Thread Rating:
  • 5 Vote(s) - 3.6 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
ఖైదీ నెంబర్ 402 - నా మాటే శాసనం
ఎపిసోడ్ 56


జైల్లో తనని కలవడానికి వచ్చిన రాజన్ వాళ్లతో నేను మళ్ళీ 12 సంవత్సరాల తర్వాత బయటికి వస్తాను అని చెప్పి పంపించాడు అభీర్.

అభిజిత్ కొడుకు మిథున్ ని జాగ్రత్తగా చూసుకోమని అభిజిత్ కోమాలో నుంచి బయటికి వస్తే తనకి కాల్ చేయమని లండన్ వెళ్లిపోయాడు ముకుల్.

**************

ఉదయం స్టేషన్ దగ్గర సెల్ లో ఉన్న అభీర్ దగ్గరికి వచ్చి "బాబు! నాకు ట్రాన్స్ఫర్ అయింది ఈ రోజే వెళ్లి జాయిన్ అవ్వాలి, నువ్వు ఈ కేసులో నుంచి బయట పడాలని దేవుడిని ప్రార్థించడం మినహా నేను కూడా ఏమి చేయలేని పరిస్థితి." అని చెప్పాడు పాఠక్.

"నా గురించి బాధపడకండి క్షేమంగా వెళ్లి రండి తప్పకుండా మళ్లీ కలుసుకుందాము." అని చెప్పాడు అభీర్.

"సరే!" అని ఎస్ఐ నిరంజన్ తో పాటు స్టేషన్ లోకి వస్తున్న లాయర్ హిరణ్యని చూస్తూ 'ఈ పాపం మిమ్మల్ని ఊరికే వదలదు.' అని మనసులో అనుకుంటు అక్కడ నుంచి వెళ్ళిపోయాడు పాఠక్.

స్టేషన్లోకి వెళ్లి సెల్లో ఉన్న అభీర్ వైపు చూసి నిరంజన్ దగ్గరకు వెళ్లి "ఏమయ్యా! ఆ అబ్బాయి దిట్టంగానే ఉన్నాడు కదా, 18 సంవత్సరాలు దాటాయి అంటే జడ్జి గారికి ఎటువంటి అనుమానం రాదు.

అయ్యినా డాక్టర్ సర్టిఫికెట్ కూడా తెప్పించాను నీకు ఎటువంటి ప్రాబ్లెమ్ ఉండదు నేను ఉన్నా కదా, ఎఫ్ఐఆర్ రాసి కోర్టుకి సబ్మిట్ చెయ్, అలాగే ఛార్జ్ షీట్ లో అతని ఊరు పేరు మెన్షన్ చేయకు.

అతను ఎవరో కూడా తెలియదు అసలు ఈ దేశానికి చెందిన వాడు కాదు, ఎంక్వైరీ లో కూడా ఎటువంటి స్టేట్మెంట్ ఇవ్వలేదు అని మెన్షన్ చెయ్!"  అని చెప్పాడు హిరణ్య.

"సార్! మీరు చెప్పింది చెప్పినట్లురాస్తే నా ఉద్యోగం  ఎగిరిపోతుంది. అయ్యినా ఈ కేసులో ఆ పిల్లాడిని ఎందుకు ఇరికించాలని చూస్తున్నారు?" అని అడిగాడు నిరంజన్.

"నీకు డబ్బు కావాలా నిజం కావాలా?" అని సీరియస్ గా అడిగాడు హిరణ్య.

ఆ మాట విని ఏమి మాట్లాడకుండా సైలెంట్ గా ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి కానిస్టేబుల్ ని పిలిచి "సెల్ లో ఉన్న కుర్రాడిని సాయంత్రం కోర్టుకి హాజరు పరచాలి." అని చెప్పాడు నిరంజన్.

"ఓకే సార్!" అని చెప్పాడు కానిస్టేబుల్.

స్టేషన్ లోపలికి వస్తున్న అమ్మాయిని చూపించి "ఆవిడా మురళి జోషి భార్య గీత స్టేట్మెంట్ ఇస్తుంది రికార్డ్ చేసుకో!" అని చెప్పాడు హిరణ్య.

