01-02-2026, 08:44 AM
(This post was last modified: 01-02-2026, 08:44 AM by SivaSai. Edited 1 time in total. Edited 1 time in total.)
Part - 71
నేహా ఏమి చెబుతుందో అని చూస్తూ ఉంటాడు. ఏమీ లేదు శ్రీ గారు అంటే.. పర్వాలేదు చెప్పు అని చేయి పట్టుకుంటాడు.
అక్కడ ఉన్న కుర్చీలో కూర్చొని పెళ్లి కుదిరింది అని చెబుతుంది. దీనికి ఎందుకు అంత ముభావంగా ఉన్నావు. నీకే పెళ్లి ఇష్టం లేదా అని అడుగుతాడు కానీ..ఎక్కడ ఇష్టం లేదని చెబుతుందో.... అని గుండె టక్ టక్ అని కొట్టుకుంటూఉంటుంది.
నేహా మౌనాన్ని చూస్తుంటే తన గుండె శబ్దం తనకే వినపడుతున్నట్టు ఉంటుంది. చెమటలు పడుతూ ఉంటాయి.
ప్లీజ్ నేహ... నువ్వు అలా సైలెంట్ గా ఉంటే నాకు టెన్షన్గా ఉంది. ప్లీజ్ చెప్పు అని గెడ్డం పట్టుకుని అడుగుతాడు .
నేను కొన్ని రోజులైనా జాబ్ చేసి మా నాన్నగారికి అండగా నిలబడాలి అనుకున్నాను కానీ. ఇలా పెళ్లి కుదిరితే నేను ఎలా నిలబడగలుగుతాను.
ఎంత చెప్పుకున్నా.. ఈ రోజుల్లో అమ్మాయి, అబ్బాయి సమానమే అని చెబుతారు కానీ..పెళ్లయిన తర్వాత అబ్బాయి తన తల్లిదండ్రులకు ఖర్చు పెట్టినంత ఈజీగా ఆడపిల్ల ఖర్చు పెట్టలేదు.
పెళ్లి అయినా కూతురి దగ్గర తీసుకోవాలి అంటే తల్లిదండ్రులకు అభిమానం అడ్డువస్తుంది. ఏదో ఒక టైంలో అల్లుడుగాని, అత్తింటివారు దెబ్బుతారు అన్న భయం అన్నది ఉంటుంది.
ఒక్కొక్కసారి మన పద్ధతులను చూస్తూ ఉంటే కోపమే వస్తుంది. చిన్నప్పటినుండి అబ్బాయిని ఎలా చదివిస్తారో అమ్మాయిని అలాగే చదివిస్తారు.
పైగా ఎక్స్ట్రా బంగారం, పెళ్లి కోసం కట్నం అన్నీ రెడీ చేస్తారు. ఎంత చదువుకున్నా సరే ఈ కట్నాలు ఇవ్వడం అన్నది పోదు కదా..
మాకు అమ్మాయి చాలు కట్నం ఏమీ వద్దు అంటారు కానీ... ఏమీ పట్టుకెళ్ళకుండా వెళితే ఏదో ఒక టైం లో మాట వస్తుంది కదా...
అందరూ అలా ఉంటారని అనను కానీ... ఇలా కొంతమంది అయినా ఉంటారు కదా... ఆ కొందరులో నాకు వచ్చిన పెళ్ళికొడుకు ఫ్యామిలీ ఉంటే...
నేను ఎలాగా మా వాళ్లకు అండగా నిలబడగలను. అలా అని మా నాన్నగారికి ఎదురు చెప్పలేను. అదే నాకు బాధగా ఉంది అని చెబుతుంది.
నేహా కి వాళ్ళ నాన్నగారి మీద ఉన్న ప్రేమను చూసి శ్రీ అబ్బురపడతాడు. ఎంత ప్రేమ మీ తల్లిదండ్రులు మీద అని మురిసిపోతాడు.
అలా ఎందుకు ఆలోచిస్తున్నావు నిన్ను నిన్నుగా అర్థం చేసుకుని మీ తల్లిదండ్రులను నెత్తిన పెట్టుకుని చూసుకునేవాడు వస్తాడేమో...
ఆ మాటలకి నవ్వుతూ అవి చెప్పుకోవడానికి బాగుంటాయి. ఏ కథలోనే, సినిమాలోనే జరుగుతాయి. చాలా తక్కువ.
నువ్వు ఉన్నావేమో అంటాడు. అంత అదృష్టం కూడానా... ఏమో ఎవరో చెప్పగలం. ఈ మాత్రం దానికి ఇంత డల్ అయిపోతావా.
చీరప్ అని చెప్పి.. ఈరోజు నేను డ్రాప్ చేస్తాను పదా అని.. నేహా చెప్పేది కూడా వినిపించుకోకుండా చెయ్యి పట్టుకుని తీసుకువెళ్లి కార్ ఎక్కిస్తాడు.
