28-01-2026, 06:59 PM
(This post was last modified: 28-01-2026, 07:00 PM by SivaSai. Edited 1 time in total. Edited 1 time in total.)
Part - 66
గదిలోకి తీసుకువెళ్లి మంచం మీద పడుకోబెట్టి ముద్దు మురిపాలలో భార్యని ఉయ్యాల ఊగించి సేదతీర్చుతాడు.
భర్త ప్రేమకి మురిసిపోతూ అతని చేతలకి సిగ్గులమొగ్గ అవుతుంది. తనివితీరని దాహానికి కాసేపు విశ్రాంతినిచ్చి.. భార్యా సమేతంగా సరిగంగా స్నానం చేసి..ఫుడ్డు తన చేతులతో తానే తినిపిస్తాడు.
అవనికి ఏ విషయంలో కూడ ఆలోచన రాకుండా తన ప్రేమతో ఉక్కిరిబిక్కిరి చేస్తూ ఉంటాడు.
చుడీదార్స్, చీరలు మాత్రమే కట్టుకునే అవిని చేత జీన్స్ దగ్గర్నుంచి మినీ ఫ్రాక్స్ దాకా వేపిస్తాడు. ఆ ఫ్రాక్స్ వేసుకున్నప్పుడు మాత్రం అవని ఇబ్బందులు ఆ పరమాత్ముడికే ఎరుక...
జీన్స్ వేసుకున్నప్పుడైనా కష్టంగా నైనా సరే కొంచెం ముందుకు వస్తుంది కానీ.. ఫ్రాక్ వేసుకొన్నప్పుడు కాళ్లు కనపడకుండా టవల్ కట్టేస్తోంది.
అది చూసిన విక్రమ్ తల కొట్టుకుంటు వెళ్లి టవల్ తీసేసి అద్దం ముందు నుంచి పెట్టి నేను చూడనిది ఏమైనా ఉందా ...
అది వేరు ఇది వేరే అండి అని మెలికలు తిరుగుతూ ఉంటుంది. ఏం వేరు భార్యమణి... అప్పుడైనా,ఇప్పుడైనా చూసేది నేనే కదా అని కొంటెగా అంటాడు.
ఈ గౌన్లో ఎలా ఉన్నావో తెలుసా? అచ్చు బుట్ట బొమ్మలాగా ఉన్నావు. నాకు ఒక డ్రీమ్ ఉండేది . నా ప్రేయసి తో ఇలా పబ్ కి వెళ్లి ఎంజాయ్ చేయాలి అని...
బట్ పెళ్ళికి ముందు ఎవరూ నాకు నచ్చలేదు. పెళ్లయిన తర్వాత నా భార్య నా ప్రేయసి కదా... అంటే ఏమిటి మీ ఉద్దేశం.. ఇప్పుడు నన్ను మీరు ఇలా పబ్ కి తీసుకువెళతారా... అని కంగారుగా అడుగుతుంది.
అవని కంగారు చూసి నవ్వుకుంటూ... నీకు అంత సీన్ లేదు. మన పబ్ డాన్స్ మొత్తం ఇక్కడే చేస్తాము. నా భార్యామణిని ఇలాగ ఎవరికైనా చూపిస్తానా...
దిష్టి తగలదు అని నడుము మీద చేయి వేసి నొక్కుతాడు.
అబ్బా ఏంటండీ మీరు అని సిగ్గుపడుతూ తలదించుకుంటుంది.
హేయ్.. అవని నాకు చెర్రీస్ ఇష్టము అని నీకు ఎలా తెలుసు అని అడుగుతాడు. చెర్రీ సా..ఇప్పుడు వాటి విషయం ఎందుకు వచ్చిందండి.
ఫ్రిజ్లో ఉన్నయేమో చూసి వస్తాను అంటే...అయ్యో భార్యామణి అని నుదుటిమీద కొట్టి ఆ చెర్రీస్ నీ బుగ్గల్లోనే ఉన్నాయి. చూడు అంటూ అద్దం వైపుకి తిప్పుతాడు.
అవినికి అప్పటికే సిగ్గుతో బుగ్గలు ఎరుపెక్కిపోతాయి. చూసావా నాకు ఏది ఇష్టమో నీకే బాగా తెలుసు అని భార్యని టీజ్ చేస్తూ ఉంటాడు.
