Thread Rating:
  • 5 Vote(s) - 3.6 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
ఖైదీ నెంబర్ 402 - నా మాటే శాసనం
ఎపిసోడ్ 52


జాకీ దొరికిపోయాడని అభిజిత్ కి ఫోన్ చేసిన జనార్ధన్ తో ముకుల్ మాట్లాడుతూ నువ్వు కాసేపు మంచి సెక్యూరిటీ అధికారి గా మారి అక్కడికి వేళ్ళు అని చెప్పాడు.

*****************

సుమతిని చేతుల్లోకి తీసుకుని గదిలోకి తీసుకు వెళుతున్న అభీర్ వైపు చూసి "ఏవండీ! పాపని ఆ అబ్బాయి తీసుకు వెళుతున్నాడు ఆపండి. తొందరగా హాస్పిటల్ కి తీసుకు వెళదాము." అని కంగారుగా చెప్పింది గీత.

ఆ మాట విని కళ్ళు తుడుచుకుని భార్యని పైకి లేపి "కంగారు పడకు సుమతికి ఏమీ అవ్వదు క్షేమంగా బయటికి వస్తుంది. నేను చాలా తప్పులు చేశాను కానీ ఆ దేవుడు నన్ను క్షమించాడు." అని ఫోన్ తీసి జనార్ధన కి కాల్ చేశాడు మురళీజోషి.

ఫోన్ రింగ్ అవడం చూసి 'జోషి సార్ కాల్ చేస్తున్నాడు ఏమిటి?' అని కంగారుగా లిఫ్ట్ చేసి "సార్ చెప్పండి." అని అడిగాడు జనార్ధన్.

"ఎక్కడ ఉన్నావ్?" అని అడిగాడు మురళి జోషి.

"సార్! నేను ఇంటి దగ్గరే ఉన్నాను." అని చెప్పాడు జనార్ధన్.

"సరే! అర్జెంటుగా మా ఇంటి దగ్గరికిరా..!  మనం చేసిన తప్పులు సరిదిద్దుకుందాము, లేకపోతే శివమణికి పట్టిన గతే మనకి పడుతుంది." అని చెప్పాడు మురళి జోషి.

"ఓకే సర్! ఇప్పుడే బయలుదేరుతున్నాను." అని ఫోన్ పెట్టేసి వెంటనే ముకుల్ కి ఫోన్ చేశాడు జనార్ధన్.

ఫోన్ రింగ్ అవడం చూసి "వీడేంటి అప్పుడే వెళ్ళిపోయాడా?" అని లిఫ్ట్ చేసి "చెప్పు జనార్ధన్!" అని అడిగాడు ముకుల్.

"సార్! నాకు మురళి జోషి ఫోన్ చేశాడు సడన్గా అప్రూవల్ గా మారదాము అని చెబుతున్నాడు, అక్కడికి వెళ్లి మీకు కాల్ చేస్తాను ఈ లోపు ఏం ప్లాన్ చేస్తారో ఆలోచించుకోండి." అని చెప్పాడు జనార్ధన్.

"ఓకే!" అని ఫోన్ పెట్టి ఆలోచిస్తూ ఉన్నాడు ముకుల్.

జనార్దన్ తో ఫోన్లో మాట్లాడి ఆలోచిస్తున్న ముకూల్ వైపు చూసి "అంకుల్  మన మనుషులు తో కలిసి వెళ్లి అందర్నీ చంపి జాకిని తీసుకోవద్దము, ఒక దెబ్బతో పని అయిపోతుంది." అని చెప్పాడు అభిజిత్.

ఆ మాట విని "జాకిని పట్టుకుంది అభీర్ కాదు, అంటే, అభీర్ మనుషులు ఇంకా మిగిలే ఉన్నారు, మనం జాగ్రత్తగా ప్లాన్ చేయాలి ఈసారికి నేను చెప్పినట్లు చేయండి.

మురళి జోషి కూతురు చచ్చింది కాబట్టి, ఇంక వాడు మన మాట వినడు, అక్కడి జనర్దన్ నుంచి ఫోన్ రావడంతోనే ఇంక ఈ గొడవలన్నీ వదిలేస్తున్నాము జాకిని తీసుకుని  వచ్చి పంచరత్నాలు తీసుకు వెళ్ళమని అభీర్ కి చెబుదాము." అని చెప్పాడు ముకుల్.

