31-01-2026, 10:47 AM
(This post was last modified: 31-01-2026, 10:48 AM by SivaSai. Edited 1 time in total. Edited 1 time in total.)
Part - 69
నేహ ఏమి చెబుతుందా అని శ్రీ చాలా అత్రంగా ఎదురు చూస్తూఉంటాడు. నేహ ఇబ్బందిగా ఏమి చెప్పాలా అని దిక్కులు చూస్తూ ఉంటే....
ప్లీజ్ నేహ ఒక ఫ్రెండ్ గా అనుకుని చెప్పు. రేపు వచ్చే అమ్మాయి లైఫ్ నాతో హ్యాపీగా ఉండాలి కదా.. అందుకే నేను ఇంత రిక్వెస్ట్ చేస్తున్నాను.
చెప్పు...చెప్పు... ప్లీజ్... ప్లీజ్... అని అడుగుతాడు. మీరు మరీ అంత ఎక్కువ రిక్వెస్ట్ చేయకండి శ్రీగారు చెబుతాను.
ఒక్క నిమిషం కళ్ళు మూసుకుని ఆలోచించి కళ్ళు తెరిచి శ్రీ వైపు చూస్తూ ఇది పూర్తిగా నా వైపు నుంచే చెబుతున్నాను.
అందరి అమ్మాయిలు ఇలాగే ఆలోచించాలి అని ఎక్కడా లేదు. పర్వాలేదు నీ వైపు నుంచి చెప్పు. మిగిలింది నేను అర్థం చేసుకుంటాను అంటాడు.
ఆ మాటకి నవ్వుతూ చూస్తూ మీరు చాలా తెలివైన వాళ్ళు అండి. థాంక్యూ.. థాంక్యూ.. అని ఉబ్బి తబ్బుబ్బి అయిపోతాడు.
మన టాపిక్ ఏటో వెళ్ళిపోతుంది అనుకుంటా అని అంటుంది. ఓకే.. ఓకే... నేనే వెనక్కి వచ్చేస్తున్నాను. ఇప్పుడు చెప్పు ఎలాగా ఉండాలి చేసుకునే వ్యక్తి అని అంటే...
అది అమ్మాయి అయినా అబ్బాయి అయినా సరే.... ముందు ఒకరిని ఒకరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి.
అప్పటివరకు ఇద్దరూ రెండు భిన్న వాతావరణంలో పెరిగి వస్తారు. చిన్నప్పటినుండి కలిసి ఉన్న అమ్మానాన్నలు, సిబ్లింగ్స్ తోనే డిస్టబెన్స్ లు వస్తూ ఉంటాయి.
అలాంటిది విభిన్న వాతావరణంలో పెరిగి ఒకే చోటు ఉండేవాళ్ళ మధ్యన కూడా వస్తూ ఉంటాయి. అలాంటప్పుడు సహనంగా ఉండి సొల్యూషన్ వైపు అడుగువేయాలి గాని..
నువ్వెంత అంటే నువ్వు ఎంత అని అనుకోకూడదు. అది నేనైనా.. నన్ను చేసుకునే వ్యక్తి అయినా సరే అని చెబుతుంది.
ఇంకా అని అడుగుతాడు. ఇంకా అంటే.. ఎంత బిజీగా ఉన్నా సరే... ఒకసారి ఫోన్ చేసి తిన్నావా.. ఏం చేస్తున్నావ్ అని అడిగితే చాలు.
గొడవ జరిగినప్పుడు నువ్వే ముందు సారీ చెప్పాలి అన్న ఇగో కి వెళ్ళకూడదు. భార్యాభర్తలు గా ఇద్దరూ కాదు ఒక్కటే అయినప్పుడు...
అటు పేరెంట్స్, ఇటు పేరెంట్స్ ని కూడా ఈక్వల్ గానే చూడాలి. అప్పుడే కదా భార్యాభర్తల బంధం ఇంకా బలపడుతుంది అంటుంది.
అది ఎలా అంటే... ఫర్ ఎగ్జాంపుల్ మీరే ఉన్నారు అనుకోండి. రేపు మీరు చేసుకున్న అమ్మాయి పేరెంట్స్ ని కూడా మీ పేరెంట్స్ లాగా ట్రీట్ చేశారు అనుకోండి.
ఆ అమ్మాయి హ్యాపీగా ఫీల్ అవుతుంది కదా.. తను కూడా మీ పేరెంట్స్ అలాగే చూస్తుంది కదా.. అప్పుడు మూడు వంతులు ప్రాబ్లమ్స్ సాల్వ్ అయిపోతాయి.
ఫర్ సపోస్ నేను అలాగే ట్రీట్ చేసేను అనుకో.... ఆ అమ్మాయి దాన్ని అలుసుగా తీసుకుంటే అని అనుమానం రైస్ చేస్తాడు.
