31-01-2026, 10:52 AM
ఎపిసోడ్ 51
అభీర్ ఢిల్లీ వచ్చాడని తెలిసి బేరా అడవికి వెళ్లడానికి డిసైడ్ అయ్యారు ముకుల్ వాళ్ళు.
మురళి జోషితో కలిసి శివమణి ఇంటికి వెళ్లి మిత్రని అనాధ ఆశ్రమంలో జాయిన్ చేసి నాకు పంచరత్నాలు ఎక్కడ ఉన్నాయో తెలియాలి అని చెప్పాడు అభీర్.
******************
అబీర్ తో పాటు కార్ లో వెళుతూ ఫోన్ రింగ్ అవ్వడం చూసి "జనార్ధన్ కాల్ చేస్తున్నాడు, జాకీ ఎక్కడ ఉన్నాడో వీడికి కచ్చితంగా తెలుస్తుంది." అని చెప్పాడు మురళి జోషి.
"సరే! మాట్లాడు నేను నీతో పాటు ఉన్న విషయం వాళ్లకి తెలియకూడదు." అని చెప్పాడు అభీర్.
"సరే!" అని ఫోన్ లిఫ్ట్ చేసి "జనార్ధన్ ఇంటికి వెళ్ళిపోయావా?" అని అడిగాడు మురళి జోషి.
"సార్! నేను ఇక్కడ రైల్వే స్టేషన్ దగ్గరే ఉన్నాను, అభీర్ ని క్లోజ్ చెయ్యడానికి అభిజిత్ సార్ జాకీ అన్నని పంపించారు కరెక్ట్ టైంకి వీడు ఎక్కడ ఉన్నాడో కనబడడం లేదు, మీకు కనిపించాడేమోనని కాల్ చేశాను." అని చెప్పాడు జనార్ధన్.
"సరే!" మీరు అక్కడే ఉండండి నేను వస్తున్నాను." అని చెప్పి ఫోన్ పెట్టేసి అభీర్ వైపు చుసి "జాకి రైల్వే స్టేషన్ దగ్గర ఉన్నాడు." అని చెప్పాడు మురళి జోషి.
"సరే! అక్కడికి వెళ్లి వాళ్లకి మనం కనిపించకుండా కారు దూరంగా ఉంచు." అని చెప్పాడు అభీర్.
"సరే!" అని రైల్వే స్టేషన్ దగ్గరికి ఫాస్ట్ గా వెళ్లి దూరం నుంచి జనార్ధన్ వాళ్ళని చూసి కార్ ఆపి "వాళ్ళు అక్కడే ఉన్నారు." అని చూపించడు మురళీజోషి.
కారులో నుంచి జాకీ వైపు చూసి వెనకాల రియా కనపడటంతో 'తను ఇక్కడికి వచ్చింది ఏంటి?' అనుకుని
మురళి జోషి వైపు చూసి
"నువ్వు వెళ్లి జాకీ తో మాట్లాడి పంచరత్నాలు ఎక్కడ ఉన్నాయో తెలుసుకో అప్పటి వరకు నేను మీ ఇంటి దగ్గరే ఉంటాను." అని చెప్పి కారు దిగాడు అభీర్.
"ఓకే!" అని కార్ స్టార్ట్ చేసుకుని జాకీ వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు మురళి జోషి.
అక్కడి నుంచి కొంచెం పక్కకు వెళ్లి రియా వైపు చూసి పక్షి లాగా అరిచి సిగ్నల్ ఇచ్చాడు అభీర్.
ఆ రూపు విని దూరంగా ఉన్నారు రాజాన్ వాళ్ళని పిలిచి "అభీర్ ఇక్కడే ఉన్నాడు." అని అరుపు వచ్చిన వైపుకు తీసుకు వెళ్లింది రియా.
జాకీ వాళ్ళ దగ్గరకు వెళ్లి "మనం అర్జెంట్గా గెస్ట్ హౌస్ కి వెళ్లి అభిజిత్ గారితో మాట్లాడాలి నా ఫ్యామిలీ డేంజర్ లో ఉంది." అని చెప్పాడు మురళి జోషి.
