29-01-2026, 10:52 PM
ఎపిసోడ్ 49
బేరా అడవిలో కొండా మీద ఉన్న గుడానికి వచ్చి తన వాళ్ళు అందరు చనిపోయి ఉండడం చూసి కోపంతో ఐదుగురుతో కలిసి వెళ్లి గెస్ట్ హౌస్ లో ఉన్న జేమ్స్ మనుషుల్ని చంపి జేమ్స్ ద్వారా జరిగిన విషయం మొత్తం తెలుసుకుని అతన్ని సహదేవుడికి అప్పగించాడు అభీర్.
*****************
అమ్మవారి పాదాల దగ్గర ఉన్న జేమ్స్ వైపు చూసి "నేను ఇచ్చిన మాట తప్పను, నా చేతులతో నిన్ను చంపను." అని సహదేవుడి వైపు చూశాడు అభీర్.
ఆ మాట విని కోపంతో వెళ్లి జేమ్స్ తలని తన రెండు చేతులతో మొండెం నుంచి వేరు చేసి దూరంగా గిరాటు వేసి ఏడుస్తూ ఆవేశంతో గట్టిగా అరిచాడు సహదేవుడు.
తన తల్లిదండ్రులకి చనిపోయిన తన వాళ్ళకి జంతువులకి దహన సంస్కారాలు చేసాడు అభీర్.
"నాయకుడా! మరి ఈ దుర్మార్గుల శరీరాలని ఏం చేద్దాము?" అని అడిగింది రియా.
"సింబా! నీ సైన్యాన్ని తీసుకురా..! వీళ్ళ శరీరంలో ఒక్క ఎముక కూడా కనపడకూడదు." అని ఆవేశం గా చెప్పాడు అభీర్.
ఆ మాట విని అరుస్తూ ఆకాశంలోకి ఎగిరి కాసేపటిలో తన సైన్యంతో అక్కడ వాలి జేమ్స్ మనుషులందరిని ఎముక కూడా మిగల్చకుండా తిన్నాయి రాబందులు.
ఐదుగురి వైపు చూసి "ఇక్కడికి వస్తున్న మనవాళ్ళని తీసుకుని మీరు వెనక్కి వెళ్లిపోండి నా దగ్గర నుంచి పిలుపు వచ్చేంతవరకు వేచివుండండి." అని చెప్పాడు అభీర్.
"నాయకుడా! ఇక్కడికి వస్తున్న మనవాళ్ళతో కలిసి యుద్ధం ప్రకటిద్దాము ఎవరిని వదలకూడదు." అని కోపంగా చూస్తూ చెప్పాడు బైరి.
"ఆలోచన లేకుండా ఆవేశంగా యుద్ధానికి వెళితే మన వాళ్ళందరినీ నష్టపోతాము, ఇకనుంచి మన తెగలో ఒక్క ప్రాణం పోవడం కూడా నాకు ఇష్టం లేదు.
నేను సహదేవుడితో కలిసి వెళ్లి ఆ పంచరత్నాలు స్వాధీనం చేసుకున్న తరువాత సింబా ద్వారా మీకు కబురు పంపుతాను అప్పుడు నా దగ్గరకు రండి. అప్పటివరకు ఎప్పటిలాగే మీ ప్రదేశాలలో ఉండండి." అని చెప్పాడు అభీర్.
"మరి ఈ లోపు ఈ ప్రదేశాన్ని వాళ్ళు ఏదైనా చేస్తే మన పూర్వీకులు దైవానికి ఇచ్చిన మాట ఏమవుతుంది?" అని అడిగాడు అగస్త్యా.
"ఈ ప్రదేశంలో ఒక్క రాయిని కూడా ఎవరు ముట్టుకోలేరు నేను మాట ఇస్తున్నాను. మీరు వెళ్లి రండి." అని చెప్పాడు అభీర్.
"సరే నాయకుడా! నీ పిలుపు కోసం ఎదురు చూస్తూ ఉంటాము." అని అక్కడి నుంచి బయలుదేరారు ఐదుగురు.
