ్లం! వాడు చనిపోతే మీరు హ్యాపీగా ఇండియాలో అడుగుపెడతారు కదా! ఆ విషయం నాకు వదిలేయండి నేను చూసుకుంటాను." అని చెప్పాడు రఘురామ్.
"ఆ ప్రాబ్లం క్లియర్ చేశాను కదా అని ఆ కొండలలో వచ్చే లాభంలో ఎక్కువ కావాలి అంటే కుదరదు." అని చెప్పాడు చిన్నల్లుడు రాజేష్.
అందరి మాటలు విని "ఒక్క నిమిషం నేను చెప్పేది వింటారా? ఆ ప్రాబ్లం లో మనం ఎంటర్ అవ్వడం తాత గారికి ఇష్టం లేదు, అందుకే మన ప్రాపర్టీ లో ఒకటి మినిష్టర్ వరదరాజులకి చాలా చీప్ గా ఇవ్వడానికి ఒప్పుకున్నాను.
ఇప్పుడు ఇండియాలో మనకి ఏ ప్రాబ్లం వచ్చిన ఆ మినిస్టర్ మనకి అండగా ఉంటాడు, అతని బలం బలగం పలుకుబడి నాకు బాగా తెలుసు! ఆ అభీర్ సంగతి కూడా అతనే చూసుకుంటాడు." అని చెప్పింది వర్ణ.
ఆ మాట విని షాక్ అయి చూస్తూ "అమ్మ దీనమ్మ! ఇంత ప్లాన్ వేసిందా? ఇంకా మన తెలివితేటలతో చీప్ గా కొట్టేసాము అనుకున్నను ఇది మామూలు కంచు కాదు." అని మనసు అని అనుకున్నాడు ప్రతాప్ మిశ్ర.

![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)