Thread Rating:
  • 5 Vote(s) - 3.6 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
ఖైదీ నెంబర్ 402 - నా మాటే శాసనం
ఎపిసోడ్ 58


ముకుల్ వాళ్ళతో జాగ్రత్తగా ఉండమని చెప్పిన వసుంధర వాళ్ళ వైపు చూసి "జరగబోయే యుద్ధం ఎవరికి తెలియనటువంటి ఎవరు చదవనటువంటి ఐదవ వేదం శత్రువులు మీద దాడి ఊహించని విధంగా ఉంటుంది." అని చెప్పాడు అభీర్.

*************

అభీర్ చెప్పింది విని ఆశ్చర్యంగా చూస్తూ 'ఆలా అయ్యితే వాళ్లకి మామూలుగా ఉండదు.' అని మనసులో అనుకుంది నీలమ్.

అందరికీ వీడ్కోలు చెప్పి అక్కడినుంచి బైరి, శంకర్ తో కలిసి కారులో వెళ్లిపోయాడు అభీర్.

అక్కడి నుంచి కార్లో వెళుతున్న వాళ్ళని చూసి "శ్రీకర్! ఆ బైరిని ఎక్కడో చూసినట్లు ఉంది?" అని డౌట్ గా అడిగాడు సందీప్.

"మీరు భైరవనాధ్ పేరు వినే ఉంటారు, ఆ బైరవనాదే ఈ బైరి! అతని మనుషులు మన ఇండియన్ RAW కి హెల్ప్ చేస్తూ ఉంటారు. శత్రువు ఏ దేశంలో ఉన్నా సరే అక్కడికి వెళ్లి అనుమానం రాకుండా చంపడంలో వీళ్ళకి సాటి ఎవరూ లేరు.

దీనిని బట్టి చూస్తే అభీర్ సేనలో ఒక్కొక్క మనిషి ఒకొక్క అభీర్! ఇప్పటివరకు ఆ నంద ఫ్యామిలీని అభిజిత్ ఫ్యామిలీని ఎదురుకోవడం వీళ్ళకి కష్టం అనుకున్నాను.

కానీ అభీర్ సేనని ఎదుర్కోవడం వాళ్ళ వల్ల కాదు, మనకి తెలిసిన ఒక వ్యక్తి ఇలా ఉంటే మిగతా వాళ్ళందరూ ఇంకా ఎలా ఉంటారో!" అని చెప్పాడు శ్రీకర్.

"మీరు అభీర్ సేనాని తక్కువ అంచనా వేశారు వాళ్ళు శివాజీ మహారాజ్ తో కలసి మొగలుల మీద వీర విహారం చేసిన వాళ్ళ పూర్వీకుల రక్తం పంచుకు పుట్టిన వారు, దేశం కోసం స్వఅభిమానం కోసం వీళ్ళు ఎక్కడిదాకైనా వెళతారు." అని చెప్పింది బామ్మ.

"మరి మిగతా నలుగురు ఎక్కడ ఉన్నారో? ఏం చేస్తున్నారో? వాళ్ళని కూడా ఒకసారి చూడాలని ఉంది." అని చెప్పింది వసుంధర.

***************

ఇంటి దగ్గరికి చేరుకుని అక్కడ ఉన్న మనుషులను చూపించి "నాయకుడా వీళ్ళందరూ మన సైన్యం! నీ రాక కోసం, నీ నోటి నుంచి వచ్చే మాట కోసం ఎదురు చూస్తూ ఉన్నారు.

ఒకవేళ ముకుల్ ఫ్యామిలీ ఇక్కడకు రాకపోయినా మన నెట్వర్క్ తో వాళ్ళు ఎక్కడ ఉంటే అక్కడకి వెళ్లి చంపించొచ్చు!" అని చెప్పాడు బైరి.

"అతని కుటుంబంలో ప్రతి ఒక్కరు ఈ గడ్డమీదకు రావాల్సిందే, వస్తారు." అని చెప్పాడు అభీర్.

"నాయకుడా! మన వాళ్ళు ఇచ్చినా ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇండియాలో ప్రాపర్టీస్ మొత్తం గోకుల్ కూతురు అర్ణ సేల్ చేయడానికి రెడీ అయింది. దానికోసం వాళ్ల కంపెనీలో డైరెక్టర్ అయిన ప్రతాప్ మిశ్రా కొడుకు సుజిత్ మిశ్రని ఇక్కడకు పంపించింది.