"డాడ్! వాడు గనక ఇక్కడికి వచ్చి నా చేతికి ఉన్నా పంచరత్నాలని చూసాడు అంటే, మనం ఆపలేము." అని కంగారుగా చెప్పాడు గోకుల్.

"ఆ విషయం నాకు కూడా తెలుసు! అందుకే జాకిని తీసుకుని అభీర్ అక్కడి నుంచి బయలుదేరగానే నువ్వు ఇక్కడి నుంచి మిచల్ తో కలిసి  మురళి జోషి ఇంటికి వెళ్లి వాడి ఫ్యామిలీని అక్కడ ఉన్న వాడి మనుషులను లేపేయ్!" అని చెప్పాడు ముకుల్.

"మరి ఇక్కడికి వచ్చిన అభీర్ సంగతి!" అని కంగారుగా అడిగాడు అభిజిత్.

"ఆ అభీర్ తో ఎలా డీల్ చేయాలో, వాడిని ఎలా ఆపాలో నాకు బాగా తెలుసు! చట్టన్ని చంకలో పెట్టుకుని ఆడుకునే ఒక లాయర్ ఉన్నాడు, అతను వాడి సంగతి చూసుకుంటాడు." అని చెప్పి ఫోన్ తీసి కాల్ చేశాడు ముకుల్.

ఫోన్ లిఫ్ట్ చేసి "నమస్తే సార్! మీ కాల్ కోసమే వెయిట్ చేస్తున్నాను, నన్ను ఎక్కడ కలవమంటారు?" అని వినయంగా అడిగాడు హిర్వాణి.

"నువ్వు నన్ను కలవవలసిన పనిలేదు, నీ ఫీజు నీ ఇంటి దగ్గర ఉంటుంది. నువ్వు చేయవలసింది ఏమిటి అంటే కాసేపట్లో ఎన్ఐఏ ఆఫీసర్ మురళి జోషి ని హత్య చేస్తున్నారు.

ఆ హంతకుడిని ఎక్కడ ఉన్నాడో ఆఫీసర్ జనార్ధన్ చూపిస్తాడు, వాడిని అరెస్టు చేసి జైల్లో పెట్టి బయటకు రాకుండా చేయాలి, వాడు ఎన్ని సంవత్సరాలు లోపల ఉంటే నువ్వు అన్ని కోట్లు నువ్వు సంపాదిస్తావు." అని చెప్పాడు ముకుల్.

"ఓకే సార్! నా టాలెంట్ ఏంటో మీకు చూపిస్తాను, మీ నుంచి ఫోన్ రావడంతోనే సెక్యూరిటీ ఆఫీసర్ల్ని అక్కడికి పంపిస్తాను వాడు బతికున్నంత కాలం  జైల్లోనే ఉండే విధంగా చేస్తాను వాడి తరపున వాదించడానికి ఏ లాయర్  కూడా ముందుకు రాడు." అని చెప్పాడు హిర్వాణి.

"గుడ్! ఆ టాలెంట్ నీ దగ్గర ఉందని నాకు తెలిసి నీకు ఇంత పెద్ద ఆఫర్ ఇచ్చాను." అని ఫోన్ పెట్టేసాడు ముకుల్.

"అంటే అంకుల్! ఇప్పుడు ఆ అభీర్ ని జైల్లో పెట్టేస్తారా? వాడికి 16 సంవత్సరాలు రెండేళ్లలో బయటకు వచ్చేస్తాడు." అని చెప్పాడు అభిజిత్.

"16 సంవత్సరాలు వాడిని 18 సంవత్సరాల కింద చూపించలేమా? నువ్వు ఆ మాత్రం మేనేజ్ చేయలేవా?" అని నవ్వుతూ అడిగాడు ముకుల్.

ఆ మాటకి నవ్వుతూ "అది చాలా ఈజీ అంకుల్! ఆ విషయం నేను చూసుకుంటాను." అని చెప్పాడు అభిజిత్.

