31-01-2026, 10:49 AM
Part - 70
సురభి వాసు 7 అయ్యేటప్పటికల్లా నేహా వాళ్ళ ఊరు చేరుకుంటారు. అక్కడ నేహా నాన్నగారైన శ్రీను గారి అడ్రస్ కనుక్కొని వెళతారు.
వీళ్ళు ఇంటికి వెళ్లేటప్పటికీ నేహా వాళ్ళ అమ్మగారు అయిన లక్ష్మి గారు ఇల్లంతా శుభ్రం చేయించేసి ముగ్గులతో ముందు అలంకరిస్తారు.
గుమ్మానికి పచ్చని మామిడి తోరణాలు కడతారు. నలుగురు ముత్తయిదువుల్ని పిలిచి ఇల్లంతా హడావుడి చేస్తూ ఉంటారు.
అది చూసిన సురభి గారికి చాలా బాగా అనిపిస్తుంది. ఇల్లంతా ఇలాగా శుభ్రంగా ఉంచారు అంటే... నేహ కూడా ఇంటిని ఇలాగే ఉంచుతుంది అనుకుంటారు.
వాసుగారికి కూడా ఆ ఎన్విరాన్మెంట్ బాగా నచ్చుతుంది. రోజు హాస్పిటల్సు, మెడిసిన్స్ వాసన మధ్యన ఉన్న వాసు గారికి చాలా ప్లసెంట్ గా అనిపిస్తుంది.
లక్ష్మీగారు కంగారుపడుతూ ఉంటే...సురభిగారు ఆవిడ చేయిపట్టుకుని ఎందుకు మీరు కంగారు పడుతున్నారు. మనం అన్ని ముందే మాట్లాడుకున్నాం కదా... టెన్షన్ పడకండి.
ఎంతైనా మగ పెళ్లి వారు కదా...అందులోనూ మీరు చాలా పెద్ద వాళ్ళు అంటే...పెద్ద చిన్న అని ఏమి తేడా ఉండదండి.
మన మనస్తత్వాన్ని బట్టి ఏదైనా ఉంటుంది. మాకు అలాంటి పట్టింపులు ఏమీలేవు. అయినా రేపు మీ అమ్మాయి మా ఇంటికి వచ్చేస్తే అది కూడా మీది కాదా... అందరూ సమానమేనండి అని చెబుతారు.
సురభి మాట తీరు లక్ష్మీ గారికి బాగా నచ్చుతుంది. ఆవిడ మంచితనం ఏంటో కూడా అర్థం అవుతుంది. తన కూతురి అత్తగారిల్లు చాలా గొప్ప మనసు కలది అని ఆవిడ సంతోషపడతారు.
శ్రీను, వాసు గారు కబుర్లో పడతారు..ఇద్దరూ కూడా చాలా ఫ్రీగా కలిసిపోతారు. వాసుగారి ఫోన్ రింగ్ అవుతూ ఉంటే.. అబ్బా అని తల పట్టుకుంటారు.
ఏమైందండి..ఏదైనా ఎమర్జెన్సీ కాలా అని శ్రీను గారు అడిగితే.. అవునండి చాలా ఎమర్జెన్సీ కాల్. మీ అల్లుడు నుంచే ఈ ఫోను అని చెప్పి..
లిఫ్ట్ చేసి చెప్పరా బాబు అంటే.. నాన్న ఏం చేస్తున్నారు. మాటలు అయిపోయయా... పెళ్లికాయం చేసేసారా అని అడుగుతాడు.
ఒరేయ్ నీ ఆత్రం తగలెయ్య వచ్చి ఎంతసేపు అయింది రా... ఒక్కొక్క పని అవ్వాలి కదా... నీకు నేను అప్డేట్స్ ఇస్తానని చెప్పాను కదా...
ఇంకొకసారి ఫోన్ చేసావు అనుకో.. మొత్తం అన్ని క్యాన్సిల్ చేసేసి.. నీకు పెళ్లి అనే చాప్టర్ లేకుండా క్లోజ్ చేసేస్తాను అర్థం అవుతుందా.. పెట్రా ఫోను అని పెట్టి పెట్టేస్తారు.
శ్రీ ఫోన్ వైపు చూస్తూ నా కంగారు మీకు ఏమి అర్థం కావడం లేదు. ఏంటో అసలు మీరు మా డాడీ ఏనా అనుకుంటూ... ఫోన్నే తదేకంగా చూస్తూ ఉంటాడు.
టైం పాస్ ఎలా చేయాలో అని ఆలోచిస్తూ ఉంటాడు. వర్క్ చేద్దాము అని లాప్టాప్ ఓపెన్ చేస్తాడు. వర్క్ చేయబుద్ది అవదు.