"సరే!" అని కార్ లో అక్కడినుంచి గెస్ట్ హౌస్ కి బయలుదేరారు అందరూ
అక్కడినుంచి జాకీవాళ్ళు వెళ్లిపోవడంతో రియకి ఎదురుగా వెళ్లి "మిమ్మల్ని రావద్దు అని చెప్పా కదా, మళ్ళీ ఎందుకు వచ్చారు?" అని అడిగాడు అభీర్.
"నిన్ను ఒంటరిగా వదిలి ఉండలేకపోయాము, ఇక్కడ ఏం జరుగుతుందో తెలియడం లేదు, పంచరత్నాలు నీ చేతికి వచ్చేవరకు తోడుగా ఉందామని వచ్చేసాము." అని చెప్పాడు బైరి.
"సరే! ఇక్కడినుంచి త్వరగా పదండి." అని చెప్పి సహదేవుడి దగ్గరికి తీసుకువెళ్లాడు అభీర్.
అక్కడికి అభీర్ తో పాటు ఐదుగురు రావడం చూసి సంతోషంగా వెళ్లి అందరిని గట్టిగా పట్టుకొని "నాయకుడికి తోడు ఎవరూ లేరు అనుకున్నాను ఇంక నాకు ఎటువంటి భయం లేదు." అని చెప్పాడు సహదేవుడు.
"మీరు ఇక్కడికి వచ్చినందుకు నాకు ఎటువంటి బాధ లేదు కానీ ఈ గొడవలో ఏ ఒక్కరి ప్రాణం పోయినా నేను భరించలేను." అని చెప్పాడు అభీర్.
"నాయకుడా! మన వాళ్ళతో పాటు మా ప్రాణాలు అప్పుడే పోయాయి, ఇంత అన్యాయం చేసిన వాళ్ల మీద పగ తీర్చుకొని, నువ్వు పంచరత్నాలు తీసుకెళ్లి అమ్మవారి పాదాల దగ్గర మళ్లీ ప్రతిష్టించడం చూసిన తర్వాతే మళ్ళీ మా ప్రాణాలు తిరిగి వస్తాయి." అని చెప్పాడు బైరి.
ఆ మాట విని ఐదుగురు వైపు చూసి "ఆ ఆఫీసర్ మనకి సహాయం చేస్తాను అని మాట ఇచ్చాడు, ఆ పంచరత్నాలు ఎక్కడ ఉన్నాయో తెలుసుకుని ఇక్కడికి వస్తాడు." అని చెప్పాడు అభీర్.
"నాయుకుడా! వీళ్ళని నమ్మడానికి లేదు వెన్నుపోటు పొడవడానికి చూస్తారు అందరూ స్వార్థపరులే!" అని చెప్పాడు సహదేవుడు.
ఆ మాట విని "నమ్మకం పోగొట్టుకుంటే ప్రాణాలు పోగొట్టుకుంటాడు, ఇక్కడ అందరూ ఉండకూడదు మనం ఉండడానికి ఏదైనా స్థలం చూడండి." అని చెప్పాడు అభీర్.
"మన శంకర్ ఇక్కడే ఉంటున్నాడు అతని ఇంటికి వెళ్లండి ఇక్కడ నేను సహదేవుడు ఉంటాము." అని చెప్పాడు బైరి.
"సరే! ఆ పంచరత్నాలు మన చేతికి వచ్చేవరకు ఏమాత్రం తొందరపడకండి." అని చెప్పి రాజన్ వాళ్ళతో కలిసి శంకర్ ఇంటికి వెళ్ళాడు అభీర్.
****************
జాకీ వాళ్ళని కలిసి అక్కడి నుంచి గెస్ట్ హౌస్ లో ఉన్న గోకుల్ వాళ్ళ దగ్గరకు వెళ్లి "సార్! అభీర్, సహదేవుడు నా దగ్గరికి వచ్చారు ఆ పంచరత్నాలు ఎక్కడ ఉన్నాయో చెప్పమని అడుగుతున్నారు లేకపోతే నా ఫ్యామిలీని చంపేస్తామని బెదిరిస్తున్నారు మీరే కాపాడాలి." అని కంగారుగా చెప్పాడు మురళి జోషి.
