29-01-2026, 10:57 PM
(This post was last modified: 29-01-2026, 10:58 PM by SivaSai. Edited 1 time in total. Edited 1 time in total.)
Part - 68
సత్యవతి గారి మాటలకి బిందు కంగారుగా చూస్తూ.. లేదు పెద్దమ్మగారు నేను మారాను. మీకు ఎక్కడ సాక్ష్యం కావాలన్నా నేను చెబుతాను. నన్ను నమ్మండి అంటుంది.
నువ్వు చెప్పేది నిజమైతే.. అందరికీ మంచిది. ఎప్పుడో ఒకప్పుడు నీ కొడుకు మారితే నీ దగ్గరికి వస్తాడు.ఇక నేను వెళ్తాను అని చెప్పి బయటికి వస్తారు.
వెళుతూ ఉన్న సత్యవతిగారు ఆగి వెనక్కి తిరిగి నీకు ఏమి ఊసుపోకపోతే ఆ గార్డెన్ వర్క్ లాంటివైనా చేసుకోవచ్చు.
అది కూడా నీ ఇష్టం. సుఖపడిన శరీరం, ప్రాణం ఒక్కసారిగా పని చేయాలంటే అలసటగానే అనిపిస్తుంది. కానీ పనిలో ఉంటేనే మన బుర్ర సరిగ్గా పనిచేస్తుంది.
మనసు ఆధీనంలో ఉంటుంది. నేను చెప్పాల్సింది చెప్పాను ఆ పైన నీ ఇష్టం అని చెప్పి వెళ్ళిపోతారు.
వెళ్ళిపోతున్న పెద్దావిడని చూస్తూ బిందు సైలెంట్ గా అక్కడ కూర్చుని ఆలోచిస్తూఉంటుంది.
కొంచెం సేపటికి లేచి వెళ్లి గార్డెన్లో పనిచేస్తూ ఉంటుంది. అప్పుడే వచ్చిన ధనుంజయ్ అది చూసి సైలెంట్ గా లోపలకి వెళ్ళిపోతాడు.
ఆ రోజంతా బిందు పనిచేస్తూనే ఉంటుంది. పనిలో పడి ఆలోచనను కూడా పక్కకి వెళ్ళిపోతాయి. మధ్యాహ్నం భోంచేసి పడుకోగానే నిద్ర పట్టేస్తుంది.
సాయంత్రం లేచిన తర్వాత చాలా ఫ్రెష్ గా అనిపిస్తుంది. అప్పుడే బిందుకి అర్థమవుతుంది. పని విలువ, నిద్ర విలువ, భోజనం విలువ.
శ్రీ సాయంత్రం ఆఫీసు నుంచి రాగానే వాళ్ళ అమ్మగారికి కాల్ చేస్తాడు. ఆ ఫోన్ చూసిన వాసు చూసావా నీ కొడుకు ఎప్పుడైనా మనకి ఫోన్ చేశాడా..
ఏదో వారానికి ఒక రోజు ఫోన్ చేసి..హౌ ఆర్ యు మామ్.. హౌ ఆర్ యు డాడ్.. బాయ్ అని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు. ఇప్పుడు వాడికి అవసరమని ఎన్నిసార్లు ఫోన్ చేస్తున్నాడు చూడు అని అంటారు.
అబ్బా ఏదో ఒకటి చేస్తున్నాడు కదా అని చెప్పి...లిఫ్ట్ చేసి చెప్పరా అంటే...ఎక్కడున్నారు మమ్మీ అని చాలా స్మూత్ గా అడుగుతాడు.
నీ వాయిస్ కి ఈ మాట తీరు ఏమి సెట్ అవ్వడం లేదు గాని మేటర్ లోకి రా అంటారు. నువ్వు చాలా ఇంటలిజెంట్ మమ్మీ ఇట్టే కనిపెట్టేస్తావు అంటే...
పొద్దున్నే ఎవరో ఈ బుర్రతో డాక్టర్ ఎలా అయ్యావు అని అడిగారు అని అంటుంది. అప్పుడు ఏదో అంటాము. అన్ని గుర్తుపెట్టుకుంటే ఎలా...