"సార్! ఆవిడ జోషి సార్ భార్య కాదు కదా!" అని డౌట్ గా అడిగాడు నిరంజన్.

"ఆ విషయం నీకు నాకు తెలుసు జడ్జి గారికి తెలియదు కదా! అయినా జోషి భార్య ఈవిడ కాదు అని కోర్ట్ లో ఎవరు చెబుతారు, నేను చెప్పింది చెయ్!" అని చెప్పాడు హిరణ్య.

"ఓకే సార్! ఇంక నేను చూసుకుంటాను చార్జెషీట్ రెండు రోజులలో కోర్టుకి సబ్మిట్ చేస్తాను." అని చెప్పాడు నిరంజన్.

*************

రెండు రోజుల తర్వాత కోర్టుకి ఛార్జ్ షీట్ సబ్మిట్ చేసి అభీర్ కి రిమాండ్ విందించి తీహార్ జైలుకి పంపించడంతో కోర్ట్ బయటికి వచ్చి మిచల్ కి కాల్ చేశాడు హిరణ్య.

ఫోన్ లిఫ్ట్ చేసి "లాయర్ గారు చెప్పండి?" అని అడిగాడు మిచల్.

"మళ్లీ నీతో పని పడింది ఒకసారి నా ఆఫీస్ కి రా..!" అని చెప్పాడు హిరణ్య.

"సరే సార్! అరగంటలో అక్కడే ఉంటాను." అని చెప్పి ఫోన్ పెట్టేసి కాసేపటికి హిరణ్య ఆఫీస్ దగ్గరికి వచ్చాడు మిచల్.

తన ఆఫీసులోకి వచ్చిన మిచల్ వైపు చూసి "ఈసారి నీకు చాలా పెద్ద పని పడింది. దానికి తగ్గట్టే అమౌంట్ కూడా ట్రాన్స్ఫర్ అవుతుంది.

ఈ పని చేసిన తర్వాత నువ్వు బీహార్ వెళ్ళిపో అక్కడే ఉండు మళ్ళీ ఢిల్లీ వైపు రాకు ఏదైనా పని పడితే నేను కాల్ చేస్తాను." అని చెప్పాడు హిరణ్య.

"సరే సార్! పని ఏమిటో చెప్పండి?" అని అడిగాడు మిచల్.

ఫోటోలు చూపిస్తూ "ఇతని పేరు నిరంజన్ ఎస్సై, ఇతని పేరు అబ్రహం గవర్నమెంట్ హాస్పిటల్ డాక్టర్, ఈయన సుబ్రహ్మణ్య రావు జడ్జిగారు, వీళ్ళు కాకుండా మురళి జోషి భార్యని నువ్వు చూసావు కదా ఆవిడ ఫోటో నా దగ్గర లేదు ఈ నలుగురు వారం రోజుల్లో చనిపోవాలి యాక్సిడెంట్ జరిగింది అనుకోవాలి ఎవరికి అనుమానం రాకూడదు." అని చెప్పాడు హిరణ్య.

"సరే సార్!" అని ఫోటోలు తీసుకుంటూ "మురళి జోషి భార్యని చూశాను కానీ సరిగ్గా గుర్తులేదు ఎక్కడ ఉందో నేను కనిపెడతాను మళ్లీ పని అయిన తర్వాత మీకు కాల్ చేస్తాను." అని వెళ్ళిపోయాడు మిచల్.

అక్కడి నుంచి మిచల్ వెళ్లడంతో ఫోన్ తీసి ముకుల్ కి కాల్ చేశాడు హిరణ్య.

లండన్ తన ఇంట్లో కొడుకు ఫోటో ముందు కూర్చుని బాధపడుతూ ఉండగా ఫోన్ రింగ్ అవ్వడం చూసి లిఫ్ట్ చేసి "లాయర్! మనం అనుకున్నది అనుకున్నట్లు జరిగిందా?" అని అడిగాడు ముకుల్.

