03-02-2026, 07:23 AM
ఎపిసోడ్ 57
ముకూల్ చెప్పిన గతం విని పంచరత్నాలు ఎలా స్వాధీనం చేసుకోవాలో అభీర్ ని ఎలా తప్పించాలో నాకు బాగా తెలుసు అని చెప్పింది అర్ణ.
అభీర్ చెప్పినా గతం విని వాళ్లని అప్పుడే శిక్షించుకుండా 12 సంవత్సరాలు ఎందుకు ఆగావు నువ్వు శిక్ష ఎందుకు అనుభవించవు అని అడిగారు నీలమ్ వాళ్ళు.
**************
ఆ మాటకి "శత్రువు బలవంతుడైనప్పుడు తన సైన్యాన్ని కాపాడుకోవాలి సమయం చూసి దెబ్బ కొట్టాలి అది నాయకుడి లక్షణం.
అప్పుడు మాలో మిగిలిన వారిలో ఎక్కువ మంది 15 సంవత్సరాలు వాళ్లే, కానీ అటువైపు అధికార బలం ఆర్థిక బలం ఉన్న శత్రువులు ఉన్నారు ఆ సమయంలో నేను ఆవేశ పడితే నా వాళ్ళు ప్రాణాలు పోగొట్టుకునేవారు." అని చెప్పాడు అభీర్.
ఆ మాట విని "అవును! అదే నాయకుడి లక్షణం! శివాజీ మహారాజ్ కూడా యుద్ధంలో శత్రువు బలంగా ఉన్నాడు అంటే తన సైన్యాన్ని తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయేవారు.
మళ్లీ సమయం చూసి తెలివిగా శత్రువు మీద దాడి చేసి విజయం సాధించేవారు, నాయకుడు అన్న వాడు విజయం సాధించడం మీద మాత్రమే దృష్టి కాదు, తన వాళ్ళని రక్షించుకోవడం మీద కూడా దృష్టి పెట్టాలి అప్పుడే రాజ్యాధికారం చేజిక్కుతుంది." అని చెప్పింది బామ్మా.
"మీరు చెప్పింది కరెక్టే బామ్మా గారు! కానీ ఇప్పుడు శత్రువుల బలం పెరిగిపోయింది. వాళ్లు మనకి అందనంత ఎత్తులో ఉన్నారు." అని చెప్పాడు శ్రీకర్.
"మనిషి ఎంత బలవంతుడైన తను చేసిన కర్మ అనుభవించక తప్పదు, ఇన్ని సంవత్సరాలుగా ముకుల్ తన వాళ్ళకోసం ప్రతిక్షణం చస్తూ బతికాడు. డబ్బు అధికారం ఉంటేనే ఆనందం కాదు మనశ్శాంతి కూడా ఉండాలి అప్పుడే మనిషి సుఖంగా జీవించగలడు." అని చెప్పాడు అభీర్.
"మరి ఇప్పుడు ముకుల్ ఫ్యామిలీ మెంబర్స్ ఇండియా రాకపోతే అమ్మవారు నీ ద్వారా తనకి ఇచ్చిన శాపం తప్పు అవుతుంది కదా!" అని అడిగింది సుమతి.
"మనిషి అహంకారం, అపేక్ష, అసూయా వదలనంతవరకూ తను తీసుకున్న నిర్ణయం తప్పు అయ్యినా కరెక్ట్ అనిపిస్తుంది. మూర్ఖంగా అడుగు ముందుకు వేస్తాడు చేస్తుంది తప్పు అని తెలుసుకోలేడు.
అదేవిధంగా తన కుటుంబ సభ్యులు కూడా అలాగే ఆలోచిస్తారు తప్పకుండా నా ముందుకి వస్తారు." అని చెప్పాడు అభీర్.
