27-01-2026, 10:58 PM
(This post was last modified: 27-01-2026, 11:08 PM by SivaSai. Edited 2 times in total. Edited 2 times in total.)
Part - 64
శ్రీ మొత్తం చెప్పిన తర్వాత విక్రమ్ మౌనంగా ఉంటాడు. ఏమైందిరా నేను ఇంత హ్యాపీ న్యూస్ చెప్తే..నువ్వు అలా సైలెంట్ గా ఉన్నావు అని అడుగుతాడు.
నేహా వాళ్ళ పేరెంట్స్ మనస్తత్వాన్ని అంచనా వేస్తున్నాను. మీరు వెళ్లి అడిగిన వెంటనే ఆయన ఒప్పుకుంటారా లేదా అన్నది ఆలోచిస్తున్నాను అని చెబుతాడు.
ఏమైంది రా నాకు. నాకేం తక్కువ అని అడిగితే.. అన్ని ఎక్కువే.అందుకే వాళ్ళు వద్దు అంటారేమో అని అనుకుంటున్నాను అంటాడు.
ఎందుకురా అంత బాంబు వేసావు నా నెత్తి మీద అంటే.. నేను నిజమే చెబుతున్నాను. నేహా చెప్పిన దాన్ని బట్టి వాళ్ళకి ఆత్మ అభిమానం చాలా ఎక్కువ.
అలాగే తహతకు మించిన సంబంధం చేస్తే.. రేపు ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తాయి అని కూడా భయపడతారు. ముందు వాళ్ళు భయాన్ని తీసివేసి, అప్పుడు నువ్వు పెళ్లికి గ్రీన్ సిగ్నల్ తీసుకో అని చెబుతాడు.
థాంక్స్ బావ మంచి సలహా ఇచ్చావు. లేకపోతే డైరెక్ట్ గా వెళ్లి మాట్లాడితే వాళ్లు నో అన్నారంటే... ఇంకా డాడీ ఒక్క అడుగు కూడ ముందుకు వేయరు.
వద్దన్నారు కదా ఇంకెందుకు వెళతాము అని ఈయన సైలెంట్ అయిపోతారు. ముందు నా ప్రయత్నాలు నేను చేసి అప్పుడు అమ్మానాన్న దింపుతాను అని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు.
విక్రమ్ నవ్వుకుంటూ రెడీ అయ్యి కిందకు వెళతాడు. అక్కడ అవని... లలిత, మాధవి లకు కబుర్లు చెబుతూనే ఉంటుంది.
అది చూసి విక్రమ్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. పరవాలేదు బానే కలిసిపోతుంది. ఇలా ఉంటే తొందరగానే తనకున్న ఇన్ సెక్యూర్ ఫీలింగ్ అంతా పోతుంది అని అనుకుంటాడు.
సత్యవతి, శేషగిరి గారు అప్పుడే లోపలికి వస్తూ ఉంటారు. రండి అని విక్రమ్ సాదరంగా ఆహ్వానిస్తాడు.
చల్లగా ఉండు నాయన ఆశీర్వదిస్తారు. బాగున్నారా అని అడుగుతాడు. పరవాలేదు అని చెప్పి అమ్మాయి ఏది అంటే...
కిచెన్ లో చూపిస్తాడు. అలా చూడగానే అవని నవ్వుతూ మాట్లాడడం చూసి వాళ్లకి కూడా చాలా సంతోషం అనిపిస్తుంది.
అవని పుట్టిన తర్వాత రజిని ఉన్నన్ని రోజులేనేమో అవని ముఖంలో చిరునవ్వు చూసింది. మళ్ళీ ఇన్ని రోజులకు చూస్తూ ఉంటే ఆ పెద్ద వాళ్ళిద్దరికీ కడుపు నిండిపోయినట్టు ఉంటుంది.
బాబు మాకు ఒక చిన్న సహాయం చేస్తావా అని అడుగుతారు. చెప్పండి తాతగారు అంటే.. అవినిది ఇలా నవ్వుతూ ఉన్న ఒక ఫోటో తీసి నాకు పెట్టు బాబు చూసుకుంటాను అంటాడు.