ఇంతకీ ఏం చేస్తున్నారు అని అడుగుతాడు. ఇప్పుడే హాస్పిటల్ నుంచి ఇంటికి వెళుతున్నాము. ఏదైనా చెప్పాలా అంటే...
ఏంటి మమ్మీ కొడుకు ఫోన్ చేస్తే ఏమైనా చెప్పాలా అని అడుగుతారా? ఏం చేస్తున్నావు, తిన్నావా ఇంకేంటి సంగతులు అని అడుగుతారు కానీ.... ఒరేయ్ మరి నీ యాక్షన్ ఓవర్గా లేదా...
మమ్మీ అంటూ గారాలుపోతాడు. ఈ వయసులో నువ్వు అలా గారాలు పోతే చూడ్డానికి చాలా చండాలంగా ఉంటుంది గానీ... మ్యాటర్ ఏంటో చెప్పరా బాబు..నిన్ను ఇంకా అడగలేక పోతున్నాను అని తల పట్టుకుంటారు.
రేపు ఎన్నింటికి బయలుదేరుతున్నారు. ఎక్కడికి రా అని తెలిసిన తెలియనట్టుగా అడిగితే... అదేంటి మమ్మీ రేపు మీరు నేహా వాళ్ళ ఊరు వెళ్లాలి కదా...
మర్చిపోయారా... అసలు ఎలా మర్చిపోయారు అని ఆవేశంగా అరుస్తూ ఉంటాడు. ఒరేయ్ ఇప్పుడు దాకా బాగానే మాట్లాడావు కదరా... ఇప్పుడు కాకి లాగా అరుస్తావ్ ఎందుకు...
వెంటనే శ్రీ కూల్ అయ్యి అది కాదు మమ్మీ మీరు హాస్పిటల్ పనిలో బిజీగా ఉంటారు కదా... ఆపరేషన్స్ చేసి, చేసి మీ బ్రెయిన్ అలసిపోయి ఉంటుంది కదా.. గుర్తుంటుందో లేదో అని గుర్తు చేయడానికి ఫోన్ చేశాను అని చెబుతాడు...
వెంటనే వాసు గారు మాకు గుర్తు ఉంది లేరా...నువ్వు బుక్ అయిపోతాను అని చెబుతుంటే నేను మాత్రం ఎందుకు ఆగుతాను..
రేపే వెళ్లి మాట్లాడదాము అని నవ్వుతూ చెబుతారు. డాడ్ అంటే మెలికలు తిరుగుతాడు. ఒరేయ్ నువ్వు అక్కడ మెలికలు తిరగకు.
నాకు సిగ్గుగా ఉంది అంటే.. నేను మెలికలు తిరుగుతున్నట్టు మీకు ఎలా తెలుసు. నేను నీ బాబుని రా...ఆ మాత్రం తెలియకుండానే నిన్ను పెంచాను అంటావా...
రేపు అక్కడికి వెళ్లాక నీకు వీడియో కాల్ చేసి మొత్తం లైవ్ చూపిస్తాను. సరేనా ప్రస్తుతానికి ఫోన్ పెట్టేయరా.. మా బుర్రలు తినకు అని చెప్పి బాయ్ అని ఫోన్ కట్ చేస్తారు.
సురభి నవ్వుతూ ఎందుకు వాసు వాడిని అలా టీస్ చేస్తున్నావు. ఇప్పుడే కదా నీ కొడుకు దొరికేది. తర్వాత ఎలాగూ మనకు దొరకడు.కోడలు చేతిలో ఎలాగ బుక్ అయిపోతాడు.
అంత నమ్మకం ఏంటో వచ్చే అమ్మాయి మీద అని అడిగితే.. వాసుగారు నవ్వుతూ నేహా అవినినీ ప్రొటెక్ట్ చేసిన విధానం నాకు బాగా నచ్చింది.
తనకి ఎంత అవకాశం ఉన్నా సరే తన పరిధిలోనే తను ఉన్నది చూడు అది ఇంకా బాగా నచ్చింది. నీ కొడుకు తింగరతనానికి ఆ అమ్మాయి నిదానమే కరెక్ట్.
