04-02-2026, 07:33 AM
(This post was last modified: 04-02-2026, 07:33 AM by SivaSai. Edited 1 time in total. Edited 1 time in total.)
Part - 77
శ్రీ అవస్థ చూసి విక్రమ్ నవ్వుకుంటూ ఉంటాడు. చెవిలో మెల్లిగా ఏంట్రా అంత తింగరి చూపులు చూస్తున్నావు అని అడిగితే... బావ అని పట్టుకుంటాడు.
ఒరేయ్ చూసే వాళ్ళకి చండాలంగా ఉంటుంది. ఏమైంది ఇప్పుడు... నీకా బాధ అంటే... చూసావా.. పెళ్లి నెల రోజుల తర్వాత పెట్టారు.
దీని వెనక కుట్ర చేసిందంతా మా నాన్నే అని నాకు చాలా గట్టి నమ్మకం అంటూ వాసు గారి వైపు చూస్తాడు. వాసు గారు కొడుకుని చేసి ఏంట్రా అని కళ్ళు ఎగరేస్తారు.
మళ్ళీ చూడు ఏమీ తెలియనట్టుగా కళ్లు ఎగరేస్తున్నారు అంటే.. ఏడిశావులే ఎదవ. ఆయన కాబట్టి నెల రోజులకు తీసుకువచ్చారు.
అక్కడ మీ మామగారిని చూడు. వదిలితే ఒక ఆరు నెలలకి పోస్ట్ పోన్ చేసేటట్టు ఉన్నారు అంటే..
అనుమానంగా శ్రీ, శ్రీను గారి వైపు చూస్తాడు.
ఆయన ఇంకా ఏదో సందిగ్ధంలో ఉండడం చూసి నువ్వు
అన్నది నిజమే. బాబోయ్... మా మామగారిని వదిలితే ఎప్పుడో చేసేటట్టు ఉన్నారు.
అలా జరిగినవ్వకూడదు ఏం చేయాలి. నువ్వు మూసుకు కూర్చో. అక్కడ అంకుల్ మాట్లాడుతున్నారు. అయినా పెళ్ళికి ముందున్న రోజులు కూడా చాలా బాగుంటాయి రా..
నెలరోజులే కదా ఎంజాయ్ అంటాడు. ఎలా రా.. ఇది కూడా నేనే చెబితే రేపు పెళ్లయ్యాక నిన్ను నేహా ఆడేసుకుంటుంది రా అంటాడు.
అప్పుడు ఏం ఆడుకున్న ఇద్దరం కలిసి ఆడుకుంటాం కానీ... నీకోసం నేహాన్ని 15 రోజులు బెంగళూరులో ఉండేటట్టుగా చేస్తాను.
ఇంతకుమించి నేనేం చెప్పలేను రా అని వెళ్ళిపోతాడు. రాజ్ మాత్రం ఇవీ ఏమి పట్టించుకోకుండా నివి ఎటు వెళుతుంటే అటే కళ్ళని అప్పచెప్పేస్తాడు.
శ్రీ సీరియస్గా ఆలోచిస్తూ రాజ్ వైపు చూస్తాడు. రాజ్ ప్రపంచంతో సంబంధం లేనట్టుగా... ఎటో చూస్తూ ఉంటే అనుమానం వచ్చి..
రాజ్ పక్కకు వచ్చి ఏరా ఏం చేస్తున్నావు. నా ముందు ఒక అపరంజి బొమ్మ తిరుగుతూ ఉంటే చూస్తున్నాను రా అని మైమరపుగా చెబుతాడు.
ఎవరో అపరంజి బొమ్మ. మాకు చూపిస్తే మేము తరిస్తాం కదా అనగానే.... ఈ లోకంలోకి వచ్చి ఏంట్రా ఏమంటున్నావు ఏమీ తెలియనట్టుగా అడుగుతాడు
నీ ఓవరాక్షన్ ఆపి మేటర్ ఏంటో చెప్పు అంటాడు. నాకే ఇంకా సరిగ్గా తెలియదు. ఇంకా నీకేం చెబుతాను. పూర్తిగా తెలిశాక ముందు చెప్పేది మీ ఇద్దరికే అంటాడు.
