Thread Rating:
  • 5 Vote(s) - 3.8 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Thriller శక్తి ఆగమనం - 10
#26
శ్రీరామ్ ఇంకా లేదు కానీ
చేస్తాను ఆకలెస్తుంది నువ్వు
కోపం తెచ్చుకోకండ మాట్లాడావ్ గా... అని అతడి మనసులో
మాట చెప్పాడు.
శ్రావణి నవ్వుతూ ఆమె బ్యాగ్ లో ఉన్న చాక్లెట్ తీసి హు తిను
ఆకలి అన్నావ్ గా అని ఇచ్చింది.
శ్రీరామ్ కి మైండ్ బ్లాక్ అవుతుంది తన శ్రావణి తనకి చాక్లెట్ ఇస్తుంది ఇది కలా నిజమా అన్నట్టు చూస్తుంటే ఆమె ఆ చాక్లెట్ తో అతడి తలపై తట్టి తీసుకో
అక్కడ నా ఫ్రెండ్ వెయిట్
చేస్తుంది అని చెప్పి
అందించింది
శ్రీరామ్ సంతోషం అంతా
ఇంతా కాదు ఆనందం గా
చాక్లెట్ అందుకుని థాంక్స్
అన్నాడు ఆమె నే వెళతాను
అని వెను తిరిగి అక్కడ
సీన్ చూసి కంగారు పడింది
ఇందు పక్కనే సిద్దు కూర్చుని ఉన్నాడు. ఆ సీన్ చూసి శ్రీరామ్ కూడా కంగారు పడ్డాడు
శ్రావణి కి కోపం వస్తుంది
అని ఆ ఇద్దరు అక్కడికి వేగం గా నడుచుకుంటూ వచ్చారు
శ్రావణి అడుగుతుంది
ఇక్కడ ఎం జరుగుతుంది నువ్వెందుకు ఇక్కడ ఉన్నావ్ అంటూ శ్రీరామ్ టెన్షన్ గా
సిద్దు వైపు చూస్తున్నాడు.
ఇందు ఎలాంటి రియాక్షన్ ఇవ్వకుండా తల దించుకుని కూర్చుంది.
*""సిద్దు నవ్వుతూ ఎంటి అలా అదుగుతావు సిస్టర్.....
మనం అంతా ఫ్రషర్స్.... సో అందరం ఫ్రెండ్స్ లా ఉండాలి ఇప్పుడే ఇందు నాతో ఫ్రెండ్షిప్ కి
ఓకే చెప్పింది తెలుసా
అందుకే ట్రీట్ ఇస్తున్నా నువ్వుకూడా వచ్చి కూర్చో
రేయ్ శ్రీ నువ్వు కూడా కూర్చో
అని ఆర్డర్ వేశాడు,
శ్రావణి సిద్దు తనని సిస్టర్ అనడం తో గొడవ పడలేదు నాలుగేళ్లు కలిసి ఒకే కాలేజ్ లో చదువుకోవాలి అలాంటప్పుడు గొడవలు పడటం లో అర్థం లేదు.
అందుకే సైలంట్ అయ్యింది.
అలాగే అసలు ఇక్కడ ఎం
జరుగుతుంది ఇందు ఎందుకు సైలంట్ గా ఉంది అన్నట్టు అనుమానం గా చూస్తూ ఉంది శ్రావణి. అంతలో
అక్కడికి సిద్దు ఆర్డర్ చేసిన
ఫుడ్ వచ్చింది.
*""ఆ ఫుడ్ చూసి శ్రావణి షాక్ అయ్యింది వేడి వేడి స్పైసి చికెన్ బిరియాని...