పో వాసు... నా కొడుకు ఏమి తింగరోడు కాదు అంటే... ఓ... అవునా...ఆ మాట ఏదో నీ గుండెల మీద చెయ్యి వేసుకుని చెప్పు.
వాసు... అని చిరుకోపంగా చూస్తుంది. చూసావా నీకు కూడా తెలుసు కానీ.. తల్లి మనస్సు కదా ఒప్పుకోలేక పోతుంది.
రేపు అక్కడికి పట్టికెళ్లడానికి ఏమేమి కావాలో చెబితే వెళుతూనే షాపింగ్ చేసి వెళ్ళిపోదామని చెబుతాడు. సరే అని చెప్పి మొత్తం లిస్ట్ అంతా భర్త చేతికి చేస్తుంది. అవి చూసి మొత్తం షాపింగ్ కంప్లీట్ చేసుకుని ఇంటికి వెళ్ళిపోతారు.
శ్రీ కి ఆ రాత్రి నిద్ర పట్టక హాల్లోనే తిరుగుతూ ఉంటాడు. ఎంత క్లాక్ వైపు చూస్తున్న దాని టైం కి అది తిరుగుతూ ఉంటుంది.
ఇంక లాభం లేదు అనుకుని వెళ్లి నేహా ఫ్లాట్ డోర్ కొడతాడు. ఈ టైంలో ఎవరూ అనుకుంటు వచ్చి డోర్ తీస్తుంది.
ఏంటి సార్ ఈ టైం లో ఏదైనా అవసరమా అని అడిగితే.. ఏం చెప్పాలో తెలియక అది... అది... అంటుంటే పర్వాలేదు చెప్పండి సార్.
తప్పుగా అనుకోవు కదా అంటాడు. లేదు సార్ అనుకోను చెప్పండి అంటుంది. నువ్వు మళ్ళీ నన్ను సార్ అని పిలుస్తున్నావు.
ఫ్లోలో వచ్చేసింది శ్రీ గారు చెప్పండి అంటే... విక్రమ్ కూడా లేడు కదా నాకు అసలు నిద్ర పట్టడం లేదు అని అంటాడు. ఆ మాటకి శ్రీని డౌట్ గా చూస్తుంటే....
ఏంటి అలా చూస్తున్నావు అని...తను ఏం మాట్లాడాడో అర్థం అయ్యి ఛీ.... ఛీ...ఒక్కడినే ఉంటే నిద్ర పట్టడం లేదు.
అదే నేను చెప్పింది అంటాడు.
ఓ అవునా అయితే ఏం చేయాలి అని అడుగుతుంది. నేహకి కూడా అలాగే ఉంటుంది. ఇన్ని రోజులు అవని తో ఉండి ఒక్కసారిగా ఒంటరిగా ఉండాలి అంటే బోర్ గా అనిపిస్తుంది. కానీ ఆడపిల్లగా తన బయటపడలేక పోతుంది.
అలా సరదాగా వాకింగ్ కి వెళదామా..వస్తావా అని అడుగుతాడు. నేహకి కూడా అది బానే అనిపించే సరే పదండి శ్రీగారు అని ఫ్లాట్ కి లాక్ వేసి శ్రీ తో కలిసి అడుగులు వేస్తుంది.
శ్రీ నేహా పక్కనే నడుస్తూ రేపటితో మన మధ్యన ఉన్న దూరం అంతా తగ్గిపోతుంది. అప్పుడు ఇలా పక్క పక్కనే నడుస్తూ, నా చేతి వేళ్ళని నీ చేతి వేళ్ళతో పెనువేసి..
నువ్వు నా భుజంపై తల పెట్టుకుని కబుర్లు చెబుతూ నడుచుకుంటూ వెళుతూ ఉంటే అని ఊహాలోకంలోనికి వెళ్ళిపోతాడు.
లిఫ్ట్ ఓపెన్ అయిన శ్రీ లిఫ్ట్ ఎక్కకుండా అలా ఊహా లోకంలోనే ఉండిపోతాడు. శ్రీ గారు ఏమైంది మీకు అని నేహా గట్టిగా పిలుస్తుంది.
