Thread Rating:
  • 5 Vote(s) - 3.8 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Thriller శక్తి ఆగమనం - 10
#25
శక్తి ఆగమనం..5

[Image: S5.jpg]



*"" తూరుపు తెలతెలవారుతు ఉంది నిదురిస్తున్న
నయనాలు వెలుగురేకలు
తాకి మెల్లిగా తెరుచుకుని
ఆ వెలుగు నీడలు చూసి
ఎంతో ఆనందించాయి
ఉదయాన్నే మేలుకుని
తాము అనుకున్న పని చేయాలి
అని ఆలోచిస్తూ కాలేజ్ రెడీ అవుతున్నాయి
రెండు జంటలు.
*""ముఖ్యం గా ఇందు తనని ఓ దద్దోజనం అన్నట్టు ఫిక్స్ అయిన
ఆ కుర్రవాడి కి బుద్ధి చెప్పి
అతడి చేతిలో ఉన్న తన పట్టి తిరిగి తెచ్చుకుని అమ్మ చేత కూడా
శబాష్ అనిపించు కోవాలి అన్నదే ఆమె ఆశ కానీ ఎందుకో గుండెల్లో వణుకు పుడుతోంది
ఆ కుర్రవాడి చొరవ...
ధైర్యం గుర్తు వస్తుంటే ఆమె
అడుగు వెనక్కి పడుతుంది
కాని తప్పదు అందుకే గట్టిగా
దేవి మాత నీ తలుచుకుని
కాలేజ్ వైపు అడుగేసింది.
*"_____________
శ్రీరామ్.... అమ్మ వాళ్ళతో కాలేజ్ కి వెళ్లి వస్తాను అని చెప్పి అతడి
బైక్ స్టార్ట్ చేయబోయాడు....
అతడి ఎదురుగా కాలి మాత లా చూస్తూ నిలుచుంది శ్రావణి.
ఆమెను చూడగానే శ్రీరామ్...
గుండె తడబడింది
ఒక్కసారిగా తల నేలకి ఒరిగి పోయింది....
అక్కడికి దగ్గరలో ఉన్న శ్రీరామ్ తల్లి ఎంటి శ్రావణి ఏమైంది ఎందుకు వాడికి అడ్డం గా నిలుచున్నావు నువ్వు కూడా వాడితో కలిసి
కాలేజ్ కి వెళ్ళాలి అనుకుంటున్నావా ఎంటి
అని అడిగింది.
*" శ్రీరామ్ ఆశ్చర్య పోయి ఆహా ఏమి నా భాగ్యం అవునా అన్నట్టు ఆశ గా ఆమె వంక చూసి
ఆ కళ్ళలో ఉన్న పవర్ తట్టుకోలేక మళ్లీ తల వాల్చేసాడు.
శ్రావణి కి మండి పోతుంది
అందుకే పైకి అత్తయ్య ముందు
బైట పడకుండా అవును అత్తయ్య నా స్కూటీ... పాడయింది
ఇవ్వాల్టి ఈ బైక్ పై వెళ్ళాలి అనుకున్న లేట్ అవుతుంది
అందుకే అని ఇబ్బందిగా చెబుతుంటే ఆవిడ నవ్వుతూ ఇవ్వాల్టి కి ఎంటి రోజు వాడి బండి మీదే పో మాకు చూసేందుకు
కన్నుల పండుగ లా ఉంటుంది.
*"" హు... నాన్న శ్రీ స్టార్ట్ చెయ్యి నీ మరదలు నీ బండి ఎక్కుతుంది
అని చెప్పి ఆర్డర్స్ ఇచ్చింది
ఆవిడ.
మిగిలిన వాళ్ళు అంతా
బైటకు వచ్చి చూసి నవ్వుతున్నారు అది చూసి శ్రావణి కి ఇంకాస్త రగిలింది మా ఇంట్లో వాళ్ళకి
వీడి ఇంట్లో వాళ్ళకి అస్సలు
బ్రెయిన్ లేదు అందుకే ఎదో వింత చూస్తున్నట్టు ఇతగాడి బండి ఎక్కుతుంటే చూస్తున్నారు
అని విసుక్కుంటూ అతడి
వెహికల్ ఎక్కింది.
శ్రీరామ్ కి గాల్లో తేలిపోతున్నట్టు ఉంది మనసు ఆనందం తో ఊగిపోతూ ఉండగా
బైక్ వేగం పుంజుకుంది
శ్రావణి వీలైన అంత దూరం గా అతడికి టచ్ అవకుండా
కూర్చుంది
కొంత దూరం వెల్లెంత వరకు
మౌనం గా కూర్చుంది ఆమె.
శ్రీరామ్ కి అయితే ఆమెతో
ఎన్నో మాట్లాడాలి అని తన మనసులో మాట చెప్పెయాలి
అని ఉంది కోంతో గొప్పో సిద్దు ఇచ్చిన ధైర్యం తో పెదవి కదిలి
ఒక్క మాట బైటకు వచ్చింది...
శ్రావణి... నేను నమ్మలేక పోతున్నాను నువ్వు నా బైక్ పై
నేను నిన్ను కాలేజ్ కి తీసుకు వెళ్ళడం.
నేను ఈ రోజు అస్సలు మరచిపోను...
అని చెబుతుంటే...
శ్రావణి... చుట్టు చూసి...
హు... ఒకసారి బైక్ ఆపు అని
చెప్పిది శ్రీరామ్ ఎందుకు
అన్నట్టు చూస్తూ బైక్ ఆపాడు.
ఆమె బైక్ దిగి సీరియస్ గా
ఎంటి నువ్వు చేస్తున్న పనులు...??? హా.... అని సూటిగా అడిగింది.
*""" శ్రీరామ్ కి ఎం అర్దం కాలేదు ఎందుకు ఇలా అడుగుతున్నావు నేనేం పనులు చేశాను అని తెలియనట్టు అడుగుతుంటే
ఆమె మరింత గట్టిగా రంకెలు
వేస్తూ అహహ. ఎం ఎరుగని పసివాడు చూడండి
ఎంత అమాయకం గా ఫేస్ పెట్టీ అడుగుతున్నాడో
నిన్న సార్ తూగుతు ఇంట్లోకి వెళ్ళారు ఎంటి సంగతి ఆ
సిద్దు గాడితో కలిసి మందు
కొట్టావా అని ఉరుముతు
అడిగింది శ్రావణి.
*" శ్రీరామ్ భయం గా చూస్తూ
నిజం చెప్పాడు అవును అని
అంతే ఆమె రంకలు వేస్తూ
ఎంత ధైర్యం ఎక్కడ నేర్చావు
ఈ పాడలవాట్లు ఎం
అత్తయ్యతో చెప్పాలా అని
అడిగింది.
శ్రీరామ్ భయపడి పోతు
అయ్యో వద్దు శ్రావణి అమ్మకి తెలిస్తే.... భాధ పడుతుంది
ప్లీజ్ చెప్పకు అని నిర్క్వస్ట్
చేస్తుంటే ఆమె ఇంకాస్త రెచ్చి
పోతూ అంత భయం ఉన్న
వాడివి మందు ఎందుకు
తాగావ్ అని అడిగింది
శ్రీరామ్ భయం గా చూస్తూ ఎం చేయమంటావ్ నేను తాగను
అంటే ఆ సిద్దు నన్ను బలవంతం చేశాడు మగాడివి కావా నీలో
ధైర్యం లేదా నువ్వు మగాడివి అయితే తాగు అని రెచ్చకోట్టాడు... అందుకే....అని అతడు మాట
పూర్తి చేయలేదు .
ఆమె అడ్డుకుని హా అందుకని నువ్వు ఫుల్ గా మందు కొట్టావ్ అంతేనా అంటే వాడు నిన్ను రెచ్చకొట్టాడు కాబట్టి తాగావు
రేపు ఎవర్తి నో చూపించి దాన్ని ముద్దు పెట్టుకో లేదంటే నువ్వు మాగాడివి కాదు అంటాడు
పోయి ముద్దాడేస్తావా అని
అడిగింది శ్రావణి,,
శ్రీరామ్ సీరియస్ గా చీ...
అలా ఎందుకు చేస్తాను
నీకు పెట్టమంటే పెడతాను
కానీ ఎవరికి బడుతే వాళ్ళకి ఎలా కిస్ చేస్తాను అని సిన్సియర్ గా నోరు జారాడు.
అంతే శ్రావణి కి పిచ్చి కోపం
వచ్చింది ఎంటి ధైర్యం ఎక్కువయింది
ఒక్క రోజు వాడితో సావాసం
చేసి నీ మాట తీరు
అంతా మార్చుకున్నావ్.....
ఇంక చాలు ఇప్పటికే ఎక్కువ అవుతుంది వాడితో ఫ్రెండ్ షిప్
చేస్తే ఒప్పుకోను నేను అత్తయ్య వాళ్ళతో మాట్లాడవలసి
వస్తుంది ఇంకోసారి నువ్వు
మందు ముట్టుకుంటే నీ కాళ్ళు విరుగుతాయి చెబుతున్న
అని అతడ్ని ఫుల్ గా
బెదరకొట్టి
నువ్వు పో నేను ఆటో లో వస్తా
అని చెప్పింది
శ్రీరామ్ కి ఆమె అన్ని చివాట్లు పెట్టినా భాధ అనిపించ లేదు
కానీ మధ్యలో బైక్ దిగిపోయి ఆటోలో వెళతాను అనేసరికి ఫీల్ అవుతూ శ్రావణి అయామ్ సారి ఇంకెప్పుడు మందు ముట్టను నువ్వు నన్ను చెడ్డవాడుగా అనుకోవద్దు రా కాలేజ్ వరకు
నేను తీసుకు వెళతాను
అని అడిగాడు. శ్రీరామ్
ఆమె చిరాగ్గా అక్కరలేదు నేను
ఆటో లో వెళ్లగలను నీకు క్లాస్ ఇవ్వాలి అని ఇక్కడి వరకు బైక్ మీద వచ్చాను ఇంకోసారి
మందు కొడితే అత్తయ్య
వాళ్ళ ముందే నీకు అయిపోతుంది అని అటో ఆపి అందులోనుంచి వెళ్లిపోయింది.
శ్రీరామ్ చాలా ఫీల్ అవుతూ
కాలేజ్ కి చేరుకున్నాడు
అక్కడ ఉన్న సిద్దు వాడి అవస్థ తెలుసుకుని ధైర్యం చెబుతూ
అరే అసలు ఏంట్రా ఆమె
ప్రాబ్లం నువ్వు మందు కొడితే తనకెంటి అసలు నిన్ను
తిట్టాలి అనుకుంటే
ఇంట్లో వాళ్ళ ముందే తిట్టవచ్చు గా ఎందుకు నీ బైక్ ఎక్కి నీలో
ఆశలు కలిగించి సగం లో
దిగిపోయి నోటికొచ్చిన మాటలు అనేసి వెళ్లిపోయింది
ఇదంతా ఏ హక్కుతో చేసింది
అని అంటుంటే
శ్రీరామ్ సీరియస్ గా బాబు సిద్దు ఇంక వదిలేయ్ నువ్వు మీటింగ్ పెట్టకు అది చూసింది అంటే
మళ్లీ పెద్ద వార్ అవుతుంది
నేను నిన్ను ఫ్రెండ్ అనుకున్నాను కాబట్టి అది వద్దు అన్నా నీతో మాట్లాడుతూ ఉన్నాను
అంతే నువ్వు మందు లాంటి వాటిలో నన్ను మినహాయిస్తే
మన ఫ్రెండ్షిప్ కంటిన్యూ
అవుతోంది లేదు అంటే నేను వెళ్ళిపోతాను అని తేల్చి
చెప్పాడు శ్రీరామ్ ,,
సిద్దు నవ్వుతూ సర్లే రా
ఏడవకు నీ మరదలికి నువ్వంటే ఇష్టం ఉంది అందుకే ఒక్కసారి నువ్వు మందు ముట్టుకుంటే తట్టుకోలేక పోయింది
నువ్వు ఒక విధం గా నాకు నా మందికి థాంక్స్ చెప్పాలి
లేకుంటే ఇన్నేళ్లలో రాని అవకాశం నీకు ఇవ్వాళ వచ్చింది శ్రావణి నీ
బైక్ ఎక్కింది గా అని అడిగాడు.
శ్రీరామ్ ఆ సీన్ గుర్తు
చేసుకుంటూ చిన్నగా నవ్వుతూ థాంక్స్ చెబుతూ సరే రారా టైం అవుతుంది అని క్లాస్ కీ
పిలిచాడు.
సిద్దు ఇందు కోసం చూస్తున్నాడు అందుకే నువ్వెల్లు నాకు చిన్న పని ఉంది వస్తా అన్నాడు
శ్రీరామ్ వెళ్లి పోయాడు.
శ్రావణి అక్కడికి చేరుకునే సమయానికి సిద్దు ఉన్నాడు తప్ప శ్రీరామ్ బైట లేడు అమే హమ్మయ్య అనుకుని అతడి దగ్గరకు వచ్చి వార్నింగ్ ఇచ్చింది.
నువ్వు ధనవంతుల అబ్బాయి వి నీకు ఎలాంటి వ్యసనం అయినా ఫ్యాషన్ లా ఉంటుంది
కానీ శ్రీరామ్ మిడిల్ క్లాస్
అబ్బాయి వాడి మీద పేరెంట్స్ చాలా ఆశలు పెట్టుకుని ఉన్నారు వాడ్ని చెడకొడితే బాగోదు చెబుతున్న.
నేను ఊరుకోను అని చెప్పి వెళ్ళిపోయింది.
సిద్దు నవ్వుతూ థాంక్స్
అంటూ ఉన్నాడు.
*""టైం అవుతున్న ఇందు ఇంకా రాలేదు యాది చెప్పాడు
ఆమె చాలా సున్నిత
మనస్కురాలు అని
ఏమైనా భయపడింద
కాలేజీ కి అందుకే రాకుండా
ఇంట్లో ఉండిపోయింద
అని అనుమాన పడుతూ ఛ
కాస్త కూల్ గా మాట్లాడి ఉండాల్సింది అనవసరం గా బెదరకొట్టాను అని
తిట్టుకుంటూ ఉంటే అప్పుడే అక్కడికి ఇందు కారు వచ్చి
ఆగింది.
అతడికి ఎంత సంతోషం
కలిగిందో మాటల్లో చెప్పలేను హేయ్.... నా బ్యూటీ వచ్చింది అనుకుంటూ ఉంటే
ఇందు కార్ దిగింది.
*"" ఆమె మనసులో దేవుడ్ని వేడుకుంటూ ఆ అబ్బాయితో
ఎలా అయినా మాట్లాడి
తన పట్టి తిరిగి తెచ్చుకోవాలి అనుకుంటూ ముందుకు
కదిలింది.
*""సిద్దు ఎంట్రన్స్ లోనే ఆమెకు ఎదురై భేదరకొట్టడం కరెక్ట్
కాదు అని అక్కడి నుండి తప్పించుకుని ఆమెను
చాటుగా చూస్తూ
మురిసిపోతూ వున్నాడు.
ఇందు ఎంట్రన్స్ దగ్గరే ఆ అబ్బాయి ఉంటాడు అనుకుంది కాని
అతడు కనిపించలేదు
ఆమె అటు ఇటు వెతుకుతూ ఉండడం సిద్దు గమనించి
వావ్ అనుకుని ఆమెనే
అబ్జర్వ్ చేస్తూ ఫాలో చేశాడు.
ఆమె క్లాస్ రూం కి వెళ్ళే
వరకు అక్కడంతా చూసింది
ఆ అబ్బాయి లేడు ఆమె
విసుక్కుని క్లాస్ కి
వెళ్ళిపోయింది.
ఆ లోగా సిద్దు చాలా ఆశలు పెట్టుకుని నువ్వు నన్నే వెతుకుతున్నావా సూపర్
బ్రేక్ టైం లో నీ ఎదురుగా ఉంటాలే దిగులు పడకు అముల్ బేబీ అనుకుని అతడి క్లాస్ రూం కి వెళ్ళిపోయాడు.
____________________________
*"""క్లాస్ రూం లో శ్రావణి
నవ్వుతూ ఇందు నీ విష్ చేసి మాటల్లో శ్రీరామ్ తన బావ అని
ఆ సిద్దు నిన్న వాడికి మందు పట్టించాడు అని నేను శ్రీరామ్ కి ఫుల్ క్లాస్ ఇచ్చాను అని
అంతే కాదు ఆ సిద్దు గాడికి
వార్నింగ్ ఇచ్చాను అని చెబుతుంది.
ఇందు అర్థం కానట్టు ఇంతకీ
ఈ సిద్దు ఎవరు శ్రావణి అని అడిగింది.
ఆ ప్రశ్న కి నిట్టూరుస్తూ నిన్ను జాయినింగ్ డే నుండి ఏడిపిస్తూ వెంట పడుతున్నాడే వాడే
సిద్దు బాగా ఉన్న వాళ్ళు అనుకుంటా డబ్బులు మంచి
నీళ్లలా కర్చు చేస్తున్నాడు అని చెప్పింది
ఇందు ఇంట్రస్ట్ గా అతనా....
అంటే అతను ఇవ్వాళ కాలేజ్ కి వచ్చాడా మరీ నాకు కనిపించలేదూ...???
ఏమయ్యాడు అని అడిగింది.
శ్రావణి షాక్ అవుతూ హేయ్.... ఎంటే ఇలా షాక్ ఇచ్చావు
నువ్వు వాడు కనపడ కూడదు అనుకుంటావూ గా మరేంటి ఇప్పుడు కనిపించ లేదు అంటున్నావు ఆమె ప్రశ్న కి
అర్థం చెప్పే లోగా లెక్చలర్
రావడం శ్రావణి ఇందు నోరు ముసెయ్యడం జరిగాయి.
___________________________
క్లాస్ పూర్తి కాగానే శ్రావణి
అడిగింది నువ్వు ఎందుకు వాడికోసం అంత ఇంట్రస్ట్ గా అడిగావు అని
ఇందు ఎం చెప్పాలో అర్థం కాక
వాడి పై ఇంట్రస్ట్ ఏమిటి నా
భోంద వాడ్ని చూస్తే భయం
వేస్తుంది కానీ ఇవ్వల మాత్రం వాడితో మాట్లాడాలి తప్పదు
ఈ దద్దోజనం నుండి తప్పించు కోవాలి అంటే వాడకి ఎదురు
పడక తప్పదు అని ఆమెకు
అర్థం కాని విధం గా చెప్పి
కెంటీన్ వైపు అడుగులు
వేయడం తో
శ్రావణి అయోమయం గా
మధ్యలో ఈ దద్దోజనం గొడవ ఏమిటే అని అడుగుతూ
ఉంది
దూరం గా శ్రీరామ్ దిగులుగా కూర్చుని కనిపించాడు
ఆమెకు అతడ్ని చూడగానే
ఎందుకో దిగులుగా గా
అనిపించింది
అందుకే ఇందు ఇప్పుడే వస్తా నువ్వు లంచ్ చేస్తుండే అని
అటుగా వెళ్ళింది.
ఇందు మాత్రం సిద్దు కోసం వెతుకుతూ ఉంటే అక్కడ
ప్రత్యక్షం అయ్యాడు అతడు ఆమెను భయపెడుతూ భుమ్మ్......అని సౌండ్ చేశాడు.
