03-02-2026, 07:32 AM
(This post was last modified: 03-02-2026, 07:33 AM by SivaSai. Edited 1 time in total. Edited 1 time in total.)
Part - 76
సరదాగా మాట్లాడుకుంటూ అందరూ నేహా ఊరికి వచ్చేస్తారు. వెనకాలే విక్రమ్ ఫ్యామిలీ కార్లు కూడా వచ్చేస్తాయి. ఒక కారుని భరత్ డ్రైవ్ చేస్తే.. ఇంకో కారుని వినయ్ డ్రైవ్ చేస్తాడు. ఇంకొక కార్ కి డ్రైవర్ వస్తాడు.
అవని కారు దిగి ఫాస్ట్గా లోపలికి వెళ్ళిపోతుంది. అది చూసిన విక్రమ్... మొగుడు దిగాడో లేదో.. వస్తాడో లేదో అని కూడా లేదు.
చూడు ఎలా వెళ్ళిపోతుందో మీ చెల్లి అంటాడు. నువ్వు ఆగరా బావ.. మా చెల్లి వెళితే వెళ్ళింది. అక్కడ నీచెల్లి ఆలకి ఎలా ఉందో తెలియదు. నాకు అసలే టెన్షన్ గా ఉంది. నువ్వు సైలెంట్ గా ఉండు అంటాడు.
రాజ్ మాత్రం ఇద్దర్నీ చూస్తూ సరిపోయింది. మీ ఇద్దరి గొడవ. ఒకళ్ళేమో పెళ్ళాం పట్టించుకోకుండా వెళ్ళిపోయింది అని అలక. ఇంకొకళ్ళు కాబోయే పెళ్ళాం ఎక్కడ అలుగుతుందో అని టెన్షన్ పడుతున్నారు.
ఏదేమైనా సరే మీరిద్దరూ చాలా వీక్ రా అంటాడు. ఇద్దరూ రాజ్ వైపు చూస్తూ.. దేంట్లో... పెళ్ళాన్ని కంట్రోల్ చేయడంలో అంటాడు.
ఒరేయ్ నీకు ఇంకా పెళ్లి కుదరలేదు. పిల్ల దొరకలేదు. అప్పుడే పెళ్ళాం కంట్రోల్ చేయడం గురించి మాట్లాడుతున్నావా...
పెళ్లి ఎప్పుడు కుదురుతుందా.. పిల్ల ఎప్పుడు దొరుకుతుందా అన్నది మెయిన్ పాయింట్ కాదు బావ. వచ్చేవాళ్లని ఎలాగైనా సరే మన కంట్రోల్ లో పెట్టుకోవడం.
అది ఇంపార్టెంట్. ఆ విషయంలో నేను మీ ఇద్దరం అంత వీక్ కాదు అంటాడు. అబ్బో చూద్దాం అది కూడా... నీ డైలాగ్ లు వింటూ ఉంటే ఏదో సినిమాలో విన్నట్టు ఉంది రా.. తర్వాత నిన్ను ఊహించుకోడానికి కూడా మాకు జాలి వేస్తుంది అంటే అంత సీన్ ఏమి లేదు.
సురభి, వాసు వీళ్ళ దగ్గరకు వచ్చి ఏంటి మీ ముగ్గురు డిస్కషన్. లోపలికి రారా అంటే... అదే చూస్తున్నాం ఆంటీ...
ఎవరూ వచ్చి పిలవలేదు అని. ఇంతలో శ్రీను గారు కంగారుగా వచ్చి క్షమించండి చూసుకోలేదు రండి.. బావగారు రండి... చెల్లెమ్మ రండి.. అల్లుడుగారు లోపలికి రండి అని పిలుస్తారు.
ఎందుకు బావగారు అంత కంగారు పడుతున్నారు. మనలో మనకి అలాంటి ఫార్మాలిటీస్ ఏమీ లేదు అని భుజం మీద చేయి వేసి పదండి అని రాజ్ వైపు తిరిగి...
రాజ్ నువ్వు ఇక్కడే ఉండి కళ్యాణ్ వాళ్ళు వస్తారు కదా.
వాళ్ళు లోపలకి తీసుకురా... ఈ ప్లేస్ కొత్త ..
