Thread Rating:
  • 4 Vote(s) - 2 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Emergency
#6
(29-01-2026, 01:37 PM)Pallaki Wrote: అందరికీ నమస్కారం 
నాకు కష్టం వచ్చింది

గత ఏడాదిన్నరగా హైదరాబాదులో రైటర్ గా అవకాశాల కోసం వెతికితే పోయిన నవంబర్లో ఈటీవీ విన్ వాళ్ళ దెగ్గర ఉద్యోగం మరియు కొన్ని ఫ్రీలాన్సర్ పనులు దొరికాయి. ఈ ఏడాదిన్నర ఇక్కడ హైదరాబాదులో అయిన ఖర్చులు తీర్చుకుంటూ రెండు షార్ట్ ఫిలిములు కూడా తీసాను. కొన్ని అప్పులు కూడా తీర్చాను. అన్ని కష్టాలు పడ్డందుకు చివరికి సెట్ అయ్యాం, ఇక మెల్లగా పేరు సంపాదించుకోవాలి అనుకుంటున్న సమయంలో మళ్ళీ ఎదురు దెబ్బ. ఒకడు సినిమా తీస్తాను అని నా దెగ్గరికి వచ్చి నాలుగు నెలలు తిప్పించుకుని చివరికి నాతో ఉద్యోగం మానిపించి వేరే ఆఫీస్ అంటూ అక్కడికి షిఫ్ట్ చేయించి ఇప్పుడు ఫోను ఎత్తకుండా తప్పించుకున్నాడు. వేరే ఫోను నుంచి చేసి మాట్లాడితే సారీ అన్నాడు. నేను అతన్ని నమ్మి ఉద్యోగం కూడా వదిలేసి ఇప్పుడు రోడ్డున పడ్డాను.

అన్నీ వదిలేసి ఊరు వెళ్ళిపోయి ఓ ఏడు పని చేసుకోవడం తప్ప వేరే దారి కనిపించడంలేదు. ఏడాది ఊరికి వెళ్ళిపోతే పరిస్థితుల వల్ల రైటర్ & డైరెక్టర్ అవ్వాలనుకున్న నా కల, కలగానే మిగిలిపోతుందేమోనని భయంగా ఉంది. ఎటు కానీ స్థితి నాది.  ఈ ఎడాదిన్నర నాకు తెలిసిన వాళ్ళ దెగ్గర సాయం పొందాను. వాళ్లని మళ్ళీ అడగలేను. అన్ని వైపులా ఇరుక్కుపోయాను. తెలిసిన xossipy స్నేహితుడు సైట్లో ప్రయత్నించు ఇన్ని కథలు రాసావు కదా నీ దెగ్గర టాలెంటు ఉంది. ఎవరో ఒకరు సాయం చెయ్యచ్యు, నీకు చేసిన సాయం వృధా పోదు అని సలహా ఇచ్చాడు.

అందుకే మీకు మెసెజ్ పెడుతున్నాను. నాకోసం మీరేమైనా ఫండ్ రైసింగ్ చెయ్యగలరా. మళ్ళీ అవకాశాలు దొరకబచ్చుకుని సెట్ అవ్వాలంటే నాకో రెండు నెలలు పడుతుంది. రెండు నెలల్లో మళ్ళీ తిరిగి ఇచ్చేస్తాను. (నా జీవితంలో అక్షిత అనే అమ్మాయిని కోల్పోయిన తరువాత మళ్ళీ ఇప్పుడే నా కళ్ళలో నీళ్లు తిరిగడం) 

ధన్యవాదాలు
ఇది కథకి ఉపోద్ఘాతం కాదు మిత్రులారా. నాకితను, ఇతని పరిస్థితి పర్సనల్గా తెలుసు, నాకు వీలైనంత సాయం చేసాను. ఇన్ని రోజులు ఇతని కథలను ఫ్రీగా చదివి ఆనందించాము కదా...వీలైతే సహాయం చేయగలరు...అతనికి DM చేయండి ప్లీజ్. 
    :   Namaskar thanks :ఉదయ్
[+] 2 users Like Uday's post
Like Reply


Messages In This Thread
Emergency - by Pallaki - 29-01-2026, 01:37 PM
RE: Emergency - by Paty@123 - 30-01-2026, 11:29 AM
RE: Emergency - by Pallaki - 30-01-2026, 11:40 AM
RE: Emergency - by GodNika - 30-01-2026, 11:53 AM
RE: Emergency - by Pallaki - 30-01-2026, 12:38 PM
RE: Emergency - by Uday - 30-01-2026, 01:32 PM
RE: Emergency - by Pallaki - 30-01-2026, 02:10 PM
RE: Emergency - by Pallaki - 30-01-2026, 03:43 PM
RE: Emergency - by Pallaki - 06-02-2026, 03:43 AM
RE: Emergency - by Paty@123 - 06-02-2026, 07:45 AM
RE: Emergency - by Blackranger22 - 06-02-2026, 01:13 PM



Users browsing this thread: 1 Guest(s)