*""అంతే ఇందు ఉలిక్కి పడి
అతడి వైపు చూసి ఏంటిది
నీకు కొంచం కూడా సెన్స్ లేదు ఎందుకు ఇలా ఆకతాయి లా
భిహెవ్ చేస్తున్నావు అని
అరిచింది.
*"""సిద్దు నవ్వుతూ పర్లేదు
దద్దోజనం సౌండ్ పెంచుతుంది
ఎంటి సంగతి మార్నింగ్
నుండి
తెగ వేతికేస్తున్నావు
నన్ను చూడకుండా ఉండలేక పోయావా అంత నచ్చానా
అంతగా గుర్తు వస్తున్నానా
అని అడిగాడు....
ఆమె చిరాగ్గా ఫేస్ పెట్టుకుని చూడండి నేను ఇక్కడికి
వచ్చింది చదువుకోడానికి
ఎవరినో చూడటానికి ఇష్టపడటానికి కాదు....
సో ప్లీజ్ అలాంటి మాటలు మాట్లాడకండి వినటానికి
చిరాగ్గా ఉన్నాయి అని
కోపం గా చెబుతుంటే.
ఆమె మాటలు అతడికి
పక్షుల కిలకిల రావాలు గా
వెండి మువ్వల సవ్వడి లా వినిపిస్తున్నాయి
వాటిని విని ఆనందిస్తున్నాడు
తప్ప అర్థం తెలుసుకోలేక పోతున్నాడు....
ఆమె సిద్దు వైపు ఇబ్బందిగా
చూస్తూ హాలో..... మిష్టర్ వినిపిస్తుంద....???
అని పిలిచింది
ఆమె పిలుపు తో స్పృహ
లోకి వచ్చినట్టు సిద్దు
ఎంటి.... అమూల్ బేబీ అని పిలిచాడు.
అంతే ఇందు కి కోపం
వచ్చింది
నిన్న దద్దోజనం ఇవ్వాళ అమూల్ బేబీ ఎంటి నీ ఉద్దేశం నేనేం
అమూల్ బేబీ కాదు నా పేరు
ఇందు ఇలా నిక్ నేమ్స్ పెడితే బాగుండదు చెబుతున్న
మర్యాదగా నా కాలి పట్టి తిరిగి ఇచ్చెయ్ అని అడిగింది ఇందు.
*"_____
కుందేలు పిల్ల పులి పిల్లలా డైలాగ్స్ చెబుతుంది అంత మాత్రాన
ఆమె కళ్ళలో అమాయకత్వం
స్వరం లో సున్నితం
ఎక్కడికి పోతుంది
సిద్దు ఆమె వణుకుతున్న
గులాభి వన్నె అదరాలని
ఇష్టం గా చూస్తూ...
చిన్నగా నవ్వి హు..... అదా విషయం కాలి గొలుసు
కోసం చిందులు త్రొక్కుతూ
నాతో గొడవ కి దిగవా
నన్ను వెతుకుతూ ఉంటే
నాపై ఇష్టం తో అనుకున్న
సర్లే... త్వరలో ఇష్టం
వస్తుంది రాకుంటే నేను ఊరుకుంటానా.....
అని ఆమెకి అర్థం కాని
మాటలు అంటూ ఉంటే
ఇందు వీసుక్కుని ప్లీజ్ నా
పట్టి తిరిగి ఇచ్చేయ్ అమ్మ నిన్న ఫుల్ క్లాస్ ఇచ్చింది
నన్ను దద్దోజనం అని మొద్దు అని అంటుంది నువ్వు కూడా అలానే అంటున్నావ్ నాకు కోపం
వస్తుంది నేనేం దద్దోజనం కాదు
అని ప్రూఫ్ చేయాలి అంటే
కాలి పట్టి తిరిగి తెమ్మంది
మమ్మీ సో నా పట్టి నాకు
ఇచ్చేయి అని విషయం
చెప్పింది ఇందు.
*""సిద్దు నవ్వుతూ.... అత్తయ్య
కరక్ట్ గానే అనింది నువ్వు దద్దోజనం అని నవ్వుతూ
ఉంటే ఇందు మొహం
కందిపోతూ ఉంది అందుకే
ఆమెకు చాలా ఇన్సల్ట్ గా అనిపిస్తుంది పైగా అతడు
మమ్మీని అత్తయ్య అనడం
ఆమె ఇంక తన వల్ల కాదు
అని దేవి మాత నీ తలుచుకుని ఎంటి వాగుతున్నావ్
అత్తయ్య ఎంటి మాటలు
మర్యాద గా రానివ్వు నా
పట్టి ఇస్తావా లేదా అని
అరిచింది.
సిద్దు ఆమెకు దగ్గరగా
కూర్చుని.... అరే నా అమూల్ బేబీ కోపం ఎందుకు నీ కాలి గొలుసు నాకెందుకు చెప్పు నీకే
ఇచ్చేస్తా బట్... చిన్న షరతు
నువ్వు దానికి ఒప్పుకుంటే....
నీ గొలుసు నీకు ఇచ్చేస్తా ఎంటి
ఓకే నా అని అడిగాడు.
*"" ఆమె ఒక్కసారిగా ఊపిరి తీసుకుని,
 నిజం గానా ఓహ్ థాంక్స్
చెప్పు ఎంటి నీ షరతు అని అడిగింది.
అతడు నవ్వుతూ నువ్వు
దద్దోజనం కాదు అని ప్రూవ్ చేసుకోవాలి... అన్నాడు.
ఆమె డల్ గా ఫేస్ పెట్టుకుని
ఎలా అని అడిగింది
అతడు నవ్వుతూ నేను పెట్టిన
ఫుడ్ వదిలిపెట్టకుండా తింటే
నేను ఒప్పుకుంటాను
నువ్వు దద్దోజనం కాదు అని
అలాగే నేనే స్వయం గా నీ కాలికి
ఈ గొలుసు అలంకరిస్త........ ఏమంటావ్...??
*"" ఆమెకు ఇంకో అవకాశం లేదు ఎలా అయినా పట్టి తిరిగి తీసుకావాలి అని ఫిక్స్
అయ్యింది. అందుకే అతడి కండీషన్ కి ఒప్పుకుంది.
*"""""''"
*" శ్రావణి శ్రీరామ్ దగ్గరకు వచ్చి ఎంటి డల్ గా ఉన్నావ్ నిన్ను తిట్టాను అనా ,,,
అని అడిగింది.
*""అతడు శ్రావణి స్వయం గా వచ్చి మటాడేసరికి తడబడి పోతు
అదేం లేదు శ్రావణి
మనసు
ఎందుకో బాలేదు అంతే అని చెబుతూ....
నేను చెడ్డవాడని కాదు
నువ్వు నేను డ్రింక్ చేశాను అని నన్ను చెడ్డవాడు అనుకోవద్దు
ప్లీజ్ ఇంకెప్పుడు
డ్రింక్ చేయను సిద్దు కి సీరియస్ గా చెప్పాను మళ్లీ మందు లాంటి వాటిలో నన్ను ఇన్వాల్వ్ చేయకు అని చెప్పి ఆమెను సంతోష పెట్టాడు.
*""శ్రావణి నవ్వుతూ నువ్వు చెడ్డవాడివి అని నేను అన్నానా నువ్వే చెడ్డవాడివి అని నేను అనుకుంటే అత్తయ్య వాళ్ళ
ముందే నీకు క్లాస్ అయిపోయేది కదా అదేం లేదు ఇంక నువ్వు ఆ సిద్దు గాడికి దూరం గా ఉంటే మంచిది అని చెబుతుంటే
*"' శ్రీరామ్- లేదు శ్రావణి నేను
తననీ ఫ్రెండ్ గా అక్సప్ చేశాను ఇప్పుడు కాదు పొమ్మనలేను చెప్పాగా
తను నన్ను బలవంత పెట్టడు నేను పొరపాటు చేయను
ప్లీజ్ మా ఫ్రెండ్షిప్ వద్దు అనకు వాడు చెడ్డవాడు కాదు పెరిగిన వాతావరణం అలాంటిది నన్ను నమ్ము
అని సిన్సియర్ గా అడిగాడు.
