Thread Rating:
  • 5 Vote(s) - 3.6 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
ఖైదీ నెంబర్ 402 - నా మాటే శాసనం
 ఎపిసోడ్ 55


జైల్లో ఉన్న అభీర్ మాటలు విని తన కళ్ళలోకి చూసి భయంతో వణుకుతూ కారులోకి వెళ్లి కూర్చున్నాడు ముకుల్.

***************

ముకూల్ స్టేషన్లో నుంచి బయటికి వెళ్లడం చూసి కంగారుగా కారు దగ్గరికి వచ్చి "సార్ ఏమైంది?" అని అనుమానంగా అడిగాడు జనార్దన్.

ఆ మాట విని తల పైకెత్తి చూసి చెమటలు తుడుచుకుని "మన వాళ్ళందరినీ ఇక్కడి నుంచి వెంటనే వెళ్లిపొమ్మను, హిర్వానికి ఫోన్ చేసి అర్జెంట్గా గెస్ట్ హౌస్ కి రమ్మను." అని టెన్షన్ గా చూస్తూ చెప్పాడు ముకుల్.

"ఓకే సర్!" అని దూరంగా ఉన్న మిచల్ వాళ్ళ వైపు చూసి "అందరూ ఇక్కడి నుంచి వెళ్ళిపోండి." అని చెప్పి కార్ లో అక్కడి నుంచి వెళుతూ "ఏమైంది సార్! మీరు ఎందుకు ఆదోలాగా ఉన్నారు." అని డౌట్ గా అడిగాడు జనార్ధన్.

"నాకు అభీర్ కళ్ళలో అమ్మవారి రూపం కనిపించింది. అతని నోటి నుంచి వచ్చిన ప్రతి మాట తప్పకుండా జరిగి తీరుతుంది. అభిజిత్ కి ఫోన్ చెయ్ వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో ఆ కొండల దగ్గరికి వెళ్ళకూడదు." అని చెప్పాడు ముకుల్.

"సరే సార్!" అని అభిజిత్ ఫోన్ కలవకపోవడంతో  జాకి కి కాల్ చేశాడు జనార్దన్.

హాస్పటల్లో అభిజిత్ కి ట్రీట్మెంట్ జరుగుతూ ఉండగా ఫోన్ రింగ్ అవ్వడం చూసి లిఫ్ట్ చేసి "జనార్దన్!  అభిజిత్ అన్న పరిస్థితి ఏమి బాలేదు నేను అర్జెంటుగా ముకుల్ సార్ తో మాట్లాడాలి." అని ఏడుస్తూ చెప్పాడు జాకి.

ఆ మాట విని "అభిజిత్ సార్ కి ఏమైంది?" అని కంగారుగా అడిగి "ముకుల్ సార్ కూడా ఇక్కడే ఉన్నారు." అని చెప్పాడు జనార్ధన్.

బ్యాక్ సీట్ లో కూర్చుని జనార్ధన్ మాట విని "ఏమైంది? నా చేతులు వణుకుతున్నాయి ఫోన్ పట్టుకోలేను స్పీకర్ ఆన్ చెయ్!" అని చెప్పాడు ముకుల్.

"సరే సార్!" అని స్పీకర్ ఆన్ చేసి "ముకుల్ సార్  మాట్లాడుతున్నారు." అని చెప్పాడు జనర్దన్.

"సార్! మనం ఆ కొండల జోలికి వెళ్లి చాలా తప్పు చేశాము శాంపిల్ తీసుకురావడానికి వెళ్లిన సర్పరాజ్ అక్కడే మాడి మసైపోయాడు.

భయపడి మేము వెనక్కి వస్తూ ఉండగా ఎలా జరిగిందో తెలియదు కారు యాక్సిడెంట్ అయ్యి  జావిద్ గారు చనిపోయారు, అభిజిత్ అన్న చావు బతుకుల్లో ఉన్నాడు." అని చెప్పాడు జాకి.

ఆ మాట విని టెన్షన్ గా చూస్తూ "అక్కడ ఎవరైనా అభీర్ మనుషులు ఉన్నారా?"  అని అడిగాడు ముకుల్.