అవని ఇంకా సిగ్గుతో ముడిచుకుపోతుంది. విక్రమ్ ని హత్తుకుంటుంది. రా.. అని చెప్పి తీసుకుని ఒక రూమ్ లోకి తీసుకువెళతాడు.
ఆ రూమ్ మొత్తం డిమ్ లైట్స్ పెట్టి ఉంటాయి. ఒక పక్కన వోడ్కా బాటిల్, గ్లాసెస్, లైట్ మ్యూజిక్ అరేంజ్ చేస్తాడు.
అవి చూసి పబ్ అంటే ఇలాగే ఉంటుందా అని అడుగుతుంది. అది ఇంకా గందరగోళంగా ఉంటుంది కానీ.. మనది రొమాన్స్ పబ్ అని చెప్పి మ్యూజిక్ తగ్గట్టుగా అవిని తో డాన్స్ చేపిస్తూ ఉంటాడు.
ముందు బిడియంగా అనిపించినా.. తర్వాత మెల్లిగా విక్రమ్ తో అడుగులు కదుపుతుంది. ప్రతిధ్రిల్ ని భార్యకి పరిచయం చేస్తూ... లోకం ఎలా ఉంటుందో అన్నది మెల్లిగా చూపిస్తూ ఉంటాడు.
మనం ఒకసారి శ్రీ దగ్గరికి వెళ్దాం. రెండు వేరువేరే టైమింగ్స్ లో జరుగుతున్నదని గుర్తించగలరు.
నైట్ అంతా పడుకోకుండా ఆలోచించి పొద్దుటే వాళ్ళ మదర్ కి కాల్ చేస్తాడు.
శ్రీ నుంచి కాల్ చూసిన వాళ్ళ అమ్మగారు చెప్పరా అనగానే.. అమ్మ మీరు ఏం చేస్తారో నాకు తెలియదు. నేను ఒక అమ్మాయి డీటెయిల్స్ పంపిస్తున్నాను.
ఈ సంబంధం ఎలాగైనా కుదర్చాలి.ఎందుకంటే తనే మీకు కాబోయే కోడలు. ఇది మాత్రం ఫిక్స్.
ఒరేయ్ కొంచెం గ్యాప్ ఇచ్చి మాట్లాడరా.. అలా తల తోక లేకుండా చెబితే నాకేం అర్థం అవుతుంది అంటే.. నువ్వు అసలు డాక్టర్ ఎలా అయ్యావు అమ్మ.
ఇంత వివరంగా చెబుతున్నా సరే ఏమీ అర్థం కాలేదంటావు.
నేను ఎలాగోలాగా డాక్టర్ అయ్యాను కానీ.. సరిగ్గా చెప్పు అనగానే... అవని, నేహా ఫ్రెండ్షిప్ మొత్తం చెప్పి, నేహా తనతో అన్న విషయాలు మొత్తం చెబుతాడు.
ఇప్పుడు అర్థమైంది కదా అనగానే... అర్థమైంది బాబు.. నేహ క్యారెక్టర్ మాకు నచ్చింది. నేహా పేరెంట్స్ కూడా ఆత్మ అభిమానం ఎక్కువ అని అర్థమవుతుంది.
మీ డాడీ తో కలిసి టైం చూసుకుని వెళ్లి మాట్లాడివస్తాము సరేనా అంటే... మీరు ఎప్పుడో టైం చూసుకోవడం కాదు. ఈరోజే వెళ్లండి అంటే...
ఒరేయ్ మాకు కొన్ని ఆపరేషన్ ఉన్నాయి రా.. అప్పటికప్పుడు చెప్తే డాక్టర్స్ కి ఎలా కుదురుతుంది అనుకుంటున్నావురా...
అదంతా నాకు తెలియదు మమ్మీ. మీరిద్దరూ అర్జెంటుగా వెళ్లి మాట్లాడండి. లేకపోతే ఏదైనా సంబంధం కుదిరింది అనుకో ఆయన మాట తప్పరు. నా పిల్ల నాకు దక్కదు.
ఇంతలో అక్కడికే శ్రీ నాన్నగారు వచ్చి.. ఏమైంది నీ కొడుకు ఏదో టెన్షన్ పెడుతున్నట్టు ఉన్నాడు అనగానే...
