27-01-2026, 11:10 PM
ఎపిసోడ్ 45
గెస్ట్ హౌస్ కి వచ్చిన శివమణి వాళ్ళతో జంతువుల్ని చంపడానికి తను తెచ్చిన పక్షి లాగ ఉండే రోబోట్ ని చూపించి ఎలా పనిచేస్తుందో చెప్పి తన ప్లాన్ మొత్తం వివరంగా చెప్పాడు.జేమ్స్.
****************
ఒకరోజు ఉదయం మురళీ జోషి వాళ్లతో పాటు బేరా అడివిలోకి వెళ్ళాడు జాకి.
అడవిలో కొంతమందితో కలిసి నడుచుకుంటూ వస్తున్న జాకిని చూసి "ఏంటి దొర ఇటు వచ్చావు?" అని అడిగాడు సహదేవుడు.
"ఒక్కసారి మీ శంభు దొరని తో కలవాలి, మొన్న మీ మీద దాడి చేయడానికి వచ్చిన వాళ్ల గురించి మాట్లాడడానికి ఆఫీసర్స్ వచ్చారు." అని మురళి జోషి వాళ్ళని చూపించాడు జాకి.
"సరే! మీరు ఆ కొండ కింద సేద తిరండి. నేను వెళ్లి మా దొరని తీసుకొస్తాను." అని అక్కడి నుంచి వేగంగా వెళ్ళాడు సహదేవుడు.
అక్కడ ఉన్న కొండ కింద కూర్చుని బ్యాగ్ లో ఉన్న రోబోట్ పావురాలని బయటకు తీస్తూ జనార్దన్ వైపు చూసి "నెమ్మదిగా ఒక్కొక్క దాన్ని వదిలిపెట్టండి." అని చెప్పాడు జాకి.
బ్యాగ్ లో ఉన్న పావురాలని వదిలిపెట్టి సాటిలైట్ ఫోన్ ఆన్ చేసి జేమ్స్ కి సిగ్నల్ ఇచ్చాడు మురళి జోషి.
ముకుల్ గెస్ట్ హౌస్ లో లాప్టాప్ లో అడవిలో వదిలిన 10 పావురాలని యాక్టివేట్ చేసి ఆపరేట్ చేస్తూ చుట్టూ ఉన్న చెట్లు మీద అరేంజ్ చేసాడు జేమ్స్.
అంతలో అభీర్, శంభు లతో కలిసి అక్కడికి వస్తు ఎగురుతున్న పావురాలను చూసి "దొర! మన అడవిలోకి కొత్త పక్షులు వస్తున్నాయి." అని సంతోషంగా చెప్పాడు సహదేవుడు.
ఆ మాట విని టెన్షన్ గా చూస్తూ ఉన్నారు ముగ్గురు.
"శీతాకాలం వస్తుంది కదా కొత్త కొత్త పక్షులు వలస వస్తూ ఉంటాయి." అని చెప్పాడు శంభు.
"అవును దొర! కాని ఇవి పావురాలు లాగా ఉన్నాయి ఎప్పుడు అడవిలోకి రాలేదు." అని చెప్పాడు సహదేవుడు.
"కొత్త కొత్త మనుషులే అడవిలోకి వస్తున్నారు అవి రావడానికి ఏముంది." అని జాకీ వైపు చూసి
"నాయకుడిని కలవాలి అని చెప్పారు అంట!" అని అడిగి వెనక ఉన్న మురళీ జోషి వాళ్ళ వైపు చూసి "ఎవరు వీళ్లంతా?" అని అనుమానంగా అడిగాడు అభీర్.
"మీ మీద దాడి జరిగింది కదా ఆ వివరాలు తెలుసుకోవడానికి వచ్చిన ఆఫీసర్లు!" అని చెప్పాడు జాకి.
"మీకేమి వివరాలు కావాలో చెప్పండి ఇక్కడకు వచ్చిన వాళ్లయితే బతికి లేరు." అని చెప్పాడు అభీర్.