అందరి ముందు సిద్ధం
అయ్యింది అదేం అక్కడి వాళ్ళకి
వింత కాదు
కానీ ఇందు వరకు వింతే
ఆమె బైట ఫుడ్ అది కూడా స్పైసి ఫుడ్ తినిందే లేదు
అంతే కాకుండా ఒక అబ్బాయి తనని హేళన చేస్తూ నీ వల్ల కాదు అంటూ ఆ ఫుడ్ ఆర్డర్ చేసాడు అన్నది అర్ధం అవుతుంది
కానీ ఆమె వల్ల కాదే ఇప్పుడు
ఎం చేయాలి నేను దీన్ని తినాలా అన్నట్టు సిద్దు వైపు చూస్తూ
ఉంది.
*""సిద్దు నవ్వుతూ... హు తినండి మనందరం ఫ్రెండ్స్ అయినా
శుభ సందర్భంగా అందరికీ ట్రీట్ ఇస్తున్న అని అక్కడ ఉన్న
అందరికీ ఫుడ్ ఆర్డర్ పెట్టాడు.
శ్రావణి అదేం పట్టించు కోలేదు ఇందు ఎలాంటి రియాక్షన్
ఇస్తుందో అని చూస్తుంది.
శ్రావణి గొడవ చేస్తుంది
అనుకున్న శ్రీ కి ఆమె సైలంట్ గా ఉండే సరికి ధైర్యం వచ్చింది
అందుకే శ్రావణి ఆకలి వేస్తుంది తిందామా అని అడిగాడు
ఆమె అతడ్ని ఎందుకు భాధ పెట్టాలి అని సరే అని సిగ్నల్ ఇచ్చింది.
శ్రీరామ్ హమ్మయ్య అని
తింటూ ఉన్నాడు సిద్దు ఇంకా శ్రావణి మాత్రం ఇందు నీ చూస్తూ ఉన్నారు.
ఆమె తింటుందా అని.
*"ఇందు సిద్దు వైపు చూసి నేను ఇంత ఫుడ్ తినలెను నా వల్ల కాదు అని చెప్పింది
సిద్దు నవ్వుతూ పెట్టింది అంతా తినమని చెప్పానా నీ లంచ్ బాక్స్ ఎంత ఉంటుందో నాకు తెలుసు అంత తింటే చాలు నాకు సంతోషమే తిను అని ఆమె ప్లేట్ లో మూడొంతులు తీసి పెట్టాడు
ఆమెకి కాస్త ధైర్యం వచ్చింది హమ్మయ్య ఇతడు మంచివాడే కొంత వరకు అని మనసులో మెచ్చుకుని తినడం స్టార్ట్
చేసింది.
*"'
శ్రావణి కంగారుగా
మనసులో ఇందు లో మార్పు వస్తుందా లేక ఇప్పుడు
ఒక్క స్పూన్ తినగానే గట్టిగా అరుస్తుందా అని చూస్తూ ఉంది.
ఆమె అనుమానమే నిజం కాని పరిస్తితి వేరేగా ఉంది
ఎలా అయినా సిద్దు కండీషన్ కి ఒప్పుకుని పట్టి తిరిగి తీసుకోవాలి అందుకే ఆమె ధైర్యం చేసి ఒక స్పూన్ నోట్లో పెట్టుకుంది.
అంతే ఆ కారం ఘాటు
నాషణం కి అంటుకుంది
అమ్మబాబో అనుకుంది మనసులో ...
కానీ బైటకు అరవలేక పోయింది
ఆమెకు
మంట తట్టుకోలేక గట్టిగా
అరవాలి అనిపించింది
 
కానీ చుట్టు అందరూ ఆ ఫుడ్
ఎంతో సింపుల్ గా తింటున్నారు తను తినలేక పోతే ఈ సిద్దు అన్నట్టు నేను అమూల్ బేబీ దద్దోజనం అని ఒప్పుకోవాలి నో వీల్లేదు నేనేం దద్దోజనం కాదు
అని పంతం గా బిరియాని తినడానికి సాహసిస్తు ఉంది
శ్రావణి ఆశ్చర్య పోతూ రేయ్....
ఎం మాయ చేశావు రా....
