04-02-2026, 07:35 AM
ఎపిసోడ్ 59
ఇంటి దగ్గరకి జారువా తెగకు సంబంధించిన అందరు రావడంతో వాళ్లతో మాట్లాడుతూ మనం ధర్మం కోసం యుద్ధం చేసే సమయం వచ్చింది మన మొదటి దాడి ఆ 1000 కోట్లు మీద అని చెప్పాడు అభీర్.
****************
అభీర్ చెప్పిన మాట విని "నాయకుడా! ఆ 1000 కోట్లు వరదరాజుల చేతిలో ఉన్నప్పుడు తీసుకుందామా? నంద ఫ్యామిలీ చేతికి వెళ్లిన తర్వాత తీసుకుందామా?" అని అడిగాడు అరుల్.
"ఎంతటి మిత్రులకైనా భేదాలు వచ్చేది డబ్బు దగ్గరే, ఇద్దరి మధ్యలో ఉండగా ఆ డబ్బు మాయం అవ్వాలి, దానికి నా దగ్గర ఉపాయం ఉంది నేను చెప్పినట్లు చేయండి." అని చెప్పాడు అభీర్.
"నాయకుడా! సుజిత్ కి ఈరోజు అర్ణ ఫోన్ చేసింది. కొత్త ప్రాపర్టీ గురించి తెలిసింది దానికి మినిస్టర్ హెల్ప్ అవసరమవుతుంది అని చెప్పింది. నాకు తెలిసి ఆ కొండల మీద తన కన్ను పడినట్లు ఉంది." అని చెప్పాడు అగస్త్య.
"అవును! ఆ విషయం గురించి తెలుసుకోవడానికి సుజిత్ తన తండ్రి కి ఫోన్ చేశాడు, ఈరోజు నంద ఫ్యామిలీ మొత్తం లండన్లో కలుసుకుంటున్నారంట అక్కడ విషయం తెలుసుకుని చెబుతానని చెప్పాడు." అని చెప్పింది రియా.
"మీరు ముకుల్ ఫ్యామిలీ మెంబర్స్ తో టచ్ లో ఉన్నారు కదా! మన నవగ్రహాల కొండల గురించి వాళ్ళకి తెలిసేలాగా చేసి ఆశ పుట్టించండి. వాటికోసం ఈ గడ్డమీదకి ప్రతి ఒక్కరూ అడుగు పెట్టాలి." అని చెప్పాడు అభీర్.
"నాయకుడా! ఆ అభిజిత్ వీల్ చైర్ లో కూర్చునే రాజకీయం చేస్తున్నాడు, వాడి పెద్ద కొడుకు మిధున్ వ్యాపారాలు చూసుకుంటున్నాడు, రెండో కొడుకు నిర్మల్ రాజకీయాలలో తండ్రికి తోడుగా ఉంటున్నాడు.
వాళ్లు బయట వ్యక్తులను ఎవరిని దగ్గరికి రానివ్వరు అందువల్ల మన వాళ్ళు ఎంత ప్రయత్నించినా దగ్గర కాలేకపోయారు." అని చెప్పాడు బైరి.
"మరి అభిజిత్ తో పాటు ఉండే జాకీ ఎక్కడ ఉంటున్నాడు?" అని అడిగాడు అభీర్.
చాక్లెట్ తో కలిసి అక్కడికి వస్తూ "ఆ జాకి దుబాయ్ లో ఉంటున్నాడు వాడిని ఇక్కడికి ఎలా రప్పించాలో నాకు బాగా తెలుసు! మిథున్ తో కూడా నాకు పరిచయం ఉంది. అంతేకాదు అర్ణ కూడా నాకు టచ్ లోనే ఉంది." అని చెప్పింది మిత్ర.
అక్కడికి వచ్చిన మిత్ర వైపు చూసి "ఇకనుంచి తను కూడా మనలో ఒకరిగా ఉంటుంది. ఆ దేవుడు మన తెగకు ఇచ్చిన బిడ్డ అనుకోండి." అని చెప్పాడు అభీర్.