"మరి అప్పుడు నిన్ను కలిసి వెళ్ళిన మీ వాళ్ళు ఐదుగురు ఏమైపోయారు? సింబా పిలుపు విని మళ్ళీ నీ దగ్గరకు వస్తారా? నీతో కలిసి ఉంటారా?" అని అనుమానంగా అడిగింది నీలమ్
"మేడం! నమ్మకద్రోహం చేయడం మా రక్తంలో లేదు, మేము మా పూర్వీకుల నుంచి గూడచారులము, అభీర్ సేన మొత్తం నంద ఫ్యామిలీని, అభిజిత్ ఫ్యామిలీని చుట్టుముట్టి వాళ్ల ప్రతి కదలిక గమనిస్తూ వాళ్లతో కలిసిపోయి ఉన్నారు. సేనలో ప్రతిఒక్కరు అభీర్ మాట కోసం ఎదురుచూస్తున్నారు." అని చెప్పాడు శంకర్.
"అభీర్! మీ వాళ్ళు గోకుల్ దగ్గర్నుంచి తీసుకుని నీకు ఇచ్చిన పంచరత్నాలు ఏమయ్యాయి? ఎక్కడ ఉన్నాయి? వాటిని మరి అమ్మవారి పాదాల దగ్గర ఎప్పుడు ప్రతిష్టిస్తావు?" అని అడిగాడు సందీప్.
"ఆ పంచరత్నాలు నా దగ్గర భద్రంగా ఉన్నాయి." అని రోషిని బొమ్మల్లో ఉన్న 5 ఉంగరాలు చూపించి "వీటిని అమ్మవారి పాదాల దగ్గర ప్రతిష్టించాలి అంటే, ముందు దుష్ట శిక్షణ జరగాలి అప్పుడే అమ్మ శాంతిస్తుంది." అని చెప్పాడు అభీర్.
"ఆరోజు కొండల దగ్గరికి వెళ్లిన అభిజిత్ వాళ్ళకి వినిపించిన అరుపులు ఎక్కడి నుంచి వచ్చేయ్? అక్కడ ఇంకా మీ తెగ వాళ్లు ఉన్నారా?" అని అడిగింది వసుంధర.
"ఆ కొండల దగ్గర సింబా సైన్యం తప్పితే ఎవ్వరూ లేరు, ఆరోజు వాళ్ళకి వినిపించినావి అరుపులు కాదు పంచభూతాల హెచ్చరికలు!" అని చెప్పాడు అభీర్.
"అభీర్ అన్న! చనిపోయిన మీ తల్లిదండ్రులు, మీ వాళ్లు, జంతువులు అక్కడ ప్రకృతిని, ధర్మాన్ని కాపాడడానికి రక్షణగా ఉన్నారు.
మరి వాళ్ళని అమ్మవారు ఎందుకు కాపాడలేదు? అక్కడికి అంత అన్యాయం చేయడానికి వచ్చిన ముకుల్ వాళ్ళని పంచభూతాలు ఎందుకు శిక్షించలేదు." అని అడిగింది సుమతి.
"రావణాసురుడు సీతమ్మవారిని అపహరించకుండా దైవశక్తి అడ్డుకుంటే రాక్షస వినాశనం జరిగేది కాదు, నిండు సభలో ద్రౌపతి మాతని అవమానించినప్పుడే కౌరవులని దైవం శిక్షించి ఉంటే, యుగ పరివర్తన కోసం కురుక్షేత్రం జరిగేది కాదు. ప్రతి సంఘటనకు కచ్చితంగా ఏదో ఒక కారణం ఉంటుంది.
గోకుల్ వాళ్లు మా ప్రదేశానికి వచ్చి ఆ విధంగా చేయకుండా ఉంటే వాళ్ళ కోరికలు, ఆశలు తీర్చుకోవడం కోసం ఇంకా ఎన్ని శక్తివంతమైన దేవాలయాలు నాశనం చేసేవారో ఎంతటీ ప్రకృతి సంపదను దోచుకునేవారో దానివల్ల ఎంత మంది ప్రాణాలు కోల్పోయేవారో!" అని చెప్పాడు అభీర్.
