04-02-2026, 07:34 AM
Part - 78
నేహా సమాధానం కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. ప్లీజ్ నేనంటే ఇష్టమని చెప్పు అని మనసులో పదే పదే దేవుని తలుచుకుంటూ ఉంటాడు.
నేహా మెల్లిగా నోరు విప్పుతుంది. మీతో నేను ట్రావెల్ చేసినప్పటి నుంచి మీ బిహేవియర్ నచ్చింది అని ఇబ్బందిగా చెబుతుంది.
కానీ ఇది ప్రేమ, పెళ్లి అలాంటి ఆలోచన కాదు. ఒక వ్యక్తిగా మీరంటే చాలా గౌరవం. మీ ఆలోచనలు బాగున్నాయి. మీరు మీ లైఫ్ పార్టనర్ కి ఇచ్చే ఇంపార్టెన్స్ కూడా బాగా నచ్చింది.
మీ మాటలను బట్టి నాకు అనిపించేది మీకు వచ్చే అమ్మాయి ఎవరో చాలా అదృష్టవంతురాలు అని అదృష్టవంతురాలు నేనే అవుతానని అనుకోలేదు అని చెబుతోంది.
ఆ మాటలు వినగానే శ్రీ మేఘాలలో తేలిపొమ్మన్నది అని సాంగ్ వేసుకుంటాడు. అంతా చెప్పి నేహా శ్రీ వైపు చూడగానే ఎక్కడో ఊహలోకంలో ఉంటాడు.
ఏంటి ఈయన ఏమి స్పందించడం లేదు. నేను చెప్పింది అర్థం మయిందా లేదా అనుకొని కళ్ళ ముందు చేతులు ఊపుతూ నేను చెప్పింది వినిపించిందా...
హ.. వినిపించింది థాంక్యూ.. థాంక్యూ.. అని నేహా చేతులు పట్టుకుని ఊపేస్తాడు. డోర్ ఎవరో కొడతా ఉంటే గబగబా నేహా వెళ్లి తలుపు తీస్తుంది.
ఏమైంది అవిని అంటే.. మీరు గదిలోకి వచ్చే చాలాసేపు అయింది. బయట మీ నాన్నగారు కంగారు పడుతున్నారు. వచ్చేస్తున్నామని శ్రీవైపు తిరిగి వెళదామా అంటుంది.
తప్పకుండా బంగారం అని నేహా వెనకాల కాలర్ ఎగరేస్తూ వస్తాడు. శ్రీ ని చూసినా విక్రమ్, రాజ్ ఒకరి మొహాలు ఒకళ్ళు చూసుకుని పెదవి విరస్తారు.
వీళ్ళిద్దరి దగ్గరికి వచ్చి ఏంట్రా నా వైపు అలా చూస్తున్నారు అని అడిగితే... నిన్ను చూస్తుంటే నాకు ఒకటి అనిపిస్తుంది రా... చెప్పనా అని రాజ్ అడుగుతాడు.
ఎందుకు ఆలస్యం చెప్పుకో పర్మిషన్ ఇచ్చాను అని వెలిగిపోతున్న ముఖంతో అంటాడు. నిన్ను చూస్తుంటే జాతరలో బలిచ్చే మేకపోతు ని రెడీ చేసినట్టుగా అనిపిస్తుంది అంటాడు.
ఆ మాటకి విక్రమ్ వస్తున్న నువ్వు ఆపుకుంటూఉంటాడు. శ్రీ.. రాజ్ వైపు తిరిగి చండాలంగా అదేం పోలికరా.. ఇంత హ్యాపీగా ఉంటే అంటే...
ఆ మేక కూడా అలాగే అనుకుంటుంది కదరా.. నన్ను ఇంత బాగా రెడీ చేశారు. నాకేమైన ఫంక్షన్ అని. తర్వాత గాని ఆ మేకకు అర్థం కాదు కదా అంటాడు.