సహదేవుడి చేతిలో ఉన్న రెండు పులి పిల్లలని పక్కనే ఉన్న ఏనుగు పిల్లని చూసి "ఇవి మనతో ఉండడం క్షేమం కాదు వీటిని క్షేమంగా చూసుకునే వారి దగ్గర వదిలి వెళదాము." అని చెప్పాడు అభీర్.
"సరే నాయకుడా!" అని అడివి వైపు బాధగా చూస్తూ అభీర్ వెనకాల నడిచాడు సహదేవుడు.
పులి పిల్లలని ఏనుగు ని అటవీ సంక్షేమ కేంద్రంలో ఉంచి "జాగ్రత్తగా చూసుకోండి." అని చెప్పి వాటికి కన్నీటితో వీడ్కోలు చెప్పి సహదేవుడితో కలిసి ఢిల్లీ బయలుదేరాడు అభీర్.
***********
మరుసటి రోజు జేమ్స్ ఫోన్ కలవకపోవడంతో ముకుల్ దగ్గరకి వచ్చి "సార్! అభీర్ మనవాళ్ళని ఏదో చేసి ఉంటాడు వాడిని మనం తక్కువ అంచనా వేస్తున్నాము." అని చెప్పాడు శివమణి.
"అంకుల్! ఒక్కసారి మినిస్టర్ జావిద్ కి కాల్ చేసి అడవిలో ఏమి జరుగుతుందో తెలుసుకోమని చెప్పండి." అని చెప్పాడు అభిజిత్.
అంతలో ఫోన్ రింగ్ అవడం చూసి "జావీద్ గారు కాల్ చేస్తున్నారు." అని నవ్వుతూ ఫోన్ లిఫ్ట్ చేసి "హలో మినిష్టర్ గారు చెప్పండి?" అన్నాడు గోకుల్.
"అడవి దగ్గర మీ వాళ్ళు ఎవరు అడ్రస్ లేరు మీరందరూ కొంచెం జాగ్రత్తగా ఉండండి." అని చెప్పాడు జావిద్.
ఆ మాట విని ఫోన్ పెట్టేసి "అడవి దగ్గర మనవాళ్ళు ఎవరు కనిపించడం లేదంట!" అని చెప్పాడు గోకుల్.
"అంటే!కచ్చితంగా అభీర్ అక్కడికి వచ్చి ఉంటాడు నాకు తెలిసి మనవాళ్ళు ఎవరు బ్రతికి ఉండరు, వాడు కచ్చితంగా ఫస్ట్ నా దగ్గరికి వస్తాడు." అని కంగారుగా చెప్పాడు అభిజిత్.
"కూల్! ఎవరు కంగారు పడకండి. నీ ఇంటి దగ్గర మిచల్ గ్యాంగ్ ని కాపలాగా పెడతాను నువ్వు చెప్పినట్లు అక్కడికి వస్తే వాడు చచ్చినట్లే!" అని చెప్పాడు ముకుల్.
"ఆ అభీర్ చాలా తెలివైనవాడు మన ఆలోచనలకి అందడు." అని చెప్పాడు సర్ఫరాజ్.
ఆ మాట విని మురళి జోషి వైపు చూసి "మీ వాళ్ళని రంగంలోకి దింపు వాడు ఢిల్లీలోకి ఎంటర్ అయితే జాగ్రత్తగా వాచ్ చేసి ఏం చేస్తున్నాడో చూడమను." అని చెప్పాడు ముకుల్.
"ఓకే సార్!" అని జనార్ధన్ తో కలిసి అక్కడి నుంచి వెళ్ళాడు మురళి జోషి.
"సార్! నేను ఈరోజు నైట్ కి ఫ్యామిలీతో మీరు చెప్పినట్లు ఈ దేశం వదిలి వెళ్ళిపోతున్నాను." అని చెప్పాడు శివమణి.
ఆ మాట విని "బెస్ట్ ఆఫ్ లక్! జాగ్రత్తగా వెళ్ళండి." అని చెప్పాడు గోకుల్.