"సార్! నేను మీకు చెప్పింది చెప్పినట్లు చేశాను, ఎన్ని సంవత్సరాలు ఉన్నా ఈ కేస్ బెంచ్ కి రాదు, ఆ అభీర్ బయటికి రాడు, ఒకవేళ ఎవరైనా ప్రయత్నించినా నేను చూసుకుంటాను." అని చెప్పాడు హిరణ్య.

"సరే! ఆ కుర్రాడు జైల్లో ఉన్నంతకాలం ప్రతి సంవత్సరం నీకు అమౌంట్ ట్రాన్స్ఫర్ అవుతూనే ఉంటుంది. ఒకవేళ ఈ కేస్ గురించి బయటికి వచ్చిన, నా పేరు కానీ అభిజిత్ పేరు కానీ బయటికి రాకూడదు." అని చెప్పి ఫోన్ పెట్టేసాడు ముకుల్.

***************

ప్రజెంట్ లండన్ లో తన ఇంటి దగ్గర ముకుల్ చెప్పినా గతం విని "తాతయ్య! మీరు నాన్నగారు చనిపోయిన టెన్షన్లో ఉండి 16 ఏళ్ల కుర్రాడు జైల్లో కూర్చుని ఆవేశంలో చెప్పిన మాటలు విని భయపడిపోయారా?" అని అడిగింది అర్ణ.

"బేబీ! అభీర్ కళ్ళలోకి చూస్తే ఆ భయం ఏమిటో తెలుస్తుంది. అంతేకాకుండా అతను చెప్పినట్లు ఆ కొండలు దగ్గరికి వెళ్లిన వాళ్ళ పరిస్థితి చూసి నాకు భయం వేసింది.

అంతేకాదు గోకుల్ ని చంపినా  ఐదుగురు ఎక్కడ ఉన్నారో కూడా తెలుసుకోలేకపోయాను, ఆ తెగ వాళ్ళ శక్తి గురించి నాకు బాగా తెలుసు!

నా వారసులని కాపాడుకోవడానికి ఆ రోజు నుంచి నేను ఇండియాకి వెళ్ళలేదు, మన వాళ్ళు ఎవరిని వెళ్ళనివ్వలేదు." అని చెప్పాడు ముకుల్.

"మరి అభిజిత్ అంకుల్ కోమాలో నుంచి బయటికి వచ్చారా?" అని అడిగింది అర్ణ.

"ఎస్! 8 సంవత్సరాల తర్వాత అభిజిత్ కోమాలో నుంచి బయటికి వచ్చాడు కానీ వీల్ చైర్ కె పరిమితం అయిపోయాడు.

అభీర్ జైల్లో ఉన్నాడని తెలిసి నలుగురు మనుషుల్ని చంపడానికి పంపించాడు కానీ వాళ్లు ప్రాణాలతో బయటకి రాలేదు." అని చెప్పాడు ముకుల్.

"మరి బైరి అడవిలో ఉన్న కొండల దగ్గరికి అంకుల్ మళ్లీ మనుషుల్ని  పంపించలేదా?" అని డౌట్ గా అడిగింది అర్ణ.

"ఆ కొండల జోలికి వెళ్ళకూడదు అని మేము నిర్ణయించుకున్నాము, అభీర్ చెప్పినట్టు కచ్చితంగా 12 సంవత్సరాల కి మళ్ళీ బయటికి వచ్చాడు అతను నోటి నుంచి వచ్చిన మాట ప్రతిదీ జరిగే తీరుతుంది." అని చెప్పాడు ముకుల్.

"మరి నాన్న ఆశపడ్డ పంచరత్నాలు ఇప్పుడు ఎక్కడ ఉన్నాయి?" అని అడిగింది అర్ణ.

"అభీర్ జైలు నుంచి బయటికి వచ్చాడు కాబట్టి అతని దగ్గరే ఉంటాయి." అని చెప్పాడు ముకుల్.

"తాతయ్య! అభీర్ నోటి నుంచి వచ్చిన మాటలు ఫలించడానికి అతను ఏమైనా దేవుడా? మనలాగా మామూలు మనిషి!

