Thread Rating:
  • 5 Vote(s) - 3.6 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
ఖైదీ నెంబర్ 402 - నా మాటే శాసనం
ఎపిసోడ్ 46


అడవిలో జంతువులు చనిపోయి వాటి వల్ల వచ్చిన వైరస్ కి జబ్బు పడటంతో ఏం చేయాలో తెలీక అభిజిత్ సహాయం అడగమని చెప్పాడు శంభు.

తండ్రి మాట కాదనలేక  అభిజిత్ దగ్గరికి ఒక మనిషిని పంపించాడు అభీర్.

****************

నాలుగు రోజుల తర్వాత జేమ్స్ టీమ్ తో కలిసి బేర అడవి దగ్గరికి వచ్చి అభీర్ ని కలిసి "విదేశీయులు ప్రత్యక్ష యుద్ధం చేయలేక ఇటువంటి వైరస్ లతో దాడి చేస్తున్నారు, నువ్వు ముందుగానే నాకు విషయం చెప్పి మంచి పని చేశావు లేకపోతే మీరు చాలా నష్టపోవాల్సి వచ్చేది."

అని తన పక్కన ఉన్న జేమ్స్ ని పరిచయం చేస్తూ "ఆయన పెద్ద డాక్టర్! మీ వాళ్ళందరికీ తగ్గేవరకూ వాళ్ళ స్టాఫ్ మొత్తం ఇక్కడే ఉంటారు." అని చెప్పాడు అభిజిత్.

ఆ మాట విని "మీరు చేస్తున్న సహాయం మర్చిపోలేము, మీ వాళ్ళందరూ ఉండడానికి తగిన ఏర్పాట్లు చేయిస్తాను." అని కొండ దగ్గరే గుడారాలు ఏర్పాటు చేయించాడు అభీర్.

వైరస్ బారిన పడిన ఆ గూడెం ప్రజల బ్లడ్ శాంపిల్స్ టెస్ట్ చేసి యాంటీడోస్ ఇస్తు ఉన్నారు జేమ్స్ మనుషులు.

అంతలో అక్కడికి శివమణి, ముకుల్ వాళ్ళతో కలిసి అక్కడకి వచ్చాడు గోకుల్.

అక్కడికి వస్తున్న వాళ్లను చూసి  "ఆయనా గోకుల్ తండ్రి  ముకుల్ నంద  గారు! చాలా దేశాలలో వ్యాపారాలు ఉన్నాయి అక్కడ కూడా మీలాగా కొండలలో ఉండే తెగ వారికి వైద్య సహాయం చేస్తూ ఉంటారు మీ గురించి తెలిసి చూడడానికి వచ్చారు." అని చెప్పాడు అభిజిత్.

"అవునా?" అని ముకుల్ దగ్గరికి వెళ్లి " మీలాంటి వారు ఇక్కడికి వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. అమ్మవారి దర్శనం చేసుకోండి. " అని తీసుకువెళ్ళాడు అభీర్.

అమ్మవారి దర్శనం చేసుకుంటూ పాదాల దగ్గర ఉన్న పంచరత్నాలు, చుట్టూ ఉన్న కొండలు చూసి "మీ ప్రదేశం చాలా ప్రశాంతంగా చాలా అందంగా ఉంది. మీరు ఇక్కడ ఉన్న మూగజీవాలతో కలిసి జీవించడం చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది." అని చెప్పాడు ముకుల్.

అక్కడికి వస్తూ "ఇటువంటి వ్యాధి మా గూడానికి ఎప్పుడు రాలేదు ఇదే మొదటిసారి దొర! మా అభీర్ అనుమానం ఏమిటంటే ఎవరో కావాలని ఈ వ్యాధి వచ్చేటట్టు చేశారు అని అంటున్నాడు." అని చెప్పాడు శంభు.

"మీ అబ్బాయికి వచ్చినా అనుమానం నిజమే! ఇటువంటి వ్యాధులు చాలా దేశాల్లో వస్తున్నాయి అందులోను మీది అడవి ప్రాంతం కాబట్టి జంతువుల ద్వారా సోకే ప్రమాదం ఉంది.

