Thread Rating:
  • 5 Vote(s) - 3.6 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
ఖైదీ నెంబర్ 402 - నా మాటే శాసనం
ఎపిసోడ్ 44


ఆ ప్లేస్ ని వాళ్ళ తెగని క్షేమంగా ఉంచడం కోసం వాళ్లలో ఐదుగురితో పాటు కొంతమందిని చుట్టుపక్కల ప్రాంతాలకు రహస్యంగా వెళ్లి ఉండమని పంపించాడు అభీర్.

ముకుల్ తీసుకువచ్చిన బ్రిటిష్ మిలటరీ మేజర్ జేమ్స్ ఆ తెగ వాళ్ళని సైకలాజికల్ గా దెబ్బ కొట్టాలి అంటే అక్కడ ఉన్న జంతువుల్ని చంపాలి అని  చెప్పాడు.

****************

"ఆ అడవిలో ఉన్న జంతువుల్ని చంపాలి అంటే, మనం జాగ్రత్తగా ప్లాన్ చేయాలి, ఆ తెగ వాళ్ళకి ఏమాత్రం అనుమానం వచ్చినా మనలో ఎవరు ప్రాణాలతో ఉండరు, వాళ్ల ప్రేమ ఎలా ఉంటుందో ప్రతీకారం కూడా అలాగే ఉంటుంది." అని హెచ్చరించాడు శివమణి.

"ఆ విషయాల గురించి జేమ్స్ కి బాగా తెలుసు! బ్రేజిల్ లో ఒక క్వారీ దగ్గర ఉండే తెగని వెంటాడి వేటాడి చంపాడు." అని చెప్పాడు ముకుల్.

"సార్! నేను ఎన్నో తెగల మీద రీసెర్చ్ చేశాను, అభీర్ సేన చాలా తెలివైనవాళ్లు, అంతే ప్రమాదకరమైన వాళ్ళు కూడా మనం ఈ విషయంలో చాలా కేర్ఫుల్ గా ఉండాలి ఏ రాంగ్ స్టెప్ వేసిన శివమణి చెప్పినట్లు మన జీవితాలు ఇక్కడితో ఆగిపోతాయి." అని చెప్పాడు సర్ఫరాజ్.

"ముందు జేమ్స్ ప్లాన్ మొత్తం వినండి తర్వాత మీరు అనుకునేది చెప్పండి." అని చెప్పాడు ముకుల్.

"జేమ్స్! కంటిన్యూ యువర్ స్టేటజీ!" అని చెప్పాడు గోకుల్.

"మీరు చెప్పినట్లు నిజంగానే ఆ తెగ వాళ్ళు చాలా ప్రమాదకరమైన వాళ్ళు, అందుకనే జంతువుల్ని చంపడానికి మన మనుషులు ఎవరూ ఆ అడవిలోకి వెళ్ళనవసరం లేదు." అని చెప్పాడు జేమ్స్.

ఆ మాటకి ఆశ్చర్యంగా చూస్తూ "మనుషులు ఎవరు వెళ్లకుండా జంతువుల్ని ఎలా చంపుతారు?" అని డౌట్ గా అడిగాడు జాకి.

ఆ మాటకి నవ్వుతూ బ్యాగ్ లో నుంచి ఒక పక్షిని బయటకి తీసి అక్కడ ఉన్నవారికి చూపిస్తూ "ఇది ఏమిటో తెలుసా?" అని అడిగాడు జేమ్స్.

"అది పావురం లాగా ఉంది. అయ్యినా ఇప్పటివరకు బ్యాగ్ లో ఉంచారు చచ్చిపోదు." అని అడిగాడు మురళి జోషి.

ఆ పావురాన్ని టేబుల్ మీద వదిలి "దీనిని చూసి ఇంకా ఎవరైనా ఏమైనా చెప్పగలరా?" అని అడిగాడు జేమ్స్.

"ఆ పక్షిని చూసి చెప్పడానికి ఏముంది. ఆది వెళ్లి అక్కడ ఉన్న జంతువుల్ని చంపుతుందా?" అని వెటకారంగా అడిగాడు అభిజిత్.

"ఎస్! ఈ పక్షి వెళ్లి అడవిలో ఉన్న జంతువులని చంపుతుంది." అని చెప్పాడు జేమ్స్.

ఆ మాట విని ఆశ్చర్యంగా చూస్తూ "ఏంటి మీరు చెప్పేది? ఒక పావురం వెళ్లి అక్కడ ఉన్న పెద్ద పులిని చంపుతుందా?" అని అనుమానం గా అడిగాడు జనార్ధన్.