అంటే ఏంట్రా నేను బలైపోతున్నానా అని అడుగుతాడు. నేను అలా అనలేదు కదా.నాకు అది గుర్తొచ్చింది అని చెప్పాను అంతే. నీకు ఎలా కావాలంటే అలా తీసుకో అని విక్రమ్ వైపు తిరిగి కన్ను కొడతాడు.
విక్రమ్ వైపు చూస్తూ ఉంటే చాలా కష్టంగా నవ్వు ఆపుకుంటూ కనిపిస్తాడు.. ఆడికంటే పెళ్లి కాలేదు కాబట్టి ఏదో పిచ్చవాగుడు వాగుతున్నాడు.
నీకు పెళ్లి అయ్యింది కదా నువ్వేమైనా బలి అయ్యావా అంటే.. ఒరేయ్ నేను నీలాగా కాదురా బచ్చా అని బుగ్గ మీద తడతాడు.
ఇందాక నేను ఇదే డైలాగ్ అంటే అబ్బో అన్నారు అని ఉడుక్కుంటూ అంటాడు. ఇప్పుడు కూడా అదే డైలాగు అంటున్నాము అని ఒకళ్ళు ఒకళ్ళు చూసుకుని అబ్బో అంటారు.
మీరు ఇద్దరు కలిసి నన్ను బాగానే మోసేస్తున్నారు గాని ఇంకా ఆపండ్రా బాబు అని దండం పెడతాడు. అలారా దారికి అని.. అందరూ అక్కడ నుండి శ్రీను గారి ఫ్యామిలీకి వీడ్కోలు చెప్పి బయలుదేరతారు.
ఇంటికి వెళ్ళిన తర్వాత పెళ్లి పనులు అన్నీ మొదలవుతూ ఉంటాయి. షాపింగ్ కూడా అందరూ సరదాగా చేస్తూ ఉంటారు.
శ్రీ, నేహా ఇద్దరూ బెంగళూరు వెళ్ళిపోతారు. ఆ పదిహేను రోజులు శ్రీ నేహా కి ఇంకా దగ్గరవుతాడు. ప్రతి ఎమోషన్ ఇద్దరూ షేర్ చేసుకుంటూ తర్వాత లైఫ్ ఎలా స్మూత్ గా వెళ్ళాలి అన్న దాని మీదే ఫోకస్ పెడతారు.
ఆరోజు ఆదివారం అందరూ ఇంట్లోనే ఉంటారు. సత్యవతి గారు ఇందిరాగారికి ఫోన్ చేస్తారు. ఏమిటి ఈ టైంలో ఫోన్ చేస్తున్నారు అనుకుని చెప్పండి అనగానే..
అందరూ ఇంట్లోనే ఉన్నారా వదినగారు అని అడుగుతుంది. ఉన్నాము ఏమిటి ఏదైనా ఇంపార్టెంటా.. అంటే కొంచెం ముఖ్యమైన విషయమే.
మేము వస్తున్నాము అని చెప్పి.. ముఖ్యంగా అవని ఇంట్లో ఉండేటట్టుగా చూడండి అని చెబుతారు. సరే అని చెప్పి ఫోన్ పెట్టేసి ఆలోచిస్తూ ఉంటారు.
అది చూసిన మాధవి ఏమైంది అమ్మ అని అడిగితే.
సత్యవతి గారు ఫోన్ చేశారు. అందరూ వస్తున్నారంట. అవిని నీ కంపల్సరీగా ఉండమన్నారు. ఏమైవుంటుందా అని ఆలోచిస్తున్నాను అని చెబుతారు.
విక్రమ్ కి ఏమైనా తెలిసేమోనమ్మ అంటే.. ఒకసారి విక్రమ్ ని పిలువు అని చెబుతారు. విక్రమ్ వచ్చి ఏమైంది నానమ్మ పిలిచావు అని అడిగితే.. జరిగిందంతా చెబుతారు.
ఆ విషయం వింటూ ఆలోచిస్తూ నాకు ఏమీ తెలియదు. చూద్దాం.. ఎందుకు వస్తున్నారో వాళ్ళ కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు.