ఇప్పుడు మా డాక్టర్స్ ఇచ్చే మెడిసిన్ తో మీ వాళ్ళు పూర్తిగా జబ్బు నుంచి బయట పడతారు, మీరు అనుమతిస్తే జంతువులకి కూడా టీకాలు వేయిస్తాను అప్పుడు మళ్లీ ఇటువంటి జబ్బులు ఈ గూడెం పరిసరాలలోకి రాకుండా ఉంటాయి." అని చెప్పాడు ముకుల్.

ఆ మాట విని అభీర్ వైపు చూసాడు శంభు.

"మాతో పాటు ఇక్కడ ఉన్న జంతువులు కూడా క్షేమంగా ఉండాలి ఈ మందు వాటికి కూడా ఇవ్వండి." అని చెప్పాడు అభీర్.

"సరే!" అని చెప్పి "అవును! ఇటువంటి జబ్బులు చేసినప్పుడు మీ గూడాలలో ఏదో జాతర ఆచారాలు ఉంటాయి కదా అది ఒకసారి జరిపించకపోయారా  అమ్మవారు కూడా శాంతిస్తుంది." అని చెప్పాడు ముకుల్.

"తప్పకుండా జరిపిస్తాము దొర!  మీ అందరికీ కూడా ఆహ్వానం పంపుతాము." అని చెప్పాడు శంభు.

"మీకు అభ్యంతరం లేకపోతే ఈసారి జాతర ఏర్పాటు ఘనంగా నేను ఏర్పాటు చేస్తాను ఆ అమ్మవారి దయ మాకు కూడా కలుగుతుంది." అని చెప్పాడు అభిజిత్.

"సరే దొర! జాతర ఏర్పాటు చేయగానే మీకు కబురు పంపుతాము." అని చెప్పాడు శంభు.

అక్కడికి వచ్చి "సార్! ఇక్కడ జబ్బు చేసిన వాళ్లందరికీ మెడిసిన్ ఇచ్చేసాము ఇంకా వీళ్ళకి ఎటువంటి ప్రాబ్లం ఉండదు. కానీ ఇక్కడ గాలిలో వైరస్ స్ప్రెడ్ అయింది మీరు ఓకే అంటే కొండ ప్రాంతాలు మొత్తం శానిటైజ్ చేసి క్లీన్ చేస్తాము." అని చెప్పాడు జేమ్స్.

ఆ మాట విని "ఈ గూడెం నాయకుడి అనుమతి తీసుకోవాలి కదా!" అని అభీర్ వైపు చూశాడు గోకుల్.

"అంటే! ఈ కొండ ప్రాంతం మొత్తం ముందు జల్లుతారా?" అని అడిగాడు అభీర్.

ఆ మాటకి నవ్వుతూ "నువ్వు బానే కనిపెట్టావు చాలా తెలివైన వాడివి, అలా జల్లడం వల్ల ఆ వ్యాధి మళ్లీ మీ దగ్గరికి కూడా రాదు." అని చెప్పాడు ముకుల్.

"సరే! మీకు తోడుగా మా మనుషులను కూడా పంపిస్తాను." అని చెప్పాడు అభీర్.

"ఓకే సార్! త్రీ డేస్ పడుతుంది.మేము వర్క్ కంప్లీట్ చేసుకుని వస్తాము." అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు జేమ్స్.

అక్కడ నుంచి బయలుదేరూతు శంభు, అబీర్ వైపు చూసి "ఏ ఇబ్బంది ఉన్న వెంటనే మాకు ఒక్క మాట చెప్పండి చాలు ఇక్కడ వాలిపోతాము." అని చెప్పాడు గోకుల్.

"సరే దొర! మీ సహాయం ఎప్పటికీ మర్చిపోలేము ఈ గూడెం ప్రజలందరూ మీకు రుణపడి ఉంటారు." అని చెప్పేడు శంభు.

ముకుల్ తో పాటు అక్కడి నుంచి బయలుదేరి దూరంగా ఉన్న కార్లు ఎక్కి వెళ్లిపోయారు అందరూ.

మూడు రోజులు పాటు ఆ కొండ ప్రాంతం అంత శానిటైజింగ్ చేసి ఆ గూడెం ప్రజలతోనే జంతువులన్నిటికీ మెడిసిన్ ఇప్పించి అభీర్ దగ్గరకు వచ్చి "మేము బయలుదేరుతున్నాము ఇక మీకు ఎటువంటి ప్రాబ్లం ఉండదు." అని చెప్పాడు జేమ్స్.