అక్కడి నుంచి వెళుతున్న శివమణి వైపు చూసి "జాకీ! మన వాళ్ళని తీసుకువెళ్లి వాడి దగ్గర ఉన్న రాళ్లు తీసుకురా.! ఫ్యామిలీ మొత్తం క్లోజ్ అయిపోవాలి." అని చెప్పాడు అభిజిత్.
"సరే అన్న!" అని చెప్పి తన మనుషులు తో కలిసి శివమణి వెనకాలే వెళ్ళాడు జాకీ.
"ఆ అభిర్ సంగతి త్వరగా చూస్తే, మనం ఆ కొండల పని చూసుకోవచ్చు దీనికి మంచి ప్లాన్ కావాలి." అని మందు తాగుతూ ఆలోచిస్తూ ఉన్నాడు ముకుల్.
****************
గెస్ట్ హౌస్ దగ్గర నుంచి ఇంటికి వచ్చి భార్య వైపు చూస్తూ "మిత్ర ఎక్కడ?" అని అడిగాడు శివమణి.
"ఇంకా కాలేజ్ నుంచి రాలేదు 15 నిమిషాల్లో వచ్చేస్తుంది." అని చెప్పింది ఝన్సీ.
"సరే! త్వరగా లగేజ్ మొత్తం ప్యాక్ చెయ్! మనం ఈ దేశం వదిలి వెళ్ళిపోతున్నము." అని చెప్పాడు శివమణి.
ఆ మాట విని కంగారుగా చూస్తూ "ఏమైంది? ఆ మినిష్టర్ వాళ్లతో కలిసి ఏదైనా తప్పు చేశారా?" అని నిలదీసి అడిగింది ఝన్సీ.
"నేను ఎటువంటి తప్పు చేయలేదు ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న పంచరత్నాలని సంపాదించాను." అని జేబులోని ఉన్న రాళ్ళని తీసి చూపించాడు శివమణి.
భర్త చేతిలో ఉన్న రాళ్ళను చూసి "ఆ రక్తం ఏమిటి? అసలు మీరు వాటిని ఎక్కడినుంచి తీసుకువచ్చారు?" అని టెన్షన్ గా చూస్తూ అడిగింది ఝాన్సీ.
రక్తంతో తడిసిన పంచరత్నాలని చూసి కంగారుగా కిందపడేసి టెన్షన్ గా చూస్తూ ఉన్నాడు శివమణి.
అంతలో అక్కడికి వచ్చి "సార్! మీకు నేను చెబుతూనే ఉన్నాను ఆ పంచరత్నాలు అమ్మవారి పాదాలతో సమానము వాటి గురించి మీరు ఆలోచించకండి అని,
కానీ మీరు నా మాట వినలేదు ఇప్పుడు చూశారా అమ్మవారి రక్తం మీ చేతికి అంటుకుంది." అని చెప్పాడు చంద్రశేఖర్.
ఆ మాట విని "ఈ పాపం నాకు నా కూతురికి అంటకూడదు." అని వెళ్లిపోవడానికి బ్యాగ్ సదురుకుంటూ ఉంది ఝాన్సీ.
అంతలో ఇంటి బయట కారు ఆగిన సౌండ్ వినిపించి కిటికీలోనుంచి చూస్తూ జాకి మనుషులతో రావడం చూసి 'వీడు ఇక్కడికి ఎందుకు వచ్చాడు?' అనుకుని కింద పడిన రాళ్ళని జేబులో వేసుకుని బయటకు వెళ్లాడు శివమణి.
గొడవపడుతున్న మాటలు వినిపించి బయటకు వెళ్లి శివమణిని వచ్చిన మనుషులు కత్తితో పొడవడం చూసి "సిస్టర్! త్వరగా ఇక్కడ నుంచి వెళ్లిపోండి." అని చెప్పి అక్కడి నుంచి పారిపోయాడు చంద్రశేఖర్.
రక్తపు మడుగులో ఉన్న భర్తను చూసి కంగారుగా బయటికి వస్తున్న ఝాన్సీ ని కూడా చంపి శివమణి జేబులో ఉన్న రాళ్లు తీసుకుని అక్కడి నుంచి వేగంగా వెళ్లిపోయాడు జాకి.
చనిపోయిన భార్య దగ్గరికి వెళ్లి చూసి ఏడుస్తూ "నేను చేసిన పాపం నన్ను వెంటాడింది. నా బిడ్డ అనాధ అయిపోయింది." అని ఫోన్ చేసి మురళి జోషికి కాల్ చేసి విషయం చెప్పి "నాకు పట్టిన గతే నీకు పడుతుంది జాగ్రత్తగా ఉండు." అని చనిపోయాడు శివమణి.
ఫోన్లో శివమణి చెప్పింది విని ఆలోచిస్తూ ఉండగా సహదేవుడితో కలిసి అభీర్ ట్రైన్ దిగడం చూసి "జనార్ధన్ వాచ్ చేస్తూ ఉండు ఇపుడే వస్తాను." అని చెప్పి హడావిడిగా ఇంటికి బయలుదేరాడు మురళి జోషి.
వేగంగా వెళుతున్న మురళి జోషిని చూసి "నాయకుడా! మన అడవికి వచ్చిన ఆఫీసర్ అక్కడ ఉన్నాడు." అని చూపించాడు సహదేవుడు.
"అవునా?" అని మురళి జోషి వెనకాలే సహదేవుడితో కలిసి వేగంగా వెళ్ళాడు అభీర్.
అది చూసి ఇద్దరినీ వాచ్ చేస్తూ వెనకాలే వెళ్ళాడుజనార్ధన్.
****************
గెస్ట్ హౌస్ దగ్గరికి జాకి తీసుకువచ్చిన పంచరత్నాలని చూసి "ఏంటి? ఇవి రక్తంతో ఉన్నాయి?" అని డౌట్ గా అడిగాడు గోకుల్.
"శివమణి గాడి రక్తం అయి ఉంటుందిలే, అంతగా ఆశ పడ్డావు ఇప్పుడు వాటితో ఏం చేస్తావు?" అని అడిగాడు అభిజిత్.
"ఈ ఐదు రాళ్ళని ఉంగరాలుగా చేయించి నా ఐదు వేళ్ళకి పెట్టుకుంటాను, అప్పుడు నాకు ఇంకా తిరుగు ఉండదు." అని సంతోషంగా చూస్తూ చెప్పాడు గోకుల్.
"అవునా? అయితే ఇంకా ఆలస్యం ఎందుకు ఇప్పుడే పంపించి ఉంగరాలు చేయించుకో, ఇక మనకు ఏ ఆటంకాలు ఉండవు." అని నవ్వుతూ చెప్పేడు ముకుల్.
అంతలో ఫోన్ రింగ్ అవడం చూసి "జనార్ధన్ కాల్ చేస్తున్నాడు." అని చెప్పి లిఫ్ట్ చేసి "ఏంటి విషయం?" అని అడిగాడు అభిజిత్.
"సార్! ఆ సహదేవుడితో కలిసి అభీర్ ఢిల్లీలో దిగాడు మురళి జోషి ని చూసి వెనకాల వెళుతున్నాడు నేను వాళ్ళ వెనకాలే వాచ్ చేస్తూ వెళుతున్నాను." అని చెప్పాడు జనార్ధన్.
"అవునా? అయితే టైం చూసి ఇద్దరిని చంపేయండి." అని చెప్పి ఫోన్ పెట్టేసి మూకుల్ వైపు చూసి
"అభీర్ ఢిల్లీలో దిగాడు మురళి జోషిని చూసి వెంటాడుతున్నాడంట జనార్ధన్ వాడి వెనకాలే వెళుతున్నాడు చంపేయమని చెప్పాను." అని చెప్పాడు అభిజిత్.
ఆ మాట విని "అభీర్ ని చంపడం ఆ ఇద్దరి వల్ల అవుతుందా?" అని డౌట్ గా అడిగాడు సర్ఫరాజ్.
"నలుగురులో ఇద్దరు కచ్చితంగా చస్తారు, ఏదైనా మనకు లాభమే! ఏం జరుగుతుందో చూద్దాము." అని చెప్పాడు ముకుల్.

![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)