అక్కడ ఉన్న బూడిదను కాలితో తంతు "వాళ్ళు చనిపోయారు అని మాకు అర్ధం అయ్యింది. కానీ వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారో తెలుసుకోవాలి అంటే వాళ్ల దగ్గర ఉన్న తుపాకులు, వస్తువులు మాకు కావాలి, వాటిని బట్టి వాళ్ళు ఏ దేశంలో నుంచి ఇక్కడ వచ్చారో తెలుస్తుంది." అని చెప్పాడు మురళి జోషి.
"ఆ మనుషులు ఏ దేశం నుంచో రాలేదు ఇక్కడి నుంచే వచ్చారు, వాళ్ల వస్తువులు కావాలి అంటే నిరభ్యంతరంగా తీసుకు వెళ్ళవచ్చు!" అని సహదేవుడి వైపు చూశాడు అభీర్.
"మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి, వాళ్ళు చాలా ప్రమాదకరమైన వాళ్ళు, మీరు ఒప్పుకుంటే కొంతమంది ఆఫీసర్స్ ని ఇక్కడ సెక్యూరిటీగా పెడతాము." అని చెప్పాడు జనార్ధన్.
"ఏమీ అవసరం లేదు దొర! వాళ్ళని మేము ఎదుర్కోగలము, ఈ ప్రదేశం నాశనం చేయడానికి ఎంతమంది వచ్చినా సరే మమ్మల్ని దాటి తిరిగి వెళ్ళలేరు." అని చెప్పాడు శంభు.
"అవును! వాళ్లు ఈ దేశం వాళ్లేనని మీకు ఎలా తెలిసింది?" అని డౌట్ గా అడిగాడు జాకి.
"ఆ మనుషుల దగ్గర దొరికిన సొమ్ము మన దేశానిదే!" అంటూ ఏనుగు మీద వస్తువులు తీసుకు వస్తున్న సహదేవుడు వైపు చూసి "మీకు కావలసినవి తీసుకోండి." అని చెప్పాడు అభీర్.
ఆ వస్తువులు ఉన్న ముట తీసుకొని "మీకు ఎటువంటి సహాయం కావాలన్నా అభిజిత్ గారికి ఒక మాట చెప్పండి చాలు మేమందరం ఇక్కడే ఉంటాము." అని చెప్పాడు మురళి జోషి.
"సరే దొర! ధన్యవాదాలు ఇంకా జాగ్రత్తగా వెళ్ళిరండి." అని చెప్పాడు శంభు.
అక్కడినుంచి జాకీ తో కలిసి వెళుతూ "వీళ్ళతో పాటు జంతువులు కనపడతాయి అని చెప్పావు,ఆ ఏనుగు తప్పితే ఏమీ కనపడలేదు." అని అడిగాడు మురళి జోషి.
"నీ టైం బాగుంది త్వరగా పద లేకపోతే ఏ పెద్ద పులో వెంటపడుతుంది." అని చెప్పాడు జాకీ.
వెనకాల వేగంగా నడుస్తూ "సార్! వీళ్ళని మోసం చేయడం చాలా ఈజీ ఇంత ప్లానింగ్ అవసరం లేదు." అని చెప్పాడు జనార్ధన్.
"సరేగాని! మనం వదిలిన పావురాలు మొత్తం జాగ్రత్తగా ఎగిరిపోయాయి కదా!" అని అడిగాడు జాకీ
"జాగ్రత్తగా ఎగిరి చెట్ల మీద కూర్చున్నాయి." అని చెప్పాడు జనార్దన్.
"సరే! నువ్వు ఈ తుపాకులు వస్తువులు తీసుకువెళ్లి రోజుకు ఒకడిని ఎన్కౌంటర్ చేసినట్లు రాసుకో!" అని చెప్పాడు జాకీ.
"అలాగే!" అని వాళ్ళు వచ్చిన కారు డిక్కీ ఓపెన్ చేసి గన్స్ లోపల పెట్టి అక్కడి నుంచి ఫాస్ట్ గా వెళ్ళిపోయారు ముగ్గురు.
గెస్ట్ హౌస్ దగ్గర వీడియోలో చూస్తూ "సార్! గేమ్స్ స్టార్ట్ చేద్దామా?" అని ముకుల్ ని అడిగాడు జేమ్స్.