అబ్బో ఈ ఊర్లో ఎవర్రా.. నీ మనసును పరిగెత్తిస్తున్న వాళ్ళు అంటే.. ఎవరో ఒకరు ఉన్నారులే గాని.. నువ్వేంటి అమావాస్య చంద్రుడిలాగా మొహము అలా ఎలాడేసావు.
రాజ్ వైపు తిరిగి ఏరా అసలు నువ్వు ఈ ప్రపంచంలోనే లేవా అంటే... ఇప్పుడు అవన్నీ ఎందుకు గాని మేటర్ ఏంటో చెప్పరా బావ.
ఏముంది చెప్పడానికి అక్కడ వాళ్ళిద్దర్నీ చూడు అని తండ్రి మామగారు వైపు చూపిస్తాడు. ఏమైంది వాళ్లిద్దరికి అంటే... పెళ్లెప్పుడు చేయాలని తెగ డిస్కస్ చేస్తున్నారు.
ఇంకా డేట్ ఫిక్స్ చేయలేదా అంటే.. అదే తర్జన భర్జన పడుతున్నారు. డాడీ ఏమో నెలకే అంటున్నారు. మా మామగారు ఇంకెప్పుడో అని ఆలోచిస్తున్నారు.
తొందరగా ఏదో ఒకటి తేల్చమని రా..నేను వెళ్ళాలా లేదా ఇక్కడే ఉండి పోవాలా అన్నది చూసుకోవాలి కదా.. లేకపోతే టికెట్స్ వేస్ట్ అవుతాయి అంటాడు.
ఒరేయ్ నా పెళ్లి కన్నా నీకు టికెట్స్ ఇంపార్టెంట్ అంటే అలా కాదురా... ఉండిపోవాల్సి వస్తే ఉండిపోతాను. లేదు అంటే వెళ్ళు వస్తాను అంతే తేడా.
అయినా నాకు ఇక్కడ ఉండడమే ఇష్టం నివిని చూస్తూ అక్కడున్న పూలు పీకుతూ ఉంటాడు. పూల మీదున్న రాజ్ చేతులను తీసి పక్కన పెడుతూ.. మనం ఇంకా ఇక్కడ నుండి వెళ్లలేదు. నువ్వు ఆ పువ్వులు పీకకు.
ఛీ... నీకు కుళ్ళు రా నన్ను చూసి అంటాడు. దేనికి అంటే నేను లవ్ లో పడుతున్నానని అంటే... అబ్బో... యువ్వరం చాలా దూరం వచ్చినట్టే ఉంది.
అంత లేదురా.. ఫస్ట్ స్టెప్ దగ్గరే ఉన్నాను. పిల్ల ఏమో నా వైపు అసలు చూడడం లేదు. ఇంతకీ ఎవరురా అమ్మాయి అంటే...
అప్పుడే చెప్పను అన్నాను కదా... ముందు నేను లైన్లో పెట్టి ఓకే చేయించుకున్నాక. మీ ఇద్దరికే పరిచయం చేస్తాను. ఇంతకీ మాకు తెలిసిన అమ్మాయా లేక కొత్త అమ్మాయా..
ఒక్క నిమిషం ఆలోచించి తెలిసిన అమ్మాయే అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఈ ఊర్లో మాకు తెలిసిన అమ్మాయి ఎవరు అబ్బా అని థింక్ చేస్తూ ఉంటాడు.
ఎట్టకేలకు అందరూ నిర్ణయం మీద నెల రోజులకే ముహూర్తం ఫిక్స్ చేస్తారు. శ్రీ హమ్మయ్య అనుకుంటు నేహా ని చూస్తాడు.
నేహ మాత్రం సైలెంట్ గా ఉంటుంది. ఏంటి మా మేడం ఇంకా అలాగే ఉన్నారు. నా మీద కోపమా లేక ఈ పెళ్లి ఇష్టం లేదా... ఎలాగైనా నేహాతో మాట్లాడాలి అని అవినికి సైగ చేస్తాడు.
ఆ సైగ లు చూసి ఏంటన్నయ్య అంటే.. ఒక్కసారి ప్లీజ్ అని రిక్వెస్ట్ చేస్తాడు. దగ్గరకు వచ్చి చెప్పు అన్నయ్య అంటే.. నేను ఒకసారి ఎలాగైనా సరే నేహాతో మాట్లాడాలి.