"నాయకుడా! నాకు తెలిసి ఈ పోరాటంలో ఆ రెండు కుటుంబాలకు సహాయం చేయడానికి చాలామంది వస్తారు." అని చెప్పాడు రాజన్.
"ఆ కుటుంబాలకు ఎవరు అండగా ఉన్న ముందు ఒక హెచ్చరిక ఇవ్వండి వింటే ప్రాణాలతో ఉంటారు." అని చెప్పాడు అభీర్.
"సరే నాయకుడా!" అని తన వాళ్ళ వైపు చూసి "ముందుగా మినిస్టర్ వరదరాజులు కుటుంబానికి అభీర్ సేన నాయకుడి ఆజ్ఞ! అని హెచ్చరిక పంపించండి." అని చెప్పాడు బైరి.
*****************
మరుసటి రోజు ఉదయం ఫ్యామిలీ మీటింగ్ కి అందరూ లండన్ చేరుకుని గెస్ట్ హౌస్ లో రెడీ అవుతూ ఉండగా ఫోన్ రింగ్ అవడంతో రూమ్ లోకి వెళ్లి లిఫ్ట్ చేసి "అగస్త్య! టెల్ మీ?" అని చెప్పాడు రఘురామ్.
"సార్! రాత్రి సుజిత్ కి అర్ణ మేడం కాల్ చేశారు, ఇండియాలో ఇప్పటివరకు తెలియని ఒక పెద్ద ప్రాపర్టీ గురించి తెలిసింది అని చెప్పారు.
ఆ ప్రాపర్టీ విషయంలో వరదరాజుల హెల్ప్ కావాలని కూడా అడిగారు, నాకు తెలిసి మినిస్టర్ హెల్ప్ కోసమే గూర్ గామ్ లో ఉన్న ప్రాపర్టీని అంత తక్కువకి ఇస్తున్నారు." అని చెప్పాడు అగస్త్య.
ఆ మాట విని "అవునా? ఈరోజు మా ఫ్యామిలీ మీటింగ్ జరుగుతుంది ఆ విషయం గురించి ప్రస్తావన వస్తే సరే లేకపోతే ఆ ప్రాపర్టీ డిటేల్స్ తెలుసుకోవాల్సిన బాధ్యత నీదే!" అని చెప్పాడు రఘురామ్.
"ఓకే సార్ షూర్!" అని చెప్పి ఫోన్ పెట్టేసాడు అగస్త్య.
ఫోన్ పెట్టేసి హడావుడిగా రూమ్ లో నుంచి బయటికి వచ్చి ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ పిలిచి "ఇండియాలో ఇప్పటివరకు మనకి తెలియని ఒక పెద్ద ప్రాపర్టీ ఉంది.
దాని మీద అర్ణ చాలా ఇంట్రెస్ట్ గా ఉంది అని తెలిసింది.
నాకు తెలిసి అక్కడ ఉన్న ప్రాపర్టీస్ అన్ని ఒక ఎత్తు, ఆ ప్రాపర్టీ ఒక ఎత్తు అయి ఉంటుంది. లేకపోతే అది అంత తొందరగా ఇంట్రెస్ట్ చూపించదు." అని చెప్పాడు రఘురామ్.
"అవునా? ఈరోజు జరిగే మన ఫ్యామిలీ మీటింగ్ లో ఆ విషయం గురించి ఏమైనా చెబుతుందేమో చూద్దాము లేకపోతే తర్వాత ఏం చేయాలో ఆలోచిద్దాము." అని చెప్పాడు విష్ణు.
"అది సరే! అసలు మనకి తెలియని అంత వాల్యూ ఉన్న ప్రాపర్టీ ఇండియాలో ఏముంది?" అని అడిగాడు సుభాష్.
"అవును! మనకి తెలియని ప్రాపర్టీస్ ఏమున్నాయి?" అని అడిగింది నళిని.
"టెన్షన్ పడకండి ఇండియాలో నా మూడో కన్ను ఉంది. అతి త్వరలోనే అన్ని విషయాలు తెలుస్తాయి." అని చెప్పాడు రఘురామ్.
"సరే! ఇంకా తాతగారింటికి బయలుదేరుదామా?" అని చెప్పి అందరినీ పంపించి తండ్రి తల్లిదండ్రులతో కలిసి కార్ లో వెళుతూ రియాకి ఫోన్ చేశాడు విష్ణు.
ఉదయం గెస్ట్ హౌస్ దగ్గరికి వస్తూ ఫోన్ రింగ్ అవ్వడం చూసి లిఫ్ట్ చేసి "హాయ్ సార్!" అని చెప్పింది రియా.
"హాయ్ రియా! కొత్త న్యూస్ ఏమైనా ఉందా?" అని అడిగాడు విష్ణు.
"సార్! రేపు వరదరాజులతో అగ్రిమెంట్ జరుగుతుంది 1000 కోట్లు అడ్వాన్స్ ఇస్తున్నారు, అలాగే రాజస్థాన్ దగ్గర ఉన్న ఒక ప్రాపర్టీ గురించి డిస్కషన్ జరిగింది. నాకు ఇంకా పూర్తి వివరాలు తెలియలేదు తెలుసుకొని మీకు ఇన్ఫామ్ చేస్తాను." అని చెప్పింది రియా.
"సరే! ఆ ప్రాపర్టీ గురించి ఫుల్ డీటెయిల్స్ తెలుసుకో!" అని చెప్పి ఫోన్ పెట్టేసి తండ్రి వైపు చూసి
"తాతయ్య మీకు కూడా తెలియకుండా రాజస్థాన్ దగ్గర ఉన్న ఒక పెద్ద ప్రాపర్టీని అర్ణకి ఇవ్వడానికి చూస్తున్నాడు నువ్వేమో ఇంకా మా నాన్న అంటూ ఎగరేసుకుంటూ తిరుగుతావు." అని కోపంగా చూస్తూ చెప్పాడు విష్ణు.
"అవునా? రాజస్థాన్ దగ్గర అంత పెద్ద ప్రాపర్టీ ఉందని ఇప్పటివరకు నాకు కూడా తెలియదు, సరే నువ్వేమీ కంగారు పడకు ఏది ఉన్న మన వాటా మనకు రావాల్సిందే!" అని చెప్పాడు నంద రెండో కొడుకు ప్రవీణ్.
వేరే కార్ లో వెళుతూ "ఎవరి ప్లాన్ లు వాళ్ళు వేసుకుంటున్నారు మనమే సైలెంట్ గా ఉండిపోయాము." అని భర్త వైపు కోపంగా చూస్తూ
"మీకు ఇండియాలో కాంటాక్ట్స్ బానే ఉన్నాయి కదా అసలు అక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోండి." అని చెప్పింది నళిని.
ఆ మాట విని "మమ్మీ! ఎందుకు టెన్షన్ పడతావు? సుజిత్ దగ్గరికి అరుల్ అని నా మనిషిని పంపించాను, ప్రతి విషయం నాకు చెబుతూనే ఉన్నాడు.
ఆల్రెడీ ఆ ప్రాపర్టీ గురించి ఫుల్ డీటెయిల్స్ తీసుకున్నాను రాజస్థాన్ దగ్గర బైరి అడవిలో ఉండే వజ్రాల కొండలు!" అని చెప్పాడు మోహిత్.
ఆ మాట విని ఆశ్చర్యంగా చూస్తూ "వజ్రాల కొండల?" అని అడిగాడు నళిని భర్త రాజేష్.
"ఎస్! ఆ కొండలలో మనకి వచ్చే షేర్ వ్యాల్యూ ఎంతో తెలుసా? మన వాటకి వచ్చే ఆస్తి మీద త్రిబుల్ ఉంటుంది." అని చెప్పాడు మోహిత్.