సత్యవతి, శేషగిరి గారు, ధనుంజయ్ ముగ్గురు లోపలికి వస్తారు. ఇంటికి వచ్చిన వాళ్ళు శత్రువు అయినా సరే గౌరవించాలి అనే ఉద్దేశంతో లోపలికి రండి అని పిలుస్తారు.
ముగ్గురు వచ్చి కూర్చుని నమస్కారం చేసి ఎలా ఉన్నారు. బాగున్నారా అని అడుగుతారు. ధనుంజయ్ కళ్ళు మాత్రం అవిని కోసం వెతుకుతూ ఉంటాయి.
అది అర్థమైన విక్రమ్, నివి ని పిలిచి మీ వదినని పిలువు అని చెబుతాడు. సరే అని నివి గదిలోకి వెళ్లి అన్నయ్య పిలుస్తున్నాడు అని చెబుతోంది.
సరే అని నివి వెనకాలే కిందకి వస్తుంది. అక్కడ వీళ్ళ ముగ్గురిని చూస్తూ ఆలోచిస్తూ వస్తూ ఉంటుంది. విక్రమ్ వారగా అవని నీ అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు.
అవని వచ్చే విక్రమ్ పక్కనే నిలబడి నానమ్మ తాతగారిని పలకరిస్తుంది బాగున్నారా ? బాగున్నాను తల్లి అని చెబుతారు.
ధనుంజయ్ కి ఒక్క నిమిషం బాధగా అనిపించేనా అది కనపడనివ్వకుండా బాగున్నావా అవని అని అడిగితే.. ఊ అని తల ఊపుతుంది.
ఇందిరా గారు అవని తో ఇంటికి వచ్చిన గెస్ట్ లకి ఇంటికోడలే మర్యాద చేయాలి అమ్మ. వెళ్లి జ్యూస్ తీసుకురా అని పంపిస్తారు.
అవని అలాగే అని చెప్పి కిచెన్ లోనికి వెళుతుంది. సర్వెంట్ సాయంతో ముగ్గురికి జ్యూస్ ప్రిపేర్ చేస్తుంది.
జ్యూస్ తీసుకొచ్చి ముగ్గురికి ఇస్తుంది.
అవిని చేతితో ఇచ్చిందని ఆనందంతో జ్యూస్ తీసుకుని తాగుతాడు. ఎవరు ఏమీ మాట్లాడకుండా ఉండేటప్పటికీ విక్రమ్ కి విసుగు వచ్చి ఏంటి తాతగారు ఏదైనా ముఖ్య విషయమా అని అడుగుతాడు.
శేషగిరి గారు కొడుకు వైపు చూస్తాడు. ఒక్క నిమిషం ధనుంజయ్ గట్టిగా ఊపిరి తీసుకుని వదిలి లేచి నిలబడి అవిని ముందుకు వచ్చి నుంచుంటాడు.
అవిని ధనుంజయ్ వైపు ఏమిటివి అన్నట్టుగా చూస్తుంది. విక్రమ్ కి ఎందుకో అనుమానం వచ్చి అవని పక్కకి వచ్చి నిలబడతాడు.
వాటి గురించి తెలుసుకోవడం కోసం అయినా కూతురు మాట్లాడుతుందేమో అని చూసిన ధనుంజయ్ కి నిరాశ ఎదవుతుంది.
ఇంకా తప్పకే ధనుంజయ్ చెబుతాడు. మనకి సంబంధించిన ఆస్తులు అన్నీ కూడా నీ పేరు మీదకి ట్రాన్స్ఫర్ చేశాను.
ఇకనుండి ఆ కంపెనీ మొత్తం నీ హ్యాండ్ఓవర్ లో లోనే ఉంటుంది అని చెబుతూ పేపర్లు ముందుకి పెడతాడు. ఎందుకు సార్ అని గొంతు తడారి పోతూ ఉంటే అడుగుతుంది.
అది నీ హక్కు కాబట్టి. పుట్టింటి నుంచి నీకు రావలసినవి అని చెబుతాడు. ఆ మాటకి పేపర్స్ వైపు ధనుంజయ్ వైపు మార్చి మార్చి చూస్తూ గట్టిగా నవ్వుతుంది.