ప్రతాప్ మిశ్ర, సెంట్రల్ మినిస్టర్ వరదరాజులు, ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందుకే ఒక ప్రాపర్టీ ని చాలా తక్కువ రేటుకి ఇస్తున్నారు, అ విషయం ముకుల్ పెద్ద అల్లుడు రఘురామ్ కి ఇష్టం లేదు ఖచ్చితంగా ఈ విషయంలో వాళ్ళ మధ్య క్లాష్ వస్తుంది." అని చెప్పాడు బైరి.

"సరే! మన వాళ్ళందరినీ నేను ఒకసారి నేను కలవాలి." అని చెప్పాడు అభీర్.

"ఈరోజు రాత్రికి అందరూ ఇక్కడ ఉంటారు నాయకుడా!" అని చెప్పాడు బైరి.

************

ఢిల్లీ తన గెస్ట్ హౌస్ లో ఫోన్ రింగ్ అవుతుండగా లిఫ్ట్ చేసి "హాయ్ అర్ణ!" అని చెప్పాడు సుజిత్.

"ఆ మినిస్టర్ ప్రాపర్టీ అగ్రిమెంట్ ఎప్పుడు చేసుకుందామని చెప్పాడు?" అవి అడిగింది అర్ణ.

"అన్ని విషయాలు మాట్లాడేసాను 2500 కోట్లకి డీల్ ఫైనల్ చేశాను వెయ్యి కోట్లు అడ్వాన్స్ ఇచ్చి అగ్రిమెంట్ చేసుకుంటారు.

నువ్వు తాతయ్య గారితో మాట్లాడి ఫైనల్ చేయడమే లేట్ ఇక్కడ ఉన్న ప్రాబ్లం గురించి కూడా ఆయనతో చెప్పాను మనకు ఎవరు అడ్డం వచ్చినా సరే వాళ్ళే చూసుకుంటారు." అని చెప్పాడు సుజిత్.

"గుడ్! అగ్రిమెంట్ కి రెడీ చెయ్, రేపు ఫ్యామిలీ మెంబెర్స్ ఇక్కడికి వస్తున్నారు, మాట్లాడి రిజిస్ట్రేషన్ డేట్ కూడా ఫిక్స్ చేస్తాను." అని చెప్పింది అర్ణ.

"షూర్! నువ్వు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడమే లేట్! మన ప్రాపర్టీస్ కోసం బయ్యర్స్ ఎగబడుతున్నారు వన్ మంత్ లో మనం అనుకున్నది జరిగిపోతుంది." అని చెప్పాడు సుజిత్.

ఆమాటకి "అప్పుడే మనం అనుకున్న పని పూర్తి అవ్వదు, ఇండియాలో నాకు కూడా తెలియని ఒక విలువైన ప్రాపర్టీ బయటపడింది. ఆ విషయంలో మినిస్టర్ వరదరాజులు హెల్ప్ మనకి చాలా అవసరం అవుతుంది." అని చెప్పింది అర్ణ.

"అవునా ఆ ప్రాపర్టీ డీటెయిల్స్ నాకు పంపించు అంకుల్ తో మాట్లాడుతాను." అని చెప్పాడు సుజిత్.

"సరే!" అని చెప్పి ఫోన్ పెట్టేసింది అర్ణ.

ఫోన్ కట్ అవ్వడంతో "సరే అని చెప్పి పెట్టేసింది ఏమిటి? డాడ్ కూడా తెలియని ప్రాపర్టీ ఏమిటి?" అని డౌట్ గా తండ్రికి కాల్ చేశాడు సుజిత్.

లండన్ లో తన ఇంటి దగ్గర ఫోన్ రింగ్ అవ్వడం చూసి "వీడేంటి ఈ టైంలో కాల్ చేస్తున్నాడు?" అని లిఫ్ట్ చేసి "సుజిత్ టెల్ మీ?" అని అడిగాడు ప్రతాప్ మిశ్రా.

"డాడ్! నంద ఫ్యామిలీకి ఇండియాలో మనకి కూడా తెలియని ప్రాపర్టీ ఒకటి  ఉంది. నాకు తెలిసి దాని గురించే ఆ జైల్లో ఉన్న వాడికి వీళ్ళకి గొడవ అనుకుంట!