**********************

కాసేపటికి గది తలుపులు తెరుచుకోవడంతో నవ్వుతూ బయటికి వచ్చిన సుమతిని చూసి సంతోషంగా వెళ్లి గట్టిగా పట్టుకుని ఒంటి మీద చూస్తూ "గాయం ఏమైపోయింది? నువ్వు బానే ఉన్నావు కదా!" అని కంగారుగా చూస్తూ అడిగింది గీత.

"నేను బానే ఉన్నాను మమ్మీ నాకు తగ్గిపోయింది." అని నవ్వుతూ చెప్పింది సుమతి.

దగ్గరికి వచ్చి కూతుర్ని, భార్యని గట్టిగా పట్టుకుని "నేను ముందే చెప్పా కదా! ఆ దేవుడు మనల్ని కరుణించాడు. మీరు లోపలికి వెళ్ళండి. ఇప్పుడు నేను చేయవలసిన పని చాలా ఉంది." అని అభీర్ వైపు చూసి,

"నేను చేసిన పని క్షమించరానిది నాకు శిక్షపడేలోపు  మీకు సహాయం చేస్తాను, నా అసిస్టెంట్ వస్తున్నాడు వాళ్ల మీద కేసు ఫైల్ చేస్తాను, జరిగిన విషయం ఈ ప్రపంచానికి తెలిసేలా చేస్తాను." అని చెప్పాడు మురళిజోషి.

"మీరు ఏదైనా చేయండి కానీ పంచరత్నాలు నా చేతికి వచ్చిన తర్వాత మాత్రమే!' అని చెప్పి బైరి వాళ్ళ వైపు చూసి "మీరు ఎవరికీ కనబడకూడదు కొంచెం దూరంలో ఉండండి." అని చెప్పాడు అభీర్.

"సరే!" అని నలుగురిని తీసుకుని అక్కడ నుంచి దూరంగా వెళ్ళాడు బైరి.

స్పృహ తప్పిన జాకిని మెడ పట్టుకుని పైకి లేపి "నాయకుడా! వీడిని చంపేస్తాను." అని కోపంగా చూస్తూ అడిగాడు సహదేవుడు.

"నేను ముందే చెప్పాను కదా! పంచరత్నాలు మన చేతికి రాకుండా వాళ్ళలో ఎవరు చావకూడదు." అని చెప్పాడు అభీర్.

అంతలో అక్కడికి హడావుడిగా వస్తున్న జనార్దన్ ని చూసి జాకిని ఒక గదిలో పెట్టి "నాయకుడా! వీడి మొహం చూస్తుంటే నాకు నమ్మబుద్ధి కావడం లేదు." అని చెప్పాడు సహదేవుడు.

"ఈ పరిస్థితి అటువంటిది ఎవరిని చూసిన అలాగే అనిపిస్తుంది. కానీ నమ్మక తప్పదు!" అని చెప్పి జనార్ధన్ వైపు చూస్తూ ఉన్నాడు అభీర్.

అక్కడకు వచ్చి "సార్! చెప్పండి ఇప్పుడు మీరు ఏది చెబితే అది చేయడానికి నేను రెడీగా ఉన్నాను." అని చెప్పాడు జనర్ధన్.

"అభిజిత్ కి కాల్ చేసి పంచరత్నాలు తీసుకుని ఇక్కడ రమ్మను లేకపోతే జరిగింది మొత్తం మీడియాకి చెప్పి కేసు ఫైల్ చేద్దాము." అని చెప్పాడు మురళీజోషి.

"ఓకే సార్! మీరు చెప్పారు కాబట్టి  వాళ్ళు తప్పు చేస్తున్నా మాట్లాడకుండా ఉన్నాను, ఇప్పుడు డిపార్ట్మెంట్ పవర్ ఏమిటో చూపిద్దాము." అని ఫోన్ తీసి ముకుల్ కి కాల్ చేసి స్పీకర్ ఆన్ చేసాడు జనార్ధన్.

ఫోన్ లిఫ్ట్ చేసి "ఏంటి జనార్దన్? ఈ టైంలో కాల్ చేసావు?" అని అడిగాడు ముకూల్.

"మీ మనుషులు మా సార్ వాళ్ళ అమ్మాయిని చంపేశారు ఇకనుంచి మా తరఫున మీకు ఎటువంటి హెల్ప్ ఉండదు. మర్యాదగా అడవిలో తీసుకున్న వస్తువులు మొత్తం మాకు అప్పగించి లొంగిపొండి. లేకపోతే మేము ఏమి చేయాగాలమో మీకు బాగా తెలుసు!" అని చెప్పాడు జనార్ధన్.