మళ్లీ ఇబ్బంది పడతారు.
షుర్ అంకుల్... అక్కడే వెయిట్ చేస్తూ ఉంటాడు. రాజ్ వెయిట్ చేస్తూ ఉండగానే మూడు కార్లు వచ్చి ఆగుతాయి.
ఒక్కొక్క కారులో నుంచి అందరూ దిగుతూ ఉంటారు. రాజ్ ఎదురు వెళ్లి లోపలికి రండి అంకుల్ అని చెప్పి తీసుకువెళుతూ ఉంటాడు.
లలిత గారు కారువైపు తిరిగి నివి... కారు దిగేటప్పుడు ఆ గిఫ్ట్స్ కూడా తీసుకుని లోపలికి రా అని చెప్పి వెళ్ళిపోతారు.
నివి కారు దిగి... గిఫ్ట్స్ తీస్తూ ఉంటే ఇబ్బందిపడుతూ ఉంటుంది. ఒక పక్కన లంగా వోని క్యారీ చేయడం. ఇంకొక పక్కనే గిఫ్ట్స్ కష్టంగా అనిపిస్తూ డ్రైవర్ని పిలుస్తుంది.
డ్రైవర్ వచ్చి ఆ గిఫ్ట్స్ తీసుకుంటాడు. హమ్మయ్య అనుకుని తను సెట్ చేసుకుని... ఆ గిఫ్ట్స్ అన్ని తీసుకుంటుంది.
నేను లోపలికి తీసుకువస్తాను మేడం అంటే.... పర్వాలేదు మన ఇంట్లో పనే కదా అని చెప్పి.... ఆ గిఫ్ట్స్ పట్టుకుని నడుస్తూ ఉంటే...
రాజ్ ఎప్పటినుంచి చూస్తున్నాడో తెలియదు కానీ స్టాట్యూలాగా అయిపోయి అలాగే చూస్తూ ఉంటాడు. ఎప్పుడు దీన్ని ఇంత పద్ధతిగా చూడక.. లేక నాలో ఏమన్నా హార్మోన్స్ మారుతున్నాయా..
నాకళ్లకి ఏంటి ఇంత అందంగా కనపడుతుంది. ఎప్పుడు చూసినా జీన్స్, స్కట్స్ వేసుకుని కనపడుతుంది. ఈరోజు ఇంత పద్ధతిగా కనపడుతూ ఉంటే ఆ పిల్ల ఈ పిల్లేనా అనిపిస్తుంది.
నివి క్రాస్ చేసుకుని వెళ్ళిపోయినా సరే అలాగే చూస్తూ ఉంటాడు. వినయ్ అక్కడికి వచ్చి ఏంట్రా ఇక్కడే నిలబడి పోయావు.
ఇంకా ఎవరినైనా రిసీవ్ చేసుకోవాలా అని కదుపుతాడు. తర్వాత ఈ లోకంలోకి వచ్చి ఏం అడిగావు అని అడుగుతాడు. ఎక్కడ ఆలోచిస్తున్నావు నువ్వు.
ఇందాకటి నుంచి నేను మాట్లాడుతూనే ఉంటే ఏదో ఊహాలోకంలో తేలుతున్నావు. నిజంగానే ఊహా లోకంలో తేలుతూనే ఉన్నాను..
అనవసరంగా నువ్వు వచ్చి డిస్టర్బ్ చేసావు. పైనుంచి కిందకి చూస్తూ ఈ ఊరు రాగానే ఏదైనా గాలి సోకిందా ఏంటి. పిచ్చిపిచ్చిగా మాట్లాడుతున్నావు.
నేనేమీ పిచ్చిపిచ్చిగా మాట్లాడడం లేదు బామ్మర్ది అని బుగ్గ పైన తట్టి లోపలికి వెళతాడు. వెళుతున్న రాజ్ని చూస్తూ బాబోయ్ వీడు ఏంటో... వీడే గోల ఏంటో అనుకుని లోపలికి వెళతాడు.
అవని నేహాని బుజ్జగించి సర్థిచెప్పి హమ్మయ్య అని హాల్లోనికి వస్తుంది. భార్యని చూసి ఏంటి అని కళ్ళు ఎగరేస్తాడు.