"సరే!" అని జేమ్స్ వాళ్ళని అడవి చివరి వరకు సాగనంపి సహదేవుడితో కలిసి వస్తూ "వీళ్లు ఏమి ఆశించకుండా మనకి ఎందుకు సహాయం చేస్తున్నారు?" అని అనుమానంగా అడిగాడు అభీర్.

"నాకు కూడా అదే అనుమానం వచ్చింది నాయకుడా! కానీ వాళ్ళు ఇచ్చిన మందుల వల్ల మన వాళ్ళందరూ మళ్లీ మామూలు మనుషులు అయ్యారు నాలుగు రోజులు ఒక్క జంతువు కూడా చనిపోలేదు." అని చెప్పాడు సహదేవుడు.

అక్కడికి వస్తున్న అభీర్ వైపు చూసి "నువ్వు ప్రతి దానికి అనుమానం పడకు బిడ్డ! ఆ దైవమే మనల్ని కాపాడడానికి వీరిని పంపించిందేమో!" అని చెప్పాడు శంభు.

"సరే అయ్యా! నేనే తప్పుగా ఆలోచిస్తున్నాను ఏమో అమ్మవారికి జాతర ఏర్పాటు చేయాలి చుట్టూ ఉన్న వాళ్ళని ఇక్కడకు రమ్మని కబురు పంపించాలి." అని చెప్పాడు అభీర్.

"నీకు నామకరణం జరిగిన తర్వాత జరిగే మొదటి జాతర నువ్వు ఈ గూడెం వదిలి వెళ్ళిన వాళ్లతో కలిసి శివాజీ మహారాజ్ పూజించిన భవాని మతని దర్శనం చేసుకుని అక్కడ మూడు రాత్రులు నిద్ర చేసి జాతర చివరి రోజుకి ఇక్కడికి చేరుకోవాలి." అని చెప్పాడు శంభు.

"సరే అయ్యా! నువ్వు ఇక్కడ జరిగే జాతర రోజు నిర్ణయించగానే  నేను మనవాళ్ళకి సమాచారం ఇచ్చి అమ్మ దగ్గరికి బయలుదేరుతాను." అని చెప్పాడు అభీర్.

*******************
మరుసటి రోజు డిల్లీ లో ఉన్న గెస్ట్ హౌస్ కి జేమ్స్ వాళ్ళు రావడంతో "మన మీద వాళ్ళకి పూర్తి నమ్మకం కుదిరింది కదా!" అని అడిగాడు ముకుల్.

"ఎస్ సార్! ఇప్పుడు మనం ఏం చేసిన వాళ్ళు నమ్ముతారు." అని చెప్పాడు జేమ్స్.

"సార్! మీ ప్లాన్ ఏమిటో నాకు అర్థం కావట్లేదు, వాళ్లకి మన మీద ఎంత నమ్మకం కుదిరిన సరే అక్కడ ఉన్న ఒక్క రాయి కూడా ముట్టుకొనివ్వరు." అని చెప్పాడు శివమణి.

"ఆ విషయం నాకు కూడా తెలుసు! జేమ్స్ మనుషులు అక్కడ ఉన్న కొండల చుట్టూ తిరుగుతూ మూడు రోజుల శానిటైజింగ్ చేస్తూ కూర్చున్నారు అనుకుంటున్నావా?" అని అడిగాడు ముకుల్.

ఆ మాట విని "కాదా సార్! మరి వాళ్ళు ఏం చేశారు?" అని డౌట్ గా అడిగాడు మురళి జోషి.

"ఆ ప్రదేశం చుట్టూ పాయిజన్ బాంబ్స్ ఉంచాము, అక్కడ జరిగే జాతర సమయంలో వాళ్లలో ప్రతి ఒక్కరు ఆ కొండమీదికి చేరుకుంటారు మన మనుషులు కూడా వాళ్లతో పాటు అక్కడే ఉంటారు.