రాజ్ కి కాల్ చేస్తే అని... రాజ్ నెంబర్ ట్రై చేస్తాడు. అమ్మో వద్దులే... వీడికి తెలిసింది అంటే గనక... నన్ను ఒక రేంజ్ లో ఆడుకుంటాడు.
ఇప్పుడు ఏం చేయాలి.. విక్రమ్ కి కాల్ చేయనా అని ఆలోచిస్తాడు. అసలే హనీమూన్ మూడ్ లో ఉన్నాడు. చేస్తే అక్కడి నుంచి ఇక్కడికి ఒక తన్ను తన్నుతాడు.
ఎవరో ఒకరితో మాట్లాడకపోతే నాకు ఈ టెన్షన్ తగ్గదే ఏం చేయాలబ్బా అని బుర్ర బద్దలు కొట్టుకుంటూ ఉంటాడు.
నేహా ఫ్లాట్ కి వెళితే ఎలా ఉంటుంది అని ఆలోచిస్తాడు. మరి ఓవర్గా ఉండదా అని థింక్ చేస్తూ ఉంటాడు. ఒక పని చేద్దాం...
బయటకి వెళ్లి నేహా కోసం తనకి ఇష్టమైన బ్రేక్ ఫాస్ట్ అండ్ రోజెస్ తీసుకువస్తాను. నేహ కి మెసేజ్ చేస్తాడు. మీరు ఏమి బ్రేక్ ఫాస్ట్ ప్రిపేర్ చేయొద్దు నేను తీసుకొస్తాను.
ఇంతకీ నేహా కి ఏమి ఇష్టమో అడిగితే బాగుంటుందా.. వద్దులే..నాలుగైదు రకాలు తీసుకువస్తే తనకు నచ్చింది ఏదో ఒకటి తింటుంది అని.. ప్లాట్ లాక్ చేసుకుని బయటికి వెళ్తాడు. నేహా పెట్టిన మెసేజ్ కూడా చూడడు.
కిందకి వెళ్లి ఏం ఆర్డర్ ఇవ్వాలో తెలియక..లేడీస్ ఎక్కువ ఆయిల్ ఫుడ్ ఇష్టపడతారు అనుకుంటా కదా.... బోండా, పూరి, మసాలాదోస ఎందుకైనా మంచిది ఇడ్లీ కూడా ప్యాక్ చేపిస్తాడు.
పక్కనే రోజస్ కనపడితే అందులో నుంచి..ఫస్ట్ రెడ్ రోజ్ తీస్తాడు. అమ్మో ముందే ఇది ఇచ్చాము అంటే... సీన్ సితార అయిందనుకో వద్దు కష్టం అనుకొని...
ఎల్లో రోజ్ తీసుకుంటాడు. ఇదైతే ఫ్రెండ్షిప్ కి సింబల్ కాబట్టి తను ఏమీ ఫీల్ అవ్వదు అనుకుని అవన్నీ పుచ్చుకొని వెళ్లి నేహా ఫ్లాట్ డోర్ నాక్ చేస్తాడు.
డోర్ తీసిన నేహ ను చూసి శ్రీ కళ్ళు నోరు వదిలేస్తాడు. ఏమైంది శ్రీ గారు అని అడిగితే.. ఆహా ఏమీ లేదు ఈరోజు ఏమిటో చాలా కొత్తగా కనిపిస్తున్నావు అని తదేకంగా చూస్తూ ఉంటాడు.
లోపలికి రండి అని...ఈరోజు ఎందుకో తెలియదు అమ్మ చీర కట్టుకోమంది. అందుకే కట్టుకున్నాను బాగుందా అని అడుగుతుంది.
చాలా ము... అనబోయి ఆ మాట మింగేసి బాగున్నావు అని చెబుతాడు. థాంక్యూ శ్రీ గారు...
ఈ చీరకి ఈ పువ్వు పెట్టుకుంటే ఇంకా బాగుంటావు అని ఆ రోజ్ ఇస్తాడు. థాంక్యూ... నాకు ఎల్లో అంటే చాలా ఇష్టం అని ఆ పువ్వు తలలో పెట్టుకుంటుంది.
తను ఇచ్చిన పువ్వు నేహా అలా పెట్టుకోగానే క్లౌడ్స్ మధ్యలోనే ఉంటాడు. గుండె పైన చెయ్యి వేసి రబ్ చేసుకుంటూ...కూల్ శ్రీ కూల్.
ఇంకా ముందు ముందు చాలా ఉంది అనుకుంటూ డైవర్ట్ అవ్వడానికి... ఇదిగో బ్రేక్ ఫాస్ట్ అని ఇస్తాడు. ఎందుకు శ్రీ గారు ఇన్ని వెరైటీస్ తెచ్చారు.
నేనే ప్రిపేర్ చేసే దాన్ని కదా అంటే... రోజు నువ్వే కదా చేస్తున్నావు. జస్ట్ ఫర్ చేంజ్ అంతే అని ఇస్తాడు. అవన్నీ ఓపెన్ చేసి ఇన్ని రకాలు ఎందుకు.