"అవును! నువ్వు చెప్పింది అక్షరాల నిజం! వాళ్ళు అక్కడితోనే ఆగిపోయారు, లేకపోతే వాళ్ళ ఆకృత్యాలకు అడ్డు ఉండేది కాదు." అని చెప్పింది బామ్మ.
"మరి శివమణి కూతురుని నువ్వు అనాధాశ్రమంలో జాయిన్ చేశావు కదా తను ఇప్పుడు ఎలా ఉంది? అసలు చంద్రశేఖర్ ఎవరు నీకు తెలుసా?" అని అడిగింది గీత.
"నేను ఇక్కడే ఉన్నావు." అని అభీర్ వైపు చూసి తన పక్కన ఉన్న మిత్ర ని చూపించి "నువ్వు చేరాతీసిన శివమణి కూతురు, నా శక్తి మేరకు పెంచి పెద్ద చేశాను." అని తనకి ఇచ్చిన రాయిని అభిర్ చేతిలో పెట్టి
"ఈ అనర్ధాలు జరగడానికి నేను కూడా బాధ్యుడనే, శివాజీ మహారాజ్ గారి చంద్ర హౌస్ గురించి రీసెర్చ్ చేస్తూ మీ తెగ గురించి తెలుసుకుని బైరా అడవిలో మీ తండ్రి గారిని కలిశాను.
ఆయన చెప్పిన విషయాలు అక్కడ ఉన్న అమ్మవారిని దర్శనం చేసుకుని ఇంకా రీసెర్చ్ చేయకూడదు అనుకోని వచ్చి జరిగిన విషయం శివమణికి చెప్పాను, కానీ అతను నేను చెప్పింది విని మనసు మలినం చేసుకుని ఆశ పెంచుకున్నాడు దానికి శిక్ష అనుభవించాడు." అని చెప్పాడు చంద్రశేఖర్.
చంద్రశేఖర్ తో పాటు అక్కడికి వస్తూ "అవును నా తండ్రి లాంటి వాళ్లకి ఇలా ఇది ఒక గుణపాఠం! వాళ్ల తెలివితేటలు మంచికి ఉపయోగించాలి ఇటువంటి చెడు మార్గాల వైపు వెళ్ళకూడదు అని తెలుసుకుంటారు." అని చెప్పింది మిత్ర.
చంద్రశేఖర్ దగ్గరికి వెళ్లి "మీ బాధ్యత మీరు సక్రమంగా నిర్వహించారు మీరు చేసిన దాంట్లో ఎటువంటి తప్పులేదు." అని చెప్పాడు అభీర్.
"నాయకుడా! ఈ రోజు నుంచి నేను కూడా అభీర్ సేనాలో ఒక సైనికురాలని నా తండ్రి చావుకి కారణం అయిన వాళ్ళ చావు కేకలు నేను వినాలి." అని ఆవేశంగా చెప్పింది మిత్ర.
ఆ మాటవిని "ఆవేశంలో నిర్ణయం తీసుకోకూడదు అది మనలో ఉన్న జ్ఞానాన్ని చంపేస్తుంది." అని చెప్పాడు అభీర్.
"నేను ఈ నిర్ణయం ఆవేశంలో తీసుకుంది కాదు బాగా ఆలోచించి తీసుకున్నను." అని చెప్పింది మిత్ర.
"నేను ఒక అధికారిగా మీరు చేసే పని సమర్ధించలేను, కానీ నా అధికారంతో వాళ్ళని నేను ఏమీ చేయలేను. అందుకే ఒక మనిషిగా మీకు సహాయం చేస్తాను." అని చెప్పాడు శ్రీకర్.
"అభీర్! ఇకనుంచి చేసే ప్రతి పని లీగల్ గా చేయండి. మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా నేను చూసుకుంటాను." అని చెప్పింది వస్తుంది వసుంధర.
"మీకు తోడుగా నేను, సుమతి కూడా ఉంటాము మీడియానే ఆయుధంగా చేసుకుని వాళ్లతో యుద్ధం చేస్తాము." అని చెప్పింది నీలమ్.