"ఇది బయటికి పావురం లాగా కనిపిస్తుంది. కానీ ఇది ఒక రోబోట్, దీనిని అమెజాన్ అడవుల్లో ఒక ప్రాంతంలో ఉన్న జంతువులకి కొత్త రకం వైరస్ సోకడంతో అక్కడికి సిబ్బందిని పంపించడానికి వీలు లేక ఈ రోబోట్ ని కనిపెట్టారు." అని చెప్పాడు జేమ్స్.

ఆ మాట విని "ఏంటి? ఇది పక్షి కాదా రోబోట్ ఆ..!" అని ఆశ్చర్యంగా చూస్తూ అడిగాడు అభిజిత్.

"ఎస్! దీనిని అడవిలోకి వదిలి ఒక చెట్ల మీద ఉండేటట్లు ఫిక్స్ చేస్తాము, దీని కళ్ళలో ఉన్న కెమెరా ద్వారా అక్కడ ఉన్న జంతువుల్ని మనం లైవ్ లో ఈ రూమ్ లో కూర్చొని స్క్రీన్ మీద చూడచ్చు!" అని చెప్పాడు జేమ్స్.

"మనం స్క్రీన్ లో చూస్తే సరిపోతుందా! వాటిని ఎలా చంపుతాము." అని డౌట్ గా అడిగాడు జాకి.

"అక్కడికే వస్తున్నాను, దీని బాడీలో  ఫిక్స్ చేసిన మైక్రో ఇంజక్షన్స్ ని మనం ఇక్కడనుంచే కనిపించే జంతువు మీద షూట్ చేయొచ్చు,ఆ మైక్రో ఇంజక్షన్ ఆ జంతువు బాడీలోకి వెళ్ళి కరిగిపోతుంది.

మనం ఇప్పుడు ఆ మైక్రో ఇంజక్షన్స్ లో మెడిసిన్ బదులు డేంజరస్ పాయిస్ అని ఫీల్ చేస్తున్నాము." అని చెప్పాడు జేమ్స్.

ఆ మాట విని షాక్ అయ్యి చప్పట్లు కొడుతూ "సూపర్! సూపర్!" అని సంతోషం గా చెప్పాడు శివమణి.

"థాంక్యూ! ఇలాంటి పది పక్షుల్ని మనం అడవిలోకి వదిలితే అక్కడ ఉన్న జంతువుల్ని  ఎవరికి అనుమానం రాకుండా క్లోజ్ చేయొచ్చు, ఎలా చనిపోయాయో కూడా ఎవరు తెలుసుకోలేరు." అని చెప్పాడు జేమ్స్.

"కానీ దీంట్లో ఒక ప్రాబ్లం ఉంది. వాళ్ళ నాయకుడు అభీర్ కి ప్రాణం పోసే శక్తి ఉంది మేము కళ్ళారా చూశాము." అని చెప్పాడు గోకుల్.

ఆ మాట విని ఆశ్చర్యంగా చూస్తూ "ఇంపాజిబుల్! మీరు ఏదో తేడాగా చూసినట్లు ఉన్నారు, ప్రాణం పోయడం అనేది ఎవరికి సాధ్యం కాదు." అని చెప్పాడు జేమ్స్.

"గోకుల్ చెప్పింది నిజమే! ఒక జింకపిల్లకి ప్రాణం పోయడం మేము కళ్ళారా చూశాము." అని చెప్పాడు అభిజిత్.

"అవునా? ఈ విషయం గురించి నాకు తెలియదు, అయ్యినా ఏమి ప్రాబ్లం ఉండదు మనం ఇచ్చే పాయిజన్ వల్ల జంతువు చనిపోయిన రెండు గంటలలో బాడీ స్పాయిల్ అవుతుంది. అప్పుడు దానిని బతికించడం సాధ్యం కాదు." అని చెప్పాడు జేమ్స్.

"జేమ్స్ ఇచ్చిన ప్లాన్ లో ఇంక మీకు డౌట్స్ ఉంటే అడగండి. నెక్స్ట్ ప్లాన్ చెప్పడం స్టార్ట్ చేస్తాడు." అని చెప్పాడు ముకుల్.

"నో డౌట్స్ సార్! నెక్స్ట్ ప్లాన్ చెప్పండి." అని అడిగాడు శివమణి.