సరే అని చెప్పి అవినికి తెలియకుండా చాలా యాంగిల్స్ లో ఫొటోస్ తీసి శేషగిరి గారికి పంపిస్తాడు. అవి చూసుకుని పెద్దయినా కన్నీళ్లు పెట్టుకుంటారు.
ఎందుకు తాతగారు ఇప్పుడు ఇంత ఎమోషనల్ అవుతున్నారు అంటే...మా ఇంటి మొదటి వారసరాలు బాబు.
వాడు ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. అల్లారు ముద్దుగా పెంచుకున్నాడు. ఎప్పుడైతే భార్గవి వాడి జీవితంలోకి వచ్చిందో..అప్పటినుండి అల్లకల్లోలం అయిపోయింది.
ఒక మాయా ప్రపంచంలో నా కొడుకుని ఉంచి అదే జీవితం అని చూపించింది. కూతురు వాడికి వ్యతిరేకంగా పెరుగుతుందేమో అనుకుని బాధపడ్డాడు.
కానీ కూతురుతో కూర్చుని మాట్లాడి అసలు ప్రాబ్లం ఏంటో తెలుసుకోవాలి అని ఆలోచన వాడికి లేకుండా చేసింది. ఎప్పుడూ అవని తో మాట్లాడదామని వాడి ప్రయత్నించిన ఏదో ఒక మెలిక వేసి అవినికి దూరంగా ఉంచింది.
ఆ పిచ్చి తండ్రికి అది తెలియక కూతురు తప్పుడు దారిలో వెళుతుందేమో అనుకున్నాడు కానీ ఆ భార్గవి కూతురే తప్పుడు దారిలో వెళ్ళింది.
ఇప్పుడు చాలా పెద్ద నిర్ణయమే తీసుకున్నాడు. మీరు హనీమూన్ నుంచి వచ్చిన తర్వాత మిమ్మల్ని కలుస్తాను అని చెప్పాడు.
ఏమి నిర్ణయం తాతగారు అంటే..నాకు సరిగ్గా తెలియదు కానీ..మాతోపాటు ఊరు వచ్చేసే ఆలోచనలో ఉన్నాడు. అది ఎంతవరకు కరెక్టో కూడా నాకు తెలియదు అని చెబుతారు. విక్రమ్ మాత్రం ఆలోచిస్తూ ఉంటాడు.
నా కొడుకు నమ్మకం అంతా మీరే బాబు అని చెబుతారు. దేనికి అన్నట్టుగా చూస్తే...భవిష్యత్తులో తన కూతుర్ని వాడి దగ్గరికి చేర్చేది మీరు మాత్రమే అని చాలా గట్టిగా నమ్ముతున్నాడు.
ఆ నమ్మకం ఎంతవరకు నిజమవుతుందో నాకైతే తెలియదు కానీ... అవని మాత్రం బాధపడకుండా ఉంటే చాలు.
ఇన్ని సంవత్సరాలు నా మనవరాలకి తెలియకుండానే బాధను ఇచ్చాడు. ఇప్పుడు ఆ బాధను వాడి తీసుకుంటున్నాడు.
అవని వీళ్ళని చూసి నానమ్మ తాతయ్య ఎంతసేపైంది మీరు వచ్చి అని పరిగెత్తుకుంటూ వస్తుంది. మెల్లిగా రా తల్లి.
ఇప్పుడే వచ్చాము అని చెబుతారు. మంచినీళ్లు తాగుతారా అంటే ఇప్పుడు ఏమీ వద్దు తల్లి కూర్చో మా పక్కన కాసేపు అని పక్కన కూర్చోపెట్టుకుంటారు.
అవని సంతోషాన్ని చూసి వాళ్ళిద్దరికీ మనసు సంతోషంతో నిండిపోతుంది. నువ్వు ఎప్పుడు ఇలాగే సంతోషంగా నవ్వుతూ ఉండాలి తల్లి అని నుదుటిన ముద్దు పెట్టుకుంటారు.
నా అత్తింటివారు నాతో ఉండగా నాకేంటి బాధ నానమ్మ అని చెబుతోంది. ఎన్నింటికి మీ ప్రయాణం అని అడిగితే లంచ్ చేసిన తర్వాత అని చెబుతుంది.