"మరి ఆ ఆస్తి గురించి నాన్నగారు ఇప్పటివరకు మనకి ఎందుకు చెప్పలేదు?" అని డౌట్ గా అడిగింది నళిని.
"నాకు తెలిసి ఈ ప్రాపర్టీ విషయం బయటకు రాకుండా అర్ణ చేసి ఉంటుంది. ఇప్పుడు ఫ్యామిలీ మీటింగ్లో అసలు విషయం తెలుస్తుంది కదా!" అని చెప్పాడు మోహిత్.
వేరే కారులో వెళుతూ సుభాష్ వైపు చూసి "డాడ్! గోకుల్ పెదనాన్నగారు పోయిన తర్వాత అన్ని విషయాలు నువ్వే చూసుకున్నావు కదా మరి ఆ ప్రాపర్టీ గురించి నీకు తెలియకపోవడం ఏమిటి?" అని డౌట్ గా అడిగాడు ప్రమోద్.
"నంద గ్రూప్ పేరు మీద ఉన్న ప్రతి ప్రాపర్టీ గురించి నాకు తెలుసు, గోకుల్ చనిపోక ముందు ఏదో కొత్త బిజినెస్ అని అన్నయ్య తో పాటు నాన్నగారు కూడా ఇండియాలో సంవత్సరం పాటు ఉన్నారు.
అక్కడ భారీగానే ఇన్వెస్ట్ చేశారు కానీ సడన్గా అన్నయ్య చనిపోయాడు నాన్నగారు లండన్ వచ్చేసారు, ఇండియాలో ఉన్న బిజినెస్ పార్ట్నర్ అభిజిత్ కూడా వీల్ చైర్ లో పడ్డాడు.
నాకు తెలిసి ఆ ప్రాపర్టీ విషయంలో ఏదో పెద్ద ప్రాబ్లం జరిగి ఉంటుంది. ఈ విషయంలో మనం ఆచితూచి అడుగు వేయాలి తొందరపడకూడదు మిగతా వాళ్ళు ఆవేశపడుతున్నారు కదా ఏం జరుగుతుందో చూద్దాము." అని చెప్పి కొడుకు వైపు చూసి
"అభిజిత్ చిన్న కొడుకు నిర్మల్ నీతో టచ్ లోనే ఉన్నాడు కదా!" అని అడిగాడు సుభాష్.
"ఎస్ డాడ్! నెక్స్ట్ సీఎం రేస్ లో వాడే ఉన్నాడు." అని చెప్పాడు ప్రమోద్.
"అవునా? మరి ఇంకేంటి మనల్ని దాటి ఏమి జరగదు నువ్వు ప్రశాంతంగా ఉండు." అని చెప్పాడు సుభాష్.
కాసేపటికి అందరూ ఇంటి దగ్గరికి చేరుకోవడంతో రూమ్ లో ఉన్న ముకుల్ దగ్గరికి వెళ్లి "తాతయ్య! ఫ్యామిలీ మెంబర్స్ మొత్తం వచ్చేసారు ఇండియా ప్రాపర్టీ విషయంలో మీ మాటే ఫైనల్ అవ్వాలి." అని చెప్పింది అర్ణ.
ఆ మాట విని "సరే!" అని బయటికి వస్తూ అక్కడ ఉన్న ప్రతాప్ మిశ్రా వైపు చూసి "ఇండియాలో ఉన్న ప్రాపర్టీస్ గురించి మొదట అడిగింది నువ్వే కదా!" అని అడిగాడు ముకుల్.
"ఎస్ సార్!" అని కంగారుగా చూస్తూ "నంద గ్రూప్ మంచి కోసమే నేను అలా చేశాను." అని చెప్పాడు ప్రతాప్ మిశ్రా.
"అవునా?" అని అనుమానంగా చూస్తూ "ఇండియాలో మినిస్టర్ వరదరాజులతో కాకుండా నువ్వు ఇంకా ఎవరితో టచ్ లో ఉన్నావు?" అని అడిగాడు ముకుల్.

![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)