మూతి తిప్పుకుంటూ మీతో మాట్లాడను. ఖచ్చి అని లిటిల్ ఫింగర్ చూపిస్తుంది. అబ్బో ఎంతసేపు ఉంటావో నేను చూస్తాను అని కళ్ళతోనే అడుగుతాడు.
అవిని మూతి తిప్పి ఫంక్షన్ దగ్గర ఏమి కావాలో అవి అన్ని సర్దుతూఉంటుంది. నివి కూడా వచ్చి అవినికి హెల్ప్ చేస్తూ ఉంటుంది.
రాజ్ విక్రమ్ పక్కకి వచ్చి నిలబడి విక్రమ్ భుజం మీద చేయి వేసి మెలికలు తిరుగుతూ నివినే చూస్తూ ఉంటాడు.
అక్కడ నివి అవిని చెప్పినట్టుగా చేస్తూ నవ్వుతూ మాట్లాడుతూ సర్దుతూ ఉంటుంది. ఒక్కొక్కసారి ఆ ఫ్యాన్ గాలికి ముంగురులు ఎగిరి డిస్టర్బ్ చేస్తూ ఉంటే....
వాటిని సున్నితంగా ముని వేళ్ళతో చెవి వెనకాల కి సర్దుకుంటూ... చెదురుతున్న ఓనీని సర్దుతూ నవ్వుతూ మాట్లాడుతూ ఉంటుంది.
నివి ని అలా చూసిన రాజ్ గుండె స్కిప్ అయ్యి కింద పడిపోతుంది ఏమో అన్నంతగా కంగారు పడిపోతూ ఉంటాడు.
ఎవరి భుజం మీద చెయ్యి వేసాడో కూడా చూడకుండా.. నివి ని చూస్తూ ఇక్కడ తన చొక్కాఅంచుని తానే నలిపేసుకుంటూ ఉంటాడు.
ఎంతసేపైనా రాజ్ ఏం మాట్లాడడం లేదు ఏంటి అని చూసిన విక్రమ్ కి ఏదో తేడాగా అనిపిస్తుంది. ఏంటి వీడు తెగ మెలికలు తిరుగుతున్నాడు.
ఏమయిందా అని... ఏరా ఏదైనా చీమ దూరిందా ఏంటి ఇందాక నుంచి తెగ డాన్స్ చేస్తున్నావు అంటే... అవును బావ ఇప్పుడే ప్రేమ చీమ కుట్టి కుట్టనట్టుగా వెళ్ళిపోయింది.
ఒరేయ్ ఏం మాట్లాడుతున్నావ్ రా నువ్వు అంటే... అసలు విక్రమ్ మాటలు వినపడితేనే కదా.. ఏంటి బావా నీ గోల అని మళ్లీ నివి మీదే ఫోకస్ పెడతాడు.
ఏంటి... వీడిని ఎంత కదిపినా ఎక్కడో చూస్తున్నాడు అని రాజ్ చూస్తున్నా వైపుకే వారగా చూస్తాడు. అక్కడ అవని, నివి ఉంటారు.
ఏంటి వీడు వాళ్ళిద్దర్నీ చూస్తున్నాడు. కొంపతీసి వీడు, నివికి ఏమైనా సైట్ కొడుతున్నాడా అని డౌట్ వచ్చి డిప్ప మీద పీకి.. ఏం చేస్తున్నావ్ రా అని అడుగుతాడు.
అప్పుడు స్పృహ లోకి వచ్చి ఎక్కడున్నాం రా మనం అంటాడు. ఒరేయ్ ఎక్కడున్నావో కూడా తెలియని అంత ఇదిగా మునిగిపోయావా.... నేనేం మునిగిపోలేదు అని ఓ... ఇది శ్రీ ఎంగేజ్మెంట్ ప్లేస్ కదా సారీ బావా అని ఒక తింగరినవ్వు నవ్వుతాడు.
నవ్వింది చాలుగాని ఏం చేస్తున్నావ్ ఇప్పుడు దాకా అంటే బావ అని గోకుతాడు. నువ్వు అలా గోక్కు చూసే వాళ్ళకి చాలా చిరాగ్గా ఉంటుంది.