అవని నవ్వుకి అర్థం తెలియక ధనుంజయ్ కూతురు వైపే చూస్తూ ఉంటాడు. కుటుంబ సభ్యులకు కూడా అవని వైపే చూస్తూ ఉంటారు.
సత్యవతి గారి ముందుకు వచ్చి ఎందుకు అవని అలా నవ్వుతున్నావు. నవ్వక ఏం చేయమంటావు నానమ్మ. పుట్టిల్లు అంట. అసలు నాకు పుట్టిల్లు ఎక్కడ ఉంది.
అమ్మ అవని అని బాధగా అంటే... నిజమే కదా నానమ్మ. నేను ఆ ఇంట్లో పని చేశాను కాబట్టి నాకు షెల్టర్ ఇచ్చారు. అంతకుమించి ఏ విషయంలో నాకు పుట్టిల్లుగా నిలబడింది.
నా కష్టంలో అండగా ఉందా.. పోనీ నన్ను ముద్దు చేసిందా.. నా విజయంలో పాలుపంచుకుందా.. అవేమీ కాకుండా పైగా నన్ను ఒక నరకంలో తోయడానికి చూశారు. అది పుట్టిల్లు అవుతుందా అని అడుగుతుంది.
అవన్నీ మీ నాన్నకి తెలియకుండా జరిగిపోయినయి అని చెబుతూ ఉంటే చెయ్యి పెట్టి చూపిస్తూ ఇంకా ఆపండి అంటుంది.
మీరు చెప్పే కథలు వినే ఓపిక నాకు లేదు. అసలు నాకు తండ్రి అంటూ ఉంటేనే కదా.. ఏ రోజైతే నా తల్లి దూరమైందో ఆ రోజే ఆ బంధం కూడా పోయింది.
ఏ కన్నతండ్రి కూడా సార్ అని పిలవమని చెప్పరు. అలా చెప్పిన రోజునే ఆ బంధం విలువ పోయినట్టే. ఇంకా ఇప్పుడు కొత్తగా పుట్టిల్లు అని మాట్లాడుతుంటే నవ్వురాక ఏమి వస్తుంది.
అవని అలా అడుగుతూ ఉంటే... సత్యవతి గారికి ఏం చెప్పాలో అర్థం కాక చూస్తూ ఉంటారు. ఎమోషనల్ అవుతుంది అని అర్థమై...విక్రమ్ భుజం చుట్టూ చేయవేసి దగ్గరికి లాక్కుంటాడు.
నేను బాగానే ఉన్నాను అండి అని చెప్పి ప్లీజ్ సార్ ఇప్పుడు లేనిపోని కొత్త బంధాలు కల్పించుకొని అనవసరంగా మీ ఆవిడ, కూతురికి నా మీద ఇంకా కోపాన్ని పెంచకండి. దయచేసి తీసుకుని వెళ్ళండి అని చెబుతుంది.
ధనుంజయ్ పూడుకుపోయిన గొంతుతో ఒక్కసారి నేను చెప్పేది విను అవని. నాకు వినే ఇంట్రెస్ట్ లేదు అని చెబుతుంది.
విక్రమ్ ధనుంజయ్ వైపు ఒక్కసారి చూసి.. ఒకసారి ఆయన చెప్పేది విను. పక్కన నేను ఉన్నాను కదా అని చెప్పి.. అక్కడ సోఫాలో కూర్చోబెట్టి... అవిని పక్కనే కూర్చుంటాడు.
ధనుంజయ్ ను కూడా...మీరు కూర్చోండి అని చెప్పి మంచినీళ్లు తెప్పించి అవిని చేత తాగిస్తాడు.
ఇప్పుడు చెప్పండి మీరు ఏం చెప్పాలి అనుకుంటున్నారో అని విక్రమ్ అడుగుతాడు.
ధనుంజయ్ ఏమని చెబుతాడు...
కథ కొనసాగుతుంది...

![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)