ఇదిగో తల్లి అన్ని కార్డు చేతికిస్తుంది. ఏమిటి నాన్నమ్మ ఇది అంటే..అంత దూరం వెళుతున్నావు కదా.. నీకంటూ ఏదైనా అవసరాలు ఉంటాయి ఏమో అని.
అంటే మీ ఆయన ఇవ్వరని కాదు.. ఏదో పుట్టింటి తరుపున చిన్న కానుక తల్లి తీసుకో అని అంటారు.
ఆ మాటలకు అవిని నా పుట్టిల్లు కూడా ఇక్కడే ఉంది నానమ్మ అని కార్డు ఉన్న చేతిని వెనక్కి తోస్తుంది. అంటే మేము పరాయి వాళ్ళం అయిపోయామా అని బాధపడతారు.
మీరు ఇద్దరు ఎప్పటికీ నాకు పరాయి వాళ్ళు కాదు కానీ...ఆ ఇంటి నుంచి నేను ఏమి తీసుకోదల్చుకోలేదు. నాకు ఏదైనా అవసరమైతే ఇక్కడ చూసుకోవడానికి నా భర్త ఉన్నారు.
పుట్టింటి తరుపున కావాలి అంటే... ఇక్కడ నాకు ఒక తండ్రి, తల్లి,అన్నయ్య ఉన్నారు. ఇంతకు మించి నాకు అవసరం ఏమీ లేదు. మీరు బాధపడి నన్ను బాధ పెట్టొద్దు అనే సున్నితంగా చెబుతుంది.
ఆ మాటలు విన్న మాధవికి మాత్రం చాలా సంతోషంగా అనిపిస్తుంది. మేము కూతురిగా పూర్తిగా స్వీకరించిన అవిని మమ్మల్ని స్వీకరించిందా లేదా అని ఎక్కడో చిన్న అనుమానం ఉండేది అది కూడా ఇప్పుడు పూర్తిగా తొలగిపోయింది.
బాధపడుతున్న పెద్ద వాళ్ళ దగ్గరికి మాధవి వచ్చి మీరు బాధపడకండి అత్తయ్య గారు. అవినికి ఏ లోటు రాకుండా తల్లిగా చూసుకునే బాధ్యత నాది.
అవిని నా కడుపున పుట్టలేదు అన్న మాటే గాని మిగిలిన ఏ లోటు రాదు. అవును మాధవి నువ్వు చెప్పిందంతా నిజమే.
అవిని ఇక్కడికి వచ్చిన తర్వాతే సంతోషంగా నవ్వుతుంది. ఆ నవ్వు రజిత ఉన్నప్పుడే చూసాము. తల్లిగా నువ్వు ఉన్నావు కదా.. అందుకే మళ్ళీ ఆ స్వచ్చమైన నవ్వు తిరిగి వచ్చింది.
నీకు ఏమిచ్చి మా రుణం తీర్చుకోగలం అని నమస్కారం చేస్తారు. అంత పెద్ద పెద్ద మాటలు ఎందుకు అత్తయ్య గారు..
అవని ఎప్పటికీ నా కుతురే అని అవని చుట్టూ చేతులు వేసి దగ్గరికి లాక్కుంటారు. లలిత వచ్చి పెద్ద వాళ్ళిద్దరినీ బలవంతంగా బ్రేక్ ఫాస్ట్ కి రమ్మని తీసుకు వెళుతుంది.
బ్రేక్ ఫాస్ట్ అయిన తర్వాత కాసేపు సరదాగా మాట్లాడుకుని లంచ్ ప్రిపేర్ చేస్తారు. లంచ్ చేసి అవని, విక్రమ్ ఎయిర్పోర్ట్ కి బయలుదేరుతారు.
ఎయిర్పోర్ట్ కి వెళ్లి ప్రాసెస్ అంతా కంప్లీట్ చేసి ఫ్లైట్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. వీళ్ళని రెండు కళ్ళు అబ్జర్వ్ చేస్తూ ఉంటాయి.
విక్రమ్ కి అనుమానం వచ్చి చుట్టూ చూస్తూ ఉంటాడు. ఒక మూలన నిలబడి చూస్తున్న వ్యక్తిని చూసి ఆశ్చర్యపోతాడు. తర్వాత చిన్నగా నవ్వుకుని అవని అతనికి కనపడేటట్టుగా కూర్చోబెడతాడు.
నవ్వుతూ ఉన్న అవిని చూసి ఆ వ్యక్తి సంబరపడిపోతాడు. నీ నవ్వు ఎప్పుడూ ఇలాగే ఉండాలి. ఆ నవ్వు శాశ్వతంగా ఉండడానికి నేనేమైనా చేస్తాను అని...
ఎంజాయ్ యువర్ హనీమూన్ అని వాళ్ళు వెళ్లేంతవరకు అక్కడే ఉండి అవని, విక్రమ్ వెళ్ళిన తర్వాత ఇంటికి వచ్చేస్తాడు.
ఇంటికి వచ్చిన వ్యక్తిని చూసి ఎక్కడికి వెళ్లావు ధనుంజయ్ అని సత్యవతి గారు అడిగితే.. ఎయిర్పోర్టుకి అమ్మ అని చెబుతాడు.
ఎయిర్పోర్టుగా ఎందుకు అని అడిగితే... నా కూతురు సంతోషాన్ని చూడడానికి. ఎంత సంతోషంగా ఉందో తెలుసమ్మా..
నా రెండు కళ్ళే సరిపోలేదు భగవంతుడు ఇంకొక పది కళ్ళు ఇచ్చి ఉంటే బాగుండును అనిపించింది. మన దగ్గర ఉన్నన్ని రోజుల్లో ఎప్పుడు అవని ఒక్కరోజు కూడా నవ్వినట్టు లేదు కదా అమ్మ.
కానీ పెళ్లయిన దగ్గర నుంచి అవని కళ్ళల్లో వచ్చే కన్నీళ్లు అన్నీ కూడా సంతోషంతోనే వస్తున్నాయి. నా అల్లుడు అంత బాగా చూసుకుంటున్నాడు అని చాలా గొప్పగా చెబుతారు.
కొడుకు సంతోషాన్ని రెట్టింపు చేయడానికి శేషగిరి గారు ఫోన్ ఇస్తారు. ఏమిటి నాన్న అంటే.. నువ్వే చూడు అని చెబుతారు.
అందులో అవని హార్ట్ ఫుల్ గా నవ్వుతూ లలిత మాధవి గారితో మాట్లాడుతూ ఉన్న ఫోటోలు. వాళ్ళిద్దరి మీద చేతులు వేసి, ఇద్దరు హగ్ చేసుకుని ఉన్న ఫోటోలు.
ఆ ఫోటోలు చూస్తూ ఉంటే ధనుంజయ్ కళ్ళల్లో నీళ్లు ఊరుతూ ఉంటాయి. మసకబారపోతున్న కళ్ళు తుడుచుకుని మళ్ళీ మళ్ళీ చూస్తూ ఉంటాడు.
నా కూతురు ఎంత సంతోషంగా ఉంది కదా నాన్న నా కూతురి మీద పాపిష్టి వాళ్ళ కళ్ళు ఎప్పటికీ పడనివ్వకూడదు.
నా కూతురు సంతోషాన్ని నాశనం చేయాలి అనుకున్న వాళ్ళకి ఈ ఫోటోలు చూపిస్తాను. అవిని సంతోషం చూసి వాళ్ళు కుళ్ళి కుళ్ళి ఏడవాలి.
నా కూతుర్ని నాకు దూరం చేసి దుఃఖాన్ని ఇచ్చారు. వాళ్ళకి అవిని సంతోషాన్ని చూపించి అదే దుఃఖాన్ని రిటర్న్ గిఫ్ట్ కింద ఇస్తాను.
తండ్రి ఫోన్ నుంచి ఆ ఫోటోలన్నీ తను ఫోన్ కి ఫార్వర్డ్ చేసుకుని ఆ ఫోటోలు చూసుకుంటూ గదిలోకి వెళ్ళిపోతాడు.
మొదటిసారి విమానం ఎక్కిన అవని భయంతో బిగుసుకుపోయి విక్రమ్ ని గట్టిగా పట్టుకుని కూర్చుంటుంది.
అవని భయాన్ని విక్రమ్ ఎలా పోగొడతాడు...
కథ కొనసాగుతుంది...

![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)