చి... చి... నేను ఆ టైపు కాదు అని చెప్పి మళ్లీ కళ్ళని ఆటోమెటిగ్గా నివికి రాసిచ్చేస్తాడు. అది చూసి విక్రమ్ నవ్వుకుంటూ చూద్దాం ఏం చేస్తారో అని పెళ్ళాన్ని చూస్తూ ఉంటాడు.
అమ్మాయిని తీసుకురండి అని చెప్పగానే... శ్రీ టెన్షన్ తో నేహా గది వైపే చూస్తూ ఉంటాడు. రాజ్ ఇంకా శ్రీ గురించి పట్టించుకోవడం మానేసి నివి పైనే ఫోకస్ పెడతాడు.
ఇక విక్రమ్ నాకు తప్పదు కదా అని వెళ్లి శ్రీ పక్కన కూర్చుని ఎందుకురా అంత టెన్షన్ పడతావు. మీ చెల్లి ఎలా రియాక్ట్ అవుతుందో అని..
అంత లేదక్కడ... ఆల్రెడీ మీ చెల్లి కూల్ చేసి వచ్చింది అని చెబుతాడు. నిజమా బావ అంత గుడ్ న్యూస్ ఇంత స్లోగా నా చెప్పేది.
నేను అలిగాను. ఐ హర్ట్ అంటాడు. నువ్వు అలిగిన, హర్ట్ అయినా ఇక్కడ ఎవరూ ఏమీ పట్టించుకోరు కానీ నేహా వస్తుంది చూసుకో అంటాడు.
గులాబీ రంగు పట్టు చీర కట్టుకొని ... తల నిండా పూలు పెట్టుకుని తలదించుకునే వస్తున్న నేహా న్ని చూసి ఒక్క క్షణం తన కళ్ళని తన మనసుని నేహా కి రాసి ఇచ్చేస్తాడు.
ఇద్దరినీ పక్కపక్కనే కూర్చోబెట్టి పూజ చేపించి పెద్దవాళ్లు తాంబూలాలు మార్చుకుని ఉంగరాలు మార్చుకోమని ఇద్దరి ముందు పెడతారు.
నేహా ఎంతసేపైనా తలెత్తదు. శ్రీకి నేహా ఫేస్ చూడాలి అని ఆరాటం ఎక్కువవుతుంది. ఎలా పిలవాలో అర్థం కాక ఉంగరం పెడుతున్నప్పుడు ఎవరూ చూడకుండా మెల్లిగా అరచేతిలో గోకుతాడు.
ఆ గోకుడికి నేహా కళ్ళు పైకెత్తి చూస్తుంది. ఆ సోయగాల చిన్నదాని చేప కళ్ళలో చిక్కి శ్రీ విలవిల్లాడిపోతూ ఉంటాడు.
నేహా కూడా శ్రీకి ఉంగరం తొడిగి మళ్ళీ కళ్ళను దించేస్తుంది.
తాంబూలాలు అయిపోయిన తర్వాత.. పెళ్లికి కూడా ముహూర్తం పెట్టేస్తారు. ఒక నెలలో దివ్యమైన ముహూర్తం ఉంది అని చెబుతారు.
ఒక నెల అంటే సరిపోతుంది బావగారు అని శ్రీను గారు మొహమాటంగా అడిగితే.. ఎందుకు సరిపోదండి ఈ రోజుల్లో అన్ని రెడీమేడ్ గా దొరికేస్తున్నాయి.
పెళ్ళికూతురు పెళ్ళికొడుకు రెడీగా ఉంటే చాలు అని వాసుగారు చెబుతారు. వీళ్ళ మాటలు వింటున్న శ్రీ నెలరోజులు సరిపోతుందా అని అడుగుతున్నారా మామయ్య గారు.
నెల రోజులంటే ఇక్కడ ఎంత కష్టమో మీకు ఏమైనా అర్థమవుతుందా అని మనసులోనే అనుకుంటాడు. పైకి అంటే అందరూ తనని తుక్కురేగ్గగొడతారు. ఆ ప్లేస్ లో ముందు వాసు గారే ఉంటారని తెలిసి సైలెంట్ గా చూస్తూ ఉంటాడు.
పాపం మా శ్రీ కష్టాలు ఎవరికీ రాకూడదబ్బా....
కథ కొనసాగుతుంది....

![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)