కార్ లో మోనంగా కూర్చున్న నేహాని డైవర్ట్ చేయడానికి..
పెళ్ళికొడుకు పేరు ఏమిటి... తెలియదు శ్రీ గారు... అదేంటి.. ఏమి తెలుసుకోకుండానే పెళ్లికి ఒప్పుకున్నావా...
నాన్నగారికి తెలుసు కదా... నాకు ఎలాంటి వాడు వస్తే నేను సంతోషంగా ఉంటాను అన్నది. ఇంకా పనిగట్టుకుని ఏమి అడుగుతాము.
ఆ మాటలికి ఆశ్చర్యముగా చూస్తూ నీ నాలాంటి అమ్మాయి ఈ రోజుల్లో ఉండరు. అందరూ అబ్బాయి ఎత్తు నుంచి కలర్ వరుకు, ఫైనాన్సియల్ స్టేటస్ ఇంకా ఫ్రీడమ్ వరుకు అన్ని ఒకే అయ్యితేనే రెడీ అంటున్నారు.
నువ్వు ఏమిటీ అంటే అంత మా నాన్నగారి ఇష్టం అంటున్నావు. నువ్వు సొమెథింగ్ స్పెషల్ అంటూ...
ఆఫీస్ ముందు ఉన్న బస్టాప్ దగ్గర కార్ ఆపుతాడు.
కార్ దిగి థాంక్స్ చెప్పి ఆఫీసుకి వెళ్ళిపోతుంది. వెళుతున్న నేహాని చూసి నవ్వుకుంటూ వాసుగారికి కాల్ చేస్తాడు.
చెప్పారా సూపుత్ర అనగానే... డాడ్ అంటాడు. ఇప్పుడే అంటున్నాను.. నీ కొడుకు ఇంకా ఫోన్ చేయలేదు ఏమిటా అని... తెలిసిందిలే...
ఎవరు చెప్పారు.. మా కోడలు పిల్ల... హ.. అవును.
నా పేరు కూడ చెప్పకుండా పెళ్లి కుదిరిచేసారా అని అలకగా అంటాడు.
ఒరేయ్ అమ్మాయి తల్లిదండ్రులు చెప్పకపోతే నేనేం చేస్తానురా... ఇంతకి కోడలు పిల్ల ఏం చెప్పింది అని అడుగుతారు.
వాళ్ళిద్దరి మధ్య జరిగిన సంభాషణ మొత్తం చెబుతాడు. నా కోడలు పిల్ల చాలా మెచ్యూరిటీగా ఆలోచిస్తుంది రా.. అందుకే నేను ఒక నిర్ణయం తీసుకున్నాను.
ఈ ఊరిలోనే ఒక 50 ఎకరాలు బిట్ కొని శ్రీను గారికి కౌవులికి ఇద్దాం అనుకుంటున్నాను. యువర్ అమేజింగ్ డాడ్ అని అంటాడు.
మరి ఎక్కువ పొగడకు రా... నీకు తిక్కరేగిందంటే ఆ పొగడ్తల్లోనే ముంచేస్తావు. ఇంతకీ నీకు ఎంగేజ్మెంట్ కావాలా లేదా డైరెక్ట్ గా పెళ్లి చేసేయ్మంటావా అంటే..
నో.. నో.. నాకన్ని పద్ధతి ప్రకారం జరగాల్సిందే.. అది విక్రమ్ వచ్చిన తర్వాత పెట్టుకుందాం అని చెబుతాడు. సరే ఏదైనా మీ ఇష్టం అని ఫోన్ పెట్టేస్తారు.
తనకి కేబిన్ కి వెళ్ళిన తర్వాత ఈ ఆనందాన్ని ఎవరో ఒకరితో షేర్ చేసుకుంటే కానీ తన గ్యాస్ తగ్గదు అని రాజ్ కి ఫోన్ చేస్తాడు.
పడుకున్న రాజ్ నిద్ర మత్తులో హలో అంటే... ఏరా ఏం చేస్తున్నావు అని అడుగుతాడు. ఎదవ...
పడుకున్నావాడికి ఫోన్ చేసి ఏమి చేస్తున్నావు అని అడుగుతావా... అరుస్తూఉంటే... అబ్బా... నీకో గుడ్ న్యూస్ చెబుదాము అని ఫోన్ చేసాను అని ఉత్సాహంగా
చెబుతాడు.
ఏంట్రోయ్ గుడ్ న్యూస్...కొంపతీసి నీకు పెళ్లి కుదిరిందా ఏమిటి అంటే... అరే.. అంత కరెక్ట్ గా ఎలా గెస్ చేసావు అని అడుగుతాడు.