"నో! అక్కడికి వెళ్ళిన మనుషులని రానివ్వు, లేకపోతే మన మీద అనుమానం వస్తుంది." అని చెప్పాడు ముకుల్.
"ఓకే సార్!" అని 10 పావురాల కళ్ళల్లో ఉన్న కెమెరాలు నుంచి అన్ని యాంగిల్స్ లో అడవి మొత్తాన్ని చూస్తూ ఉన్నాడు జేమ్స్.
*****************
అక్కడి నుంచి శంభుతో కలిసి గూడెం దగ్గరికి వెళుతూ "అయ్యా! నాకు ఏదో కీడు శంకిస్తుంది. ఈ అడవికి ఆపద రాబోతున్నట్లు అనిపిస్తుంది." అని దిగాలుగా చెప్పాడు అభీర్.
"మన వాళ్ళు ఇక్కడి నుంచి వెళ్ళిన దగ్గర్నుంచి అదే ఆలోచనలో ఉన్నావు, అందుకే నీ మనసుకి అలా అనిపిస్తుంది అంతా బానే ఉంది అవసరమైతే అభిజిత్ గారికి చెబుదాము." అని చెప్పాడు శంభు.
"అయ్యా! అయన మనం మేలుకోరేవాడే అంటావా?" అని అనుమానం గా అడిగాడు అభీర్.
"మేలు కోరే వారు కాబట్టే మనకి సమాచారం ఇచ్చారు ఇప్పుడు ఆఫీసర్లు పంపించారు అలాగే మన నుంచి ఏమీ ఆశించలేదు." అని చెప్పాడు శంభు.
"సరే!" అని గూడెం లోపలికి వెళ్లి అక్కడ ఉన్న అమ్మవారి విగ్రహం వైపు చూస్తూ 'నా జాతిని, ఈ అడవిని కాపాడే శక్తిని ఇవ్వు తల్లి!' అని మనసులో అనుకున్నాడు అభీర్.
************
రెండు రోజుల తర్వాత వీడియోలో చూస్తూ అటువైపు వచ్చిన జంతువులకి పాయిజన్ ఇంజక్షన్ షూట్ చేస్తూ ఉన్నడు జేమ్స్.
బోర్డర్ నుంచి బేరా అడవిలోకి టెర్రరిస్టులు ఎంటర్ అవుతున్నారు అని రిపోర్టు రాసి మంద గ్యాంగ్ లో కొంతమందిని ఎన్కౌంటర్ చేసినట్టు పై ఆఫీసర్స్ కి వేపన్స్ సబ్మిట్ చేశాడు మురళి జోషి.
*******************
ఒకరోజు అడవిలో ఎగురుతూ జంతువులు చనిపోయి ఉండడం చూసి వేగంగా అభీర్ దగ్గరికి వచ్చి భయంకరంగా అరుస్తూ ఉన్నాడు సింబా.
ఆది విని "అక్కడకి తీసుకువెళ్ళు!" అని చెప్పాడు అభీర్.
సింబా వెనకాల వేగంగా కొంతమంది కలిసి చనిపోయిన జంతువులు దగ్గరికి వెళ్లి కళేబరాలుగా మారడం చూసి షాక్ అయ్యి "అసలు ఇలా ఎందుకు జరుగుతుంది?" అని టెన్షన్ గా చూస్తూ అన్నాడు అభీర్.
"అయ్యో! కన్న బిడ్డల లాగా చూసుకున్నాము ఇలా చనిపోతున్నాయి ఏమిటి? ఇక్కడ ఏదో ఆపచారం జరిగింది." అని ఏడుస్తూ ఉన్నారు గూడెం ప్రజలు.
చనిపోయిన జంతు కళేబరా దగ్గరకు వెళ్లి ముట్టుకుని వాసన చూసి "విష ప్రయోగం వల్ల చనిపోయాయి." అని చెప్పాడు శంభు.