ఆ మాటకి నవ్వుతూ ఆడవాళ్లకి అనుమానాలు ఎక్కువ అంటారు గాని.. మమ్మల్ని మించిపోయారు మీరు అంటుంది.
అలా కాదు నేహా.. రేపు పెళ్లయ్యాక సంసారం అందంగా సాగిపోవాలి కదా..అందుకే చిన్న చిన్న డిస్టర్బెన్స్ లకి ముందే సొల్యూషన్ దొరికింది అనుకో.. క్లియర్ చేసేసుకుంటే బెటర్ అని నా ఉద్దేశం అంటాడు. బిజినెస్ మాన్ అనిపించుకున్నారు.
అందరి అమ్మాయిలు గురించి నాకు తెలియదు గానీ నాలాంటి అమ్మాయి అయితే మాత్రం.. మీ ప్రేమను గాని మీరు ఆ అమ్మాయి తల్లిదండ్రులు విషయంలో తీసుకునే శ్రద్ధని అలుసుగా తీసుకోదు.
ఇంకా అని అడుగుతాడు ఇంకా ఏముంటాయి శ్రీగారు అంటే... అదే మీ లేడీస్ కి షాపింగ్ అంటే ఇంట్రెస్ట్ ఉంటుంది కదా..
రోజు షాపింగ్ కి తీసుకువెళ్లాలా.. అకేషన్ వైస్ గాన.. అని అడుగుతాడు లేదా కార్డు ఇస్తే సరిపోతుందా...
మీరు కార్డు ఇచ్చి కొనుక్కోఅన్న.. అది ఎన్ని లక్షల పెట్టి కొన్నా సరే.. మీరు తెచ్చే రెండు రూపాయల గులాబీకే విలువ ఎక్కువ ఉంటుంది.
మీ చేతితో ఒక గులాబీ. ఒక ఐస్ క్రీము లేదో తనకి ఇష్టమైన చిన్న చిన్న సరదాలు సరే...వంద రూపాయల చీర అయినా సరే..
అది మీ చేతితో తెచ్చిన రోజున ఉన్న సంతోషం తన చేతులతో ఎన్ని లక్షలు పెట్టి కొనుక్కున్నా సరే ఉండదు. ఇది మాత్రం నేను పక్కా చెప్పగలను. అది ఎలాంటి అమ్మాయి అయినా సరే అంటుంది.
ఇప్పటికి చాలు కదా ఈ ఇన్ఫర్మేషన్. రూమ్ కి వెళదామా అంటుంది. సరే పద.. చాలా లేట్ అయిపోయింది. ఫ్లాట్ వరకు వచ్చి దింపి తన ఫ్లాట్ కి వెళ్ళిపోతాడు.
ఫ్లాట్లోకి వచ్చిన శ్రీ నేహా చెప్పిన దానికి మురిసిపోతూ నువ్వు ఎంత బంగారమే... చాలా సింపుల్ సింపుల్ గా ఉన్నాయే చెబుతున్నావు.
నేను నీకు ప్రామిస్ చేస్తున్నాను. నువ్వు చెప్పినట్టే గానే మీ పేరెంట్స్ ని, మా పేరెంట్స్ ని ఈక్వల్ గానే చూస్తాను. ఎందుకో తెలుసా బంగారం నీ మనసు అంత స్వచ్ఛమైనది. ఇక నా పేరెంట్స్ విషయంలో కూడా నాకు ఎటువంటి బెంగా లేదు.
టైమెంతయింది అని చూస్తాడు. అది ఇంకా పదే చూపిస్తూ ఉంటుంది. అబ్బా ఈ గడియారం కూడా ఈరోజు ముందుకి కదలడంలేదు.
కష్టమైనా సరే నిద్రపోవాలి అని అలారం సెట్ చేసుకుని మంచం ఎక్కుతాడు. నేహ ఊహల్లో తేలుతూ ఎప్పటికో నిద్రపోతాడు.
పొద్దున్నే నాలుగింటికి ఫోన్ మోగుతుంటే వాసు చిరాగ్గా ఈ టైంలో ఎవరు సురభి చూడు అని అంటారు. ఏదైనా ఎమర్జెన్సీ కాల్ ఏమో చూస్తాను అని ఆవిడ కంగారుగా మంచం దిగి ఫోన్ లిఫ్ట్ చేసి..
నిద్రమత్తులోనే హలో అంటారు. హలో మమ్మీ అనగానే.. ఒక్కసారిగా ఉలిక్కిపడి ఫోన్ వైపు చూసుకొని శ్రీ అంటారు. అంతే వాసుగారి నిద్రమత్తు కూడా ఎగిరిపోయి..
శ్రీ ఏంటి ఈ టైంలో..బాగానే ఉన్నాడా అని కంగారుగా మంచం దిగి స్పీకర్ ఆన్ చెయ్ అంటారు.. మమ్మీ నాకేమైంది. నేను బాగానే ఉన్నాను అని చెబుతాడు.