ప్లీజ్ ఏర్పాటు చేయవా అంటే.. అమ్మో ఇక్కడ అంటది. ప్లీజ్ అవని నువ్వు తప్ప నాకు ఇక్కడ ఇంకొక దారి లేదు. ఎందుకో మా మేడం ఫేస్ డల్ గా ఉంది అని చెబుతాడు.
అప్పుడు అవని నేహా ఫేస్ వంక చూస్తుంది. అది నిజంగానే డల్ గా కనిపిస్తుంది. ఒక్క ఐదు నిమిషాలు అని లక్ష్మి గారి దగ్గరికి వెళ్లి ఆంటీ అని పిలుస్తుంది.
చెప్పమ్మా ఏమైనా కావాలా అంటే... అది ఏమీ లేదు నిశ్చితార్థం అయిపోయింది కదా... ఒక్క అయిదు నిమిషాలు పెళ్ళికొడుకు పెళ్ళికూతురుని ఒంటరిగా మాట్లాడుకునేస్తే బాగుంటుందేమో అంటుంది.
అది అని ఇబ్బందిగా చూస్తూ ఉంటే ప్లీజ్ ఆంటీ.. వాళ్లకు కూడా మనస్సు విప్పి మాట్లాడుకోవాలి అని ఉంటుంది కదా...
మీ అంకుల్ ఏమంటారో అని ఇబ్బందిగా చెబుతుంది. నేను అది చూసుకుంటాను అని విక్రమ్ దగ్గరికి వెళుతుంది. ఏవండీ అని పిలుస్తుంది.
అయినా వినిపించుకోన్నట్టుగా కూర్చుంటాడు. మిమ్మల్నే అని దగ్గరికి వెళుతుంది. నన్నా అనే వేలు తన వైపు పెట్టుకొని చూపిస్తూ అడుగుతాడు.
మిమ్మల్ని కాపోతే ఇంకా ఎవరిని పిలుస్తాను అని అడుగుతుంది. అంటే... ఇందాక ఎవరో నాతో మాట్లాడను అన్నారు కదా..అందుకే నన్ను కాదు అనుకున్నానులే...
ఇంతకీ ఎందుకో అని రాగం తీస్తాడు. ఎంత అలుసైపోయాను మీకు అని పళ్ళు నూరుతూ ఉంటుంది. ఇంత కూడ అలసుఅవ్వలేదులే గాని...
మేటర్ ఏంటి అని అడుగుతాడు. శ్రీ ఇబ్బంది చెబుతుంది. దానికి నవ్వుకుంటూ సరే నేను అరేంజ్ చేస్తాను. వాళ్ళిద్దరికీ రూమ్ సెట్ చేయి అని చెప్పి శ్రీను గారితో మాట్లాడి ఇద్దరినీ ఒక గదిలోకి పంపిస్తారు.
గదిలోకి వెళ్లిన నేహ తలదించుకునే ఉంటుంది. శ్రీ, నేహా దగ్గరకు వచ్చి నేహా అని గారంగా పిలుస్తాడు. అయినా తలెత్తదు.
ఏంటి నా పైన కోపమా అని అడుగుతాడు. లేదు అన్నట్టుగా తలపుతుంది. సిగ్గా అని అడుగుతాడు. కాదు అన్నట్టుగా ఊపుతుంది.
మరి ఇంకేంటి అని అడుగుతాడు. అయినా మౌనంగా ఉంటే.. ఎంతసేపు నిలబడతాం కానీ వచ్చి కూర్చో అని.. పక్కన కూర్చోబెట్టుకుని ఇప్పుడు చెప్పు.
నువ్వు ఏదైనా నోరు తెరిచి చెబితేనే కదా నాకు అర్థం అవుతుంది అని అడుగుతాడు. ఆ మాటకి శ్రీ వైపు చూస్తూ మీరు నాకు ముందే ఎందుకు చెప్పలేదు అని అడుగుతుంది.
ఆ మాటకి గుతుక్కుమంటాడు. అబ్బా ఇప్పుడు ఏం చెప్పాలి అనుకుని.. మీ నాన్నగారు నీతో ఏమీ చెప్పలేదు అన్నావు కదా.. అందుకే నాకు ఎలా చెప్పాలో అర్థం కాలేదు.