"అడవిలో ఒక అక్కడ మనిషి కాదు కదా జంతువు కూడా లేదు, కానీ ఆ కొండల లోపల నుంచి భయంకరమైన అరుపులు వినిపిస్తున్నాయి, అవి మన చావు కేకలు లాగా ఉన్నాయి." అని భయం చెప్పాడు జాకి.

"సరే! నువ్వు అభిజిత్ ని తీసుకుని ఢిల్లీ వచ్చేయ్!" అని చెప్పి ఫోన్ పెట్టేసి "నేను పాపం చేశాను.' అని మనసులో అనుకున్నాడు ముకుల్.

కాసేపటికి గెస్ట్ హౌస్ దగ్గరికి వచ్చిన ముకుల్ వాళ్ళని చూసి "సార్! గోకుల్ గారి బాడీ మార్చురీలో ఉంది. మీరు వస్తే దహన సంస్కరాలు పూర్తి చేద్దాము." అని చెప్పాడు హిరణ్య.

"ఆ సంగతి నేను చూసుకుంటాను నువ్వు స్టేషన్ దగ్గరికి వెళ్లి అభీర్ మీద ఏ కేసులు ఫైల్ చేపిస్తావో నాకు తెలీదు వాడు మాత్రం జీవితాంతం లోపలే ఉండాలి, అసలు వాడు ఎవరూ అని కూడా బయట ప్రపంచానికి తెలియకూడదు.

నేను రేపు ఉదయం లండన్ వెళ్ళిపోతున్నాను మళ్లీ నీకు కనిపించకపోవచ్చు ఏ విషయమైనా ఫోన్లోనే మాట్లాడుకుందాము నేను ఈ కేసులో నేను ఇన్వాల్వ్ అయినట్లు ఎట్టి పరిస్థితుల్లో బయటికి రాకూడదు." అని చెప్పాడు ముకుల్.

"సరే సార్! ఆ విషయాలన్నీ నేను చూసుకుంటాను, కానీ  అభీర్ ని కోర్టు హ్యాండ్ ఓవర్ చేసిన తర్వాత కచ్చితంగా ఈ కేసు గురించి, ఆ అబ్భాయ్ గురించి బయటికి వస్తుంది." అని చెప్పాడు హిరణ్య.

"జైలుకు పంపించిన తరువాత వాడు ఎక్కడ ఉన్నాడో మూడో కంటి వాడికి తెలియకూడదు ఈ కేసులో ఇన్వాల్వ్ అయిన వాళ్లందరు చనిపోవాలి నీకు మిచల్ తోడుగా ఉంటాడు." అని చెప్పాడు ముకుల్.

"సార్! ఈ కేసులో ఉన్న వాళ్ళందరినీ క్లోజ్ చేయాలి అంటే చాలా ఖర్చవుతుంది." అని చెప్పాడు హిరణ్య.

"డబ్బు గురించి ఆలోచించకు ఎంత కావాలో మాత్రమే అడుగు!" అని జనార్దన్ ని తీసుకుని గోకుల్ బాడీని హ్యాండ్ ఓవర్ చేసుకోవడానికి వెళ్ళాడు ముకుల్.

****************

సెక్యూరిటీ అధికారి స్టేషన్ దగ్గర ఎస్సై నిరంజన్ దగ్గరికి వచ్చి "సార్! ఈ కుర్రాడు అమాయకుడు లాగా ఉన్నాడు కావాలని ఈ కేసులో ఇరికించారు, మనం పూర్తిగా ఎంక్వయిరీ చేసిన తర్వాత ఎఫ్ఐఆర్ రాద్దాము." అని చెప్పాడు పాఠక్.

ఆ మాట విని ఆలోచిస్తూ "సరే! రేపు ఉదయం దీని గురించి ఆలోచిద్దాము నేను ఇంటికి వెళుతున్నను జాగ్రత్తగా చూసుకో, ఆ అబ్బాయిని కలవడానికి ఎవరు వచ్చినా సరే నా పర్మిషన్ లేకుండా మాట్లాడించకు." అని చెప్పి అక్కడినుంచి వెళ్లాడు నిరంజన్.