అతనికి అంత శక్తి ఉంటే చనిపోయిన సహదేవుడిని ఎందుకు బ్రతికించుకోలేకపోయాడు 12 ఏళ్లు జైల్లో ఎందుకు ఉంటాడు,

ఆది కాకుండా అతని మనుషులు ఇంకా అతని మాట వింటారు అనుకుంటున్నావా? ఈ రోజుల్లో డబ్బుకి ఉన్న విలువ మనిషి మాటకి లేదు, వాళ్లు 12 సంవత్సరాలుగా ఈ సమాజంలో బతుకుతున్నారు నాకు తెలిసి పూర్తిగా మారిపోయి ఉంటారు.

నాన్న కలను నేను నెరవేరుస్తాను, పంచరత్నాలు నా చేతికి ఎలా తెచ్చుకోవాలో ఆ కొండలతో ఎలా బిజినెస్ చేయాలో  అడ్డువచ్చిన అభీర్ ని ఎలా తొలగించాలో నాకు బాగా తెలుసు!" అని చెప్పింది అర్ణ.

"నీ మాటలు వింటుంటే నాకు కూడా ధైర్యం వస్తుంది. కానీ అభీర్ ని తక్కువ అంచనా వేయకూడదు ప్రతి అడుగు చాలా జాగ్రత్తగా ఉండాలి మన వైపు ఒక్క ప్రాణం కూడా పోకూడదు." అని చెప్పాడు ముకుల్.

"ఆ విషయాలన్నీ నేను చూసుకుంటాను మీరు ప్రశాంతంగా ఉండండి ఇండియా ఎప్పుడు వెళ్లాలో నేను చెబుతాను." అని అక్కడి నుంచి బయటికి వచ్చింది అర్ణ.

****************

వసుంధర ఇంటి దగ్గర అభీర్ చెప్పింది విని "ఇంత దారుణంగా ప్రవర్తిస్తారా? అసలు వాళ్ళు మనుషులు కాదు కచ్చితంగా వాళ్ళకి శిక్ష పడాల్సిందే!" అని ఆవేశంగా చెప్పింది నీలమ్.

అభీర్ దగ్గరికి వచ్చి "అన్న! నా ప్రాణాలు కాపాడిన నువ్వు సహదేవుడిని ఎందుకు కాపాడలేదు?" అని ఏడుస్తూ అడిగింది సుమతి.

"నాకు ప్రాణదానం చేసే శక్తి ఆ దేవుడు ఇచ్చాడు కానీ ఎదుటి మనిషి కొనా ఊపిరితో ఉండనప్పుడే నేను ప్రాణదానం చేయగలను, ఆరోజు నేను అక్కడికి వచ్చేసరికి సహదేవుడు చనిపోయాడు." అని బాధగా చెప్పాడు అభీర్.

"మరి తప్పు చేసిన వాళ్ళని 12 సంవత్సరాలు ఎందుకు క్షమించవు? నువ్వు తలుచుకుంటే జైలు నుంచి బయటికి కూడా రాగలవు కదా, ఎందుకని రాలేదు?" అని అడిగాడు సందీప్ రావు.

"అవును అభీర్! నువ్వు అప్పుడే వాళ్ళని చంపేసి ఉండాల్సింది. ఇప్పుడు వాళ్లు నీకు అందనంత ఎత్తులో ఉన్నారు, నాకు తెలిసి వాళ్ళు మళ్ళీ ఇండియాకి కూడా రాకపోవచ్చు, అసలు 12 సంవత్సరాలు వెయిట్ చేసావు? చేయని తప్పుకు ఎందుకు శిక్ష అనుభవించావు?" అని అడిగాడు శ్రీకర్.

ఆ మాటకి అక్కడ ఉన్న వారి వైపు చూస్తూ సమాధానం చెప్పడం మొదలుపెట్టాడు అభీర్.
[+] 12 users Like SivaSai's post
Like Reply


Messages In This Thread
RE: వేదం - by Manmadhsbanam143 - 22-12-2025, 04:13 PM
RE: ఖైదీ నెంబర్ 402 - నా మాటే శాసనం - by SivaSai - 02-02-2026, 07:10 AM



Users browsing this thread: 1 Guest(s)