"నాయకుడా! నందా గ్రూప్ లో ఒక ప్రాపర్టీ సెల్ కి పెట్టారు దానిని సెంట్రల్ మినిస్టర్ వరదరాజులు కొంటున్నాడు రెండు రోజుల్లో పెద్ద మొత్తం చేతులు మారబోతుంది. ఆ అగ్రిమెంట్ నిమిత్తం కచ్చితంగా వాళ్లలో ఎవరో ఒకరు ఇక్కడికి వస్తారు." అని చెప్పాడు శంకర్.
ఆ మాట విని "బైరిని ఇక్కడకు రమ్మని కబురు పంపించు." అని చెప్పాడు అభీర్.
"సరే నాయకుడా!" అని చెప్పాడు శంకర్.
వసుంధర వైపు చూసి "మీరు చేసిన సహాయం నేను మర్చిపోలేను ఈరోజు నుంచి నేను ఇక్కడ ఉండను నా వల్ల మీరు ఇబ్బంది పడకూడదు." అని చెప్పాడు అభీర్.
"నువ్వు ఇక్కడే ఉండు మాకు ఎటువంటి ప్రాబ్లం లేదు, మేమందరం కూడా నీకు హెల్ప్ గా ఉంటాము." అని చెప్పింది వసుంధర.
"నేను మీ అందరి సహాయం తప్పకుండా తీసుకుంటాను కానీ నావల్ల ఎవరు ఇబ్బంది పడకూడదు, బైరి వచ్చిన తర్వాత నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను నా మాట కాదనకండి." అని చెప్పాడు అభీర్.
"నీ మాట మేము కాదనలేము, కానీ నువ్వు నా కూతురికి ప్రాణం పోసిన దేవుడివి, నీ ప్రతి అడుగులో మా అడుగు కూడా ఉంటుంది." అని చెప్పాడు సందీప్.
"నాయకుడా! కాసేపట్లో బైరి ఇక్కడ ఉంటాడు మనం ప్రయాణానికి సిద్ధం అవ్వాలి." అని చెప్పాడు శంకర్.
"సరే!" అని చెప్పి గీత వైపు చూసి "మీ ఇంటికి వెళ్లి ధైర్యంగా ఉండండి ఇంక మీ జోలికి ఎవరు రారు ప్రశాంతంగా జీవించండి." అని చెప్పాడు అభీర్.
"అసలు మా ఇల్లు ఉందో కూలిపోయిందో కూడా తెలియదు." అని చెప్పింది గీత.
"మీ ఇల్లు మా సహదేవుడు చనిపోయిన ప్రదేశం, ఆ రోజు నుంచి మా వాళ్ళు దానిని జాగ్రత్తగా కాపాడారు మీరు సంతోషంగా వెళ్లండి." అని చెప్పేడు శంకర్.
కాసేపటికి అక్కడికి కార్ లో తన మనుషులతో కలిసి వచ్చి అభీర్ ని చూసి సంతోషంగా దగ్గరికి వెళ్లి గట్టిగా పట్టుకుని "నాయకుడా! నువ్వు చెప్పిన మాటతో అక్కడి నుంచి వెళ్లిన తర్వాత కసితో ఎదిగాను మన సైన్యాన్ని బలంగా తయారు చేశాను నీ కనుసైగా చాలు యుద్ధం మొదలుపెడతారు." అని చెప్పాడు బైరి.
"అభీర్! మీ ప్రతి అడుగు చాలా జాగ్రత్తగా ఉండాలి ఏమాత్రం ఏమరపాటుగా ఉన్నా మళ్లీ మీరు నష్టపోవాల్సి ఉంటుంది." అని చెప్పింది వసుంధర.
"మేడం! ఇప్పుడు నేను చేయబోయే యుద్ధం ఎవరికి తెలియని ఎవరు చదవనటువంటి ఐదవ వేదం! దీంట్లో శత్రువు మీద దాడి ఎవరు ఊహించని విధంగా ఉంటుంది." అని చెప్పాడు అభీర్.

![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)