పాలన్నాం తినే పిల్ల బిరియాని తింటుంది నిన్ను చూస్తే
పారిపోయే ది ధైర్యం గా నీ పక్కనే కూర్చుని ఉంది ఏంటిది...???
అసలు ఏంటిది అని అతడ్ని అడుగుతుంది శ్రావణి
*"అతడు నవ్వుతూ హేయ్
సిస్ ప్లీజ్ మరీ అంత పోగడకు నాకు సిగ్గేస్తుంది అని మెలికలు తిరుగుతూ ముందు నువ్వు తిను అప్పుడే నీ ఫ్రెండ్ పూర్తిగా
తింటుంది అన్నాడు.
*" శ్రావణి కి సిద్దు మీద కోపం గా ఉన్న ఇందు లో మార్పు వస్తుంది అని ఆనందం గా ఫుడ్
తీసుకుంటూ ఉంది
*"' ఇందు మాత్రం గుప్పెట భాధ దాచుకుని నోరు మండి పోతున్న ఆ మంట కి కళ్ళు ఎర్రబడి పోతున్న పంతం గా సిద్దు పెట్టిన ఫుడ్ తినేసింది.
ఆమెను పరీక్ష గా చూస్తే అర్థం అయిపోతుంది నోరంతా మంట పుడుతూ పెదాలు అలాగే గడ్డం వరకు ఎర్రగా కందిపోయి
కళ్ళు ఎర్రగా నీళ్ళు తిరుగుతూ ఎంతో కష్టం గా ఉంది అని
కానీ అక్కడ ఎవరు గమనించ
లేదు ఆమె అవస్థ అంతా సిద్దు ఇందు నీ మార్చాడు.....
అని నవ్వుతూ ఉన్నారు.
శ్రావణి కూడా అది
ఒకందుకు మంచిదే ఆడపిల్ల
మరీ ఇంత సుకుమారం గా
ఉంటే ఎలా ఎందు చేత ఇందు ఈ ఫుడ్ తింటుందో గాని
చేంజ్ వచ్చింది అందుకు
సంతోషం అనుకుంది
 అంతా ఫుడ్ ఫినిష్ చేస్తుంటే
ఇందు అవస్థ దారుణం గా ఉంది, ఆమె ఎంత ఇబ్బంది పడుతుంది ఆమె పక్కన ఉన్న
అతడికి తెలిసి పోయింది
ఆమె కష్టం అతడు గమనించి
ఇంక చాల్లే ఒప్పుకుంటాను
నువ్వు దద్దోజనం కాదు అని
ఆమె ముందు ప్లేట్ పక్కకి లాగేసాడు.
ఇందు అతడి వైపు
చూసి పక్కనే ఉన్న వాటర్
గ్లాస్ అందుకుంది.
ఆ సమయం లో ఆమె ఫేస్ ఎంతలా కంది పోయి ఉంది
అతడు చూసాడు.
చాలా ఫీల్ అయ్యాడు కూడా అయ్యో నువ్వు మరీ ఇంత సుకుమారివా ఆ పెదవులు
ఎర్రని మిరుప పల్లు వలె కందిపోయాయి నేను సరదాగా
అన్న మాటలు
నిన్ను నొప్పించాయి అందుకే
నువ్వు ఇంత కష్టాన్ని భరిస్తూ తిన్నావా అని మనసులో అనుకుంటూ ఉన్నాడు.
*""శ్రావణి మొబైల్ మోగడం తో ఇప్పుడే వస్తా అని చేయి
కడుక్కుని పక్కకి వెళ్ళింది,
శ్రీరామ్ గొప్పగా ఫీల్ అవుతూ
రేయ్ సిద్దు నువ్వు సూపర్
రా బాబు లైఫ్ లో ఎప్పుడు
ఇంత మార్పు రాలేదు
శ్రావణి నా బైక్ ఎక్కింది నాకు...చాక్లెట్ ఇచ్చింది
అంతే కాదు మన అందరితో భోజనం చేసింది నిజం గా
నువ్వేదో మాయ చేశావు
ఉండు ఈ చాక్లెట్ సగం
శ్రావణి కి ఇచ్చి వస్తా అని హుషారుగా అక్కడి
నుండి వెళ్ళాడు.