"సరే సర్!" అని సెల్యూట్ చేసి ఎస్సై వెళ్లిన తర్వాత  సెల్ లో ఉన్న అభీర్ దగ్గరికి వెళ్లి "అందరూ కలిసి నిన్ను మోసం చేస్తున్నారు మీ వాళ్ళు ఎవరైనా ఉన్నారా?" అని అడిగాడు పాఠక్.

"నేను సాటి మనిషిని నమ్మడం మానేశాను మిమ్మల్ని నమ్మి నా వాళ్లని బలి చేయలేను, ఒకవేళ మీరు నా మంచి కోసమే చెప్పిన నేను అర్థం చేసుకునే పరిస్థితిలో లేను క్షమించండి." అని చెప్పాడు అభీర్.

"నీ పరిస్థితుల్లో ఉంటే ఎవరైనా అలాగే మాట్లాడతారు." అని భోజనం తీసుకువచ్చి ఇచ్చి తన టేబుల్ దగ్గర కూర్చున్నాడు పాఠక్.

అంతలో జైలు దగ్గరికి వచ్చి పాఠక్ దగ్గరికి వెళ్లి "సార్! మీరు స్మశానం దగ్గర అరెస్ట్ చేసిన వ్యక్తితో నేను ఒకసారి మాట్లాడాలి." అని అడిగాడు శంకర్.

"నువ్వు అతనికి ఏమవుతావ్?" అని డౌట్ గా అడిగాడు పాఠక్.

"అతని మంచి కోరేవాడిని!" అని చెప్పాడు శంకర్.

"ఆ సెల్ లో ఉన్నాడు మాట్లాడి త్వరగా వెళ్లిపోండి ఈ విషయం ఎస్ఐ గారికి తెలిస్తే మీరు కూడా ఇబ్బంది పడతారు." అని చెప్పాడు పాఠక్.

"సరే!' అని బయట ఉన్న రాజన్ వాళ్ళ వైపు చూసి లోపలికి రమ్మని సైగ చేశాడు శంకర్.

లోపలికి వచ్చి సెల్ లో ఉన్న అభీర్ ని చూసి ఏడుస్తు "నాయకుడా! నువ్వు ఈ పరిస్థితుల్లో ఉండడానికి వీల్లేదు ఇప్పుడే ఈ గోడలు బద్దలు కొట్టింది నిన్ను తీసుకు వెళ్ళిపోతాము." అని చెప్పాడు బైరి.

"అవును నాయకుడా! మనం ఈ జనాలతో ఉండలేము మన కొండల దగ్గరికి వెళ్లి పోదాము అక్కడే సుఖంగా బతుకుదాము." అని చెప్పింది రియా.

"మన తెగకు అమ్మవారి దయ ఉందని చెబుతూ ఉంటారు కానీ మనకే ఎందుకు ఇన్ని కష్టాలు!" అని బాధగా అడిగాడు అగస్త్య

తన వాళ్ళ మాటలు విని "మానవరూపంలో భూమి మీదకు వచ్చిన దేవుడికే కష్టాలు తప్పలేదు మనమెంతా! కృష్ణ పరమాత్ముడు అండగా ఉన్న పాండవులు  కూడా 14 సంవత్సరాలు వనవాసం చేశారు, కర్మ ఫలితం ఎవరైనా అనుభవించాల్సిందే కానీ చివరికి ధర్మమే గెలుస్తుంది.

మన పూర్వీకులు ఇచ్చిన ఫలాలను మనం అనుభవించినప్పుడు వారు చేసినా తప్పిదలకు శిక్ష కూడా మనం అనుభవించాలి ఇప్పుడు జరిగేది కూడా ఆదే,

మీరందరూ మీ స్థానాలకు వెళ్ళండి నేను తిరిగి వచ్చేవరకు మన కొండ దగ్గరికి ఎవరు వెళ్ళకండి దాని మీద శత్రువులు చెయ్యి కూడా వేయలేరు.