ఏదో ఒకటి తెస్తే సరిపోతుంది కదా...నీకు ఏమి ఇష్టమో నాకు తెలియదు కదా.. నేను తెచ్చింది నచ్చిన, నచ్చకపోయినా నువ్వు అలా తినడం నాకు ఇష్టం లేదు.
నీకు ఏది ఇష్టమో అదే తిను అని చెబుతాడు. ఒక్క నిమిషం ఆలోచించి రెండు ప్లేట్స్ తీసుకుని అన్ని టిఫిన్స్ ని రెండు ప్లేట్స్ లోనే సర్ది ఒక ప్లేటు శ్రీకి ఇస్తుంది.
నేహ చేసినదాన్ని చూస్తూ ఉంటాడు. ఏమైంది శ్రీ గారు అంటే... ఏమీ లేదు ఏదో ఒకటి తింటావు. మిగిలినవి అన్ని వేస్ట్ అవుతాయి అనుకున్నాను.
బట్ నువ్వు ఏది వేస్ట్ అవ్వకుండా నీటుగా సర్దేవ్ కదా... చాలా ఆశ్చర్యంగా ఉంది. ఇందులో ఆశ్చర్యపడడానికి ఏముంది.
మా నాన్నగారి వ్యవసాయం చేస్తారు కాబట్టి నాకు ఫుడ్ వాల్యూ బాగా తెలుసు అని చెబుతుంది. ఓ...ఏం మాట్లాడాలో తెలియక అవిని ఏమైనా ఫోన్ చేసిందా అని అడుగుతాడు.
వాళ్లు వెళ్ళింది హనీమూన్ కి సార్... ఫ్రెండ్స్ కి ఫోన్ చేస్తూ ఉంటారా అని నవ్వుతుంది. ఆ నవ్వుతో జత కలిపి అది నాకు తెలుసు కానీ ఏం మాట్లాడాలో అర్థం కాలేదు అంతే అని బ్రేక్ ఫాస్ట్ కంప్లీట్ చేస్తారు.
నేహా కాఫీ కలిపి చేతికి ఇస్తుంది. థాంక్యూ అని చెప్పి కాఫీ తాగుతూ ఉంటాడు. నీకు ఒక విషయం చెప్పనా అంటాడు.
చెప్పండి. నీ చేతి కాఫీ తాగుతూ లైఫ్ లాంగ్ బ్రతికేయొచ్చు తెలుసా.. అంత టేస్టీగా ఉంటుంది అని చెబుతాడు.ఏదో మీ అభిమానం శ్రీ గారు.
లంచ్ మాత్రం నేనే ప్రిపేర్ చేస్తాను. మీరు మాత్రం ఏమీ ఆర్డర్ పెట్టొద్దు అని చెప్పి కిచెన్లోనికి వెళ్ళిపోతుంది. నేహా కిచెన్లో లంచ్ ప్రిపేర్ చేస్తూ ఉంటే...
అక్కడ గోడకి నిలబడి నేహా కి కబుర్లు చెబుతూ ఉంటాడు. ఆ కబుర్లకి నేహా నవ్వుతూ గబగబా లంచ్ ప్రిపేర్ చేసి ఇద్దరికీ బాక్సులు ప్యాక్ చేసేస్తుంది.
ఆ బాక్స్ శ్రీ చేతికి ఇచ్చి నేను ఇంకా బయలుదేరుతాను అని చెబుతుంది. ఒకే ఆఫీసులో కలుద్దాము అని శ్రీ కూడా బయటకు వస్తూ ఉంటే..
నేహా ఫోన్ రింగ్ అవుతుంది. ఫోన్ చూసి అమ్మ ఏమిటీ ఈ టైంలో ఫోన్ చేస్తుంది అనుకుంటూ ఫోన్ లిఫ్ట్ చేస్తుంది. అంతే శ్రీ అడుగుల ఆగిపోయి చెవులు రెక్కరించి మరీ వింటూ ఉంటాడు.
శ్రీ కి ఏమి వినిపించదు. కానీ నేహా ఫేసులో రంగులు మారుతూ ఉంటాయి. అది చూసి శ్రీ గుండెల్లో టెన్షన్ మొదలవుతుంది.
ఏమై ఉంటుందా అని తెగ ఆలోచిస్తూ ఉంటాడు. ఫోన్ పెట్టేసి శ్రీవైపు తిరిగి ఇంకా మీరు వెళ్లలేదా అని అడుగుతుంది. వెళుతున్న..
ఏమైంది నీ ఫేస్ ఏదో లాగా ఉంది అని ఇన్ఫర్మేషన్ కోసం అడుగుతాడు.
నేహా ఏమి చెబుతుంది...
కథ కొనసాగుతుంది...

![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)