శ్రీ చెప్పిన మ్యాటర్ మొత్తం చెబుతారు.
నీ కొడుకుకి ఏదో వచ్చినా తట్టుకోవడం కష్టమే. ఫోన్ ఒకసారి ఇటుఇవ్వి అని ఒరేయ్ శ్రీ ఈరోజు మాకు ఇంపార్టెంట్ ఆపరేషన్స్ ఉన్నాయి.
రేపు వెళ్లి మాట్లాడి ఫైనల్ చేసి నీకు కాల్ చేస్తాను సరేనా అని చెబుతారు. ప్లీజ్ డాడీ... ఆయన మొహమాటానికి మీ సంబంధానికి మేము సరిపోము. వద్దు అని చెబితే.. అలాగే మీ ఇష్టం అని చెప్పి వచ్చేయకండి. ఎలాగోలాగా ఒప్పించండి .
ఒరేయ్ ఎలా హ్యాండిల్ చేయాలో మాకు తెలుసు.నువ్వు నోరు మూసుకొని ఫోన్ పెట్టేయ్.
కొడుకుని విసుక్కుంటూ ఫోన్ పెట్టేస్తారు. ఫోన్ పెట్టేసిన తర్వాత శ్రీ అమ్మగారు అయిన సురభి..ఎందుకండీ వాడితో అలా మాట్లాడుతున్నారు.
రేపు మనం వెళుతున్న విషయం చెప్పచ్చు కదా అంటే.. నీ కొడుకు ఏమైనా ప్రేమించానని ముందే మనకి చెప్పాడా... విక్రమ్ కాల్ చేసి ఇన్ఫర్మేషన్ మొత్తం ఇచ్చాడు.
అక్కడ కూడా వాళ్ళతో మాట్లాడి సెట్ చేసి ఉంచాడు. రేపు ఎదో ఫార్మాలిటీకి అంతే.. కాసేపైనా నీ కొడుకుని టెన్షన్ పడని పద హాస్పిటల్కి అని బయలుదేరుతారు.
ఒక నిమిషం వాసు అని భర్త వెనకాలే వెళుతుంది. చెప్పు అనగానే.. వాడంటే చిన్న పిల్లోడు.మీరు కూడా ఎందుకు వాడితో సరి సమానంగా గొడవ వేసుకుంటారు.
వాడు చిన్నపిల్లోడా ఈపాటికి పెళ్లి అయ్యి ఉంటే నలుగురు పిల్లలు వేసుకుని తిరిగేవాడు. పైగా నన్ను ఏమంటున్నాడు...
మాట్లాడడం రాదని వెక్కిరిస్తాడా.... అబ్బా వాడు అలా అనలేదండి. ఏదో టెన్షన్ తో అమ్మాయి ఎక్కడ తప్పిపోతుందా అన్న కంగారుతో ఏదో మాట్లాడేశాడు.
మీరు ఆ మాటలు పట్టించుకుంటే ఎలాగా అంటే..నువ్వు అలాగే వాడిని వెనకేసుకుని రా..వాడు నా మాట అసలు లెక్క చేయడంలేదు.
ఈ ఒక్క రోజుకి వాడికి తల్లిగా కాకుండా నా భార్యగా ఉండి నా గౌరవాన్ని కాపాడు. అర్థమైందా అని చెప్పి కార్ స్టార్ట్ చేస్తాడు.
మీ ఇద్దరి మధ్యన నేను నలిగిపోతున్నాను అని తల కొట్టుకుంటూ.. రేపు నాతోపాటు నా కోడలు కూడా జాయిన్ అవుతుందనుకుంటా నవ్వుతూ ఉంటుంది.
నా కోడలేమి నీలాగా కాదు. అప్పుడే నీ కొడుకుని కంట్రోల్ లో పెట్టేసుకుంది. పోనీలే ఇలాగైనా నిజాలు ఒప్పుకున్నారు అని అంటుంది.
ఏమి నిజాలు అంటే.. మీ భార్య అమాయకురాలు అని.. అబ్బో ఎటు వచ్చినా సరే నీకు అనుకూలంగా మార్చేసుకుంటావు అని నవ్వుతాడు.
ఆ నవ్వులతో శృతి కలిపి సురభి కూడ నవ్వుతూ హాస్పిటల్ కి రీచ్ అవుతారు .
శ్రీమాత్రం టెన్షన్..తో అసలు మా డాడీ వెళ్లి ఏం మాట్లాడతారు. మాట్లాడటం వచ్చా...వెళ్లి మాట్లాడితే... ఏదో ఆపరేషన్ చేసినట్టుగా మాట్లాడతారా ఏమిటి అని టెన్షన్ తో గోళ్లు కొరికేసుకుంటూ ఉంటాడు...
ఇందులో కాలింగ్ బెల్ సౌండ్ వినిపిస్తే ఎవరు అని వెళ్లి చూస్తాడు. అక్కడ నేహా రెడీ అయ్యి చేతుల్లో బౌల్స్ తో ఉంటుంది.
నేహాని అలా చూడగానే శ్రీ బాబు క్లౌడ్స్ మధ్యన విహరిస్తూ ఉంటాడు. ఎన్నిసార్లు పిలిచిన పలకడం లేదని... కళ్ళ ముందు చేతితో ఊపుతూ శ్రీ గారు అని గట్టిగా అరుస్తుంది.
నేహా చేతికి ఉన్న గాజులు సౌండ్ కి డిస్టర్బ్ అయ్యి హా.. చెప్పు అంటాడు. ఎక్కడ ఉన్నారు సార్. ఇందాకటి నుంచి పిలుస్తూ ఉంటే..
ఏదో పరిజ్ఞానంగా ఆలోచిస్తున్నారు.మిమ్మల్ని డిస్టర్బ్ చేసినట్టు ఉన్నాను అని ఇబ్బందిగా చెబుతుంది. అయ్యో నేహా నువ్వు డిస్టర్బ్ చేయడమేంటి...
నీ గురించి ఆలోచిస్తుంటేను అని మాట జారి నాలిక కరుచుకుంటాడు. నా గురించి ఏం ఆలోచిస్తున్నారు అయోమయంగా చూస్తూ అడుగుతుంది.
అదే నైట్ జర్నీ చేసి వచ్చాము కదా.. అలసటతో నిద్ర పట్టిందా లేదా అని ఆలోచిస్తున్నాను అంతే అని..
ఇంతకీ ఆ బౌల్స్ ఏంటి అని టాపిక్ చేంజ్ చేస్తాడు.
ఓ అదా.. మీకోసమని బ్రేక్ ఫాస్ట్ చేసి తీసుకు వచ్చాను. అలాగే మీకు లంచ్ కూడా ప్రిపేర్ చేసేసాను సార్.బాక్స్ ఇదిగో అని చెప్పి ఇచ్చి నేను ఆఫీస్ కి బయలుదేరుతున్నాను అని చెబుతోంది .
ఒక్క నిమిషం నేహా అని పిలుస్తాడు. చెప్పండి సార్ అనగానే..ఆఫీస్ కి ఎలా వెళుతున్నావు అని అడుగుతాడు.
క్యాబ్ బుక్ చేసుకుంటున్నాను అని చెబుతోంది. నేను ఆఫీస్కే కదా వెళ్లేది. డ్రాప్ చేస్తాను అంటే... వద్దు సార్. ఎవరైనా చూస్తే బాగోదు అని ఇబ్బందిగా చెబుతుంది.
ఇందులో అంత ఇబ్బంది పడేది ఏముంది అంటే.. కొన్ని కొన్ని పరిచయాలు ఒకచోట ఉంటేనే బాగుంటాయి. అది క్రాస్ చేస్తే అందరమూ ఇబ్బంది పడాల్సి వస్తుంది.
మీతో పాటు కారులో వస్తే ఎవరైనా నా గురించి తప్పుగా అనుకోని రూమర్స్ స్ప్రెడ్ చేస్తే చాలా కష్టం కదా..అది నాకు అసలు ఇష్టం లేదు.నన్ను ఇలాగే ఉండనివ్వండి సార్ అని చెప్పి వెళ్ళిపోతుంది.
వెళుతున్న నేహాన్ని చూస్తూ గుండెలపై రబ్ చేసుకుంటూ నచ్చేస్తున్నావే పిల్ల అని నవ్వుకుంటాడు.
కథ కొనసాగుతుంది..

![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)