"మీ దగ్గర జాకీ ఉన్నాడని నాకు తెలుసు! అతన్ని తీసుకుని అభీర్ నా గెస్ట్ హౌస్ కి రమ్మను, అతని వస్తువులు అతనికి ఇస్తాము, మేము కూడా లండన్ కి తిరిగి వెళ్ళిపోతాము, ఆ శివమణి వల్లే ఇదంతా జరిగింది." అని చెప్పాడు ముకుల్.

ఫోన్లో చెప్పింది విని మురళి జోషి వైపు చూశాడు జనార్ధన్.

"సరే! జాకీ ని తీసుకుని నేను అక్కడికి వెళ్తాను." అని చెప్పాడు అభీర్.

ఆ మాట విని "సరే! అభీర్, జాకీ తీసుకుని వస్తున్నాడు అతనికి కావలసినవి ఇచ్చి పంపించండి." అని చెప్పి ఫోన్ పెట్టేసాడు జనర్దన్.

"నాయకుడా! వాళ్ళ మాటలు నమ్మకూడదు నువ్వు ఒంటరిగా అక్కడికి వెళ్లడం చాలా ప్రమాదం!" అని కంగారుగా చెప్పాడు సహదేవుడు.

"నాకు ఏమీ అవ్వదు." అని జాకీ మొహం మీద నీళ్లు కొట్టి నిద్రలేపి అక్కడ నుంచి గెస్ట్ హౌస్ కి బయలుదేరి దూరంగా ఉన్న తన వాళ్ళ వైపు చూసి "ఇక్కడే ఉండండి." అని సైగ చేసాడు అభీర్.

అక్కడినుంచి అభీర్ బయలుదేరగానే ముకుల్ కి మెసేజ్ చేశాడు జనార్ధన్.

మెసేజ్ చూసి "గోకుల్! మిచల్ ని తీసుకుని బయలుదేరు అక్కడ ఒక్కడు కూడా బతికి ఉండడానికి వీల్లేదు, మేము బేరా బయలుదేరుతాము నువ్వు త్వరగా పని ముగించుకుని అక్కడికి వచ్చేయ్!" అని చెప్పాడు ముకుల్.

"ఓకే డాడ్!" అని తన చేతి వేళ్ళకి ఉన్న పంచరత్నాల ఉంగరాలు చూసుకొని మిచల్ మనుషులతో కలిసి మురళి జోషి ఇంటికి బయలుదేరాడు గోకుల్.

అభిజిత్, సర్పరాజ్ లతో కలిసి అక్కడ నుంచి బైరాకి  బయలుదేరి కార్ లో వెళుతూ జాకీ కి ఫోన్ చేశాడు ముకుల్.

ఫోన్ రింగ్ అవడం చూసి అభీర్ వైపు చూసి "ముకుల్ సర్ కాల్ చేస్తున్నారు." అని చెప్పాడు జాకి.

"సరే! మాట్లాడు అక్కడికే వస్తున్నాము అని చెప్పు!"  అన్నాడు అభీర్.

లిప్ట్ చేసి "సార్! అభీర్ తో కలిసి నేను గెస్ట్ హౌస్ దగ్గరికి వస్తున్నాను వాళ్ళ వస్తువులు వాళ్ళకి ఇస్తే ఇక్కడి నుంచి వెళ్ళిపోతారు." అని చెప్పాడు జాకీ.

"మీరు గెస్ట్ హౌస్ దగ్గరికి వచ్చి వెయిట్ చేయండి. నేను ఆ పంచరత్వాలు, వస్తువులు తీసుకుని అక్కడికి వస్తాను." అని చెప్పి ఫోన్ పెట్టేసాడు ముకుల్.
[+] 10 users Like SivaSai's post
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.


Messages In This Thread
RE: వేదం - by Manmadhsbanam143 - 22-12-2025, 04:13 PM
RE: ఖైదీ నెంబర్ 402 - నా మాటే శాసనం - by SivaSai - 31-01-2026, 10:55 AM



Users browsing this thread: