Thread Rating:
  • 5 Vote(s) - 3.6 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
ఖైదీ నెంబర్ 402 - నా మాటే శాసనం
ఎపిసోడ్ 48


జాకీ వెనకాల కొండ మీద నుంచి కిందకి వచ్చి జేమ్స్ వాళ్ళు జంతువుల్ని చంపడం చూసి ఇక్కడ జరిగింది నాయకుడికి చెప్పడానికి ఎవరో ఒకరు ఉండాలి అని చెట్టు దిగకుండా అలాగే ఉండిపోయాడు సహదేవుడు.

******************

ఉదయం కొండ దగ్గరికి వచ్చి అక్కడ ఉన్న జేమ్స్ వైపు చూసి "ఇంకా ఎవరైనా మిగిలారా?" అని అడిగాడు ముకుల్.

"సార్! ఇక్కడ ఒక మనిషి కాదు కదా జంతువు కూడా బతికి లేదు, మనం పెట్టిన పాయిజన్ వల్ల కొండ మీద ఉన్న ప్రతి ఒక్కడు రక్తం కక్కుకొని చచ్చారు మీరు కూడా వెళ్లి ఒక్కసారి చూడండి." అని నవ్వుతూ చెప్పాడు జేమ్స్.

"వెరీ గుడ్!" అని గోకుల్ వాళ్ళతో కలిసి కొండమీదకి వెళ్లి అక్కడ చనిపోయిన వాళ్ళని చూస్తూ  "వైలెంట్ లేకుండా మనుషుల్ని చంపడం చాలా చికాకుగా ఉంది." అని చెప్పాడు ముకుల్.

"సార్! మనం ఇక్కడి నుంచి త్వరగా వెళ్లిపోవాలి మళ్లీ అభీర్ వచ్చాడు అంటే చాలా డేంజర్!" అని చెప్పాడు సర్పరాజ్.

ఆ మాట విని అమ్మవారి విగ్రహం దగ్గరకు వెళ్లి పాదాల దగ్గర ఉన్న పంచరత్నాలు తన దగ్గర ఉన్న కత్తితో బయటకు తీసి శివమణి చేతిలో పెట్టి "నీకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాను." అని చెప్పాడు గోకుల్.

తన చేతిలో ఉన్న పంచరత్నల వైపు చూసి "నా ఆశ నెరవేరింది. ఇక ఈ జీవితానికి ఇది చాలు!" అని సంతోషంగా చెప్పాడు శివమణి.

"మీరు హ్యాపీ కదా! వాటిని భద్రంగా ఉంచుకుని ఈ దేశం వదిలి వెళ్లిపోండి. ఒకవేళ  అభీర్ మన వాళ్ళ దగ్గర నుంచి  తప్పించుకుంటే వాటి కోసం వస్తాడు అవి ఎక్కడ ఉన్నాయో తెలియకూడదు." అని చెప్పాడు ముకుల్.

"ఓకే సార్!" అని చెప్పి పంచరత్నాలని జేబులో వేసుకున్నాడు శివమణి.

అమ్మవారి దగ్గర ఉన్న కొన్ని రాళ్ళని, వేదాలని, వస్తువులని తీసుకుని బ్యాగ్ లో పెట్టుకుని "సార్! మనం వెళదామా?" అని అడిగాడు సర్పరాజ్.

"ఓకే!" అని జేమ్స్  వైపు చూసి అక్కడ మిగిలిన ప్రసాదాలను తీసేయండి. వీళ్లు టెర్రరిస్టుల రసాయనిక దాడి వల్లే చనిపోయారు అని అనుకోవాలి. " అని చెప్పాడు ముకుల్.

"ఇక్కడ అంతా క్లియర్ చేసిన తర్వాత మీరు వెళ్లి గెస్ట్ హౌస్ లో ఉండండి. అభీర్ ఇక్కడకి రావడానికి ఇంకా వన్డే డే టైం ఉంది." అని చెప్పాడు గోకుల్.

అమ్మవారి ముందు ఉన్న దీపాన్ని ఆర్పుతున్న అభిజిత్ వైపు చూసి "దానిని అలా ఉంచు నువ్వు వెలిగించిందే కదా!" అని చెప్పాడు ముకూల్.