టైం చూసి ఆ బాంబ్స్ బ్లాస్ట్ చేస్తాము విషవాయువు మొత్తం ఆ కొండ మీదకు చేరుకుంటుంది అక్కడ ఉన్నవాడు ఎవడు బతికి ఉండడు." అని చెప్పాడు జేమ్స్.

"అదే జరిగితే అక్కడ ఉన్న గవర్నమెంట్ కి కచ్చితంగా డౌటు వస్తుంది." అని చెప్పాడు అభిజిత్.

"అందుకే కదా! కొండలలో నుంచి విష వాయువులు వస్తున్నాయని మన మినిస్టర్ రిపోర్ట్ రెడీ చేయిస్తున్నాడు, మన ఆఫీసర్స్ కూడా టెర్రరిస్టులు రసాయనిక దాడి చేశారు అని రిపోర్ట్ రెడీ చేస్తారు.

అక్కడ ఉన్న కొండలు వల్లే ఇలా జరిగింది అని  వాటిని తొలగించమని మన మినిస్టర్ ఆర్డర్ పాస్ చేస్తాడు మనం వాటిని తవ్వి ఆ ఏరియా ని సేఫ్ జోన్ గా చేస్తాము." అని నవ్వుతూ చెప్పాడు ముకుల్.

"అలాంటప్పుడు మళ్ళీ మరి మనం జాతర ఏర్పాటు చేయడం ఎందుకు?" అని డౌట్ గా అడిగాడు శివమణి.

"ఆ విష వాయువులు రావడంతోనే వాళ్ళు అక్కడి నుంచి పారిపోవడానికి ట్రై చేస్తారు అలా వెళ్లకుండా ఉండడానికి వాళ్ళు తినే ఫుడ్ లో మత్తు ముందు కలిపి పంపిస్తాము ఇంక ఆ కొండ మీద జంతువు కాదు కదా మనిషి కూడా బతికి ఉండడు." అని చెప్పాడు ముకుల్.

"గుడ్ ఐడియా డాడ్! ఒక్క దెబ్బకి అక్కడ ఎవరూ లేకుండా పోతారు ఒకవేళ బయట ఎవరైనా ఉన్నా జాతర సమయానికి అక్కడికి చేరుకుంటారు కాబట్టి, వాళ్లు కూడా మిగలరు ఇంకా ప్లేస్ గురించి మనల్ని అడిగేవాడు కూడా ఉండడు." అని సంతోషంగా చూస్తూ చెప్పాడు గోకుల్.

"మరి ఆ విషవాయువులు చుట్టుపక్కలకు స్ప్రెడ్ అయితే చాలా చికాకు అవుతుంది. గవర్నమెంట్ రంగంలోకి దిగుతుంది. అక్కడ ఉన్న మన వాళ్ళు కూడా చనిపోతారు కదా!" అని డౌట్ గా అడిగాడు సర్పరాజ్.

ఆ విష వాయువుల వల్ల ఎవరికి ప్రమాదం ఉండదు  "మనం ఇచ్చిన మెడిసిన్ బాడీ లోకి వెళ్ళిన వాళ్ళకి మాత్రమే ప్రమాదం! అసలు వాళ్ళు ఎలా చనిపోయారో కూడా ఎవరో తెలుసుకోలేరు." అని చెప్పాడు జేమ్స్.

"మరి ఇదంతా జరిగేది ఎప్పుడూ అంకుల్!" అని అడిగాడు అభిజిత్.

"వాళ్లు జాతర డేట్ అనౌన్స్ చేయడంతోనే నీకు కబురు అందుతుంది. అప్పుడు మన వర్క్ స్టార్ట్ అవుతుంది అప్పటివరకు అందరూ సైలెంట్ గా ఉండండి. మన రోబోట్స్ ని కూడా చెట్ల మీద నిద్ర పోనివ్వండి వాళ్ళని సంతోషంగా చావనివ్వండి." అని చెప్పాడు ముకుల్.
[+] 11 users Like SivaSai's post
Like Reply


Messages In This Thread
RE: వేదం - by Manmadhsbanam143 - 22-12-2025, 04:13 PM
RE: ఖైదీ నెంబర్ 402 - నా మాటే శాసనం - by SivaSai - 27-01-2026, 11:11 PM



Users browsing this thread: 1 Guest(s)