ఆ మాట విని "అభీర్ ని ట్రాప్ లో పెట్టి లేపేయాడానికి మనకి మంచి ఛాన్స్ వచ్చింది." అని జాకీ వైపు చూసి "మిచల్ ని నీతో పాటు తీసుకువెళ్లి దూరంగా ఉండి మురళీజోషి ని ఇంటికి పంపించండి.
మిచల్ స్నైపర్ గన్ తో రెడీగా ఉంటాడు అభీర్ వాళ్ళు మురళీజోషి దగ్గరికి రాగానే షూట్ చేస్తాడు." అని చెప్పాడు గోకుల్.
"గుడ్ ఐడియా! అక్కడ ఎటువంటి మిస్టేక్ జరగకూడదు." అని చెప్పాడు ముకుల్.
ఆ మాట విని "సార్! ఈ టైంలో వెళితే నా భార్య పిల్లలకి విషయం తెలిసిపోతుంది. ఉదయం వెళతాను జనం హడావిడిలో బుల్లెట్ సౌండ్ కూడా వినపడదు.
తరువాత టెర్రరిస్టులు ఎటాక్ చేయడానికి వచ్చారు షూట్ అవుట్ జరిగింది అని నేను మేనేజ్ చేస్తాను." అని చెప్పాడు మురళి జోషి.
"సరే! అయ్యితే రాత్రి కి మందు తాగి ఎంజాయ్ చేసి ఉదయం బయలుదేరి వెళ్ళండి. మేము కూడా ఉదయం వెళ్లి ఆ పంచరత్నాలు ఉంగరాలు తీసుకుని, మీ పని అయింది అన్న తర్వాత అడవికి బయలుదేరుతాము." అని చెప్పాడు అభిజిత్.
"సరే సార్!" అని ఇంటి దగ్గర నుంచి ఫోన్ రావడం చూసి కట్ చేసి జాకీ వాళ్ళతో కలిసి మందు తాగుతూ కూర్చున్నాడు మురళి జోషి.
******************
ఉదయం గెస్ట్ హౌస్ నుంచి బయలుదేరి మురళి జోషి ని ఇంటికి పంపించి మిచల్ వైపు చూసి "తనతో ఇద్దరు వస్తారు గురి తప్పకూడదు." అని చెప్పాడు జాకి.
"ఓకే బాయ్! నా గురి ఎప్పుడైనా తప్పిందా?" అని గన్ తీసి మురళి జోషిని చూస్తూ ఉన్నాడు మిచల్.
ఇంటి దగ్గరికి వస్తున్న మురళి జోషిని చూసి బైరి తో కలిసి వెళ్ళాడు సహదేవుడు.
ఇంటి దగ్గర నిద్రపోకుండా తండ్రి కోసం ఎదురు చూస్తూ మురళి జోషి కనపడడంతో "డాడీ!" అని పరిగెత్తుకుంటూ వచ్చింది సుమతి.
దూరం నుంచి చూస్తూ మురళీ జోషి దగ్గరికి ఇద్దరు రావడంతో షూట్ చేశాడు మిచల్.
ఆ సౌండ్ విని సహదేవుడని పక్కకు తోసి వెనక్కి తిరిగి దూరంగా ఉన్న జాకి వాళ్ళని చూసి వేగంగా పరిగెత్తుకుంటూ వెళ్ళాడు బైరి.
బుల్లెట్ సహదేవుడు తల పక్క నుంచి వెళ్లి పరిగెత్తుకుంటూ వస్తున్న సుమతికి తగలడంతో ఎగిరి అవతల పడింది.
అది చూసి కంగారుగా అక్కడి నుంచి మిచల్ తో కలిసి పారిపోయాడు జనార్ధన్.