పైగా ఎంగేజ్మెంట్ రోజుని ఇలా చూస్తే నువ్వు సర్ప్రైజ్ ఫీల్ అయ్యి.. హ్యాపీగా ఫీలవుతావు అనుకున్నాను కానీ ఇలా డల్ గా ఉంటావని ఎక్స్పెక్ట్ చేయలేదు అని నీరసంగా చెబుతాడు.
నేను డల్ గా ఉంది అందుకు కాదు అంటుంది. అంటే నన్ను చేసుకోవడం ఇష్టమేనా అని హ్యాపీగా అడుగుతాడు. ఇష్టమే అని తలుపుతుంది.
మరి ఇంకేంటి ప్రాబ్లం అని అడుగుతాడు. ఏం చెప్పాలో అర్థం కాక మళ్ళీ తల దించుకుంటుంది. గెడ్డం కింద వేలు పెట్టి పైకి లేపుతూ.. మీ పేరెంట్స్ గురించా అని అడుగుతాడు.
అవును అన్నట్టుగా తలూపుతుంది.. దానికి ఇంత ఆలోచించాల్సిన అవసరం ఏముంది. ఉన్నది మనిద్దరం. మనకు ఉన్నది వాళ్ళ నలుగురు.
పెళ్లయ్యాక నువ్వు జాబ్ చేయడం చేయకపోవడం పూర్తిగా నీ ఇష్టం కాని.. వాళ్ళు బాధ్యత మాత్రం పూర్తిగా నాదే.
నీ శాలరీ మొత్తం వాళ్ళకి ఇచ్చేస్తానన్నా నాకు ఎటువంటి ఇబ్బంది లేదు. నీకు ఇంకో గుడ్ న్యూస్ చెప్పనా... ఈ ఊర్లోనే డాడీ ల్యాండ్ కొంటున్నారు.
అది మొత్తం మీ నాన్నగారు కంట్రోల్లోనే ఉంటుంది అని చెబుతాడు. నిజంగానా అని ఆనందంగా అడుగుతుంది. నా ప్రాణానికి నేను అబద్ధం చెబుతానా...
ఆ మాటకే నేహ సిగ్గుపడుతుంది. హమ్మయ్య వచ్చినప్పటి నుంచి ఇప్పటికి నీ ఫేసులో ఒక ఫీలింగ్ చూడగలిగాను.
ఇప్పుడు దాకా చాలా టెన్షన్ వచ్చింది. ఈ పెళ్లి నీకు ఇష్టమా కాదా అని. ఇష్టం లేకుండా పెళ్లి చేసుకోవడం నాకు ఇష్టం లేదు అనుకో.. బట్ నిన్ను వదులుకోవడం అంతకన్నా ఇష్టం లేదు అని చెబుతాడు.
ఆ మాటకి ఆశ్చర్యంగా చూస్తూ ఈ పెళ్లి కుదురుతుందని మీకు ముందే తెలుసా అని అడుగుతుంది. దానికి నవ్వుతూ ఎందుకు తెలియదు.
సెట్ చేసిందే మేము అయితే అంటాడు. అంటే.. నిన్ను ఎప్పుడో ఇష్టపడ్డాను. అవని నువ్వు కలిసి ఉన్నప్పుడే మీ ఇద్దరి బాండింగ్ బాగా నచ్చింది.
అప్పుడు నుంచి నీ మీద ఇష్టం మొదలయింది. ఆ ఇష్టం ప్రేమగా మారి ఇక్కడ వరకు వచ్చింది.
ఇదంతా నాకు తెలియకుండా ఎప్పుడు జరిగింది. ఇది మరీ బాగుంది. నాకు నీ మీద ఇష్టం పెరుగుతూ ఉంటే నీకు ఎలా తెలుస్తుంది.
నీకు నామీద ఇష్టం పెరిగినప్పుడు అది నీకు తెలుస్తుంది. కానీ ఇప్పుడైనా నీకు నామీద ఇష్టం కలిగిందా లేక మీ పెద్దవాళ్లు చూశారని ఒప్పుకుంటున్నావా అని అడుగుతాడు.

![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)