"ఓకే అంకుల్!" అని గోకుల్ వాళ్ళతో కలిసి కొండ కిందకి వచ్చాడు అభిజిత్.

అక్కడి నుంచి వెళుతూ జేమ్స్ వైపు చూసి "మీరు అభీర్ ని క్లోజ్ చేసిన తర్వాత వచ్చి నాకు కలవండి." అని చెప్పాడు ముకుల్.

అక్కడ నుంచి వెళుతూ "సార్! మరి ఈ కొండలు ఎప్పుడు తవ్వడం స్టార్ట్ చేద్దాము." అని ఆశగా అడిగాడు జావిద్.

"మినిస్టర్ గారు కంగారు పడకండి ఇంకా చేయవలసిన పని చాలా ఉంది." అని నవ్వుతూ చెప్పిడు గోకుల్.

"సరే! మీరు ఎలా చెబితే అలాగా!" అని అక్కడ ఉన్న కార్ ఎక్కి కూర్చున్నాడు జావిద్.

అక్కడి నుంచి ముకూల్ వాళ్ళు వెళ్లిపోవడం చూసి తన మనుషులు వైపు తిరిగి "అందరూ వచ్చి గెస్ట్ హౌస్ లో రెస్ట్ తీసుకోండి . రేపు సాయంత్రం వరకు మీకు హాలిడే, తర్వాత ఒక పెద్ద పులిని వేటాడాలి." అని చెప్పాడు జేమ్స్.

అందరూ వెళ్లిపోవడం చూసి నిదానంగా చెట్టు దిగి కొండా కింద ఉంచిన పులి పిల్లల్ని చేతిలో తీసుకుని ఏనుగు పిల్లతో సహా కొండమీదకి వెళ్లి చనిపోయిన తన వాళ్ళందరిని చూసి గుండెలు పగిలేలా ఏడుస్తూ ఉన్నాడు సహదేవుడు.

***********

అదే సమయంలో అమ్మవారి దర్శనం చేసుకుని వచ్చి రాజన్ వాళ్ళ వైపు చూసి "ఎందుకో నా మనసు కీడు శంకిస్తుంది. మనం వెంటనే బేరా కి బయలుదేరాలి." అని చెప్పాడు అభీర్.

ఆ మాట విని "ఇక్కడ మూడు రాత్రులు నిద్ర చేయాలి లేకపోతే ఆపచారం!" అని చెప్పాడు బైరి.

"నాకు అమ్మే అక్కడికి వెళ్ళమని చెబుతున్నట్లు ఉంది." అని చెప్పి సింబా వైపు చూసి "నేను వస్తున్నానని జాతరలో ఉన్న మనవాళ్ళకి సమాచారం ఇవ్వు!" అని చెప్పాడు అభీర్.

ఆ మాట విని వేగంగా అక్కడి నుంచి ఆకాశంలోకి ఎగిరేడు సింబా.

"సరే! నాయకుడు ఎలా చెబితే అలాగా, నీ వెంటే మేము!" అని చెప్పి అభీర్ తో పాటు బయలుదేరారు ఐదుగురు.

**********

మధ్యాహ్నానికి అక్కడికి చేరుకుని కొండమీద సహదేవుడు ఏడుస్తూ ఉండడం చూసి తన ముందు వాలేడు సింబా.

ఎదురుగా ఉన్న సింబవైపు చూసి ఏడుస్తూ "నాయకుడిని తీసుకురా.!" అని గట్టిగా అరుస్తూ చెప్పాడు సహదేవుడు.

ఆ మాట విని అక్కడి నుంచి వేగంగా వెళ్లి ఆకాశంలో నుంచి అభీర్ వాళ్ళని చూసి భయంకరంగా అరిచాడు సింబా.

ఆ అరుపు విని ఓళ్లు జలదరించినట్లు అయ్యి ఆకాశం వైపు చూసి "అక్కడ మన వాళ్లకు ఏదో ఆపద జరిగింది." అని కళ్ళ వెంట వస్తున్న నీళ్ళు ఆపుకుని "నన్ను అక్కడికి తీసుకువెళ్ళు!" అని గట్టిగా అరిచాడు అభీర్.