మరి ఈ టైం లో ఫోన్ ఏంట్రా అంటే... ఈ టైం లో అంటావేంటి మమ్మీ తెల్లారిపోయింది అంటాడు. సురభి గారు టైం చూసి ఇంక నాలుగే అయింది కదా అంటే...
అదే నెక్స్ట్ డే వచ్చేసింది కదా.. మీరు ఇంకా లేచి ఉండరని లేపుదామని కాల్ చేశాను అని చెబుతాడు. ఆ మాటలకు వాసుగారు పళ్ళునూరుతూ..
ఒరేయ్ ఎదవ... మంచి నిద్ర పాడుచేశావు కదరా... నీ పెళ్లి నా చావుకి వచ్చేటట్టు ఉంది. వెళతామని చెప్పాను కదా అంటే...
మీకు లేట్ అవుతుందేమో అని లేపాను అంతే డాడీ.గుడ్ మార్నింగ్. ఎలాగా లేచారు కదా.. రెడీ అయి బయలుదేరిపోండి అని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు.
వీడిని ఏ టైం లో కన్నావే బాబు. నా ప్రాణం తోడేస్తున్నాడు అంటే...నవ్వుకుంటూ పెళ్ళికి ముందు మీరేం చేసారో మరి అంటుంది.
ఆ మాటకి వాసు గారు సిగ్గుపడుతూ...ఆ రోజులే వేరు అంటాడు. కదా..మీకు ఎలాగో మీ అబ్బాయి కూడా అంతే. అదంతా వయసు ప్రభావం అని చెప్పి ఫ్రెష్ అవ్వడానికి అని బాత్రూంలోకి దూరతారు.
వాసుగారు కూడా శ్రీ ఆత్రానికి నవ్వుకుంటూ... పిచ్చఎదవ పెళ్లి అవుతేగానీ వీడికి తెలుసురాదు. హ్యాపీగా బ్యాచిలర్ లైఫ్ని ఎంజాయ్ చేయకుండా పెళ్లి పెళ్లి అని ఎగురుతున్నాడు.
సురభి రెడీ అయిన తర్వాత వాసు కూడా రెడీ అయ్యి దేవుడి గదిలో దీపం వెలిగించి..అన్నీ సర్దుకుని బయటికి వస్తారు.
వాసు మరీ బొత్తిగా ఆరే అయ్యింది. ఇక్కడ నుంచి ఒక గంటలో వెళ్ళిపోతాము. మరీ ఏడింటికే వెళితే బాగోదేమో అంటే...
ఆ మాటకి కోపంగా చూస్తూ... ఆ ముక్క నాకు కాదు. నీ కొడుక్కి చెప్పు అంటున్నంతలోనే. మళ్లీ ఫోన్ రింగ్ అవుతుంది.
మళ్లీ ఎవరు అనుకుంటూనే ఫోన్ చూస్తారు. ఇంకెవరు నీ కొడుకే అయి ఉంటాడు అనగానే.. నిజమే వాసు నీకు ఎలా తెలిసింది.
వాడు ఆత్రం అర్ధం కావడం లేదా..లిఫ్ట్ చెయ్ లేకపోతే అక్కడ ఎదవకి టెన్షన్ తో మోషన్స్ అవుతాయి అంటారు.
అబ్బా వాసు మరీ అంత ప్రెస్టేట్ అవ్వకు అని చెప్పి.. లిఫ్ట్ చేసి చెప్పరా అంటే.. మమ్మీ బయలుదేరారా అంటే.. ఒరేయ్ ఇంకా ఆరే అయింది రా.
ఏడు అయ్యేటప్పటికీ వెళ్ళిపోతాము. మరీ అంత పొద్దునే వెళ్తే బాగోదు రా అంటే.. వాళ్ళు అలాగే ఏమీ అనుకోరు మమ్మీ.
అయినా పల్లెటూరు అంటే అందరూ ఎర్లీగా లేచిపోతారు కదా.... ఎంత లేచినా సరే వాళ్ళ పనులు వాళ్ళు ఉంటాయి కదరా..
చెప్పా పెట్టకుండా వెళ్ళిపోతే బాగోదు రా.. నా మాట విన రా.. ఏమీ అనుకోరు కానీ మీరు బయలుదేరండి కంగారుపెట్టి కార్ ఎక్కిస్తాడు.
కారు ఎక్కిన వాసు గారు డ్రైవర్ తో నన్ను ఆ ఊరు వెళ్లాక లేపు. అప్పుడు దాకా అసలు లేపొద్దు అని భార్య వైపు తిరిగి.. ఫోన్స్ రెండు సైలెంట్ లో పెట్టి నువ్వు కూడా పడుకో.
లేకపోతే ఐదు నిమిషాలకు ఒకసారి ఫోన్ చేస్తూనే ఉంటాడు అని. ఇద్దరి ఫోన్లు తీసికుని సైలెంట్ లో పెట్టేసి పడుకుంటారు.

![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)