నేను 12 సంవత్సరాల తర్వాత మళ్లీ తిరిగి వస్తాను అప్పటికి మీరు చేయవలసింది ఒక్కటే, మన పరిస్థితికి కారణమైన వారికి దగ్గర అవ్వండి వాళ్లు మనల్ని ఎలా మోసం చేశారో మనం కూడా అలాగే మోసం చేయాలి ధర్మాన్ని రక్షించడం కోసం మోసం చేసిన పర్వాలేదు అని మహాభారతంలో శ్రీకృష్ణ పరమాత్మ  చెప్పారు.

నేను బయటకి వచ్చిన తర్వాత సింబా ద్వారా మీకు సమాచారం పంపుతాను అప్పటివరకు మీరు జారువా తెగకి చెందిన వారని ఎక్కడ తెలియకూడదు." అని చెప్పాడు అభీర్.

ఆ మాటలు విని "సరే నాయకుడా! నువ్వు బయటకు వచ్చే వరకు జరిగిన విషయాలన్నీ మర్చిపోయి మొండిగా బతుకుతాము అభీర్ సేనాని యుద్ధానికి సిద్ధం చేస్తాము." అని శబదం చేసి అభీర్ చేతిలో చేయ్యి వేసి చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోయారు రాజన్ వాళ్ళ ఐదుగురు.

"శంకర్ నువ్వు కూడా వెళ్ళు త్వరలోనే నిన్ను కలుస్తాను." అని చెప్పాడు అభీర్.

"నాయకుడా! నేను తీహార్ జైల్లో  సెంట్రి గా పనిచేస్తున్నాను నువ్వు బాలనేరస్తుల జైలుకు వెళతావు, నేను అక్కడికి వచ్చి కలుస్తాను నువ్వు రెండు సంవత్సరాల్లో బయటకు వచ్చేస్తావు." అని చెప్పాడు శంకర్.

ఆ మాటకి నవ్వుతూ "నేను 12 సంవత్సరాల తర్వాత మాత్రమే ఈ గోడల మధ్యలో నుంచి బయటికి వస్తాను  ఇక్కడి నుంచి వెళ్ళిపో తప్పకుండా నిన్ను కలుసుకుంటాను." అని చెప్పాడు అభీర్.

"సరే నాయకుడా!" అని కళ్ళు తుడుచుకుని పాఠక్ దగ్గరికి "వెళ్లి మేము ఇక్కడికి వచ్చాము అని ఎవరికి చెప్పకండి." అని టేబుల్ మీద డబ్బులు పెట్టాడు శంకర్.

ఆ డబ్బులు తీసే శంకర్ చేతిలో పెట్టి "నేను చాలా తప్పులు చేశాను కానీ ఈ తప్పు మాత్రం చేయాలి అనుకోవడం లేదు మీరు వెళ్లి రండి. ఈ విషయం నాకు తప్పితే ఎవరికి తెలియదు అభీర్ ని జాగ్రత్తగా చూసుకునే బాధ్యత నాది." అని చెప్పాడు పాఠక్.

"మీరు చేస్తున్న సహాయం మనిషికి కాదు దేవుడికి, మీకు తప్పకుండా మంచి జరుగుతుంది." అని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు శంకర్.
*****************

గోకుల్ దహన సంస్కారాలు చేసి స్పెషల్ ఫ్లైట్లో లండన్ బయలుదేరుతూ జనార్దన్ చేతిలో ఒక కవర్ పెట్టి "నువ్వు మాల్దీవులకి వెళ్ళిపో అక్కడ నీకోసం అన్ని ఏర్పాట్లు చేశాను." అని చెప్పి జాకి వైపు చూసి

"అభిజిత్ కొడుకు మిథున్ కి ఈ విషయాలు ఏమి తెలియకూడదు జాగ్రత్తగా చూసుకో, అభిజిత్ కోమలో నుంచి బయటికి వస్తే నాకు వెంటనే కాల్ చెయ్!" అని చెప్పి లండన్ వెళ్లి పోయాడు ముకుల్.
[+] 7 users Like SivaSai's post
Like Reply


Messages In This Thread
RE: వేదం - by Manmadhsbanam143 - 22-12-2025, 04:13 PM
RE: ఖైదీ నెంబర్ 402 - నా మాటే శాసనం - by SivaSai - 02-02-2026, 07:08 AM



Users browsing this thread: 1 Guest(s)