నీ ఆత్రం చూస్తుంటేనే అర్థం అవుతుంది. పడుకున్నావాడ్ని లేపి మరీ చెబుతుంటే... మా టైమింగ్స్ తెలిసి కూడా చేసావు చూడు..
అక్కడే క్లియర్గా అర్థమైందిలే. ఇంతకీ నేహా ఒప్పుకుందా అని అడిగితే..లేదురా అంటాడు. మరి ఎలాగా సెట్ చేసావు అంటే..
ఇటు నుంచి అవ్వదని అర్థమయ్యే అటునుంచి నరుక్కువచ్చాను అంటాడు. ఎటు నుంచి నరుక్కువచ్చావు అంటే...జరిగింది మొత్తం చెబుతాడు.
దానికి నవ్వుతూ బానే సెట్ చేసావు లే.. పెళ్లి డేట్ ఎప్పుడు ఫిక్స్ చేశారు అంటే.. నువ్వు, విక్కీ ఎప్పుడైతే ఉంటారో అప్పుడే పెళ్లి.
విక్కీ కూడా ఫోన్ చేయాలి నువ్వు ఫోన్ పెట్టేయ్. ఒరేయ్ వాడు హనీమూన్ మూడ్ లో ఉన్నాడు. అనవసరంగా డిస్టర్బ్ చేయకు అని రాజ్ అరుస్తూ ఉండగానే ఫోన్ పెట్టేస్తాడు.
ఎదవ ఫోన్ పెట్టేసాడు. వీడికి మరి ఆత్రం ఎక్కువవుతుంది. విక్కీ చేతులో ఏదో ఒకటి వీడికి మూడిందిలే అనుకుంటు నా పెళ్ళాం ఎక్కడుందో అనుకుంటూ తలగడ పట్టుకుని పడుకుంటాడు.
ఫోన్ రింగ్ అవుతుంటే విక్రమ్ నవ్వుకుంటూ లిఫ్ట్ చేసి చెప్పరా పెళ్ళికొడకా అంటాడు. అరే అప్పుడే నీకు ఎలా తెలిసింది అంటే..మాకు అన్నీ అలా తెలిసిపోతాయిలే.. కానీ ఏంటి సంగతులు అంటాడు. పెళ్లి కుదిరింది మామ అని గొప్పగా చెబుతాడు.
ఆ విషయం మాకు తెలుసు గాని... నేహా కి తెలుసా అంటే లేదురా అని డల్ గా చెప్పాడు. మా మామగారు పెళ్లి కుదిరింది అని చెప్పారు కానీ పెళ్లి కొడుకు పేరు చెప్పలేదు నీరసంగా చెబుతాడు.
హ.. హ... నవ్వుతూ నీ ఆత్రానికి, మీ మామగారు నిదానానికి సరిపోయింది. హ్మ్.. అవున్రా ఎంగేజ్మెంట్ రోజునే రివిల్ చేసేటట్టు ఉన్నారు అని వాపోతాడు.
ఈ పాటికి తెలిసి ఉంటే అందరికి ఒక పెద్ద ట్రీట్ ఇచ్చేసేవాడిని. నేహా అడిగితే ఏం చెబుతావు రా అంటే... దేని గురించి బావ.
నాకంటే తెలియదు. మీకు తెలుసు కదా.. ఎందుకు చెప్పలేదు అన్నదే అనుకో ఏమని చెబుతావు...
నీకు తెలిసేమో అనుకున్నాను అని అంటాను.
దానికి ఒరేయ్ మట్టి బుర్ర.. ఆల్రెడీ జరిగిందంతా నీకు చెప్పే ఉంటుంది కదా.. తనకు ఏమీ తెలీదు అని నీకు తెలుసు కదా...
మళ్లీ నీకు తెలిసేమో అనుకున్నాను అంటే.. నమ్ముతుందా నిన్ను ఎలా చూస్తుంది. మరి ఇప్పుడు ఏం చెప్పాలి బావా అంటే.. అది కూడా మేమే చెబితే ఎలా రా...కొంచెం ఆలోచించు.
పెళ్లి ముహూర్తాలు ఎప్పుడు పెట్టారు అంటే...ఏదైనా మీరు వచ్చిన తర్వాతే అని చెబుతారు. మేము రావడానికి ఇంకొక వారం పడుతుంది రా...
మీరు వచ్చే టైమ్ కి ఎంగేజ్మెంట్ పెట్టేసుకుందాము. ఒకే బై అని ఫోన్ పెట్టేసి భార్యని అల్లుకుపోతాడు.
ఇక్కడ శ్రీ మాత్రం నేహా తో లైఫ్ ఊహించుకుంటూ లైఫ్ అనే డ్రీమ్స్ క్లౌడ్ లో ఎగురుతూ ఉంటాడు.
ఎంగేజ్మెంట్ రోజు రానే వచ్చింది...

![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)