*"" అందరూ వెళ్ళాక
ఆమె అడిగింది
నీ కండీషన్ పూర్తి చేశాగా నా
పట్టి ఇచ్చెయి అన్నట్టు చేయి చాచింది
 సిద్దు ఆమె చేతికి పట్టి
ఇవ్వకుండా ఆమె పాదం అందుకుని అతడు మోకాలి మీద పెట్టుకుని ఆమె కాలి పట్టి తొడిగాడు....
ఆ సమయం లో అతడి స్పర్శ ఎదో తెలియని అలజడి రేపింది ఆమెకు మైండ్ బ్లాక్ అవుతుంది
ఒక్కసారిగా చాలా ఇబ్బంది కలిగింది.
బట్ సిద్దు ఆమె పాదం గట్టిగా పట్టుకుని ఉండటం వలన ఊరుకుంది.
మొత్తానికి ..... ఇందు అనుకున్నది సాధించింది తన కాలి పట్టి తిరిగి తీసుకోవాలి అనుకుంది
దాన్ని తిరిగి అతడి చేత్తో పెట్టడం పూర్తి కాగానే అక్కడి నుండి
పరుగు తీస్తూ కాలేజ్ గ్రౌండ్ వైపు వెళ్లి అక్కడ ఓ చెట్టు దగ్గర
కూర్చుని
గట్టిగా దగ్గుతూ ఉంది
గొంతు మండి పోతుంటే కారం ధాటికి
తట్టుకోలేక పోతుంది ఆమె
ఏడుస్తూ ఓహ్ గాడ్ మండి పోతుంది అని చాలా అవస్థ పడుతూ భాధ పడుతుంది.
*'" సిద్దు కంగారుగా అక్కడికి వచ్చి ఆమె పడే భాధ చూసి అయామ్ సారి ఇందు నేను నువ్వు ఇంత ఇబ్బంది పడతావు అనుకోలేదు ముందు ఈ ఐస్క్రీమ్ తిను
మంట తగ్గుతుంది ప్లీజ్ నువ్వు అలా భాధ పడుతుంటే
చూడలేక పోతున్నాను
ప్లీజ్ అని రిక్వెస్ట్ చేసాడు
*"ఆమె కోపం గా చూస్తూ ఎం ఆక్కరు లేదు నేను ఏడుస్తున్నాను అనుకుంటున్నావు ఏమో
నేనేం ఏడవటం లేదు కంట్లో
డస్ట్ పడింది అంతే ఇంక నాతో మాట్లాడే ప్రయత్నం
చేయకుండా పో అని అక్కడి
నుండి తప్పుకిబోయింది....
సిద్దు అడ్డం వచ్చి హేయ్.....
సారి చెప్పాను గా ఇంకా కోపం ఎందుకు
మంచి వాళ్ళు ఎప్పుడు ఇలా చేయరు క్షమించమని అడిగాక కొప్పడరు నువ్వు మంచి దానవు అని నాకు తెలుసు ప్లీజ్ ఈ సిద్దు తప్పు మన్నించి ఐస్క్రీమ్ తినవా అని ఆమెకు ఎంతో పరిచయం
ఉన్న వ్యక్తి కా చొరవ తీసుకుని
మరీ ఆమె నూటికి ఐస్క్రీమ్ అందించాడు
*"అప్పటికే ఆమె నోట్లో అగ్ని రగులుతున్నట్టు ఉంది పైగా ఐస్క్రీమ్ టెంప్ట్ అవుతుంటే
వద్దు అని అనలేక అతడు అందించిన స్పూన్ నోట్లో
పెట్టుకుంది అలాగే అతడి
చేతిలో ఐస్క్రీమ్ బాక్స్
లాక్కుని ఓహో.....