మురళి జోషి వైపు చూసి "మీ ఆఫీసర్స్ ఇద్దరు చేయవలసిన పని ఏమిటంటే, బోర్డర్ నుండి టెర్రరిస్టులు ఇండియాలోకి బేరా అడవి లో నుంచి ఎంటర్ అవుతున్నారని గవర్నమెంట్ నమ్మించాలి, కొంతమందిని చంపాము అని మంద గ్యాంగ్ మనుషులు పేర్లు లిస్టులో చేర్చండి." అని చెప్పాడు జేమ్స్.

"మీరు చెప్పినట్లు చేస్తే ఆ ఏరియా సెక్యూరిటీ జోన్ అవుతుంది. అప్పుడు మనం ఎంటర్ అవ్వడం కూడా కష్టమవుతుంది కదా!" అని డౌట్ గా అడిగాడు సర్పరాజ్.

"మనం అలా చేయగలిగితేనే ఆ తెగ వాళ్ళు చచ్చిన ఎవడు పట్టించుకోడు టెర్రరిస్టుల లెక్కలోకి వెళ్ళిపోతారు." అని చెప్పాడు జేమ్స్.

"గుడ్ ఐడియా!" అని నవ్వుతూ చెప్పాడు ముకుల్.

"నెక్స్ట్! మన మినిస్టర్ గారు చేయవలసిన పని ఏమిటి అంటే, అక్కడ ఉన్న కొండల అడుగున ఉన్న విష పదార్థాలు  రిలీజ్ అయ్యి అడవిలో ఉన్న జంతువులు చనిపోతున్నాయి అని ఒక రిపోర్ట్ తయారు చేయించి ఆ కొండలను అక్కడ నుంచి తొలగించే కాంట్రాక్టు మన గోకుల్ గారి కంపెనీకి ఇప్పించాలి." అని చెప్పాడు జేమ్స్

"ఆ పని చేయడానికి నేను రెడీ,  అడవిలో జంతువులు చనిపోవడం స్టార్ట్ అయితే ఇమీడియట్ గా రిపోర్ట్ తెప్పిస్తాను అదంతా మన చేతిలో పనే!" అని నవ్వుతూ చెప్పాడు జావీద్.

"మీరు ఎన్ని పర్మిషన్స్ తెప్పించినా ఆ కొండలు తవ్వడానికి అక్కడ ఉన్న తెగ వాళ్ళు ఒప్పుకోరు తప్పకుండా ఎదురు తిరుగుతారు." అని చెప్పాడుశివమణి.

"దానికి నా దగ్గర ఒక ప్లాన్ రెడీగా ఉంది. ముందు ఇవన్నీ అయిన తర్వాత మనం దాని గురించి మాట్లాడుకుందాము." అని చెప్పాడు జేమ్స్.

"మన ప్లాన్ అందరికీ ఓకే కదా!" అని అడిగాడు ముకుల్.

"ఎస్! ఎస్! " అని చెప్పారు అందరు.

"ఈ ప్రాజెక్టులో వచ్చే ప్రాఫిట్ ఇక్కడ ఉన్న వారందరూ సమానంగా పంచుకుంటారు ఒకరికి ఎక్కువ ఒకరికి తక్కువ అని ఉండదు, కానీ అక్కడ ఉన్న పంచరత్నాలు మాత్రం మాట ఇచ్చిన ప్రకారం శివమణి గారికి ఇస్తున్నాము." అని చెప్పాడు ముకుల్.

ఆ మాట విని సంతోషంగా చూస్తూ "ఈ ప్రాజెక్టులో మమ్మల్ని కూడా కలిపినందుకు చాలా సంతోషంగా ఉంది సార్! " అని చెప్పాడు మురళి జోషి.

"ఆల్ రైట్! టుడేస్ లో వర్క్ స్టార్ట్ చేద్దాము పది పక్షుల్ని అడవిలోకి పంపిద్దాము, నాకు ఆ అడవికి సంబంధించిన మ్యాప్ మొత్తం కావాలి."  అని చెప్పాడు జేమ్స్.

"ఆ ఫారెస్ట్ లొకేషన్ మ్యాప్ రేపు ఉదయానికి మీ టేబుల్ మీద ఉంటుంది." అని చెప్పాడు జావిద్.

"గుడ్!" అని అభిజిత్ వైపు చూసి "మీరు ఆ తెగ వాళ్ళ గూడెంలో జరిగే జాతర సంబరాలు స్పాన్సర్ చేయడానికి ఇప్పటినుంచి ప్రిపేర్ లో ఉండండి." అని చెప్పాడు జేమ్స్.

"అంటే! ఆ జాతర సమయంలో ఆ తెగ వాళ్ళందర్నీ క్లోజ్ చేద్దామా?" అని అడిగాడు అభిజిత్.

"ఆ విషయం చెప్పడానికి ఇంకా చాలా టైం ఉంది కంగారు పడకండి. మీరు ఆ ప్రిపరేషన్ లో ఉండి ఆ తెగ వాళ్ళకి ఇంటిమేషన్ ఇవ్వండి." అని చెప్పాడు జేమ్స్.

ముకుల్ వైపు చూసి "అంకుల్! ఈ మనిషి మీకు ఎక్కడ దొరికాడో కానీ, ఇతనితో ఒక గూడెం ఏమిటి ఒక దేశాన్ని నాశనం చేయొచ్చు!" అని గొప్పగా చెప్పాడు అభిజిత్.

ఆ మాటకి నవ్వుతూ "ముందు ముందు జేమ్స్ పనితీరు, అతని ఐడియాలజీ చూసి మీరు ఆశ్చర్యపోతారు." అని చెప్పాడు ముకుల్.

సోఫాలో నుంచి లేచి, "నేను ఇంక  సెలవు తీసుకుంటాను ఒక అర్జంట్ మీటింగ్ ఉంది. మీకు ఆ ఏరియాలో ఏ హెల్ప్ కావాలి అన్న చెప్పండి వెంటనే అయిపోతుంది. " అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు జావిద్.

"సార్! మరి మేము కూడా బయలుదేరుతాము మా పనిలో మేము ఉంటాము." అని చెప్పాడు మురళి జోషి.

ఇద్దరి ఆఫీసర్ల వైపు చూస్తూ, "అక్కడ టెర్రరిస్ట్ కదలికలు ఉన్నాయి అని మీరు పర్ఫెక్ట్ గా రెడీ చేయాలి  గుర్తుంచుకోండి." అని చెప్పాడు జేమ్స్.

"ఓకే సార్! ఆ విషయం గురించి మీరు మర్చిపోండి." అని చెప్పి జనార్ధన్ తో కలిసి అక్కడి నుంచి బయలుదేరాడు మురళి జోషి.

శివమణి, సర్ఫరాజ్ కూడా అక్కడి నుంచి వెళ్లడంతో "అంకుల్! మీరేంటి ప్రాఫిట్స్ అందరికీ పంచి పెడతాను అని చెబుతున్నారు." అని అడిగాడు అభిజిత్.

ఆ మాటకి నవ్వుతూ జేమ్స్ వైపు చూశాడు ముకుల్.

"అభిజిత్ గారు! తాజ్ మహల్ వెనుక ఉన్న రక్త చరిత్ర గురించి మీకు తెలుసా?" అని అడిగాడు జేమ్స్.

"తాజ్ మహల్ కి రక్త చరిత్ర ఏముంది అది ప్రేమకు చిహ్నం కదా!" అని అడిగాడు అభిజిత్.

"తాజ్ మహల్ ని కట్టించిన షాజహాన్, నిర్మాణం పూర్తి అయిన తర్వాత దానికి కట్టుబడి లో పనిచేసిన కూలీలని చంపేశాడు, ఎందుకంటే అటువంటిది మరొకటి ఉండకూడదు అని, అలాగే మనం కూడా ఈ ప్రాజెక్టులో పనిచేసిన కూలీలని!" అని వికృతంగా నవ్వుతూ చెప్పాడు జేమ్స్.

ఆ మాట విని "అంకుల్! ఆ లిస్ట్ లో నన్ను జాయిన్ చేయకండి." అని కంగారుగా చెప్పాడు అభిజిత్.

ఆ మాటకి నవ్వుతూ అభిజిత్ భుజం మీద చేయ్యి వేసి "నువ్వు నా ఫ్రెండ్ రా..!" అని చెప్పాడు గోకుల్.

"హమ్మయ్య!" అని ఊపిరి పీల్చుకొని స్మైల్ ఇచ్చాడు అభిజిత్.
[+] 12 users Like SivaSai's post
Like Reply


Messages In This Thread
RE: వేదం - by Manmadhsbanam143 - 22-12-2025, 04:13 PM
RE: ఖైదీ నెంబర్ 402 - నా మాటే శాసనం - by SivaSai - 26-01-2026, 12:01 AM



Users browsing this thread: 9 Guest(s)