ఆ మాట విని వేగంగా వచ్చి రెండు కాళ్ళతో అభీర్ ని పట్టుకుని ఆకాశంలోకి ఎగిరిపోయాడు సింబా.

శంభు దొర ముందు కూర్చుని ఏడుస్తూ ఆకాశంలో సింబా అరుపు విని "నాయకుడా! ఇక్కడ అంతా అయిపోయింది." అని ఏడుస్తూ చెప్పాడు సహదేవుడు.

సింబా రెండు కాళ్ళని వదిలి కిందకి దూకి చనిపోయిన తన వాళ్ళందరినీ చూసి "ఎలా జరిగింది?" అని అడిగాడు అభీర్.

"నాయకుడా! నమ్మిన వాళ్లు వెన్నుపోటు పొడిచారు మన జంతువులు చనిపోయింది కూడా వాళ్ల వల్లే!" అని తన చేతిలో ఉన్న పావురాన్ని చూపించాడు సహదేవుడు.

"అసలు ఇదంతా ఎందుకు చేశారు? ఇప్పుడు వాళ్లంతా ఎక్కడ ఉన్నారు?" అని కోపంతో ఎర్రబడ్డ కళ్ళతో చూస్తూ అడిగాడు అభీర్.

అమ్మవారి పాదాల వైపు చూపిస్తూ "పంచరత్నాలను ఇక్కడి నుంచి తీసుకువెళ్లారు, ఈ కొండలను కూడా తొలిచి వేస్తారు అంట! నీతో ఈ విషయం చెప్పడానికే నేను ఇంకా ప్రాణాలతో ఉన్నాను.

నేను ఒక్కరిని కూడా కాపాడలేకపోయాను, వాళ్లు నిన్ను చంపడానికి అక్కడ ఉండే ఇళ్లలోనే ఉన్నారు." అని ఏడుస్తూ చెప్పాడు సహదేవుడు.

ఆ మాట విని అమ్మవారి పాదాల దగ్గరికి వెళ్లి చూసి పట్టుకుని బాధపడుతూ ఉన్నాడు అభీర్.

"నాయకుడా! శంభు దొరకి నాడి ఇంకా ఆడుతుంది." అని కంగారుగా చూస్తూ చెప్పాడు సహదేవుడు.

ఆ మాట విని తండ్రి దగ్గరికి వచ్చి తన శక్తితో ప్రాణాన్ని నిలబెట్టి "అయ్యా!" అని గట్టిగా కౌగిలించుకున్నాడు అభీర్.

"బిడ్డ! నువ్వు చెప్పిన మాట నేను వినవలసింది. నాయకుడు చెప్పిన మాట వినకుండా అపచారం చేశాను అందుకే ఇలా జరిగింది. ఇంత అపచారం చేసిన వాళ్ళు శిక్ష అనుభవించి తీరాల్సిందే, మన జాతికి ఈ ప్రదేశానికి ఇక నువ్వే రక్ష, ధర్మన్ని కాపాడు."  అని భార్య దగ్గరికి వెళ్లి

తన చేతిలో ఉన్న కత్తిని తీసుకుని గుండెల్లో పొడుసుకుని  "మళ్లీ నాకు ప్రాణం పోయేకు నాకు తగిన శిక్ష పడింది." అని చనిపోయాడు శంభు.

తండ్రి పట్టుకుని ఏడుస్తూ అక్కడ చనిపోయిన వాళ్ళందర్నీ సహదేవుడి తో కలిసి ఒకచోటకు చేరుస్తూ ఉన్నాడు అభీర్.

అంతలో అక్కడికి పరుగెత్తుకుంటూ వచ్చి చనిపోయిన వాళ్ళని చూస్తూ "నాయకుడా! వాళ్లు చేసిన పాపానికి శిక్ష చావు ఒక్కటే అవ్వకూడదు." అని ఏడుస్తూ చెప్పాడు అరుల్.

సహదేవుడి వైపు చూసి  వీళ్ళ దహన సంస్కారాలకి ఏర్పాటు చేయ్యి, ఒకవైపు వేరే చితిని కూడా ఏర్పాటు చేయ్యి!" అని చెప్పి

ఐదుగురు వైపు చూసి "వాళ్ళ దగ్గరకి వెళదాము పదండీ
అమ్మవారి రౌద్ర రూపం ఎలా ఉంటుందో చూపిస్తాను."  అని  గెస్ట్ హౌస్ దగ్గరికి బయలుదేరాడు అభీర్.

అభీర్ వెనకాలే అక్కడ ఉన్న కత్తులు తీసుకుని బయలుదేరారు ఐదుగురు.

గెస్ట్ హౌస్ దగ్గర కూర్చుని తన వాళ్లతో కలిసి మందు తాగుతూ నడుచుకుంటూ వస్తున్న అభీర్ వాళ్ళని చూసి "ఒరేయ్! వీళ్ళు చావడానికి ఒకరోజు ముందే వచ్చేసారు." అని వెటకారంగా చూస్తూ నవ్వుతూ చెప్పాడు జేమ్స్.

ఆ మాట విని గన్స్ తీసుకుని అభీర్ వాళ్ల వైపు ఎయిమ్ చేశారు జేమ్స్ మనుషులు.

"మీరు మా వాళ్ళకి ప్రాణాలు పోయడానికి వచ్చారు అనుకున్నాను, కానీ తీయడానికి వచ్చారని ఇప్పుడే అర్థమైంది." అని వేగంగా వస్తున్న సింబా కాళ్లు పట్టుకుని ఎగిరి వెళ్లి జేమ్స్ గుండెల మీద తన్నాడు అభీర్.

అది చూసి  షూట్ చేస్తూ ఉన్నారు జేమ్స్ మనుషులు.

మీదకు వస్తున్న బుల్లెట్స్ ని కత్తులతో కొడుతూ దొరికిన వాళ్ళని దొరికినట్లు నరుకుతూ ఉన్నారు ఐదుగురు.

తన మనుషులందరూ దారుణంగా చనిపోవడం చూసి భయంతో  అక్కడ నుంచి పారిపోవడానికి పరిగెత్తాడు  జేమ్స్.

అది చూసి "సింబా!" అని గట్టిగా అరిచాడు అభీర్.

ఆ మాట విని తన రెండు కాళ్లతో జేమ్స్ ని పట్టుకొని కొండమీదకి తీసుకువెళ్లి అమ్మవారి పాదాల ముందు పడేసాడు సింబా.

అక్కడ ఉన్న మనుషులందరినీ చంపి చెట్లు వేర్లతో కట్టి అడవిలోకి లాక్కు వెళ్లి అమ్మవారి పాదాల ముందు కాళ్లు చేతులు వీరిగి పడి ఉన్న జేమ్స్ దగ్గరకు వచ్చి

"ఎవరు చేశారు? ఎందుకు చేశారో చెప్పు, నిన్ను నా చేతులతో చంపను." అని గుండెల మీద కాలు వేసి అడిగాడు అభీర్.

ఆ మాట విని "జరిగిందంతా చెబుతాను." అని భయంగా చూస్తూ ముకుల్ వాళ్ళ అందరి గురించి చెప్పాడు జేమ్స్.

"అమ్మవారి పాదాల దగ్గర ఉన్న పంచరత్నాలు ఎక్కడ ఉన్నాయి?" అని అడిగాడు అభీర్.

"ఆ రాళ్లు శివమణి దగ్గర ఉన్నాయి, కానీ అతని ఫ్యామిలీని చంపి వాటిని గోకుల్ తీసుకువెళ్లిపోతాడు, నువ్వు అడిగినదానికి సమాధానం చెప్పాను నన్ను ప్రాణాలతో ఉంచు నేను నా దేశం వెళ్ళిపోతాను." అని భయంగా చూస్తూ అడిగాడు జేమ్స్.

"నేను ఇచ్చిన మాట తప్పను నా చేతులతో నిన్ను చంపను." అని సహదేవుడు వైపు చూశాడు అభీర్.
[+] 12 users Like SivaSai's post
Like Reply


Messages In This Thread
RE: వేదం - by Manmadhsbanam143 - 22-12-2025, 04:13 PM
RE: ఖైదీ నెంబర్ 402 - నా మాటే శాసనం - by SivaSai - 28-01-2026, 07:09 PM



Users browsing this thread: 1 Guest(s)