*"" ఆమెకు శ్రీరామ్ సిన్సియారిటి నచ్చింది అంతే కాదు అతడు ఎలాంటి వాడు ఎంత మంచి వాడు అన్ని ఆమెకు తెలుసు
అందుకే అతడ్ని ఇంకాస్త
ఇబ్బంది పెట్టకూడదు అని
సరే నీ ఇష్టం కానీ మందు సిగరెట్ అని ఎదైనా వేషాలు వెసావ్
అనుకో ఊరుకోను అని వార్నింగ్ ఇచ్చింది
శ్రీరామ్ భయం గా చిచి ఇంక ఎప్పుడు ముట్టుకోను అని
నమ్మకం గా చెప్పాడు
ఆమె చిన్న చిరునవ్వు
నవ్వుతూ సరే లంచ్ చేసావా
అని అడిగింది.
ఇతర ధారావాహికాలు

శక్తి ఆగమనం
(https://xossipy.com/thread-71346.html)
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
[+] 4 users Like k3vv3's post
Like Reply


Messages In This Thread
శక్తి ఆగమనం - 10 - by k3vv3 - 19-11-2025, 06:08 PM
RE: శక్తి ఆగమనం - by k3vv3 - 20-11-2025, 09:46 AM
RE: శక్తి ఆగమనం - by k3vv3 - 20-11-2025, 09:46 AM
RE: శక్తి ఆగమనం - by anaamika - 20-11-2025, 12:16 PM
RE: శక్తి ఆగమనం - by k3vv3 - 10-12-2025, 09:32 AM
RE: శక్తి ఆగమనం - by k3vv3 - 10-12-2025, 09:32 AM
RE: శక్తి ఆగమనం - by Uday - 10-12-2025, 02:21 PM
RE: శక్తి ఆగమనం - by k3vv3 - 01-01-2026, 09:35 AM
RE: శక్తి ఆగమనం-1 - by k3vv3 - 01-01-2026, 09:39 AM
RE: శక్తి ఆగమనం-1 - by k3vv3 - 01-01-2026, 10:00 PM
RE: శక్తి ఆగమనం-1 - by k3vv3 - 08-01-2026, 09:28 AM
RE: శక్తి ఆగమనం-1 - by k3vv3 - 08-01-2026, 09:29 AM
RE: శక్తి ఆగమనం-2 - by k3vv3 - 08-01-2026, 09:31 AM
RE: శక్తి ఆగమనం-2 - by k3vv3 - 15-01-2026, 03:46 PM
RE: శక్తి ఆగమనం-2 - by k3vv3 - 15-01-2026, 03:48 PM
RE: శక్తి ఆగమనం-2 - by k3vv3 - 15-01-2026, 03:50 PM
RE: శక్తి ఆగమనం-2 - by k3vv3 - 15-01-2026, 03:53 PM
RE: శక్తి ఆగమనం-3 - by k3vv3 - 15-01-2026, 05:27 PM
RE: శక్తి ఆగమనం-3 - by k3vv3 - 22-01-2026, 07:15 PM
RE: శక్తి ఆగమనం-3 - by k3vv3 - 22-01-2026, 07:18 PM
RE: శక్తి ఆగమనం-3 - by k3vv3 - 22-01-2026, 07:19 PM
RE: శక్తి ఆగమనం - 4 - by k3vv3 - 29-01-2026, 06:06 PM
RE: శక్తి ఆగమనం - 6 - by Uday - 06-02-2026, 04:01 PM



Users browsing this thread: