28-01-2026, 07:04 PM
ఎపిసోడ్ 47
జారువ తెగ వాళ్ళకి వచ్చిన జబ్బుకి టీకాలు వేయించి ఢిల్లీ చేరుకుని అక్కడ జరిగే జాతర సమయంలో విషవాయులతో అందరినీ ఎలా చంపుతామో వివరంగా చెప్పాడు జేమ్స్.
********************
మూడు నెలల తర్వాత జాతర తేదీ ఖరారు చేసి అభిజిత్ కి కబురు పంపించి మూడు రోజులు నిద్ర చేయడానికి భవాని మాత ఆలయం దగ్గరికి వెళ్లడానికి సిద్ధమయ్యాడు అభీర్.
"బిడ్డ! ఆ మాతని మన తెగ చల్లగా ఉండాలని, ఈ ప్రదేశాన్ని కాపాడే శక్తి నీకు ఇవ్వాలని మనసారా వేడుకో!" అని చెప్పాడు శంభు.
"సరే అయ్యా!" అని సింబా వైపు చూసి మన వాళ్ళ ఐదుగురికి నేను అమ్మవారి గుడి దగ్గరికి బయలుదేరారని సమాచారం ఇవ్వు!" అని చెప్పాడు అభీర్.
ఆ మాట విని వేగంగా అరుస్తూ ఆకాశంలోకి ఎగిరిపోయాడు సింబా.
"నాయకుడా! నీకు తోడు గా నేను కూడా వస్తాను." అని అడిగాడు సహదేవుడు.
"ఈ బేర అడవికి నువ్వే కాపరివి నువ్వు లేకపోతే ఎలా? నేను వెళ్లి జాతర ముగింపు సమయానికి ఇక్కడే ఉంటాను నువ్వు మనవాళ్లందరినీ క్షేమంగా చూసుకో!" అని నవ్వుతూ అక్కడ నుంచి బయలుదేరాడు అభీర్.
********************
శంభు దగ్గర నుంచి జాతర కబురు రావడంతో వచ్చిన మనిషి వైపు సంతోషంగా చూస్తూ "మా వాళ్ళ అందరితో కలిసి వస్తాను ఘనంగా ఏర్పాటు చేస్తాను." అని చెప్పి ఆ మనిషిని అక్కడి నుంచి పంపించి గోకుల్ కి కాల్ చేశాడు అభిజిత్.
ఫోన్ లిఫ్ట్ చేసి "టెల్ మీ అభిజిత్!" అని అడిగాడు గోకుల్.
"జాతర కబురు అందింది మన వాళ్ళని రెడీ చెయ్ బయలుదేరుదాము." అని చెప్పాడు అభిజిత్.
రెండు రోజుల తర్వాత గొర్వర్ గెస్ట్ హౌస్ దగ్గరికి చేరుకొని "జేమ్స్! మీరందరూ కొండ కింద ఉండండి పాయిజన్ వల్ల మతి చెడి కిందకి వచ్చే జంతువులని అక్కడే చంపేయండి." అని చెప్పడు ముకుల్.
"ఓకే సార్! ఆ కొండ మీద నుంచి ఒక్క జంతువు కూడా బయటికి వెళ్లలేదు." అని చెప్పాడు జేమ్స్.
"ఈ విషయం బయటకి తెలియకూడదని నేను కూడా అనధికారికంగా ఒక్కడినే వచ్చాను నాతో పాటు గన్ మెన్ ని కూడా తీసుకురాలేదు." అని అని చెప్పాడు జావీద్.
"మంచి పని చేశారు ఈ విషయం మూడో కంటికి తెలియకూడదు." అని చెప్పాడు అభిజిత్.
"సార్! మనం పెట్టిన పాయిజన్ కరెక్ట్ గా పని చేస్తుంది కదా లేకపోతే మన పని అవుట్!" అని అడిగాడు శివమణి.
"ఆ అడవిలో సాక్ష్యం చెప్పడానికి మనిషి కాదు కదా ఒక జంతువు కూడా బతకదు." అని చెప్పాడు జేమ్స్.
"మనం ఏదైనా మాట్లాడాలి అనుకుంటే ఇక్కడే మాట్లాడుకుందాం ఆ కొండ మీద ఒక్క మాట కూడా మాట్లాడకూడదు." అని చెప్పాడు సర్పరాజ్.
"అందరూ జాగ్రత్తగా వినండి. మనం తీసుకువెళ్లే ప్రసాదంలో మత్తుమందు కలిపాము జాతర పూర్తయిన తర్వాత ప్రసాదాలు పంచిపెట్టి మనం కొండ కిందకి వచ్చిన వెంటనే జేమ్స్ వాళ్ళు పాయిజన్ బాంబ్స్ బ్లాస్ట్ చేస్తారు." అని చెప్పాడు గోకుల్.
"సరే!" అని అక్కడి నుంచి బేర అడవికి చేరుకుని శంభుని కలసి "మా మనుషులు అన్ని ఏర్పాట్లు జాగ్రత్తగా చేశారా? ఏదైనా లోటు ఉంటే చెప్పండి?" అని అడిగాడు అభిజిత్.
"ఎటువంటి లోటు లేదు దొర! అన్ని చాలా ఘనంగా ఏర్పాటు చేశారు." అని సంతోషంగా చెప్పాడు శంభు.
"ఈ రోజు ప్రసాదం మా దగ్గర మా ఇంటి నుంచి వస్తుంది దానికి మీరు అభ్యంతరం చెప్పకూడదు." అని అడిగాడు ముకుల్.
"సరే దొర! ఈ జాతర మొత్తం మీ చలవా వల్లే జరుగుతుంది ఆ అమ్మకి ప్రసాదం కూడా మీరే పెట్టండి." అని చెప్పాడు శంభు.
అమ్మవారి దగ్గర జాతర ప్రారంభానికి దీపం వెలిగిస్తూ వెలగకపోవడంతో ఆశ్చర్యంగా చూస్తూ "ఏదో అపచారం జరిగినట్లు ఉంది. దీపం వెలగడం లేదు." అని కంగారుగా చెప్పింది శంభు భార్య.
ఆ మాట విని ముందుకు వెళ్లి "మీరు సరిగ్గా వెలిగించినట్లు లేరు." అని అక్కడ ఉన్న దీపాన్ని తన జేబులో నుంచి అగ్గిపెట్టి తీసి వెలిగించాడు అభిజిత్.
"దొర! జాతర మొత్తం మీ చేతుల మీదుగానే జరుగుతుంది కదా, అందుకనే ఆ దీపం అమ్మ మిమ్మల్ని పెట్టమన్నట్టుంది." అని సంతోషంగా చెప్పాడు శంభు.
దీపం వెలగడంతో జాతర ప్రారంభించి అందరూ సంబరాలు మునిగితేలుతూ ఉన్నారు.
*********************
ఐదుగురు భవాని మాత దేవాలయం దగ్గరికి చేరుకుని అభీర్ ని కలిసి "ఈ జాతరతో మన సమస్యలు మొత్తం తీరిపోతాయి అనుకుంటున్నాను." అని చెప్పాడు రాజన్.
"నేను కూడా అదే అనుకుంటున్నాను మనవాళ్ళందరూ ఎలా ఉన్నారు? జాతర చివరి రోజుకి అక్కడికి చేరుకోమని చెప్పారా?" అని అడిగాడు అభీర్.
"నాయకుడా? జాతర చివరి రోజు మన అభీర్ సేన మొత్తం అక్కడే ఉంటుంది." అని చెప్పాడు అగస్త్య.
"మనం ఎలాగో జాతర చూడకుండా గుడి దగ్గర నిద్ర చేస్తున్నాము మన వాళ్ళని వెళ్ళమని చెబితే సరిపోయేది సరదాగా చూసేవారు." అని చెప్పింది రియా.
"అభీర్ సేన లో ఉన్న ప్రతి ఒక్కరు నాయకుడు వెనకాలే జాతరకు వెళ్లాలి." అని చెప్పాడు బైరి.
"మన గూడెం నుంచి బయటకు వెళ్లిన అందరినీ ఈ గుడికి రమ్మని నిద్ర చేసి జాతరకు తీసుకువెళ్లాలి అనుకున్నాను కానీ మన గురించి బయటకు తెలియకూడదు అని వాళ్ళని ఆగిపొమ్మని మీ ఐదుగురిని మాత్రమే రమ్మని చెప్పాను." అని చెప్పాడు అభీర్.
"సరే! పదండి అమ్మవారి దర్శనం చేసుకుందాము." అని చెప్పాడు అరుల్.
************
అదే సమయంలో శంభు దగ్గరికి వెళ్లి "అభీర్ కనబడడం లేదు ఏమిటి?" అని అనుమానంగా అడిగాడు శివమణి.
ఆ మాట విని "దొర! నా బిడ్డ అమ్మవారి దర్శనానికి వెళ్ళాడు జాతర చివరి రోజు ఇక్కడికి చేరుకుంటాడు." అని చెప్పాడు శంభు.
ఆ మాట విని ఒక్కసారి షాక్ అయ్యి ముకుల్ వాళ్ళ దగ్గరికి వచ్చి "సార్! అభీర్ ఇక్కడ లేడు, జాతర చివరి రోజు వస్తాడంట!" అని కంగారుగా చెప్పాడు శివమణి.
"అవునా? అది కూడా మన మంచికే, వాడు ఇక్కడికి వచ్చేసరికి ఎవ్వరు ప్రాణాలతో ఉండరు అది చూసి నేను బతకడం ఎందుకు అనుకుంటాడు.
మీరు వాడి గురించి ఎక్కువగా ఆలోచించకండి మొదటిరోజు జాతర పూర్తి అవుతుంది జాకీ ని పంపించి ప్రసాదాలు తెప్పించండి. అలాగే జేమ్స్ ని కూడా రెడీగా ఉండమని చెప్పమను." అని చెప్పాడు ముకుల్.
"ఓకే డాడ్!" అని జేమ్స్ కి విషయం చెప్పి ప్రసాదాలు తీసుకురమ్మని జాకిని పంపించాడు గోకుల్.
కొండ కిందకి వెళుతున్న జాకిని చూసి "ఈ మనిషి ఏంటి? జాతర జరిగే సమయంలో కిందకి వెళుతున్నాడు." అని వెనకాలే వెళ్ళాడు సహదేవుడు.
అది చూసి సహదేవుడు వెనకాలే రెండు పులి పిల్లలు ఏనుగు పిల్ల కూడా బయలుదేరి వెళ్లాయి.
అడవి చివరికి వెళ్లి జేమ్స్ తో మాట్లాడుతున్న జాకిని చూసి 'వీళ్లు డాక్టర్లు కదా! చేతిలో తుపాకులు ఉన్నాయి ఎందుకు?' అని అనుమానంగా
వెనకాల వస్తున్న పులి పిల్లల్ని ఏనుగుపిల్లని తీసుకొని ఎవరకి కనపడకుండా కొండ కిందకి తీసుకువెళ్లి చూస్తూ ఉన్నాడు సహదేవుడు.
కాసేపటికి నలుగురు మనుషులతో కలిసి ప్రసాదాలు తీసుకుని కొండమీదకి వెళ్ళాడు జాకి.
అది చూసి 'ప్రసాదాలు తీసుకు వెళుతున్నాడు సరే! వీళ్ళు ఎందుకు తుపాకులు పట్టుకుని కొండ మీదకు రాకుండా అక్కడ ఉన్నారు.' అనుకుంటూ
జేమ్స్ వాళ్ళని చూడడానికి అక్కడ ఉన్న చెట్టు ఎక్కి పావురాన్ని చూసి 'ఇదేంటి కదలడం లేదు.' అని చేత్తో పట్టుకుని గట్టిగా ఉండడంతో రెండు ముక్కలు చేసి లోపల సూదులు ఉండటం చూసి
'వీళ్ళు ఏదో మోసం చేస్తున్నారు, ఆరోజు ఆఫీసర్లు వచ్చినప్పుడే ఈ పక్షులు కూడా వచ్చాయి అసలు ఇక్కడ ఏం జరుగుతుంది.' అని ఆలోచిస్తూ ఉన్నాడు సహదేవుడు.
అంతలో కొండమీదకి జాకీ తెచ్చిన ప్రసాదాలని అమ్మవారి దగ్గర పెట్టి అందరికీ పంచి పెట్టమని శంభుకి చెప్పాడు గోకుల్.
"సరే దొర!" అని అమ్మవారికి నైవేద్యం పెట్టి అక్కడ ఉన్న వారందరికీ ప్రసాదాలు పంచి పెడుతూ ఉన్నాడు శంభు.
అక్కడ ఉన్న వాళ్ళందరికీ ప్రసాదాలు పంచి పెట్టడంతో తింటూ ఉండడం చూసి "మేము వెళ్లి ఉదయం వస్తాము." అని శంభుకి చెప్పి అక్కడి నుంచి బయలుదేరారు ముకుల్ వాళ్ళు.
"సరే దొర! తోడుగా ఎవరినైనా పంపించమంటారా?" అని అడిగాడు శంభు.
"అవసరంలేదు మీరందరూ ప్రశాంతంగా ఈ కొండ మీదే ఉండండి." అని చెప్పి ముకుల్ వాళ్లతో కలిసి కిందకు బయలుదేరాడు అభిజిత్.
చెట్టు మీదే ఉండి అక్కడి నుంచి వెళ్ళిపోతున్న ముకుల్ వాళ్ళని చూసి 'వీళ్ళు ఇక్కడ నుంచి వెళ్ళిపోతున్నారు, ఆ తుపాకులతో ఉన్న వాళ్ళు వెళ్లడం లేదు ఏమిటి?' అని అనుమానం వచ్చి చెట్టు దిగకుండా అక్కడే ఉన్నాడు సహదేవుడు.
ముకుల్ వాళ్ళు అక్కడి నుంచి వెళ్లిన కాసేపటికి కొండ చుట్టూ ఉన్న పాయిజన్ బాంబ్స్ బ్లాస్ట్ చేసాడు జేమ్స్.
చెట్టు మీద నుండి కొండ చుట్టూ ఆకుపచ్చ రంగు పొగ రావడం చూసి 'ఇది ఎక్కడి నుంచి వస్తుంది.' అనుకుని చెట్ల మీద నుంచి పాకుతూ పొగ వచ్చే కొండల వైపుకు వెళ్ళాడు సహదేవుడు.
అంతలో కొండ మీద నుంచి అరుస్తూ జంతువులు కిందకి రావడం చూసి వాటిని షూట్ చేస్తూ ఉన్నారు జేమ్స్ మనుషులు.
కొండ కింద దాచిన ఏనుగు పిల్ల వైపు చూసి 'అక్కడే ఉండండి బయటికి రావద్దు.' అని శబ్దం చేస్తూ సిగ్నల్ ఇచ్చి ఏమి జరుగుతుందో అర్థం కాక చనిపోతున్న జంతువుల్ని చూస్తూ ఏడుస్తూ
'కొండమీద ఉన్న మన వాళ్ళు ఎవరు కిందకి దిగడం లేదు, అరుపులు వినిపించడం లేదు, ఈ ఆకుపచ్చ పొగ వల్ల వాళ్లకి ఏదైనా జరిగిందా? ఎలాగైనా వాళ్ళని కాపాడాలి.' అనుకుని కిందకి దిగబోయి
మళ్లీ ఆగి 'జరిగిన విషయం నాయకుడికి చెప్పడానికి ఒక్కరైనా మిగిలి ఉండాలి కదా!" అని చెట్టు కొమ్మ పట్టుకుని అక్కడే ఉండిపోయాడు సహదేవుడు.

![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)