ఆ మాట విని "ఎవరో కావాలని చేస్తున్నారు ఇక్కడ ఉన్న జంతువులన్నీ మనకు గూడానికి తోలుకు వెళ్ళండి. కొన్ని రోజుల వరకు అడవిలోకి రాకూడదు." అని చెప్పాడు అభీర్.
ఆ మాట విని వేగంగా ఆకాశంలోకి ఎగిరి అడవి మొత్తం తిరుగుతూ జంతువులకు సిగ్నల్ ఇచ్చింది సింబా.
చనిపోయిన జంతువులను పూడ్చిపెట్టి ఏడుస్తూ వాళ్ల గూడానికి వెళ్లారు అందరూ.
వీడియోలో అక్కడ జరిగేదంతా చూస్తూ "జేమ్స్! ఆడియో కూడా అవైలబుల్ గా ఉంటే బాగుండేది." అని నవ్వుతూ చెప్పాడు ముకుల్.
"అంకుల్! జంతువులు మొత్తం అడవిలో నుంచి ఎక్కడికో వేగంగా వెళుతున్నాయి వాళ్లకి ఏదో అనుమానం వచ్చినట్లు ఉంది." అని చెప్పాడు అభిజిత్.
వీడియోలో చూస్తూ "జంతువులు మొత్తం కొండమీదికి వెళుతున్నాయి, మన రోబోట్స్ ని కూడా వెనకాలే పంపించండి." అని చెప్పాడు గోకుల్.
"ఇప్పుడు వెళ్లాల్సింది రోబోట్స్ కాదు నాలుగు రోజుల తరువాత మనం అక్కడకి వెళ్ళాలి." అని చెప్పాడు జేమ్స్.
"మనం అక్కడికి వెళ్లి ఇప్పుడేం చేస్తాము." అని కంగారుగా అడిగాడు శివమణి.
"ఆ జంతువుల కళేబరాలు ముట్టుకున్న గూడెం మనుషులకి వైరస్ ఎటాక్ అయ్యి మంచాన పడతారు మనం వెళ్లి యాంటీ డోస్ ఇచ్చి రికవరీ చేద్దాము." అని చెప్పాడు జేమ్స్.
"మనం వెళ్లి రికవరీ చేయడం ఎందుకు చస్తే కొంతమంది తగ్గుతారు కదా!" అని చెప్పాడు గోకుల్.
"నో నో! వాళ్ళకి మన మీద పూర్తి నమ్మకం రావాలి అప్పుడే మా ప్లాన్ వర్క్ అవుట్ అవుతుంది." అని చెప్పాడు జేమ్స్.
"అక్కడ వాళ్లకి జబ్బు చేసిందని వాళ్ళు చెప్పకుండా మనం వెళితే అనుమానం వస్తుంది కదా!" అని అడిగాడు సర్పరాజ్.
"నాకు తెలిసి ఖచ్చితంగా అభిజిత్ కి కబురు వస్తుంది వెళ్లడానికి రెడీగా ఉండండి." అని చెప్పాడు జేమ్స్.
*******************
జంతు కళేబారాల నుంచి వచ్చిన వైరస్ వల్ల గూడెంలో శంభు తో సహా కొంత మందికి జబ్బు చేయడంతో "అభీర్ దగ్గరికి వచ్చి వాళ్ళని నువ్వే నయం చేయాలి నాయకుడా? నీకు ప్రాణం పోసే శక్తి ఉంది కదా!" అని అడిగాడు సహదేవుడు.
"నాకు ప్రాణం పోసే శక్తి ఉంది కానీ వాళ్ళు ప్రాణాలతోనే ఉన్నారు, జబ్బు ఏమిటో తెలుసుకుని మందు వేయాలి అప్పుడే తగ్గుతుంది." అని చెప్పాడు అభీర్.
"ఈ విషయం అభిజిత్ గారికి తెలిపితే ఏదైనా సహాయం చేస్తారేమో!" అని చెప్పాడు సహదేవుడు.
"అవును బిడ్డ! అభిజిత్ గారికి వెంటనే ఈ విషయం గురించి కబురు పంపించు తప్పకుండా సహాయం చేస్తారు." అని చెప్పాడు శంభు.

![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)