మంట అని అంటూ గబగబా తినేస్తూ కళ్ళలో నీళ్ళు వస్తుంటే తుడుచుకుంటూ ముక్కు ఎగరేస్తూ అచ్చం lkg పిల్లలా చేస్తూ ఉంటే
అతడికి ఎంత ముద్దొచ్చిందో చెప్పలేం.... ఆమె ఐస్క్రీమ్ కాలి చేసి నోటి మంట తగ్గించుకుని.... అతడి వైపు చూసి థాంక్స్....
అని చెప్పింది
అంతలో శ్రావణి శ్రీరామ్ అక్కడికి చేరుకున్నారు
వాళ్ళని చూసి ఇందు ఇంక నేను వెళ్తాను నువ్వు ఇప్పటి నుండి నన్ను ఆటపట్టించ కూడదు చెప్తున్న శ్రావణి రా వెళదాం అంటూ సిద్దు చేతిలో కాలి ఐస్క్రీమ్ బాక్స్ పెట్టీ ముందుకి కదిలింది.
శ్రావణి ఎం అర్థం కానట్టి అటు సిద్దు వైపు ఇటు ఇందు వైపు వింతగా చూస్తూ ఆమె వెనకే కదిలింది.
*"" క్లాస్ రూం లో శ్రావణి అడిగింది ఏంటిది ఇందు నువ్వు సిద్దు తో ఫ్రెండ్షప్ చేస్తావా వాడితో మాట్లాడతా వా అని అడిగింది.
ఇందుకు ఎం చెప్పాలో అర్థం కాలేదు అతడు కాలి పట్టి అడ్డం పెట్టుకొని తన చేత కారం గా ఉన్న ఫుడ్ తినిపించాడు అని
తెలిస్తే శ్రావణి గొడవ పెట్టుకుంటుంది వాడు మళ్లీ నన్ను తగులుకుంటాడు అని
ఆలోచించి
శ్రావణి నువ్వే చెప్పావు గా నాలుగేళ్లు ఇక్కడే ఉండాలి అని మరీ అతడితో గొడవ ఎందుకు చెప్పు ఫ్రెండ్లీ గా మాట్లాడితే కాదు అనలేక పోయాను
అని చెప్పింది.
శ్రావణి అర్థం చేసుకుని హా
అవును నేను అందుకే ఊరుకున్నాను పైగా వాడు నన్ను సిస్టర్ అన్నాడు సో వాడ్ని క్షమించేసాను అయినా వాడు మల్లీ.....శ్రీరామ్ తో మందు
లాంటి పనులు చేస్తే మాత్రం వాయించేస్తాను అని నవ్వుతూ ఇక్కడ ఉన్నన్నాల్లు
ఎవరితోనూ గొడవలు మనకి
వద్దు చదువు పూర్తి చేసుకుని వెల్లిపోధాం అని సలహా చెప్పింది.
అంతలో క్లాస్ స్టార్ట్ అయ్యింది ఆ ఇద్దరు పాఠం మీద శ్రద్ద పెట్టీ చదువుకుంటూ ఉన్నారు.
____________________________
మొత్తానికి అంతా ఫ్రెండ్స్ గా ఫిక్స్ అయ్యారు ఇందు మైండ్ లో ఒక డౌట్ వచ్చింది
ఈ సిద్దు శ్రావణి నీ సిస్టర్ అన్నాడు మరీ నన్నెందుకు అమూల్ బేబీ అంటున్నాడు నన్ను సిస్టర్ అనవచ్చు గా ఇంకోసారి
నాకు కనిపిస్తే నేనే బ్రదర్
అనేస్తాను ఇంకే దిగులు
ఉండదు ..
అనుకుని క్లాస్ అయిపోగానే
బైటకు వచ్చింది
శ్రీరామ్ సిద్దు ఇంకా నలుగురు కుర్రాళ్ళు ఇందు శ్రావణి లకి కనిపించారు సిద్దు ఇందు రావడం చూసి... చాలా హ్యాపీ ఫీల్
అవుతూ ఆమెకు దగ్గరగా
వచ్చాడు అతడి వెనకే శ్రీరామ్ కూడా వచ్చాడు....
ఇందు అతడి వైపు చూసి చూడనట్టు మొహం
తిప్పుకుని వెళ్ళిపో బోతే
అతడు అడ్డుకుని హేయ్
ఇందు నీకు ఇప్పుడు బాగానే
ఉంది గా అంటే కారం తినడం వలన ఇబ్బంది లేదు గా అని అడిగాడు
ఆమె ఏమి లేదు బాగానే ఉన్నా ఇంక నేను వెళతాను అని ముందుకు కదిలింది
వెనుక నుండి శ్రావణి వచ్చి నిలుచుంది సిద్దు ఆమెను
హాయ్ సిస్టర్ అన్నాడు
శ్రావణి నవ్వుతూ ఎంటి
ఇప్పుడు హాయ్ ఇంటికి
ఇంక పోరా...మీరు
అని అతడితో పాటు శ్రీరామ్ నీ కూడా అడిగింది
శ్రీరామ్ ధైర్యం తెచ్చుకుని
నీకోసమే వెయిటింగ్ నిన్ను
నా బైక్ లో డ్రాప్ చేస్తాను
ప్లీజ్ ఆటో వద్దు అని రిక్వెస్ట్ చేసాడు...
ఆమె ఇవ్వాల్టి కి అతడి బైక్
మీద వెళ్లిపోవడం బెటర్
అనుకుని సరే అనింది.
సిద్దు నవ్వుతూ ఓకే బై సిస్టర్ అంటూ ఉన్నాడు
ఇందు అతడి కి దగ్గరగా వచ్చి
ఇంక నేను వెళతాను బ్రదర్ బై అనింది
అప్పటివరకు నవ్వుతున్న
సిద్దు షాక్ అయిపోయి....
రేయ్ బావా నీ చెల్లి పిలుస్తుంది రా చూడు బై చెబుతుంది
అని శ్రీరామ్ వైపు చూపించాడు.
అతడు ఎందుకు అలా అన్నాడో ఇంకా శ్రీరామ్ కి అర్థం అయ్యింది కానీ
ఇందు కి అర్థం కాలేదు
ఆమె కలుగు చేసుకుని అరే
నేను అన్నయ్యా అన్నది తనని
కాదు నిన్ను అని చెబుతు
ఉంటే...
సిద్దు చిరాగ్గా చూస్తూ
నేను అన్నయ్య ఎంటి
అసహ్యం గా, చి వినడానికే బాలేదు సిద్దు అని పిలువు.....
అంటూనే చేతిలో ఫోన్ రింగ్ అవకుండా హాలో ఆ డాడ్
వస్తున్న ఇప్పుడే అని అక్కడి
నుండి మెల్లిగా ఎస్కేప్
అయ్యాడు.
, శ్రావణి నవ్వుతూ
ఎం షాక్ ఇచ్చావ్ దెబ్బకి మాయమయి పోయాడు పాపం సిద్దు అనుకుని ఇందు నీ
తీసుకుని
బైటకి వచ్చింది
ఏమి అర్ధం కాని ఇందు
తన కార్ రాగానే శ్రావణి శ్రీకాంత్ కి బై చెప్పి వెళ్ళిపోయింది.
శ్రావణి శ్రీరామ్ కి కండీషన్
పెట్టీ బైక్ స్పీడ్ గా డ్రైవ్ చేయకూడదు సడన్ బ్రేక్ వేయకూడదు
అని ఆర్డర్ వేసి
బైక్ ఎక్కింది శ్రీకాంత్
తన కల త్వరలోనే
నెరవేరుతుంది అని నమ్మకం తెచ్చుకుని ముందుకు
కదిలాడు.
అంతా వెల్లెంత వరకు దాక్కుని
ఉన్న సిద్దు నిట్టూరుస్తూ ఎంటి నన్ను అన్నా అంటావా
చెప్తా నీ సంగతి ఇంకోసారి
అలా అనకుండా గట్టి వార్నింగ్ ఇస్తాను అప్పటికి గానీ దారికి
రాదు నా అమూల్ బేబీ
అని ఫిక్స్ అయిపోయి
ఇవాళ్టి కి చాలు అనుకుని
ఇంటికి తిరిగి ప్రయాణం అయ్యాడు.
*"" మొత్తానికి రెండు హృదయాలు ఒక చోటికి చేరుకున్నాయి
కానీ వాల్ల తండ్రుల శతృత్వం
వలన వేరయ్యే ప్రమాదం ఉంది ఇందు కి ఇంత వరకు సిద్దు
ఎవరి కొడుకో తెలియదు
తెలిసాక ఇంకెంత
భయపడుతుంది చూడాలి..... నెక్స్ట్ అప్డేట్ త్వరగా ఇచ్చే ప్రయత్నం చేస్తాను ఫ్రెండ్స్....
ఈ ఎపిసోడ్ స్మాల్ వచ్చి ఉంటే మన్నించాలి ఫ్రెండ్స్
ధన్యవాదాలు...
 
 
*రచనకు రేటింగ్/లైకులు ఇవ్వండి*
ఇతర ధారావాహికాలు

శక్తి ఆగమనం
(https://xossipy.com/thread-71346.html)
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
[+] 4 users Like k3vv3's post
Like Reply


Messages In This Thread
శక్తి ఆగమనం - 10 - by k3vv3 - 19-11-2025, 06:08 PM
RE: శక్తి ఆగమనం - by k3vv3 - 20-11-2025, 09:46 AM
RE: శక్తి ఆగమనం - by k3vv3 - 20-11-2025, 09:46 AM
RE: శక్తి ఆగమనం - by anaamika - 20-11-2025, 12:16 PM
RE: శక్తి ఆగమనం - by k3vv3 - 10-12-2025, 09:32 AM
RE: శక్తి ఆగమనం - by k3vv3 - 10-12-2025, 09:32 AM
RE: శక్తి ఆగమనం - by Uday - 10-12-2025, 02:21 PM
RE: శక్తి ఆగమనం - by k3vv3 - 01-01-2026, 09:35 AM
RE: శక్తి ఆగమనం-1 - by k3vv3 - 01-01-2026, 09:39 AM
RE: శక్తి ఆగమనం-1 - by k3vv3 - 01-01-2026, 10:00 PM
RE: శక్తి ఆగమనం-1 - by k3vv3 - 08-01-2026, 09:28 AM
RE: శక్తి ఆగమనం-1 - by k3vv3 - 08-01-2026, 09:29 AM
RE: శక్తి ఆగమనం-2 - by k3vv3 - 08-01-2026, 09:31 AM
RE: శక్తి ఆగమనం-2 - by k3vv3 - 15-01-2026, 03:46 PM
RE: శక్తి ఆగమనం-2 - by k3vv3 - 15-01-2026, 03:48 PM
RE: శక్తి ఆగమనం-2 - by k3vv3 - 15-01-2026, 03:50 PM
RE: శక్తి ఆగమనం-2 - by k3vv3 - 15-01-2026, 03:53 PM
RE: శక్తి ఆగమనం-3 - by k3vv3 - 15-01-2026, 05:27 PM
RE: శక్తి ఆగమనం-3 - by k3vv3 - 22-01-2026, 07:15 PM
RE: శక్తి ఆగమనం-3 - by k3vv3 - 22-01-2026, 07:18 PM
RE: శక్తి ఆగమనం-3 - by k3vv3 - 22-01-2026, 07:19 PM
RE: శక్తి ఆగమనం - 4 - by k3vv3 - 29-01-2026, 06:08 PM
RE: శక్తి ఆగమనం - 6 - by Uday - 06-02-2026, 04:01 PM



Users browsing this thread: 1 Guest(s)