పారిపోవడానికి కారు స్టార్ట్ చేస్తున్న జాకీని పట్టుకుని భుజానా వేసుకుని మురళి జోషి ఇంటి దగ్గరికి వచ్చాడు బైరి.
బుల్లెట్ తగిలి చావు బతుకుల్లో ఉన్న కూతుర్ని పట్టుకుని ఏడుస్తున్న మురళి జోషిని, గీతని చూసి, "బైరి! నువ్వు వెళ్లి నాయకుడిని తీసుకురా..! వీడి సంగతి నేను చూసుకుంటాను." అని జాకిని పట్టుకున్నాడు సహదేవుడు.
కూతురుని పట్టుకుని ఏడుస్తూ "మీ వల్లే సుమతి చనిపోయింది." అని కోపంగా చూస్తూ అంది గీత.
"అవును! నేను చేసిన తప్పు వల్లే నాకు కూతురు చనిపోయింది." అని ఏడుస్తూ బైరితో పాటు అక్కడికి వచ్చినా అభీర్ ని చూసి కాళ్లు పట్టుకుని
"నా కూతుర్ని ఎలాగైనా బతికించు ఇంక నేను ఈ జన్మలో తప్పు చేయను." అని ఏడుస్తూ అడిగాడు మురళి జోషి.
ఆ మాట విని ఏడుస్తున్న గీత వైపు చూసి సుమతిని తన చేతుల్లోకి తీసుకుని ఇంట్లోకి వెళ్ళాడు అభీర్.
********************
మిచల్ తో కలిసి అక్కడ నుంచి పారిపోయి అభిజిత్ కి కాల్ చేశాడు జనార్ధన్.
గెస్ట్ హౌస్ దగ్గర పంచరత్నాలతో చేసిన ఉంగరాలు పెట్టుకున్న గోకుల్ తో కలిసి డాన్స్ చేస్తూ ఉండగా ఫోన్ రింగ్ అవ్వడం చూసి
"జనార్ధన్ కాల్ చేస్తున్నాడు పని అయిపోయినట్లు ఉంది." అని సంతోషంగా లిఫ్ట్ చేసి "అభీర్ గాడు క్లోజ్ అయిపోయాడా?" అని అడిగాడు అభిజిత్.
"సార్! బుల్లెట్ మురళీజోషి కూతురికి తగిలి చచ్చిపోయింది అక్కడ అభీర్ లేడు సహదేవుడుతో పాటు వేరే మనిషి ఉన్నాడు, మన జాకిని పట్టుకున్నాడు చంపేస్తారు ఏమో అని భయంగా ఉంది." అని చెప్పాడు జనార్ధన్.
"అవునా? ఒక్క నిమిషం లైన్లో ఉండు." అని డాన్స్ చేస్తున్న గోకుల్ దగ్గరికి వెళ్లి విషయం చెప్పాడు అభిజిత్.
ఆ మాట విని ఫోన్ తీసుకుని "జనార్ధన్ నువ్వు మురళి జోషి ఇంటికి వెళ్లి నాకు కాల్ చెయ్!" అని చెప్పాడు ముకుల్.
"సార్ నేను ఇప్పుడు అక్కడికి వెళితే నన్ను చంపేస్తారు." అని భయంగా చెప్పాడు జనార్ధన్.
"పంచరత్నాలు మన దగ్గర ఉన్నంతసేపు అభీర్ ఎవర్ని చంపడు నువ్వు కాసేపు గుడ్ సెక్యూరిటీ ఆఫీసర్ అవ్వు, తరువాత నీ లైఫ్ సెటిల్ అయిపోయా ఆఫర్ ఇస్తాను." అని చెప్పాడు ముకుల్.
"సరే సర్! అక్కడికి వెళ్లి మీకు ఫోన్ చేస్తాను." అని చెప్పి మిచల్ ని గెస్ట్ హౌస్ దగ్గరికి వెళ్ళమని చెప్పి మురళిజోషి ఇంటికి బయలుదేరి వెళ్ళాడు జనార్ధన్.

![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)