ఆ ప్రాపర్టీ విషయంలో అర్ణ చాలా ఇంట్రెస్ట్ గా ఉంది. దానికి వాల్యూ చాలా ఎక్కువగా ఉంటుంది అనిపిస్తుంది. దాని విషయంలో మినిస్టర్ అంకుల్ హెల్ప్ కూడా కావాలి అని చెబుతుంది." అని చెప్పాడు సుజిత్.

"అవునా? అంత వాల్యుబుల్ ప్రాపర్టీ నాకు తెలియకుండా ఎక్కడ ఉంది." అని ఆలోచిస్తూ "సరే! రేపు వాళ్ళ ఫ్యామిలీ మొత్తం కలుస్తున్నారు ఎలాగైనా నేను ఆ విషయం గురించి తెలుసుకుంటాను.

ఆ ప్రాపర్టీ విషయంలో మన హస్తం కచ్చితంగా ఉండాలి, ఎట్టి పరిస్థితుల్లో వాళ్లకి వరదరాజుల్ని డైరెక్ట్ చేయకూడదు, ప్రతి దానికి మనం మధ్యలో ఉండాలి మనం చెప్పినా వ్యాల్యూ ఫైనల్ అవ్వాలి."అని చెప్పాడు ప్రతాప్ మిశ్ర.

"ఓకే డాడ్!" అని చెప్పి ఫోన్ పెట్టేసి బయటికి వెళ్ళడానికి రెడీ అవుతున్న రియా వైపు చూసి "ఎక్కడికి ప్రిపేర్ అవుతున్నావు ఈరోజు మనం పబ్ కి వెళ్ళాలి అనుకున్నాము కదా!" అని అడిగాడు సుజిత్.

"మన ప్రోగ్రాం రేపటికి పోస్ట్ పోన్ చేద్దాము ఈరోజు నా ఫ్రెండ్ దుబాయ్ నుంచి వస్తుంది చాలా సంవత్సరాల తర్వాత తనని కలుస్తున్నను." అని చెప్పింది రియా.

"అవునా? మరి నీ ఫ్రెండ్ నాకు పరిచయం చేయవా?" అని అడిగాడు సుజిత్.

ఆ మాటకి వెనక్కి తిరిగి "తప్పకుండా పరిచయం చేస్తాను తనకి మీ హెల్ప్ చాలా అవసరం అవుతుంది." అని చెప్పి అక్కడ నుంచి బయలుదేరింది రియా.

*************

చంద్రశేఖర్ తో కలిసి తన ఇంటికి వచ్చి "అంకుల్! మీరు ఇన్ని సంవత్సరాలుగా ఈ విషయం గురించి నాకు ఎందుకు చెప్పలేదు?" అని అడిగింది మిత్ర.

"జరిగిన విషయం తెలిస్తే నువ్వు ఇంత ప్రశాంతంగా నవ్వుతూ ఉండే దానివి కాదు, నీ జీవితంలోకి ఆ పాత రోజులు మళ్లీ రాకూడదు అనుకున్నాను.

కానీ నీకు జీవితాన్ని ప్రసాదించిన అభీర్ కి సహాయంగా ఉండాలి అని ఆ దేవుడు తలచినట్లు ఉన్నాడు, అందుకే నిన్ను శత్రువుల ద్వారానే తన దగ్గరికి పంపించాడు." అని చెప్పాడు చంద్రశేఖర్.

"నా తండ్రి తప్పు చేశాడు అతని చావుకి నేను బాధపడను కానీ నా తల్లి తప్పు చేయకుండానే చనిపోయింది." అని బాధగా చెప్పింది మిత్ర.

"అక్క! వాళ్ళని నవ్వుతూనే దెబ్బ కొట్టాలి ఆవేశం పనికిరాదు వాళ్లకి మన స్టైల్ ఏ కరెక్ట్!" అని చెప్పాడు చాక్లెట్.

"అవునురా చాక్లెట్! నువ్వు చెప్పిందే కరెక్ట్! ఆ జాకీ గాడు ఎక్కడ ఉన్నాడో తెలుసుకుని వాడికి చావు రుచి చూపించాలి." అని ఫోన్ రింగ్ అవ్వడం చూసి

"ముకుల్ మనవరాలు అర్ణ కాల్ చేస్తుంది." అని చెప్పి లిఫ్ట్ చేసి "గుడ్ ఈవెనింగ్ మేడం! అభీర్ గురించి ఫుల్ డీటెయిల్స్ తెలుసుకున్నాను." అని జారువ తెగ గురించి బైరి అడవి గురించి అన్ని వివరాలు చెప్పి

"అతను అసలు అక్కడి నుంచి ఇక్కడికి ఎందుకు వచ్చాడో కేస్ లో ఎలా ఇరుక్కున్నాడో మాత్రం తెలుసుకోలేకపోయాను." అని చెప్పింది మిత్ర.

ఫోన్లో మిత్ర చెప్పింది విని 'ఈ డిటెక్టివ్ స్పీడ్ గా తెలుసుకుంది.' అని మనసులో అనుకుని "ఆ విషయాలు ఏమి మనకి అవసరం లేదు, నాకు ఆ అభీర్ ఎక్కడ ఉన్నాడు, ఏం చేస్తున్నాడు, ఎవరెవరిని కలుస్తున్నాడో అన్ని విషయాలు తెలియాలి నువ్వు ఇచ్చే ఇన్ఫర్మేషన్ బట్టి నీకు వచ్చే అమౌంట్ పెరుగుతూ ఉంటుంది." అని చెప్పింది అర్ణ.

"థాంక్యూ మేడం ఇకనుంచి నా వర్క్ అభీర్ ని ఫాలో అవడమే! అతని ప్రతి అడుగు మీకు తెలుస్తుంది." అని చెప్పింది మిత్ర.

"ఓకే బాయ్!" అని చెప్పి ఫోన్ పెట్టేసింది అర్ణ.

***************

అభీర్ ఉన్న ఇంటి దగ్గరికి రాజన్ వాళ్ళతో సహా జారువా తెగకు చెందిన వాళ్ళందరూ రావడంతో

అందరి వైపు చూస్తూ "ఇన్ని సంవత్సరాలు శత్రువు కంటి ముందు కనపడుతున్న పంటి బిగువున కోపాన్ని దాచుకుని కలిసి ఉన్నాము, ఇప్పుడు తిరిగి దెబ్బ కొట్టే సమయం వచ్చింది.

మన 12 ఏళ్ల పగ తీరబోతుంది మనవాళ్ళ ఆత్మకు శాంతి చేకూరుతుంది. ఈరోజు నుంచి మన నాయకుడు అభీర్ మాట మనకి సిరోధార్యం జై భవాని!" అని చెప్పాడు బైరి.

"జై భవాని జై భవాని!" అని అరుస్తూ ఉన్నారు అక్కడ ఉన్న అభీర్ సేన.

"మనలో ఉన్న ప్రతి ఒక్కరు ఎక్కడెక్కడ ఉంటున్నారు  ఇప్పటివరకు మన శత్రువుల జాడ గురించి ఏమేమి తెలుసుకున్నారు ప్రతి విషయం మన నాయకుడికి సమాచారం ఇవ్వండి. ఎవరు ఏ టైమ్ కి ఏం చేయాలో నాయకుడు చెప్పిన మాట మీకు చేరుతుంది." అని చెప్పాడు రాజన్.

అక్కడ ఉన్న తన వాళ్ళ వైపు చూసి కన్నీళ్లు తుడుచుకుంటూ "ఇన్ని సంవత్సరాలుగా మీకు ఇష్టం లేని పని చేసి ఉంటారు, ఇక నుంచి ఆ పని మీకు ఇష్టంగా మారుతుంది ఇన్నాళ్లు ఎదురు చూసిన మన పగ తీరబోతుంది.

ఈ ధర్మ యుద్ధంలో మనలో ఒక్క ప్రాణం కూడా పోవడానికి వీల్లేదు, మన మొదటి దాడి నంద గ్రూప్ చేతికి వెళ్లబోయే వెయ్యి కోట్లు!" అని చెప్పాడు అభీర్.
[+] 12 users Like SivaSai's post
Like Reply


Messages In This Thread
RE: వేదం - by Manmadhsbanam143 - 22-12-2025, 04:13 PM
RE: ఖైదీ నెంబర్ 402 - నా మాటే శాసనం - by SivaSai - 03-02-2026, 07:29 AM



Users browsing this thread: 1 Guest(s)