అప్పుడు మన లోకంలోనికి వచ్చి.. నాకేమవుతుంది.. ఏమీ అవలేదు అని గబగబా లిఫ్ట్ ఎక్కుతాడు. ఈ మధ్యన ఎందుకు మీరు చాలా పరధ్యానంగా ఉంటున్నారు.
ఒకసారి చెక్ చేపించుకుంటే మంచిదేమో..జస్ట్ ఒక ఫ్రెండ్ గా చెబుతున్నాను అంతే తప్పుగా అనుకోకండి అంటుంది.
అయ్యో నా బంగారం పెళ్లికి ముందే మొగుడి ఆరోగ్యం గురించి ఎంత జాగ్రత్త. ఈ పరధ్యానం అంతా నీవల్లనే వచ్చింది.
ఇది ప్రేమ జబ్బు అంటారు. నీకు అంటుకున్నాక అది నీకు కూడా తెలుస్తుంది బంగారం అనుకుని అలాగా... అలాగే..
అని చెబుతాడు.
లిఫ్ట్ దిగి ఇద్దరూ మెల్లిగా నడుచుకుంటూ వెళతారు.ఆ చల్లగాలికి మనసు ప్రశాంతంగా అనిపిస్తుంది. శ్రీకి మాత్రం నేహా నడుం చుట్టూ చెయ్యి వేసి దగ్గరికి లాక్కుని నడవాలని కోరిక గట్టిగాఉంటుంది.
ఒకసారి ఇమేజిన్ చేసుకుంటాడు. నేహా నడుము చుట్టూ చెయ్యవేసి దగ్గరికి లాక్కోవడం...వెంటనే నేహ.. శ్రీ చెంప పైన చేతిముద్ర వేయడం కూడా...
వెంటనే మన లోకంలోకి వచ్చిపడి అమ్మో అప్పుడే ఇలా చేయకూడదు. చేస్తే ఇంకా అంతే సంగతులు. నామీద బాడ్ ఒపీనియన్ వచ్చేస్తుంది.
నేహ అని పిలుస్తాడు. చెప్పండి శ్రీ గారు అంటే.. పెళ్లి మీద నీ ఒపీనియన్ ఏమిటి అని అడుగుతాడు. దేనికి శ్రీగారు అంటే..జస్ట్ ఏదో ఒకటి మాట్లాడాలి కదా..
అందుకే క్యాజువల్ గా అడిగాను. పెళ్లి చేసుకునే అబ్బాయిలో ఎలాంటి క్వాలిటీస్ కావాలి నీకు అని అడుగుతాడు.
ఒక్క నిమిషం మౌనంగా ఉండి అప్పుడు చెబుతుంది. పెళ్లి అంటే నాకు అర్థమైనంత వరకు ఒకరి కోసం ఒకరి ఉండడం. ఎన్ని అవాంతరాలు వచ్చినా ఒకరి చెయ్యి ఒకళ్ళు వదలకుండా ఉండడం.
మూడో వ్యక్తి అది ఎవరైనా సరే అబ్బాయి తల్లిదండ్రులైన, ఇటు నా తల్లిదండ్రులైనా సరే, ఇంకా ఎవరైనా సరే.. మా బంధం మధ్యలోకి రానివ్వకూడదు.
అంటే నా ఉద్దేశం తొందరగా చెప్పుడు మాటలు విని బంధాన్ని వీక్ చేసుకోకూడదు అని చెబుతుంది.
మరి చేసుకునే అబ్బాయి విషయంలో...
ఇప్పుడు అది అవసరమా శ్రీ గారు అంటే...ప్లీజ్ నేహా చెప్పు. నేను ఎలాగో పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నాను. నాకు కొన్ని తెలుసాయి అనుకో...నన్ను నేను మార్చుకునేది ఉంటే మార్చుకోవచ్చు కదా... చెప్పు ప్లీజ్.....ప్లీజ్...
అని అడుగుతాడు.
నేహా ఏమని చెబుతుంది...
కథ కొనసాగుతుంది...

![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)